అర్ధరాత్రి బైక్పై కలెక్టర్‌ పర్యటన | collector murali visits areas in bhoopalapally by bike | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి బైక్పై కలెక్టర్‌ పర్యటన

Published Tue, Apr 25 2017 1:50 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

అర్ధరాత్రి బైక్పై కలెక్టర్‌ పర్యటన - Sakshi

అర్ధరాత్రి బైక్పై కలెక్టర్‌ పర్యటన

కలెక్టర్‌ మురళి జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించారు.

భూపాలపల్లి:
కలెక్టర్‌ మురళి జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2.30 గంటల వరకు భూపాలపల్లి నగర పంచాయతీలోని హనుమాన్‌నగర్, శాంతినగర్, ఎస్సీకాలనీ, సుభాష్‌కాలనీ, జంగేడు, సెగ్గెంపల్లి, గడ్డిగానిపల్లి, కాశీంపల్లి, కారల్‌మార్క్స్‌కాలనీ, అంబేద్కర్‌ చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై తిరిగారు. ఆయా వార్డులలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలను పరిశీలించారు.

కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్‌ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పట్టణంలో వివిధ దుకాణాలు రాత్రి ఎప్పటి వరకు తెరిచి ఉంటాయని, గుడుంబా తయారీ, రవాణా జరిగే సమాచారం గురించి ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement