పేద బతుకు.. పెద్దమనసు
{పేమించి పెళ్లి చేసుకున్న రెండేళ్లకే వెంటాడిన విధి
రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన భర్త
ఒంటరిగా మిగిలిన తల్లి బిడ్డ
తిరుపతి మెడికల్: పేద కుటుంబం పెద్ద మనసును చాటుకుంది. తమను చీకట్లు ముసురుకున్నా ఆ కుటుం బసభ్యులు కొందరికి వెలుగులు పంచారు. కుటుంబానికి దిక్కుగా ఉన్న వ్యక్తి విగతజీవిగా మారినా అతని అవయవదానంతో కొందరికి ప్రాణభిక్ష పెట్టారు. పాకాల మండలం కె.వడ్డేపల్లి కావలివారి పల్లెకు చెందిన బుజ్జమ్మ, భాస్కర్ దంపతులకు ముగ్గురు సంతానం. రెక్కాడితే డొక్కాడని కుటుంబ నేపథ్యం. మురళి పెద్ద కొడుకు. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మారుు ప్రత్యేక ప్రతిభావంతురాలు కావడం, చిన్న కూతురుకి వివాహమైంది. మురళి (27) తిరుపతిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నారావారిపల్లెకు చెందిన అమ్మారుుతో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న బిడ్డ ఉంది.
తిరుపతిలో కాపురం ఉంటున్న మురళి దీపావళి జరుపుకునేందుకు కావలివారిపల్లెకు 30వ తేది ఆదివారం బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బ్రెరుున్ డెత్ కేసుగా వైద్యులు తేల్చారు. దీంతో అతనికి చెందిన అవయవాలను దానం చేసి నలుగురిని బతికించాలని కుటుంబ సభ్యులు నిర్ణరుుంచారు. వెంటనే వైద్యులను సంప్రదించి గుండెను చెన్నైకి, లివర్‌ను వైజాగ్, రెండు కిడ్నీలను తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు దానం చేశారు. మురళి మృతితో కట్టుకున్న భార్య, ఏడాది వయసున్న ఆడ బిడ్డ రోడ్డున పడ్డారు. అసలే పేద కుటుంబం. ప్రేమ వివాహ కారణంతో కుటుంబాలు దూరంగా ఉన్నారుు. ప్రభుత్వం స్పందించి మురళి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.