
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది చట్టరూపం దాల్చితే వ్యవసారంగం, ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సబ్సిడీ విద్యుత్‌పై ప్రభావం పడుతుందన్నారు. విద్యుత్ రంగం మొత్తం ప్రైవేటీకరణ కాబోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీన్ని వ్యతిరేకించారని తెలిపారు. ఈ బిల్లుపై సీఎం పలు సమీక్షలు చేశారని, త్వరలోనే కేంద్రానికి లేఖ రాస్తారని వెల్లడించారు. అనంతరం రాష్ట్రం అభిప్రాయం చెప్పి..ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
(రైళ్లను ఇప్పుడే నడపొద్దు: సీఎం కేసీఆర్)