సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్సార్‌సీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద అండను కోల్పోయారన్నారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సజ్జల మండిపడ్డారు.
చంద్రబాబులాగే లోకేష్ కూడా పనికి రాకుండా తయారయ్యాడని విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపిస్తున్నారని.. సాక్ష్యాలను ఎవరూ తారుమారు చేయలేరన్నారు. గుండెపోటు అని చెప్పినంత మాత్రాన అది దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తుందని సూటిగా ప్రశ్నించారు. ఎదురుగా ఉన్న సాక్ష్యాలను సీబీఐ పరిగణలోకి తీసుకోదా? అని నిలదీశారు. చంద్రబాబుది కుట్రల స్వభావం అని మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్యకేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని సజ్జల దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment