సాక్షి, తాడేపల్లి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేయటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు ఎవరూ మాట్లడకపోవటంపై ప్రశ్నించారు.
‘సుప్రీం కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ నిర్ణయం. వికేంద్రీకరణపై మరింత పకడ్బందీగా చట్టం తీసుకొస్తాం. రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది.’ అని పేర్కొన్నారు సజ్జల. వైఎస్ వివేకానంద హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. వాస్తవాలు బయటకు రావాలని తామే ముందు కోరుకుంటున్నట్లు చెప్పారు. హత్యకు గురైన వివేకా తమ నాయకుడని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వయానా చిన్నాన్న అని గుర్తు చేశారు. తమ నాయకుడు వివేకా హత్యకు బాధ్యలేవరో వారు దొరకాలన్నారు.
ఇదీ చదవండి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ
Comments
Please login to add a commentAdd a comment