Victory Venkatesh
-
స్టైలిష్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ మామ
-
రామ్ చరణ్ తో మళ్లీ జతకట్టనున్న సమంత.?
-
హీరో వెంకటేష్ పై కేసు నమోదు.. దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్ట్ షాక్
-
ఈసారి సంక్రాంతి నాదే అంటున్న వెంకటేష్
-
పాటతో ఇరగదీసిన 'వెంకీ మామ'
-
వెంకటేష్ కెరీర్ కు కీలకంగా మారిన 2025 పొంగల్..
-
వివాదాలకు దూరం.. విక్టరీ వెంకటేశ్ ఎందుకంత స్పెషల్? (ఫొటోలు)
-
బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు వెంకీ గ్రీన్ సిగ్నల్..
-
పొల్లాచ్చికి పోదాం
పొల్లాచ్చికి పోదాం అంటున్నారట హీరో వెంకటేశ్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సిని మాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి... ఇలా మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. అయితే హీరో వెంకటేశ్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కాగా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో పొల్లాచ్చిలో ్రపారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ కూడా పాల్గొంటారట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
భార్య–భర్త–మధ్యలో మాజీ ప్రేయసి
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో కొత్త సినిమా షురూ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందుతున్న 58వ చిత్రమిది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌కి జోడీగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. వెంకటేశ్–మీనాక్షీ చౌదరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ‘‘హీరో, అతని భార్య, మాజీ ప్రేయసి... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. హీరో– దర్శక–నిర్మాతల కాంబినేషన్లో ఇప్పటికే రెండు బ్లాక్బస్టర్లు రావడంతో మూడో చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు మునుపెన్నడూ కలగని అనుభూతిని అందించడానికి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు’’ అన్నారు మేకర్స్. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, వీకే నరేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సమీర్ రెడ్డి. -
చిరు మూవీతో వెంకీ సాహసం.. F2 రిపీట్ అవుద్దా..!
-
75 అనేది నెంబర్ మాత్రమే..ప్రతి సినిమా ప్రత్యేకమే: వెంకటేశ్
దగ్గుబాటి వెంకటేశ్.. ఈ పేరు కంటే విక్టరీ వెంకటేశ్ అంటే చాలు అందరు గుర్తుపడతారు. విక్టరిని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేశ్. వారసత్వం తొలి అవకాశం మాత్రమే ఇస్తుంది. కానీ.. సొంత ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు అని రుజువు చేశాడు వెంకటేశ్. హీరోగా 74 సినిమాల్లో నటించడమే కాదు..వాటిలో ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక తన 75వ సినిమాగా ‘సైంధవ్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. సైంధవ్ మీ లాండ్ మార్క్ 75వ సినిమా కదా.. ఆ ఒత్తిడి ఏమైనా ఉందా ? నాకు ఆ ఒత్తిడి ఏమీ లేదు. 75 అనేది నెంబర్ మాత్రమే. అయితే ఒక కెరీర్ లో 50, 75, 100 నెంబర్స్ సహజంగానే ఒక మైల్ స్టోన్ లా అనుకోవచ్బు. నా వరకూ .. ఆ సమయానికి వచ్చింది నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తాను. ప్రతి సినిమా ప్రత్యేకమే. ప్రతి సినిమాకి కష్టపడి పని చేయాలి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. దర్శకుడు శైలేష్ కొలను కథ చెప్పినపుడు మీకు నచ్చిన అంశం ఏమిటి ? చాలా బ్యుటీఫుల్ డాటర్ సెంటిమెంట్ ఉంది. రెగ్యులర్ గా కాకుండా కథకు అవసరమైయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. యాక్షన్ చాలా నేచురల్ గా ఉంది. చాలా ఫాస్ట్ పేస్డ్ మూవీ ఇది. ఇది నాకు ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అవుతుందనిపించింది. దర్శకుడు శైలేష్ కొలను వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి. పిల్లలతో కలసి చాలా సినిమాలు చేశారు కదా.. బేబీ సారా నటన ఎలా అనిపించింది ? పిల్లలతో కలసి పని చేయడం నాకు చాలా ఇష్టం. బేబీ సారాలో స్పార్క్ ఉంది. అద్భుతంగా నటించింది. ‘సైంధవ్’ కథకు సంబంధించి మీరేమైనా సూచనలు చేశారా ? దర్శకుడు శైలేష్ చాలా మంచి కథతో వచ్చారు. ఒకసారి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా టీంతో కలసిపోతాను. సాధారణమైన చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. ఎక్కడైనా మెరుగుపరిచే అవకాశం ఉందనిపిస్తే చెబుతాను. నా దృష్టి మాత్రం నటనపైనే ఉంటుంది. ‘సైంధవ్’లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తారని, క్లైమాక్స్ సరికొత్తగా ఉంటుందని వినిపిస్తోంది ? -సైంధవ్ చాలా మంచి కథ. స్టొరీ నడిచే విధానం చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ ని ఎక్స్ ట్రార్డినరీ గా డిజైన్ చేశారు. హైలీ ఎమోషనల్ గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇవన్నీ ఒక కొత్తదనం తీసుకొచ్చాయి. ఈ సినిమా విషయానికి వస్తే ప్రమోషన్స్ లో స్టేజ్ పై డ్యాన్స్ చేశారు కదా ? నాకు సహజంగానే సౌండ్ వింటే కాళ్ళు ఆడుతాయి. సడన్ గా వాసు పాట వేసేసరికి అలా వచ్చేసింది. ఆ బీట్ అలాంటిది (నవ్వుతూ) ‘సైంధవ్’ పాత్రలో మీ ‘ధర్మచక్రం’ పోలికలు ఉన్నాయా ? లేదండీ. ఈ రెండు కంప్లీట్ గా డిఫరెంట్. నవాజుద్దీన్ సిద్ధిఖి గారు ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నారు.. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? నవాజుద్దీన్ సిద్ధిఖి గారితో పని చేయడం చాలా మంచి అనుభూతి. ఆయన ఎక్స్ ట్రార్డినరీ యాక్టర్. గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్ నుంచి ఆయన ప్రయాణం చాలా విలక్షణంగా సాగుతోంది. సైంధవ్ లో చాలా క్రేజీ రోల్ చేశారు. మాములు సీక్వెన్స్ ని కూడా డిఫరెంట్ గా చేసే నటుడు ఆయన. ఇందులో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ‘సైంధవ్’ లో సంగీతంకు ఎంత ప్రాధన్యత ఉంటుంది ? సంతోష్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. నేపధ్య సంగీతం ఎక్స్ లెంట్ గా ఉంటుంది. రాంగ్ యూసెజ్, సరదాలే పాటలు అద్భుతంగా వచ్చాయి. లిరిక్స్ కూడా చాలా చక్కగా కుదిరాయి. 75 సినిమాల కెరీర్ లో ఒక్క వివాదం కూడా లేకుండా మీ ప్రయాణం సాగడం ఎలా సాధ్యమైయింది? అది ఎలా అని తెలుసుంటే అందరికీ చెప్పేవాడిని( నవ్వుతూ). నిజంగా నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఎవరికీ అసౌకర్యం కలిగించకూడదనే మనస్తత్వం నాది. స్కూల్, కాలేజీలో కూడా ఇలానే ఉండేవాడిని. నాని గారితో సినిమా చేస్తున్నారని విన్నాం ? చేద్దాం. అన్నీ చేసేద్దాం (నవ్వుతూ) స్వామి వివేకనంద సినిమా గురించి ? ఆ స్క్రిప్ట్ ఒక లెవల్ వరకు వచ్చింది. ఇద్దరు మేకర్స్ చేస్తున్నారు. అయితే స్క్రిప్ట్ పై వాళ్ళకి పూర్తి స్థాయి సంతృప్తి రాలేదు. నెక్స్ట్ సినిమా గురించి ? రెండు మూడు కథలు ఉన్నాయి. ఇంకా ఏమీ లాక్ చేయలేదు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. నాలుగు సినిమాలు అద్భుతంగా ఆడాలి. అందరూ ఆనందంగా ఉండాలి. థాంక్ యూ సో మచ్. -
సైంధవ్ మూవీ ట్రైలర్
-
'సైంధవ్' ప్రమోషనల్ టూర్ ఫోటోలు
-
సైంధవ్ మూవీ టీజర్
-
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
ఆ రోజు వెంకటేష్ అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది
-
నాకు హీరో వెంకటేష్ అంటే చాలా ఇష్టం..!
-
ఈ సినిమా కోసం మా అబ్బాయి చాలా కష్టపడ్డాడు
-
రానా నాయుడు 2 వెంకటేష్ పరిస్థితి ఏంటో?
-
రానా నాయుడు వెబ్ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం!
టాలీవుడ్ స్టార్స్ విక్టరి వెంకటేశ్, రానా దగ్గుబాటిలు నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇటీవల విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక వ్యూవర్ షిప్లో రానా నాయుడు దూసుకుపోతుంది. ఓటీటీలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న రానా నాయడుపై అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందంటూ పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: తండ్రి ఫొటో పట్టుకుని తారకరత్న కొడుకు అలా.. అలేఖ్య పోస్ట్ వైరల్ ఇందులో సెన్సార్‌కు మించి అసభ్య పదాలు, శృంగారపు సన్నివేశాలు అధికంగా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రానా నాయుడు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్పై నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రానా నాయుడు సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో అభ్యంతకర భాష ఎక్కువగా ఉండటంతో ఈ తెలుగు ఆడియోను తొలగించాలని నెట్‌ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించనుందట. తెలుగు ఆడియో తొలగించడానికి ప్రధాన కారణం అసభ్య పదాలు ఎక్కువగా ఉండటమే అని తెలుస్తోంది. ఇక మార్చి 10న స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ పది ఎపిసోడ్స్ ఉంది. ఎక్కువ మెుత్తంలో అడల్డ్ కంటెంట్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపుగా రూ.12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం. రానా రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. చదవండి: వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి మేనక కాగా అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' సిరీస్‌లో బాలీవుడ్ నటి మాధురి ధీక్షిత్ను అవమారిచే విధంగా వ్యాఖ్యలు ఉండటంతో రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ మండపడిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆయన నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే రానా నాయుడు విషయంలో నెట్‌ఫ్లిక్స్ జాగ్రత్త పడినట్లు కూడా తెలుస్తోంది. -
వెంకటేశ్ నోట పచ్చిబూతులు.. వినలేకపోతున్నామంటున్న ఫ్యామిలీ ఆడియన్స్
-
ఆ పాత్ర నేను చేయాల్సింది.. వెంకటేశ్ ఏం పొడిచారో చూస్తా?..బ్రహ్మానందం
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి తండ్రికొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించి ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా బ్రహ్మానందం నటించిన ఓ స్పెషల్ వీడియోని నెట్ఫిక్స్ విడుదల చేసింది. అందులో బ్రహ్మీ తనని తాను ఆస్కార్ నాయుడిగా పరిచయం చేసుకొని నాగ నాయుడు (ఈ సిరీస్‌లో వెంకటేశ్ పోషించిన పాత్ర పేరు) క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ ఇచ్చాడు. కిరీటి దామరాజు డైరెక్టర్‌గా, జబర్దస్త్ అవినాష్ ఆయన అసిస్టెంట్‌గా కనిపించారు. ఈ స్పెషల్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బ్రహ్మానందం ఆడిషన్ చూసి విసుగుచెందిన వెంకటేశ్..చివరకు రానాకు తండ్రిగా తానే నటిస్తానని చెబుతాడు. దీంతో బ్రహ్మీ కోపంతో..‘ఆ క్యారెక్టర్‌కి నా ఏజ్ సరిపోలేదని.. వెంకటేశ్‌ను పెట్టారు. ఓకే.. ఏం పొడిచారో..ఎంత పొడిచారో నేను చూస్తాను. మీరూ.. చూడండి.. వాచ్ రానా నాయుడు. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్’ అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది. -
తారకరత్న బౌతికకాయానికి నివాళులర్పించిన విక్టరీ వెంకటేష్
-
హాలీవుడ్ వెబ్... బాలీవుడ్ హబ్!
హాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ కావడం కొత్తేం కాదు. అయితే కరోనా తర్వాత మొదలైన వెబ్ సిరీస్‌ల హవా వల్ల ఇప్పుడు బాలీవుడ్ హబ్‌గా పలు హాలీవుడ్ సిరీస్‌లు కూడా రీమేక్ అవుతున్నాయి. విదేశీ కథలతో దేశీ తారలు చేస్తున్న ఈ వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం. దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ తెరకెక్కించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డొనవన్’కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ రూపొందింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలో ఓ స్పష్టత వస్తుంది. నేర ప్రపంచంలో సెటిల్మెంట్స్ చేసి డబ్బు సంపాదిస్తుంటాడు ఓ వ్యక్తి. అయితే అతని తండ్రి విడుదలైన తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ తండ్రీ కొడుకుల కథ ఏంటి? అన్నదే ‘రానా నాయుడు’ ప్రధాన కథాంశం. 2013లో మొదలైన ‘రే డొనవన్’ సిరీస్ ఏడుసీజన్లుగా 19 జనవరి 2020 వరకూ సాగింది. మరోవైపు నైట్ మేనేజర్‌గా వెబ్ వీక్షకుల ముందుకు వస్తున్నారు యువ హీరో ఆదిత్యారాయ్ కపూర్. అనిల్ కపూర్, శోభితా ధూళ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు సందీప్ మోది దర్శకుడు. బ్రిటిష్ క్రైమ్ డ్రామా ‘ది నైట్ మేనేజర్’కు రీమేక్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఈ నెలలో స్ట్రీమింగ్ కానుంది. ఓ స్టార్ హోటల్లో పని చేసే ఓ నైట్ మేనేజర్ అదే హోటల్‌కు గెస్ట్‌గా వచ్చిన ఓ యువతిని ఇష్టపడతాడు. అయితే అనుకోకుండా అతను ఆయుధాలను అక్రమ రవాణా చేసే ఓ ముఠా నాయకుడి చేతిలో చిక్కుకుంటాడు. అప్పుడు ఆ నైట్ మేనేజర్ ఏం చేశాడు? అన్నదే కథ. ఇక అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రివెంజ్’ సిరీస్ హిందీలో రీమేక్ కానుంది. ఇందులో లీడ్ రోల్‌ను రవీనా టాండన్ చేయనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభం కానుంది. ‘రివెంజ్’ కథ విషయానికి వస్తే... తన తండ్రి మరణానికి కారకులైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఒక సాధారణ యువతి ఏ విధంగా పగ తీర్చుకుంది? అన్నదే కథాంశం. ఇంకోవైపు మరో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘సిటా డెల్’ హిందీలో రీమేక్ అవుతోంది. హిట్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శకులు రాజ్ అండ్ డీకే ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్ చేస్తున్నారు. దేశరక్షణ కోసం ఓ గూఢచారి ఎలాంటి సాహసాలు చేయాల్సి వస్తుంది? అనే నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. కాగా మరికొన్ని ఫారిన్ సిరీస్ లకు దేశీ వెర్షన్ రానుంది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ప్రస్తుతం కొన్ని ఫారిన్ వెబ్ సిరీస్‌లు హిందీలో రీమేక్ అవుతుండగా ఆల్రెడీ కొన్ని సిరీస్‌లు ఇండియాలో రీమేక్ అయ్యాయి. జర్నలిజం నేపథ్యంలో రూపొందిన బ్రిటిష్ సిరీస్ ‘ప్రెస్’ హిందీ రీమేక్ ‘ది బ్రోకెన్ న్యూస్’లో సోనాలీ బింద్రే ఓ లీడ్ రోల్ చేశారు. ఇజ్రాయెల్ సిరీస్ ‘హోస్టేజెస్’ అదే పేరుతో హిందీలో రీమేక్ కాగా ఇందులో రోనిత్ రాయ్, టిస్కా చోప్రా లీడ్ రోల్స్ చేశారు. అలాగే బ్రిటిష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘లూథర్’ హిందీ రీమేక్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’లో అజయ్ దేవగన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు చేశారు. ఇదే కోవలో డచ్ (నెదర్లాండ్) డ్రామా సిరీస్ ‘పెనోజా’ ఆధారంగా ‘ఆర్య’ హిందీలో రాగా, ఇందులో సుష్మితా సేన్ ప్రధాన ΄ాత్రధారి. అలాగే అమెరికన్ సిరీస్‌లు ‘క్రిమినల్ జస్టిస్’ (మూడు సీజన్లు), ‘ది ఆఫీస్’(రెండు సీజన్లు) నెట్టింటి వీక్షకుల ముందుకు వచ్చాయి. -
Saindhav Movie: ఘనంగా ప్రారంభమైన వెంకటేష్ 75వ చిత్రం (ఫొటోలు)
-
చలపతి రావుకు నివాళులు అర్పించిన విక్టరీ వెంకటేష్
-
కైకాల గారు మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ : విక్టరీ వెంకటేష్
-
సినిమాలకు వెంకీ మామ బ్రేక్ ..?
-
మై డియర్ వెంకీ.. వేర్ ఇజ్ ద పార్టీ.. మెగాస్టార్ ట్వీట్ వైరల్
ఇవాళ టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. నేడు ఆయన 62 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. వెంకీ బర్త్‌డేను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్లో అగ్రహీరోగా పేరు సంపాదించిన వెంకటేశ్ తనదైన నటనతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. వెంకటేశ్‌కు బర్త్‌డే విషెష్ తెలిపారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్లో..' మై డియర్ వెంకీ.. హ్యాపీ బర్త్‌డే.. వేర్ ఇజ్ ద పార్టీ' అంటూ ట్వీట్ చేశారు. చిరు ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వాల్తేరు వీరయ్య సాంగ్ బాస్ పార్టీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. విక్టరీ వెంకటేశ్ తన కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. మై డియర్ వెంకీ... @VenkyMama Happy Birthday 💐🎂 Where is the Party?!! pic.twitter.com/kRHhEErsLD — Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2022 -
వెంకటేశ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్, థియేటర్లో వచ్చేస్తున్న నారప్ప
ప్రస్తుతం ఇండస్ట్రీలో రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రాలను మరోసారి ప్రక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. స్టార్ హీరోస్ పుట్టినరోజు సందర్భంగా వారికి సంబంధించిన సినిమాలను ఫ్యాన్స్ కోసం రి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ స్టార్స్ పుట్టినరోజు సందర్భంగా వారి హిట్ సినిమాలను రి రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా విక్టరీ వెంకటేశ్ మూవీ కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఆయన బర్త్‌డే సందర్భంగా దగ్గుబాటి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందించింది సురేశ్ ప్రొడక్షన్స్. అయితే ఇటీవల వెంకటేశ్ నటించిన నారప్ప సినిమాను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. కరోనా, లాక్డౌన్ కారణంగా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేశారు. స్టార్ హీరో అయిన వెంకటేశ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదే ఈ సినిమాను బిగ్స్క్రీన్పై చూడలేకపోయామనే నిరాశలో ఉండిపోయారు అభిమానులు. ఇప్పుడు వారి కోసం నారప్పు మూవీకి వెంకి బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 13న థియేటర్లోకి తీసుకువస్తున్నట్లు తాజాగా సురేశ్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే ఒక్క రోజు మాత్రమే నారప్ప మూవీ థియేటర్లో సందడి చేయనుంది. కాగా నారప్ప మూవీకి ఓటీటీలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన నారప్ప చిత్రంలో ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, రావు రమేశ్, నాజర్, రాఖీ (నారప్ప చిన్న కుమారుడు)కీ రోల్స్ పోషించారు. నారప్ప చిత్రాన్ని కలైపులి యస్ థాను సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ – వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. VICTORY @VenkyMama's Raging Blockbuster #Narappa is all set to release on Dec 13th (for only one day) across theatres in AP & Telangana!! 🔥🔥#NarappaInTheatres#Priyamani@KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @sureshprodns @theVcreations @PrimeVideoIN pic.twitter.com/Q4u4VeLQXs — Suresh Productions (@SureshProdns) December 6, 2022 చదవండి: హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్ ఘాటు రిప్లై అలా నేను సినిమాల్లోకి వచ్చాను: అక్కినేని అమల -
ఒకే చోట కలిసిన 80's తారలు..
-
‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ కాన్సెప్ట్ ఆసక్తిగా ఉంది: వెంకటేశ్
‘‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా ఆసక్తిగా ఉంది.. విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఈ మూవీతో ఉదయ్ శంకర్‌కి, యూనిట్‌కి మంచి విజయం రావాలి’’ అని హీరో వెంకటేష్ అన్నారు. ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా మధునందన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. గురు పవన్ దర్శకుడు. అట్లూరి ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని వెంకటేష్ రిలీజ్ చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఒక రోజు జరిగే కథే ఈ చిత్రం. అన్ని ఎమోషన్స్ ఉన్న మా సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. ‘‘యూత్‌ఫుల్ కంటెంట్‌గా రూపొందిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు అట్లూరి నారాయణరావు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహార్, సంగీతం: గిఫ్టన్. -
సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు
సమంత ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆమె రెట్టింపు శక్తితో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్యే స్వయంగా తెలిపింది. దీంతో సామ్ త్వరగా కోలుకుకోవాలని కోరుకుంటూ ఇటూ ఫ్యాన్స్, అటూ సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆమె అనారోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని హీరో అఖిల్, నటి వరలక్ష్మి శరత్ కుమార్, కీర్తి సురేశ్‌తో పాటు పలువురు నటీనటులు స్పందిస్తు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్ అలాగే దగ్గుబాటి వారసురాలు, విక్టరి వెంకటేశ్ కూతురు అశ్రిత సైతం సామ్ పోస్ట్‌పై స్పందించింది. సమంత పోస్ట్‌కు అశ్రిత ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ‘నీ గురించి నీకు తెలియదు.. నీలో ఎంతో బలం ఉంది.. నీ శక్తి గురించి నీకు తెలియదు.. అనంతమైన ప్రేమను నీకు పంపుతున్నా’ అంటూ రెడ్ హాట్ ఎమోజీలను జత చేసింది. అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్ కూడా సామ్ పోస్ట్‌పై స్పందించాడు. ‘నువ్వు మరింత శక్తి, బలంతో ఉండాలని కోరుకుంటున్నా. త్వరలోనే నువ్వు దీన్ని అదిగమిస్తావు సామ్’ అంటూ ధైర్యం ఇచ్చాడు. దీంతో వారి కామెంట్స్ చూసి సామ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే సామ్ ఆనారోగ్యంపై ఆమె మాజీ భర్త, హీరో నాగ చైతన్య స్పందన కోసం సమంత ఫ్యాన్స్‌తో పాటు అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయంటే.. Rambha Car Accident: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం, ధ్వంసమైన కారు.. ఫొటోలు వైరల్ -
‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా?
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓరి దేవుడా’. తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను తెలుగులో వెంకటేశ్ చేశారు. కథను మలుపు తిప్పే దేవుడి పాత్రలో ఆయన కనిపించారు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా సినిమాకు హైలెట్‌గా నిలిచారు. చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్ అయితే ఈ సినిమా కోసం వెంకి భారీగానే పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కనిపించింది 15 నిమిషాలే యంగ్ హీరో రెమ్యునరరేషన్ స్థాయిలో ఆయనకు మేకర్స్ భారీ మొత్తం చెల్లించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓరి దేవుడా సినిమాలో వెంకి తన పాత్ర కోసం 5 రోజుల కాల్షీట్ ఇచ్చారట. ఈ 5 రోజుల షూటింగ్, 15 నిమిషాల నిడివికి ఆయన దాదాపు రూ. 3 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా ఈ సినిమాలో ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చదవండి: Mega 154 Title: మెగా 154 టైటిల్ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్ లుక్ -
' ఓరి దేవుడా ' ఓటీటీ పార్ట్నర్ అదేనా?
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇవాళ విడుదలైన థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ను ఖాయం చేసుకుందని సమాచారం. (చదవండి: ఆయనతో నటించడం మా అదృష్టం: ‘ఓరి దేవుడా’ హీరోయిన్స్) ఈ రొమాంటిక్ కామెడీ, డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'ఆహా' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఆశా భట్, రాహుల్ రామకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు. -
రెండు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని వారు ఉండరు.. రామ్ చరణ్ స్పీచ్ వైరల్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశాభట్ కథానాయికలుగా జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా..లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా వస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న థియేటర్లలో కనువిందు చేయనుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి మెగా హీరో రామ్‌చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. (చదవండి: లవ్వే లేని లవ్ మ్యారేజ్.. కామెడీతో అదరగొడుతున్న 'ఓరి దేవుడా' ట్రైలర్) వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'మనం సినిమాను ఎంత ప్రేమిస్తామో తెలుసు. మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఈ మూవీకి వంశీ కాక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయనకు ఆల్ ది బెస్ట్. వెంకటేశ్ అన్నా.. మీ కోసమైనా నేను ఈ సినిమా చూస్తా. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వక్సేన్ పేరు తెలియని వాళ్లు ఉండరు. అతి తక్కువ సమయంలో గల్లీగల్లీకి ఆయన ఫ్యాన్స్‌ను సంపాదించారు. ఒక్కసారి మాటిస్తే విశ్వక్ కూడా నిలబడతాడన్న పేరుంది. అతని వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్. ఈ సినిమా కుడా ఉప్పెన మూవీలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'రామ్ చరణ్ అన్న సినీ ప్రయాణం నాకెంతో స్ఫూర్తి. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వటం చిన్న విషయం కాదు. నేను అన్నయ్యను చూశాకే క్రమశిక్షణ నేర్చుకున్నా. ఈ క్షణాల్ని నేను మర్చిపోలేను. దర్శకుడు అశ్వత్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్, డీఓపీ విద్ధు ఇండియాలోనే టాప్ లిస్ట్‌లో నిలుస్తారు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే చిత్రమిది’ అని అన్నారు. -
సెట్లో పూజా బర్త్‌డే సెలబ్రెట్ చేసిన స్టార్ హీరోలు, వీడియో వైరల్
పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో టాలీవుడ్ హీరో విక్టరి వెంకటేశ్, విలక్షణ నటుడు జగపతి బాబులు కీ రోల్ పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు పూజా బర్త్‌డే. ఈ సందర్భంగా సెట్లో సల్మాన్ ఖాన్, వెంకటేశ్‌లు ఆమె బర్త్‌డే సెలబ్రెట్ చేశారు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన బిగ్‌బాస్ దివి.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా పూజా ‘నేను ఎక్కువ ప్రేమించేది నా పనిని, షూటింగ్‌ని. అలాంటి షూటింగ్ సెట్లోనే నేను కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషకంగా ఉంది. ఇది నాకు ఓ మధుర జ్ఞాపకం. ఆన్ సెట్స్‌లో బర్త్ డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని ఆమె పేర్కొంది. Wishing the gorgeous @hegdepooja a very Happy Birthday from the team of #KisiKaBhaiKisiKiJaan@BeingSalmanKhan @VenkyMama @TheRaghav_Juyal @siddnigam_off @jassiegill @ishehnaaz_gill @palaktiwarii @farhad_samji pic.twitter.com/b4YGToUgH2 — Salman Khan Films (@SKFilmsOfficial) October 13, 2022 -
లవ్వే లేని లవ్ మ్యారేజ్.. కామెడీతో అదరగొడుతున్న 'ఓరి దేవుడా' ట్రైలర్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా..లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను తలపించేలా ఉంది. పూరి జగన్నాధ్ 'బ్రేకప్.. ఐ లవ్ బ్రేకప్స్' అంటూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చివర్లో వచ్చే డైలాగ్ 'వైఫ్లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రైండే వైఫ్‌లాగా వచ్చిందా..' విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న థియేటర్లలో కనువిందు చేయనుంది ఈ చిత్రం. -
Rana Naidu Teaser: వెబ్ సిరీస్‌లో బాబాయి, అబ్బాయి.. టీజర్ అదుర్స్..!
టాలీవుడ్ హీరో దగ్గబాటి రానా, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్‌సిరీస్ 'రానా నాయుడు'. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి హిందీలో మాత్రమే తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో వీరిద్దరు తండ్రి, కొడుకులుగా నటిస్తున్నారు. హిందీలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇది అమెరికన్ సిరీస్ 'రే డోనోవన్'కు రీమేక్‌గా వస్తోంది. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. 'రానా నాయుడు’ టీజర్‌ని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముంబై మాఫియా నేపథ్యంలో సన్నివేశాలు వెబ్ సిరీస్‌పై ఆసక్తి మరింత పెంచుతున్నాయి. ఎవరికైనా సహాయం కావాలా అన్న రానా వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. అయితే విక్టరీ వెంకటేశ్ రానాకు తండ్రిగా నటిస్తుండగా.. ఇందులో జైలులో ఖైదీగా కనిపించనున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ తెలుగులోనూ డబ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాబాయి- అబ్బాయి కాంబినేషన్లో రావడంతో దగ్గుబాటి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ టీజర్‌పై పలువురు అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొందరు టీజర్‌ను తెలుగులో విడుదల చేయాలని కోరుతున్నారు. వెంకటేశ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘కబీ ఈద్ కబీ దివాళి’ అనే సినిమాలో నటిస్తుండగా మరోవైపు.. రానా చేతిలో సైతం పలు సినిమాలు ఉన్నాయి. -
Vishwak Sen: 'ఓరి దేవుడా' బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని చిత్రబృందం అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం అక్టోబర్ 21 థియేటర్లలో కనువిందు చేయనున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. Vishwak Sen: యాక్షన్ హీరో డైరెక్షన్లో విశ్వక్ సేన్ మూవీ.. ఆసక్తికర విషయాలు) పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా.. లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వేంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ మూవీ నుంచి కేవలం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఒక్కసారిగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. -
వెంకటేశ్ చేతుల మీదుగా అనసూయ, సునీల్ ‘దర్జా’ మూవీ ట్రైలర్
Venkatesh Released Darja Movie Trailer: సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివ శంకర్ పైడిపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ట్రైలర్ రిచ్‌గా, చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. చదవండి: మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో సినిమా చేయను: ప్రముఖ నిర్మాత ‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో ‘దర్జా’ రిలీజ్ ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నాం. సినిమా రిలీజ్ డేట్‌పై త్వరలో స్పష్టత ఇస్తాం’ అన్నారు నిర్మాతలు. ‘దర్జా’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సలీం మాలిక్, మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్రాక్ షకీల్‌తో పాటు చిత్రయూనిట్ పాల్గొంది. -
కమల్‌గారు గ్లోబల్ స్టార్: విక్టరీ వెంకటేశ్
‘‘దక్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌గారికి ముందు.. మరొకటి కమల్‌గారు వచ్చిన తర్వాత. ఆయనతో ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉంది. కమల్‌గారు నాకు అపూర్వ సహోదరులు’’ అని అన్నారు హీరో వెంకటేశ్. కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘విక్రమ్’. ఈ సినిమాను తెలుగులో ‘విక్రమ్: హిట్ లిస్ట్’ పేరుతో హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 3న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘విక్రమ్: హిట్ లిస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ – ‘‘కమల్‌గారి ‘పదినారు వయదినిలే’ (పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్»ౌల్డ్. ఆయన నటించిన ‘మరో చరిత్ర’ ప్రతి యాక్టర్‌కు జీపీఎస్. ‘దశావతారం’లాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌కు ధైర్యం సరిపోదు. ‘ఏక్ దూజే కేలియే’తో ఆయన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్. ఈ రోజు కమల్‌గారు గ్లోబల్ స్టార్. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి. ‘విక్రమ్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్, నితిన్‌లకు కంగ్రాట్స్’’ అన్నారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ – ‘‘దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్ అసిస్టెంట్‌గా హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్ తింటున్నాను. నా కెరీర్లో ఎన్నో హిట్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. డైరెక్టర్ బాలచందర్‌గారితో నేను 36 సినిమాలు చేశాను. అదే నా పీహెచ్డీ. నా స్టైల్, రజనీకాంత్ స్టైల్ ఆయన్నుంచే వచ్చాయి. వెంకీగారు ఓసారి గోవాకు వస్తే, ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చారా? అన్నాను. మిమ్మల్ని చూడటానికి వచ్చానన్నారు. నాకు తెలిసింది చెప్పాను. ఆయనకు మరో వేవ్ వచి్చంది. ఇప్పుడు నా బ్రదర్ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను, వెంకీగారు ‘మర్మయోగి’ సినిమా చేయాల్సింది. చేసి ఉంటే మా కెరీర్లో మంచి హిట్‌గా నిలిచి ఉండేది. ‘విక్రమ్’ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమా హిట్ మీ (ప్రేక్షకులు) చేతుల్లోనే ఉంది. డైరెక్టర్ లోకేశ్‌గారు నాలాగే (బ్యాక్‌గ్రౌండ్ లేకుండా) ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్ ఫిల్మ్స్... పాన్ ఇండియా చాలదు.. పాన్ వరల్డ్. అది మీ (ప్రేక్షకులు) సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్ చేయాలి. ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నేను మంచి సినిమాకు అభిమానిని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కమల్‌గారి అద్భుతమైన యాక్షన్‌ను చూస్తారు’’ అన్నారు లోకేశ్ కనగరాజ్. ‘‘కమల్‌హాసన్‌గారు ప్రైడ్ ఆఫ్ ఇండియా’’ అన్నారు నితిన్. ‘‘తెలుగులో ‘విక్రమ్’ను రిలీజ్ చేసే చాన్స్ ఇచి్చన కమల్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు సుధాకర్ రెడ్డి. -
ఎఫ్3ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం
విక్టరి వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఎఫ్ 3 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలై ఫస్ట్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంపై మూవీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎఫ్ 3 టీం ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. మా చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు, యూనివర్షల్గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొంది. హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. కుటుంమంతా కలిసొచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్‌కి వెళ్లి చూసిన సినిమా ఎఫ్ 3నే. దేవి థియేటర్లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్టైనర్ తీసుకునందుకు సంతోషంగా ఉంది. అనిల్ రావిపూడి ఎఫ్ 3కి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేయాలి’ అని కోరుకున్నారు . దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుండి 'ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్' అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షకులు థియేటర్లో పడిపడి నవ్వుతున్నారు. ఎఫ్ 2 కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 3 రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హాగ్ ఇచ్చాను. వెంకటేష్ గారికి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్ ఇమేజ్ ఉండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో వెంకటేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎఫ్ 3ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిందుకు ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు. ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళండి... హాయిగా నవ్వుకోండి’ అని పేర్కొన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ మూవీ మాకు చాలా ప్రత్యేకమైనంది. వెంకటేష్ గారి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’ తెలిపారు. -
పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ వచ్చేది అప్పుడే..
F3 Movie: Pooja Hegde Party Song Of The Year Promo Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా మరోసారి సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన సంగతే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను విడుదల చేయనున్నారు. 'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మే 17న రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రొమోను సోమవారం (మే 16) బయటకు వదిలారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నిలవనుంది. మోస్ట్ గ్లామరస్‌గా ఉన్న పూజా హెగ్డే పోస్టర్‌ను 'పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్'గా రిలీజ్ చేశారు. ఈ పార్టీ నంబర్ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చదవండి: ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు.. మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం తొలి ప్రాధాన్యత: మంచు విష్ణు -
వెంకీ, వరుణ్ తేజ్‌లను ఆడేసుకున్న నాగరత్తమ్మ.. ట్రెండింగ్‌లో వీడియో
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీని అనేక వాయిదాల తర్వాత మే 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా సెట్లో చిత్రబృందానికి చుక్కలు చూపించింది నాగరత్తమ్మ అలియాస్ 'ఫ్రస్టేటెడ్ ఉమెన్' ఫేమ్ సునయన. అయితే ఎఫ్-3 చిత్రం రిలీజయ్యే వరకూ నీడలా వెంటాడతానని ఇదివరకు శపథం చేసిన నాగరత్తమ్మ.. అన్నట్లే చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్ ఇతర టీం సభ్యులతో ఆమె కొంతసేపు ముచ్చటించి సరదాగా గడిపింది. అనంతరం వాళ్లతో ఫొటోలు దిగింది. సినిమాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. -
2021లో వెంకటేష్ రేర్ రికార్డ్
-
మరోసారి వాయిదా పడ్డ ఎఫ్ 3 మూవీ, సమ్మర్లో ఈ నవ్వుల పండగ..
Venkatesh Daggubati And Varun Tej F3 Movie Release Date Postponed Again: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించగా.. ఆ తర్వాత ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. చదవండి: వెనక్కి తగ్గిన భీమ్లానాయక్, విడుదల తేదీ వాయిదా తాజాగా ఇదే తేదీకి భీమ్లా నాయక్‌ను వాయిదా వేయడంతో ఎఫ్ 3 మూవీని మరోసారి వాయిదా వేశారు మేకర్స్. సమ్మర్‌కు రిలీజ్ చేయబోతున్నామంటూ తాజా విడుదల తేదీని ప్రకటించారు. నవ్వల పండగ వచ్చే ఏడాది సమ్మర్లో అంటూ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు విడుదల తేదీని వెల్లడించారు. ‘నవ్వుల పండగా ఇప్పుడు సమ్మర్లో.. ఏప్రిల్ 29న విడుదల, గెట్ రెడీ ఫర్ సమ్మర్ సోగాళ్లు’ అంటూ ఎఫ్ 3 మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. కాగా ఈ సినిమాకు.. ఎఫ్ 2 స్టోరీకి ఏమాత్రం సంబంధం ఉండదు అని గతంలోనే అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ త్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. చదవండి: పుష్ప స్పెషల్ సాంగ్‌పై సమంత హాట్ కామెంట్స్, సెక్సీగా కనిపించాలంటే.. నవ్వుల పండుగ ఇప్పుడు వేసవి లో ☀️😎😃 The Ultimate Fun Franchise #F3Movie on 𝟐𝟗𝐭𝐡 𝐀𝐩𝐫𝐢𝐥, 𝟐𝟎𝟐𝟐 😎💥 Get Ready for సమ్మర్ సోగ్గాళ్ల సందడి 👬#F3OnApril29th@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @ThisIsDSP @SVC_official @f3_movie pic.twitter.com/pDTzCjANww — Sri Venkateswara Creations (@SVC_official) December 21, 2021 -
Happy Birthday విక్టరీ వెంకటేష్: చిరు స్పెషల్ విషెస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ వెర్సటైల్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు నేడు ( డిసెంబరు 13) ఈ సందర్బంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. అటు ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ పెద్దలు వెంకీని అభినందనల్లో ముంచుత్తుతున్నారు. (వెంకీ మామకు బర్త్‌డే శుభాకాంక్షలు, మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా!) Happy birthday to my fav @VenkyMama sir!! It’s a joy working with you. You are so much fun!🤗 Wishing you great health and happiness! Loads of love! pic.twitter.com/slUKNvT08G — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 13, 2021 ముఖ్యంగా దగ్గుబాటి వారి మరో వారసుడు టాలీవుడ్ భల్లాల దేవ రానా ఒక మోషర్ పోస్టర్‌ను ట్విట్ర్లో పోస్ట్ చేశారు. దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్ , హీరోయిన్ ఖుష్బూ, ఇతర నటీనటులతోపాటు, మ్యూజిక్ డైరెక్టర్స్, డీఎస్పీ, తమన్ తదితరులు బర్త్‌డే విషెస తెలుపుతూ ట్విట్ చేశారు. నులి వెచ్చని నీ స్నేహంతో నాముఖంపై చిరునవ్వును ఉంచుతున్న మిత్రమా..థ్యాంక్స్.మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్!! అంటూ చిరు ట్వీట్ చేశారు. అలాగే రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లోని వెంకటేష్ ఫస్ట్‌లుక్ కూడా సందడి చేస్తోంది. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌లో బాబాయ్ అబ్బాయిలు వెంకీ, రానా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. Victory #Venkatesh look from @NetflixIndia's Web Series #RanaNaidu Happy Birthday @VenkyMama #HappyBirthdayVictoryVenkatesh pic.twitter.com/mfxSUY5PxE — Suresh Kondi (@V6_Suresh) December 13, 2021 My brother & dear friend @VenkyMama Thank you for always radiating warmth & always managing to put a smile on my face! Have a Wonderful birthday!! Many Many Happy Returns!! pic.twitter.com/OWd6epcIyk — Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2021 Many More Happy returns of the day #Venkymama @venkymama #HBDVenkymama Stay Blessed in every area of your life, may god rule and rein over your life every deep desire come true this year in Film industry, May this Special Year ahead be filled with joy, Happiness, Health & Wealth. pic.twitter.com/4ogRrVCBiA — Victory Casting (@CastingVictory) December 13, 2021 Wishing a SUPER DUPER HAPPY MUSICAL BDAY to Dearest VICTORY VENKATESH sirr ! ❤️🎶😍🤗 @VenkyMama ❤️ Love Ur Energy always sir..Very Inspiring🤗 Keep Rocking wit ur Versatile Movies & Evergreen Blockbusters dear Sir ! Its always amazing to work with U🎶🙏🏻#HBDVictoryVenkatesh pic.twitter.com/y2LQXHlbiB — DEVI SRI PRASAD (@ThisIsDSP) December 13, 2021 Wishing My Favourite ⭐️ Person ❤️a lovely human to be around with Always with heart energy and overflowing ideas 🎧✨ the Victorious @VenkyMama gaaru a very happiest birthday ♥️ #HBDVictoryVenkatesh 🏆 pic.twitter.com/nQUO5rJh6d — thaman S (@MusicThaman) December 13, 2021 -
దృశ్యం- 2పై కీలక అప్డేట్..
హీరో వెంకటేశ్ శరవేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ (తమిళ చిత్రం ‘అసురన్’కు తెలుగు రీమేక్) సినిమా షూట్‌ను పూర్తి చేసిన వెంకటేశ్ తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా పూర్తిగా ప్యాకప్ చెప్పారు. ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే దృశ్యం 2ను ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించినా నిర్మాత సురేశ్ బాబు వాటిని ఖండించారు. అయితే తాజాగా సినిమాల విడుదలకు ఆలస్యం అవుతుండటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ద్వారా 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేసి, థియేటర్లు తెరుచుకున్న తరువాత 'నారప్ప'ను రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెంటకేష్ వెల్లడించినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు. అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన రూపొందిన సినిమానే దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్‌గాతెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ జంటగా నటించారు. చదవండి : తారక్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎంత తీసుకుంటున్నారంటే.. చిరు, పవన్, వెంకీతో సహా అంతా..ఆ కథలే, ఎందుకు? -
స్పీడు పెంచిన వెంకటేశ్
హీరో వెంకటేశ్ మంచి జోష్‌లో ఉన్నారు. సినిమాల మీద సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ (తమిళ చిత్రం ‘అసురన్’కు తెలుగు రీమేక్) సినిమా షూట్‌ను పూర్తి చేసిన వెంకటేశ్ తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా పూర్తిగా ప్యాకప్ చెప్పారు. మలయాళ ‘దృశ్యం 2’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ తొలి భాగంలో భార్యాభర్తలుగా నటించిన వెంకటేశ్, మీనాలే సీక్వెల్లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబందం ప్రకటించింది. ఇప్పుడు నదియా, మీనా కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు వెంకటేశ్ ‘ఎఫ్–3’ సినిమాతో బిజీ అవుతారు. -
వెంకీ.. శేఖర్... ఓ సినిమా!
వెంకటేష్ స్పీడ్ మాములుగా లేదు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల (‘నారప్ప’, ‘ఎఫ్ 3’, ‘దృశ్యం2’)ను విడుదలకు సిద్ధం చేస్తున్న వెంకటేష్ తాజాగా మరో సినిమాకు పచ్చజెండా ఉపారని సమాచారం. ఇటీవల శేఖర్ కమ్ముల చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారట వెంకీ. త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని టాక్. ప్రస్తుతం నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు శేఖర్ కమ్ముల. ‘లవ్‌స్టోరీ’ వచ్చే నెల 16న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత వెంకీకి చెప్పిన స్క్రిప్ట్‌పై మరింత దృష్టి పెడతారట శేఖర్. ఇక వెంకీ నటిస్తున్న ‘నారప్ప’ మే 14న, ‘దృశ్యం 2’ జూలైలో, ‘ఎఫ్ 3’ ఆగస్టు 27న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. -
తండ్రి వర్థంతి: హీరో వెంకటేష్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలన చిత్ర నిర్మాతగా వచ్చి దేశవ్యాప్తంగా ఎన్నో బాషల్లో సినిమాలు నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచారు ప్రముఖ దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు. నేడు ఆయన 6వ వర్థంతి. 2015 ఫిబ్రవరి 18న ఆయన అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెండవ కుమారుడు, హీరో విక్టర్ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. తన ట్విటర్ ఖాతాలో తండ్రి చిత్ర పటాన్ని గురువారం షేర్ చేస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘ఇన్నేళ్లు గడిచాయి. కానీ ఈ రోజు మిగిల్చిన చేదు అనుభవాన్ని మాత్రం అంత ఈజీగా మరవకలేకపోతున్నాం. ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న. లవ్ యూ. మిస్ యూ’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే ఆయన పెద్ద కూమారుడు, నిర్మాత సురేష్ బాబు.. తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్‌లోని రామానాయడు విగ్రహానికి సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి నివాళులు ఘటించారు. Even after all these years, this day is never easy. Thank you for all the memories Nana. Love you and miss you 😞♥️ pic.twitter.com/lLPGe9nyMH — Venkatesh Daggubati (@VenkyMama) February 18, 2021 (చదవండి: ఆసక్తి రేపుతున్న నారప్ప టీజర్) (వెంకీ మామ ఇంటి పని అదిరింది) -
ఆసక్తి రేపుతున్న నారప్ప టీజర్
బర్త్‌డే సందర్భంగా వెంకటేశ్ తాజా ఫొటోషూట్ స్టిల్స్‌ను విడుదల చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో వెంకీ లుక్ అదుర్స్ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో చేయబోయే చిత్రంలో వెంకటేశ్ ఈ గెటప్‌లో కనబడతారనే ఊహాగానాలు ఉన్నాయి. నారప్ప మంచివాడు. కానీ అన్యాయాన్ని సహించలేడు. కత్తి దూస్తాడు. కళ్లల్లో కనిపించే ఆ ఆగ్రహం చూస్తే శత్రువులు పారిపోవాల్సిందే. ఇప్పటివరకూ తన కెరీర్లో ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన వెంకటేశ్ ఇప్పుడు నారప్పగా మంచి మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన వెంకీ లుక్స్ బయటికొచ్చాయి. ఆదివారం (డిసెంబర్ 13) వెంకీ పుట్టినరోజు సందర్భంగా ‘గ్లింప్స్ ఆఫ్ నారప్ప’ అంటూ శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆగ్రహం నిండిన కళ్లతో, చేతిలో కత్తితో వెంకీ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ధనుశ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘అసురన్’కి ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డి. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. -
కొత్త లుక్‌తో కేక పుట్టిస్తోన్న నారప్ప..
-
నాన్‌స్టాప్ నారప్ప
వికారాబాద్ అడవుల్లోకి ఎంటరయ్యారు నారప్ప. నెక్ట్స్ పదిహేను రోజులు అక్కడే మకాం అని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. సురేశ్‌బాబు, కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ వికారాబాద్ అడవుల్లో ప్రారంభం అయింది. పదిహేను రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ కొనసాగనుంది. కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివరికల్లా సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయా లనుకుంటున్నారు. -
విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఫోటోలు
-
ఎఫ్3 షురూ
వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా స్క్రీన్‌పై సందడి చేసిన సినిమా ‘ఎఫ్ 2’ (‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’). అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ తెరకెక్కించబోతున్నట్టు అనిల్ రావిపూడి ఆ మధ్య స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ‘ఎఫ్2’లో కనిపించిన వెంకటేశ్, వరుణ్ తేజ్ ఇందులో కనిపించనున్నారు. వారికి జోడీగా తమన్నా, మెహరీనే కనిపిస్తారు. మరి.. కాంబినేషన్లో ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి. అలాగే వీరితో పాటు ఇంకో హీరో కూడా సందడి చేయనున్నారని టాక్. -
భారీ కుంభకోణం
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ బ్రదర్ – సిస్టర్‌గా నటిస్తోన్న క్రాస్ఓవర్ చిత్రం ‘మోసగాళ్లు’. శుక్రవారం హీరో వెంకటేశ్ ఈ చిత్రానికి సంబంధించిన ‘ది రైజ్ ఆఫ్ మోసగాళ్లు’ (టైటిల్ థీమ్ మ్యూజిక్)ను విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. భారత్‌లో మొదౖలై అమెరికాను సైతం వణికించిన చరిత్రలోనే అతి పెద్ద భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్‌శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్. -
కాంబినేషన్ కుదిరిందా?
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరు వెంకటేష్. తన కథలో ప్రేక్షకులను లీనం చేయగలుగుతారు దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కడానికి సన్నాహాలు మొదలు కాబోతున్నాయనేది ఫిల్మ్‌నగర్ టాక్. ఈ లాక్డౌన్ సమయంలో ఓ స్క్రిప్ట్‌ను రెడీ చేశారట శేఖర్ కమ్ముల. ఈ కథలో వెంకటేష్ హీరోగా నటించబోతున్నారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ ‘నారప్ప’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
వెంకీ మామ ఇంటి పని అదిరింది
-
మరో రీమేక్‌లో...
త్వరలో వెంకటేశ్ తన కెరీర్లో 75వ మైలురాయిని టచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ ఆయన కెరీర్లో 73వ చిత్రం. ఈ 73 చిత్రాల్లో 20కి పైగా రీమేక్ చిత్రాలు ఉండటం విశేషం. వాటిలో సుందరాకాండ, రాజా, జెమిని, వసంతం, ఘర్షణ, గోపాల గోపాల, బాడీగార్డ్, దృశ్యం, గురు.. ఇలాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకీ మరో రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘అసురన్’ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించనున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరులో విడుదలైన ‘అసురన్’ ఘనవిజయం సాధించింది. తెలుగు రీమేక్‌ని సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ పతాకాలపై కలైపులి యస్. థాను, డి. సురేశ్‌బాబు నిర్మించనున్నారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. వెంకటేశ్ కెరీర్లో ఇది 74వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. -
నవంబర్ నుంచి షురూ
ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాలో సందడి సందడి చేస్తున్నారు వెంకటేశ్. ఈ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. ‘వెంకీ మామ’ తర్వాత వెంకీ ఏం చేయబోతున్నారు? అంటే.. ‘సినిమా చూపిస్త మామ’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమాను నవంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని సమాచారం. నాన్‌స్టాప్ సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. వెంకటేశ్ ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ అక్టోబర్ నెలలో రిలీజ్ కానుంది. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
యాక్షన్ థ్రిల్లర్ ‘22’ షురూ..
శివకుమార్ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు (జులై 22) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, కొండా కృష్ణం రాజు సంయుక్తంగా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ముహూర్తపు షాట్‌కు భీమినేని శ్రీనివాస రావు గౌరవ దర్శకత్వం వహించారు. హరీష్ శంకర్ చిత్ర దర్శకుడుకి స్క్రిప్ట్ అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ హాజరయ్యారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) సి.అశ్వనీదత్, కె.ఎస్. రామారావు, యం.యస్.రాజు, అనీల్ సుంకర, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.కె. రాధామోహన్, సముద్ర, నిమ్మకాయల ప్రసాద్, చిట్టూరి శ్రీనివాసరావు, సాగర్ తదితరులు హాజరై దర్శక నిర్మాతలకి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి కాలంలో చిన్న సినిమాకి ఇంతమంది అతిథులు హాజరై శుభాకాంక్షలు తెలపడం విశేషం. కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులందరికీ చిత్ర యునిట్ ధన్యవాదాలు తెలిపింది. -
రెండు కుటుంబాల మధ్య మిస్ మ్యాచ్
‘‘మిస్ మ్యాచ్’ టీజర్ ఆసక్తిగా ఉంది. కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఉదయ్ శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజాగారికి, డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్ ఆఫ్ లక్’’ అని హీరో వెంకటేష్ అన్నారు. ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా తమిళ చిత్రం ‘సలీం’ ఫేమ్ ఎన్.వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను వెంకటేష్ విడుదల చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘ఆటకదరా శివ’కు వెంకటేష్‌గారు చాలా సహకారం అందించారు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్’ టీజర్ ఆయన చేతుల మీదగా విడుదలవడం సంతోషంగా ఉంది. భూపతిరాజాగారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు ఎన్.వి.నిర్మల్. ‘‘ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు శ్రీరామ్. ‘‘రెండు కుటుంబాల మధ్య జరిగే కథే ‘మిస్ మ్యాచ్’’ అన్నారు రచయిత భూపతిరాజా. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కెమెరా: గణేష్ చంద్ర. -
ఇలాంటి సినిమాలనే యూత్ ఆదరిస్తున్నారు
కమెడియన్ గౌతమ్‌రాజు తనయుడు కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్’. శ్రీనాథ్ పులకరం దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం టీజర్ రిలీజైంది. రిలీజైన ఈ చిత్రం టీజర్‌ను వెంకటేశ్ అభినందిస్తూ– ‘‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్’ టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. రియలిస్టిక్‌గా ఉంది. ప్రస్తుతం ఇలాంటి సినిమాలనే యూత్ ఎంకరేజ్ చేస్తున్నారు. కృష్ణ నటుడిగా మంచి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్‌ది బెస్ట్’’ అన్నారు వెంకటేశ్. ‘‘త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సపోర్ట్ చేసిన వెంకటేశ్‌గారికి కృతజ్ఙతలు’’ అన్నారు గౌతంరాజు. ‘‘టీజర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అన్నారు కృష్ణ. -
‘జెర్సీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
నాని అభిమానులు గర్వంగా ఫీలవ్వాలి
‘‘జెర్సీ’ వంటి మంచి సినిమా చేసినందుకు నానికి అభినందనలు. తన తొలి చిత్రం ‘అష్టా చమ్మా’ నుంచి నాని అద్భుతంగా నటిస్తున్నాడు. తను వన్నాఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. నాని అభిమానులు చాలా గర్వంగా ఫీలవ్వాలి. మన తెలుగు ఇండస్ట్రీలో వన్నాఫ్ ది మోస్ట్ నేచురల్ యాక్టర్స్ తను.. నేను గర్వంగా ఫీలవుతున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ముఖ్య అతిథి వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చానని కాదు.. వాస్తవం ఏంటంటే ‘జెర్సీ’ కోసమే వచ్చాను. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసినప్పటి నుంచే చాలా ఇంప్రెస్ అయ్యా. ఈ సినిమాలో నేనూ భాగస్వామ్యం అయితే బాగుంటుందనుకున్నా. డైరెక్టర్ గౌతమ్ చాలా క్లియర్‌గా ఉన్నాడు.. సినిమాలో ఏం చూపించాలనే అంశంపై. ట్రైలర్ చూశాక ఒకే ఒక్క మాట చెప్పాలనిపిస్తోంది.. మైండ్ బ్లోయింగ్. ఇలాంటి నిజాయతీ ఉన్న సినిమాలు అరుదుగా వస్తాయి. ఇటువంటి చిత్రాలు నాని ఎంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్లలేం. ‘జెర్సీ’లాంటి సినిమాల్లోని పాత్రల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా ఎమోషన్ అయిపోతాం. ఇలాంటి సినిమాలు చాలా ఇన్స్పిరేషన్గా, మోటివేషన్‌గా నిలుస్తాయని ట్రైలర్ చూడగానే అర్థమైంది. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. కానీ, వెనక్కి రాకుండా నిలదొక్కుకుని విజయాలు సాధించినప్పుడే థ్రిల్ ఉంటుంది. అదే ఈ సినిమాలో నాని చూపించబోతున్నాడు. ఈ చిత్రం చూశాక ఇది సినిమా కాదు, మన జీవితం అని అందరూ భావిస్తారు. కొన్ని సినిమాలు అందరికీ పాఠాలు నేర్పిస్తాయి. మీరు కన్న కలలు, మీ లక్ష్యం గుర్తొస్తాయి. ఇది మైండ్‌లో పెట్టుకుని మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఇదే విషయాన్ని నాని చూపించబోతున్నాడు.. ఈ సినిమా ఔట్ స్టాండింగ్‌గా ఉంటుందనే నాకు నమ్మకం ఉంది. టీమ్ అందరికీ అభినందనలు. ఈ చిత్రనిర్మాతలు నాకు మంచి మిత్రులు. మంచి సినిమా చేశారని గర్వంగా భావిస్తున్నా. మంచి సినిమా తీసిన గౌతమ్‌కి అభినందనలు. శ్రద్ధా శ్రీనాథ్ చాలా అందంగా కనిపిస్తున్నారు’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారు ఆవకాయలాంటివారు. ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆయన్ను చూస్తే ఏదో తెలియని ఓ పాజిటివిటీ. పెద్ద తెరపై చూసిన ఓ స్టార్‌ని పర్సనల్‌గా కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నచ్చేసిన ఒకే ఒక్క స్టార్ వెంకటేశ్‌గారు. ఆయన ఫంక్షన్‌కి వెళ్లాలనే కోరిక ‘బాబు బంగారం’ సినిమాతో తీరిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఆయన నా సినిమా ఫంక్షన్‌కి వస్తే బాగుండేదనే కోరిక ‘జెర్సీ’తో తీరింది. ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరం కలిసి ఓ సినిమా చేసి స్టేజ్‌ని షేర్ చేసుకోవాలనే కోరిక ఇంకా బలంగా ఉంది. మీతో స్క్రీన్ షేర్ చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఏదైనా మల్టీస్టారర్ సినిమా గురించి డిస్కషన్స్ వస్తే వెంకటేశ్‌గారు, నేను కలిసి చేస్తే బాగుంటుందని చాలా మంది నాతో అన్నారు. దాని కోసం వేచి చూస్తున్నా. ‘జెర్సీ’ ఆల్రెడీ నాకు చాలా చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ ఫంక్షన్‌కి ఆయన రావడంతో ఇంకా ఇంకా ప్రత్యేకం అయిపోయింది. ‘జెర్సీ’ టీమ్ తరఫున ధన్యవాదాలు సార్. ఇక ‘జెర్సీ’ విషయానికొస్తే.. నిజంగా మొదటిసారి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఎందుకంటే ఏప్రిల్ 19న మీరంతా చాలా గర్వపడతారు. ఈ సినిమాకి పనిచేసిన టీమ్ అందర్నీ చూసి గర్వపడతారు. మీరందరూ గర్వించదగ్గ ఓ సినిమాలో నేనూ భాగం అయినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. కన్ఫార్మ్.. ఫిక్స్ అయిపోండి. బ్లాక్ బస్టర్ అనే మాటలు అనటం లేదు. ఒక మంచి సినిమా పక్కన ఇలాంటి పదాలు పెట్టకూడదనిపిస్తోంది. అంత గొప్ప సినిమా చేశాననే పూర్తి సంతృప్తి ఉంది నాకు. ఎందుకింత సంతృప్తి అనేది 19న చూస్తారు. గౌతమ్ ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. తను ఈరోజు ఇక్కడ లేడు.. మాట్లాడలేకపోవచ్చు. కానీ 19న తన సినిమా మాట్లాడుతుంది. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ కథ చెప్పడంలోనే ఒక భాగమయ్యారు. ఇంత అందమైన సినిమా చేశాననే భావనను ఏదైనా మాటల్లో చెప్పాలంటే ఏం చెప్పినాసరే నాకు తక్కువ అయిపోతుంది. గౌతమ్ కొడుక్కి చెబుతున్నా.. మీ నాన్న చాలా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ‘జెర్సీ’ సినిమాని పూర్తిగా అర్థం చేసుకునే వయస్సు నీకుందో లేదో తెలియదు కానీ, నువ్వు పెద్దయ్యాక మీ నాన్నకి బిగ్గెస్ట్ ఫ్యాన్ అవుతావని కచ్చితంగా చెప్పగలను. ‘జెర్సీ’ ట్రైలర్ మీ అందరికీ (అభిమానులు) నచ్చిందా? ‘జెర్సీ’ ట్రైలర్ స్టైల్లో చెప్పాలంటే ‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు దాకా నన్ను జడ్జ్ చేయంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే.. మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను’’ అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘నానిగారికి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. వంశీ పంపిన ‘జెర్సీ’ ట్రైలర్ చూసి షాక్ అయ్యా. గౌతమ్ ఎంతో ఎఫర్ట్ పెట్టి బాగా తీశారు. వేసవిలో రెగ్యులర్ క్రికెట్‌కి మించి ఈ సినిమాలో క్రికెట్ ఉంటుంది. ఇది చాలా మంచి సినిమా. ఎవరూ మిస్ అవ్వొద్దు.. తప్పకుండా చూడాలి. మా సితార ఎంటర్టైన్మెంట్స్కి మంచి హిట్ ఇవ్వాలి’’ అన్నారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఏది ఏమైనా నాని నాకు ప్రత్యేకం.. కారణం మీ అందరికీ తెలుసు. ఆర్జేగా పనిచేస్తున్న ఓ కుర్రాడు(నాని) 2008లో మా ఆఫీసుకి వచ్చి ‘అష్టా చమ్మా’కి ఆడిషన్స్ ఇవ్వడం గుర్తుంది. నాని.. నువ్వు స్టార్ మెటీరియల్ అని మెయిల్ చేశా. దశాబ్దం తర్వాత ఇప్పుడు ఆ మాట గుర్తుకొస్తోంది. నా మాట నిజమైనందుకు గర్వపడుతున్నా. ‘జెర్సీ’ సినిమా నాకు క్లోజ్. క్రికెట్ నేపథ్యంలో ‘గోల్కొండ హైస్కూల్’ సినిమా చేశా. ‘జెర్సీ’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అందులో ఎటువంటి డౌట్ లేదు. గౌతమ్ ‘మళ్ళీ రావా’ సినిమా చూసి ఎంజాయ్ చేశా. ఈ సినిమాతో తనకు మరో హిట్ రావాలి’’ అన్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ– ‘‘కన్నడ, తమిళ్, హిందీ సినిమాలు చేశా. ‘జెర్సీ’ లాంటి మంచి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అవుతుండటం నా అదృష్టం. నాలుగేళ్ల క్రితం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యాక్టింగ్ చేయడం తప్ప వేరే దేని గురించి తెలీదు. మంచి పాత్రలు చేయాలనుకునేదాన్ని.. ఇప్పుడు చాలా హ్యాపీ. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన గౌతమ్‌గారు నా హీరో. నిర్మాతలకు థ్యాంక్స్. నానీకి బిగ్ థ్యాంక్స్. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇంత పెద్ద సినిమాలో నేనూ ఓ చిన్న భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. నిర్మాతలు రాధాకృష్ణ, మోహన్, రామ్ ఆచంట, డైరెక్టర్స్ సుధీర్ వర్మ, విక్రమ్ కె.కుమార్, వెంకీ కుడుముల, నటులు సత్యరాజ్, ప్రవీణ్, జశ్వంత్, కెమెరామేన్ సాను జాన్ వర్గీస్, పాటల రచయిత కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎఫ్2’ టీజర్ ఎప్పుడంటే..?
ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్‌డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మాస్ పల్స్‌ను పట్టుకోవడంలో దిట్ట. తీసిన మూడు సినిమాల్లో కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ప్రతీది ఉండేలా.. మాస్కు చేరువయ్యేలా తెరకెక్కించారు. పటాస్, సుప్రీమ్, రాజాదిగ్రేట్ సినిమాలతో వరుసగా హిట్లు కొట్టిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఎఫ్2(ఫన్ అండ్ ఫస్ట్రేషన్) అనే మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక వరుసగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనిలో భాగంగానే వెంకటేష్ పుట్టిన రోజు(డిసెంబర్ 13) సందర్భంగా.. స్పెషల్ తేదీ(డిసెంబర్ 12)న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. -
వెంకీ... ఖుష్బూ@ 32
వెంకటేశ్ ఐదు పదుల వయసు దాటేసిన విషయం తెలిసిందే. కానీ తన వయసు ఇంకా 32 ఏళ్లే అంటున్నారాయన. వెంకీ అబద్ధం చెప్పడం లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. యాక్టర్‌గా 32 ఇయర్స్ అని ఆయన అంటున్నారు. ‘‘14 ఆగస్టు 1986లో నేను హీరోగా నటించిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ విడుదలైంది. మంగళవారంతో నాకు ఇండస్ట్రీలో 32 ఏళ్లు ముగిశాయి. ఈ ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేయడంతో పాటు అభిమానించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని వెంకీ అన్నారు. ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యేందుకు వెంకీ ఫొటో షేరింగ్ యాప్ ‘ఇన్స్టాగ్రామ్’లో జాయిన్ అయ్యారు. ‘‘సౌత్‌లో హీరోయిన్గా నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ విడుదలై అప్పుడే 32 ఏళ్లు కంప్లీట్ అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్ల జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలాను చూశా. అండగా ఉన్నవారికి థ్యాంక్స్’’ అన్నారు ఖుష్బూ. -
కామెడీ డోస్ డబుల్
ఇక నుంచి ఫన్ డబులవ్వనుంది. కామెడీ డోస్ రెండింతలు కానుంది. ఎందుకంటే వెంకటేశ్ సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి. ఈ ఫన్ రైడ్‌లో ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు అనిల్ రావిపూడి. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ రూపొందుతోంది. వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ యాక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల స్టార్ట్ అయిన ఈ షూటింగ్లో ఆల్రెడీ వరుణ్, మెహరీన్ జాయిన్ అయ్యారు. లేటెస్ట్గా వెంకటేశ్ కూడా ఎంట్రీ ఇచ్చి డబుల్ ఫన్ సృష్టించనున్నారు. ‘‘ఈరోజు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఇవాళ (సోమవారం) వెంకటేశ్‌గారు షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ టైమ్ వెంకటేశ్‌గారితో వర్క్ చేయడం హానర్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
