CBI director selection
-
సీబీఐ డైరెక్టర్‌ను ఎందుకు నియమించలేదు?
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను ఇంతవరకూ ఎందుకు నియమించలేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంతకాలం సీబీఐకి పూర్తిస్థాయిలో డైరెక్టర్‌ను నియమించకపోవడంపై తాము సంతృప్తిగా లేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు నియామకాన్ని సవాలుచేస్తూ ఎన్జీవో సంస్థ ‘కామన్ కాజ్’ దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అసంపూర్తిగా సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐకు కొత్త చీఫ్‌ను ఎంపికచేసేందుకు ఏర్పాటైన అత్యున్నతస్థాయి మండలి సమావేశం శుక్రవారం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఏర్పాటైన ఈ ప్యానెల్ సమావేశానికి ప్రధానితోపాటు ప్యానెల్ సభ్యులైన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ కేడర్ 1983 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారిణి రీనా మిత్రా సహా ఐదుగురి పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. జనవరి 10 నుంచి సీబీఐ చీఫ్ పోస్ట్ ఖాళీగా ఉంది. -
సీబీఐ చీఫ్ ఎంపికకు 24న కమిటీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : తదుపరి సీబీఐ డైరెక్టర్‌ను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈనెల 24న సమావేశం కానుంది. ప్రధాని నేతృత్వంలోని ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సభ్యులుగా ఉన్నారు. తొలుత ఈనెల 21న కమిటీ సమావేశం కావాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఈనెల 24 లేదా 25న సమావేశం జరగాలని ఖర్గే కోరారు. తర్జనభర్జనల అనంతరం నూతన సీబీఐ చీఫ్‌ను ఎంపిక చేసేందుకు ఈనెల 24న సమావేశం కావాలని ప్రభుత్వం కమిటీ భేటీకి తేదీని ఖరారు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చీఫ్‌గా తిరిగి నియమితులైన ఆలోక్ వర్మను ఆ పదవి నుంచి తొలగించి ఫైర్ సర్వీసుల డీజీగా నియమించినప్పటి నుంచి సీబీఐ డైరెక్టర్ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఆలోక్ వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కాగా సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ప్రభుత్వ ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వరరావును నియమించింది. సీబీఐకి పూర్తిస్ధాయి డైరెక్టర్‌ను నియమించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై ఒత్తిడి పెంచుతోంది. -
సీబీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సవరణ బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును (ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ బిల్లు-2014) లోక్‌సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించడం తెలిసిందే. దీంతో ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినట్లు అయింది. సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నేత లేకుంటే విపక్షాల్లోని అతిపెద్ద పార్టీకి చెందిన నేతకు ఈ కమిటీలో చోటు కల్పించేలా ఈ బిల్లుతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అలాగే కమిటీలో ఏ ఒక్క సభ్యుడు లేకున్నా (కోరమ్ లేకుంటే) ఎంపిక ప్రక్రియ కొనసాగేలా మరో సవరణను బిల్లులో పొందుపరచింది.