నకిలీపాలు తయారుచేస్తూ డెయిరీలకు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్‌చేశారు.
నకిలీపాలు తయారుచేస్తూ డెయిరీలకు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్‌చేశారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన వేముల మురళి అనే వ్యక్తి చాలాకాలంగా పాల వ్యాపారం చేసేవాడు. యూరియా, వంటనూనె, పాలపిండి, చక్కెర, యూరియా మిశ్రమంతో నకిలీ పాలు తయారుచేసి డెయిరీలకు విక్రయించేవాడు. పలు ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టిన పోలీసులు సోమవారం ఉదయం దాడిచేసి మురళిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 250 లీటర్ల నకిలీ పాలు, 80 లీటర్ల వంటనూనె, 30 కిలోల యూరియాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.