sajjala Ramakrishnareddy
-
వైఎస్ జగన్ పథకాలపై బాబు కుట్ర: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలపై చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సోమవారం(డిసెంబర్ 9) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసు నుంచి పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సజ్జల మాట్లాడారు. టెలీ కాన్ఫరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ సమన్వయకర్తలు,రీజనల్ ఇంఛార్జులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ పథకాలను ఉద్దేశపూర్వకంగా కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాం. ఈనెల 13న రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం.రైతులతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహిస్తాం. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తాం. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఈ నెల 27న,ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ జనవరి 3న ధర్నాలు చేస్తాం. సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లలో మగ్గేలా చేస్తోంది. బాధితులకు పార్టీ అండగా ఉంది. వారికి న్యాయ సహాయం అందిస్తూనే ఉంటుంది’అని సజ్జల తెలిపారు. -
టీడీపీ ప్రభుత్వంపై సజ్జల ఫైర్
-
ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. -
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.‘‘రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరయ్యారు. పోలింగ్‌కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు. విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్సఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది’’ అని సజ్జల ధ్వజమెత్తారు.జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది’’ అని సజ్జల చెప్పారు.‘‘సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్‌గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. -
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
-
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, జగన్ కోసం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.వేరే దేశాలలో ఉన్న ఎన్నారైలు ఏపీకి వచ్చి పని చేయడం హ్యాపీగా ఉందని.. జగన్ గెలుపు మన ఇంట్లో గెలుపులా మహిళలు సైతం భావిస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందన్న ఆయన... చేసిన మంచి గురించి ప్రజలకు వివరించటం చాలా మంచి పరిణామన్నారు.పార్టీ, జగన్ తరపున ఎన్నారైలకు కృతజ్ఞతలు. టీడీపీ వికృత చేష్టలు పెరిగాయి. కోమటి జయరాం అనే టీడీపీ అహంకారి నోట్లతో ఓట్ల కొనాలనటం సిగ్గు చేటు. రాజకీయం అంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయడం. లీడర్ని బట్టి కార్యకర్తలు ఉంటారు. ప్రజల కోసం వైసీపీ ఎన్నారై లు వస్తే.. డబ్బులు పంచడం కోసం టీడీపీ ఎన్నారైలు వచ్చారు. సమాజంలో మార్పు ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎన్నారై టీమ్ పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 బస్సులతో స్టార్ క్యాంపైనర్స్ ప్రచారం చేస్తారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
మల్లాది విష్ణుకి టికెట్ ?..సజ్జల కీలక కామెంట్స్
-
సమ్మెకు తెర.. నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు, చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం.. అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని జూలై నుంచి అమలు చేసే దిశగా పని చేస్తున్నామని తెలిపారు. ‘అంగన్వాడీల శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వర్కర్లకు రూ.50 వేల నుంచి ఏకంగా రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతున్నాం. అందరి ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు.. ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నాం. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్ చేస్తాం. అంగన్వాడీల్లో పని చేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వ దృష్టికి గ్రాట్యుటీ అంశం తీసుకెళ్లి.. వారిచ్చేది నేరుగా అమలు చేస్తాం. భవిష్యత్తులో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి సమ్మె కాలంలోని అంగన్వాడీల వేతనం, పోలీసు కేసుల అంశం తీసుకెళ్లి.. న్యాయం జరిగేలా చూస్తాం. ఇన్ని డిమాండ్లను అంగీకరించడం అంటే అంగన్వాడీ అక్కచెల్లెమ్మల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అని మంత్రి తెలిపారు. ఇక విధుల్లోకి వెళ్తున్నాం.. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో విజయవంతం అయ్యాయని అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు. ఇకపై తాము విధుల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందన్నారు. సర్వీసులో ఉండి అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చులు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు. అంగన్వాడీలకు ప్రత్యేకంగా వైఎస్సార్ బీమా, అంగన్వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో టీఏ బిల్లులు నిలిచిపోయాయని, ఆ బిల్లులు వచ్చిన వెంటనే విడుదల చేస్తామన్నారని తెలిపారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి నెలకు ఒక టీఏ బిల్లు ఇస్తామనడం సంతోషంగా ఉందన్నారు. యాప్‌ల భారాన్ని సైతం తగ్గిచేందుకు స్పష్టమైన హామీ లభించిందన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ బిల్లులు, గ్యాస్ మెనూ పెంపు, చిన్నారుల మెనూ పెంచాలని కోరగా ప్రత్యేక కమిటీలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారన్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడానికి చర్యలు చేపడతామనడం ఆనందాని్నస్తోందన్నారు. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి, గౌరవాధ్యక్షురాలు మంజుల, వీఆర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ‘ఛలో’ భగ్నం ఇదిలా ఉండగా.. అంగన్వాడీల ఆందోళనను అడ్డు పెట్టుకుని పలుచోట్ల టీడీపీ నేతలు టెంట్లు, కుర్చీలు, భోజనాలు సమకూరుస్తూ కొన్ని శక్తులను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. అంగన్వాడీల ముసుగులో అసాంఘిక శక్తులు ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ‘ఛలో విజయవాడ’కు పిలుపునిచ్చాయి. నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. -
చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిల: సజ్జల
-
AP: బీసీల అభివృద్ధికి సీఎం జగన్ తపన : సజ్జల
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడేలా చేసేందుకు తపన పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీమ్‌ల నుంచి అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలేనని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన రజకుల ఆత్మీయ సమావేశంలో సజ్జల పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రజక కార్పోరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వివిధ స్కీమ్‌లను పరిశీలిస్తే నాలుగున్నరేళ్ల కాలంలో 18 లక్షల రజక కుటుంబాలకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాల్లో 5,600 కోట్ల రూపాయలు వేశాం. నాన్ డీబీటీలను కూడా కలుపుకుంటే 17 వేల కోట్ల రూపాయలు రజక కుటుంబాలకు ఇచ్చాం. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోవచ్చు. దేశంలో బీసీలు సీఎంలుగా ఉన్న ఏపీలో ఇచ్చినన్ని నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వలేదనే వాస్తవాన్ని గమనించాలి. రాజకీయపార్టీలు ఆయా వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూశాయి. గతంలో రజకులకు చంద్రబాబు కేవలం ఐరన్ బాక్సులు ఇచ్చి మభ్యపెట్టాడు. బీసీల సమస్యల పరిష్కారం కోసం వెళ్తే అవమానించారు. మళ్లీ ఇప్పుడు మాత్రం జయహో బీసీ అంటూ సభలు పెట్టి ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. బీసీలు ముమ్మాటికి చంద్రబాబును నమ్మేస్దితిలో లేరు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్ రజకుల అభివృద్ధి కోసమే పథకాలు తీసుకువచ్చారు’ అని సజ్జల వివరించారు. రజక కార్పొరేషన్ ఛైర్మన్ మీసాల రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల అభివృద్దికి సీఎం జగన్ చేస్తున్న కృషిని ప్రతి నియోజకవర్గానికి తీసుకువెళ్తానన్నారు. పలు రజక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రజకుల సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఇదీచదవండి..పార్టీ ఫిరాయించిన వారితో వెళ్లి దొంగ ఓట్లపై ఫిర్యాదా -
AP: అంగన్వాడీలు రాజకీయాలకు బలి కావొద్దు: సజ్జల
సాక్షి,తాడేపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు రాజకీయ అజెండాలకు బలికావొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై తాడేపల్లిలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల ఆందోళనలపై అనేక స్థాయిల్లో చర్చించామని, ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నామని తెలిపారు. ‘అంన్వాడీల సమ్మె వెనుక రాజకీయ కోణం ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో వారి ఆడియోలు మేం విన్నాం. కొందరు రాజకీయ కోణంలో రెచ్చగొడుతూ మాట్లాడారు. రాజకీయ అజెండాకి బలి కావద్దు. ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నాం. గర్భిణీలు, పసిపిల్లలను ఇబ్బందులు పెట్టొద్దు. పట్టు వీడకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుంది. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కూడా ఇది వర్తిస్తుంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారంతా అంగన్వాడీలను రెచ్చగొడుతున్నారు. వారి వలలో చిక్కుకోవద్దు. ప్రభుత్వాన్ని దించుతాం, జైళ్లకైనా వెళ్తాం అంటూ కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. పేద తల్లులు, పిల్లలకు ఆహారం అందకపోవటం మంచిదేనా చంద్రబాబు చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంగన్వాడీలకు అన్యాయం చేశారు. సమ్మె విరమించాల్సిందిగా అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులను కోరుతున్నాం. సమ్మె కొనసాగిస్తే నోటీసులు ఇస్తాం తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీకి అభ్యర్థులు లేరు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. మేము కాన్ఫిడెంట్‌గా సీట్లపై నిర్ణయాలు తీసుకుంటున్నాం. లోకేష్, గంటా శ్రీనివాసరావు, అనిత, జవహర్ ఇలా ఎంతమంది ఎన్ని నియోజకవర్గాలు మారారో తెలియదా.. అన్ని పార్టీలు కట్ట కట్టుకుని వచ్చినా మాకు ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు, అలాంటప్పుడు ఎన్నికల విధుల్లో ఎలా పాల్గొంటారు? ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటమి తప్పదని ఊహించే ముందుగా కారణాలు వెతుక్కుంటున్నారు. గతంలో ఓడిపోగానే ఈవీఎంలపైకి నెట్టారు’అని సజ్జల గుర్తుచేశారు. ఇదీచదవండి.. రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు -
ఆ ఎమ్మెల్యేలను మారుస్తాం..సజ్జల క్లారిటీ..
-
చంద్రబాబుపై సజ్జల కామెంట్స్
-
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా అవినీతిమయమే
తాడేపల్లి: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ సందర్బంగా నారా లోకేష్ బూతుపురాణం గురించి దత్తపుత్రుడి ఓవర్ యాక్షన్ గురించి ఆయన ప్రస్తావించారు. వారిద్దరూ శాంతికి భగ్నం కలిగించే ప్రయత్నం చేశారు కాబట్టే తాను మాట్లాడవలసి వస్తోందన్నారు. ఆదివారం సాయంత్రం ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా అవినీతిమయమేనని, ఈ స్కీముకు దర్శకత్వం, రూపకర్త అంతా చంద్రబాబేనన్నారు. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై పూర్తి ఆధారాలున్నాయని కోర్టు వాటినన్నిటిని పరిగణనలోకి తీసుకునే తీర్పునిచ్చిందని అన్నారు. ఇక నిన్నటి నుంచి నారా లోకేష్, దత్తపుత్రుడు ఇద్దరూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించారని చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. వాళ్ళు హుందాగా ప్రవర్తించి ఉంటే మేము మాట్లాడాల్సి వచ్చేది కాదని రాత్రి పవన్ కళ్యాణ్ అయితే చాలా ఓవర్ యాక్షన్ చేశారన్నారు. మరోపక్క నారా లోకేష్ బూతు పురాణం మొదలు పెట్టాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేస్తే ఎంతటి పెద్ద వారికైనా న్యాయపరమైన శిక్షలు తప్పవు. చట్టాలను, న్యాయవ్యవస్థను మనం గౌరవించాలని అన్నారు. ఇది కూడా చదవండి: ఇక జైలుకే.. ఏసీబీ కోర్టులో బాబుకు షాక్.. Babu @ Jail : న్యాయం గెలిచింది! -
ఛార్జ్ షీట్ లో అంతా కల్పిత కథలే
-
మళ్లీ చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారు: సజ్జల
సాక్షి, విజయవాడ: విశాఖలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో కేంద్రహోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పార్టీ పరంగా అమిత్ షా విమర్శలు చేశారు. దేశంలో ఏపీ భాగం కాదు అన్నట్టుగా అమిత్ షా మాట్లాడారు. ఎవరో స్క్రిప్టులు రాసిస్తే చదివేయడం కాదు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పవన్ కల్యాణ్ ఖచ్చితమైన ఆలోచనలతో రాజకీయాలు చేయడం లేదు. పవన్ వాయిదా వేసుకుంటూ యాత్రలు చేయడం కాదు. గత రెండుసార్లూ పవన్.. చంద్రబాబునే మోశారు. ఇప్పుడు మరోసారి పవన్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీసీ కులాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ కృషిచేస్తోంది. వెనుకబడ్డ కులాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోందన్నారు. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు బీసీ డిక్లరేషన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కోలా అనుకున్నారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా సీఎం జగన్ చేసి చూపించారు. రాష్ట్రంలో జనాభా ప్రకారం అందరికీ న్యాయం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. సామాజిక న్యాయం అమలు కాకపోతే సమాజానికి మంచిది కాదు. ఎప్పటికైనా తిరుగుబాటు వస్తుంది. అందరి చేతుల్లోనూ అధికారం ఉండాలనే దిశగానే సీఎం జగన్ అడుగులు వేశారు. రాబోయే ఐదారేళ్లలో ఎంతో మార్పు వస్తుంది. కాలం మారుతోంది.. ఓ నలుగురు కూర్చుని రాజకీయం చేస్తామంటే కుదరదు. పేదలు.. సంపన్నులతో కలిసి విద్యను అభ్యసించేలా చేస్తున్నాం. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రతీ విద్యార్ధీ ఆత్మగౌరవంతో స్కూళ్లకు వెళ్లేలా సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో సామాజిక న్యాయం ఎంతో వేగంగా జరిగింది. రాజకీయ వేదికల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా సాధికారతకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు. రాబోయే ఎన్నికల్లోనూ బలమైన నాయకత్వం రావడం ఖాయం. 175 కి 175 సీట్లు దక్కించుకునేలా అడుగులు వేద్దాం. మరింత మెరుగైన మెజార్టీతో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కడుపుమంటతోనే ఆ వ్యాఖ్యలు.. అమిత్‌షాకు మంత్రి బొత్స కౌంటర్ -
రజినీకాంత్ చంద్రబాబు ఫోన్ కాల్ పై సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు....
-
సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పదవికి రాజీనామా...సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ
-
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచే ఆదాల పోటీ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేస్తారన్నారు. సీఎంను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తా: ఆదాల ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, రూరల్ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషకరమన్నారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే: బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును కోటంరెడ్డి కలిసి టిక్కెట్ హామీ తీసుకున్నారని, బాబును కలిసిన తర్వాత ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నారని బాలినేని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై రుజువు చేసి మాట్లాడాలని, రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడెందుకు మాట్లాడారంటూ ఆయన దుయ్యబట్టారు. రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం ఖరారు చేశారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరగనున్నాయని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి -
ముందస్తు ఎన్నికలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
-
టీడీపీ, జనసేనలు ఎప్పుడూ కలిసే ఉన్నాయి: సజ్జల రామకృష్ణా రెడ్డి
-
రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం.. మాకు కూడా ఇవే రూల్స్ : సజ్జల
-
ప్లాన్ ప్రకారమే ఇరుకు రోడ్డులో సభ నిర్వహించారు : సజ్జల
-
దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉంది : సజ్జల
-
చంద్రబాబు ముందస్తు ఆశలు నెరవేరే అవకాశం లేదు : సజ్జల
-
అవినీతికి తావులేకుండా ప్రభుత్వ పథకాలను వాలంటీర్లు డోర్ డెలివరీ చేస్తున్నారు
-
ఇదేం ఖర్మ అని ప్రజలు భావించారు కాబట్టే 2019 లో టీడీపీ ఓటమి : సజ్జల
-
మేం ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతిస్తాం : సజ్జల
-
సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేయటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు ఎవరూ మాట్లడకపోవటంపై ప్రశ్నించారు. ‘సుప్రీం కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ నిర్ణయం. వికేంద్రీకరణపై మరింత పకడ్బందీగా చట్టం తీసుకొస్తాం. రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది.’ అని పేర్కొన్నారు సజ్జల. వైఎస్ వివేకానంద హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. వాస్తవాలు బయటకు రావాలని తామే ముందు కోరుకుంటున్నట్లు చెప్పారు. హత్యకు గురైన వివేకా తమ నాయకుడని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వయానా చిన్నాన్న అని గుర్తు చేశారు. తమ నాయకుడు వివేకా హత్యకు బాధ్యలేవరో వారు దొరకాలన్నారు. ఇదీ చదవండి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ -
దత్తపుత్రుడు పవన్ మాదిరిగానే చంద్రబాబు ఊగిపోతున్నాడు : సజ్జల
-
చంద్రబాబును జనం ఎప్పుడో ఇంటికి పంపించేశారు : సజ్జల
-
ఉద్యోగులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం : సజ్జల రామకృష్ణ రెడ్డి
-
జగనన్న కాలనీల పై సజ్జల కామెంట్స్
-
వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు : సజ్జల
-
కొత్త పార్టీలను ఆహ్వానించడంలో నష్టం లేదు : సజ్జల
-
తెలంగాణ మంత్రి హరీష్ రావుకు సజ్జల కౌంటర్
-
గడప గడపకు కార్యక్రమంలో స్పందన బాగుంది : సజ్జల
-
ఎన్టీఆర్ పై అభిమానంతోనే జిల్లాకు పేరు పెట్టాం
-
‘కుప్పంలో టీడీపీ అరాచకం.. చంద్రబాబే ప్రథమ ముద్దాయి’
సాక్షి, అమరావతి: కుప్పంలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విధ్వంసకర ఘటనకు టీడీపీ తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనలో కుప్పం ప్రజలు అభివృద్ధిని చూశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కకావికలమైందన్నారు. ప్రజల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు. చంద్రబాబు సేవ చేస్తే ప్రజలు ఆయన గురించి ఆలోచిస్తారన్నారని సజ్జల అన్నారు. చదవండి: చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని ‘‘కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ముందు నుంచే ఉన్న వైఎస్సార్సీపీ జెండాలను తొలగించారు. మా చంద్రబాబు వస్తుంటే వైసీపీ జెండాలు పెడతారా అంటూ దాడులకు దిగారు. టీడీపీ వాళ్లు కర్రలు తీసుకుని ఊరేగింపుగా వెళ్లారు. జరిగిన దాడులకు చంద్రబాబే ప్రథమ ముద్దాయి. నిన్న, ఇవాళ్ల అదే పనిగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా వ్యవహరించారు. గతంలో కూడా ఇలాగే చేశారు. నిన్నటి ఘటనకి శాంతియుతంగా వైఎస్సార్సీపీ నిరసన తెలిపితే వారిపైనా దాడులు చేశారు. డిప్రెషన్‌తో చంద్రబాబు బాధ పడుతున్నారని’’ సజ్జల వ్యాఖ్యానించారు. ‘‘జనాన్ని చంద్రబాబే స్వయంగా రెచ్చగొట్టారు. దాడులకు ఉసిగొల్పారు. 30 ఏళ్లుగా దొంగ ఓట్లతో గెలిస్తూ వచ్చారు. వాటన్నిటికీ ఇప్పుడు వైఎస్సార్సీపీ దెబ్బతో బ్రేక్ పడింది. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్సీపీ బయటకు తెచ్చింది. స్థానిక ఎన్నికలలో మేము అన్నిటిలోనూ గెలిచాం. చంద్రబాబు వైఖరితో విసుగు చెందిన కుప్పం ప్రజలు ఆయనకు చెల్లుచీటి చెప్పారు. టీడీపీ జెండాలు కట్టుకోవచ్చు. కానీ వైసీపీ జెండాలు పీకటం ఎందుకు?’’ అని సజ్జల ప్రశ్నించారు. ‘‘అన్నా క్యాంటీన్ పేరుతో రచ్చ చేశారు. గంటకుపైగా రోడ్డుపైన కూర్చున్నారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో వదిలేశారు. అందుకే కావాలని అక్కడకు వెళ్లి కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఎన్ని ఆరోపణలు చేసినా జనం నమ్మటం లేదు. అప్పట్లో వైఎస్సార్, 2019కి ముందు జగన్ పాదయాత్ర చేసి చంద్రబాబు చేసిన తప్పులు ప్రజలకి వివరిస్తే జనం నమ్మారు. అలాగే చేయాలని ఇప్పుడు చంద్రబాబు అనుకున్నాడు. కానీ వాస్తవాలను చెప్తేనే నమ్ముతారన్న విషయాన్ని మాత్రం మర్చిపోయారు. ప్రజల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించడు. తన మీడియా ముందు ఏదో ఒకటి చెప్తే అదే జనం నమ్ముతారనుకోవటం అతని అవివేకం. పార్టీ ఆఫీసుని 30 ఏళ్ల తర్వాత ఓపెన్ చేశాడంటే అతని పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చని’’ సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘60 లక్షలమంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని చంద్రబాబు చెప్తున్నారు. ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో అంత సీన్ లేదు. చంద్రబాబు, పవన్ మధ్య రహస్య బంధం ఎందుకు? . ఇద్దరూ కలిసే పని చేస్తున్నారని అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ విముక్త రాష్ట్రం కావాలని పవన్ అంటున్నారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ తొలగించాలని పవన్ కోరుకుంటున్నారు. జగన్ అంటేనే సంక్షేమం గుర్తొస్తుంది. ఆ సంక్షేమాన్ని ప్రజలకు అందకుండా చేయాలన్న లక్ష్యంతో పవన్, చంద్రబాబు పని చేస్తున్నారు. పేద ప్రజల కడుపు నింపాలనుకుంటే 2014లోనే అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టలేదు?. 2019 ఎన్నికలకు ముందే అవి ఎందుకు గుర్తొచ్చాయి’’ అంటూ సజ్జల నిలదీశారు. చదవండి: చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం.. కీలక అరెస్టులు -
మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు ఉంటాయ్: సజ్జల
తాడేపల్లి: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అది వాస్తవం కాదని, పోలీసు కేసు కూడా పెట్టానని గోరంట్ల తనతో చెప్పారన్నారు. ఆ విషయంలో నిజంగా ఆయన తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘మా పార్టీ మహిళల పక్షపాత పార్టీ. నిజంగా తప్పు ఉంటే మా నాయకుడు ఊరుకోరు. టీడీపీ రాద్దాంతం చేస్తోంది. మా నాయకుడు చేతల్లో చూపిస్తారు. గోరంట్ల మాధవ్ పోలీస్ కేసు పెట్టారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదీ చదవండి: నకిలీ వీడియోపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్ -
విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: సజ్జల
సాక్షి, గుంటూరు: టీడీపీ, ఎల్లోమీడియాపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయం చేస్తున్నాయి. వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. విజయమ్మ వ్యాఖ్యలపై పెడార్థాలు తీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా -
ఉద్యోగుల బాగు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న సేవలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. సజ్జల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏపీ ఎన్జీవో అపార్ట్మెంట్ నిర్మించుకోవడం సంతోషకరం. తక్కువ ధరకే ఉద్యోగులకు ఇలాంటి గృహాలను ఇవ్వడం శుభ పరిణామం. ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. ప్రభుత్వం చేస్తున్న సేవలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఇందుకు ఉద్యోగులను అభినందిచక తప్పదు. పాలకుడు మంచివారైతే అయితే అందులో భాగస్వామ్యం అవుతామని ముందుకు వచ్చిన ఉద్యోగులకు ధన్యవాదాలు. రాష్ట్రంలో సమస్యలు ఉద్యోగులకు తెలియనివి కావు. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు చూశాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు భయపడకుండా సేవలను అందించారు. ఆదాయం తగ్గి భారం పెరిగింది. ఉద్యోగులు ఆశించినంతగా ప్రభుత్వం సహాయం చేయలేకపోయింది. దీన్ని కూడా ఉద్యోగులు స్వాగతించారు. ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌గా ఉన్న ఆర్టీసీ విలీనాన్ని చేసిన ఘనత మన ప్రభుత్వానిది. ఉద్యోగికి ఏ సమస్య ఉన్నా చట్టానికి లోబడి పరిష్కారం చేసే దిశగా ఎల్లపుడూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలను రాజకీయాలకు వాడుకోవాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. అది ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా తెలుసు. ఉద్యోగులకు అన్నీ చేయాలని ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేయలేకపోయాం. సీఎం జగన్ ఆలోచనలు సాధ్యం కావాలంటే ఉద్యోగుల సహకారం తప్పనిసరి. ఉద్యోగుల కలలను సాకారం చేసేందుకు సీఎం జగన్ సర్కార్ ఎల్లప్పుడూ ముందుంటుంది’’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు -
‘మహానాడులో చంద్రబాబుకు ఆ ఏడుపు మరీ ఎక్కువైంది’
సాక్షి, అమరావతి: మహానాడు దేనికోసం నిర్వహించారో అర్థం కాలేదని.. ప్రభుత్వంపై బురద చల్లేందుకే మహానాడు జరిగినట్టుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విష ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. బీసీ మంత్రుల బస్సు యాత్రను చూసి ఓర్వలేకపోయారన్నారు. మహానాడులో అన్నీ అబద్ధాలే చెప్పారని ధ్వజమెత్తారు. చదవండి: నారా లోకేశ్ టీమ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ‘‘ఏదో ఎన్నికల్లో గెలిచినట్టు మహానాడులో హడావుడి చేశారు. ప్రభుత్వంపై పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. మహానాడులో ఆ ఏడుపు మరీ ఎక్కువైంది. ఏపీ సీఎం హోదాలో జగన్ దావోస్ సదస్సులో పాల్గొన్నారు. దావోస్ ఒప్పందాలపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. చంద్రబాబువి చిల్లర రాజకీయాలు. సీఎం జగన్ హుందాగా వ్యవహరించే వ్యక్తి. చంద్రబాబులా జగన్ ప్రగల్భాలు పలికే వ్యక్తి కాదు. ప్రజలకు మేలు చేకూర్చే పథకం ఒక్కటైనా బాబు తెచ్చారా?. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతోనే ఈ ఏడుపు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. -
‘ప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించారు’
అమలాపురం: కొన్ని శక్తులు నిరసనకారుల్ని రెచ్చగొట్టి అమలాపురంలో విధ్వంసం సృష్టించాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం మంత్రి విశ్వరూప్ ఇంటిని పరిశీలించిన సజ్జల.. మీడియాతో మాట్లాడారు.‘ప్లాన్ ప్రకారమే అమలాపురంలో విధ్వంసం సృష్టించారు. అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాలు కోరాయి. ప్రధాన పార్టీలన్నీ మద్దతు పలికాయి. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.కులాల మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు కుట్ర పన్నాయి. కొన్ని శక్తులు నిరసనకారులను రెచ్చగొట్టాయి. ఈ తరహా శక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ప్రభుత్వానికి తెలుసు.రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించడంతోనే ఈ కుట్రను అదుపులోకి తెచ్చాం’ అని ఆయన తెలిపారు. -
Konaseema: కోనసీమ ఉద్రిక్తతలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
-
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు వీరే
-
AP:26 జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వీరే..
-
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు వీరే..
సాక్షి, తాడేపల్లి: జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం వైఎస్సార్సీపీ ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు. జిల్లా అధ్యక్షులు వీరే.. జిల్లా పేరు అధ్యక్షులు 1 చిత్తూరు కేఆర్జే భరత్ 2 అనంతపురం కాపు రామచంద్రారెడ్డి 3 శ్రీసత్యసాయి ఎం. శంకర్ నారాయణ 4 అన్నమయ్య గడికోట శ్రీకాంత్‌రెడ్డి 5 కర్నూలు వై. బాలనాగిరెడ్డి 6 నంద్యాల కాటసాని రాంభూపాల్‌రెడ్డి 7 వైఎస్సార్(కడప) కే. సురేష్ బాబు 8 తిరుపతి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 9 నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 10 ప్రకాశం బుర్రా మధుసూదన యాదవ్ 11 బాపట్ల మోపిదేవి వెంకట రమణ 12 గుంటూరు మేకతోటి సుచరిత 13 పల్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 14 ఎన్టీఆర్ వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు 15 కృష్ణా పేర్ని వెంకటరామయ్య( నాని) 16 ఏలూరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) 17 పశ్చిమ గోదావరి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు 18 తూర్పు గోదావరి జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్ 19 కాకినాడ కురసాల కన్నబాబు 20 కోనసీమ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ 21 విశాఖపట్నం ముత్తెంశెట్టి శ్రీనివాసరావు 22 అనకాపల్లి కరణం ధర్మశ్రీ 23 అల్లూరి సీతారామ రాజు కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ 24 పార్వతీపురం మాన్యం పాముల పుష్పశ్రీవాణి 25 విజయనగరం చిన్న శ్రీను 26 శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్ రీజినల్ కో- ఆర్డినేటర్లు జిల్లాలు, నియోజకవర్గాలు రీజినల్ కో ఆర్డినేటర్ 1 చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 కర్నూలు, నంద్యాల సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 3 వైఎస్సార్, తిరుపతి అనిల్ కుమార్ యాదవ్ 4 నెల్లూరు, ప్రకాశం, బాపట్ల బాలినేని శ్రీనివాస్ రెడ్డి 5 గుంటూరు, పల్నాడు కొడాలి వెంకటేశ్వరరావు( నాని) 6 ఎన్టీఆర్, కృష్ణా మర్రి రాజశేఖర్ 7 ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ పీవీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ 8 విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు వైవీ సుబ్బారెడ్డి 9 పార్వతీపురం మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం బొత్ససత్యనారాయణ -
ఏపీ వాణిజ్య శాఖ పనితీరు దేశంలోనే అత్యుత్తమం
భవానీపురం(విజయవాడ): దేశ వాణిజ్య పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబర్చడం ద్వారా ఉన్నత స్థితిలో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రెవెన్యూ అనేది పాలనలో కీలకమని, ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విజయవాడలో బుధవారం జరిగిన వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2019లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ సాధించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యోగుల సంఘ నేతగా సూర్యనారాయణ మంచి పనితీరు కనబర్చారని ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఉద్యోగులంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక అభిమానమని, కానీ కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితులు కారణంగా పీఆర్సీ విషయంలో వారితో సంప్రదింపులు చేయాల్సి వచ్చిందన్నారు. 50 ఏళ్లుగా ఒకే యూనియన్‌గా వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ పనిచేయడం అభినందనీయమన్నారు. అలాంటి పార్టీలతో జాగ్రత్త : సజ్జల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు అడగకుండానే సీఎం వైఎస్ జగన్ 27% మధ్యంతర భృతి ఇచ్చారని గుర్తు చేశారు. రెండు, మూడు దశాబ్దాలుగా ఎన్నికల సమయంలో హామీలివ్వడం ఆ తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా వస్తోందని, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధిని ప్రజా సంక్షేమంతో కలిసి చూస్తోందని చెప్పారు. ఇవ్వగలమన్న ఉద్దేశంతోనే సీపీఎస్ రద్దు వంటి హామీలిచ్చామని, కానీ రాష్ట్ర ఆదాయంపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిందని, అయినా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఎన్నికలు వస్తుండటంతో ఉద్యోగులను వాడుకునేందుకు పార్టీలు వస్తున్నాయని.. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సుమారుగా 10 రాష్ట్రాల నుంచి హాజరైన అధికారులు జీఎస్టీ సంబంధిత అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 2,000 మందికిపైగా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. -
వైఎస్సార్సీపీలోనే దళిత డీఎన్ఏ ఉంది
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీలోనే దళిత డీఎన్ఏ ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌లు ఒకరు ఆలోచన, మరొకరు ఆచరణ అని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు అసమానతలకు పుట్టినిల్లుగా ఉన్న భారతదేశం నేడు సమానత్వం, అభివృద్ధి దిశగా వెళ్తోందంటే అంబేద్కర్, జగ్జీవన్ రామ్లే కారణమని అన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాలు ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణంగా నెరవేరతాయని వివరించారు. అణగారినవర్గాలు రాజకీయ సాధికారత సాధించే దిశగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాల్సిన ఆవశ్యకతను గుర్తించింది వైఎస్సార్సీపీయే అని చెప్పారు. మంత్రివర్గ కూర్పు నుంచి అన్నింటిలోనూ సీఎం జగన్ ఈ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గతంలో పాలించిన పార్టీలు దళిత వర్గాల అభివృద్ధి గురించి మాటలు మాత్రమే చెప్పాయని, వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదని తెలిపారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలనే ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. దళితుల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సోషల్ జస్టిస్) జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతకు సీఎం జగన్ కృషి: సజ్జల
సాక్షి, విజయవాడ: మహిళా సాధికారతకు పూర్తిస్థాయి అర్థం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ సచివాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, అమ్మ ఒడి పథకం సీఎం జగన్ ఆలోచనల్లోంచి పుట్టిందేనన్నారు. కుటుంబం బాగుండాలంటే నిర్ణయాధికారం మహిళకు ఉండాలని ఈ ప్రభుత్వంలో మహిళలకు ఆ అధికారం జగన్ కల్పించారని సజ్జల అన్నారు. చదవండి: ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్ ‘‘మహిళల పేరిటే ఇళ్ల పట్టాలిచ్చి వారికి సొంత ఆస్తి కల్పించారు. మహిళల పట్ల ఆయనకు అమితమైన విశ్వాసం ఉందని అనేక చర్యల ద్వారా నిరూపించుకున్నారు. మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించారు. ఏపీలో వచ్చే ఐదారేళ్లలో మహిళలు మరింత శక్తివంతంగా మారుతారు. ఏపీ నుంచి వచ్చారంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవారని అంతా చెప్పుకుంటారు. మహిళల కోసం ఎలాంటి సూచనలు చేసినా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుందని’’ సజ్జల తెలిపారు. ‘‘శతాబ్దాలుగా అనేక అసమానతలకి గురైంది మహిళే. ఇటీవల కాలంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. విధాన పరమైన నిర్ణయాల అమలులో సచివాలయ మహిళా ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వాలు ఏమైనా ఆ నిర్ణయాలు అమలులో మీదే కీలకపాత్ర. సీఎం వైఎస్ జగన్ గత మూడేళ్లగా మహిళా సాధికారికతకి కృషి చేస్తున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
వివేకానందరెడ్డి హత్యకేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారం:సజ్జల
-
బాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు: సజ్జల
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్సార్సీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద అండను కోల్పోయారన్నారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబులాగే లోకేష్ కూడా పనికి రాకుండా తయారయ్యాడని విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపిస్తున్నారని.. సాక్ష్యాలను ఎవరూ తారుమారు చేయలేరన్నారు. గుండెపోటు అని చెప్పినంత మాత్రాన అది దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తుందని సూటిగా ప్రశ్నించారు. ఎదురుగా ఉన్న సాక్ష్యాలను సీబీఐ పరిగణలోకి తీసుకోదా? అని నిలదీశారు. చంద్రబాబుది కుట్రల స్వభావం అని మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్యకేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని సజ్జల దుయ్యబట్టారు. -
అందరినీ సంతోషంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సజ్జల రామకృష్ణారెడ్డి
-
ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నాం: సజ్జల
సాక్షి, అమరావతి: పీఆర్సీ విషయంలో చేయగలిగినంతా చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనూ వారికి చేయాల్సింది చేశామని పేర్కొన్నారు. హెచ్ఆర్ఏ స్లాబుల విషయంలోనూ సానుకూలంగా చేశామన్నారు. చర్చల్లో పాల్గొన్న టీచర్ల నేతలు అప్పుడే చెప్పి ఉంటే బావుండేదన్నారు. చదవండి: మా ఆవేదనను సీఎం జగన్ అర్థం చేసుకున్నారు: ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు అడిగినవి కూడా చేశాం. అందరినీ సంతోషంగా ఉంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కోవిడ్ పరిస్థితుల్లో కూడా రూ.10వేల కోట్లకు పైగా అదనంగా ఖర్చు పెడుతున్నాం. హెచ్ఆర్ఏ స్లాబుల వల్ల రూ.1300 కోట్ల భారం. భవిష్యత్‌లో ఉద్యోగులకు ఏ సమస్య వచ్చిన చర్చించడానికి సిద్ధం. మంత్రుల కమిటీని ప్రభుత్వం కొనసాగిస్తుంది. మేం ఉద్యోగులను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. ఉన్నదానిలో ఉద్యోగులకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చాం. ఉద్యోగ సంఘాలు మంచిగా సహకరించాయి. సీఎం ఎన్ని స్కీములు పెట్టినా ఉద్యోగుల సహకారం అవసరం. ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జఠిలం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జఠిలం అవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులు బలప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు. బయటి శక్తుల ప్రమేయంతో ఉద్యోగులకు ఇబ్బందులొస్తాయన్నారు. చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ సంబంధం లేని ఇష్యూలు హైలెట్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉద్యోగులు నియంత్రణ కోల్పోయి వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధం. ఆందోళనలు, సమ్మెల వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ సమస్యలను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు: సజ్జల
సాక్షి, అమరావతి: ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలను అనేక సార్లు చర్చలకు పిలిచామని తెలిపారు. సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మేరకు మంచి నిర్ణయం తీసుకున్నామని సజ్జల పేర్కొన్నారు. చదవండి: ‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్’ ‘‘పీఆర్సీ నిర్ణయం గురించి అన్నీ వివరించాం. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సంఖ్య పెరిగింది. బల ప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలం అవుతుంది. పీఆర్సీ ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇస్తున్నాం. కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాం. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఉన్న పరిస్థితుల్లో చేయాల్సిందంతా చేశాం. ఉపాధ్యాయులకు చాలా మేలు చేశాం. సర్వీస్ సంబంధిత అంశాలెన్నింటినో పరిష్కరించామని ’’ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని.. మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. చదవండి: ఏపీ ప్రయోజనాలు విస్మరించిన కేంద్రం ‘‘సమ్మె అవసరం లేకుండా సమస్య పరిష్కారం చేద్దామని చెప్పాం. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలను జఠిలం చేసుకోవద్దని చెప్పాం. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని’’ సజ్జల విజ్ఞప్తి చేశారు. బల ప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని.. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని సజ్జల కోరారు. సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?. ఉద్యోగుల కార్యాచరణను పక్కన పెట్టాలని చెప్పాం. సమ్మెకు వెళ్లకముందే రోడ్డు ఎక్కడం సరికాదని’’ సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. -
చర్చోప చర్చలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల కమిటీ మధ్య మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తొలుత ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల వ్యవహారాలు) చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహించిన చర్చలు సానుకూలంగా జరిగాయి. (మరో సభ్యుడు మంత్రి పేర్ని నాని అనారోగ్యంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు) పీఆర్సీ సాధన సమితి నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితర నేతలు ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు. తమకు పాత జీతాలే వేయాలని మరోసారి మంత్రుల కమిటీని కోరారు. దీంతో పాటు కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలను రద్దు చేయాలని, పీఆర్సీ నివేదికను ఇవ్వాలన్నారు. అంశాల వారీగా చర్చలు జరిపిన తర్వాత మరోసారి చర్చలకు పిలుస్తామని మంత్రుల కమిటీ వారికి చెప్పింది. చర్చలకు అందుబాటులో ఉండాలని కోరింది. అన్ని విషయాల గురించి మాట్లాడుకుందామని, ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించవద్దని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలను కోరింది. అనంతరం వారు అక్కడి నుంచి బయటకు వెళ్లారు. కాగా, మంగళవారం చర్చలు సానుకూలంగా జరిగాయని, మరోసారి మళ్లీ చర్చలు జరుపుతామని సాయంత్రం తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. పీఆర్సీ సాధన కమిటీ ర్యాలీకి అనుమతి నిరాకరణ విజయవాడ స్పోర్ట్స్: పీఆర్సీ సాధన కమిటీ ఈ నెల 3వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పోలీస్ కమిషనరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మూడో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలో భారీ ర్యాలీకి పీఆర్సీ సాధన కమిటీ అనుమతి కోసం తమకు దరఖాస్తు చేసుకుందన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తి, సెక్షన్ పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో వారికి అనుమతి నిరాకరించామని చెప్పారు. విజయవాడ నగరంలో కోవిడ్ ఉధృతి ఎక్కువ ఉందని, ఈ ర్యాలీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారి వద్దకు వచ్చే సామాన్య ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేల మందితో ర్యాలీలు చట్టపరంగానే కాకుండా ఎంప్లాయ్ కాండాక్ట్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల ఉద్యోగులెవ్వరూ ఈ ర్యాలీకి రాకూడదని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్లొద్దు.. అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆందోళనలు విరమించుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరాం. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఎంత చేయాలో అంత చేసిన విషయాన్ని మరోసారి వారికి వివరించాం. ఉద్యోగ సంఘాల నాయకులు పాత పీఆర్సీని అమలు చేయాలని కోరారు. పీఆర్సీ ప్రకటించి కొత్త పీఆర్సీ అమలైన తర్వాత పాత పీఆర్సీని అమలు చేయడం ఎంత వరకు సాధ్యమో ఆలోచించాలని చెప్పాం. ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని రికవరీ చేయడం ఏమీ లేదు. ఐఆర్ అనేది కేవలం సర్దుబాటు మాత్రమే. అది రికవరీ కాదు. ఉద్యోగులపై బెదిరింపులు, ఒత్తిళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించే వరకు వెళ్లవద్దని వారిని కోరాం. అధికారుల కమిటీ నివేదికలోనే పీఆర్సీ నివేదికలోని అన్ని అంశాలు ఉన్నాయని వారికి వివరించాం. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు చలో విజయవాడను విజయవంతం చేయాలి గురువారం చేపట్టే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాలేదు. ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుంది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కొత్త పీఆర్సీ ప్రకారం నష్ట పోతున్న విషయాన్ని మళ్లీ చెప్పాం. మూడు ప్రధాన అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం. అవి సాధ్యపడవని మంత్రుల కమిటీ సమాచారం ఇచ్చింది. అందుకే కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు ఛలో విజయవాడకు వెళ్లొద్దని ఉద్యోగులకు చెప్పే ప్రైవేటు క్లాసులు మానుకోవాలి. ఉద్యోగులను భయ భ్రాంతులకు గురి చేయొద్దని కలెక్టర్లకు చెబుతున్నాం. సమ్మెలు, ఆందోళనలు తాత్కాలికమే. మళ్లీ అంతా కలిసి పని చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. – బండి శ్రీనివాసరావు, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు -
హైకోర్టు సలహాను పరిగణలోకి తీసుకోవాలి: సజ్జల
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం.. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని జేఏసీ నేతలు చర్చలకు వచ్చారని.. అని అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ లేదన్నారు. చదవండి: జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు?: ఏపీ హైకోర్టు ఉద్యోగుల కార్యాచరణను వాయిదా వేయమని కోరామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు ఎవరికీ అన్యాయం చేయాలని లేదన్నారు. హైకోర్టు సలహాను ఉద్యోగ సంఘాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇది పాజిటివ్ చర్చగానే తాము భావిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ చర్చిస్తామని మంత్రుల కమిటీ తెలిపింది. -
సీఎం జగన్ పథకాలు సామాన్యమైనవి కావు: సజ్జల
-
సీఎం జగన్ పథకాలు సామాన్యమైనవి కావు: సజ్జల
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు టీడీపీ పాలనను చీత్కరించి కొత్త ఆశలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. 30మే 2019లో అధికారం చేపట్టి 2020, 2021 సంవత్సరాలను పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. 2020లో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విస్తరించిందని తెలిపారు. అప్పటికే టీడీపీ ప్రభుత్వం మిగిల్చిన రుణభారంతో రాష్ట్రం కుంగిపోయిందని.. కరోనా కూడా దెబ్బకొట్టిందని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొని సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను మొదటి ఏడాదిలోనే 95 శాతం అమలు చేశారని వివరించారు. ఏ పథకంలో కూడా అంతరాయం లేకుండా పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన పథకాలు సామాన్యమైనవి కావని, గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం జనజీవనంలో భాగమయ్యాయని పేర్కొన్నారు. -
డప్పు, చర్మకారులు రూపొందించిన ప్రచార రథాన్ని ప్రారంభించిన సజ్జల
-
మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. సీఎంను కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కట్‌చేసి సజ్జల రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
జీతాలు కొంత పెరిగే విధంగానే ఫిట్మెంట్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వడం ద్వారా వస్తున్న జీతం కంటే ఫిట్మెంట్ అమలు తర్వాత జీతం తగ్గకుండా, కొంత పెరిగేలా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగుల జీతాలు తగ్గకపోగా, కొంత పెరుగుతాయని చెప్పారు. ఇది ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని, ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారని గుర్తు చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సజ్జల తదితరులతో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. (చదవండి: ప్రజానేతకు పట్టంకట్టిన ప్రజలు) సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సెక్రటరీల కమిటీ సిఫార్సులు అమలు చేస్తే వేతనం తగ్గుతుందన్న ఉద్యోగుల అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. అధికారులు సూచించిన ఫిట్మెంట్ అయితే ఇప్పుడు వస్తున్న జీతంకంటే తగ్గుతుందని, అలా జరగకుండా కసరత్తు చేయాలని సీఎం సూచించారని చెప్పారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన అంశాన్ని ఉద్యోగులకు సెక్రటరీల కమిటీ వివరించిందని తెలిపారు. ఆర్థికేతర అంశాలను రెండ్రోజుల్లోగా పరిష్కరించేందుకు మంగళవారం నుంచే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ నేతృత్వంలోని సెక్రటరీల కమిటీ సమావేశమవుతుందని తెలిపారు. చదవండి: ముఖ్యమంత్రి ఆరాటం.. మేలు చేయాలనే -
చంద్రబాబుకు చేతనైతే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ఏపీ మండలి ఛైర్మన్ ఆఫీస్‌లో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలిలో సీఎం జగన్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఇళ్ల రుణమాఫీ పథకంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు.. సీఎంగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. శాసన మండలిలో గ్యాలరీ ఎక్కి మరీ బెదిరించారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు.. రాజకీయాలకు సిగ్గుచేటని.. వ్యవస్థలను, కుల వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆయనకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తోంది: సజ్జల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆది మూలపుసురేష్ ,సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పక్షాలు పాదయాత్రల పేరుతో వందల కోట్లు వసూలు చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. ప్రజలు.. వైఎస్సార్సీపీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజలంతా ముక్తకంఠంతో తమ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని సజ్జల అన్నారు. కాగా, నిజమైన ప్రజల పక్షంగా ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించిందని సజ్జల అన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సజ్జల పేర్కొన్నారు. -
కుప్పం ప్రజలు బాబుకు దండం పెట్టేశారు: సజ్జల
సాక్షి, అమరావతి: కుప్పం అడ్డాలో చంద్రబాబు పరాజయం పాలయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తుది వీడ్కోలు పలికారని అన్నారు. కుప్పం ప్రజలు బాబుకు దండం పెట్టేశారని ఎద్దేవా చేశారు. పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారని అన్నారు. చదవండి: Kuppam Municipal Election Results: కుప్పంలో కుప్పకూలిన టీడీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు చంద్రబాబును నమ్మలేదని తెలిపారు. కుప్పం ఓటమికి చంద్రబాబు ముందే సాకులు వెతుకున్నారని అన్నారు. వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీ పట్టం కడుతున్నారని తెలిపారు. పలు ఎన్నికల్లో టీడీపీకి జనసేన బహిరంగంగానే మద్దుతు ఇచ్చిందని అన్నారు. 100 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 97 శాతం స్థానాల్లో విజయం సాధించామని సజ్జల పేర్కొన్నారు. కాలం గడిచే కొద్దీ సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. బద్వేల్ ఎన్నికల్లోనూ టీడీపీ.. బీజేపీకి మద్దతు పలికినా అందరూ ఏకమైనా ఆ మెజారిటీ వచ్చిందని ఎద్దేవా చేవారు. 2019లో 50శాతం ఓట్లతో ప్రారంభమైన యాత్ర ఇప్పుడు 90 శాతాన్ని మించిందని అన్నారు. దౌర్జన్యాలు జరిగినట్లు చూపించాలని నానా యాగీ చేశారని, ఎదో విధంగా అలజడి సృష్టించి ఎన్నిక ఆపాలని చూశారని తెలిపారు. గుంటూరులో ఒక డివిజన్ గెలిచామని పండగ చేసుకుంటున్నారని, కళ్లు మూసుకుని తమదే విజయం అంటుంటే జాలి పడాల్సిందేనని అన్నారు. కుప్పం ప్రజలు బాబు చెర నుంచి విముక్తులైనందుకు అభినందనలు తెలిపారు. తమ పార్టీని అక్కడ ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తమకు ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ ప్రజలకు మోయలేని బరువైందని, అందుకే ప్రజలు దించేశారని అన్నారు. కుప్పం కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయ్యిందని, వైఎస్సార్, జగన్ కుప్పాన్ని అబివృద్ది చేశారని తెలిపారు. ఒక్క చంద్రబాబే దాన్ని వదిలేశాడని అన్నారు. ప్రజలు ఓటు వేయకపోతే చంద్రబాబు వాళ్లని నిందిస్తాడు కానీ సీఎం జగన్ తమ లోపం ఎక్కడ ఉందో సమీక్షించుకుంటాడని సజ్జల పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యానికి పనికిరాని క్యారెక్టర్ చంద్రబాబు
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్(శ్రీకాకుళం), ఇషాక్ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(కడప)లను వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. ఈ మేరకు అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. చదవండి: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
పెట్రోల్ ధరలపై బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: సజ్జల
-
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల
-
రాష్ట్రంలో అద్భుతమైన పాలనకు ప్రజాసంకల్పయాత్ర నాంది పలికింది
-
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
-
ప్రతీ ఎన్నిక మా బాధ్యతను మరింత పెంచుతుంది: సజ్జల రామకృష్ణా రెడ్డి
తాడేపల్లి: టీడీపీ నేతలు బీజేపీకి ఏజెంట్లుగా పనిచేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నామని ఈ గెలుపుతో మరోసారి స్పష్టమైందని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం.. బరిలో లేకపోయినా బీజేపీ అభ్యర్థిని మోసుకొచ్చారని ఆరోపించారు. ప్రతీ ఎన్నిక మా బాధ్యతను మరింత పెంచుతోందని సజ్జల పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయన్నారు. పోటీలో లేకపోయినా జనసేన, టీడీపీ ప్రచారం చేశాయని విమర్శించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కుట్రలను బద్వేలు ప్రజలు తిప్పికొట్టారన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
అమరావతి: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు’’ అన్నారు సీఎం జగన్. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 ‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను’’ అని సీఎం జగన్ తెలిపారు. (చదవండి: ‘బద్వేలు తీర్పు సీఎం జగన్‌పై నమ్మకానికి నిదర్శనం’) దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 బద్వేల్ ఉప ఎన్నికలో భారీ విజయం నేపథ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్‌ని కలిశారు. అలానే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం జగన్‌ని కలిశారు. చదవండి: ‘90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు పాదాభివందనం’ చదవండి: అవార్డు గ్రహీత వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేసిన సీఎం జగన్ -
చంద్రబాబు బూతు పంచాంగం డ్రామా ఫెయిల్: సజ్జల
-
అధికారం ఊడిందనే అక్కసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వారం క్రితం ప్రారంభించిన బూతు డ్రామాకు మంగళవారం ఢిల్లీ వేదికగా తెరదించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారం ఊడిందనే అక్కసుతో.. తనకు ఓటు వేయని ప్రజలపై కక్ష తీర్చుకునేలా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో చంద్రబాబు బూతు డ్రామాను ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఎల్లో మీడియా ద్వారా ఏదో జరుగుతోందని చూపించే ప్రయత్నం చేశారని ఎద్దేశా చేశారు. అందులో భాగంగానే ‘ఈనాడు’లో అశ్వత్థామ హతః కుంజరః అన్నట్లుగా ‘రాష్ట్రపతి పాలన పెట్టండి’ అనే డిమాండ్‌తో బ్యానర్ హెడ్డింగ్‌లు పెట్టించి తృప్తి పడ్డారని దెప్పిపొడిచారు. బూతులు తిట్టించిన చంద్రబాబేమో ఢిల్లీ నుంచి కిక్కురుమనకుండా హైదరాబాద్ చేరుకున్నారని, తిట్టినవాడేమో మాల్దీవులకు పోయాడని మండిపడ్డారు. ఈ సమావేశంలో సజ్జల ఇంకా ఏమన్నారంటే.. ఢిల్లీలో దివాలా తీసిన చంద్రబాబు ► తిమ్మిని బమ్మి చేయటమే కాదు.. శూన్యంలోంచి చంద్రబాబు ఏమైనా సృష్టించగలరు. ఒక ఛండాలమైన బూతు మాటను సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడితే.. దానిపై వచ్చిన ప్రతిస్పందన చూసి చంద్రబాబు పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలని ప్రయత్నించారు. ► ఒక రోజు బంద్‌కు పిలుపు ఇచ్చారు. 36 గంటల నిరాహార దీక్ష చేసిన డయాబెటిక్ పేషెంట్ ఊగిపోతూ గంటన్నర సేపు నినదించి ప్రసంగించారు. అంతశక్తి ఉందంటే అది దీక్షకాని దీక్ష అనుకోవాలి. దాన్ని వ్యూహాత్మకంగా ముగించాలని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. అక్కడ చంద్రబాబు దివాలా తీశారని పసిగట్టిన జాతీయ మీడియా ఆయన పర్యటనను ఏమాత్రం పట్టించుకోలేదు. అమిత్ షా ఫోన్ చేశారని మరో డ్రామా ► ఢిల్లీలో రాష్ట్రపతిని చంద్రబాబు బృందం కలిసింది. రాష్ట్రపతి ఏమన్నారో తెలియదు. చంద్రబాబు అయితే చెప్పాల్సింది చెప్పి, కక్కాల్సింది కక్కారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రమ్మని పిలిచినట్లు.. శిఖరాగ్ర చర్చలు జరిపి.. సీఎం వైఎస్ జగన్ పాలనకు తెరదించేలా అమీతుమీ తేల్చుకోనున్నట్లు చంద్రబాబు కలరింగ్ ఇచ్చారు. కానీ అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో ఎల్లో మీడియా రాయలేదు. ► అదే సీఎం వైఎస్ జగన్ అమిత్ షాను కలిస్తే.. మొట్టికాయలు వేశారని ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాక అమిత్ షా ఫోన్ చేసినట్లు ఎల్లో మీడియాకు చంద్రబాబు లీకులు ఇచ్చి మరో డ్రామాకు తెరతీశారు. అమిత్ షా ఫోన్ చేశారో లేదో తెలియదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చక్రం కాదు కదా.. దీపావళి పండుగ పూట తిప్పే విష్ణు చక్రం కూడా తిప్పలేదు. ► చంద్రబాబుకు ఏనాడూ ప్రజలంటే ప్రేమ, అభిమానం లేదు. లెక్కలేనితనం ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. గంజాయి సాగు, స్మగ్లింగ్‌కు రాష్ట్రం రాజధానిగా మారిందని చెప్పడం దారుణం. చంద్రబాబుకు ఏ సెక్షన్ కింద ఎంత కఠినాతి కఠినమైన శిక్ష వేసినా తప్పులేదు. ► చంద్రబాబు ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారు. దారినపోయేవాడు అక్కసుతో తిడితే దానికో అర్థముంటుంది. ఈ రాష్ట్రంలో యువతకు బూతులు నేర్పాలని అనుకుంటున్నావా? టీడీపీ సర్కార్ హయాంలోనే గంజాయి స్మగ్లింగ్ ► 2016లో నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ప్రాంతం కేంద్రంగా గంజాయి వెళ్తోందని ఏమాత్రం దాపరికం లేకుండా మాట్లాడారు. దీనిపై చంద్రబాబు, ఆయన్ను సపోర్ట్ చేసే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. ► సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను తుదముట్టించడానికి ఎస్ఈబీని ఏర్పాటు చేశారు. ఏడాదిలోనే 3 లక్షల కిలోలకుపైగా గంజాయిని ఎస్ఈబీ స్వాధీనం చేసుకుంది. సాగు చేసిన గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు. స్మగ్లర్లకు పెద్ద ఎత్తున శిక్షలు పడుతున్నాయి. ఇది వాస్తవం కదా? ► ఎయిడెడ్ స్కూళ్లపై చేస్తున్న ఆందోళన వెనుక టీడీపీ నేతల పాత్ర ఉంది. ఎవరి మెడ మీదా కత్తి పెట్టి బలవంతంగా స్కూళ్లను తీసుకోలేదు. ► దేశంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా పార్టీ పెట్టుకోవచ్చు. కేసీఆర్ కూడా రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవచ్చు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఉమ్మడి ఏపీ దేశంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్సీపీ చెప్పింది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో అడ్డగోలుగా విద్యుదుత్పత్తి చేస్తుండటం, సింగరేణి బొగ్గు గనులు ఉండటం వల్లే తెలంగాణలో విద్యుత్ సమస్య ఉత్పన్నం కాలేదన్నది వాస్తవం కాదా? చదవండి: కాంగ్రెస్ ,బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి: అంబటి రాంబాబు -
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి: సజ్జల
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనను ఇలానే దూషిస్తే ఊరుకుంటారా.. చంద్రబాబుకు తెలియకుండా పట్టాభి మాట్లాడతారా’’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు. ఈ సదర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఆయన దీక్షలకు పట్టుమని పది మంది కూడా స్పందించడంలేదు. బూతులు తిట్టడం అనేది చేతగానివాళ్లు చేసే పని. సీఎం జగన్ సంయమనం పాటించాలని చెప్పారు. అందుకే మా కార్యకర్తలు సహనంగా ఉన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా’’ అని ప్రశ్నించారు. (చదవండి: టీడీపీ బూతు వ్యాఖ్యలపై.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి) ‘‘పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంను దూషించడం సరికాదు. టీడీపీ నేతలు ఎన్నిసార్లు దూషించినా మౌనంగానే ఉన్నాం. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం.. వీధి రాజకీయాలు చేయడానికి కాదు. ప్రజలకు మంచి చేయడానికి ఎందాకైనా వెళ్తాం. టీడీపీ నేతలు.. వినేందుకు ఇబ్బంది పడే మాటలు మాట్లాడుతున్నారు. బూతులు వారే మాట్లాడతారు.. దొంగ దీక్షలు వారే చేస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు. (చదవండి: చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి బూతులు: మంత్రి బాలినేని ) ‘‘టీడీపీ డీఎన్ఏలోనే లోపం ఉందేమో.. చంద్రబాబును చూస్తే జాలేస్తోంది.. కోపం రావడం లేదు. పట్టాబి వెనక ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడించినట్లు ఉంది. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బాబు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్తులో ఇలాంటివే ఎదురవుతాయి. టీడీపీ నేతలు ఎక్కడ కనపడినా నిలదీయండి. సహానానికి కూడా హద్దు ఉంటుంది. టీడీపీ నేతలు హద్దు మీరి ప్రవర్తించారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని సజ్జల తెలిపారు. చదవండి: ‘పట్టాభి ఓ గే’.. 'సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ -
టీడీపీ పూర్తిగా హద్దు దాటింది: సజ్జల
-
చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరింది: సజ్జల
తాడేపల్లి: చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి పక్షాలు ఏక్కడ ఏది జరిగినా ప్రభుత్వంపై కావాలనే విషప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. హెరాయిన్, డ్రగ్స్‌లకు ఏపీ అడ్డగా మారిందని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు దిగజారీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు అనుకూల మీడియాల్లో అడ్డమైన కథనాలు రాయించుకుంటున్నారని సజ్జల విమర్శించారు. హెరాయిన్ కేసును కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని సజ్జల తెలిపారు. టీడీపీ వాళ్లు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారేమోనన్న అనుమానం ఉందని విమర్శించారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రూ.వేల కోట్ల డ్రగ్స్ కేసులో ఎవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుందని అన్నారు. టీడీపీ హయాంలో గంజాయి రవాణాను చూసీ చూడనట్లు వదిలేశారని అన్నారు. దీనిపై సీఎం జగన్ ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చినందువల్లే.. గంజాయి రవాణాపై అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా.. చంద్రబాబుకు సిగ్గులేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చదవండి: ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ -
బద్వేలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ: సజ్జల
-
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికే ఎల్లో మీడియా పరిమితం: సజ్జల
-
40 ఏళ్ల ఇండస్ట్రీ కుట్రలు ఫలించలేదు
-
శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం: సజ్జల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్టుటూరులోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రైతాంగానికి సంక్షేమం అందించేందుకు ఆర్బీకే కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు స్వయంగా తమ కాళ్లపై నిలబడేలా అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన’’ అని తెలిపారు. ‘‘ఎంత త్వరగా రైతులను ఆదుకుంటున్నాము అనేదే ఇక్కడ ముఖ్యం.. పంటల బీమా, పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వడం ద్వారా రైతులకు వడ్డీ భారం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించి ఐదేళ్లలో కూడా పూర్తిగా చెల్లించలేదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఇచ్చిన హామీని పూర్తి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయం. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొంటున్నాయి’’ అని సజ్జల తెలిపారు. (చదవండి: రైతులకు అండగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి) ‘‘స్వచ్ఛమైన ఆలోచన, అన్ని వర్గాలను తన కుటుంబాల లాగా భావించి కార్యక్రమాలు అమలు చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన. గ్రామాల్లో ఆర్బీకేల్లో మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా స్థానిక నేతలు సహకారం కావాలి. సహకార రంగం మరింత బలోపేతం కావాలంటే గ్రామాల్లో నేతలు కలిసి పనిచేయాలి. జిల్లాకు నీరు వస్తుందా రాదా అన్న కల నుంచి ఇప్పుడు 60 టీఎంసీల నీరు నిల్వ చేసే స్థాయికి వెళ్లడం వైఎస్ కుటుంబం చలువ. వరద జలాలు కిందికి వృధాగా వెళ్లకుండా నీటిని ఒడిసిపట్టి నీటిని నిల్వ చేసుకుంటున్నాం’’ అన్నారు సజ్జల. చదవండి: పులిచింతల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే.. -
సీఎం జగన్ విజన్‌కు అనుగుణంగా పనిచేయాలి: సజ్జల
-
ఏపీ: 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం ఊసే లేదన్నారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారన్నారు. చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే చూశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామన్నారు. మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామన్నారు. ఓసీలకు 42 శాతం పదలిచ్చామని తెలిపారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల అన్నారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన: మంత్రి వేణుగోపాల కృష్ణ బీసీలంటే చంద్రబాబుకు చులకన అని, వారిని ఓటు బ్యాంక్‌గానే చూశారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. బలహీన వర్గాలకు సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. సీఎంకు, సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేరన్నారు. మహిళలకు 52 శాతం పదవులు: సుచరిత మహిళలకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని హోంమంత్రి సుచరిత అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకంలో మహిళలకు 52 శాతం పదవులు ఇచ్చారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరు మీదే ఇచ్చి వారి ప్రాధాన్యం ఏమిటో చెప్పారని సుచరిత అన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నిమామకంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. కొంతమంది కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన దాన్ని పదవి అనుకోకుండా బాధ్యతలా పని చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల
సాక్షి, అమరావతి: పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, జూపూడి ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగిందన్నారు. నాన్న వేసిన అడుగుకి పదడుగులు వైఎస్ జగన్ వేశారన్నారు. వైఎస్సార్ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా వైఎస్ జగన్ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ను బలోపేతం చేస్తూ ఆయన అడుగులో అడుగు వేద్దామని పిలుపునిచ్చారు. తండ్రి బాటలో సీఎం జగన్: లక్ష్మీపార్వతి పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్సార్ మరణించినా.. ఆయన జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయన్నారు. తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారన్నారు. లోకేష్ అసమర్థుడని.. ఎప్పటికీ నాయకుడు కాలేడని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర -
జగనన్న కాలనీ పరిశీలించిన సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పర్యటించారు. వెంకటగిరిలో జగనన్న కాలనీని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. తొలివిడతలో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న మహిళా లబ్ధిదారులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. దశాబ్దాల కాలం నాటి తమ సొంతింటి కల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేద మహిళా లబ్ధిదారులు తెలిపారు. అనంతరం వెంకటగిరిలో వైఎస్సార్ సీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఇంట్లో శుభకార్యానికి సజ్జల రామకృష్ణారెడ్డి హజరయ్యారు. చదవండి:ఈ నెల 24న అగ్రి గోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి -
ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లతో సజ్జల సమీక్ష
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రెండేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, సీఎం జగన్ చేస్తున్న మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంచి చేస్తున్నాం కాబట్టే.. మొన్నటి ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీకి పట్టం గట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
ఆర్యవైశ్యులు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి : సజ్జల
-
కాషాయమే రాజకీయ అజెండాగా బీజేపీ పనిచేస్తోంది : సజ్జల
-
'నేతన్న నేస్తం'తో ఆగిన ఆత్మహత్యలు: సజ్జల
-
చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్ ధరలు పెరిగాయి
-
ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పారు. 2015లోనే చంద్రబాబు పెట్రోల్, డీజిల్‌పై రూ.4 అదనంగా పెంచారని వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ విమర్శలు హాస్యాస్పదమని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచారని గుర్తుచేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు లేవు అని పేర్కొన్నారు. తాడేపల్లిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. ‘బాబు హయాంలో ధరలు పెరిగినప్పుడు ఎల్లో మీడియా ఏం చేసింది? బాబు హయాంలో రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదు. బాబు అడ్డంగా దోచుకోవడం వల్లే ఈ పరిస్థితి. రెవెన్యూ తగ్గినా సీఎం జగన్ ప్రజలపై భారం మోపలేదు’ అని స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు ఈ సమయంలో అమర్‌రాజా కంపెనీ వ్యవహారంపై స్పందించారు. ‘అమర్‌రాజ్ కంపెనీ విషపూరితమైన కాలుష్యం వెదజల్లుతోంది. ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. అమర్‌రాజా వ్యవహారంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. ప్రజలకు హాని కలిగించని పరిశ్రమలు ఉండాలన్నదే సీఎం ఉద్దేశం. ప్రజలకు ఇబ్బంది కలిగించే అన్ని పరిశ్రమలపై చర్యలు ఉంటాయి’. రాష్ట్రంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఉందని సజ్జల తెలిపారు. చంద్రబాబు అప్పులు, కరోనా వల్ల ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని వివరించారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని చెప్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి రూపాయి దుబారా అవుతుందా? అని ప్రశ్నించారు. కేంద్రం అప్పులు చేస్తుంది రాష్ట్ర బీజేపీ నేతలకు తెలియదా? అని మండిపడ్డారు. -
దాదాగిరీ ఎవరు చేస్తున్నారో.. ప్రజలు గమనిస్తున్నారు: సజ్జల
-
నవశక రాజకీయానికి సీఎం జగన్ శ్రీకారం: సజ్జల
సాక్షి, అమరావతి: అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని.. ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చాత్తాద శ్రీ వైష్ణవ కార్పొరేషన్ ఛైర్మన్ టి.మనోజ్‌కుమార్ అధ్యక్షతన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చాత్తాద శ్రీ వైష్ణవ కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవకులుగా పేరుతెచ్చుకునే అట్టడుగు వర్గాల నేతలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా నాయకులు పేరు తెచ్చుకోవాలి గాని అధికారం ఉంది కదా అని జులుం ప్రదర్శించే విధానానికి కాలం చెల్లిందని అన్నారు. వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారని తెలియచేశారు. కొందరి రాజకీయ నేతల మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే తత్వం వైఎస్ జగన్‌ది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
ప్రజల హక్కుగా సంక్షేమ పథకాలు: సజ్జల
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంక్షేమ పథకాల్లో కనీసం 20 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దేవాంగ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబొయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అరాచక పాలనను ప్రజలు భరించలేక పోయారని, కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల హక్కుగా సీఎం జగన్ అందిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ పని చేస్తున్నారన్నారు.. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, వెనకబడిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కృష్టి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. బీసీలు బలహీన వర్గాలు కాదు.. సమాజానికి వెన్నెముకలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, బీసీలు బలహీన వర్గాలు కాదని.. సమాజానికి వెన్నెముకగా పేర్కొన్నారు. బీసీలందరూ రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆ ఘనత సీఎం జగన్‌దే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ, బలహీన వర్గాలను పార్లమెంట్‌కు పంపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్రంలో గొప్ప అవకాశాలను సీఎం జగన్ కల్పిస్తున్నారని జోగి రమేష్ అన్నారు. -
వెనకబడిన వర్గాల్లోని మహిళాభ్యున్నతికి సీఎం జగన్ కృషి: సజ్జల
సాక్షి, అమరావతి: ఏలూరులో దూదేకుల మహిళకు మేయర్ పదవి ఇవ్వబోతున్నామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నూర్ బాషా కార్పొరేషన్ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యత: మంత్రి వేణుగోపాలకృష్ణ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలను అందించి పేదల అభ్యున్నతికి సీఎం జగన్ కృషిచేస్తున్నారన్నారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు. పేదల కోసం అందించే విద్య,వైద్య విధానంలో కార్పొరేట్ స్థాయి కన్న గొప్పగా ఉండేలా వినూత్న పథకాలు సీఎం జగన్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. బీసీలు, మైనార్టీల అభివృద్ధే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యం: లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, బీసీలు, మైనార్టీల అభివృద్ధే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవిష్యత్తులో వెనుకబడిన వర్గాలలోని ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగాలన్నారు. వెనుకబడిన వర్గాల ఎదుగుదల కోసమే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన వర్గాల భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. -
కరకట్టను వదిలేశారు .. ఎకానమీ దెబ్బతీశారు : సజ్జల
-
ఎక్కువ ఆనందాన్ని ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు :సజ్జల
-
‘రెడీ అనడమే తప్ప.. ఏవీ టీడీపీ రాజీనామాలు?’
-
ఉనికిని కాపాడేందుకే 56 కార్పొరేషన్లు ఏర్పాటు: సజ్జల
సాక్షి,అమరావతి: వెనుకబడిన వర్గాలలోని ప్రతి బిడ్డ... సంపన్న వర్గాల పిల్లలకు పోటిగా విద్యనభ్యసించాలనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుదవారం నిర్వహించిన రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల ఉనికిని కాపాడేందుకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ కులాల రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీ కాదని, వైఎస్ జగన్‌కు పార్టీలతో పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చేలా రాజకీయాలు చేయడం రాదని సజ్జల అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం ద్వారా ప్రజలు లబ్ది పొంది అభివృద్ధి చెందాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన వాఖ్యానించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంచార జాతులకు ప్రాధాన్యత ఇచ్చిన నేత సీఎం జగన్
-
ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రకటించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నామినేటెడ్ పదవులు అలంకార ప్రాయం కాదని.. పదవులు తీసుకున్నవారు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. పదవుల భర్తీలో సీఎం సామాజిక న్యాయం పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు ఇచ్చామని సజ్జల వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు, విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9 పోస్టులు పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7 పోస్టులు అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు వైఎస్సార్ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు -
పుట్టిన ప్రాంతం, రాష్ట్రంపై చంద్రబాబుకు ప్రేమ లేదు: సజ్జల
-
బీసీల ఎదుగుదలకు సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు: సజ్జల
-
కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు: సజ్జల
గుంటూరు: కష్టపడిన ప్రతి ఒక్కరికి వైఎస్సార్సీపీలో గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పదవులు కొంతమందికి ముందు వస్తాయి మరికొందరికి తర్వాత వస్తాయని , అంతేగానీ పదవులు రాలేదని ఎవరూ కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో అందరికీ సమానంగా గౌరవం ఉంటుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా నిబద్ధతతో నిజాయితీతో పని చేస్తున్నారన్నారు. ప్రజలతో ఉన్న అనుబంధమే వ్యక్తిని నాయకుడిని చేస్తుందని, సమాజం కోసం పని చేసే వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు అవే వస్తాయని తెలిపారు. అలాగే పదవులు కూడా వాటంతట అవే వస్తాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుజువు చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కుటుంబం వంటిదని సజ్జల పేర్కొన్నారు. -
గుంటూరులో ఎంఎల్‌సి అప్పిరెడ్డి అభినందన సభ
-
గుంటూరులో వైఎస్సార్ ఫుడ్ బ్యాంకులు ప్రారంభం
సాక్షి, నెహ్రూనగర్(గుంటూరు): ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార వృథాను అరికట్టి అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు చొరవతో రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో ఆరుచోట్ల వైఎస్సార్ ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకుల్లో ఫ్రీజ్ లను అందుబాటులో ఉంచింది. ఆహారం సేకరించి వీటిల్లో నిల్వ చేసి భోజనానికి ఇబ్బంది పడే పేదల పొట్ట నింపనుంది. సోమవారం ఈ బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. వెయ్యిలీటర్ల సామర్థ్యంతో.. నగరంలో రద్దీ ప్రాంతాలైన రైల్వే స్టేషన్, బస్టాండ్, జీజీహెచ్, లాడ్జిసెంటర్, గాంధీ పార్కు, చుట్టుగుంట ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లలో వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఫుడ్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఫ్రిజ్‌లలో నాజ్‌వెజ్, వెజ్‌కు విడివిడిగా ర్యాక్‌లు ఉంటాయి. మిగిలి పోయిన ఆహారాన్ని ఈ ర్యాక్‌లలో ఉంచితే సరిపోతుంది. ఈ బ్యాంకుల నిర్వహణకు అధికారులు రెండు షిఫ్టులుగా సిబ్బందిని నియమించారు. వీరు దాతల నుంచి ఆహారాన్ని సేకరించి ర్యాక్‌లలో నిల్వ చేస్తారు. అన్నార్తులు వస్తే వారికి భోజనాన్ని అందిస్తారు. ఈ ఫుడ్ బ్యాంకులపై విస్తృత ప్రచారం చేసేందుకూ నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఈ విధానం గ్రేటర్ హైదరాబాద్‌లో అమలవుతోంది. పాతదుస్తులూ సేకరణ ఈ ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని మాత్రమే కాకుండా పాత దుస్తులనూ సేకరిస్తారు. ఎవరైనా తమ పాత దుస్తులు ఇక్కడ అందజేస్తే ప్రత్యేక ర్యాక్‌లలో భద్రపరిచి అవసరం ఉన్నవారికి అందిస్తారు. ఫుడ్‌బ్యాంకుల పరిశీలన వైఎస్సార్ ఫుడ్ బ్యాంకులను ఆదివారం మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. -
తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది: సజ్జల
-
షర్మిల పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు : సజ్జల
-
కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే..
