amendment bill
-
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు YSRCP
-
వక్ఫ్ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన YSRCP
-
వక్ఫ్ చట్టాన్ని బెంగాల్ లో అమలు చేయం: దీదీ
-
Perni Kittu: సొల్లు కబుర్లు వద్దు ఇంటి నుంచి బయటికి రండి
-
వక్ఫ్ బిల్లుతో చంద్రబాబు ముస్లింలకు వెన్నుపోటు పొడిచారు : ఖాదర్ బాషా
-
పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ ఏడాది జనవరి 31వ తేదీన ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వక్ఫ్(సవరణ) బిల్లును ఉద్దేశించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో శుక్రవారం దుమారం రేగింది. ఈ బిల్లు ముమ్మాటికీ రాజ్యాంగంపై దాడేనని, బిల్లును లోక్‌సభలో బుల్డోజ్ చేశారు అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ... సోనియా గాంధీ వ్యాఖ్యలు దురదృష్ట్టకరం, సభ గౌరవానికి విరుద్ధం అని పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా టారిఫ్‌లపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత స్పీకర్ తన ముగింపు వ్యాఖ్యలను చదివారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో 173 మంది, కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో 169 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 16 బిల్లులు ఆమోదించినట్లు, సభ ఉత్పాదకత 118 శాతానికి పెరిగినట్లు ప్రకటించారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యసభలో రెండో సుదీర్ఘ భేటీ ఈ సెషన్లో రాజ్యసభ మొత్తంగా 119 గంటలపాటు పని చేసిందని, ఉత్పాదకత 119 శాతానికి పెరిగిందని ఎగువ సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. సభలో రికార్డు స్థాయిలో 49 మంది సభ్యులు ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారని వివరించారు. వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ గురువారం ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు విరామం లేకుండా సుదీర్ఘంగా సమావేశమైందని, ఇదొక రికార్డు అని అన్నారు. పార్లమెంటరీ రికార్డుల ప్రకారం.. రాజ్యసభలో ఇది రెండో సుదీర్ఘ భేటీ. మొదటి సుదీర్ఘ భేటీ 1981 సెప్టెంబర్ 18న జరిగింది. అప్పట్లోసభ మరుసటి రోజు తెల్లవారుజామున 4.43 గంటల వరకు కొనసాగింది. అత్యవసర సేవల నిర్వహణ బిల్లు–1981పై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించారు. ఇదిలా ఉండగా, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ధ్రువీకరిస్తూ రాజ్యసభలో ఒక తీర్మానాన్ని శుక్రవారం ఆమోదించారు. పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. మణిపూర్‌లో ఘర్షణకు తెరదించడమే లక్ష్యంగా రెండు ముఖ్యమైన తెగల మధ్య సమావేశం త్వరలో జరగబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో వెల్లడించారు. ఢిల్లీలో ఈ భేటీ జరుగుతుందన్నారు. -
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది: అంబటి రాంబాబు
-
Merugu Nagarjuna: మైనార్టీలకు తీరని అన్యాయం
-
వక్ఫ్ సవరణ బిల్లుపై న్యాయ పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్
-
వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడే
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు భారత రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. సమాజాన్ని శాశ్వతంగా విభజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో ఇది భాగమన్నారు. లోక్‌సభలో బిల్లును ఆదరాబాదరగా ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. సంవిధాన్ సదన్‌లో గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా తమ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఒక దేశం– ఒకే ఎన్నిక బిల్లు కూడా రాజ్యాంగ విద్రోహమన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్‌సభలో హడావుడిగా ఆమెదింపజేసుకున్నారు. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి సుస్పష్టం. ఇది రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమే. సమాజాన్ని ఎప్పటికీ విభిజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో భాగమే’ అని సోనియా పేర్కొన్నారు. విపక్షాల సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించాక, వక్ఫ్ బిల్లును బుధవారం అర్ధరాత్రి లోక్‌సభ 288–232తో ఆమోదించిన విషయం విదితమే. మహిళా రిజర్వేషన్ బిల్లును రెండేళ్ల కిత్రమే ఇరుసభలు ఆమోదించాయని, దాన్ని తక్షణం అమలులోకి తేవాలనే కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పైనా బీజేపీ శీతకన్ను వేస్తోందన్నారు. -
వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే.సదుద్దేశమే: రిజిజు న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన వాడివేడి చర్చ పెద్దల సభను వేడెక్కించింది. ఉమీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్)గా పేరు మార్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు నిరసనగా పలువురు విపక్ష సభ్యులు నల్లదుస్తులు ధరించి సభకు వచ్చారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. ముస్లింల భూములను లాక్కోవడమే మోదీ సర్కారు అసలు లక్ష్యమని ఆరోపించారు. విపక్షాల వాదనను రిజిజు ఖండించారు. వాటి అభ్యంతరాలను తోసిపుచ్చారు. ‘‘ముస్లింల హక్కులను ఎవరూ లాక్కోబోవడం లేదు. ఈ విషయమై విపక్షాలు చేస్తున్నదంతా దు్రష్పచారమే’’ అని పేర్కొన్నారు. ‘‘2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు ఏకంగా 8.72 లక్షలకు పెరిగాయి. తద్వారా దేశంలో వక్ఫ్ అతి పెద్ద ప్రైవేటు భూ యజమానిగా అవతరించింది’’ అని వివరించారు. ‘‘వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తేవడం, వాటి ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించడం, ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడం, ముస్లింలలోని అన్ని తెగల హక్కులనూ పరిరక్షించడమే బిల్లు లక్ష్యం. అంతే తప్ప మతంతో ఈ బిల్లుకు ఎలాంటి సంబంధమూ లేదు’’ అని పునరుద్ఘాటించారు. ‘‘అందుకే సున్నీలు, షియాలతో పాటు ముస్లింలలోని ఇతర వెనకబడ్డ వర్గాల వారు కూడా వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉంటారు. తద్వారా వారి ప్రయోజనాలకూ న్యాయం జరుగుతుంది. ఇందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుల్లో అధిక సంఖ్యాకులు ముస్లిమేతరులే ఉంటారనడం అవాస్తవం. 22 మందిలో వారి సంఖ్య 4కు మించబోదు. వక్ఫ్ బోర్డులు చట్టపరమైన సంస్థలు. అంతే తప్ప కేవలం ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు కాదు. వక్ఫ్ ట్రిబ్యునళ్ల ముందు 31,999 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివాదాస్పద వక్ఫ్ భూముల్లో ఇప్పటికే కోర్టుల్లో పరిష్కారమైన వాటి జోలికి పోబోం. పసలేని ఆరోపణలు మాని బిల్లును ఆమోదించడంలో విపక్షాలు కూడా కలసి రావాలి’’ అని కోరారు. దురుద్దేశాలు: విపక్షాలు వక్ఫ్ (సవరణ) బిల్లు వెనక మోదీ సర్కారు దురుద్దేశాలు దాగున్నాయని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని ముస్లింలు విశ్వసించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడాలన్నారు. బిల్లులో పలు అంశాలు పైకి బాగానే ఉన్నా దీని వెనక మోదీ సర్కారు ఉద్దేశమే అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్.సురేశ్‌రెడ్డి అన్నారు. బిల్లులోని 75 శాతం అంశాలను బిల్లుతో నిమిత్తం లేకుండానే అమలు చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుచ్చి శివ (డీఎంకే), వై.వి.సుబ్బారెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), అభిõÙక్ మను సింఘ్వీ, సయీద్ సనీర్ హుసేన్ (కాంగ్రెస్), సుష్మితా దేవి (టీఎంసీ), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), సంజయ్‌సింగ్ (ఆప్), ముజీబుల్లా ఖాన్ (బీజేడీ), జాన్ బ్రిటాస్ (సీపీఎం), పి.పి.సునీర్ (సీపీఐ), హరీస్ బీరన్ (ఐయూఎంఎల్), వైగో (ఎండీఎంకే) తదితర సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (జేడీఎస్) బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. వక్ఫ్‌కు ముస్లిమేతరులూ విరాళాలు ఇవ్వొచ్చు: సిబల్ ముస్లిమేతరులకు కూడా వక్ఫ్ విరాళాలిచ్చే హక్కుందని స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘నా ఆస్తిని ఫలానా వారికి ఇవ్వొద్దని చట్టం చేయడానికి మీరెవరు? హిందువులు వక్ఫ్ విరాళాలు ఇవ్వడమే కాదు, స్వాతంత్య్రానికి ముందే వక్ఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని పలు హైకోర్టులూ సమరి్థంచాయి’’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో హిందూ మత సంస్థలకు 10 లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని ఆయన అన్నారు. ‘‘హిందూ మతంలో స్వార్జిత ఆస్తిని కుమారులకు మాత్రమే ఇవ్వగలరు. దాన్ని కూతుళ్లకూ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ చట్టాన్ని మార్చండి’’ అని సూచించారు. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుంటూ కూతుళ్లతో పాటు ఎవరికైనా ఇచ్చేందుకు మన చట్టాలు వీలు కల్పిస్తున్నాయని చెప్పారు. అయోమయం సృష్టిస్తున్నారు: రిజిజు సిబల్ తీరును మంత్రి రిజిజు తీవ్రంగా దుయ్యబట్టారు. హిందూ మత సంస్థలకు చెందిన భూమిని వక్ఫ్ భూములతో పోల్చడాన్ని ఖండించారు. ‘‘పలువురు సీనియర్ సభ్యులు ఏ అంశం పడితే అది లేవనెత్తడం ద్వారా అయోమయం సృష్టిస్తున్నారు. కానీ వాటిపై వివరణలు వినే దాకా కూడా సభలో ఉండటం లేదు’’ అంటూ అసహనం వెలిబుచ్చారు. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే: ఖర్గే వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దానిపై చర్చలో ఆయన పాల్గొన్నారు. బిల్లు ముసుగులో సమాజంలో విభజన బీజాలు నాటేందుకు, ముస్లింలను వేధించేందుకు, వారి భూమిని లాక్కొని కార్పొరేట్ మిత్రులకు పంచేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఈ బిల్లు ఆమోదం పొందితే ముస్లింల ఆస్తులను లాగేసుకుంటారు. వారి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి’’ అని ఆరోపించారు. అస్మదీయులను వక్ఫ్ బోర్డుల్లోకి చొప్పించేందుకు వీలుగా సవరణలు చేశారంటూ బిల్లులోని పలు అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. ‘‘గత 11 ఏళ్లలో ముస్లింల సంక్షేమానికి కేటాయించిన రూ.18,274 కోట్ల నిధులనే పూర్తిగా వెచ్చించని చెత్త రికార్డు మోదీ సర్కారుది. అలాంటివాళ్లు పస్మాంద వంటి పేద ముస్లింల సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండాలన్న ప్రతిపాదనను ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం, రామమందిర్ ట్రస్ట్ వంటివాటిల్లో ఒక్కరైనా ముస్లిం ఉన్నారా అని ప్రశ్నించారు. ఆలయ ట్రస్టుల్లో కనీసం దళితులకు కూడా స్థానం కల్పించడం లేదని ఆక్షేపించారు. ‘‘‘దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీయకండి. ప్రతిష్టకు పోకుండా ఈ తప్పులతడక బిల్లును తక్షణం వెనక్కు తీసుకోండి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పాపమే: నడ్డా కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో ముస్లిం మహిళల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా ఆక్షేపించారు. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిన పాపం ఆ పారీ్టదేనంటూ దుయ్యబట్టారు. ‘‘ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడంతో కోట్లాది మంది ముస్లిం మహిళలు గౌరవంగా జీవిస్తున్నారు. వక్ఫ్ బిల్లు జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించింది. వక్ఫ్ ఆస్తులు తీవ్రంగా దురి్వనియోగమవుతున్నాయి. దానికి పూర్తిగా అడ్డుకట్ట వేసి వక్ఫ్ వ్యవహారాల్లో జవాబుదారీతనం తేవడమే బిల్లు లక్ష్యం. వక్ఫ్ బిల్లులో సవరణలు సూచించేందుకు ఏకంగా 31 మంది సభ్యులతో జేపీసీ వేశాం. యూపీఏ హయాంలో కేవలం 13 మందితో జేపీసీ వేసి మమ అనిపించారు’’ అని నడ్డా ఆరోపించారు. ‘‘వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు వీలుగా సౌదీ అరేబియా, తుర్కియే వంటి ముస్లిం దేశాలు కూడా పలు చట్టాలు చేశాయి. వక్ఫ్ ఆస్తులను డిజిటైజ్ కూడా చేస్తున్నాయి. అదే పని భారత్‌లో చేస్తుంటే అభ్యంతరమెందుకు?’’ అని విపక్షాలను ప్రశ్నించారు. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన YSRCP
-
రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు
-
ముస్లింలపై ఎందుకింత ద్వేషం?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్(సవరణ) బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ బిల్లును తాను అంగీకరించబోనంటూ లోక్‌సభలో బిల్లు ప్రతిని ఆయన చించేశారు. దేశంలో మసీదు, ఆలయం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఆయన బుధవారం లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని, ఈ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి న్యాయం జరుగుతుందని తేల్చిచెప్పారు. రాత్రికి రాత్రి వక్ఫ్ భూములను ఆక్రమించుకున్న వారంతా వక్ఫ్(సవరణ) బిల్లుతో యజమానులుగా మారిపోతారని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేం తమాషా? అని ప్రశ్నించారు. ముస్లింలపై ఎందుకింత ద్వేషం? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వక్ఫ్ బోర్డు అనేది పూర్తిగా ధార్మిక సంస్థ అని స్పష్టంచేశారు. వక్ఫ్ బిల్లు విషయంలో తాను సూచించిన 10 సవరణలు అంగీకరించాలని కోరారు. ప్రాచీన మందిరాలకే న్యాయం జరుగుతుంది ‘‘ఆర్టికల్ 14 ప్రకారం హిందూ, సిక్కు, జైన, బౌద్ధ ధర్మాలకు చెందిన వారికి సంబంధిత ఎండోమెంట్‌లోని ప్రోత్సాహకాలు వారికే దక్కాలి. పాలనా యంత్రాంగం మొత్తం వారి ఆధీనంలోనే ఉంటుంది. వారి పాలనా యంత్రాంగంలో వేరే ధర్మానికి చెందిన వారికి అవకాశం ఉండదు. వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాలను నూతన వక్ఫ్ బిల్లు ద్వారా తొలగించారు. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డు పాలనా యంత్రాంగంలో భాగం అవుతారు. ఇది ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుంది. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26ను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత వక్ఫ్ ఆస్తులు(అనధికార ఆక్రమణదారుల తొలగింపు) బిల్లు–2014ను ప్రవేశపెట్టి 2024లో ఎందుకు ఉపసంహరించుకున్నారు? అనధికార ఆక్రమణలు జరుగుతున్నాయని భావించినప్పుడు ఆ బిల్లును ఎందుకు వెనక్కి తీసుకున్నారో చెప్పాలి. నూతన చట్టం ప్రకారం.. వివాదాస్పద భూముల్లో మసీదులు ఉన్నచోట ఇది ప్రభుత్వ భూమి అని అధికారి నిర్ణయించి ఒక నోటీసు అతికిస్తే అక్కడ మసీదు మూతబడి అది ప్రభుత్వ భూమిగా మారిపోతుంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశంలోని ప్రాచీన మందిరాలకు న్యాయం జరుగుతుంది తప్ప ప్రాచీన మసీదులకు కాదు. ప్రస్తుతం ఢిల్లీలో 172 వక్ఫ్ ఆస్తులు దేశ పురావస్తు శాఖ ఆ«దీనంలో ఉన్నాయి. వాటికి సంబంధించిన పత్రాలు లేని కారణంగా ఇప్పుడు అవి ఇక ప్రభుత్వ భూములుగా మారిపోతాయి’’ అని అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తంచేశారు. -
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
వక్ఫ్. కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయంగా మారిన అంశం. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ అల్లాకు చెందుతాయని భావిస్తారు. కనుక వాటి అమ్మకం, ఇతర ప్రయోజనాలకు వాడకం పూర్తిగా నిషిద్ధం. మసీదులు, మదర్సాలు, శ్మశానవాటికలు, అనాథాశ్రమాల నిర్మాణ నిర్వహణ తదితరాల నిమిత్తం ఉపయోగించాలి. భారత్‌లో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో దిల్లీ సుల్తానుల హయాంలో మొదలైంది. స్వాతంత్య్రానంతరం 1954లో కేంద్ర వక్ఫ్ చట్టం వచ్చింది. దాని స్థానంలో 1995లో తెచ్చిన కొత్త చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు దఖలు పడ్డాయి. వాటిని అపరిమితంగా పెంచుతూ యూపీఏ ప్రభుత్వం 2013లో మరిన్ని సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా 8.7 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయి! వీటన్నింటికీ కలిపి 9.4 లక్షల ఎకరాలున్నాయి! ఆ లెక్కన వక్ఫ్ బోర్డులు దేశంలో మూడో అతి పెద్ద భూ యజమానులుగా అవతరించాయి. వాటి భూముల మొత్తం విలువ కనీసం రూ.1.2 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వాటిలో అవినీతి తీవ్ర సమస్యేనని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. 13 వేలకు పైగా ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఇక 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారమే లేదు! వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేస్తోందని సచార్ కమిటీ ఆక్షేపించింది కూడా. అయితే తీవ్ర వాద వివాదాల నడుమ వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నది విపక్షాల ఆరోపణ. దీన్ని వక్ఫ్ భూములను ముస్లింల నుంచి లాక్కునేందుకు మోదీ సర్కారు కుట్రగా మజ్లిస్ వంటి పార్టీలు అభివర్ణిస్తున్నాయి. ఇందులోని పలు ప్రతిపాదనలు 14, 26, 26, 29 తదితర ఆర్టికల్స్‌కు పూర్తిగా విరుద్ధమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ రగడపై ఇండియాటుడే న్యూస్ చానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ బుధవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు పార్టీల నేతలు తదితరులు, నిపుణులు వాదనలు విన్పించారు. వక్ఫ్ ఆస్తులు అంతిమంగా పేద ముస్లింల అభ్యున్నతికి దోహదపడాలన్నదే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతుండగా అందులోని ప్రతిపాదనలను అంశాలవారీగా విపక్షాలు దుయ్యబట్టాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష ఇండియా కూటమి ఆరోపించగా పారదర్శకత కోసమేనని ప్రభుత్వం సమర్థించుకుంది.న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా వాడీవేడీగా చర్చ కొనసాగింది. ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్షాలు మండిపడ్డాయి. బిల్లును అంగీకరించబోనంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలోనే బిల్లు ప్రతిని చించేశారు. అధికార ఎన్డీయే కూటమి ఎంపీలు బిల్లును సమర్థించారు. విపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలని ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ జరగనుంది. రాజ్యసభలోనూ అధికార ఎన్డీయేకు తగిన మెజార్టీ ఉండడంతో బిల్లు సులువుగా ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది.యూపీఏ పాపమే: రిజిజు వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ, వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటముల మధ్య సంవాదం సభను వేడెక్కించింది. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీఏ పక్షాలు పేర్కొనగా, బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. వక్ఫ్ బిల్లు పేరును ఉమ్మీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్–యూఎంఈఈడీ)గా మారుస్తున్నట్టు రిజిజు ప్రకటించారు. అనంతరం చర్చను ప్రారంభించారు. వక్ఫ్ బిల్లుకు తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తే అంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తుల్లో భాగమేనని ఆలిండియా ముస్లిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ గతంలో వ్యాఖ్యలు చేశారు. వాటినుద్దేశించే మంత్రి ఇలా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈ బిల్లు కేవలం వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయమే తప్ప ముస్లింల మత విశ్వాసాల్లో ఎలాంటి జోక్యమూ చేసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేసి అత్యంత సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు జరిపాం. జేపీసీ సూచించిన పలు సవరణలకు అంగీకరించాం. అయినా విపక్షాలు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించజూస్తున్నాయి. వక్ఫ్ చట్టానికి యూపీఏ హయాంలో చేసిన మార్పుల వల్ల దానికి విపరీతమైన అధికారాలు దఖలు పడ్డాయి. వక్ఫ్ చట్టాన్ని ఇతర చట్టాలకు అతీతంగా మార్చేశాయి. అందుకే ఈ సవరణలు తప్పనిసరయ్యాయి’’ అని రిజిజు అన్నారు. ఏ మత సంస్థల వ్యవహారాల్లోనూ తమ ప్రభుత్వం వేలుపెట్టబోవడం లేదని చెప్పారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో వక్ఫ్ ఆస్తులున్నది భారత్‌లోనే. వాటిని పేద ముస్లింల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలి. అలా జరిగేలా చూడటమే బిల్లు లక్ష్యం. దీనికి మద్దతిస్తున్నదెవరో, వ్యతిరేకిస్తున్నదెవరో దేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది’’ అని చెప్పారు. కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ రిజిజు వాదనను తీవ్రంగా ఖండించారు. బిల్లును రాజ్యాంగ మౌలిక స్వరూపంపైనే దాడిగా అభివర్ణించారు. రిజుజు చర్చకు బదులిచ్చారు. మైనారిటీలకు భారత్‌ను మించిన సురక్షితమైన దేశం ప్రపంచంలోనే లేదన్నారు. అత్యల్ప సంఖ్యాకులైన పార్సీలు కూడా సగర్వంగా నివసిస్తున్నట్టు చెప్పారు.అంతా అంగీకరించాల్సిందే: అమిత్ షా వక్ఫ్ బిల్లు విషయమై దేశంలో అయోమయం సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ముస్లింలను భయపెట్టడం ద్వారా వారిని ఓటుబ్యాంకుగా మార్చుకున్నాయంటూ దుయ్యబట్టారు. ఈ బిల్లు ముస్లింల మత సంబంధిత అంశాల్లో వేలు పెడుతుందన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. ‘‘ఈ సవరణలను మైనారిటీలు ఒప్పుకోరని కొందరంటున్నారు. భారత ప్రభుత్వం, పార్లమెంటు చేస్తున్న చట్టమిది. దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘2014 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు వక్ఫ్ చట్టానికి హడావుడిగా రాత్రికి రాత్రి అడ్డగోలు సవరణలు చేసింది. తద్వారా దాన్ని చట్టాలకు అతీతంగా మార్చింది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుïÙ్టకరణ రాజకీయాలకు ఇది పరాకాష్ట. లేదంటే ఈ సవరణ బిల్లు అవసరముండేదే కాదు’’ అని అమిత్ షా అన్నారు. ‘‘యూపీఏ నిర్ణయం వల్ల ఢిల్లీలోని ల్యూటెన్స్ జోన్లో ఏకంగా 123 ఆస్తులు కేవలం 25 రోజుల వ్యవధిలో వక్ఫ్ ఆస్తులుగా మారిపోయాయి. ఇలాంటి దారుణమైన అవకతవకలను సరిదిద్దడం, వక్ఫ్ భూములు, ఆస్తుల నిర్వహణ పూర్తిగా ప్రజాస్వామికంగా, పారదర్శకంగా జరిగేలా చూడటమే తాజా బిల్లు ఉద్దేశం. అంతేతప్ప ఓటుబ్యాంకు కోసం చట్టాలు చేయడం మోదీ సర్కారుకు అలవాటు లేదు’’ ని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించి తీరతామని చెప్పారు. ‘‘కేవలం వక్ఫ్ ఆస్తి అని ప్రకటించినంత మాత్రాన ఎవరి భూమీ వక్ఫ్ భూమిగా మారకుండా తగిన రక్షణలను ఈ బిల్లు కల్పిస్తుంది’’ అని వివరించారు. అనంతరం బీజేపీతో పాటు విపక్షాల నుంచి పలువురు సభ్యులు బిల్లుపై అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందింది. తర్వాత దానికి విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించగా అవన్నీ ఒక్కొక్కటిగా వీగిపోయాయి.చర్చకు రాహుల్ గైర్హాజరు సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంక కూడా కీలకమైన వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు, ఓటింగ్‌కు విపక్ష నేత రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. ఆయన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కూడా బుధవారం సభకు హాజరు కాలేదు. బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ఉదయం సభలో ఆయన పార్టీ ఎంపీలతో చర్చించారు. దాంతో బిల్లుపై కాంగ్రెస్ తరఫున చర్చకు రాహులే సారథ్యం వహిస్తారని భావించారు. కానీ చర్చలో పాల్గొనరాదని రాహుల్ నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ప్రియాంక కూడా చర్చలో పాల్గొనకపోవడం విశేషం. కాంగ్రెస్‌కు కేటాయించిన గంటా 40 నిమిషాల సమయంలో గౌరవ్ గొగొయ్ తదితర పార్టీలే ఎంపీలే మాట్లాడారు. బీజేపీ నయా మత రాజకీయంలౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ: అఖిలేశ్ వక్ఫ్ బిల్లు ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, భారత లౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నయా మత రాజకీయం అని ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బల నేపథ్యంలో.. ఓట్ల పోలరైజేషన్ కు, తమకు దూరమైన కొన్ని వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాషాయ పార్టీ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. అధికార కూటమిలోకి కొన్ని పార్టీలు వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ వాటికీ మనస్ఫూర్తిగా ఇష్టం లేదని తెలిపారు. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశ జనాభాలో ముస్లింలు దాదాపు 15 శాతం ఉన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్స్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని చెప్పారు.‘‘ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 13 స్పష్టం చేసింది. నాన్ ముస్లింలను వక్ఫ్ కమిటీలలో ఎలా చేరుస్తారు. మైనారిటీలు టీడీపీ వాదనలను సమర్థించరు. చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు. వక్ఫ్ విషయంలో ముస్లింలకు అండగా నిలబడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఒవైసీతో కూడా చర్చించాం వక్ఫ్ సవరణ బిల్లుపై మా స్టాండ్ అదే
-
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
న్యూఢిల్లీ: కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయేలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన తెలుగుదేశం, జేడీ(యూ) తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆదేశించాయి. బిల్లుకు మద్దతు పలకాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు సైతం తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు. బీఏసీ సమావేశం నుంచి విపక్షాల వాకౌట్ వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. విపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలన్న ప్రతిపాదనకు వారు అంగీకరించారు. అయితే, ఈ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం తమ గొంతును అణచివేస్తోందని ఆరోపిస్తూ బీఏసీ సమావేశం నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే బుధవారం లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ‘ఇండియా’ కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాందీ, కేసీ వేణుగోపాల్, రాంగోపాల్ యాదవ్, సుప్రియా సూలే, కల్యాణ్ బెనర్జీ, సంజయ్ సింగ్. టి.ఆర్.బాలు, తిరుచ్చి శివ, కనిమొళి, మనోజ్‌కుమార్ ఝా తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను అణచివేయడానికే వక్ఫ్(సవరణ) బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.బిల్లుకు మద్దతు పలుకున్న తెలుగుదేశం, జేడీ(యూ)లకు ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగవిరుద్ధమైన బిల్లును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ బీఏసీ సమావేశం జరిగింది. గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి.ఏమిటీ వివాదం? వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి. ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లును దేశ ప్రజలంతా అడ్డుకుని తీరాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) అధ్యక్షుడు ఖాలిద్ సైపుల్లా రెహ్మానీ పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును తిరిస్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ, రాష్ట్ర ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శనివారం మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్దఎత్తున తరలిరాగా.. వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రెహ్మానీ మాట్లాడుతూ.. రాజ్యాంగం ముస్లింలకు ప్రసాదించిన హక్కులను వక్ఫ్ సవరణ బిల్లుతో కాలరాసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వందల ఏళ్లనాటి మసీదులు, మదర్సాల రిజిస్ట్రేషన్ పత్రాలు దొరక్కపోతే మత సంబంధమైన బై యూజర్ నియమం ద్వారా చట్టబద్ధత లభిస్తుందన్నారు. అటువంటి నియమాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తెచ్చి.. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకోవాలని చూస్తోందని విమర్శించారు. దేశంలో ఇప్పటికే లక్షలాది ఎకరాలను ప్రభుత్వాలు ఆక్రమించాయని, ఇంకా అనేక హాస్యాస్పదమైన సవరణలు చేసి వక్ఫ్‌ను బలహీన పరచడానికి సవరణ బిల్లు తెచ్చారన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు సైతం తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు దేశ లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు పెను ప్రమాదమని, రాజ్యాంగ పరిరక్షణకు, లౌకిక వాదాన్ని కాపాడేందుకు దేశంలోని సెక్యులర్ పార్టీలు ఐక్యంగా పోరాడాలని కోరారు. మహాధర్నాలో జమాతే ఇస్లాం హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫిక్, ఉపాధ్యక్షుడు మాలిక్ ముహతషిమ్ ఖాన్, మజ్లిస్ ఉలమా ఏపీ ప్రతినిధి మౌలానా ముఫ్తి యూసుఫ్, ఉమ్రి అధ్యక్షుడు మౌలానా నసీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ షేక్ అసిఫ్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంవక్ఫ్ పరిరక్షణ ముస్లింల విశ్వాసానికి సంబంధించిన అంశం. ఈ బిల్లును ఆమోదిస్తే ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంతోపాటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించినట్టు అవుతుంది. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఈ బిల్లు ముస్లింలకు మాత్రమే నష్టం కలిగించదు. వక్ఫ్ చట్టం–1995కు 2013లో సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకుసంక్రమించిన హక్కులు, అ«ధికారాలను కూడా కోల్పోతాయి. – మౌలానాషా ఫజల్ రహీమ్ ముజద్దిద్, ప్రధాన కార్యదర్శి, ఏఐఎంపీఎల్బీ వక్ఫ్ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందిరాజకీయ ప్రయోజనాల కంటే రాజ్యాంగ పరిరక్షణే ముఖ్యమని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ భావిస్తారు. అందుకే ముస్లింలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగేలా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును మా పార్టీ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. వైఎస్ జగన్ ఆదేశాలతో ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించారు. మరోసారి పార్లమెంట్లో ఆ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. దేశంలో భిన్న మతాలు, కులాలు కలిసి మెలిసి అన్నదమ్ముల్లా మెలగాలన్నదే వైఎస్సార్సీపీ ఉద్దేశం. కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజ్యాంగంలో రాసుకున్న రాతలకు తూట్లు పొడుస్తున్నాయి. అటువంటి పాపపు ఆలోచనల నుంచి వచ్చిందే వక్ఫ్ సవరణ బిల్లు. పాపాలు చేస్తున్న వారితోపాటు.. అలాంటి వారికి అండగా నిలవడం కూడా పాపమే అని ఖురాన్ చెబుతోంది. రంజాన్ మాసంలో వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం సమాజం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణమైన రాజకీయ పార్టీలను ఈ వేదిక ద్వారా నిలదీయాలి. – పేర్ని నాని, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత -
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ తొలగింపు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్రకటనలపై విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీని (డిజిటల్ ట్యాక్స్) తొలగించేలా ఆర్థిక బిల్లులో కేంద్రం సవరణ చేసింది. దీనితో గూగుల్, ఎక్స్, మెటాలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై అడ్వర్టైజ్మెంట్ సర్వీసులు అందించే సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో ప్రతిపాదిత 59 సవరణల్లో ఇది కూడా ఒకటి. ఈ సవరణ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2016 జూన్ 1న ఈ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార పన్నులు విధిస్తామంటూ హెచ్చరించిన అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకే ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్‌ను భారత్ తొలగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఆదాయ పన్ను చట్టాలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఇది దోహదపడుతుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుమీత్ సింఘానియా చెప్పారు. -
ఈ వారమే లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వక్ఫ్ సవరణ బిల్లు–2024ను ఈ వారంలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 4వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న దృష్ట్యా, అంతకుముందే ఈ వారంలోనే బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికను ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాకు అందించింది. వక్ఫ్ బోర్డుల్లో కనీసం నలుగురు ముస్లిమేతరులను చేర్చుకోవచ్చని భూ వివాదాలపై దర్యాప్తు అధికారాన్ని కలెక్టర్ల నుంచి సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు బదిలీ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉండేందుకు వీలు కల్పించడం, కలెక్టర్లకు అదనపు అధికారాల వంటివాటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
వక్ఫ్ నివేదికకు జేపీసీ ఆమోదం
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులు, బోర్డ్ వ్యవహారాల్లో సంస్కరణలు, పారదర్శకత తేవడమే లక్ష్యంగా మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు(Waqf (Amendment) Bill)ను సమీక్షించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(Joint Parliamentary Committee) ఎట్టకేలకు తమ ముసాయిదా నివేదికను బుధవారం ఆమోదించింది. జేపీసీ 38వ సారి సమావేశమై ముసాయిదా నివేదికను ఆమోదించడం కోసం జరిపిన ఓటింగ్‌లో 15 మంది సభ్యులు నివేదికకు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓట్లేయడంతో బీజేపీ నేత జగదాంబికాపాల్(Jagdambika Pal) నేతృత్వంలోని జేపీసీ ఈ నివేదికను ఆమోదించింది. జేపీసీలో సభ్యులుగా ఉన్న విపక్ష పార్టీల నేతలు ఈ నివేదికపై తమ పూర్తి అసంతృప్తిని వ్యక్తంచేస్తూ నోట్లను సమర్పించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆధునికత సాధించే ఉద్దేశ్యంతోనే గత ఏడాది ఆగస్ట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందని బీజేపీ సభ్యులు చెప్పారు. అయితే ఈ బిల్లు ద్వారా ముస్లింల మతసంబంధ వ్యవహారాల్లో కమలదళం ఉద్దేశపూర్వకంగా కలగజేసుకుంటోందని, వక్ఫ్ బోర్డ్ నిర్వహణ అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటోందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ నివేదికను గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేస్తామని, శుక్రవారం మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు జగదాంబికా పాల్ చెప్పారు. వక్ఫ్ బోర్డులోకి ముస్లిమేతర వ్యక్తులను సభ్యులుగా అనుమతిస్తూ సవరణ బిల్లు తేవడాన్ని విపక్షాలు ప్రధానంగా తప్పుబడుతున్నాయి. ప్రతి పౌరుడికీ తన మత సంబంధ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, మత సంబంధ, దాతృత్వ సంబంధ సంస్థల నిర్వహణపై ఆ మతస్థులకే పూర్తి హక్కు ఉంటుందని విపక్షాలు తేల్చి చెప్పాయి. సవరణ బిల్లుతో ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 26లోని పౌరుల మతస్వేచ్ఛకు భంగం కల్గిస్తోందని ధ్వజమెత్తాయి. నివేదికను ఆమోదించడాన్ని జేపీసీలో కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ తప్పుబట్టారు. ‘‘ రాజ్యాంగం ద్వారా మాకు సంక్రమించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వం తరచూ ఉమ్మడి పౌరస్మృతి గురించి మాట్లాడుతుంది. మరి సభ్యుల విషయానికొస్తే హిందూ ఎండోమెంట్ బోర్డ్‌లో హిందూయేతర సభ్యులు లేరు. అలాగే సిఖ్ బోర్డ్‌లో సిఖ్యేతర సభ్యుడు లేడు. క్రిస్టియన్ బోర్డ్‌లో క్రైస్తవేతర సభ్యుడు లేడు. ఇదే నియమాన్ని ముస్లింలకూ వర్తింపజేయాలిగదా?. ఇదంతా వక్ఫ్ బోర్డ్లను నాశనంచేసే కుట్ర’’ అని మసూద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సవరణల్లో ఒక్కటికూడా వక్ఫ్‌కు మేలుచేసేలా లేవు. సవరణలన్నీ వక్ఫ్ బోర్డ్‌ను నాశనంచేసి, వక్ఫ్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యాన్ని పెంచేలా ఉన్నాయి. ఖాళీ వక్ఫ్ స్థలాలను ప్రభుత్వం లాగేసుకునే ప్రమాదముంది. ముస్లిం ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం ఆమోదించట్లేదు. ఈ సవరణలను మేం తిరస్కరిస్తున్నాం. సవరణలను ఒప్పుకుంటే మేం మా మసీదులను కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించే అవకాశం
-
జేపీసీ సమావేశంలో రగడ
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశంలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేత, చైర్మన్ జగదాంబికా పాల్ నేతృత్వంలో జేపీసీ శుక్రవారం సమావేశమైంది. చైర్మన్ తీరుపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని, నియమ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. మీటింగ్ ఎజెండాను రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేపీసీ కార్యకలాపాలను ఒక ఫార్స్‌గా మార్చేశారని దుయ్యబట్టారు. విపక్ష సభ్యుల తీరుపై జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తనను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాన్ బెనర్జీపై మండిపడ్డారు. సమావేశానికి అంతరాయం కలిగించడానికే వచ్చారా? అని నిలదీశారు. దీంతో జగదాంబికా పాల్‌కు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. రెండో చైర్మన్ సమావేశాన్ని రెండు సార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పది మంది విపక్ష సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తూ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన్ని జేపీసీ ఆమోదించింది. దీంతో కల్యాణ్ బెనర్జీ, నదీమ్–ఉల్ హక్(తృణమూల్ కాంగ్రెస్), మొహమ్మద్ జావెద్, ఇమ్రాన్ మసూద్, సయీద్ నసీర్ హుస్సేన్(కాంగ్రెస్), ఎ.రాజా, మొహమ్మద్ అబ్దుల్లా(డీఎంకే), అసదుద్దీన్ ఓవైసీ(ఎంఐఎం), మొహిబుల్లా(సమాజ్‌వాదీ పారీ్ట), అరవింద్ సావంత్(శివసేన–ఉద్ధవ్) జేపీసీ భేటీ నుంచి సస్పెండయ్యారు. విపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ రాశారు. ఈ నెల 27న జరగాల్సిన జేపీసీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. మరోవైపు జమ్మూకశీ్మర్‌కు చెందిన మతపెద్ద మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ నేతృత్వంలో ఓ బృందం శుక్రవారం జేపీసీతో సమావేశమైంది. వక్ఫ్ సవరణ బిల్లుపై తమ అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకొచి్చంది. ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ నెల 29వ తేదీన తమ తుది నివేదికను సిద్ధం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వక్ఫ్ సవరణ బిల్లు–2024ను కేంద ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 8వ తేదీన జేపీసీకి పంపించిన సంగతి తెలిసిందే. -
నలుగురు నామినీలు.. కీలక మార్పులు..
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభ ఆమోదించింది. ప్రధానంగా బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలకు గరిష్టంగా నలుగురు నామినీలను కలిగి ఉండేలా ఈ బిల్లు అనుమతిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది."ప్రతిపాదిత సవరణలు బ్యాంకింగ్ రంగంలో పాలనను బలోపేతం చేస్తాయి. నామినేషన్, డిపాజిట్‌దారుల రక్షణకు సంబంధించి కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి" అని సీతారామన్ బిల్లును ప్రవేశ పెడుతూ చెప్పారు. బిల్లులోని ప్రతిపాదనల ప్రకారం బ్యాంకులో ఖాతాదారు గరిష్టంగా నలుగురు నామినీలను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరిని ఒకేసారి కానీ, వివిధ సందర్భాల్లో గానీ చేర్చుకోవచ్చు. ఎవరెవరికి ఎంత వాటా అన్నది కూడా ఖాతాదారు పేర్కొనవచ్చు.పాలనా ప్రమాణాలను మెరుగుపరచడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బ్యాంకులు నివేదించడంలో స్థిరత్వాన్ని అందించడం, డిపాజిటర్లకు, ఇన్వెస్టర్లకు మెరుగైన రక్షణ కల్పించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిట్ నాణ్యతను మెరుగుపరచడం, నామినీల విషయంలో కస్టమర్ సౌలభ్యాన్ని పెంచడం, సహకార బ్యాంకుల్లో డైరెక్టర్ల పదవీకాలం పెంచడం వంటి వాటికి సంబంధించి 19 సవరణలను ఈ బిల్లులో ప్రతిపాదించారు.ప్రతిపాదిత కీలక మార్పులుబ్యాంకు ఖాతాలకు నామినీల సంఖ్య పెంపుతోపాటు మరికొన్ని కీలక మార్పులు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024లో ఉన్నాయి.బ్యాంకులకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డివిడెండ్లు, షేర్, వడ్డీ లేదా బాండ్ల రిడెమ్షన్ను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (IEPF)కి బదిలీ చేస్తారు. సంబంధిత వ్యక్తులు ఎకరైనా ఉంటే అక్కడి నుంచి క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.డైరెక్టర్షిప్స్కు సంబంధించి సబ్‌స్టాన్షియల్ ఇంట్రస్ట్ పరిమితి రూ.2 కోట్లకు పెరుగుతుంది. ఇది ప్రస్తుత రూ.5 లక్షలుగా ఉంది. దీన్ని సుమారు 6 దశాబ్దాల కిందట నిర్ణయించారు.సహకార బ్యాంకుల డైరెక్టర్ల (ఛైర్మన్, ఫుల్‌టైమ్ డైరెక్టర్ మినహా) పదవీ కాలం ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెరుగుతుంది.కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరు రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులో కూడా సభ్యుడిగా ఉండేందుకు అనుమతి. -
Waqf Amendment Bill: రేపు రాబోం
కోల్‌కతా/న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై సమీక్ష చేపడుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నవంబర్ 9వ తేదీ నుంచి మొదలుకానున్న తదుపరి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కమిటీలోని విపక్ష సభ్యులు ప్రకటించారు. కమిటీ సభ్యులు కల్యాణ్ బెనర్జీ, నదీముల్ హక్ గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘‘విరామం ఇవ్వకుండా, సమీక్షలకు మేం సిద్ధమయ్యే అవకాశం లేకుండా చైర్మన్, బీజేపీ నేత జగదాంబికా పాల్ సమావేశాలకు తేదీలు ఖరారు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో గువాహటి, భువనేశ్వర్, కోల్‌కతా, పట్నా, లక్నోల్లో ఆరు రోజుల్లో సమావేశాలకు రమ్మంటున్నారు. పాల్ ఏకపక్ష నిర్ణయాలను మేం వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈ దఫా భేటీలను మేం బహిష్కరించబోతున్నాం’’ అని అన్నారు. -
వక్ఫ్ జేపీసీకి విపక్షాలు దూరం!
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నుంచి విపక్ష పారీ్టల సభ్యులు వైదొలగే అవకాశముంది. కమిటీ చైర్పర్సన్, బీజేపీ సీనియర్ నేత జగదాంబికా పాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట తమ నిరసనను తెలిపేందుకు మంగళవారం వీరంతా ఆయనను కలవాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో తమ అభిప్రాయాలకు పూచికపుల్లంత అయినా విలువ ఇవ్వట్లేరని, ప్రతిపాదిత బిల్లుపై తమకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయంటూ స్పీకర్‌కు ఒక సంయుక్త లేఖ సైతం రాయనున్నాయి. స్వేచ్ఛగా, పారదర్శకంగా కమిటీ సమావేశాలు నిర్వహించేలా జగదాంబికా పాల్‌ను ఆదేశించాలని, లేని పక్షంలో తామంతా కమిటీ నుంచి వైదొలుగుతామని స్పీకర్‌కు విపక్షసభ్యులు మంగళవారం కరాఖండీగా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. -
వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈద్గా మైదానంలో జమాతే ఈ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో జరిగిన వక్ఫ్ పరిరక్షణ మహాసభలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారన్నారు.‘‘ఈ బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వైఎస్సార్సీపీ తరఫున మేము డీసెంట్ నోట్ కూడా ఇచ్చాం. ముస్లింల తరఫున వైఎస్సార్సీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైఎస్సార్సీపీ వ్యతిరేకం’’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.‘‘రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉంది. ఆ భూముల్లో చాలా భాగం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పు. కుట్రపూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను వైఎస్సార్సీపీ ఖండిస్తోంది. వక్ఫ్ బోర్డు భూములే 50 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. 9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారు. ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.‘‘ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వవచ్చు. ఇతరులు మాత్రం వక్ఫ్ బోర్డుకు ఇవ్వకూడదనటం చాలా అన్యాయం. వక్ఫ్ బోర్డు సీఈవోగా గతంలో ముస్లింలే ఉండేవారు. ఇప్పుడు నాన్ ముస్లింలు కూడా సీఈవోగా ఉండొచ్చని ఈ బిల్లులో నిర్ణయం తీసుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే మేము సహించం. వైఎస్ జగన్ ఆదేశాలతో మేము ముస్లింల హక్కుల కోసం పోరాడతాం’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
Banking Laws Amendment Bill: ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టింది. ఒక బ్యాంకు ఖాతాకు నామినీల ఎంపికను ప్రస్తుతమున్న ఒకటి నుండి నలుగురికి పెంచడంసహా పలు కీలక అంశాలకు సంబంధించిన ఈ బిల్లును లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ, సేవల విస్తృతి బిల్లు ప్రధాన లక్ష్యం. అన్‌క్టైమ్డ్ డివిడెండ్లను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదలాయించడం, బ్యాంకింగ్ పరిపాలనా, ఆడిట్ వ్యవహారాల్లో మరింత మెరుగుదలకూడా ఈ బిల్లు దోహదపడనుంది. డైరెక్టర్íÙప్లకు సంబంధించిన వడ్డీ పరిమితిని పునరి్నర్వచించటానికి సంబంధించిన అంశం బిల్లులో మరో కీలకాంశం. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచడం దీని ఉద్దేశం. 2024–25 వార్షిక బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ఈ బిల్లును గత వారం క్యాబినెట్ ఆమోదించింది. -
వివాదాస్పద భూములపై... నిర్ణయాధికారం కలెక్టర్లకే
కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు తేనెతుట్టను కదిపింది. విపక్షాలు, ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబదీ్ధకరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ భూముల యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తితే ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యూనల్‌కు నిర్ణయాధికారం ఉండేది. కొత్త బిల్లు ఈ అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతోంది. వక్ఫ్ చట్టం–1995ను ఇకపై యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్‌గా మారుస్తోంది. మొత్తం 44 సవరణలను ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ అంటే ఏమిటి? ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన, ధారి్మక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసిన ఆస్తిని వక్ఫ్‌గా పేర్కొంటారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే.. ఇక అది అంతిమం. దాన్ని తిరగదోడటానికి ఉండదు. ఈ అంశంపై దృష్టి సారించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. 9 లక్షల ఎకరాలు దేశంలోని 30 వక్ఫ్ బోర్డులు 9 లక్షల పైచిలుకు ఎకరాలను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారత్‌లో పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న వాటిల్లో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులు మూడోస్థానంలో ఉన్నాయి. బిల్లులోని కీలకాంశాలు → ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది వక్ఫ్ చట్టం– 1995. అందులోని సెక్షన్– 40 ఇందుకు వీలు కలి్పంచింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్– 40 రద్దుకు ప్రతిపాదించారు. ఇలా చేయడం ద్వారా వక్ఫ్ బోర్డుల చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని లాగేసుకుంటోందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దుమారం రేగుతోంది. → కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు. కౌన్సిల్లో, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలకు చోటు. ముస్లిమేతరులకూ స్థానం. ఇద్దరు లోక్‌సభ, ఒక రాజ్యసభ ఎంపీకి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో చోటు కలి్పంచాలి. ఈ ముగ్గురు ఎంపీలు ముస్లింలే అయ్యుండాలనే నిబంధనేమీ లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్లో చోటు ఉండేది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పును మార్చే అధికారాన్ని కూడా బిల్లు కేంద్రానికి కట్టబెడుతోంది. → ఒక ఆస్తి వక్ఫ్‌కు చెందినదా, ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే నిర్ణయాధికారం. వక్ఫ్ చట్టం–1995 సెక్షన్– 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునళ్లు తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేన్నైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేలి్చతే ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచొచ్చు. అక్రమంగా ఆస్తులు దక్కించుకోవడానికి స్వార్థపరులు ట్రిబ్యునళ్లను అడ్డం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. → ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ముందు సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు ఇవ్వడం. రెవెన్యూ చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి మ్యూటేషన్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడం. → కాగ్ నియమించిన ఆడిటర్ ద్వారా ఏదేని వక్ఫ్ బోర్డు ఆస్తుల తనిఖీకి ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు దఖలు పరుస్తుంది. → బోరాలు, అగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది. → తన ఆస్తిని దానంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధపడినపుడు.. అతను రాసిన చెల్లుబాటయ్యే అంగీకారపత్రాన్ని (వక్ఫ్‌నామా)ను కొత్త బిల్లు తప్పనిసరి చేస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మౌఖికంగా కూడా తన ఆస్తిని వక్ఫ్‌కు ఇవ్వొచ్చు. → ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ.. ఆస్తిపై యాజమాన్య హక్కులున్నపుడే వక్ఫ్ ఇవ్వొచ్చు. → వక్ఫ్ బోర్డులకు వచ్చే డబ్బును వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథల సంక్షేమం కోసం వినియోగించాలి. అదీ ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో. – నేషనల్ డెస్క్, సాక్షి -
లోక్‌సభ ముందు వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు.. ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న మిథున్‌రెడ్డి
-
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు
ఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించే వక్ఫ్ బోర్డ్‌ల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ (ఆగస్ట్8న) కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇది కూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కేంద్రం మత స్వేచ్ఛ ఉల్లంగిస్తోందని తెలిపారు. వక్ఫ్ చట్టసవరణ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, మజ్లిస్, ఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించగా.. టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు ఇచ్చాయి. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును తీర్చిదిద్దింది.దీంతో పాటు సరైన ఆధారాలు లేకుండానే ఆస్తులు తమ వేనని ప్రకటించే వక్ఫ్ బోర్డు ఏకపక్ష అధికారాలకు స్వస్తి పలకనుంది. కాగా, ఒకవైపు ఈ బిల్లును ఆమోదించేందుకు ఎన్డీయే అన్ని విధాలా ప్రయత్నిస్తుండగా మరోవైపు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. BIG BREAKING NEWS 🚨 Union Minister Kiren Rijiju will withdraw the Waqf Properties 2014 Bill, tomorrow at 12 pm.The Bill was introduced in Rajya Sabha on 18th February 2014 during UPA-2 Govt.This will allow Modi Govt to pass new Waqf bill that strips the Board of powers to… pic.twitter.com/xOrbdA1bBg— Times Algebra (@TimesAlgebraIND) August 7, 2024 -
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
-
నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
ఢిల్లీ: మూడు నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు చట్టంగా మారాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ బిల్లులను రాష్ట్రపతి అనుమతి కోసం పంపించారు. బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్‌సభ కూడా బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించింది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం -
ఢిల్లీ బిల్లు నెగ్గింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభాపతి ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. ఢిల్లీ బిల్లు గత వారమే లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎగువ సభ సైతం ఆమోద ముద్ర వేయడంతో ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ముగ్గురు సభ్యులు ఎటూ తేల్చుకోలేదు. ఓటింగ్‌లో పాల్గొనలేదు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తారా?: విపక్షాలు ఢిల్లీ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై తొలుత సభలో చర్చను కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ ప్రారంభించారు. బిల్లు రాజ్యాంగవిరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పారు. మనమంతా కచి్చతంగా వ్యతిరేకించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ చర్య ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది అంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచి్చన రెండు తీర్పులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఢిల్లీ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అలాగే బిల్లుపై చర్చలో ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎండీకే, సమాజ్‌వాదీ పార్టీ, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆర్జేడీ, సీపీఎం, జేడీ(యూ), కేరళ కాంగ్రెస్(ఎం), సీపీఐ తదితర పారీ్టల సభ్యులు మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బలవంతంగా లాక్కోవడానికే బిల్లును తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అధికారాలు లాక్కోవడానికి కాదు: అమిత్ షా బిల్లును తీసుకొచ్చింది కేవలం ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడడం కోసమేనని, అంతేతప్ప ఆప్ ప్రభుత్వ అధికారాలను లాక్కోవడానికి కాదని అమిత్ షా తేలి్చచెప్పారు. ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, సుప్రీంకోర్టు తీర్పును ఏ కోణంలోనూ ఉల్లంఘించడం లేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీ చాలా భిన్నమని తెలియజేశారు. పార్లమెంట్, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, సుప్రీంకోర్టు ఇక్కడే ఉన్నాయని, వివిధ దేశాల అధినేతలు ఢిల్లీని తరచుగా సందర్శిస్తుంటారని, అందుకే ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినట్లు పేర్కొన్నారు. పరిమిత అధికారాలున్న అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆప్‌నకు తోడుగా నిలిచిన రాజకీయ పార్టీలకు నా కృతజ్ఞతలు. ఢిల్లీలో నాలుగు పర్యాయాలు ఆప్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైన బీజేపీ, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకే ఈ బిల్లును తీసుకువచ్చింది. ఆప్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ పోటీ పడలేకపోతోంది. నన్ను ముందుకు వెళ్లకుండా చేయడమే వారి ఏకైక లక్ష్యం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటును కూడా ప్రజలు బీజేపీకి దక్కనివ్వరు. ఢిల్లీ వ్యవహారాల్లో ప్రధాని మోదీ జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? ’అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు. -
సినీ కార్మి కుల కష్టాన్ని గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సినీ కార్మికుల కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కథానాయకులు రూ.కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారని, కార్మి కుల వేతనాలు మాత్రం అంతంతగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల కష్టానికి తగ్గ ఫలం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, 2023పై ఆయన మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మి కులు పనిచేస్తున్నారని తెలిపారు. చిత్ర నిర్మాణ వ్యయంలో మూడోవంతు పైగా భాగం కథానాయకుల పారితోషికాలకే సరిపోగా.. మిగిలిన మొత్తంతో చిత్రనిర్మాణం పూర్తి చేయాల్సి వస్తోందన్నారు. సెన్సార్ బోర్డ్ సరి్టఫికెట్ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని కోరారు. రైల్వే అప్రెంటీస్లకు న్యాయం చేయండి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) చేసిన తప్పిదం కారణంగా వందలాది కోర్సు కంప్లీటెడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు రైల్వే నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్సీవీటీ పరీక్షకు హాజరు కాలేదన్న సాకుతో వారి నియామకాన్ని రైల్వే పెండింగ్‌లో పెట్టిందన్నారు. మానవతా దృక్పథంతో ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పైరసీ సైట్ల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి:ఎంపీ నిరంజన్‌రెడ్డి విచ్చలవిడిగా పెరిగిపోతున్న పైరసీ సైట్ల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భారతీయ సినిమా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. పైరసీ సైట్లు సుమారు రూ.20 వేల కోట్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్నారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఆయా సైట్లను బ్లాక్‌చేయడం ద్వారా భారతీయ సినిమాను రక్షించొచ్చన్నారు -
ఇక ఇంధన సంరక్షణ తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: కర్బన ఉద్గారాల నియంత్రణలో భాగంగా ఇకపై నిర్దేశిత వాటాలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, బయోమాస్, ఇథనాల్ వంటి శిలాజయేతర ఇంధనాల వినియోగం తప్పనిసరి కానుంది. పరికరాలు, వాహనాలు, నౌకలు, పరిశ్రమలు, వ్యాపార సముదాయాలతో పాటు భారీ భవనాలు సైతం ఇంధన సంరక్షణ చట్టంలోని నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండాల్సిందే. లేనిపక్షంలో భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించక తప్పదు. ఈ మేరకు ఎనర్జీ కన్జర్వేషన్ చట్ట సవరణ బిల్లు–2022ను కేంద్రం అమల్లోకి తీసుకురాబోతోంది. గత ఆగస్టులోనే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించే అవకాశాలున్నాయి. ఉల్లంఘిస్తే నిషేధం... ఈ చట్ట సవరణ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఇందులో పేర్కొన్న నాణ్యతాప్రమాణాలు లేని పరికరాలు, వాహనాలు, నౌకలు, భారీ భవనాల తయారీ, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం వర్తింపజేయనున్నారు. పరిశ్రమలను రెండు ఏళ్లలోగా మూతవేయాల్సి ఉంటుంది. నాణ్యతలను ఉల్లంఘించే వాహనాలు, నౌకలను ఉత్పత్తి చేయడం, ఎగుమతి చేయడం, దిగుమతి చేయడంపై నిషేధం. రెండేళ్లలోపు ఇంధన పరిరక్షణ నాణ్యతల అమలుకు పరిశ్రమలు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఈ మేరకు చర్యలు తీసుకునే వరకు వాటిపై సైతం నిషేధం విధిస్తారు. అపార్ట్మెంట్లకు బిల్డింగ్ కోడ్ తప్పనిసరి... ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నిర్మించిన భారీ భవనాలకు ఇంధన సంరక్షణ చట్ట సవరణ నిబంధనలు వర్తిస్తాయి విద్యుత్ పొదుపు, సంరక్షణ, పునరుత్పాదక విద్యుత్ వినియోగం, ఇతర గ్రీన్ బిల్డింగ్ ఆవశ్యకతల కోసం పాటించాల్సిన ప్రమాణాలు, నిబంధనలు ఈ కోడ్‌లో ఉంటాయి. విద్యుత్ కనెక్టెడ్ లోడ్ 100కేడబ్ల్యూ లేదా కాంట్రాక్ట్‌డ్ లోడ్ 120 కేవీఏకి మించి ఉన్న భవనాలు తప్పనిసరిగా ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. నివాస, వాణిజ్య, కార్యాలయాలు అనే తేడా లేకుండా అన్ని భారీ భవనాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. 50 కేడబ్ల్యూకి మించిన కనెక్టెడ్ లోడ్ ఉన్న భవనాలను సైతం వీటి పరిధిలోకి తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లభించనుంది. ఒక అపార్ట్మెంట్లో 25 ఫ్లాట్లు ఉండి.. ఒక్కో ఫ్లాట్ సగటున 4కేడబ్ల్యూ లోడ్ కలిగిన విద్యుత్ కనెక్షన్ ఉంటే ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే. అయితే, బిల్డింగ్ కోడ్ ప్రకటించిన తర్వాత నిర్మించిన భవనాలకు మాత్రమే వర్తిస్తాయి. పాత భవనాలకు మినహాయింపు ఉంటుంది. కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్ల వ్యాపారం.. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీంను కేంద్రం అమలు చే యనుంది. నిర్దేశించిన వాటా కంటే తక్కువగా శిలాజయేతర ఇంధనాలను వినియోగిస్తే, లోటును భర్తీ చేయడానికి కార్బన్ క్రెడి ట్ సర్టిఫికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం లేదా అది నియమించే ఏ దైనా సంస్థ ఈ సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు... ►పైన పేర్కొన్న నిబంధనలను ఎవరైన వ్యక్తి ఉల్లంఘిస్తే రూ.10లక్షలకు మించకుండా జరిమానాలు విధిస్తారు. మళ్లీ ఉల్లంఘనలు పునరావృతమైతే ప్రతి రోజుకు రూ.10వేలు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆయా ఉపకరణాల విషయంలో ఈ ఉల్లంఘనలకు పాల్పడితే ఒక్కో ఉపకరణానికి రూ.2 వేల నుంచి రూ.5వేల లోపు అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ►పరిశ్రమలు, నౌకలు ఉల్లంఘనలకు పాల్పడిన పక్షంలో అవి వినియోగించిన ప్రతి మెట్రిక్ టన్ను ఇంధనం ధరకు రెండు రెట్ల జరిమానాను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ►వాహనాల తయారీ కంపెనీలు నాణ్యత లేని వాహనాలను తయారు చేసి విక్రయిస్తే ప్రతి వాహనానికి దాని రకం ఆ ధారంగా రూ.25వేలు, రూ.50వేల లో పు జరిమానా విధించాల్సి ఉంటుంది. -
గవర్నర్‌కు వర్సిటీల చాన్స్‌లర్ హోదా రద్దు
తిరువనంతపురం: రాష్ట్రంలోని వర్సిటీలకు చాన్సెలర్‌గా గవర్నర్‌ను తొలగించడంతోపాటు ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్తను నియమించేందుకు ఉద్దేశించిన బిల్లును కేరళ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. అయితే, తమ ప్రతిపాదనలను బిల్లులో చేర్చలేదంటూ కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సభ నుంచి వాకౌట్ చేసింది. కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని గానీ, సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలను గానీ చాన్సలర్‌గా నియమించాలని యూడీఎఫ్ సూచించింది. చాన్సెలర్ ఎంపిక కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలంది. ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్ధేశించిన చట్టసవరణలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేశారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. పాలకవర్గంతోపాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్ట సవరణ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఈ చట్ట సవరణ చేశారు. చదవండి: ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్ -
మత స్వేచ్ఛ(సవరణ) బిల్లుకు ఆమోదం... బలవంతం చేస్తే 10 ఏళ్లు జైలు శిక్ష
Freedom of Religion (Amendment) Bill: హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ మతస్వేచ్ఛ(సవరణ) బిల్లు 2022 ను ఏకగ్రీవం ఆమెదించింది. ఈ బిల్లులో సాముహిక మార్పిడిని నిషేధించింది. ఒకరు లేదా అంకంటే ఎక్కువ మంది ఒకేసారి మతం మార్చుకుంటున్నట్లు పేర్కొంది. బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడితే సుమారు ఏడేళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. ఇది కేవలం 18 నెలలు క్రితం అమల్లోకి వచ్చిన హిమచల్‌ప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం 2019కి మరింత కఠినమైన సంస్కరణ అని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టింది. 2019 చట్టంలో సాముహిక మత మార్పిడిని ఆరికట్టడానికి ఎటువంటి నిబంధన లేదని అందువల్లే ఈ చట్టాన్ని సవరించి రూపొందించడం జరిగిందని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ పేర్కొన్నారు. అంతేకాదు 2019 మత స్వేచ్ఛ చట్టం డిసెంబర్ 21 2020న సుమారు 15 నెలలు తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందని, ఐతే ఇది అతి తక్కువ శిక్షలను సూచిస్తోందని చెప్పారు. (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
లంకలో నిరసనలకు తెర
కొలంబో: శ్రీలంకలో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారకులైన రాజపక్స కుటుంబ పాలనపై ఆగ్రహంతో వెల్లువెత్తిన దేశవ్యాప్త నిరసనలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. రాజధానితో పాటు పలుచోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు మంగళవారం నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెర పడ్డట్టయింది. మరోవైపు, నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధశారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు, అవినీతి విచారణ అధికారులు, పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియామకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దఖలు పడుతుంది. -
స్టాండింగ్ కమిటీకి ‘విద్యుత్’ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పించే వివాదాస్పద విద్యుత్ సవరణ బిల్లు–2022ను విస్తృత సంప్రదింపుల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. రైతు వ్యతిరేక బిల్లు అన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూనే బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు. సోమవారం ముందుగా లోక్‌సభలో విపక్ష పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఈ బిల్లును సింగ్ ప్రవేశపెట్టారు. దీనిని విపక్షాలు వ్యతిరేకించాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుధ్ధం: అధిర్ రంజన్ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. బిల్లుతో కేంద్ర పెత్తనం పెరిగి రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతోంది. తెలంగాణ, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌తో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ బిల్లును ఉపసంహరించుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో మాట తప్పి బిల్లును ప్రవేశపెట్టారు’ అని అ«ధిర్ రంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి సింగ్ ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇకపైనా కొనసాగుతుంది. ఈ బిల్లు రైతు సంక్షేమ, ప్రజాహిత బిల్లు. బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని విద్యుత్ మంత్రి సింగ్ అన్నారు. మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు ఓటింగ్‌కు డిమాండ్ చేశాయి. అయితే స్పీకర్ ఓం బిర్లా సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చుంటే ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పలువురు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వెంటనే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కోరగా, స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. మూజువాణి ఓటుతో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్ర మంత్రి అనుమతి కోరగా, స్పీకర్ అనుమతి ఇచ్చారు. దీనికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. విద్యుత్‌రంగ ఉద్యోగుల నిరసన బాట విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం లక్షలాది మంది విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు సోమవారం నిరసన గళం వినిపించారు. దేశంలోని అన్ని విద్యుదుత్పాదక సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్లుసహా మొత్తం దాదాపు 27 లక్షల మంది సోమవారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలకు చరమగీతం పాడే, రైతులు, అణగారిన వర్గాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారిన బిల్లులోని అంశాలను వెంటనే తొలగించాలని ఏఐపీఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే డిమాండ్‌చేశారు. ‘బిల్లులోని నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ నెట్‌వర్క్‌ను వాడుకుంటూ కొత్త ప్రైవేట్ సంస్థ లాభాలు తెచ్చే వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమలకే విద్యుత్ అందించే ప్రమాదముంది. మొండి బకాయిలుగా మారే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ఇవ్వాలా వద్దా అనేది వారి ఇష్టం. ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం అందరికీ సరఫరా చేయాల్సిందే. దీంతో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నష్టాలపాలవుతాయి’ అని దూబే అన్నారు. -
ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుటుంబ న్యాయస్థానాల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండటంపై లోక్‌సభ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసుల విచారణను త్వరితగతిన ముగించాలని పిలుపునిచ్చారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్‌సభలో ఫ్యామిలీ కోర్టుల సవరణ బిల్లు–2022ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జనతాదళ్ (యు)కు చెందిన కౌశలేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్ కేసుల భారం ప్రస్తుతం 11.4 లక్షలకు పెరిగిందని, ఈ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 715 కుటుంబ న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి తీసుకునే చర్యలను ప్రభుత్వం వెల్లడించాలని బిజూ జనతాదళ్‌కు చెందిన మహ్తాబ్ కోరారు. చర్చను ప్రారంభిస్తూ బీజేపీకి చెందిన సునితా దుగ్గల్.. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కుటుంబ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కుటుంబం, వివాహ సంబంధ సమస్యల పరిష్కారానికి కేంద్రం 1984లో ఫ్యామిలీ కోర్టుల చట్టం ద్వారా ఈ న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 2008లో నాగాలాండ్‌లో రెండు, 2019లో హిమాచల్ ప్రదేశ్‌లో మూడు కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది హిమాచల్ హైకోర్టు విచారణ సందర్భంగా రాష్ట్రంలోని ఫ్యామిలీ కోర్టులకు అధికార పరిధి లేదనే అంశం తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ కోర్టు చట్టాన్ని హిమాచల్‌కు పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనందునే ఇలాంటి పరిస్థితి వచ్చిందని హిమాచల్ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పేర్కొంది. నాగాలాండ్‌లోని ఫ్యామిలీ కోర్టులు కూడా 2008 నుంచి ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండా పనిచేస్తున్నాయి. ఈ చట్టంలో తాజాగా చేపట్టిన సవరణల ద్వారా ప్రభుత్వం ఇటువంటి లోపాలను సవరించే ప్రయత్నం చేసింది. కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటు, వాటి పరిధిపై సంబంధిత హైకోర్టులతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని తెలిపింది. -
డిజిటల్ మీడియా నియంత్రణకు చట్టం!
న్యూఢిల్లీ: డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు సన్నద్దమవుతోంది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదిస్తే డిజిటల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే వెబ్సైట్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం, జరిమానా విధించేందుకు అవకాశం కలుగుతుంది. న్యూస్ ప్రొవైడర్లపై ఆంక్షలు.. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ శాఖ నియంత్రణ పరిధిలోని డిజిటల్ న్యూస్‌ను తొలిసారిగా మీడియా నమోదు చట్టంలోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లులో కొత్తగా ‘ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా డిజిటల్ మీడియాలో వార్తలు’ అనే అంశాన్ని చేర్చింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే డిజిటల్ న్యూస్ ప్రొవైడర్లకు ఆంక్షలు తప్పవు. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు.. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తమ వెబ్సైట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పీలేట్ బోర్డు కూడా.. నిబంధనలు అతిక్రమించిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్లపై చర్యలు తీసుకునే అధికారం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన వెబ్సైట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం లేదా రద్దు చేయడంతో పాటు జరిమానాలు విధించే చర్యలు ఉంటాయి. ఈ బిల్లును ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదించాల్సి ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ నేతృత్వంలో అప్పీలేట్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. సమాచార శాఖ పరిధిలోకి డిజిటల్ న్యూస్ మీడియా నమోదు చట్టంలో కేంద్రం ప్రతిపాదిత తాజా సవరణలు అమల్లోకి వస్తే... డిజిటల్ న్యూస్ మీడియా పూర్తిగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి వస్తుంది. కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు 2019లో చేసిన ప్రయత్నం పెద్ద వివాదానికి దారితీసింది. డిజిటల్ మీడియా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో అప్పట్లో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ‘ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం నుంచి ఇంటర్నెట్ ద్వారా టెక్ట్స్, వీడియో, ఆడియో, గ్రాఫిక్స్ రూపంలో, డిజిటల్ ఫార్మాట్లో వార్తలను ప్రసారం చేయడాన్ని డిజిటల్ మీడియా న్యూస్’గా అప్పట్లో నిర్వచించారు. (క్లిక్: సహజీవనం చేసి.. రేప్ కేసులు పెడితే ఎలా?) -
నచ్చిన కంపెనీ నుంచి కరెంట్
సాక్షి, హైదరాబాద్: ఓ టెలికాం కంపెనీ రీచార్జీల రేట్లు ఎక్కువ. కావాలనుకుంటే వేరే కంపెనీకి మారిపోవచ్చు. ఒక డీటీహెచ్‌లో చానళ్ల ప్యాకేజీ రేట్లు ఎక్కువ.. తక్కువ ధరకు ఇచ్చే మరో డీటీహెచ్‌ను పెట్టుకోవచ్చు.మరి మనకు సరఫరా చేసే కరెంటు చార్జీలు ఎక్కువ.. చచ్చినట్టు ఉన్న ఒక్క డిస్కం నుంచే విద్యుత్ వాడుకోవాలి. వచ్చినంత బిల్లులు కట్టాల్సిందే... కానీ ఇక ముందు విద్యుత్ సరఫరా చేసే కంపెనీల సంఖ్య పెరగనుంది. తక్కువ ధరకు కరెంటు ఇచ్చే కంపెనీనిగానీ.. కోతల్లేకుండానో, వోల్టేజీ హెచ్చు తగ్గులు లేకుండానో కరెంటు ఇచ్చే కంపెనీని గానీ ఎంచుకునే అవకాశం రానుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022లో ఈ మేరకు విప్లవాత్మక సంస్కరణలను ప్రతిపాదించింది. ఒకే ప్రాంతంలో ఒకటికి మించి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలు కల్పించనుంది. ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా.. రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)లు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేసేలా నిబంధనలను తీసుకువస్తోంది. ప్రైవేటు డిస్కంలకు తలుపులు బార్లా తెరిచేందుకు వీలుకల్పించే ఈ చట్టాన్ని కేంద్రం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది. ముసాయిదా బిల్లులోని కీలక ప్రతిపాదనలను కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా ఓ నివేదికలో బహిర్గతం చేసింది. ఇప్పటిదాకా సొంత వ్యవస్థలున్న వాటికే.. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. డిస్కంలు తమ సొంత వ్యవస్థ ద్వారా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు మాత్రమే వీలుంది. అంటే డిస్కంలు విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లతో సొంత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే లైసెన్స్ ఇస్తారు. ఇకపై ఆ అవసరం ఉండబోదు. ‘సొంత వ్యవస్థ ఉండాల’నే నిబంధనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోసం ఎక్కువ సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు తప్పనిసరిగా ఓపెన్ యాక్సెస్ సదుపాయం కల్పించే దిశగా కొత్త నిబంధనను తీసుకువస్తోంది. ఈ లెక్కన కొత్తగా వచ్చే ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వాడుకునేలా ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అనుమతి ఇవ్వాల్సి రానుంది. దీనికి బదులుగా ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ డిస్కంలకు వీలింగ్ చార్జీలను చెల్లిస్తాయి. కొత్త డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి లైసెన్స్‌ల జారీలో రాష్ట్రాల ఈఆర్సీలు విఫలమైనా, దరఖాస్తును తిరస్కరించినా.. ఆయా సందర్భాల్లో లైసెన్స్ జారీ చేసినట్టే పరిగణించేలా కేంద్రం నిబంధన తెస్తుండటం గమనార్హం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేకపోయినా ప్రైవేటు కంపెనీలకు లైసెన్స్ జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. వినియోగదారుడే రాజు! ప్రస్తుతం ఒక ప్రాంతంలో ఒకే ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో వాటి గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఇకపై ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వినియోగదారులకు కాపాడుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వ రంగ కంపెనీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు, అంతకు మించిన సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేస్తే.. ధరల విషయంలో వాటి మధ్య పోటీని ప్రోత్సహించేలా కేంద్రం అవకాశమివ్వడమే దీనికి కారణం. ఆయా ప్రాంతాల్లో రిటైల్ విద్యుత్ సరఫరాకు సంబంధించి గరిష్ట, కనిష్ట ధరలను మాత్రమే రాష్ట్రాల ఈర్సీలు నిర్ణయిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు డిస్కంలు గరిష్ట, కనిష్ట ధరల మధ్యలో ఏ రేటుకైనా విద్యుత్ సరఫరా చేసుకోవచ్చు. దీనితో తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీని ఎంచుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుత పీపీఏల విద్యుత్, వ్యయం పంపిణీ చేసి.. ప్రస్తుతం డిస్కంలకు ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)లపై కేంద్రం కీలక స్పష్టతనిచ్చింది. వీటి ద్వారా వచ్చే విద్యుత్‌ను, అందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రాల ఈఆర్సీలు అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య పంచాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అదనపు విదుŠయ్త్ అవసరమైతే.. ఇతర కంపెనీలతో సంబంధం లేకుండా కొత్తగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు. క్రాస్ సబ్సిడీలకు ప్రత్యేక ఫండ్! పరిశ్రమలు, వాణిజ్యం వంటి కేటగిరీల వినియోగదారుల నుంచి అధికంగా వసూలు చేసిన టారిఫ్‌ను.. గృహాలు, వ్యవసాయం వంటి ఇతర వినియోగదారులకు సబ్సిడీగా ఇవ్వడాన్ని క్రాస్ సబ్సిడీ అంటారు. ఇలా క్రాస్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం.. క్రాస్ సబ్సిడీ బ్యాలెన్సింగ్ ఫండ్‌ను రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మిగులు క్రాస్ సబ్సిడీ కలిగి ఉంటే.. ఆ మొత్తాన్ని ఈ ఫండ్‌లో జమ చేస్తారు. లోటు క్రాస్ సబ్సిడీ ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఈ నిధిని పంచుతారు. ఈఆర్సీలకు అరెస్టు చేయించే అధికారం ఈఆర్సీల ఉత్తర్వులను సివిల్ కోర్టు ఆదేశాలతో సమానంగా పరిగణించనున్నారు. ఆస్తుల విక్రయం, అరెస్టుకు ఆదేశించడం, జైలులో పెట్టడం వంటి అధికారాలు ఈఆర్సీలకు లభించనున్నాయి. ఈఆర్సీ ఉత్తర్వులను స్థానిక సివిల్ కోర్టుకు బదిలీ చేసి అమలుకు చర్యలు తీసుకోవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించే కమిషన్ సభ్యులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలకు అధిపతిగా గానీ/ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా అనుభవమున్న వారినే ఈఆర్సీ చైర్‌పర్సన్‌గా నియమిస్తారు. మరిన్ని కీలక నిబంధనలివీ.. ►డిస్కంలు కేంద్రం నిర్దేశించిన మేర పునరుత్పాదక విద్యుత్‌ను కొనాల్సిందే. తగ్గితే ప్రతి యూనిట్‌కు తొలి ఏడాది 25–35 పైసల చొప్పున, తర్వాత 35–50 పైసల చొప్పున జరిమానా చెల్లించాలి. ►డిస్కంలు విద్యుదుత్పత్తి కంపెనీలకు ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపడంలో విఫలమైతే.. ఆయా డిస్కంలకు విద్యుత్ సరఫరా ఆపేసే అధికారాన్ని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఆర్ఎల్డీసీ)కు కేంద్రం అప్పగించనుంది. ఇప్పటికే రూ.వేల కోట్లు బకాయి పడిన డిస్కంలకు ఇది గుదిబండగా మారనుంది. ►సరఫరా చేసిన విద్యుత్‌కు సరితూగేలా వినియో గదారుల నుంచి బిల్లులు వసూలయ్యేలా ఈఆర్సీ లు చార్జీలను నిర్ణయించాలి. డిస్కంలు టారిఫ్ ప్రతిపాదనలను గడువులోగా సమర్పించకుంటే.. ఈఆర్సీలే మధ్యంతర టారిఫ్ జారీ చేయాల్సి ఉంటుంది. చార్జీలు ఆటోమేటిగ్గా పెరుగుతాయి. -
సవరణ బిల్లు ఆమోదం పొందే వరకు వివాహ వయసు 18 ఏళ్లే.
సాక్షిహైదరాబాద్: బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు–2021 ఆమోదం పొందే వరకు ఆడపిల్లల వివాహ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే అమలులో ఉంటుందని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ అన్నారు. హైదరాబాద్ హజ్‌హౌస్‌లో వక్ఫ్ ఖాజీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టినా... ఇంకా ఆమోదం పొందలేదని, బిల్లు ఆమోదం పొందిన నాటి నుంచి రెండేళ్ల తర్వాత అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచడంతో ఆందోళనకు గురైన కొందరు తల్లిదండ్రులు హడావుడిగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించవద్దని అందరూ అభ్యర్ధిస్తున్నారని, దీనిపై ఆందోళన చెందవద్దని సూచించారు. సమావేశంలో ఖాజీలు మహ్మద్ యూసుఫుద్దీన్,సయ్యద్ షా నూరుల్ అస్ఫియా,సయ్యద్ లతీఫ్ అలీ, సయ్యద్ అఫ్జల్ హుస్సేన్, సయ్యద్ నూరుల్లా ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..
సాక్షి, ఢిల్లీ: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు నేడు సభలో ప్రవేశపెట్టారు. చదవండి: కర్ణాటకలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజే 5, దేశంలో 167కు చేరిన సంఖ్య అయితే ఈ బిల్లును కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి. అయినప్పటికీ దీన్ని ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అంగీకరించడంతో కేంద్రమంత్రి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. అయితే, ఈ బిల్లుతో పాటు లఖింపుర్ ఘటన, ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ బిల్లుపై చర్చ మొదలుపెట్టకుండానే లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఏంటీ సవరణ బిల్లు.. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీల ఆమోద ముద్రవేసింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్ ఐడీ లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించుకొనేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు సమాచారం. అలాగే, కొత్త ఓటర్లు నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. ఇక, ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల ఎంపికపై కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు కట్టబెడుతూ మరో సవరణ చేశారు. ఆధార్ నెంబర్‌తో ఓటర్ ఐడీని అనుసంధానం చేయడం.. గోప్యతా హక్కుకు భంగం కలిగించడమేనని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో నివసించే అందరికీ ఆధార్ కార్డులు జారీచేస్తారని, ఓటువేసే హక్కు కేవలం భారత పౌరులకే ఉంటుందని మరో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అయితే, విపక్షాల వాదనలను కేంద్రం ఖండించింది. ఎన్నికల ప్రక్రియను విశ్వసనీయంగా ఉంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. బోగస్ ఓట్లను నిర్మూలించేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు. -
21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి
న్యూఢిల్లీ: దేశంలో మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో మహిళల కనీస వివాహ వయసు పురుషులతో సమానమవనుంది. స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసును సమానం చేసి 21 ఏళ్లుగా నిర్ణయించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం అంగీకారం తెలిపిందని, ఈ శీతాకాల సమావేశాల్లో సంబంధిత సవరణ బిల్లు తేవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమ్మాయిల పెళ్లి వయసు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు, శిశువులను పౌష్టికాహార లేమి నుంచి కాపాడేందుకు అమ్మాయిల పెళ్లి వయసును పెంచడం అవసరమని గత ఏడాది స్వాతంత్య్రదిన ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఈ విషయంపై అధ్యయనానికి సమతా పార్టీ మాజీ చీఫ్ జయా జైట్లీ అధ్యక్షతన గత ఏడాదే నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. డిసెంబర్లో ఈ కమిటీ సిఫార్సులను కేంద్రానికి సమర్పించగా, వీటి పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రతి రంగంలో లింగ సమానత్వం, సాధికారత పెంచాలని భావించేటప్పుడు స్త్రీ కనీస వివాహ వయసును 18 ఏళ్లకు పరిమితం చేయడం సబబు కాదని జయా జైట్లీ అభిప్రాయపడ్డారు. 18 ఏళ్ల పరిమితి వల్ల పలువురు మహిళలు కాలేజీలకు వెళ్లే అవకాశం కోల్పోతున్నారని, పురుషులకు 21 ఏళ్ల వరకు స్వీయ సంసిద్ధత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. పురుషుడితో సమానంగా స్త్రీలకు అవకాశాలు కల్పించాలంటే అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై పలువురి అభిప్రాయాలు స్వీకరించామని, వివాహ వయసు పెంపు ప్రతిపాదనకు మతాలకతీతంగా స్త్రీ సమాజం నుంచి అధిక సానుకూలత వచ్చిందన్నారు. యూనివర్శిటీలు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలతో మాట్లాడామని వివరించారు. ఈ సంఘంలో నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, విద్యావేత్తలు నజ్మా అఖ్తర్, వసుధా కామత్, దీప్తీ షా తదితరులున్నారు. నిపుణుల ఆందోళన వివాహ వయసు పెంచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు అంటున్నారు. వయసు పెంపు ప్రతిపాదనను చట్టబద్ధం చేయడంతో 21 ఏళ్లకు లోపు చేసే వివాహాలు శిక్షార్హమవుతాయని, దీంతో కలిగే దుష్పరిణామాలు, 18 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాల కన్నా అధికమని ఆక్స్‌ఫామ్ ఇండియాకు చెందిన అమితా పిత్రే అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం సమాజంలో చిన్న వయసులో చేసే వివాహాల శాతం 23 శాతానికి (27 నుంచి) తగ్గిందన్నారు. ఇటీవల కాలంలో పలు అగ్ర, మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లలు 21 ఏళ్లు దాటిన చాన్నాళ్లకు పెళ్లాడుతున్నారన్నారు.అనేక సమాజాల్లో సగానికిపైగా వివాహాలు 21 ఏళ్లకు ముందే అవుతున్నాయని, దీన్ని ఒక్కమారుగా శిక్షార్హం చేయడం సమాజంలో అలజడకి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. చట్ట సవరణ చేయడం.. మూలకారణాలను వదిలి లక్షణాలకు చికిత్స చేసినట్లని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. శతాబ్దాలుగా ఉన్న అలవాటు ఒక్కమారుగా పోదంది. అసమానత్వం, పేదరికం, విద్యా వైద్య లేమి, ఉపాధి అవకాశాల కొరత లాంటి పలు అంశాలు బాల్య, చిన్నవయసు వివాహాలకు కారణమని తెలిపింది. ఈ చట్టాలకు సవరణ! మహిళల కనీస వివాహ వయసును మార్చేందుకు ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధ చట్టం (పీసీఎంఏ)– 2006కు సవరణలు తీసుకువస్తుంది. పీసీఎంఏలో స్త్రీ, పురుషుల కనీస వివాహ హక్కు వరుసగా 18, 21 ఏళ్లుగా నిర్ణయించారు. తాజా నిర్ణయంతో పీసీఎంఏతో పాటు స్పెషల్ మ్యారేజ్ (సివిల్) యాక్ట్–1954, హిందూ మ్యారేజ్ యాక్ట్–1955కు సైతం మార్పులు చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కుల వివాహల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలుంటాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మతంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ వర్తించే నిబంధనలుంటాయి. –నేషనల్ డెస్క్, సాక్షి -
బ్యాంకుల ప్రైవేటీకరణకు త్వరలో చట్ట సవరణ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో మెజారిటీ వాటాల విక్రయానికి అనుగుణంగా బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, 2021ను 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. తాజా చట్ట సవరణ బిల్లులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీస ప్రభుత్వ వాటాను 51 శాతం నుండి 26 శాతానికి తగ్గించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా కేంద్ర మంత్రివర్గం ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
నిర్ణీత రేట్లకే టికెట్ల విక్రయం.. రోజూ 4ఆటలు మాత్రమే: మంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఈ విధానం లక్ష్యమన్నారు. ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ– సవరణ) బిల్లు’ను అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకు ముందు చర్చ సందర్భంగా బిల్లు ఉద్దేశాలను మంత్రి పేర్ని నాని వివరించారు. ప్రేక్షకుల ఆదరణ ను కొందరు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావించారు. ఒక్కో టిక్కెట్‌పై ఇష్టారాజ్యంగా రూ.300 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. రోజుకు 4 ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సినా చట్ట విరుద్ధంగా 6 – 8 షోలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక ఆటలు సాగవు.. చిత్ర పరిశ్రమలో కొందరు మాకు ఎదురు ఉండకూడదు.. ఏచట్టాలూ మమ్మల్ని ఆపలేవు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మంత్రి నాని పేర్కొన్నారు. ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా టిక్కెట్లు విక్రయించే వ్యవస్థ తేవాలని నిర్ణయిం చిందన్నారు. బస్సులు, రైలు టికెట్ల మాదిరిగా సినిమా టిక్కెట్లను కూడా మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని వివరించారు. గంట ముందు థియేటర్లో కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే అక్కడ కూడా ఆన్లైన్ విధానంలోనే థియేటర్ల యజమానులు టిక్కెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నారని మంత్రి తెలిపారు. కాగా, సమాజ హితం కోసం స్వచ్ఛంద సంస్థలు థియేటర్ యాజమాన్యాలతో కలసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే బెనిఫిట్ షోలకు అవకాశం ఉంటుందని తెలిపారు. -
సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహకరం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తాజాగా తెచ్చిన ట్యాక్సేషన్ చట్టాల సవరణ బిల్లు సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రెట్రోస్పెక్టివ్ (గత కాలానికి) ట్యాక్స్ రద్దుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రతిపాదిత బిల్లు సులభతర వాణిజ్యానికి మరింత ఊతమిచ్చేదిగా ఉన్నందున ఈ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు పలుకుతోంది. ఈ బిల్లు వల్ల ప్రభుత్వానికి లిటిగేషన్ ఖర్చులు కలిసిరావడంతోపాటు విదేశీ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం క్రమేపీ మరింత పాదుకుంటుంది. ఈ చర్య ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై గణనీయమైన ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయపన్ను చట్టంలో మళ్లీ ఇలాంటి రెట్రోట్యాక్స్ ప్రతిపాదన తీసుకురావద్దు. రెట్రోట్యాక్స్ వల్ల ఏర్పడే వివాదాలు ఏళ్లతరబడి న్యాయస్థానాలలో కొనసాగే పరిస్థితిని మళ్లీ కల్పించవద్దు. భారత ఆస్తుల పరోక్ష బదిలీపై వచ్చే కేపిటల్ గెయిన్స్‌పై రెట్రోట్యాక్స్విధింపు ఆదాయపన్ను చట్టంలోని నిబంధనలకు లోబడి లేదని సవాలుచేస్తూ వొడాఫోన్ దాఖలుచేసిన కేసుపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వొడాఫోన్ వాదనను సమర్థించింది. దీంతో కోర్టు తీర్పును పక్కన పెడుతూ 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాక్సేషన్ చట్టానికి సవరణ చేసింది. విదేశీ పెట్టుబడిదారులు, సంస్థలు అప్పట్లో ఈ సవరణను తీవ్రంగా దుయ్యబట్టినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ఫలితంగా వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి అనేక సంస్థలు రెట్రోట్యాక్స్పై దేశ, అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చింది. రెట్రోట్యాక్స్ రద్దుచేసే ఈ బిల్లు వల్ల ఏళ్లతరబడి అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలను ప్రభుత్వం ఆయా సంస్థలతో సామరస్యంగా పరిష్కరించుకునే వీలు కలుగుతుంది. తాజా బిల్లుతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసం పాదుకుంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది..’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
బిల్లుతో తీవ్ర నష్టం: కేంద్ర ప్రభుత్వంపై కరెంటోళ్ల కన్నెర్ర
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యుత్ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనకకు తగ్గకపోతే ఆందోలనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆగస్టు10వ తేదీన మెరుపు సమ్మెకు విద్యుత్ సంఘాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవడంతో విద్యుత్ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న విద్యుత్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లుపై పోరాటం సాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు తెలిపారు. -
ఒడిశా అసెంబ్లీలో స్పీకర్ పైకి చెప్పులు
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ శనివారం రణరంగంగా మారింది. చర్చ జరపకుండా ఒడిశా లోకాయుక్త సవరణ బిల్లును సభ ఆమోదించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వని స్పీకర్ పాత్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వైపు చెప్పులు, కాగితం ఉండలు, మైక్రోఫోన్లను విసిరారు. దాంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, తక్షణమే వారు సభను వీడి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను, షెడ్యూల్ కన్నా ఐదు రోజుల ముందే, నిరవధికంగా వాయిదా వేశారు. మధ్యాహ్న భోజన విరామానికి ముందు, ఎలాంటి చర్చ జరపకుండానే లోకాయుక్త సవరణ బిల్లును ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు, మైనింగ్ కార్యకలాపాల్లో అవినీతిపై చర్చ జరపాలన్న తమ డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు కూడా వారితో జత కలిశారు. బీజేపీ సభ్యులు మైక్రోఫోన్లను లాగి, తమ ముందున్న కాగితాలను ఉండలుగా చుట్టి స్పీకర్ పోడియం వైపు విసిరారు. చివరకు స్లిప్పర్లను కూడా విసిరారు. అవి స్పీకర్ పోడియం దగ్గరలో పడ్డాయి. గందరగోళం నెలకొని, సభ అదుపు తప్పిన పరిస్థితులో స్పీకర్ పాత్రో సభను వాయిదా వేశారు. లంచ్ అనంతరం తిరిగి సమావేశమైన తరువాత, అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బీసీ సేథీ, పార్టీ విప్ మోహన్ మాఝీ, ఎమ్మెల్యే జేఎన్ మిశ్రాలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం, వారు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిపారు. ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టిన అనంతరం, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీలో బీజేపీకి 22 మంది ఎమ్మెల్యేలున్నారు. ‘మా వాళ్లు తప్పేం చేయలేదు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో అలా చేశారు’ అని బీజేపీ నేత పీకే నాయక్ పేర్కొన్నారు. -
ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే!
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని తేల్చిచెప్పే బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్సీటీడీ)ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వం ఎవరనే అంశానికి సంబంధించి కొన్ని విషయాల్లో గందరగోళం నెలకొందని, దీన్ని తొలగించేందుకే ఈ బిల్లును తెచ్చామని చెప్పారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని లోక్‌సభలో ఆప్, కాంగ్రెస్ వ్యతిరేకించాయి. బిల్లు ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఎల్జీ అని ఖరారుకానుంది, అంతేకాక ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్ చర్యకైనా ఎల్జీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి కానుంది. ఇది రాజకీయ బిల్లు కాదని, కేవలం కొన్ని అంశాలపై స్పష్టత కోసం తెచ్చిన బిల్లని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈబిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. నిజానికి ఈ బిల్లు 1991లో కాంగ్రెస్ తెచ్చిందని గుర్తు చేశారు. ఎల్జీ కార్యనిర్వహణాధికారి కనుక రోజూవారీ కార్యకలాపాలు తెలుసుకునే హక్కు ఆయనకుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి అధికారాలు లాక్కొని ఎల్జీకి కట్టబెట్టలేదని వివరించారు. తమ తప్పుంటే విని దిద్దుకుంటామని, కానీ ఎలాంటి తప్పు లేనప్పుడు విమర్శలను సహించమని, ఈ బిల్లు మరింత పారదర్శకత కోసమే తెచ్చామని చెప్పారు. 2015 నుంచి ఢిల్లీ హైకోర్టులో కొన్ని అంశాలపై వేసిన కేసులు, వాటిపై కోర్టు ఇచ్చిన రూలింగ్స్‌తో కొంత గందరగోళం నెలకొందన్నారు. ఎల్జీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపని చెప్పి చేయాలని కోర్టు తీర్పులిచ్చిందన్నారు. రాజ్యాంగ వ్యతిరేకం రాష్ట్ర ప్రభుత్వ హక్కులను లాక్కునే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి విమర్శించారు. ఇది గతంలో అప్పటి హోంమంత్రి అద్వానీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకమన్నారు. అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం అమలు చేయకుండా అపేందుకే ఈ బిల్లు తెచ్చారన్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై గందరగోళానికి కాంగ్రెస్, ఆప్ కారణమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేకి దుయ్యబట్టారు. కావాలనుకుంటే కాంగ్రెస్ అప్పట్లోనే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందన్నారు. 2013లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఒక వ్యక్తి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ బ్రిజేందర్ సింగ్ పరోక్షంగా అరవింద్ క్రేజీవాల్‌ను విమర్శించారు. అరవింద్ హయాంలో ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చిఉంటే ఈ పాటికి సివిల్‌వార్ వచ్చేదన్నారు. రాష్ట్రాల హక్కుల హరణలో కేంద్రం స్పెషలిస్టని, ఢిల్లీని పాలించాలని భావిస్తోందని ఆప్ ఎంపీ భగవంత్‌మన్ విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లా అసెంబ్లీ ఉన్న యూటీలాగా ఢిల్లీని మార్చాలని కేంద్రం భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏ నిర్ణయాధికారం లేకుంటే, అసెంబ్లీకి ఎన్నికలెందుకన్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. -
ఈ బిల్లుతో అవినీతి అంతం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా బదలాయించేందుకు అధికారులకున్న విచక్షణాధికారాల రద్దుతో అవినీతికి, అవకతవకలకు ఆస్కారం తగ్గి పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ధరణి ద్వారా ఆన్లైన్ విధానంలో వ్యవసాయేతర భూముల బదలాయింపు దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించామని.. దీని ద్వారా రైతుకు, బిల్డ ర్కు ప్రయోజనం కలుగుతుందన్నారు. మంగళవారం తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు (కన్వర్షన్ నా న్ అగ్రికల్చర్ ల్యాండ్)– 2020, ఇండియన్ స్టాంప్ (తెలం గాణ సవరణ) బిల్లు– 2020ను శాసనసభలో ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. పాత చట్టంలో వ్య వసాయ భూమిని వ్యవసాయేతరగా మార్చే ప్రక్రియలో ఆర్డీఓకు కొన్ని విచక్షణాధికారాలు ఉండేవని, ఈ క్రమంలో కొంత అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఈ సవరణ బిల్లుతో ఆర్డీఓ ఆ అధికారాన్ని కోల్పోతారని, ధరణి ద్వా రా ఆన్లైన్లో సత్వరమే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నా రు. ఇప్పటికే ఎవరైనా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకుంటున్న వారు మూడు నెలల్లోగా దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం విధిస్తున్న 50% జరిమానా ఉండదని వివరించారు. ఇక భూముల ప్రాథమిక విలువ నిర్ధారణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేసినట్టు తెలిపారు. ఈ బిల్లు ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తోపాటు డాక్యుమెంట్లకు ఒకేరోజు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి: అధికార పక్ష సభ్యులు గొంగిడి సునీత, మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ఈ బిల్లులను స్వాగతించారు. చర్చ సందర్భంగా ఎల్ఆర్ఎస్ విషయాన్ని భట్టి లేవనెత్తే ప్రయత్నం చేయగా.. దీన్ని స్పీకర్, అధికార పక్ష సభ్యులు అడ్డుకున్నారు. ‘సవరణ బిల్లు’పై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ధరణిలో పొందుపరిచిన భూముల వివరాలు సక్రమంగా లేకుంటే, వ్యవసాయ భూముల బదలాయింపు ప్రక్రియతో మరో కొత్త సమస్య వస్తుందన్నారు. ధరణిలో పొందుపరిచిన భూములన్నీ సక్రమంగా ఉన్నా యో లేదో ముందు చూడాలని.. లేదంటే గందరగోళం నెలకొంటుందన్నారు. దీనిపై స్పష్టత ఇస్తేనే బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే 1.48 కోట్ల ఎకరాల పట్టా భూముల వివరాలు ధరణిలో రికార్డయ్యాయని.. కోర్డుల్లో ఉన్నవి, ఇతర పంచాయితీల్లో ఉన్న భూములను వదిలేసి 95శాతం భూముల వివరాలను పొందుపరిచామని తెలిపారు. చదవండి: బుల్లెట్లా పంటలు -
ముఖ్యమైన నాలుగు సవరణ బిల్లులకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: నాలుగు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్ర శాసనసభ ఆరో సమావేశం రెం డో విడత భేటీని మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించా రు. మంగళవారం ఉదయం 11.30కు ప్రారంభమైన సమావేశం ప్రశ్నోత్తరాలు వంటి ఇతర ఎజెండా ప్రస్తావన లేకుండా నేరుగా సవరణ బిల్లులపై చర్చను చేపట్టింది. భారతీయ స్టాంప్ (తెలంగాణ సవరణ) బిల్లు– 2020, తెలంగాణ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పు) (సవరణ) బిల్లు– 2020ని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తరఫున శాసనసభ వ్యవహా రాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులపై చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) బిల్లు– 2020ని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపాదించగా, అహ్మద్ బలాలా (ఎంఐఎం), భట్టి విక్రమార్క (కాంగ్రెస్) తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద్ గౌడ్, సుధీర్‌రెడ్డి చర్చలో పాల్గొన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (తెలంగాణ) సవరణ బిల్లు– 2020ని న్యాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతిపాదించారు. నాలుగు బిల్లులను సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. మంగళవారం ఉదయం సభ ప్రారంభ సమయంలో సమావేశ మందిరంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఐదు నిమిషాల పాటు సభలో ఉన్నారు. సమావేశం వాయిదాకు ముందే పలువురు శాసనసభ్యులు తిరుగుముఖం పట్టారు. కాగా, శాసనసభ ఆమోదించిన నాలుగు సవరణ బిల్లులపై చర్చించేందుకు బుధవారం శాసనమండలి ప్రత్యేక భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తూ చైర్మన్ ప్రకటన చేస్తారు. చదవండి: భారీ వర్షాలు: పోలీసు శాఖను అప్రమత్తం చేసిన డీజీపీ -
4 సవరణ బిల్లులకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: నాలుగు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్ర శాసనసభ ఆరో సమావేశం రెండో విడత భేటీని మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించా రు. మంగళవారం ఉదయం 11.30కు ప్రారంభమైన సమావేశం ప్రశ్నోత్తరాలు వంటి ఇతర ఎజెండా ప్రస్తావన లేకుండా నేరుగా సవరణ బిల్లులపై చర్చను చేపట్టింది. భారతీయ స్టాంప్ (తెలంగాణ సవరణ) బిల్లు– 2020, తెలంగాణ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పు) (సవరణ) బిల్లు– 2020ని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తరఫున శాసనసభ వ్యవహా రాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులపై చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) బిల్లు– 2020ని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపాదించగా, అహ్మద్ బలాలా (ఎంఐఎం), భట్టి విక్రమార్క (కాంగ్రెస్) తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద్ గౌడ్, సుధీర్‌రెడ్డి చర్చలో పాల్గొన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (తెలంగాణ) సవరణ బిల్లు– 2020ని న్యాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతిపాదించారు. నాలుగు బిల్లులను సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. మంగళవారం ఉదయం సభ ప్రారంభ సమయంలో సమావేశ మందిరంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఐదు నిమిషాల పాటు సభలో ఉన్నారు. సమావేశం వాయిదాకు ముందే పలువురు శాసనసభ్యులు తిరుగుముఖం పట్టారు. కాగా, శాసనసభ ఆమోదించిన నాలుగు సవరణ బిల్లులపై చర్చించేందుకు బుధవారం శాసనమండలి ప్రత్యేక భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తూ చైర్మన్ ప్రకటన చేస్తారు. -
ఎజెండాకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశా లను ఒక్కోరోజు చొప్పున మాత్రమే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం శాసనసభ, బుధ వారం శాసనమండలి భేటీ జరగనుంది. భేటీ ఒకరోజు మాత్రమే కాబట్టి ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లాంటి అంశాల జోలికి వెళ్లకుండా ఎజెండాను మాత్రమే చేపట్టే అవకాశం ఉంది. సమావేశాల ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో శాసనసభ, మండలి సమావేశ మందిరాల్లో సీటింగ్ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 6 నుంచి 16వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే సభ్యుల మధ్య భౌతికదూరం ఉండేలా సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణంతో పాటు, సభ లోపల కూడా పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయించా లని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహా చార్యులను ఆదేశించారు. ఏర్పాటు చేయా ల్సిన బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్లతో ఫోన్ ద్వారా సమీక్షించారు. అవసరమైన సమాచా రంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఫోన్లో సూచించారు. ఎజెండా అంశాలే... మంగళవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమై నేరుగా ఎజెండాపై చర్చిస్తుంది. శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో నాలా, రిజిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ 1955 చట్టాలను సవరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ మూడు చట్టాలకు సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు. వీటిపై చర్చించి ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్ వాయిదా వేస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మండలి... శాసనసభ ఆమోదించిన బిల్లులను చర్చించి ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది. అనుమానితులకు కరోనా పరీక్షలు ఉభయ సభల ప్రాంగణాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమ య్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు కరోనా లక్షణాలు న్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయిం చుకోవాలని మండలి చైర్మన్ గుత్తా, శాసన సభ స్పీకర్ పోచారం సూచించారు. సభలో ప్రవేశపెట్టే బిల్లులివే... ►వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు చేస్తారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నాలా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేయాలనే సవరణ కూడా చేస్తారు. ►రెవెన్యూ చట్టంలోని సవరణలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చట్టానికి కూడా స్వల్ప సవరణ చేస్తారు. ►జీహెచ్ఎంసీ చట్టం – 1955కు సవరణ చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పాల కమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతి నిధ్యానికి చట్టబద్ధత కల్పిస్తారు. వార్డు కమిటీల పనివిధానం, వార్డుల రిజర్వేషన్ రొటేషన్‌ను రెండు పర్యాయాలకు మారుస్తూ చట్ట సవరణ చేస్తారు. -
‘విద్యుత్ బిల్లు’ను కేంద్రం వెనక్కి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే విద్యుత్ సరఫరాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులను హరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరఫున మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని తమ అభ్యంతరాలను తెలియజేశారు. అనంతరం ఆయన విద్యుత్ సౌధలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా కేంద్రం ఒక్క లైనును కూడా మార్చలేదన్నారు. రాష్ట్రాల ఈఆర్సీల నియామకం విషయంలో మార్పులు చేశామని కేంద్రం అంటోంది కానీ, చేతల్లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. ఈ బిల్లుతో భవిష్యత్తులో పేదలు విద్యుత్ సబ్సిడీలు కోల్పోయే ప్రమాదముందన్నారు. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన డిస్కంలకు కేంద్రం అందిస్తున్న రుణాలకు సంబంధించిన వడ్డీలను 9.5% నుంచి 8.5 శాతానికి తగ్గించాలన్నారు. మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్రంలోని 270 మెగావాట్ల రెండో యూనిట్ శుక్రవారం నుంచి ఉత్పత్తి ప్రారంభించిందని, త్వరలో మూడో యూనిట్లో సైతం ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భారత్-నేపాల్ వివాదం.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో ఎగువసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత భూభాగంలోని ఈ మూడు ప్రాంతాలను తమ మ్యాప్‌లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ బిల్లును రెండు రోజుల క్రితమే దిగువ సభ ఏకగీవ్రంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధురలు తమ ప్రాంతాలేనంటూ నేపాల్ వాదించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పుర్ణ చంద్ర థాపా.. కాలాపానీ సమీపంలోని చాంగ్రూలో ఏర్పాటు చేసిన కొత్త భద్రతా పోస్టును బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు నేపాల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ (ఏపీఎఫ్)ముఖ్య అధికారి శైలేంద్ర ఖనాల్ కూడా ఉన్నారు. (నేపాల్‌తో వివాదంపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు) నేపాల్ ప్రభుత్వం ఏపీఎఫ్ పోస్టును కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే 8న భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మానస సరోవర యాత్రికుల కోసం ఉద్ధేశించిన ధార్చులా-లిపులేఖ్ రోడ్డును ప్రారంభించిన తర్వాత నేపాల్ ఈ ఏపీఎఫ్ పోస్టును ఏర్పాటు చేయడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని దార్చుల నుంచి లిపులేఖ్ వరకు భారత ప్రభుత్వం నిర్మిస్తున్న 80 కిలోమీటర్ల రోడ్డుపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే లిపులేఖ్ రహదారిపై నేపాల్ ‘వేరొకరి కోరిక మేరకు’ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ ఈ వివాదస్పద బిల్లును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను తమ భూభాగాలుగా చెప్పడానికి నేపాల్ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని భారత్ మండిపడింది. (ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం) -
నేపాల్ కొత్త మ్యాప్ : ఆ మూడూ మావే
కఠ్మాండు: భారత్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు తమకే చెందుతాయంటూ ఇటీవల వాదనలు ప్రారంభించిన నేపాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం శనివారం దిగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ–నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా మద్దతు తెలిపాయి. సభకు హాజరైన 258 మంది సభ్యులూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ‘ఈ సవరణను మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో సభ ఆమోదించింది’అని స్పీకర్ అగ్ని సప్కోటే ప్రకటించారు. ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీకి వెళుతుంది. ఆమోదం అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. దీనిద్వారా నేపాల్ జాతీయ చిహ్నంలోని దేశ రాజకీయ మ్యాప్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని అధికార పత్రాల్లో ఈ మ్యాప్ ఉంటుంది. కాగా, నేపాల్ చర్యను భారత్ శనివారం తీవ్రంగా ఖండించింది. నేపాల్ కృత్రిమంగా తమ భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. ‘ఇది చారిత్రక సందర్భం. రాచరిక పాలనలో పోగొట్టుకున్న భూమిని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పొందబోతున్నాం. ఈ విషయంలో దక్షిణ సరిహద్దులోని పొరుగుదేశంతో శత్రుత్వం కోరుకోవడం లేదు. ఎంతోకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం దౌత్యపరమైన సంభాషణలు, చర్చల ద్వారా పరిష్కారమవుతుంది’అని అధికార ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా మాట్లాడుతూ.. ‘జాతి సమగ్రత, జాతీయత అంశాల్లో నేపాల్ ప్రజలు ఐక్యంగా నిలుస్తారు. 1816లో జరిగిన సుగాలీ ఒప్పందం ప్రకారం..మహాకాళి నదికి తూర్పు భాగం నేపాల్‌కే చెందుతుంది’అని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయని, వాటిని భారత్ నుంచి పొందుతామని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అన్నారు. ఆధారాల్లేవన్న ప్రతిపక్ష నేత కాలాపానీ సహా ఇతర ప్రాంతాలు నేపాల్‌కే చెందుతాయనేందుకు ఎలాంటి రుజువులు లేవని జనతా సమాజ్‌వాదీ పార్టీ సరితా గిరి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ స్పీకర్ దానిని తిరస్కరించడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. వివాదం ఎందుకు తలెత్తింది? లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలతో కలిపి 2019 నవంబర్‌లో భారత్ రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని దార్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌తో కలిపే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని మే 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి నేపాల్ అభ్యంతరాలు మొదలయ్యాయి. అంగీకారయోగ్యం కాదు: భారత్ తమ భూభాగాలను కూడా కలుపుకుంటూ రూపొందించిన రాజకీయ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమోదిం చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. అవి నేపాల్‌లోని వని చెప్పేందుకు చారిత్రక సత్యాలు, ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలా వ్యవహరిస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు. -
ప్రధాని మోదీకి లేఖ రాసిన కేసీఆర్
-
ప్రధాని మోదీకి కేసీఆర్ ఘాటు లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రాలకు సంబంధించిన నిర్దిష్టమైన అధికారాలు, విధులను ప్రతిపాదిత విద్యుత్ చట్ట సవరణ బిల్లు లాక్కుంటుంది. కేంద్రం ఏర్పాటు చేసే ఎంపిక కమిటీ.. రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లను నియమించడం, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రాల ఈఆర్సీ బాధ్యతలను పొరుగు రాష్ట్రాల ఈఆర్సీలకు అప్పగించడం వంటి చర్యలు రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య రాజ్య స్ఫూర్తిని దెబ్బతీయనున్నాయి. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఓ అంశం ఉన్నంతమాత్రాన రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం చూపే చట్టాలను కేంద్రం/పార్లమెంట్ తీసుకురావడం సమంజసం కాదు. ఈ ధోరణిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని సీఎం కేసీఆర్ కేంద్రంపై మండిపడ్డారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదా విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2020పై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు/సూచనలు కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ మంగళవారం లేఖ రాశారు. ప్రజలు, రాష్ట్రాల విద్యుత్ సం స్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేఖలోని అంశాలు ఇవీ.. ♦ విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయం, గృహ వినియోగదారులకు అందించే విద్యుత్ రాయితీలను నగదు బదిలీ(డీబీటీ) ద్వారా అందించాలన్న నిబంధనను బిల్లులో ప్రతిపాదించారు. ఈ నిబంధన రైతులు, పేద వినియోగదారుల ప్రయోజనా లకు విరుద్ధం. రైతులకు 24 గంటలు నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయడం తెలంగాణ విధానం. సబ్సిడీల చెల్లింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్సిడీల విధానాన్ని సవరించేందుకు చేసే ఎలాంటి ప్రతిపాదనలు అయినా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ♦ సబ్సిడీ లేకుండానే అన్ని కేటగిరీల వినియోగదారుల విద్యుత్ టారీఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించాలని బిల్లులో ప్రతిపాదించారు. కొన్ని రకాల వినియోగదారులు క్రాస్ సబ్సిడీ భరించేలా ప్రస్తుత టారీఫ్ విధానం ఉంది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు అమల్లోకి వస్తే వ్యవసాయం సహా అన్ని కేటగిరీల వినియోగదారులకు వాస్తవ విద్యుత్ సరఫరా వ్యయం ఆధారంగా కరెంటు బిల్లులు జారీ చేయాల్సి వస్తుంది. ఈ నిబంధనలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సముచిత విధానంలో కొన్ని కేటగిరీల వినియోగదారులపై క్రాస్ సబ్సిడీలు విధించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయడం శ్రేయస్కరం. ♦ రాష్ట్రాల సంపూర్ణ అంగీకారంతోనే ఏదైనా జాతీయ పునరుత్పాదక ఇంధన విధానానికి రూపకల్పన చేయాలి. జల, పవన విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలు, భూముల లభ్యత వంటి అంశాల విషయంలో దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం ప్రత్యేక పరిస్థితిని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన విషయంలో జాతీయ విధానానికి లోబడి తమకు అనువైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు కల్పించేలా జాతీయ విధానం రూపకల్పన జరగాలి. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు అందుకోకపోతే రాష్ట్రాలకు జరిమానాలు విధించే నిబంధనలు ఉండరాదు. ♦ ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా పవర్ షెడ్యూలింగ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారాలను జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)కి కట్టబెట్టతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్ అత్యంత సంతృప్తికర రీతిలో మెరిట్ ఆర్డర్‌ను అమలు చేస్తోంది. గ్రిడ్ క్రమశిక్షణకు ఉన్న అత్యంత ప్రాధాన్యం దృష్ట్యా ఎన్ఎల్డీసీకి అదనపు బాధ్యతలు అప్పగించడం సముచితం కాదు. ఇది రాష్ట్రాల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల బ్యాకింగ్ డౌన్ (ఉత్పత్తి తగ్గింపు/ పూర్తిగా నిలుపుదల)కు దారితీస్తుంది. కేంద్ర విద్యుదుత్పత్తి ప్లాంట్లతో రాష్ట్రాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు పోటీ పడలేవు. ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ వంటి కేంద్ర విద్యుత్ ప్లాంట్ల విద్యుదుత్పత్తి ధరలు తక్కువగా ఉండటంతో మెరిట్ ఆర్డర్ ప్రకారం విద్యుత్ కొనుగోళ్లలో వాటికి ప్రాధాన్యం లభించనుంది. దీంతో రాష్ట్రాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు నష్టపోనున్నాయి. ♦ విద్యుదుత్పత్తి కేంద్రాలకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా పర్యవేక్షించే అధికారాన్ని ఎన్ఎల్డీసీకి అప్పగించేందుకు బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి వాణిజ్యపర అంశాలను ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం రాష్ట్రాల ఈఆర్సీలు, సివిల్ కోర్టులకే వదిలేయాలి. విద్యుత్ షెడ్యూలింగ్, గ్రిడ్ భద్రత వంటి సాంకేతికపరమైన బాధ్యతలకే ఎన్ఎల్డీసీ పరిమితం కావాలి. ♦ డిస్కంల నుంచి కాకుండా వినియోగదారులు బహిరంగ మార్కెట్ నుంచి నేరుగా ఓపెన్ యాక్సెస్ విధానంలో స్వేచ్ఛగా విద్యుత్ కొనుగోలు చేసుకునేందుకు అనుమతించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ అవకాశం కల్పిస్తే డిస్కంల ఆదాయానికి గండి పడనుంది. సాంకేతికంగా సాధ్యం కాకపోయినా, మెగావాట్‌కు పైగా విద్యుత్ అవసరమైన వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లే ప్రమాదముంది. దీనికి తోడు సబ్ లైసెన్సీలు ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేసే అవకాశం లభించనుంది. దీని ద్వారా కూడా డిస్కంలు ఆర్థికంగా కుంగిపోనున్నాయి. ♦ రాష్ట్రాల ఈఆర్సీల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారాన్ని ప్రతిపాదిత విద్యుత్ బిల్లు లాక్కోనుంది. ఇది సమాఖ్య విధాన స్ఫూర్తికి విరుద్ధం. కాంట్రాక్టులకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు కేంద్ర స్థాయిలో ‘ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ’పేరుతో సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం కాంట్రాక్టుల వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలో ఉండగా, ఈ వ్యవస్థ ఏర్పాటుతో రెండింటి పరిధిలో వివాదాలు రానున్నాయి. ♦ విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2020పై మాకున్న తీవ్ర అభ్యంతరాల్లో కొన్నింటిని పైన పేర్కొనడం జరిగింది. ఈ సవరణలు ఇటు ప్రజలకు, అటు రాష్ట్ర విద్యుత్ సంస్థలు/రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించేలా లేవు. పైన పేర్కొన్న అంశాల దృష్ట్యా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర విద్యుత్ శాఖ.. ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. -
‘ఆ బిల్లుకు సీఎం కేసీఆర్ వ్యతిరేకం’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది చట్టరూపం దాల్చితే వ్యవసారంగం, ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సబ్సిడీ విద్యుత్‌పై ప్రభావం పడుతుందన్నారు. విద్యుత్ రంగం మొత్తం ప్రైవేటీకరణ కాబోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీన్ని వ్యతిరేకించారని తెలిపారు. ఈ బిల్లుపై సీఎం పలు సమీక్షలు చేశారని, త్వరలోనే కేంద్రానికి లేఖ రాస్తారని వెల్లడించారు. అనంతరం రాష్ట్రం అభిప్రాయం చెప్పి..ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. (రైళ్లను ఇప్పుడే నడపొద్దు: సీఎం కేసీఆర్) -
సరోగసీకి ఇంకా సమస్యలే
ఎట్టకేలకు సరోగసీ (అద్దె గర్భం) బిల్లుపై సెలెక్ట్ కమిటీ సిఫార్సులు పెద్దల సభ ముందుకొచ్చాయి. బిల్లుకు ఏర్పడిన అవరోధాలు తొలగి అది పార్లమెంటు ఆమోదం పొందాలని సంతాన లేమితో బాధపడుతూ, సరోగసీ కోసం ఎన్నో జంటలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడో 2008లో బిల్లు పని ప్రారంభం కాగా, చట్టాల రూపకల్పనలో రివాజుగా సాగే జాప్యాన్ని దాటడానికి ఇంతకాలం పట్టింది. దీనిపై ఇంకా సభలో చర్చ జరగాల్సివుంది. బిల్లును అధ్యయనం చేసిన సెలెక్ట్ కమిటీ 15 సూచనలు చేసింది. ఇందులో అద్దె గర్భానికి అంగీకరించే మహిళ, దంపతులకు సమీప బంధువై ఉండాలన్న నిబంధన తొలగించమని చేసిన సూచన కూడా ఉంది. అలాగే మరో కీలకమైన సూచన కూడా చేసింది. వివాహమైన దగ్గర నుంచి అయిదేళ్లపాటు ఎదురుచూశాకే అద్దె గర్భం ప్రత్యా మ్నాయాన్ని దంపతులు ఎంచుకోవాలన్న నిబంధన కూడా సరికాదని కమిటీ అభిప్రాయపడింది. సంతానం అవసరమని భావించే దంపతులు సంతానలేమి ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్న నిబంధనను కమిటీ వ్యతిరేకించింది. దీనికి బదులు వైద్యపరంగా వారిని అద్దె గర్భం ద్వారా ‘సంతానం కోరుకునే జంట’గా పరిగణిస్తే సరిపోతుందని తెలిపింది. ‘సంతానం కోరుకునే జంట’ గా ఎవరిని పరిగణించాలన్న విషయమై బిల్లులోని నిబంధనను మార్చాలని కమిటీ సూచించింది. వివాహమైన జంట మాత్రమే సరోగసీకి అర్హులన్న నిబంధన బదులు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసుగల మహిళలు వారు విడాకులు తీసుకున్నవారైనా, భర్తను కోల్పోయినవారైనా ఎంచుకునేలా మార్పు చేయాలని సూచించింది. అయితే ఒంటరి పురుషులు, ఒంటరి మహిళలు, సహజీవనం చేస్తున్న జంటలు, స్వలింగసంపర్కులకు బిల్లులో ఉన్న అనర్హత కొనసాగాలని పేర్కొంది. ఈ కేటగిరీలోని వారికి ఇప్పటికే దత్తత చట్టాల ప్రకారం ఎవరినైనా దత్తత తీసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు సరోగసీలో బిడ్డను పొందే హక్కును వారికి నిరాకరించడంలో హేతుబద్ధత కనబడదు. సరోగసీ సాంకేతికత మొదలయ్యాక మన దేశంలో అది విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. 2000 సంవత్సరంనాటికి మన దేశాన్ని అందరూ ‘క్రాడిల్ ఆఫ్ ద వరల్డ్’(ప్రపంచ ఊయల) అనేవిధంగా అది వ్యాపించింది. పేదరికం ఉన్నచోట ఏమైనా చేయొచ్చునన్న అభిప్రాయం సంపన్నుల్లో ఉండటం దీనికి కారణం. ఈ అంశాన్ని మొదట ప్రభుత్వం గుర్తించలేదు. మహిళా ఉద్యమకారులు, ఆరోగ్య రంగ కార్యకర్తలు గమనించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయినా మరో ఎనిమిదేళ్లకుగానీ బిల్లు రూపొందించే ప్రక్రియ మొదలుకాలేదు. ఆ తర్వాతైనా ఆ పని చకచకా పూర్తికాలేదు. చివరకు బిల్లు తయారైనా అది కేంద్ర మంత్రివర్గం ముందుకు కూడా పోలేదు. ఈలోగా యూపీఏ పాలన ముగిసి, ఎన్డీఏ అధికారంలోకొచ్చింది. అనంతరం 2016లో కేంద్ర మంత్రివర్గం ముందుకు ఈ బిల్లు వచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఈ బిల్లును అధ్యయనం చేసి అనేక సవరణలు సూచించింది. ఆ సవరణల్లో చాలావాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు వస్తున్న తరుణంలోనే అది లోక్‌సభ ముందు కెళ్లింది. తీవ్ర గందరగోళం మధ్య పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందింది. బిల్లు సమగ్రంగా లేదని, సరోగసీకి ఇందులో ఎన్నో పరిమితులు విధించారని రాజ్యసభలో విమర్శలు వచ్చిన నేప థ్యంలో దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. రెండేళ్ల అనంతరం ఇప్పుడు ఆ కమిటీ సిఫా ర్సులు రాజ్యసభ ముందుకొచ్చాయి. బిల్లు త్వరగా చట్టంగా మారితే నిరుపేద అమాయక మహిళ లకు ఇప్పుడెదురవుతున్న అనేకానేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ క్రమంలో అసలు సరోగసీ కోరుకునే జంటలకు చట్టం సమస్యాత్మకంగా మారకూడదు. ఈ బిల్లుపై మొదటినుంచీ మహిళా సంఘాలనుంచీ, ఆరోగ్యరంగ కార్యకర్తల నుంచి ఎదుర వుతున్న మౌలిక అభ్యంతరాల గురించి సెలెక్ట్ కమిటీ సరిగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఉదాహ రణకు సరోగసీ అనేది ‘నిస్వార్థమైనది’గా ఉండాలని బిల్లు నిర్దేశిస్తోంది. బిడ్డను కని ఇచ్చే మహిళకు అవసరమైన వైద్య ఖర్చులకూ, బీమా సౌకర్యం కల్పించడానికి సొమ్ము ఇవ్వాలి తప్ప ఇతరత్రా డబ్బిస్తే అది వాణిజ్యపరమైన సరోగసీ అవుతుందని బిల్లు చెబుతోంది. నిజానికి అన్యులైతే చట్టవిరుద్ధంగా డబ్బు ప్రమేయంతో సరోగసీ సాగుతుందని అనుమానించి, సన్నిహిత బంధువులైన మహిళలు మాత్రమే సరోగసీకి అర్హులని బిల్లులో నిబంధన పెట్టారు. సెలెక్ట్ కమిటీ దీన్ని తొల గించాలని సూచించడం మంచిదే అయినా... ఎవరికోసమో బిడ్డను కని ఇవ్వడానికి ఒప్పుకుని, అందుకోసం తొమ్మిదినెలలపాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొనడానికి సిద్ధపడే మహిళ ఆ పని నిస్వార్థంగా చేయాలన్న నిబంధన సరికాదు. దీన్ని కూడా కమిటీ వ్యతిరేకించి ఉంటే బాగుండేది. భారత్‌లో సంతానం లేని జంటల కోసం ఎంతో పెద్ద మనసుతో, త్యాగబుద్ధితో సరోగసీకి సిద్ధపడే మహిళలుంటారన్న భుజకీర్తులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. డబ్బు లావాదేవీలు మాత్రం చట్టం కన్నుగప్పి సాగుతూనే ఉంటాయి. ఇందులో ఉండే సమస్యేమంటే... తొలుత అంతా మాట్లాడుకుని, ఆ తర్వాత మహిళకు సొమ్ము ఎగ్గొట్టిన పక్షంలో ఆ నిస్సహాయురాలికి చట్టం అండ దండలుండవు. పైగా ఫిర్యాదు చేస్తే ఆమె కూడా చట్టప్రకారం నిందితురాలవుతుంది. కనుక మౌనంగా ఉండిపోవాల్సివస్తుంది. అయితే సరోగసీకి సిద్ధపడే మహిళకు వైద్య ఖర్చులు, బీమా సౌకర్యంతోపాటు పౌష్టికాహార అవసరాలు, గర్భిణిగా ధరించాల్సినవి సమకూర్చుకోవడానికయ్యే ఖర్చుల్ని కూడా ఇవ్వాలన్న నిబంధన కూడా పెట్టాలని కమిటీ సూచించింది. బీమా సౌకర్యం ఇప్పుడున్న 16 నెలలనుంచి, 36 నెలలకు పొడిగించాలన్నది. ఏదేమైనా సరోగసీ బిల్లు రూపకల్పనలో మహిళా కార్యకర్తలు, ఆరోగ్య రంగ కార్యకర్తల అభిప్రాయాలకు చోటిచ్చివుంటే బాగుండేది. -
పౌరసత్వ సవరణ చట్టం
-
ఈశాన్యంలో మంట
-
పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. వాడి, వేడి చర్చ అనంతరం, విపక్ష సభ్యుల నిరసనల మధ్య బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓటేశారు. దాంతో, మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్తైంది. అంతకుముందు, పలువురు ఎంపీల సవరణ ప్రతిపాదనలను సభ మూజువాణి ఓటుతో తోసిపుచ్చింది. ఈ బిల్లుపై సభలో దాదాపు 7 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం, చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విపక్ష విమర్శలను తిప్పికొట్టారు. ‘రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే ఈ బిల్లు ఉంది. సమానత్వ హక్కును కల్పించే ఆర్టికల్ 14 సహా రాజ్యాంగంలోని ఏ అధికరణకు కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదు’ అని అన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఈ బిల్లుతో ఏ విధమైన సంబంధం లేదని, ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రోహింగ్యాలకు నో.. ఎన్నార్సీకి ఎస్ రోహింగ్యాలకు పౌరసత్వం కల్పించే ప్రసక్తే లేదని అమిత్ షా మరోసారి తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చి, బాధాకర జీవనం గడుపుతున్నవారికి ఊరట కల్పించేందుకే ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. 1947లో మత ప్రాతిపదికన దేశ విభజన జరిగి ఉండకపోతే.. ఇప్పుడు ఈ బిల్లు అవసరమే ఉండేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మత వివక్ష ఎదుర్కొంటూ 2014, డిసెంబర్ 31 లోపు భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులను అక్రమ శరణార్ధులుగా భావించం. వారికి భారత పౌరసత్వం కల్పిస్తాం’ అని ఆ బిల్లులో పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. శతాబ్దాల సంప్రదాయమైన ఆత్మీయీకరణ, మానవీయతలో భాగంగానే ఈ బిల్లు రూపొందిందన్నారు. డివిజన్ ఓట్‌తో.. అంతకుముందు, విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లును అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు, మతహింస ఎదుర్కొన్న ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించే ఈ ప్రతిపాదనకు 130 కోట్ల భారతీయుల ఆమోదం ఉందని ఈ సందర్భంగా షా స్పష్టం చేశారు. డివిజన్ ఓట్ అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డివిజన్ వోట్లో అనుకూలంగా 293 ఓట్లు, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింలకు వ్యతిరేకమని విపక్ష సభ్యులు ఆధిర్ రంజన్ చౌధురి(కాంగ్రెస్), సౌగత రాయ్(టీఎంసీ), ఎన్కే ప్రేమ్‌చంద్రన్(ఆర్ఎస్పీ), గౌరవ్ గొగొయి(కాంగ్రెస్), శశిథరూర్(కాంగ్రెస్), అసదుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం) తదితరులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ప్రవేశపెడ్తూ.. కాంగ్రెస్‌పై షా మండిపడ్డారు. ‘శరణార్ధులు, చొరబాటుదారుల మధ్య తేడాను మనమంతా గుర్తించాల్సి ఉంది. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు.ఎవరి హక్కులనూ లాక్కోదు’ అని అన్నారు. ‘ఇన్నర్ లైట్ పర్మిట్’లోకి మణిపూర్ ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల ఆందోళనలపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని షా తెలిపారు. ఈ బిల్లు పరిధిలో లేని ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ ప్రాంతంలోకి మణిపూర్‌ను కూడా చేరుస్తున్నామన్నారు. మూడు పొరుగుదేశాల్లో మత వేధింపులను ఎదుర్కొన్న ముస్లిమేతరులకు రేషన్ కార్డ్ సహా ఎలాంటి పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పిస్తామన్నారు. గతంలోనూ ఇలాంటి హక్కులు కల్పించారని, ఆ కారణంగానే ప్రస్తుత పాకిస్తాన్ నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధాని, ఎల్కే అడ్వాణీ ఉప ప్రధాని కాగలిగారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సభలో వాడివేడి చర్చ చోటు చేసుకుంది. ఈ బిల్లు లౌకికత అనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ విమర్శించారు. ‘సమానులను సమానం కాని వారుగా గుర్తించకూడదు. భారత్‌కు ఎవరు వచ్చినా వారు శరణార్ధులే. మతం ప్రాతిపదికన వారిని వేరువేరుగా చూడకూడదు’ అన్నారు. బిల్లుకు ఎన్డీయే మిత్ర పక్షాలైన జేడీయూ, ఎల్జేపీలు మద్దతు తెలిపాయి. ఈ బిల్లులో ముస్లింలను కూడా చేర్చాలని, బిల్లుకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్ సూచించాయి. ఈ బిల్లును వ్యతిరేకించే వారంతా హిందూ వ్యతిరేకులు అనే ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి విమర్శించారు. ‘ఈ బిల్లు వివక్షాపూరితం. రాజ్యాంగ పునాదులనే ఇది దెబ్బతీస్తుంది. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇది తొలి అడుగు’ అని మండిపడ్డారు. మా రాష్ట్రంలో ఒప్పుకోం: మమత... ఈ బిల్లును కానీ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని కానీ తమ రాష్ట్రంలో అనుమతించబోమని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడ్తున్న నేపథ్యంలో.. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై ఆందోళనలు ఊపందుకున్నాయి. బిల్లు ప్రతిని చించేసిన ఒవైసీ పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. తన ప్రసంగం చివరలో ఈ బిల్లు ప్రతిని చించేశారు. ‘ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాను. మేమూ మనుషులమే. ఈ వివక్షకు కారణమేంటి? అస్సాం ఎన్ఆర్సీలో 19 లక్షల మంది పేర్లు లేవు. ముస్లింలకు స్వదేశమంటూ లేకుండా చేయడం వీరి ఉద్దేశం. రెండోసారి విభజన జరగాలని మీరు కోరుకుంటున్నారా? ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది’ అంటూ ప్రతిని చించేసి తన ప్రసంగాన్ని ముగించారు. -
పౌరసత్వ బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని అవి వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వలసలు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ ప్రతిపాదనపై ఆగ్రహంతో ఉన్నారు. మూడు ఇస్లామిక్ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారిలో హిందువులే అత్యధికంగా ఉంటారు. ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి వారికి ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించాలని బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు వీలుగా జాతీయ పౌరపట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్–ఎన్నార్సీ)ను సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పౌరసత్వ బిల్లు రూపకల్పన సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లును నేడు కానీ, రేపు కానీ సభలో ప్రవేశపెట్టి, వచ్చే వారం సభ ఆమోదం పొందేలా చూడాలని కేంద్రం ఆలోచిస్తోంది. తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్, టీఎంసీ ఈ బిల్లున వ్యతిరేకిస్తున్నాయి. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం భారత లౌకిక భావనకు వ్యతిరేకమని కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ నేత, అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 12 మంది ఎంపీలు మోదీకి లేఖ రాశారు. లోక్‌సభలో బీజేపీకి ఉన్న మెజారిటీ దృష్ట్యా అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం సమస్య కాబోదుగానీ, రాజ్యసభలో విపక్షం ఈ బిల్లును అడ్డుకునే అవకాశముంది. గత ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు లోక్‌సభలో గట్టెక్కింది. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు చోటు చేసుకోవడంతో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టలేదు. ఆ తరువాత ఆ ప్రభుత్వ పదవీకాలం ముగిసింది. కేబినెట్ నిర్ణయాల్లో మరికొన్ని.. ► వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం. డేటా సేకరణ, నిల్వ, వినియోగం, సంబంధిత వ్యక్తుల ఆనుమతి, ఉల్లంఘనలకు జరిమానా, శిక్ష.. తదితరాలకు సంబంధించిన సమగ్ర విధి, విధానాలతో బిల్లును రూపొందించారు. ► కేంద్ర సంస్కృత యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం. మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్సిటీలను సెంట్రల్ యూనివర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ► ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 3.7 ఎకరాల స్థలాన్ని ఐటీడీసీ(ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్), ఐటీపీఓ(ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్)లకు రూ. 611 కోట్లకు 99 ఏళ్ల పాటు లీజుకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఈ స్థలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మిస్తారు. 2021లోగా ఈ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ► జమ్మూకశ్మీర్‌లో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉపసంహరించేందుకు ఆమోదం. ఇటీవలి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ అంశం ఉండటంతో ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగించేందుకు నిర్ణయించారు. అయితే, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతానికి వారికి రిజర్వేషన్లను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మీడియా ప్రశ్నించగా, బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారని జవదేకర్ వెల్లడించారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారన్నారు. ఏమిటీ బిల్లు? పౌరసత్వ చట్టం, 1955కి తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లు ప్రకారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నివసిస్తూ మత పరమైన హింస, వేధింపుల్ని ఎదుర్కొంటున్న ఆరు వర్గాలకు భారత పౌరసత్వాన్ని కల్పించడానికి వీలుగా చట్టానికి సవరణలు చేస్తున్నారు. హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు, జైనులు, బుద్ధులకు ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం మన దేశ పౌరసత్వం లభిస్తుంది. వీరంతా భారత్‌లో ఉంటూ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, ఆ పత్రాల గడువు తేదీ ముగిసిపోయినా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆరు వర్గాల్లో ముస్లింలు లేకపోవడం మైనారిటీల్లో అసంతృప్తి రాజేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో.. బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా దేశంలోని ఈశాన్యరాష్ట్రాల్లో ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇప్పటికే అసోం పౌర రిజిస్టర్ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాల్లో ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. పార్లమెంటులో బిల్లు గట్టెక్కుతుందా? లోక్‌సభలో ఈ బిల్లుని మొదట 2016లో ప్రవేశపెట్టారు. అధికార బీజేపీకి అసోంలో మిత్రపక్షమైన అసోం గణ పరిషత్(ఏజీపీ) అప్పట్లో దీనిని వ్యతిరేకించింది. కొన్ని సవరణలతో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందున దీనిపై వ్యతిరేకత వచ్చినా ఆమోద ముద్ర పడుతుంది. ఇక రాజ్యసభలో మాత్రం జేడీ(యూ), అకాలీదళ్ వంటి పార్టీల మద్దతు లేకుండా బిల్లు గట్టెక్కలేదు. రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకునేందుకు హోంమంత్రి అమిత్ పలు పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. బిల్లుకు అనుకూలం బీజేపీ, అకాలీదళ్, ఏఐఏడీఎంకే బిల్లుకి ప్రతికూలం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు -
ఎస్పీజీ చట్ట సవరణకు ఓకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఇతర విపక్షాల నిరసనల మధ్య స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణ బిల్లు ప్రకారం ఇకపై ప్రధానమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ఎస్పీజీ కమాండోల రక్షణ ఉంటుంది. మాజీ ప్రధానులు, వారితో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉండే కుటుంబసభ్యులకు ఆ ప్రధాని పదవీ కాలం ముగిసిన అయిదేళ్ల వరకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తారు. సోమవారం ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెడితే బుధవారం ఈ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ బ్లాక్ క్యాట్ కమాండోలు ఉదాసీనంగా వ్యవహరించకుండా, వారి సమర్థత పెంచడం కోసమే ఎస్పీజీ చట్టానికి సవరణలు చేశామని చెప్పారు. తొలిరోజుల్లో ఏ ఉద్దేశంతో ఎస్పీజీ చట్టాన్ని తీసుకువచ్చారో దానినే పునరుద్ధరించామని వెల్లడించారు. ఇతర దేశాల్లో కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత కేవలం దేశాధిపతులకు మాత్రమే ఉంటుందని షా గుర్తు చేశారు. గాంధీ కుటుంబం భద్రతను మార్చాం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు భద్రతను తొలగించలేదని, జెడ్ ప్లస్ కేటగిరీకి భద్రతను మార్చామని అమిత్ షా చెప్పారు. వాస్తవానికి ఇప్పుడే గాంధీ కుటుంబానికి భద్రత మరింత పెరిగిందని అన్నారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ, అంబులెన్స్‌తో గాంధీ కుటుంబానికి భద్రత కల్పిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. మాజీ ప్రధానులు చంద్రశేఖర్, ఐకె గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌లకు ఎస్పీజీ భద్రత తొలగించినప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గతంలో చేసినట్టుగా ప్రతీకారంతో తాము ఈ బిల్లు తీసుకురాలేదని షా అన్నారు. వీఐపీలందరికీ వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగానే భద్రతను కల్పిస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రికి భద్రత కల్పించే స్థాయిలో అందరికీ కల్పించలేమని చెప్పారు. షా వ్యాఖ్యల్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఇతర విపక్షాలు కూడా కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. వాటిని తిరస్కరించిన సభ మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదించింది. గాడ్సే దేశభక్తుడు: ప్రజ్ఞా గాంధీజీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను ‘దేశభక్తుడు’గా పేర్కొంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో వివక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మహాత్మా గాంధీని ఎందుకు చంపాడనే దానిపై గాడ్సే చేసిన ప్రకటనను డీఎంకే సభ్యుడు రాజా ప్రస్తావిస్తుండగా.. ప్రజ్ఞా ఠాకూర్ అడ్డుతగిలారు. ఒక దేశభక్తుడిని మీరు ఉదాహరణగా చెప్పనక్కర్లేదు అని అన్నారు. రాజా మాటలకు ప్రజ్ఞా ఠాకూర్ అడ్డుతగలడంతో విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. గాడ్సేపై ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మరో కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సమ్మెపై 14 రోజులు ముందే చెప్పాలి సమ్మెకు వెళ్లే కార్మికులు 14 రోజుల ముందే నోటీసు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ బుధవారం రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త కార్మిక చట్టంలో ఇది భాగమని, దీనిపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని గంగ్వార్ అన్నారు. కార్మిక చట్టాలలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోందని పేర్కొన్న మంత్రి, అందులో భాగంగా 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మిళితం చేస్తున్నామని వెల్లడించారు. 2016లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని, ఇది శ్రామిక శక్తిలో 20 శాతం ఉందని తెలిపారు. -
చిట్‌ఫండ్’కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: చట్టబద్ధ చిట్‌ఫండ్స్ కంపెనీలకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చిట్స్ నిర్వహిస్తున్న వ్యక్తి తీసుకునే కమీషన్‌ను ప్రస్తుతం ఉన్న 5% నుంచి 7 శాతానికి పెంచుతూ ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. అలాగే, చిట్ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. ‘ది చిట్‌ఫండ్స్ (అమెండ్మెంట్)బిల్, 2019’పై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ మాట్లాడుతూ.. చిట్‌ఫండ్స్‌ను అనధికార, అనియంత్రిత డిపాజిట్ పథకాలు, లేదా పోంజీ స్కీమ్స్‌తో పోల్చకూడదని పేర్కొన్నారు. ఒకరు లేదా నలుగురి లోపు వ్యక్తులు నిర్వహించే చిట్స్ గరిష్ట మొత్తాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షలకు పెంచేలా.. నలుగురు లేదా ఆపై సంఖ్యలో నిర్వాహకులున్న చిట్‌ఫండ్ సంస్థల్లో చిట్స్ మొత్తాన్ని రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షలకు పెంచేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చిట్‌ఫండ్ నిర్వాహకుడి కమిషన్‌ను 5% నుంచి పెంచి 7% చేశారు. ‘చిట్ అమౌంట్’ను ఇకపై ‘గ్రాస్ చిట్ అమౌంట్’ అని, డివిడెండ్‌ను ‘షేర్ ఆఫ్ డిస్కౌంట్’ అని, ‘ప్రైజ్ అమౌంట్’ను ‘నెట్ చిట్‌ఫండ్’ అని పేర్కొనాలని బిల్లులో స్పష్టం చేశారు. కనీస మొత్తం (బేస్ అమౌంట్) రూ. 100 అని పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఆ కనీస మొత్తాన్ని నిర్ధారించే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించారు. అవసరమనుకుంటే, చిట్‌ఫండ్ వినియోగదారులు చిట్ మొత్తానికి బీమా చేయించుకోవచ్చు కానీ వినియోగదారులపై భారం మరింత పెరుగుతుందనే ఆలోచనతో.. బీమాను కచ్చితం చేయాలనుకోవడం లేదని బిల్లుపై చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
పౌరసత్వ బిల్లులో కీలక మార్పులు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత లోక్‌సభ రద్దైన నేపథ్యంలో ఆ బిల్లుకు కూడా కాలం చెల్లిన విషయం తెలిసిందే. దాంతో, కొత్తగా కొన్ని కీలక మార్పులతో ఆ బిల్లును మళ్లీ సభ ముందుకు తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, ‘అక్రమ వలసదారులు’ అనే పదానికి నిర్వచనాన్ని కూడా బిల్లులో చేర్చనున్నారని సోమవారం అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులకు తట్టుకోలేక భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీలకు.. వారివద్ద సరైన పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పించే దిశగా పౌరసత్వ చట్టం, 1955లో సవరణ చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లు అది. ఇది బీజేపీ ప్రచారాస్త్రాల్లో ఒకటి. -
బ్రెగ్జిట్ ఆలస్యానికే ఓటు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం జాప్యం కానుంది. ఈ మేరకు శనివారం జరిగిన చారిత్రక సమావేశం నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్ కోసం ఈయూతో కుదుర్చుకున్న గొప్ప ఒప్పందానికి మద్దతు తెలపాలంటూ ఈ అంశంపై ప్రధాని జాన్సన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ఇప్పటి వరకు బ్రెగ్జిట్ తర్వాత అవసరమయ్యే చట్టాలు రూపొందనందున ఈ గడువును 31వ తేదీ నుంచి పొడిగించాలని శనివారం అర్థరాత్రిలోగా ఈయూను కోరాలంటూ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఆలివర్ లెట్విన్ సవరణ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈ తీర్మానానికి అనుకూలంగా 322 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 306 ఎంపీలు ఓట్లేశారు. ప్రధాని కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందానికి ఎంపీల మద్దతు లేదనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని లేబర్ పార్టీ నేత కార్బైన్ వ్యాఖ్యానించారు. ప్రధాని జాన్సన్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటింగ్ అర్థరహితం. అక్టోబర్ ఆఖరు కల్లా బ్రెగ్జిట్ అమలు చేయాలన్న నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని, తాజా ఓటింగ్ మేరకు ఈయూను గడువు పొడిగించాలని కోరబోను’అని స్పష్టం చేయడం గమనార్హం. బ్రెగ్జిట్తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని వచ్చే సోమవారం సభలో ప్రవేశపెట్టి, మంగళవారం ఓటింగ్‌కు కోరతామన్నారు. కాగా, పార్లమెంట్లో చర్చ జరుగుతుండగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు ప్రధాని జాన్సన్ ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం జరిగిన ‘ప్రతినిధుల సభ’ సమావేశాన్ని విశ్లేషకులు ‘సూపర్ సాటర్డే సెషన్’అని అంటున్నారు. ఇలాంటి అసాధారణ సమావేశం 1982లో మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉండగా ఫాక్‌ల్యాండ్ యుద్ధంపై ఓటింగ్ కోసం ఏర్పాటైంది. -
‘ఉగ్ర’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: కీలకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్ట సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఇది చట్ట రూపం దాలిస్తే ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఏ వ్యక్తిని అయినా సరే ఉగ్రవాదిగా ప్రకటించడంతోపాటు, అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారాలను విస్తృతం చేసింది. ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం–1967 సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్, బీఎస్పీ బిల్లుకు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం మాట్లాడుతూ.. చట్ట సవరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, తాజా సవరణతో వ్యక్తి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, చట్టం దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలను కోర్టులు కొట్టేసే అవకాశముందున్నారు. డీఎంకేకు చెందిన రవికుమార్ మాట్లాడుతూ.. మూకదాడి కేసులు, పరువు హత్యల్లో నిందితులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించాలని కోరారు. దీనిపై హోం మంత్రి మాట్లాడుతూ.. ‘గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదానికి మతం రంగు పులిమింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్, మక్కా మసీదు పేలుడు ఘటనల్లో ఒక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టింది. దీంతో అసలైన నిందితులు తప్పించు కోగలిగారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకునే దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రతిపక్ష నేతలను జైలుపాలు చేసి, మీడియాపై ఆంక్షలు విధించింది’ అని కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. విదేశాల్లో ఉగ్ర కేసులపైనా ఎన్ఐఏ దేశంతోపాటు విదేశాల్లో ఉగ్ర సంబంధ కేసులపైనా దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం భారతీయులు, భారత్ ఆస్తులపై ఉగ్రదాడులు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆయుధాల రవాణా, తయారీ, దొంగనోట్లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్ఐఏకు ఉంటుంది. ఇలాంటి కేసుల విచారణకు ఢిల్లీలో ప్రత్యేక కోర్టును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ చట్టం–1951 (సవరణ)బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రస్టీగా ఉండేందుకు ఇకపై వీలుండదు. డ్యామ్ సేఫ్టీ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చకు హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ.. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడానికే చట్ట సవరణను చేపట్టామన్నారు. ఒక సంస్థను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తే అందులోని వ్యక్తులు వేర్వేరు పేర్లతో ప్రమాదకర కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రస్తుత చట్టం వీలు కల్పిస్తోంది. ఇటువంటి వారి చర్యలపై నిఘా వేసేందుకు వీలు లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తులను అడ్డుకునేందుకే తాజాగా సవరణ చేపట్టాం’ అని వివరించారు. ‘ఈ చట్టంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగేందుకు వీలులేకుండా నిబంధనలున్నాయి. నాలుగు దశల్లో పరిశీలన జరిపిన మీదటే ఎవరైనా వ్యక్తులను ఉగ్ర వాదులుగా ప్రకటించేందుకు వీలుంటుంది’ అని తెలిపారు. -
దివాలా బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: డిఫాల్టయిన సంస్థల ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై మరింత స్పష్టతనిచ్చేలా దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే దీనికి రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా లోక్‌సభలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. స్మృతిలోని ఏడు సెక్షన్లలో సవరణలు ప్రతిపాదించారు. వీటి ప్రకారం డిఫాల్టయిన సంస్థ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నిధులపై రుణదాతల కమిటీకి పూర్తి అధికారాలు లభించనున్నాయి. ఐబీసీ పరిధిలోకి వచ్చిన కేసులను 330 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. రుణ పరిష్కార ప్రణాళికపై ఎన్నాళ్లలోగా నిర్ణయం తీసుకోవాలి, ఆర్థిక రుణదాతలను ఏ వర్గంగా పరిగణించాలి తదితర నిబంధనలపై ఈ సవరణలతో మరింత స్పష్టత వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ప్రారంభమైన తర్వాత 330 రోజుల్లోగా కేసు పూర్తి కావాల్సి ఉంటుందని ఆమె వివరించారు. అలాగే రుణ పరిష్కార ప్రణాళిక ఒకసారి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ అధికారిక సంస్థలు కూడా దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు తాజా సవరణలతో గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు సంక్రమించగలవని నిర్మలా సీతారామన్ చెప్పారు. బిల్డర్ల ఆగడాలతో సతమతమవుతున్న కొనుగోలుదారులకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివాదాస్పద జేపీ గ్రూప్ సంస్థల నుంచి గృహాలు కొనుగోలు చేసిన వారి సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. మరోవైపు, దివాలా స్మృతి పనితీరు మిశ్రమంగా ఉందని చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కంపెనీల వేలం..ముఖ్యంగా రియల్టీ వంటి రంగాల సంస్థల విక్రయం వల్ల కష్టార్జితం పెట్టి ఇళ్లు కొనుక్కున్న కొనుగోలుదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. -
‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: అంతర్ రాష్ట్ర జల వివాదాలను వేగంగా, ఓ క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు–2019 బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రవేశపెడుతూ, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లు విఫలమయ్యాయనీ, కాబట్టి పరిష్కార విధా నంలో మార్పు అవసరమన్నారు. ఓ కేసులో అయితే 33 ఏళ్లయినా వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని చెప్పారు. కోర్టులు లేదా ట్రిబ్యునళ్లు నీటిని సృష్టించలేవనీ, అందరూ జల సంరక్షణపై దృష్టిపెట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోని జనాభాలో 18 శాతం మంది ఇండియాలోనే ఉన్నారనీ, కానీ ప్రపంచంలోని మంచి నీళ్లలో 4 శాతమే మన దేశంలో ఉండటంతో ఇది తీవ్ర సమస్యగా మారనుందని మంత్రి చెప్పారు. సభలో చర్చ సందర్భంగా కావేరీ జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ ఓం బిర్లా వారిని సముదాయించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రాలను సంప్రదించేలా ఈ బిల్లులో నిబంధనలు లేవనీ, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. బిల్లులో ఏముంది?: అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956ను సవరించేం దుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. వేర్వేరు ధర్మాసనాలతో ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడం, వివాదాలను పరిష్కరించేందుకు ఓ కాలపరిమితి విధించి, కచ్చితంగా ఆ సమయంలోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రత్యేకతలు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ట్రిబ్యునల్‌కు నేతృత్వం వహిస్తారు. అవసరమైనప్పుడు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తా రు. వివాదం పరిష్కారమయ్యాక అవి రద్దవుతాయి. గరిష్టంగా రెండేళ్లలోపు వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంటుంది. -
ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణల బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. ‘సమాచార హక్కు (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభ సోమవారమే ఆమోదించగా, తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఆ బిల్లు పార్లమెంటులో గట్టెక్కింది. అయితే ఈ బిల్లును క్షుణ్నంగా పరిశీలించేందుకు ఎంపిక కమిటీకి పంపాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు పట్టుబట్టడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు బిల్లును ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్ నిర్వహించగా, ఆ ఓటింగ్ సమయంలో తమకు అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా ఎంపీలను మంత్రులు, అధికార పార్టీ సభ్యులు భయపెట్టేందుకు ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేశ్, ఓటు రశీదులను తీసుకెళ్లి సభ్యుల చేత వాటిపై సంతకాలు చేయిస్తుండటం కనిపించడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. విపక్ష సభ్యులు సీఎం రమేశ్‌తో గొడవకు దిగి, ఆయన చేతుల్లో నుంచి ఆ రశీదులను లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లను ఎలా గెలిచిందో మనకు సభలోనే సాక్ష్యం కనిపిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సీఎం రమేశ్ చర్యను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులంతా వెల్‌లోకి వచ్చి ఆందోళనలు చేస్తూ నిరసన తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టంలో గతంలో ఉన్న లోటుపాట్లను తమ ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఆజాద్ మాట్లాడుతూ ‘మీరు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. మీ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి మేం బయటకు వెళ్లిపోతున్నాం’ అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ సమాచార కమిషనర్లు గతంలో ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా పలు తీర్పులు ఇచ్చినందున, ఇప్పుడు మోదీ సమాచార కమిషన్‌పై పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును, సభలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బయటకు వెళ్లిపోయాయి. అనంతరం ఓట్లు లెక్కపెట్టగా, బిల్లును ఎంపిక కమిటీకి పంపవద్దని 117 ఓట్లు, పంపాలని 75 ఓట్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో విపక్ష సభ్యులెవరూ సభలో లేకపోవడంతో సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలం, వేతనాలను కేంద్రమే నిర్ణయించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. -
ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల తీవ్ర అభ్యంతరాల నడుమ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)తోపాటు సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సమాచార కమిషనర్లుగా నియమితులైన వ్యక్తులు ఐదేళ్ల కాలం పాటు లేదా వారికి 65 ఏళ్ల వయసు నిండే వరకు (ఏది ముందైతే అది) ఆ పదవిలో ఉంటున్నారు. అలాగే ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)కు ఇస్తున్నంత వేతనమే సీఐసీకి, ఎన్నికల కమిషనర్లకు ఇస్తున్నంత వేతనమే సమాచార కమిషనర్లకు కూడా ఇస్తున్నారు. ఈ రెండు నిబంధనలను మార్చి, సీఐసీ సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా సవరణ బిల్లు ఉంది. దీంతో సమాచార హక్కు చట్టాన్నే నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తాము చెప్పిన మాట వినని సమాచార కమిషనర్లను వెంటనే సాగనంపేందుకు, సమాచార కమిషన్‌ను కూడా తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు, దాని స్వతంత్రతను దెబ్బతీసేందుకే కేంద్రం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చిందనీ, లేకపోతే ఇప్పుడు ఈ సవరణలతో పనేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల కారణంగా లోక్‌సభలో స్పీకర్ ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 218 మంది సభ్యులు అనుకూలంగా, 79 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అనంతరం విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజు వాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. మోదీ విద్యార్హతలు చెప్పమన్నందుకేనా? బిల్లుపై చర్చను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ వ్యవస్థను నీరుగార్చేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును తెచ్చిందనీ, కేంద్రం దీనిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఎలాంటి చర్చా జరగకుండానే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందనీ, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత వివరాలు చెప్పాల్సిందేనని గతంలో ఓ సమాచార కమిషనర్ పీఎంవోను ఆదేశించినందున, వారి అధికారాలకు కోత పెట్టేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారా అని శశిథరూర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎంలతోపాటు బిజూ జనతా దళ్ వంటి పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్‌సభలో తనకున్న 303 మంది ఎంపీల బలాన్ని చూసుకుని ఆర్టీఐ స్ఫూర్తినే కేంద్రం చంపేస్తోందని కార్తీ చిదంబరం అన్నారు. ఆర్టీఐ వ్యవస్థ కోరలు పీకి, సమాచార కమినర్లను తమ ఇళ్లలో పని వాళ్లలా మార్చుకోవాలని కేంద్రం చూస్తోందని డీఎంకే ఎంపీ ఎ.రాజా వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఇతర సమాచారం.. ► భారత వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు. ► అనేక బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజులపాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం జరిగే బీఏసీ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం రానున్న శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉంది. బిల్లుపై కేంద్రం మాట.. స్వతంత్ర భారతంలో అత్యంత విజయవంతమైన చట్టాల్లో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ఒకటి. తమకు అవసరమైన సమాచారం కోసం ప్రభుత్వాధికారుల్ని ప్రశ్నించగలిగే అధికారాన్ని ఈ చట్టం సామాన్యులకు ఇస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ఏడాదికి దాదాపు 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం తెచ్చిన సవరణలతో ఆర్టీఐ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పోయి, అది నిర్వీర్యం అవుతుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి కేంద్రం సమాధానం చెబుతూ విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తామేమీ చేయడం లేదనీ, కేవలం ఆ చట్టంలోని కొన్ని లోటుపాట్లను మాత్రమే సరిచేస్తున్నామంటోంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్ధ కాగా, ఆర్టీఐ వ్యవస్థ శాసనం ద్వారా ఏర్పాటైంది. అయితే వేతనాలు మాత్రం ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషనర్లకు ఒకేలా ఉండటంతో దానిని తాము హేతుబద్ధీకరిస్తున్నామని అంటోంది. అలాగే ప్రస్తుతం కేంద్ర సీఐసీకి సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన హోదా ఇస్తున్నప్పటికీ, సీఐసీ ఇచ్చిన తీర్పులను హైకోర్టులో సవాలు చేసే వీలు ఉండటం సమంజసంగా లేదనీ, ఇలాంటి లోటుపాట్లను సవరించడమే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం వివరిస్తోంది. -
ఆర్టీఐ సవరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ : సమాచార హక్కు (ఆర్టీఐ) సవరణ బిల్లు తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది. ఆర్టీఐని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం సవరణ బిల్లును ప్రతిపాదించిందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ బిల్లును ఆర్టీఐ నిర్మూలన బిల్లుగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ఈ బిల్లును తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని డిమాండ్ చేశాయి. ఈ బిల్లును ప్రభుత్వానికి తగినంత సంఖ్యా బలం లేని రాజ్యసభలో అడ్డుకునే అవకాశం ఉంటుందని విపక్షాలు ఆశిస్తున్నాయి. రాష్ట్ర, కేంద్రస్ధాయిలో సమాచార కమిషనర్ల వేతనాలు, కాలపరిమితికి సంబంధించిన సవరణలకు బిల్లులో చోటుకల్పించారు. ఎన్నికల కమిషన్ అధికారుల స్ధాయిలో వారికి వేతనాలు ఇవ్వచూపడం, కాలపరిమితి వంటి అంశాలను ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా సవరణ బిల్లులో పొందుపరిచారు. ఆర్టీఐ చట్టంలో ప్రస్తుతం వీటికి సంబంధించిన నిబంధనల ప్రస్తావన లేదు. కాగా ఆర్టీఐ కమిషనర్ల విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా సవరణలు చేశారని విపక్షం ఆరోపించింది. ఆర్టీఐ చట్టాన్ని నీరుగార్చేలా ఈ నిబంధనలు ఉన్నాయని కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రమాదానికి కారణమైన వాహన యజమాని నుంచి బాధితులకు ఈ మొత్తాన్ని ఇప్పిస్తారు. ఈ బిల్లుకు గత లోక్‌సభలోనే ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందక గడువు చెల్లిపోయింది. దీంతో మళ్లీ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం అందించే మంచి వ్యక్తులకు ఇబ్బందులు లేకుండా చూడటం తదితర కొత్త నిబంధనలను బిల్లులో కేంద్రం చేర్చింది. ఈ బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలిగిస్తోందని తృణమూల్ ఎంపీలు ఆరోపించారు. కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్చౌధురీ ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లులోని నిబంధనలను అమలు చేయాలో లేదో పూర్తిగా రాష్ట్రాల ఇష్టమనీ, అయితే మరిన్ని ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు అందరూ ఆమోదం తెలపాలని రవాణా మంత్రి గడ్కరీ కోరారు. -
ఎన్ఐఏకి కోరలు
న్యూఢిల్లీ: భారతీయులు లేదా భారత దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అధికారాలిచ్చేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. విదేశాలకు సంబంధించిన కేసుల విచారణను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పర్యవేక్షిస్తుంది. సైబర్ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్లను వ్యాప్తిచేయటం, నిషేధిత ఆయుధాల తయారీ, వాటి అమ్మకం కేసులపై విచారించేందుకు కూడా ఎన్ఐఏకి ఈ బిల్లు అధికారం ఇస్తోంది. ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే అధికారం కూడా ఎన్ఐఏకు ఉంటుంది. 2008లో ముంబైలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి 166 మందిని చంపేసిన అనంతరం, 2009లో ఉగ్రవాద కేసుల విచారణకు ప్రత్యేకంగా ఎన్ఐఏను ఏర్పాటు చేశారు. కొత్త సవాళ్లను పరిష్కరించేందుకు ఎన్ఐఏకు మరిన్ని అధికారాలు అవసరమని 2017 నుంచీ హోం శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ‘జాతీయ దర్యాప్తు సంస్థ (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అది ఆమోదం పొందింది. ఎన్ఐఏ చట్టాన్ని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయదని అమిత్ అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతం చేయడమేననీ, దీనికి మతంతో సంబంధం లేదనీ, ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా తాము వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపేలా పార్లమెంటు అంతా ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని అమిత్ షా కోరారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదనీ, ఇప్పుడు వారి తప్పులను తాము సరిచేస్తున్నామని అన్నారు. బిల్లుకు 278 మంది సభ్యులు మద్దతు తెలపగా, ఆరుగురు మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ఓ కేసు విచారణ సందర్భంగా ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను గతంలో బెదిరించాడని అన్నారు . ఆ మాటకు హైదరాబాద్ ఎంపీ ఒవైసీ అభ్యంతరం తెలుపుతూ ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్ షా కలగజేసుకుంటూ ప్రతిపక్షం వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ వాళ్లు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ, తనవైపు వేలు చూపించవద్దని అమిత్ షాకు చెప్పారు. తననెవరూ భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టడానికి ప్రయత్నించడం లేదనీ, ఒవైసీ మనసులో భయం ఉంటే తానేమీ చేయలేనని అన్నారు. ఈ మాటల అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభకు అద్దెగర్భం బిల్లు అద్దె గర్భం (సరోగసీ) విధానాన్ని వ్యాపారంగా వాడుకోకుండా చూసేందుకు పలు నిబంధనలతో కూడిన ‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు–2019’ని కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కూడా గతేడాది డిసెంబర్లోనే లోక్‌సభ ఆమోదించినప్పటికీ పార్లమెంటు దీనికి పచ్చజెండా ఊపకపోవడంతో గడువు చెల్లింది. దీంతో ఈ బిల్లును మళ్లీ కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం కనీసం ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యి, ఇంకా పిల్లలు పుట్టని దంపతులకు మాత్రమే అద్దె గర్భం ద్వారా బిడ్డను కనే అవకాశం కల్పిస్తారు. అలా పుట్టిన బిడ్డను వారు మళ్లీ ఏ కారణం చేతనైనా వదిలేయకూడదు. దంపతుల్లో భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య, భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక మహిళ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దంపతులకు తన గర్భాన్ని అద్దెకివ్వవచ్చు. ఆమె కచ్చితంగా పిల్లలు లేని దంపతులకు దగ్గరి బంధువై ఉండాలి. ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యి, పిల్లలు ఉండాలి. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇప్పటివరకు అద్దెగర్భం విధానానికి సంబంధించి ఇండియాలో చట్టం ఏదీ లేదు. దీంతో విదేశీయులు ఇక్కడకు వచ్చి, మన దేశంలోని మహిళల ద్వారా ఈ విధానంలో బిడ్డలను కంటూ ఆ మహిళకు సరైన పరిహారం ఇవ్వడం లేదు. అలాంటి మహిళలు ఇకపై దోపిడీకి గురవకుండా ఉండటం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. -
గుర్తింపు ధ్రువీకరణగా ఆధార్
న్యూఢిల్లీ: ఆధార్ సంఖ్యను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆధార్ చట్టాన్ని ప్రతిపాదించిన తాజా సవరణల ప్రకారం బ్యాంకు అకౌంట్లు ప్రారంభించేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్ పొందేందుకు ఆధార్‌ను వాడుకోవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేందుకు ఇందులో వీలు కల్పించారు. ఆధార్ చట్టం–2016 సవరణ బిల్లు ఉభయసభల ఆమోదం పొందితే ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో చట్టంగా అమల్లోకి వస్తుంది. లోక్‌సభలో చర్చ సందర్భంగా బిల్లులోని అంశాలపై ఆర్ఎస్పీ సభ్యుడు ప్రేమ్‌చంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత అంశాలు సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఆధార్ డేటాను అప్పగించడం ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనన్నారు. దీనిపై సమాచార, సాంకేతిక శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ‘ప్రతిపాదిత అంశాలన్నీ సుప్రీకోర్టు ఆదేశాలకు లోబడే ఉన్నాయి’అని తెలిపారు. ఆధార్ నిబంధనలు ఉల్లంఘించినా, దుర్వినియోగపరిచినా రూ.కోటి వరకు జరిమానా విధించేలా ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యను రహస్యంగా ఉంచే వర్చువల్ గుర్తింపు సంఖ్యను ఉపయోగించేందుకు ఇందులో ప్రతిపాదించింది. ఆధార్ డేటాను తస్కరించిన సంస్థలకు శిక్షను 10 ఏళ్లకు పెంచింది. జీరో అవర్ అంశాలపై.. జీరో అవర్‌తోపాటు ప్రత్యేక ప్రస్తావనాంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేకుంటే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మంత్రులకు సూచించారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. -
ఆధార్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు పొందేందుకు ఆధార్‌ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చిలో విడుదల చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ఈ సవరణ బిల్లును 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన వారు బయోమెట్రిక్ గుర్తింపు విధానం నుంచి బయటికి వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. రాష్ట్రంలో 2018 జూన్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామంటూ ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ఇదే ఆఖరి పొడిగింపు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత గడువు జూలై 2వ తేదీతో ముగియనుండగా తాజా పొడిగింపు జూలై 3వ తేదీ నుంచి అమలు కానుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ట్రిపుల్ తలాక్ విధానంపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 16వ లోక్‌సభ రద్దు కావడంతో రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు కాలపరిమితి తీరింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు రూపొందించింది. ట్రస్టులకు ప్రత్యేక ఆర్థిక మండలా(ఎస్ఈజెడ్)లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఎస్ఈజెడ్ సవరణ బిల్లుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
‘న్యాయ్’కు నిధులు దొంగ వ్యాపారుల నుంచే..
బొకాఖత్/లఖింపూర్(అస్సాం): ‘న్యాయ్’పథకానికి అవసరమైన నిధులను ప్రధాని మోదీకి సన్నిహితులైన దొంగ వ్యాపారవేత్తల నుంచి రాబడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. బుధవారం ఆయన అస్సాంలోని బొకాఖత్, లఖింపూర్ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘ప్రజల అకౌంట్లలో డబ్బు జమ చేస్తామంటూ మోదీ ఇచ్చిన హామీ ..అంబానీల వంటి కొందరు ధనిక వ్యాపారవేత్తలకే మేలు చేశారు. గత నాలుగేళ్లుగా ప్రధాని మోదీ ద్వారా పొందిన అనిల్ అంబానీ వంటి దొంగ వ్యాపారవేత్తల నుంచి న్యాయ్ పథకానికి కావాల్సిన నిధులను రాబడతాం. పేదలు ముఖ్యంగా మహిళల అకౌంట్లలో జమ చేస్తాం’అని అన్నారు. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి రూ.15 లక్షలు చొప్పున ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనంటూ హత్యా నేరంలో నిందితుడైన బీజేపీ చీఫ్ అమిత్‌షాయే కొట్టిపారేశారని పేర్కొన్నారు. ధనికులకు మాత్రమే వాచ్మెన్(చౌకీదార్లు) ఉంటారనీ, వారికి మాత్రమే ప్రధాని కాపలాదారు అయ్యారని ఎద్దేవా చేశారు. ‘బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగిత తీవ్రంగా పెరిగిపోయింది. వివాదాస్పద పౌరత్వ సవరణ బిల్లును అమల్లోకి రాకుండా చేస్తాం. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించి, ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తాం. మోదీ, బీజేపీ వణికిపోతున్నారు కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకాన్ని(న్యాయ్) చూసి మోదీ, బీజేపీ వణికిపోతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నిరాశ, నిస్పృహకు గురయ్యారన్నారు. ‘న్యాయ్’ను కాంగ్రెస్ పార్టీ ‘మాగ్నాకార్టా’గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అన్నివర్గాలు స్వాగతించాయన్నారు. ఎన్నికల్లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నేతలు ఇతర పార్టీలు ఇచ్చే హామీలపై విమర్శలు చేసే నైతిక హక్కును కోల్పోతారని స్పష్టం చేశారు. నేడు వయనాడ్‌లో నామినేషన్ కోజికోడ్: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గురువారం నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు కోజికోడ్ నుంచి హెలికాప్టర్లో వయనాడ్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారని, ఆయన వెంట సోదరి ప్రియాంకగాంధీ ఉంటారని సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ చెప్పారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు రాహుల్ కోజికోడ్‌కు చేరుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ కలుపుకుపోతుందనే భరోసా ప్రజల్లో కల్పించేందుకే వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు రాహుల్ ప్రకటించారు. -
పౌరసత్వ బిల్లుపై భగ్గుమన్న ఈశాన్యం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు 2016ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెడుతుండటంతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించేలా చేపట్టిన ఈ సవరణ బిల్లును అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీకి చెందిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌లు సైతం బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2014, డిసెంబర్ 31లోగా భారత్‌లో ప్రవేశించిన పొరుగు దేశాలకు చెందిన ముస్లింలు కాకుండా హిందువులు, పార్శీలు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, జైన్లకు భారత పౌరసత్వం ఇచ్చేలా ఈ బిల్లును సవరించారు. వలసదారుల పట్ల వివక్ష తగదని, దేశంలోకి తరలిచ్చిన ప్రతిఒక్కరికీ వారి మతంతో సంబంధం లేకుండా పౌరసత్వ హక్కు కల్పించాలని ఈశాన్య రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి 1971 మార్చి తర్వాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందూ వలసదారులకు పౌరసత్వం కల్పించేలా రూపొందిన ఈ బిల్లు 1985 అసోం ఒప్పందానికి విరుద్ధమని నిరసనకారులు పేర్కొంటున్నారు. కాగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ భారతరత్నను వెనక్కిఇవ్వాలని అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా కుటుంబం యోచిస్తోంది. మరోవైపు పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఇటీవల ప్రధాని మోదీ గౌహతి పర్యటనలో నిరసనకారులు నల్లజెండాలు ప్రదర్శించారు. -
పైరసీ చేస్తే మూడేళ్ల జైలు
చలనచిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారింది పైరసీ భూతం. ఇకపై సినిమాకి చెందిన సంబంధిత వ్యక్తుల అనుమతులు లేకుండా సినిమాను కాపీ చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా సినిమాటోగ్రఫీ 1952 సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం సరైన అనుమతులు లేకుండా ౖపైరసీ చర్యలకు పాల్పడిన వ్యక్తులు మూడేళ్ల కారాగార శిక్ష లేదా పది లక్షల రూపాయల జరిమానా కట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఆ రెండిటికీ శిక్షార్హులవుతారు. కేంద్రప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ సవరణ బిల్లు గురించి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘మన దేశంలోని మేధావుల సంపత్తిని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన ముందడుగు’’ అని ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ప్రెసిడెంట్ సిద్ధార్థ్‌రాయ్ కపూర్ అన్నారు. -
కుష్టు ఉందని విడాకులు కుదరదు
న్యూఢిల్లీ: విడాకులు తీసుకోవాలనుకునే భార్య/భర్త తమ జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపడం కుదరదు. ఈ మేరకు చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ‘జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపి ఇకపై విడాకులు పొందేందుకు వీలుండదు. కుష్టు నయం కాదని ఇదివరకు అందరూ భావించేవారు. కానీ, ఈ వ్యాధికి చికిత్స ఉంది’ అని వ్యక్తిగత చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌధరి అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులపై వివక్షను చూపుతున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వివాహ చట్టాల్లో ఈ మేరకు ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ చర్చలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. దేశంలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించలేదు. ప్రభుత్వం ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో జోక్యం చేసుకోవద్దు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కుష్టు వ్యాధిని కారణంగా చూపి విడాకులు తీసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది’ అని చెప్పారు. -
‘ఎస్సీ, ఎస్టీల బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: దళితులపై వేధింపులను నిరోధించే బిల్లులో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6న ఈ బిల్లు లోక్‌సభలో గట్టెక్కగా, గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపింది. కోర్టు ఆదేశించినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా, ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదుచేసేలా నిబంధనలను తిరిగి చేర్చారు. నిందితులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఈ చట్టంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. -
ఎస్సీ, ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల(అత్యాచారాల నిరోధక) సవరణ బిల్లు–2018ను సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీంకోర్టు విధించిన నియంత్రణల కారణంగా ఆర్టికల్–18 ప్రాముఖ్యత కోల్పోయిందని మంత్రి గెహ్లాట్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ ఆలస్యం దళితుల్లో అసహనం పెరిగిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం ఆర్టికల్–18కి సవరణలు చేపట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందనే సాకుతో 88శాతం మంది దళితులను ఇబ్బందులు పడనివ్వబోమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్‌ను ఏ కోర్టూ ఇవ్వరాదనే నిబంధనను బిల్లులో చేర్చారు. క్రిమినల్ కేసు నమోదు చేయకున్నా, ఎవరి అనుమతి తీసుకోకుండానే అరెస్టులు చేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. -
‘ఓబీసీ కమిషన్’కు రాజ్యాంగ హోదా!
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ)కి రాజ్యాంగబద్ధత కల్పించే కీలక బిల్లును లోక్‌సభ ఆమోదించింది. గురువారం∙చర్చ తర్వాత మూడింట రెండింతలకు పైగా సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. రాజ్యసభ ప్రతిపాదించిన కొన్ని సవరణలను లోక్‌సభ తోసిపుచ్చింది. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు కృషిచేసిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రి గెహ్లాట్‌ను ప్రధాని అభినందించారు. 123వ రాజ్యాంగ సవరణ పేరిట తెచ్చిన తాజా బిల్లుపై చర్చ సందర్భంగా ఓబీసీల సంఖ్యను తేల్చడానికి జనాభా లెక్కలు నిర్వహించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. 2014 నాటి సామాజిక, ఆర్థిక సర్వే వివరాలను బహిర్గతం చేయాలని మరికొందరు కోరారు. ఎన్సీబీసీ సభ్యుల్లో ఒకరు మహిళ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. సొంత ఓబీసీ జాబితా రూపొందించుకుని, దానిలో ఏ కులాన్నైనా చేర్చుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని చెప్పారు. కేంద్ర జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలనుకుంటే కేంద్రాన్ని సంప్రదించాలని గెహ్లాట్ సూచించారు. ఈ బిల్లుకు గతేడాది ఏప్రిల్ 10న లోక్‌సభ ఆమోదం తెలిపి రాజ్యసభకు పంపింది. ప్రతిపక్షాలు సూచించిన కొన్ని సవరణలను చేర్చి అదే ఏడాది జూలై 31న ఆమోదించిన బిల్లును ఎగువ సభ మళ్లీ లోక్‌సభకు పంపింది. ఆ సవరణలను తోసిపుచ్చుతూ తాజాగా లోక్‌సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ల మాదిరిగా ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించాలని ప్రతిపాదించారు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన రక్షణల అమలును ఎన్సీబీసీ చూస్తుంది. హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల విచారణ సమయంలో సివిల్ కోర్టులకుండే అధికారాలుంటాయి. -
దళితుల చట్టానికి కోరలు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న భారత్ బంద్ పాటించాలని దళిత సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి చేరువయ్యేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తాజా బిల్లులోని ముఖ్యాంశాలు..ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దాష్టీకాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చే నిబంధన తొలగింపు. కేసు నమోదుకు ప్రాథమిక విచారణ అక్కర్లేదు. నిందితుల అరెస్ట్‌కు ఎలాంటి అనుమతులు తీసుకోనవసరంలేదు. నిందితులకు పలు రక్షణలు కల్పిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న చట్టంలో మార్పులు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దుచేస్తూ పాత నిబంధనలను పునరుద్ధరించాలని దళితులు కోరుతున్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో చట్టం బలహీనమైందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోని కొన్ని మిత్ర పక్షాలు కూడా ప్రభుత్వ ఉదాసీన వైఖరిని వ్యతిరేకించాయి. ఈ ఏడాది చివరన జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం పాత నిబంధనలను పునరుద్ధరించింది. కేబినెట్ నిర్ణయంపై కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. బంద్ పాటించాలనుకున్న ఆగస్టు 9న వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. అవసరమైతే ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామని ప్రధాని మోదీ చెప్పినట్లు పాశ్వాన్ వెల్లడించారు. ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు తాజా బిల్లు చెంపపెట్టు అని అన్నారు. కుష్టు ఉందని విడాకులు ఇవ్వలేరు.. కుష్టు వ్యాధి సోకిందని భాగస్వామికి విడాకులు ఇవ్వడం ఇకపై కుదరదు. ఇందుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. కుష్టు నయంకాని వ్యాధి అని భావిస్తున్న సమయంలో తీసుకొచ్చిన చట్టంలో ఆ వ్యాధితో బాధపడుతున్న జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వొచ్చని ఉందని కేంద్ర న్యాయశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘అధునాతన చికిత్సతో ఇప్పుడు కుష్టును పూర్తిగా నివారించడం సాధ్యమే. అందువల్ల విడాకులకు కుష్టును ఒక కారణంగా చూపుతున్న సదరు చట్టంలోని నిబంధనను కొనసాగించడం సమర్థనీయం కాదు’ అని న్యాయశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
ఆర్టీఐ సవరణ బిల్లుపై సీఐసీ అసంతృప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)–2005లో తీసుకురావాలని సంకల్పించిన సవరణలపై కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపర్చేలా ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుపై చర్చించేందుకు అందరు కమిషనర్లతో వెంటనే సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు అత్యంత సీనియర్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్‌కు లేఖ రాశారు. ఈ వివాదాస్పద బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని కమిషనర్లందరికీ లేఖలో విజ్ఞప్తి చేశారు. కొత్త సవరణ బిల్లుతో సమాచార హక్కు చట్టం మౌలిక ఉద్దేశం దెబ్బతింటుందని శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
విదేశీ విరాళాలపై సవరణకు ఓకే
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల విదేశీ విరాళాలపై తనిఖీ అవసరం లేదన్న సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. 21 సవరణలతో కూడిన 2018 ఆర్థిక బిల్లును విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ బుధవారం చర్చ లేకుండానే ఆమోదించింది. వాటిలో విదేశీ సంస్థల నుంచి పార్టీలు విరాళాలు స్వీకరించడాన్ని నిషేధిస్తూ చేసిన విదేశీ విరాళాల నియంత్రణ చట్ట (ఎఫ్సీఆర్ఏ) సవరణ కూడా ఒకటి. 1976 నుంచి పార్టీలు విదేశాల నుంచి పొందిన నిధులపై ఎలాంటి సమీక్ష, తనిఖీ ఉండకూడదనేది ఈ సవరణ ఉద్దేశం. పార్టీలు విదేశీ విరాళాలు స్వీకరించడాన్ని సులభతరం చేస్తూ బీజేపీ ప్రభుత్వం 2016 ఆర్థిక బిల్లు ద్వారా ఎఫ్సీఆర్ఏ చట్టానికి సవరణ చేసింది. ప్రస్తుతం దానికి కొనసాగింపుగా 1976 నుంచి పొందిన విరాళాలకు తనిఖీ అవసరం లేదంటూ మరో సవరణ చేసింది. ‘2016 ఆర్థిక చట్టంలోని సెక్షన్ 236 తొలి పేరాలో ఉన్న 26 సెప్టెంబర్ 2010కు బదులుగా 5 ఆగస్టు 1976ని మార్చాం’అని లోక్‌సభ వెబ్సైట్ పేర్కొంది. ఈ సవరణ ఎఫ్సీఆర్ఏ ఉల్లంఘన కేసులో దోషులంటూ 2014 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో వేసిన అప్పీళ్లను ఉపసంహరించుకున్నాయి. -
గ్రాట్యుటీ పన్ను మినహాయింపు రూ. 20 లక్షలు!
