సీబీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం | Parliament approved the bill in CBI | Sakshi
Sakshi News home page

సీబీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

Published Fri, Nov 28 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

Parliament approved the bill in CBI

న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సవరణ బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును (ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట సవరణ బిల్లు-2014) లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించడం తెలిసిందే. దీంతో ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినట్లు అయింది.

సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నేత లేకుంటే విపక్షాల్లోని అతిపెద్ద పార్టీకి చెందిన నేతకు ఈ కమిటీలో చోటు కల్పించేలా ఈ బిల్లుతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అలాగే కమిటీలో ఏ ఒక్క సభ్యుడు లేకున్నా (కోరమ్ లేకుంటే) ఎంపిక ప్రక్రియ కొనసాగేలా మరో సవరణను బిల్లులో పొందుపరచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement