
సాక్షి, అమరావతి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డిను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయ సంబంధిత అంశాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.