న్యూఢిల్లీ: రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఇచ్చే గ్రాట్యుటీ చెల్లింపు సవరణ బిల్లు–2017ను వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదించే అవకాశాలున్నాయి. దీని ప్రకారం.. 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒక సంస్థలో పనిచేసి రిటైరయ్యే లేదా వైదొలిగే వారు పొందే గ్రాట్యుటీపై రూ.20లక్షల వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పది అంతకంటే ఎక్కువ మంది పనిచేసే ఫ్యాక్టరీలు, గనులు, చమురు క్షేత్రాలు, ప్లాంటేషన్లు, నౌకాశ్రయాలు, రైల్వే కంపెనీలు, దుకాణాలు తదితర వ్యవస్థీకృత రంగ సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఈ బిల్లు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం కూడా పొందింది. మహిళలకు మాతృత్వ సెలవులను పొడిగించే మెటర్నిటీ బెనిఫిట్ సవరణ బిల్లు–2017ను ఈ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల్లోనే వేతన కోడ్ బిల్లు బడ్జెట్ సమావేశాల్లో వేతన కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం కనీస వేతన పరిమితి అమల్లోకి వస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే తక్కువ వేతనం నిర్ణయించకూడదు. -
పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్!
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు అంశంలో బీజేపీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విపక్షాల డిమాండ్‌కు తలొగ్గి పార్లమెంట్ కమిటీకి(సెలక్ట్) సమీక్ష కోసం పంపేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. అవి చేసే సూచనలు, ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణించాల్సి ఉంటుంది. అదే జరిగితే వచ్చే పార్లమెంట్ సెషన్స్‌లోనే బిల్లు మళ్లీ చర్చకు వచ్చే అవకాశాలున్నాయి . కాగా, లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు స్పష్టమైన మెజార్టీతో ఆమోదం పొందగా, రాజ్యసభలోనే కాంగ్రెస్ పార్టీ, విపక్షాల నినాదాలతో చర్చకు కూడా నోచుకోకుండానే పోయింది. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ కీలకనేతలు కాంగ్రెస్ పార్టీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాగా, సుప్రీంకోర్టు తీర్పు అనుసారంగా ట్రిపుల్ తలాక్ బిల్లు లేదని, అందులో చాలా లోటుపాట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. రాజ్యసభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవటం, దీనికితోడు అన్నాడీఎంకే, బిజ్జూ జనతా దళ్ సెలక్ట్ కమిటీకి పంపాల్సిందేనని కోరటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
నిన్న కఠిన చట్టం.. నేడు మరో ట్రిపుల్ తలాక్
లక్నో : ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం ముద్ర వేయించుకున్న మరుసటి రోజే ఉత్తర ప్రదేశ్‌లో మరో వ్యవహారం వెలుగు చూసింది. మొరానాబాద్కు చెందిన వరిషా.. తన భర్త తనకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చాడని చెబుతున్నారు. ఈ ఉదయం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... ‘‘నా భర్త కట్నం కోసం గత కొంత కాలంగా హింసిస్తున్నాడు. 10 లక్షల రూపాయలు లేదా కారు ఏదో ఒకటి ఇస్తేనే ఇంట్లో ఉండాలని.. లేకపోతే బయటకు వెళ్లిపోవాలని చెప్పాడు. ఆ వెంటనే ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చానన్నాడు’’ అని వరిషా చెప్పారు. అయితే ఈ అంశంపై ఆమె భర్త, పోలీసులు స్పందించాల్సి ఉంది. కాగా, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. అయితే ప్రస్తుతం అది రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. Moradabad: Woman named Varishaa says, 'my husband gave me #TripleTalaq over dowry, he told me either get a car or Rs.10 lakh cash, if you can't I will leave you.' pic.twitter.com/zKABVylADq — ANI UP (@ANINewsUP) December 29, 2017 మిగిలిన మతాల్లో లేరా: ఒవైసీ -
ట్రిపుల్ తలాక్ బిల్లు.. ఒవైసీ అడ్డుపుల్ల
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌ను నేరంగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లు నేడు లోక్‌సభ ముందుకు రానుంది. అయితే ఇది విరుద్ధమంటూ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉదయం ఓ నోటీసును అందించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు 72వ నిబంధన ప్రకారం నోటీసు అందజేసినట్లు ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే దానిపై చర్చకు అంగీకరిస్తారా? అన్నది చూడాలి. ‘‘ముస్లిం మహిళలను రక్షించేందుకు రూపొందించిన బిల్లు అని కేంద్రం చెబుతోంది. తద్వారా ముస్లింలను దోషిగా చూపించి రెచ్చగొట్టే విధంగా కేంద్రం చేష్టలు ఉన్నాయని స్పష్టమౌతోంది’’ అని ఆయన చెబుతున్నారు. కావాలంటే ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డుతో సంప్రదించి, వారి సూచనల ప్రకారం చట్టాన్ని రూపొందించాలని అసదుద్దీన్ గతంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఓ లేఖ రాశారు. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు నేపథ్యంలో లోక్‌సభకు ఇవాళ, రేపు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయ్యింది. ముస్లిం మహిళా (వివాహ రక్షణ హక్కులు) బిల్లు-2017కు హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని బృందం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. ఇంకోపక్క బిల్లును రూపొందించడంలో సరైన పద్ధతిని అవలంబించలేదని కేంద్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
పన్ను సంస్కరణలకు అమెరికా సెనెట్ ఓకే
వాషింగ్టన్: అమెరికా పన్ను వ్యవస్థ సమగ్ర ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పన్ను సవరణ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 51–48 ఓట్ల తేడాతో ఈ బిల్లు గట్టెక్కింది. వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలకు భారీగా పన్ను ఉపశమనం కలిగించనున్న ఈ బిల్లు ఇప్పటికే ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. ప్రత్యేక సందర్భాల్లో కార్పొరేట్లకు శాశ్వతంగా పన్ను విరామాలు, వ్యక్తులకు తాత్కాలికంగా పన్ను కోతలను ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీని వల్ల రాబోయే పదేళ్లలో దేశ ఆర్థిక లోటు 1.5 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనావేస్తున్నారు. విధానపర ప్రక్రియపై కాంగ్రెస్‌లో చివరిసారి చర్చ జరిగిన తరువాత బిల్లు శ్వేతసౌధం చేరుతుంది. అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తరువాత చట్టరూపం దాల్చుతుంది. క్రిస్మస్ సందర్భం గా ప్రజలకు తీపికబురు అందిస్తానని ట్రంప్ ఇది వరకే ప్రకటించిన నేపథ్యంలో రేపోమాపో ఈ శుభవార్త అధికారికంగా వెలువడనుంది. అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ఏడాది చట్టసభల్లో సాధించిన అతిపెద్ద విజయం ఇదే కానుంది. -
కట్టుతప్పితే కఠిన చర్యలే ఇక!
న్యూఢిల్లీ: కార్పొరేట్ పరిపాలనా ప్రమాణాలను పటిష్టపరచడం, రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడం, దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం వంటి లక్ష్యాలుగా కేంద్రం రూపొందించిన కంపెనీల చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. వర్షకాల సమావేశాల్లో ఇదే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించినందున చట్టరూపం దాల్చనుంది. గత యూపీఏ సర్కారు తీసుకొచ్చిన కంపెనీల చట్టం, 2013లో మోదీ సర్కారు దాదాపు 40కు పైగా సవరణలను ప్రతిపాదించింది. ఇదే చట్టంలో మోదీ సర్కారు లోగడ కూడా ఓ సారి సవరణలు చేయడం గమనార్హం. బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి సమాధానం ఇచ్చారు. తాజా సవరణలతో దేశంలో కార్పొరేట్ పరిపాలన మెరుగ్గా మారుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ప్రక్రియలు, నిబంధనల అమలు సులభంగా మారుతుందన్నారు. కంపెనీలు తమ లాభాల్లోంచి నిర్ణీత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించాలన్న నిబంధనలు (సీఎస్ఆర్) పాటించని కంపెనీలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు చెప్పారు. -
భూ సేకరణ బిల్లుకు ఆమోదం
-
భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం
-
భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలిలలో భూసేకరణ చట్టసవరణ బిల్లు ఆమోదం పొందింది. శాసనసభలో విపక్షాల ఆందోళనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే కేవలం పది నిమిషాల్లో చట్ట సవరణ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక శాసనమండలి మూడు నిమిషాల్లోనే ముగిసింది. ఆదివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే.. సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో రైతు సమస్యలపై చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. స్పీకర్ పోడియం వద్ద కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేవారు. కీలకమైన బిల్లు విషయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వాయిదా అనంతరం కూడా కాంగ్రెస్ సభ్యులు సభలోనే ఉండి నిరసన కొనసాగించారు. -
ఆ బిల్లుతో విద్యుత్ రంగం వినాశనం
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు గుంటూరు వెస్ట్: విద్యుత్‌రంగాన్ని నాశనం చేసే విద్యుత్ సవరణ బిల్లు –2015ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగ, కార్మికుల రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సవరణల వల్ల రూ.3 లక్షల కోట్లు విలువైన ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు ఉపయోగించుకుని ప్రైవేటు వ్యక్తులు లాభాలు గడించడానికి ఉపయోగపడనున్నాయని చెప్పారు. దీనివల్ల పంపిణీ సంస్థలు దివాలా తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు ఏ విధమైన సౌకర్యాలు లేవని, జీతభత్యాలు కూడా ఇతర విభాగాలలోని కాంట్రాక్టు కార్మికుల కన్నా తక్కువగా ఇస్తున్నారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
సవరణ బిల్లు తీసుకురండి
హైకోర్టు విభజనపై కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ * ఏపీ న్యాయమూర్తులను తెలంగాణకు పంపారు * సమస్య పరిష్కరించకుంటే పార్లమెంటులో ఆందోళన తప్పదు * కేంద్ర మంత్రులతో భేటీ.. వివాదాన్ని పరిష్కరించాలని విన్నపం సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై కేంద్రం సవరణ బిల్లు తేవాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఎక్కడ పనిచేస్తున్న న్యాయాధికారులు అక్కడే ఉండాలంటూ అపాయింటెడ్ డే కంటే రెండ్రోజుల ముందు డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను కాదని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ న్యాయాధికారుల కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మంగళవారం టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, ఎ.పి.జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితర ఎంపీలంతా తెలంగాణ న్యాయవాదులతో వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, డీవోపీటీ మంత్రి జితేంద్రసింగ్, న్యాయమంత్రి సదానందగౌడలను కలిశారు. తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలను వివరించారు. తక్షణం హైకోర్టు విభజన జరగాలని, న్యాయాధికారుల కేటాయింపులపై జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలుత కె.కేశవరావు మాట్లాడుతూ.. ‘‘సబార్డినేట్ జ్యుడీషియరీ సర్వీసులకు సంబంధించి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం చెప్పిందేమిటంటే... ఒక కమిటీ వేసి విభజన జరపాలని చెప్పింది. దాన్నే ప్రస్తావిస్తూనే అపాయింటెడ్ డే కంటే రెండ్రోజుల ముందు మార్గదర్శకాలు వెలువడ్డాయి. కేంద్రం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఏ రాష్ట్రంలో పనిచేసే న్యాయాధికారులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలని చెప్పారు. అయినా న్యాయాధికారుల కేటాయింపులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ పోస్టుల్లో బదిలీ చేసి పంపారు. ఆప్షన్ ఇవ్వొచ్చన్న సాకుతో ఇలా చేశారు. ముందుగా స్వస్థలం.. తర్వాత ఆప్షన్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలి. మీ ఖాళీల కంటే మీరు ఎక్కువగా ఉన్నప్పుడు.. సర్దుబాటు కానప్పుడు ఇక్కడ సర్దుబాటు చేయొచ్చు. కానీ అలా చేయకుండా తెలంగాణలో నింపేశారు. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇక్కడ న్యాయాధికారులుగా నియమితులైన వారు చివరకు హైకోర్టు న్యాయమూర్తులవుతారు. అంటే మరో ముఫ్పై ఏళ్ల వరకు తెలంగాణ హైకోర్టులో కూడా ఏపీ న్యాయమూర్తులే ఉంటారు. తెలంగాణ హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులు ఉండడానికి వీలు లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు’’ అని అన్నారు. ఈ అన్యాయంపై నిరసన వ్యక్తం చేసిన న్యాయాధికారులను సస్పెండ్ చేశారని, ఇది దేశంలోనే మొదటిసారని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ మంత్రులకు వివరించామని, వారికి మొత్తం విషయం అర్థమైందని పేర్కొన్నారు. న్యాయమంత్రి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అన్నారని, తమతో ఏకీభవించినట్టుగా కనిపించిందని చెప్పారు. న్యాయవాదులను రోడ్డెక్కిస్తున్నారు: ఎంపీ జితేందర్‌రెడ్డి మంచిగా విడిపోయాం. మనుషులుగా కలిసి ఉందాం. అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, మనోభావాలు రెచ్చగొడుతూ న్యాయవాదులను రోడ్డెక్కిస్తున్నారు. మాకు రావాల్సిన నీళ్లను అడ్డుకున్నారు. మా నియామకాలను అడ్డుకుంటున్నారు. ఏపీ అనవసరంగా లేనిపోని గొడవలు చేస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరించాం. మా హైకోర్టును మాకు అప్పగించాలని, న్యాయాధికారులను విభజించాలని కోరాం. రిజిస్ట్రార్ జనరల్ ఎలా నిర్ణయం తీసుకుంటారు: ఎంపీ వినోద్‌కుమార్ న్యాయాధికారులు తమ సంఘం ద్వారా హై కోర్టు చీఫ్ జస్టిస్‌కు విన్నవించుకున్నారు. చీఫ్ జస్టిస్ నాయకత్వాన కమిటీ వేశారు. ఆ కమిటీలో తేలలేదు. ఏపీలో పుట్టి అక్కడ ప్రాక్టీస్ చేసి న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారిని తెలంగాణకు కేటాయించడం సరికాదని ఆ కమిటీ అభిప్రాయపడ్డట్టు అర్థమవుతోంది. దీంతో చీఫ్ జస్టిస్ దీన్ని ఫుల్ కోర్టుకు రిఫర్ చేశారు. అక్కడ తెలంగాణ న్యాయమూర్తులు ముగ్గురు ఉంటే ఏపీకి చెందినవారు 18 మంది ఉన్నారు. వారంతా తెలంగాణ న్యాయాధికారుల కేటాయింపులపై ముందుకెళ్లారు. దీన్ని తప్పుపడుతూ న్యాయాధికారులు నిరసన తెలియజేస్తే చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సస్పెండ్ చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ కేటాయింపులపై నిర్ణయం ఎందు కు తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి. మిమ్మల్ని ఎవరు గైడ్‌లైన్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పారు? విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. కేంద్రం ఒక కమిటీ వేసి మార్గదర్శకాలు రూపొంది స్తుందని, అప్పుడు విభజన జరగాలని చెప్పిం ది. కానీ మీరు సొంతంగా ఎలా రూపొందిం చారు? ఏపీ విభజన చట్టం సెక్షన్ 31 సబ్‌క్లాజ్‌లో రెండేళ్లలో రాష్ట్రపతి హైకోర్టుపై నోటిఫై చేస్తారని చెప్పి ఉంటే అయిపోయేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సరికాదు. మోదీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ సబ్ క్లాజ్ చేర్చండి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే పార్లమెంటులో మా నిరసన తెలుపుతాం. నేడు హైకోర్టు బంద్‌కు పిలుపు టీఆర్ఎస్ ఎంపీల విలేకరుల సమావేశానికి ముందు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు, అడ్వొకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, జయాకర్ తదితరులు మాట్లాడారు. న్యాయవాదుల అరెస్టులు, న్యాయాధికారుల సస్పెన్షన్‌కు నిరసనగా బుధవారం హైకోర్టు బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయాలని కేంద్రానికి విన్నవించినట్టు తెలిపారు. -
ఫిరాయింపుల చట్ట సవరణకు సుముఖంగా ఉన్నాం
కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుల పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు సుముఖంగా ఉన్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. లా కమిషన్ ఈ దిశగా కొన్ని సిఫారసులు చేసిందని, వీటిని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదికను బట్టి ఫిరాయింపుల వ్యతిరేక చట్ట సవరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తన శాఖ రెండేళ్ల పనితీరుపై ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులు పెరుగుతున్నాయని, దీనిపై కేంద్రం వైఖరి ఏంటని ప్రశ్నించినప్పుడు న్యాయ మంత్రి ఈ సమాధానమిచ్చారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై ప్రశ్నించగా.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకు చెందుతుందని, ఏపీలో మౌలిక సదుపాయాల ఏర్పాటు జరిగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ అంశంలో తాను ఇంతకుమించి సమాధానం చెప్పలేనని స్పష్టంచేశారు. -
16 దాటితే.. ఇక పెద్దోళ్లే!
బాల నేరస్థులకు సంబంధించిన చట్టాన్ని లోక్‌సభ ఆమోదించింది. 16-18 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు దారుణమైన నేరాలకు పాల్పడినా కూడా వాళ్లను బాల నేరస్థులుగానే చూడాల్సి రావడం, దానివల్ల వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోవడం లాంటి ఘటనల నేపథ్యంలో కేంద్రం బాల నేరస్థుల చట్టం సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. సభ దాన్ని ఆమోదించింది. ఇక దీన్ని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలి. అలా అయితే ఇక మీదట చట్టాన్ని సవరించి, 16 ఏళ్లు దాటినవాళ్లంతా పెద్దవాళ్లేనని భావిస్తారు. ఇందులో సాధారణ నేరాలు, తీవ్రమైన నేరాలు, హేయమైన నేరాలు అనే మూడు విభాగాలుగా నేరాలను వర్గీకరించారు. ప్రతి విభాగానికి వేర్వేరుగా విధానాలను అందులో నిర్వచించారు. నిర్భయ ఘటనలో అందరికంటే ఘోరంగా ప్రవర్తించినది ఒక మైనర్ కావడంతో అప్పటి నుంచి బాల నేరస్థుల వయసు మీద చర్చలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 2000 నాటి బాల నేరస్థుల చట్టానికి దాదాపు 40 సవరణలు రాగా, అన్నింటినీ లోక్‌సభ ఆమోదించింది. 2013 సంవత్సరంలో మొత్తం 28 వేల కేసుల్లో బాల నేరస్థులు ఉండగా, వాటిలో 3887 అత్యంత హేయమైనవని జాతీయ నేర రికార్డుల బ్యూరో కూడా వెల్లడించిందని ఈ బిల్లు మీద జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. -
విభజన చట్టం సవరణకు పెద్దల సభ ఓకే
58కి పెరిగిన ఏపీ మండలి స్థానాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2015కు పెద్దల సభ పచ్చజెండా ఊపింది. ఫలితంగా ఏపీ శాసనమండలి స్థానాలు 50 నుంచి 58కి పెరగనున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయాలని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన రాజ్యసభ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై శుక్రవారం జరిగిన చర్చలో తొలుత కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ.. ‘ఉమ్మడి ఏపీలో ఉన్నవే 90. తెలంగాణలో మండలి ఏర్పడాలంటే కనీసం 40 స్థానాలుండాలి. అందుకే 40 కేటాయించారు. మిగిలిన 50 ఏపీకి కేటాయించా రు. మూడో వంతు వరకు పెంచుకోవచ్చు కాబట్టి ఇప్పుడు 58కి పెంచుతున్నారు. దీన్ని తప్పుబట్టడం సరికాదు’ అని అన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ అసెంబ్లీ సీట్లను కూడా 175 నుంచి 225కు పెంచాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రాంచంద్రరావు మాట్లాడుతూఏపీకి పోర్టులు, విమానాశ్రయాలు, నిధులివ్వాలని చేతులు జోడించి కోరుతున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘పోలవరం అంచనా వ్యయం రూ.16 వేల కోట్లు ఉంటే.. వీళ్లు రూ.100 కోట్లు ఇచ్చారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.2 వేల కోట్లయినా ఇవ్వాలి’ అని కోరారు. కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు సహా ఇతర హామీలను నెరవేర్చాలి. ప్రాణహితకు జాతీయ హోదా ప్రకటించాలి. తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ ‘ముంపు బాధిత మండలాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ, ఏపీ అసెంబ్లీల్లో స్థానాల సంఖ్య పెంచాలి’ అని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలూ కూర్చొని మాట్లాడుకోవాలి. సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. -
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారతీయ సంతతి ప్రజలు(పీఐఓ), విదేశాల్లోని భారతీయ పౌరులు(ఓసీఐ).. ఈ రెండు విభాగాలను విలీనం చేసేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్టం(సవరణ) బిల్లును.. జనవరి 6న కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో సభలో ప్రవేశపెట్టనున్నారు. 2022 సంవత్సరంలోగా అందరికీ ఇళ్లు లక్ష్యంతో రూపొందించిన జాతీయ పట్టణ గృహనిర్మాణ పథకంపై చర్చను కేబినెట్ ప్రస్తుతానికి వాయిదా వేసింది. అలాగే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగ పాఠాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ నినాదం స్ఫూర్తి ప్రతిబింబించేలా.. ఎన్డీయే ప్రభుత్వ పథకాలను, విధానాలను వివరిస్తూ సోమవారం(ఫిబ్రవరి 23న) రాష్ట్రపతి ప్రసంగం సాగేలా కేబినెట్ భేటీలో తుది మెరుగులు దిద్దారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులను, సభ ఆమోదం పొందాల్సి ఉన్న ఆర్డినెన్సులను కూడా రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు. -
నేడే సీబీఐ చీఫ్ ఎంపిక
ప్రధాని నేతృత్వంలో భేటీ కానున్న కమిటీ న్యూఢిల్లీ: సీబీఐ కొత్త చీఫ్‌ను ఎన్నుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ మంగళవారం సమావేశం కానుంది. సీబీఐ ప్రస్తుత డెరైక్టర్ రంజిత్‌సిన్హా మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. సీబీఐ డెరైక్టర్ నియామక కమిటీలో లోక్‌సభలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతను కూడా చేరుస్తూ రూపొందించిన సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించిన నేపథ్యంలో.. ఆ కమిటీలో లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గేకు కూడా స్థానం లభించింది. కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేదా ఆయన తరఫు ప్రతినిధి కూడా ఉంటారు. లోక్‌పాల్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి సీబీఐ డెరైక్టర్ నియామకం ఇదే. ప్రస్తుతం సీబీఐ చీఫ్ రేసులో రాజస్తాన్ డీజీపీ ఒమేంద్ర భరద్వాజ్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రకాశ్ మిశ్రాలు ముందంజలో ఉన్నారు. వీరిద్దరూ 1977 కేడర్ ఐపీఎస్ అధికారులు. అలాగే, కేరళ పోలీస్ చీఫ్, 1978 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం పేరు కూడా వినిపిస్తోంది. సీబీఐ డెరైక్టర్ నియామకానికి సంబంధించిన సవరణ బిల్లు(ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(అమెండ్మెంట్)బిల్, 2014)ను గతవారం పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ శనివారం ఆమోదం తెలిపారని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బిల్లులో చేర్చిన సవరణ ప్రకారం.. లోక్‌సభలో అధికారిక ప్రతిపక్ష నేత లేని పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు సాధించిన ప్రతిపక్ష నేతకు సీబీ ఐ డెరైక్టర్ ఎంపిక కమిటీలో స్థానం కల్పిస్తారు. -
సీబీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సవరణ బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును (ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ బిల్లు-2014) లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించడం తెలిసిందే. దీంతో ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినట్లు అయింది. సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నేత లేకుంటే విపక్షాల్లోని అతిపెద్ద పార్టీకి చెందిన నేతకు ఈ కమిటీలో చోటు కల్పించేలా ఈ బిల్లుతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అలాగే కమిటీలో ఏ ఒక్క సభ్యుడు లేకున్నా (కోరమ్ లేకుంటే) ఎంపిక ప్రక్రియ కొనసాగేలా మరో సవరణను బిల్లులో పొందుపరచింది.