government advisor
-
చాగంటి కోటేశ్వరరావు నియామకం సరికాదు
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘ఫ్యూడల్ విధానాలను ప్రచారం చేసే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులకు నైతిక విలువలనే నేర్పుంచేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచన చేయండి..’ అని సీఎం చంద్రబాబుకు విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ అధ్యక్షతన వర్చువల్‌గా సభ నిర్వహించారు. 72 మంది విద్యావేత్తలు, కవులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని చాగంటి నియామకాన్ని వ్యతిరేకించారు. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ‘స్వాతంత్య్ర ఉద్యమం, రాజ్యాంగ విలువలు ప్రచారం చేయాలి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం పునాదిగా ఉండే విలువలు ఆధునిక జీవితానికి అవసరం. మన భవిష్యత్ తరాన్ని పురాణయుగంలోకి మళ్లించడం మనల్ని ఎక్కడికి తీసుకెళుతుందో ప్రభుత్వం గుర్తించాలి. సంకుచిత కుల, మత, ప్రాంతీయ దృక్పథాలకతీతంగా భావితరం ఎదిగినప్పుడే మనం గొప్పగా చెప్పుకొంటున్న లక్ష్యాల్ని చేరుకోగలం. దీనికి తగినట్టుగా మన విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు పౌరాణిక నీతులు ఎంతవరకు పనికొస్తాయో ఆలోచించాలి..’ అని లేఖలో పేర్కొన్నారు. చదవండి: ఆర్.కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ టికెట్సంతకాలు చేసినవారిలో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ప్రముఖ రచయిత్రి ఓల్గా, అఖిల భారత లాయర్ల సంఘం అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు గడ్డం కోటేశ్వరరావు, ప్రజాశక్తి సంపాదకుడు శర్మ, ప్రొగ్రెసివ్ ఫోరం నాయకుడు బుడ్డిగ జమిందార్, మ్యూజిక్ అకాడమీ అవార్డు గ్రహీత ద్వారం దుర్గాప్రసాదరావు, విద్యావేత్తలు ప్రొఫెసర్ అంజయ్య, రమేష్ పట్నాయక్ తదితరులు ఉన్నారు. చదవండి: రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలొద్దు.. ఏపీ హైకోర్టు -
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కే.కేశవరావు(కే.కే) తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ అఫైర్స్)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో జారీచేసింది. కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, కేసీఆర్‌కు సన్నిహితుడైన కె. కేశవరావు బుధవారం ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన తన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే తాను కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కాగా.. అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్‌లో బుధవారం చేరారు. కేకే.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పార్టీ మారిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఏపీ ప్రభుత్వ సలహాదారుల పదవికాలం పొడిగింపు
-
స్కిల్ డెవలప్మెంట్ అతిపెద్ద స్కామ్: సజ్జల
-
‘స్కిల్’ స్కామ్‌లో బాబు, లోకేశ్
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వారి నిర్వాకాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పటికే గుర్తించిందన్నారు. ఈడీ తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.241 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి కాజేశారని, చంద్రబాబు, లోకేష్ పాత్ర లేకుండా అంత భారీ ఎత్తున నిధులను మళ్లించడం సాధ్యం కాదన్నారు. ఈ కుంభకోణంలో వారి ప్రమేయం బట్టబయలు కావడం వల్లే కిక్కురుమనడం లేదని వ్యాఖ్యానించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కుంభకోణంపై ఈనాడు రామోజీరావు ఇచ్చిన ప్రకటనపై విస్మయం వ్యక్తం చేశారు. తాము చట్టానికి అతీతం అన్నట్లుగా ఆ ప్రకటన ఉందన్నారు. కర్నూలు గర్జన గ్రాండ్ సక్సెస్.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తూ జేఏసీ నిర్వహించిన రాయలసీమ గర్జన గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సజ్జల తెలిపారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గర్జన ప్రతిబింబించిందన్నారు. కర్నూలు ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. సీమ ద్రోహి చంద్రబాబే.. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టని చంద్రబాబు ఎల్లోమీడియా ద్వారా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి గాలేరునగరి, హంద్రీ నీవాలను చేపట్టి దివంగత వైఎస్సార్ రాయలసీమకు మేలుచేస్తే ఇప్పుడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని మరింతపెంచి, కాలువలను వెడల్పుచేసి శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా సీఎం జగన్ పనులు చేపట్టారని గుర్తు చేశారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే దిగువన నీటిమట్టం ఉన్నా రాయలసీమకు కృష్ణాజలాలను తరలించేలా ఎత్తిపోతల చేపట్టామన్నారు. చిత్రావతిలో 10 టీఎంసీలు, గండికోటలో 27, బ్రహ్మంసాగర్‌లో 15 టీఎంసీలు నిల్వ ఉన్నాయని చెప్పారు. రాయలసీమలో కొత్తగా 5 మెడికల్ కాలేజీలను, కర్నూలు, కడపలో క్యాన్సర్ ఆస్పత్రులను నెలకొల్పుతున్నామని, ఈ స్థాయిలో సీమకు గతంలో ఎవరూ మేలు చేయలేదన్నారు. చివరకు కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా చంద్రబాబు పూర్తిచేయలేదన్నారు. ఇప్పుడు సీఎం జగన్ దాన్ని పూర్తి చేసి ఆ ప్రాంతానికి నీళ్లందించేలా చర్యలు చేపట్టారన్నారు. చంద్రబాబు రాయలసీమకు మేలు చేయకపోగా ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు వేయించి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనుల్లో జాప్యానికి చంద్రబాబు పాపాలే కారణమని చెప్పారు. కమీషన్ల కోసం పోలవరాన్ని బాబు ఏటీఎం మాదిరిగా మార్చుకున్నారని ప్రధాని మోదీనే వెల్లడించారని గుర్తుచేశారు. వైఎస్సార్ ప్రారంభించిన పోలవరాన్ని సీఎం జగన్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు అవాస్తవం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారనడం పూర్తిగా అవాస్తవమని, ఆ వార్త చూసి తాము కూడా ఆశ్చర్యానికి గురయ్యామని సజ్జల ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమాచారం లోపం వల్ల కింది స్థాయిలో ఎవరో ఇలా చేశారని, ఈ అంశంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేనిరీతిలో రెండు లక్షలకుపైగా ఉద్యోగాలిచ్చి భారీ ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇప్పుడు పోలీసు రిక్రూట్మెంట్ కూడా జరుగుతోందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి భద్రత చేకూర్చామన్నారు. ఇది చదవండి: ‘స్కిల్’ స్కాంపై ఈడీ కొరడా ఇదీ చదవండి: చంద్రబాబు హయాంలో యువత నిర్వీర్యం -
సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేయటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు ఎవరూ మాట్లడకపోవటంపై ప్రశ్నించారు. ‘సుప్రీం కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ నిర్ణయం. వికేంద్రీకరణపై మరింత పకడ్బందీగా చట్టం తీసుకొస్తాం. రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది.’ అని పేర్కొన్నారు సజ్జల. వైఎస్ వివేకానంద హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. వాస్తవాలు బయటకు రావాలని తామే ముందు కోరుకుంటున్నట్లు చెప్పారు. హత్యకు గురైన వివేకా తమ నాయకుడని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వయానా చిన్నాన్న అని గుర్తు చేశారు. తమ నాయకుడు వివేకా హత్యకు బాధ్యలేవరో వారు దొరకాలన్నారు. ఇదీ చదవండి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ -
ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు: ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పదకొండవ పీఆర్సీపై అనేకసార్లు చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేశారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగ సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను మొన్నటి వరకూ ఎన్జీవో అధ్యక్షుడిగా, జేఏసీ ఛైర్మన్‌గా ఉన్నాను. కొంత మంది ఉద్యోగ నాయకులు హెచ్ఆర్ఏ తగ్గిందని అంటున్నారు. దీనిపై ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై కమిటీ కూడా వేసింది. నిన్న (మంగళవారం) జరిగిన సమావేశంలో మూడు విషయాలను పట్టుబడుతున్నారు. పాత శాలరీ ఇవ్వాలని, పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన జీతాలకు అనుగుణంగా కొత్త జీవో ప్రకారం నిన్న జీతాలు వేశారు. ఇప్పుడు మార్చడానికి వీల్లేదు. ఐఆర్ రికవరీ లేకుండా, హెచ్ఆర్ఏ పెంచాలని అడుగుతున్నారు. కానీ ఆ విషయాన్ని మంత్రుల కమిటీ వద్ద చర్చిస్తే బాగుండేది. కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఉద్యోగులు కోరిన మేర పీఆర్సీ ఇవ్వలేకపోతున్నాం. ఏది ఏమైనా జీతాలు పడ్డాయి కాబట్టి జీవోలు వెనక్కి తీసుకోలేము. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపై సంప్రదింపులతో సాదించుకోవాలి. లేదంటే ఆ గ్యాప్ అలానే ఉంటుంది. సమ్మె నోటీస్ ఇచ్చి ఆందోళనకు వెళ్తామని చెప్తున్నారు. అనేక సార్లు చర్చలకు ఆహ్వానించి మంత్రుల కమిటీ వేచి చూసింది. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు వేరు కాదు. వారు మరోమారు ఆలోచన చేయాలి. చదవండి: (ఆస్తుల విభజనకు తీసుకున్న చర్యలేమిటి?: విజయసాయిరెడ్డి) సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. మా ఉద్యోగ మిత్రులను రిక్వెస్ట్ చేస్తున్నా చర్చలతో పరిష్కరించుకుందాం. కార్యాచరణ వాయిదా వేయాలని, చర్చలకు రావాలని కోరుతున్నా. ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ముఖ్యమంత్రి 23 శాతం ఫిట్మెంటు ఇచ్చారు. వచ్చిన జీతాల్లో ఎవరెవరికి ఎంత పెరిగిందో వాళ్ళకే తెలుసు. సామరస్యంతోనే సమస్యను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు ఒకేసారి విజయవాడ రావడం వల్ల కొంత అసౌకర్యం కలుగుతుంది. అసాంఘిక శక్తులు కూడా మన మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నం చేయవచ్చు. కోవిడ్ వల్ల ఇబ్బంది ఉంది. 200 మంది కంటే ఎక్కువ గుమికూడి ఉండకూడదు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా ఉద్యోగులు ఆలోచించాలి అని ప్రభుత్వ సలహాదారు ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. -
రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఉన్నతోద్యోగులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించడమేమిటని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎక్కువ మొత్తంలో జీతాలు ఇస్తూ మళ్లీ వారిని నియమించడం వల్ల దుబారా ఖర్చు తప్ప ఏమీ ఉండదని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కీలకమైన పోస్టుల్లో పాత వారినే నియమించడంతో ఎక్కువ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను పదవీ విరమణ తర్వాత సలహాదారులుగా నియమించడం చూస్తుంటే వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవారనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. వీరే కాక రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తున్నారని, ఇది సమర్థనీయం కాదని అన్నారు. సలహాదారులు, వారి సిబ్బందిపై ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడమంటే ప్రజా ధనాన్ని వృథాచేయడమేని స్పష్టం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. చదవండి: తనిఖీల వీడియో వైరల్: ‘సోషల్‌మీడియాను గుడ్డిగా నమ్మొద్దు’ -
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డిను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయ సంబంధిత అంశాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. -
ప్రభుత్వ సలహాదారుగా రామచంద్రమూర్తి
సాక్షి, అమ రావతి: ఏపీ ప్రభుత్వ సలహా దారు(పబ్లిక్ పాలసీ)గా డాక్టర్ రామచంద్రమూర్తి కొండు భట్లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.నియమ నింబధనలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొంటామని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా అజేయ కల్లం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం కేబినెట్ హోదాతో తాజాగా సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా ఆయన వ్యవహరిస్తారు. సీఎంవో కార్యదర్శులకు శాఖలను కేటాయించే బాధ్యత కూడా ఆయనకే అప్పగించారు. ప్రభుత్వ సలహాదారులతోపాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కల్పించింది. అందరూ ఆయనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ కాకముందు ఉన్న టీఏ, డీఏలు వర్తిస్తాయి. ప్రభుత్వ వాహనంతోపాటు నివాస వసతి సౌకర్యం కల్పిస్తారు. లేదంటే ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. డిప్యుటేషన్‌పై సిబ్బంది నియామకానికి ఆదేశాలు కల్లంకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)తోపాటు పేషీలో ప్రైవేట్ కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీసు సబార్డినేట్లు ఉంటారు. ఈ పోస్టులను ఆన్ డ్యూటీ పద్ధతిలో కేటాయిస్తారు. వారికి మాతృసంస్థల్లో వచ్చే వేతనాలతో పాటు పేషీలో పనిచేసినందుకు ప్రత్యేక అలవెన్సులు పొందడానికి అర్హత ఉంటుంది. డ్రైవర్లు, సబార్డినేట్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవచ్చు. డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమించేందుకు సాధారణ పరిపాలన శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఎక్కడ పనిచేసినా మన్ననలే అజేయ కల్లం తిరుమల – తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీఎస్‌గా పనిచేసిన సమయంలో తన అభిప్రాయాలను ఫైళ్లపై నిర్మొహమాటంగా రాశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండగా రాజధాని అమరావతిలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తప్పుబడుతూ ఫైలులో కుండబద్దలు కొట్టినట్లు రాశారు. ‘స్విస్ ఛాలెంజ్ లోపభూయిష్టంగా ఉంది. ఇది పనికిమాలిన విధానం. దీనివల్ల నష్టం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవడం ఉత్తమం..’ అని ఫైలులో మూడు పేరాలు పొందుపరిచారు. ఆయన ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా మంచి అధికారిగా, మానవతావాదిగా మన్ననలు పొందారు. -
రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్‌కు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన టీఆర్ఎస్ నేత డి. శ్రీనివాస్ కు ఎట్టకేలకు ఛాంబర్ కేటాయించారు. సలహాదారుగా నియామకం ఖరారయి పదిరోజులు కావస్తున్నప్పటికీ ఛాంబర్ కేటాయింపులో ఏర్పడిన జాప్యం వల్లే బాధ్యతల స్వీకారానికి ఆయన దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సచివాలయంలోని డీ బ్లాక్ మొదటి అంతస్తులో డీఎస్ కు పేషీని కేటాయిస్తూ సాధారణ పరిపాలనా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసి, అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన టి రాజయ్య ఇదే ఛాంబర్ నుంచి విధులు నిర్వర్తించారు, ఛాంబర్ కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో శుక్రవారం (ఆగస్టు 28న) డీఎస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.