వెంకీ ఎంట్రీ
ఫన్ రైడ్‌ని వెంకటేశ్ లేకుండా స్టార్ట్ చేశారు వరుణ్ తేజ్. ఇప్పుడు ఈ ప్రయాణంలోకి వెంకీ కూడా ఎంటర్ అవుతారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది క్యాప్షన్. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. నేటి నుంచి ఈ చిత్రం షూటింగ్లో వెంకటేశ్ పాల్గొననున్నారని సమాచారం. ఆల్రెడీ వరుణ్ తేజ్, మెహరీన్‌లు ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ సరసన తమన్నా యాక్ట్ చేయనున్నారు. -
ఫన్లోకి ఎంట్రీ
ఫన్ను డబుల్ నుంచి ట్రిపుల్ చేయడానికి ఫన్ రైడ్‌లో జాయిన్ అయ్యారు కథానాయిక మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌లోకి రీసెంట్గా వరుణ్ తేజ్ జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సెట్లోకి మెహరీన్ ఎంట్రీ ఇచ్చారు. వరుణ్‌తేజ్, మెహరీన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. హాస్యనటుడు ప్రియదర్శి కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా నటించనున్నారన్న విషయం తెలిసిందే. -
ఆన్ ట్రాక్
జస్ట్ మూడు రోజులు.. అంతే. మామా అల్లుళ్లు రంగంలోకి దిగుతారు. ఎందుకు అంటే? సినిమా కోసం. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11న జరుగుతుందని సమాచారం. అంటే ఆ రోజు నుంచీ మామా అల్లుళ్లు ఆన్ ట్రాక్ అన్నమాట. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘వెంకీ మామా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. రియల్ లైఫ్ మాదిరిగానే ఈ సినిమాలో మామా అల్లుళ్ల పాత్రల్లో నటించనున్నారట వెంకీ అండ్ చైతూ. ఆల్రెడీ నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు. మామా అల్లుళ్లు సినిమాలో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
ముహూర్తం ఫిక్స్?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్‌తో ‘ఎఫ్ 2’, బాబీ డైరెక్షన్లో నాగ చైతన్యతో ఓ మల్టీ స్టార్ మూవీకి ఓకే చెప్పారు వెంకటేశ్. ఇలా వరుసగా రెండు మల్టీస్టారర్ చిత్రాల తర్వాత సోలో హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ ఓకే చేశారు వెంకీ. ఇది వరకూ వెంకీ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి హిట్ సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒప్పుకున్న ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ వెంకటేశ్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా ముహూర్తాన్ని డిసెంబర్లో ఫిక్స్ చేశారని సమాచారం. రెగ్యులర్ షూటింగ్‌ను 2019 జనవరి నుంచి స్టార్ట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై యస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
రామ్మా.. హ్యూమా
‘కాలా’ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఒప్పుకున్నారో కానీ తమిళంలో కాలు పెట్టాక తెలుగులో కాలు పెట్టే అవకాశం వచ్చింది హ్యూమా ఖురేషీకి. మరి... రజనీకాంత్ ‘కాలా’ విడుదలయ్యాక ఈ బ్యూటీ సౌత్‌లో ఫుల్ బిజీ అవుతారేమో కాలమే చెప్పాలి. ఈ 7న విడుదల కానున్న ‘కాలా’ కోసం హ్యూమా వెయిటింగ్ అట. ప్రస్తుతం తెలుగులో ఆమెను వరించిన ఆçఫర్ విషయానికొస్తే... విక్టరీ వెంకటేశ్‌తో హ్యూమా జోడీ కట్టనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వెంకీ ‘గురు’ సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. ఏడాది గ్యాప్ తీసుకోవడం వల్లనో ఏమో ఆయన స్పీడ్ పెంచారు. ప్రస్తుతం వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిలోబాబీ దర్శక త్వంలో చేయనున్న సినిమా ఒకటి. ఇందులో వెంకీ– నాగచైతన్య మామా అల్లుళ్లగా కనిపించ నున్నారు. వెంకీ సరసన బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీని నాయికగా తీసుకోవా లనుకున్నా రట. హ్యూమాతో చర్చించా రని సమాచారం. ఇది కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రం చేయనున్నారు వెంకటేశ్. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరో. వెంకీకి జోడీగా తమన్నా కనిపించనున్నారు. -
ఎఫ్2 పెయిర్ ఫిక్స్
ఒకరేమో ఫన్నీ. మరొకరు ఫ్రస్ట్రేటింగ్. మరి వీళ్లకు జోడి కుదిరితే ఎలా ఉంటుంది? ఒకరు ఫన్నీ పెయిర్ అవుతారు. మరొకరు ఫ్రస్ట్రేటింగ్ పెయిర్‌లా తయారవుతారు. ఇందులో ఫన్ క్రియేట్ చేసే ఫన్నీ పెయిర్ ఎవరు? ఫ్రస్ట్రేట్ అయ్యే ఫ్రస్ట్రేటింగ్ పెయిర్ ఎవరు? అనే విషయం తెలియాలంటే మాత్రం మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అనిల్ రావిపూడి. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్‌తేజ్‌కు జోడీగా మెహరీన్‌లను ఫిక్స్ చేసింది చిత్రబృందం. ‘‘ఈ ఫన్ రైడ్‌లో భాగమైనందుకు సూపర్ హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు మెహరీన్. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. -
రోడ్డుపై షటిల్ ఆడిన విక్టరీ వెంకటేశ్
మొన్న క్రికెట్ దేవుడు సచిన్ రోడ్డు పైకి వచ్చి క్రికెట్ ఆడారు. స్టేడియంలో ఆడటం వేరు. బయట రోడ్డుపైకి వచ్చి పిల్లలతో ఆడటం వేరు. స్వయంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఆడటంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. విక్టరీ వెంకటేశ్ కూడా అదేవిధంగా పిల్లలతో షటిల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సరదాగా కాసేపు పిల్లలతో ఆడిన వెంకటేశ్ ఆటను చూసి ముచ్చట పడ్డారు అక్కడి వారు. వెంటనే వెంకీ ఆటను కెమెరాలో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియలేదు. గతేడాది ‘గురు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో వెంకీ నటనకు ప్రశంసలు దక్కాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వెంకీ, వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ తేజతో కూడా వెంకటేశ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. -
వెంకీకి జోడిగా మిల్కీ బ్యూటీ
గురు సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు విక్టరీ వెంకటేశ్. కానీ ఈ మూవీ వచ్చి ఏడాది గడుస్తున్నా... వెంకీ నుంచి కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆచితూచి స్ర్కిప్ట్స్కు ఓకే చెప్పడమే దీనికి కారణం అని తెలుస్తోంది. డైరెక్టర్ తేజతో ఓ సినిమా ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మల్టిస్టారర్‌లో వరుణ్‌తేజ్,వెంకటేశ్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ తాజాగా దిల్ రాజు అధికారికంగా ప్రకటించేశారు. వెంకీకి జోడిగా మిల్కీ బ్యూటిని, వరుణ్‌కు జోడిగా మెహరీన్‌ను తీసుకున్నుట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. జూన్‌లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఆద్యంతం వినోదంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. -
ఫన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్... తొలకరిలో స్టార్టవ్వున్
ఫన్ ఒకరిది. ఫ్రస్ట్రేషన్ మరొకరిది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఆడియన్స్‌ది. ఈ ఎంటర్టైన్మెంట్ను సిల్వర్‌స్క్రీన్‌పై అందించేందుకు ‘ఎఫ్2’లో జాయిన్ అవ్వడానికి వీ2 రెడీ అవుతున్నారు. వేసవిలో ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని వర్షాకాలంలో షూటింగ్‌కు కొబ్బరికాయకొట్టి చలికాలంలో చిత్రానికి గుమ్మడికాయ కొట్టేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). అయితే ఎవరు ఫన్ క్యారెక్టర్ చేయబోతున్నారు? ఎవరు ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్లో నటించనున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్గా ఈ సినిమా టైటిల్ లోగోను అధికారికంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్నట్లు... వీ2 అంటే వెంకీ ప్లస్ వరుణ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్‌ను జూన్‌లో స్టార్ట్ చేయనున్నారు.‘‘ఎఫ్2’ సినిమా షూటింగ్‌ను జూన్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సెట్లో ఫుల్ ఫన్ స్టార్ట్ అవ్వబోయేది అప్పుడే’’ అని పేర్కొన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అంతేకాదు వెంకీ, వరుణ్, ‘దిల్’ రాజుతో ఉన్న ఫొటోను అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించనున్నారని టాక్. -
ఎఫ్ 2లో వి సరసన ఎమ్?
హ్యాట్రిక్ హిట్స్‌తో ఫామ్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఆయన వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో ఓ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) రూపొందించనున్న విషయం తెలిసిందే. ఇందులో ఎవరు ఫన్ క్రియేట్ చేస్తారు, ఎవరు ఫ్రస్టేట్ అవుతారు అన్న విషయం స్క్రీన్ పైనే తెలుసుకోవాలి. ఈ సినిమాలో వి (వరుణ్ తేజ్) పక్కన హీరోయిన్గా ఎమ్ (మెహరీన్)ను కన్ఫార్మ్ చేసినట్టు సమాచారం. ఆ మధ్య విడుదలైన అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’లో మెహరీనే హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, మెహరీన్ జంటగా యాక్ట్ చేయడం ఇదే తొలిసారి. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. -
చార్మింగ్ పెయిర్
మూడు హిట్ సినిమాల తర్వాత మారోసారి జోడీ కట్టనున్నారు వెంకటేశ్, నయనయతార. ‘లక్ష్మీ, తులసి, బాబు బంగారం’.. ఇలా మూడు సార్లు సిల్వర్ స్కీన్‌పై సందడి చేసి, చార్మింగ్ పెయిర్ అనిపించుకున్న ఈ జోడీ ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారని సమాచారం. కేయస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య ఓ మల్టీస్టారర్ మూవీలో యాక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హీరోయిన్గా నయనతార పేరుని పరిశీలిస్తుందట చిత్రబృందం. నాగచైతన్య పక్కన హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్, కోనా ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందట. -
వీ2 ఇన్ ఎఫ్2
వీ స్క్వేర్ ప్లస్ వీటీ బికమ్స్ వీ2. ఈక్వల్ టు ఎఫ్2. ఫైనల్లీ వీ2 ఇన్ ఎఫ్2. ఫార్ములా ఫన్‌గా ఉంది కదూ. సేమ్‌టైమ్ కన్ఫ్యూజ్డ్గా కూడా ఉంది కదూ. డిఫికల్ట్‌గా ఉన్న ఈ ఫన్ ఫార్ములా సాల్వ్ చేయడం ఈజీ. విక్టరీ వెంకటేశ్(వీవీ) ఈజ్ వీ స్క్వేర్. వీటీ ఈజ్ వరుణ్ తేజ్. ఈ ఇద్దరూ కలిసి చేయబోతున్న సినిమా ‘ఎఫ్2’. అదే ‘ఫన్ అండ్ ఫస్ట్రేషన్’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీకి ‘ఎఫ్2’ అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ‘‘వెంకటేశ్‌గారు, ‘దిల్’ రాజుగారు, అనిల్ రావిపూడిలతో సూపర్ ఫన్ ఫిల్మ్ చేయబోతున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘వెంకటేశ్‌గారు, సూపర్ కూల్ వరుణ్ తేజ్ హీరోలుగా నా దర్శకత్వంలో ‘దిల్’ రాజుగారి బ్యానర్లో సినిమా రానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. జూలైలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది’’ అన్నాయి చిత్రవర్గాలు. -
ఉగాది రోజున అనిల్ రావిపూడి కొత్త సినిమా?
