టీఆర్‌ఎస్‌లో తమకు టికెట్ కేటాయించలేదని పార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తిన కొండా సురేఖ, మురళీ దంపతులు.. కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుం బంపై విమర్శలు చేసిన తర్వాత సాయంత్రానికి వారిద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. దీంతో అందరూ ఊహించినట్టుగానే వారు కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నట్టు స్పష్టమైంది.