-
బాబూ జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి సజ్జల నివాళి
-
జలవివాదంతో రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు
-
అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసిన అపర భగీరథుడు వైఎస్ఆర్
-
రేపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు సజ్జల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని 10 మంది సభ్యుల బృందం రేపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు బయల్దేరనుంది. బృందంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. చదవండి: కృష్ణా నది కరకట్ట పనులకు రేపు సీఎం జగన్ శంకుస్థాపన -
విషం కక్కడమే ఎల్లోమీడియా ఎజెండా: సజ్జల
-
ప్రభుతానికి వ్యతిరేఖంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయి : సజ్జల
-
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రస్తావించారని చెప్పారు. రాజకీయాలతో ఈ సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఢిల్లీ పర్యటనల్లో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకునేవారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు జరిగాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఎల్లో మీడియా హడావుడి చేసింది. హోంమంత్రి అపాయింట్మెంట్ వాయిదా పడితే అది తప్పా?. రాష్ట్ర ప్రయోజనాలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో పోలవరం పనులు ముందుకు సాగలేదు. కరోనా సమయంలో కూడా పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం ఖాయం. సీఎం జగన్ విజన్‌తో తీసుకున్న నిర్ణయం అమలవుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణపై కేంద్ర సాయం కూడా ఉంటుంది’’ అని అన్నారు. విభజన హామీలపై సుప్రీం జడ్జిని పెట్టి పరిష్కరించాలని కోరుతున్నామన్న సజ్జల.. ఆనాడు బీజేపీ, కాంగ్రెస్ కలిసి గొంతు కోసాయన్నారు. ఇప్పుడు వాళ్లే బాధ్యత తీసుకుని న్యాయం చేయాలని సజ్జల కోరారు. రఘురామకృష్ణరాజు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, అందుకే తమ పార్టీ ఎంపీలు చర్యలు తీసుకోవాలని కోరారన్నారు. ఇక్కడ చదవండి: రఘురామకృష్ణరాజును డిస్క్వాలిఫై చేయండి Andhra Pradesh: 2008 డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్ -
గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ సాకారం చేశారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రెండేళ్లలోనే చరిత్రలో మిగిలిపోయే సువర్ణ ఘట్టాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారని.. మొత్తంగా 90 శాతంపైగా అభివృద్ధితో రాష్ట్రం ముందుకు నడిచిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆయనతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నేతలు ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని తెలిపారు. పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి సీఎం జగన్ ప్రతిక్షణం పేదల బాగోగుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నామని.. అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందించామని పేర్కొన్నారు. 20 ఏళ్లల్లో సాధించలేని అభివృద్ధిని రెండేళ్లలోనే సీఎం జగన్ చేసి చూపారన్నారు. మహా నేత వైఎస్ఆర్ అభివృద్ధి బాటలో సీఎం జగన్ నడిచారన్నారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమాన్ని అందించామని’’ సజ్జల పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శమైందని.. రాజ్యాంగ నిర్మాతలు కలలు గన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ సాకారం చేశారని తెలిపారు. నిజాయతీ, నిబద్ధతతో కూడిన వ్యవస్థను సీఎం జగన్ తన పాలనలో తెచ్చారని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల సీఎం జగన్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతు భరోసాతో రైతులను ప్రభుత్వం ఆదుకుంది. ఏ సంక్షేమ పథకం ఎప్పుడు అమలవుతుందో.. ఎప్పటికప్పుడు సీఎం జగన్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పు తెచ్చి నాడు-నేడు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి తెచ్చి విద్య అందిస్తున్నాం. రాష్ట్ర ప్రజలను మొత్తం తన కుటుంబంగా సీఎం జగన్ భావిస్తున్నారు. విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రభుత్వం భావిస్తోంది. అప్పుల భారం పడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు సీఎం జగన్ నడిపిస్తున్నారు. రేపు 16 మెడికల్ కాలేజీలకు సీఎం జగన్ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేస్తారని’’ సజ్జల వెల్లడించారు. ఐదేళ్లలోనే ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని సీఎం నిరంతరం శ్రమిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే .. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి సీఎం జగన్ అత్యంత శ్రద్ధ చూపుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు, పోర్టుల అభివృద్ధికి మౌలిక వసతులు సమకూర్చారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా రాష్ట్రాభివృద్ధికి సీఎం శ్రమిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు ఎక్కువగా అవకాశాలు కల్పించి.. ఆ వర్గాలు అభివృద్ధి చెందేలా సీఎం జగన్ కృషి చేశారు. చంద్రబాబు తత్వం ఎప్పటికీ మారదు.. అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా చంద్రబాబు మాట్లాడుతారు. చంద్రబాబు తనలో ఉన్న లోపాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని’’ సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. -
టీడీపీ దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తోంది: సజ్జల
-
‘ఎన్నికలు జరపమని డివిజన్ బెంచే తీర్పు చెప్పింది’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరపమని గతంలో ఇదే డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ తీర్పు ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల కమీషన్ (ఎస్ఈసీ) ఎన్నికలు నిర్వహించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, ప్రజాక్షేత్రంలో గెలవలేమని తెలుసుకున్న టీడీపీ దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తుందని, అందులో భాగంగా కోర్టుల్లో కేసులు వేస్తూ పాలనకు అడ్డు తగులుతుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు చిల్లర రాజకీయాలు చేస్తూ సంబరపడుతున్నారని, వారు ఎన్ని కుట్రలు పన్నినా అంతమ విజయం తమదేనని సజ్జల పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధమని, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్లో డ్రామాకు తెరలేపారు.. రఘురామకృష్ణరాజుపై నమోదైన సీఐడీ కేసులో ఎలాంటి అభ్యంతరాలు లేవని సజ్జల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ప్రజలందరు గమనించారని, ఈ డ్రామా మొత్తం చంద్రబాబు డైరెక్షన్లోనే సాగిందని ఆయన ఆరోపించారు. రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి పంపలేదని ఎలా అడుగుతారని, అసలు రమేష్ ఆస్పత్రిలోనే పరీక్షలు ఎందుకు చేయాలి ప్రశ్నించారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు ఆయన సొంత వాహనంలో వెళ్లారని, ఆ సమయంలో ఏదైనా జరిగి ఉండొచ్చన్న అనుమానానన్ని వ్యక్తం చేశారు. అతని కాలు నిజంగా ఫ్రాక్చర్ అయితే కారులో కాళ్లు, చేతులు చూపిస్తూ విన్యాసాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బెయిల్ రిజక్ట్ అయ్యి రాజద్రోహం కేసు నిలబడుతుందనే భయంతోనే ఆయన ఈ డ్రామాలన్నింటికీ తెరలేపుతున్నాడని ఆరోపించారు. -
టీడీపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని కుట్ర చేస్తోంది
-
మానవతా దృక్పధంతో అంబులెన్స్‌లను అనుమతించాలి: సజ్జల
-
బాబు, లోకేష్ అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా..?
-
N 440K స్ట్రెయిన్ అనే అభూత కల్పనను బాబు సృష్టించారు
-
ఏపీ పాలిట విలన్లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు
-
ఏపీలో లాక్‌డౌన్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది.. కానీ లాక్డౌన్ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది అన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నా.. జాగ్రత్తలు పాటించాలి. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు’’ అని సజ్జల తెలిపారు. ‘‘ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం జగన్ పాలన చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం జగన్ పాలన ఉంది. మా పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా ఉంటుంది’’ అన్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సజ్జల. ‘‘చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు.. హైదరాబాద్‌లో కూర్చుని ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తున్నారు. సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి అని సజ్జల సూచించారు. చదవండి: ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడడమా! -
‘పవన్ కళ్యాణ్ నటుడు, చంద్రబాబు సహజ నటుడు’
-
‘పవన్ కళ్యాణ్ నటుడు, చంద్రబాబు సహజ నటుడు’
తాడేపల్లి: ‘పవన్ కళ్యాణ్ నటుడు.. చంద్రబాబు రాజకీయాల్లో సహజ నటుడు’ అని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. టీడీపీ, బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లోనే ప్రజలు ఈ రెండు పార్టీలను ఛీ కొట్టినా వారిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామన్నది ఆ పార్టీ నేతలు చెప్పలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే, ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని చురకలంటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రభుత్వం, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిందని సజ్జల పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లభ్దిదారులకు అందాల్సిన సొమ్మును నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన రాళ్లదాడి హైడ్రామాను ప్రజలు గమనించారన్నారు. ‘టీడీపీ పనైపోయింది’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా చెప్తున్నారని విమర్శించారు. లోకేష్ దెబ్బకు టీడీపీ దివాళా తీసిందని ఆ పార్టీ నేతలే అంటున్నారని, దీన్నిబట్టి ఆ పార్టీ నేతలకి టీడీపీ పట్ల ఏమాత్రం చిత్తశుధ్ది ఉందో తెలిసిపోతుందన్నారు. చదవండి: లోకేష్, అచ్చెన్న ఎడమొహం.. పెడమొహం -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
ఎన్నికలు ఎపుడు జరిగినా ప్రజలు వై ఎస్ ఆర్ సి పీ కే పట్టం కడతారు: సజ్జల
-
సీఎం జగన్‌పై తప్పుడు కథనాలా.. అర్నాబ్ జాగ్రత్త
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జాతీయ మీడియా సంస్థ అయిన రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం కావడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని తప్పుడు కథనం ప్రచారం చేయడంపై ఆయన ఫైరయ్యారు. మార్చి 4న జగన్ సన్నిహితుడిపై ఫేక్ వార్తను ప్రసారం చేయడంపై ధ్వజమెత్తారు. నేషనల్ మీడియా ముసుగులో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫేక్ న్యూస్‌పై న్యాయపరంగా ప్రొసీడ్ అవుతామని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఆదరాభిమానాలున్న వైఎస్సార్సీపీపై తప్పుడు కధనాలు బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీలో ఎలాంటి సంక్షోభం కానీ గందరగోళం కానీ లేవని స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం రిపబ్లిక్ టీవీలో ఇలాంటి కథనాలు వండి వార్చారన్న అనుమానం కలుగుతోందని ఆయన ప్రకటించారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంలోనూ రిపబ్లిక్ టీవీ ఫేక్ కథనాలు ప్రసారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలపై చంద్రబాబు ఆక్రోశం, అశోక్‌గజపతిరాజు మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం వంటి అంశాలను వదిలి పెట్టి ఫేక్ కథనాలను వండి వారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కథనాల వెనక ఎవరున్నారో తెలుగు ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. నిత్యం వివాదాల్లో ఉండే అర్నాబ్ జాతికి పట్టిన పీడ అని ధ్వజమెత్తారు. -
మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే హవా..
సాక్షి, తాడేపల్లి: తామందరమూ ఊహించిన విధంగానే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనడానికి ఈ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలే నిదర్శనమన్నారు. ఏకగ్రీవాలు అధికంగా జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు ఉండేవని పేర్కొన్నారు. సుపరిపాలన అందిస్తే ప్రజల ఆశీస్సులు ఉంటాయనేది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఫలితాలు వైఎస్సార్సీపీ అనుకూలంగా ఉంటాయని తెలిసే చంద్రబాబు కోవిడ్ చూపి ఎన్నికలను వాయిదా వేయించాడన్నారు. ఎస్ఈసీ విషయంలో చంద్రబాబు రోజుకో తీరులో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఒక రోజు మెరునగధీరుడు అన్నారు.. ఇప్పుడేమో ఎస్ఈసీ మారిపోయాడంటున్నాడన్నారు. వలంటీర్ల సర్వీసులపై ఆంక్షలు పెట్టాలని ఎస్ఈసీ కుట్రలు పన్నినప్పటికీ, కోర్ట్ ఆ కేసును కొట్టేసిందని గర్తుచేశారు. ఎస్ఈసీ అధికార దుర్వినియోగం చేసి మళ్లీ నామినేషన్ వేయండని టీడీపీ వారిని కోరినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఆ పార్టీపై నమ్మకం పోయింది కాబట్టే నామినేషన్ వేసే నాధుడే కరువయ్యాడన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయడం అంత చెండాలం లేదనుకుంటే, ఇప్పుడు మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను మేనిఫెస్టోలో పెట్టడం విడ్డూరంగా ఉందని, దీనిపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 2014 మున్సిపల్ మేనిఫెస్టోలో 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఆతరువాత ఆ ఊసే లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అధికారమే లేకుంటే మున్సిపల్ పన్నులు ఎలా తగ్గిస్తాడని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబుని పంచాయతీకి, మున్సిపాల్టీకి ముఖ్యమంత్రిని చేయాలని ఎద్దేవా చేశారు. ఆస్తి పన్ను సవరణకు సంబంధించి పారదర్శకంగా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆస్తిపన్నుపై చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. పంచాయతీల కంటే పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో గెలుస్తందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
‘ఆ పళ్లు కొరకడం ఏంటి?.. ఊగిపోవడం ఏంటి?..’
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌కు ప్రజాక్షేత్రంలో పోటీ చేసే సత్తా లేదని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు చంద్రబాబును ఛీత్కరించారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కుప్పంలో ఓటమిపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతగా హామీలను అమలు చేస్తున్నారు. ఏపీలో సంక్షేమ పాలన నడుస్తోంది. గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందజేస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు. బాబు రాజకీయ జీవితం ముగిసిపోయే సమయం వచ్చింది. సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్య ఓటమి అంటారు. వైఎస్సార్ సీపీ గెలిస్తే అక్రమం అని గగ్గోలు పెడుతున్నారు. మా పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ( ‘బాబు ఎందుకు కేంద్రానికి లేఖ రాసే ధైర్యం చేయడం లేదు’ ) బాబు నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నారు. కుమారుడిలో పార్టీ నడిపే సామర్థ్యం కనపడకపోవడంతో ఆయన ఇలా తయారయ్యాడు. పళ్లు పట పటా కొరకడమేంటి?.. ఆ మనిషి అలా ఊగిపోవడం ఏమిటి?. 2424 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. మరికొంత మంది మా పార్టీ రెబల్స్ గెలిచారు. కేవలం 527 పంచాయతీల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా వెబ్ సైట్లో వివరాలున్నాయి. మీకు దమ్ముంటే అవి తప్పు అని నిరూపించండి. కక్కలేక మింగలేక ఆయన మీడియా అష్టవంకర్లు తిరుగుతోంది. కొన్నాళ్లు ఇలానే సాగితే ఊపిరి ఆగి పోయేటట్లున్నారు. బాబు ఒక మామూలు మనిషిగా ఉండటానికి కూడా అర్హత లేని విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ఒక దిష్టిబొమ్మలా నిలుస్తున్నారు. ఆయన విషం చిమ్మేలా ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు మా వైపు ఉన్నందుకు ధన్యవాదాలు’’అని అన్నారు. -
‘ఆ పళ్లు కొరకడం ఏంటి?.. ఊగిపోవడం ఏంటి?..’
-
వైఎస్సార్సీపీలో చేరిన సుందరరామ శర్మ
సాక్షి, తాడేపల్లి : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సుందరరామ శర్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో సుందరరామశర్మ వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సజ్జల రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సుందరరామ శర్మ గతంలో ఏపీ పీసీసీ లీగల్ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఈసీ నిమ్మాడకు ఎందుకు వెళ్లలేదు..?: సజ్జల
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. టీడీపీ దౌర్జన్యకారుల ధాటికి అట్టుడుకుతున్న నిమ్మాడ గ్రామానికి ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే.. నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడన్న విషయం మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రలోభాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చట్టంలో మౌలిక మార్పులు తెచ్చామని వివరించారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, నిమ్మాడ ఘటనే ఇందుకు ఉదాహరణ అని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇలాఖా అయిన నిమ్మాడలో ఇంతవరకు స్వేచ్ఛగా నామినేషన్ వేసిన దాఖలాలు లేవని, గతంలో టీడీపీ నేతలను వ్యతిరేకించిన 8 మంది హత్యకు గురయ్యారని గర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అచ్చెన్నాయుడు అతని అనుచరగణం వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన అప్పన్న నామినేషన్ వేయకుండా దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. గతంలో నిమ్మాడలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేశారని గర్తు చేశారు. చంద్రబాబు చెప్పే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని సజ్జల నిలదీశారు. విజయవాడ దాడి ఘటనలో టీడీపీ పాత్ర ఉన్నట్టు అనుమానాన్ని వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను పక్కదారి పట్టించేందుకే టీడీపీ నేతలు ఈ డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. బస్సులు తగలబెట్టడం చంద్రబాబు నైజం అని దగ్గుబాటి పుస్తకంలో ప్రస్తావించిన అంశాన్ని సజ్జల ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నేతలు డబ్బులిచ్చి రాజమండ్రిలో విగ్రహ ధ్వంసం చేయించారని, అంబేడ్కర్, రంగా విగ్రహాల ధ్వంసానికి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారన్నారు. ఎస్ఈసీ యాప్‌పై అనేక అనుమానాలున్నాయని, దానికి బదులు సీఈసీ యాప్‌ను వాడాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ఎవరు రెచ్చగొట్టినా.. రెచ్చిపోవద్దు’
సాక్షి, నెల్లూరు : ‘ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలి. వీలైతే ఏకగ్రీవాలు అయ్యేలా చూసుకోవాలి. ఎవరు రెచ్చగొట్టినా జిల్లా నాయకులెవరూ రెచ్చిపోవద్దు. ఓటర్లందరినీ చైతన్యపరచండి’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, డబ్బుతో ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడితే అలాంటి వారిని చట్టానికి పట్టించే దిశగా అడుగులు వేయాలన్నారు. వీలైనంత వరకు జిల్లా నాయకులు గ్రామ స్థాయిలో చర్చలు జరిపి వాళ్లంతట వాళ్లే నాయకుడ్ని ఎన్నుకునేలా ప్రోత్సహించాలని, అలా చేస్తే తొలిసారిగా ఆదర్శవంతమైన ఎన్నికలు జరుగుతాయని, గ్రామ స్వరాజ్యం సుస్థిరంగా నిలబడుతుందని అన్నారు. ( చిచ్చు పెట్టండి.. రచ్చ చేయండి ) రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అడ్రస్ లేకుండా గల్లంతవుతామనే భయంతో టీడీపీ ఎంతో మంది చేత నామినేషన్ వేయించి అదే విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టి నాలుగు ఓట్లు రాల్చుకోవాలని చూస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను ప్రభావితం చేయాలన్న దుర్బుద్ధితో టీడీపీ ఉందని మండిపడ్డారు. -
నియంతలా వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన వ్యక్తి.. నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీనియర్ అధికారుల పట్ల ఆయన పరిధి దాటి చర్యలకు ఆదేశిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి వ్యక్తిగత అభిప్రాయాలు తగవని గుర్తు చేశారు. అసలు నిమ్మగడ్డ ఐఏఎస్ ఎలా అయ్యారో తెలీడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిమ్మగడ్డ నియంత్రణను కోల్పోయి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ద్వివేదిని చంద్రబాబు బెదిరించారని, అలా చేసినా.. గోపాలకృష్ణ ద్వివేది హుందాగా వ్యవహరించిన విషయాన్ని సజ్జల గర్తు చేశారు. టీఎన్ శేషన్ లాంటి వ్యక్తులు కూడా పరిధికి లోబడి వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఏజెంట్లా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. గతంలో ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారో కారణాలు చూపడం లేదని విమర్శించారు. ఎన్నికల విధుల నుంచి అధికారులనందరిని తప్పించి టీడీపీ గూండాలు, చంద్రబాబు ఏజెంట్లతో ఎన్నికలు నిర్వహిస్తారా అని నిమ్మగడ్డను నిలదీశారు. గతంలో ఏకగ్రీవాలపై నోరు మెదపని నిమ్మగడ్డ.. ఇప్పుడు అనవసర ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 2018లో ఆయన పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరపలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్న నిమ్మగడ్డ.. సీఎం, డీజీపీ, ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు ఇతర ఉద్యోగులపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై నమ్మకం లేని ఎస్ఈసీ.. ప్రభుత్వ యంత్రాంగం లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహించగలరని ప్రశ్నించారు. అసలు నిమ్మగడ్డ ఎన్నికలు జరుపుతున్న విధానమే సరైనది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశలపై చర్చించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం నిధులు వంటి అంశాలపై మాత్రమే సీఎం జగన్ అమిత్ షాను కలుస్తారని వివరించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయటంపై ఆయన స్పందిస్తూ.. తాము బలహీనులము కాదని, అలాగే తమ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం లేదని ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాజకీయ పార్టీగా తమకంటూ ప్రత్యేక విధి విధానాలు ఉన్నాయని అన్నారు. మరోవైపు కొడాలి నాని, దేవినేని ఉమ ఎపిసోడ్లో పూర్తి బాధ్యత టీడీపీదేనని పునరుద్ఘాటించారు. టీడీపీ నేతలు పదే పదే ఒకే అబద్దాన్ని చెప్పి దానిని నిజం చేయాలని చూస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు తామేమాత్రం వెరవమని హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో, రాష్ట్ర ప్రజలకు ఇదివరకే స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైకోర్టు విభజన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాజధాని భూముల్లో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ కొనసాగుతుందని, త్వరలో నిజాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. ఇందులో కిలారి రాజేష్ కేసు ఓ చిన్న విషయం మాత్రమేనని, త్వరలో పెద్ద తలకాయలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. -
పండగలా జననేత జన్మదినోత్సవం..
-
క్యాంపు ఆఫీస్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుక
-
సీఎం జగన్ బర్త్ డే: కేట్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు సీఎం నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు పుట్టినరోజు సందర్భంగా టీటీడీ వేదపండితులు ముఖ్యమంత్రి జగన్‌కి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ) తాడేపల్లి వైస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వేకటేశ్వర్లు, పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జననేత పుట్టిన రోజును స్వచ్చందంగా ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలు పండుగలా చేసుకుంటున్నారు. ప్రజలను దగ్గరకు తీసుకున్న నాయకుడు ఇప్పుడు వారికి ధీమా ఇస్తూ పరిపాలిస్తున్నాడు. అందుకే ఈ పుట్టిన రోజు ప్రతి ఇంట్లో జరుగుతోంది. ప్రజల ఆకాంక్షలు లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు కనుకే ఈ రోజు ఈ సుపరిపాలనలో భాగంగా ఏడాదిన్నరలోనే అనేక మార్పులు చేపడుతూ ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు. ఏ సమస్య లేకుండా 60 వేల కోట్ల నిధులు ప్రజల అకౌంట్‌కి చేరాయి. పారదర్శకత, అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు’ అని తెలిపారు. (చదవండి: ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..) ‘కోవిడ్ సమయంలో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడితే మన రాష్ట్రం త్వరగా కొలుకుంది. ఇది చూసి అధికారులు, నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. ఈ రోజు ఒక యువ నాయకుడు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో పవర్ కేంద్రీకృతం అయితే ఈ నాయకుడు వికేంద్రీకరణ చేసి ప్రజలకు పవర్ ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉన్నాయి.. అందుకే మేము ఈ రక్తదానం కార్యక్రమం చేపట్టాము. ప్రజలకు సేవ చేయండి అని మా నాయకుడు ఇచ్చిన పిలుపే ఈ సేవా కార్యక్రమాలకు నాంది. ఆయన వందేళ్ల పాటు ప్రజలకు సేవ చేస్తూ.. ఆరోగ్యాంగా ఉండాలి’ అని కోరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సంక్షేమంలో ముందున్నాం: సజ్జల
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సంక్షేమం.. ప్రజా సంక్షేమంలో భాగమేనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలన అనుభవం లేకున్నా.. సంక్షేమంలో ముందున్నామని, ఏడాదిన్నరలోనే ప్రపంచ, దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.2లక్షల కోట్లకుపైగా అప్పులు పెట్టి పోయింది. కోవిడ్ కట్టడిలో ఖర్చుకు వెనుకాడని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: కావాలనే ఘర్షణ వైఖరి) ‘‘ప్రజా జీవనం కోవిడ్ కారణంగా స్తంభించింది. ఎవరికైనా సమాచారం చాలా ముఖ్యం. సమాచార వారధి ఉండటం చాలా అవసరం. నేను రాజకీయ నాయకుడిని కాదు. పరిష్కారం దిశగా ఏ సమస్య అయినా ఆలోచించగలగడానికి కారణం సీఎం జగన్ పట్టుదల. సీఎం జగన్ వెంట నడుస్తున్న వారిగా మేం అంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. ప్రభుత్వ విధానాలను అమలు చేసే యంత్రాంగం సమస్యలు తీర్చాలి. సీఎం జగన్ స్వేచ్ఛగా తాను అనుకున్నవి చేస్తున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.(చదవండి: ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్) -
ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తి భవనాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శుక్రవారం రోజున సీఎం కంప్యూటర్ బటన్ నొక్కి ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యం, సిబ్బందికి సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పి అభినందించారు. కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్) జీవీడీ కృష్ణమోహన్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధుతో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా) -
ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..
సాక్షి, తాడేపల్లి: తండ్రి ఆశయాల కోసం.. మహానేత ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తున్న తరుణంలో వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల సమస్యలను విని వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. దేశంలో ఎవ్వరికీ ఇవ్వని విజయాన్ని ఏపీ ప్రజలు వైఎస్ జగన్‌కు ఇచ్చారని తెలిపారు. పాదయాత్రలో చూసిన కష్టాలను సీఎం జగన్ పథకాలుగా మలిచారని చెప్పారు. గత పాలకులు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా.. వైఎస్ జగన్ ఉక్కు సంకల్పంతో పాలన ప్రారంభించారని తెలిపారు. ‘‘ఏడాదిన్నరగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు దాదాపు అమలు చేశారు. దేశ చరిత్రలో ఏడాదిలోనే 90 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ ఒక్కరికే దక్కుతుంది. ఆయన అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతిపక్షాల దుష్ట ఆలోచనలను ప్రజలకు వివరిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.(చదవండి: జనం మద్దతే జగన్ బలం) ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘‘ జగన్ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది.14 నెలలు ప్రజలతో మమేకం అయ్యారు. అక్రమ కేసులు పెట్టినా బెదరకుండా జనంలోనే ఉన్నారు. ప్రజల్లో ఆదరణ ఓర్వలేక ప్రాణాలు కూడా తీయ్యాలని కూడా ప్రయత్నించారు. జగన్ ఎప్పుడూ జనంలోనే ఉన్నారు. జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేశారు. ప్రజలు ఆశీర్వదించి 51 శాతం ఓట్లతో 151 సీట్లు కట్టబెట్టారు. ప్రజల నుండి తీసుకున్న అజెండానే తన అజెండాగా తీసుకున్నారు. 16 నెలల్లో రాష్ట్ర దిశను మార్చిన నేత సీఎం జగన్. ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ అనే కార్యక్రమనికి శ్రీకారం చుట్టామని’’ ఆయన పేర్కొన్నారు.10 రోజుల పాటు పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావాలని పిలుపు నిచ్చామని చెప్పారు. ఇది ప్రజల పండగగా జరపాలని పిలుపునిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. (చదవండి:.వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు) ఎన్ని కష్టాలు వచ్చినా సంకల్పం వదల్లేదు.. సీఎం వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. చంద్రబాబు అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించేందుకే పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు.14 నెలలు ఎన్నికష్టాలు వచ్చినా సంకల్పం వదలలేదని, ఏడాదిన్నరలోనే సీఎం జగన్ 90 శాతం హామీలు అమలు చేశారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పాలన ప్రజలకు వివరిస్తామని వేణుగోపాల కృష్ణ తెలిపారు. -
గత పాలకుల వల్లే విభజన అన్యాయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: గత పాలకుల వల్లే ఆరేళ్లుగా విభజన అన్యాయం జరిగిందని, రాష్ట్రం వెనుకబాటుతో కున్నారిళ్లిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో రాష్ట్రాన్ని సీఎం జగన్ గాడినపెట్టారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్.. దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. (చదవండి: గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం జగన్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం గుర్తుంచుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే వేడుకలు చేసుకుంటున్నామని తెలిపారు. ‘‘తెలుగువారందరి బంగారు భవిష్యత్తు కోసం పాటుపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సీఎం జగన్ నేతృత్వంలో సఫలం చేస్తాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ప్రజల్లో మమేకం అయ్యి, అభివృద్ధి దిశగా కర్తవ్య దీక్షకు పునరంకితం అవ్వాలి. సీఎం జగన్ వెంట మడమ తిప్పని సైనికులు గా పని చేయాలని’’ ఆయన పిలుపునిచ్చారు. (చదవండి: భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబరు 1)