హైదరాబాద్ : నగరంలోని సనత్‌నగర్ మెట్రోస్టేషన్ సమీపంలో వాటర్ ట్యాంకర్ ఓ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. కూకట్‌పల్లి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేస్తోన్న మురళి కృష్ణ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో మురళీ కృష్ణ కు తీవ్రగాయాలయ్యాయి. దగ్గరలోని ఆసుపత్రికి తరలించే లోపే అతను మరణించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి , ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.