నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష పడినట్లు కొత్తగూడ ఎస్సై అరాఫత్ బుధవారం తెలిపారు.
నర్సంపేట : నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష పడినట్లు కొత్తగూడ ఎస్సై అరాఫత్ బుధవారం తెలిపారు. కొత్తగూడ వుండలం గాంధీనగర్‌కు చెందిన వుల్లెల కళావతిని నెల్లికుదురుకు చెందిన ఎర్రబోరుున మురళి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో సదరు మహిళ అప్పటి ఎస్సై సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయుగా 2012లో 417, 406, 420 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విచారణ అనంతరం అప్పటి ఎస్సై నర్సంపేట కోర్టులో చార్జిషీటు వేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను కోర్టు కానిస్టేబుల్ స్వామినాయుక్ సకాలంలో ప్రవేశపెట్టగా పిటిషనర్ తరఫున ఏపీపీ వెంకటేశ్వర్లు వాదించారు. వాదనలు విన్న జడ్జి శ్రీదేవి వుురళీకి ఆరు నెలల జైలు శిక్ష లేదా 5 వేల జరివూనా విధించినట్లు తెలిపారు.