తీసింది మూడు సినిమాలే. కానీ, యంగ్ హీరోలకు ఈ డైరెక్టర్ హాట్ ఫేవరెట్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ ఇలా తీసిన ప్రతి సినిమాలో తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో సినిమాను విజయతీరాలకు చేర్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. రీసెంట్గా రవితేజ ఖాతాలో హిట్ పడేసిన ఈ యువ దర్శకుడు ఉగాదికి తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఈసారి మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటిసారిగా మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ పెద్ద హీరోలతో ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించబోతున్నట్లు సమాచారం. తన మార్క్ కామెడీతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎఫ్ 2( ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి అనిల్ రెడీ అవుతున్నాడు. వెంకటేశ్‌కు జోడిగా తమన్నా నటించే అవకాశం ఉంది. -
అప్పుడు తెలుగు... ఇప్పుడు ఫిజిక్స్
తెలుగు మాస్టర్‌గా పద్యాలు చెప్పిన వెంకటేశ్ ఇప్పుడు ఫిజిక్స్ చెప్పడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఆల్మోస్ట్ పాతికేళ్ల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘సుందరకాండ’ చిత్రంలో వెంకటేశ్ తెలుగు మాస్టర్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తేజ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలోనే వెంకీ ఫిజిక్స్ లెక్చరర్‌గా నటించనున్నారని టాక్. ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ లుక్ ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇంతకీ ఫొటోను బాగా గమనించారు కదా! వెంకీ చేతిలో ఉంది ఫిజిక్స్ సబ్జెక్ట్‌కి చెందిన బుక్. సో.. ఈ సినిమాలో ఆయన ఫిజిక్స్ లెక్చరర్‌గా కనిపించనున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. నారా రోహిత్ ఓ కీలక పాత్రను చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ, అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలో వెంకటేశ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. -
జ్ఞాపకాలు బతికే ఉంటాయి
‘‘శ్రీదేవిలాంటి ఆర్టిస్ట్ వేరీ రేర్. భౌతికంగా ఆమె దూరమైనా శ్రీదేవి జ్ఞాపకాలు అలా బతికే ఉంటాయి’’ అన్నారు వెంకటేశ్. ముంబై వెళ్లి, శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొని హైదరాబాద్ వచ్చాక, ‘సాక్షి’తో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ► మీతో యాక్ట్ చేయకముందు శ్రీదేవిగారి గురించి మీరు విన్న మాటలు... యాక్చువల్లీ శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచే తన గురించి నాకు తెలుసు. ‘శ్రీదేవి అనే చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది. చాలా బాగా యాక్ట్ చేస్తోంది’ అని చెబుతుండేవారు. మేమంతా అప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. నాలుగైదేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది తను. 14–15 ఇయర్స్‌కే హీరోయిన్ అయిపోయింది. కమల్‌హాసన్‌గారు చైల్డ్ ఆర్టిస్ట్‌లాగా ఎలా వచ్చారో శ్రీదేవి కూడా అలానే వచ్చారు. హీరోలుగా మేం తర్వాత ఎంట్రీ ఇచ్చాం. యాక్టర్‌గా తను మోస్ట్ సీనియర్. తనుకున్న ఎక్స్పీరియన్స్ కానీ తన జర్నీ కానీ మోస్ట్ రేర్. ప్రపంచంలో అలా చాలా తక్కువమంది యాక్టర్స్ ఉంటారు. శ్రీదేవిలాంటి వాళ్లు సినిమా కోసమే పుట్టిన అరుదైన ఆర్టిస్టులు. అందుకే మనం వాళ్లను లెజెండ్స్ అంటుంటాం. 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు సినిమాకు డెడికేట్ చేయడమంటే మాటలు కాదు. ► ఏయన్నార్, ఎన్టీఆర్గార్లతో యాక్ట్ చేసిన శ్రీదేవి ఆ తర్వాతి తరం అయిన మీతో కూడా యాక్ట్ చేశారు. హీరోయిన్స్ విషయంలో ఇలా జరగడం రేర్ కదా.. డెఫినెట్లీ. అప్పటి టాప్ హీరోస్, టాప్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేసి, మళ్లీ మా తరం హీరోస్ అందరితోనూ యాక్ట్ చేయడమే కాకుండా వెళ్లిన ప్రతీ లాంగ్వేజ్‌లోనూ సూపర్ సక్సెస్ అవ్వడం శ్రీదేవి స్పెషాలిటీ. జనరల్‌గా హీరోయిన్ లైఫ్ స్పాన్ కొన్ని సంవత్సరాలే అని అంటుంటాం. కానీ శ్రీదేవి విషయంలో ఇది వర్తించదు. డీ–గ్లామర్ రోల్ చేసినా, మోస్ట్ గ్లామరస్ రోల్ చేసినా.. ఎక్సెల్ అయ్యారామె. డ్యాన్స్‌లు అంటే శ్రీదేవి. కాస్ట్యూమ్స్ అంటే శ్రీదేవి. యాక్టింగ్‌లో తీసుకుంటే ‘పదహారేళ్ల వయసు, ‘దేవత’ వంటి సినిమాలు ఉన్నాయి. మళ్లీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లాంటి సినిమాతో రీ–ఎంట్రీ ఇచ్చి, తన యాక్టింగ్ కేపబులిటీ చూపించారు. బేసిక్‌గా శ్రీదేవి బ్లడ్‌లోనే యాక్టింగ్ ఉంది. ► ‘ క్షణక్షణం’ అప్పుడు శ్రీదేవిగారు మీకంటే సీనియర్ కాబట్టి ఆవిడతో యాక్ట్ చేయడానికి వెనకాడారా? అలాంటిదేం లేదు. శ్రీదేవి హీరోయిన్ అనగానే టీమ్ అంతా చాలా ఎగై్జట్ అయ్యాం. ఇద్దరం చాలా బాగా యాక్ట్ చేశాం. అది ప్రతీ సీన్లోనూ కనిపిస్తుంది. కొన్ని కొన్ని సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌ను బాగా క్యాప్చర్ చేశాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. శ్రీదేవికి కూడా ఇది చాలా డిఫరెంట్ రోల్. మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో ట్రైన్ సీక్వెన్స్ అప్పుడు నేను పడిపోతే తను చేయి ఇవ్వడం.. చాలా ఫన్నీగా బావుంటాయి. సినిమా అయిపోతున్నా హీరో హీరోయిన్‌కు లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడు. ఫైనల్‌గా జస్ట్ ఇద్దరం హగ్ చేసుకుంటాం. జస్ట్ ఒక్క ఎక్స్ప్రెషన్తో చెప్పేస్తాం. ఆ సీన్లో ఇద్దరం చాలా న్యాచురల్‌గా ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. ► ‘జామురాతిరి జాబిలమ్మ...’ సాంగ్ ఎక్స్పీరియన్స్ గురించి? మేం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే టైమ్‌లో రాము ‘క్షణక్షణం’ సినిమాతో రావడం, అందులో నన్ను, శ్రీదేవిని కొత్త స్టైల్లో చూపించడం, అదొక కల్ట్ సినిమా అవ్వడం.. టోటల్‌గా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ‘జాము రాతిరి...’ సాంగ్ అంతా ఇద్దరం కూర్చుని, ఎక్స్‌ప్రెషన్స్‌తో చేశాం. నాకు తెలిసి ఇప్పటికీ ఏ హీరో హీరోయిన్ కంప్లీట్ సాంగ్ అంతా అలా కూర్చుని చేయలేదు. అది మాకు చాలెంజింగ్‌గా అనిపించింది. శ్రీదేవి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ నేను, నా ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూ తనూ... అలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఆ సాంగ్‌లో ఓ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ కనిపిస్తుంటుంది. ఆ జనరేషన్ ఈ జనరేషన్.. నెక్ట్స్ జనరేషన్... ఎవ్వరికైనా ఈ సాంగ్ ఓ క్లాసిక్. ► మీ సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌తో శ్రీదేవిగారికి మంచి అనుబంధం ఉంది.. అవును. నేను యాక్టర్ అవ్వకముందే శ్రీదేవి మా బ్యానర్లో ‘ముందడుగు, తోఫా’ వంటి సినిమాలు చేశారు. మా డాడీ ఫేవరెట్ ఆర్టిస్ట్. తను చూపించే ప్రొఫెషనలిజం, క్యారెక్టర్స్ విషయాల్లో చూపించే ఇంట్రెస్ట్, దర్శక–నిర్మాతల పట్ల గౌరవం... ఇవన్నీ శ్రీదేవి అంత పెద్ద స్టార్ అవ్వడానికి హెల్ప్ చేశాయి. యాక్టర్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి శ్రీదేవి జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. తనతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే మనందరినీ వదిలిపెట్టి వెళ్లిపోవడం బా«ధగా ఉంది. ► శ్రీదేవిగారి మరణ వార్త వినగానే షాకింగ్‌గా ఉండి ఉంటుంది.. చాలా. వెంటనే ముంబై వెళ్లాలనిపించింది. బోనీ కపూర్, అనిల్ కపూర్ నాకు, మా అన్నయ్య సురేష్‌కు క్లోజ్. అందుకే అక్కడ మేం ఉండాలి, వాళ్లకు మా సపోర్ట్ ఉండాలనిపించింది. అక్కడే ఉండిపోయాను. మేమే కాదు ఇండస్ట్రీ అంతా శ్రీదేవి కోసం వచ్చింది. మంచి ఫేర్వెల్ ఇచ్చారు. శ్రీదేవి డిజర్వ్ దట్ రెస్పెక్ట్. ► శ్రీదేవిలాంటి ఆర్టిస్ట్ భవిష్యత్‌లో రారని చాలామంది అంటున్నారు.. యస్.. శ్రీదేవిలా అంటే కష్టమే. ఫిల్మ్ ఇండస్ట్రీకు, అభిమానులకు మర్చిపోలేనన్ని జ్ఞాపకాల్ని వదిలి వెళ్లారు శ్ర్రీదేవి. ఇప్పుడు తను లేదని బాధపడటం కంటే తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందాం. తనలాంటి అద్భుతమైన యాక్టర్‌ను భూమ్మీదకు పంపినందుకు ఆ దేవుడికి మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. -
ముచ్చటగా మూడోసారి
వెంకటేశ్, శ్రియకి ముచ్చటగా మూడోసారి జోడీ కుదిరింది. ‘సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల’ వంటి చిత్రాల్లో అలరించిన ఈ జంట మరోసారి ఓ చిత్రంలో కలిసి నటించనున్నారని టాక్. అఫ్కోర్స్ వెంకీతో ‘తులసి’లో శ్రియ ‘నే చుక్ చుక్ బండి’ అనే ఐటమ్ సాంగ్ చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ఆ సంగతలా ఉంచి, తాజా చిత్రం విషయానికొస్తే.. ‘గురు’ వంటి హిట్ సినిమా తర్వాత వెంకటేశ్ నటిస్తున్న సినిమా ‘ఆట నాదే వేట నాదే’ (పరిశీలనలో ఉన్న టైటిల్). ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత తేజ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ వంటి పేర్లు వినిపించాయి. వారిద్దరూ కాదు.. బాలీవుడ్ బ్యూటీ అదితీ రావ్ హైదరీని ఫిక్స్ చేశారంటూ ఆ మధ్య వార్తలు హల్చల్ చేశాయి. కట్‌చేస్తే.. తాజాగా శ్రియ పేరు లైన్లోకి వచ్చింది. వెంకటేశ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా శ్రియ కరెక్ట్ అని చిత్రబృందం ఆలోచన అట. ‘గోపాల గోపాల’ సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా కనిపించిన శ్రియ ఈ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో నటించనున్నారట. ప్రస్తుతం తెలుగులో ‘వీర భోగ వసంతరాయలు’లో నటిస్తున్నారు శ్రియ. తమిళంలో చేసిన ‘నరగసూరన్’, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్లో నటించిన హిందీ చిత్ర ‘తఢ్కా’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. -
వి అండ్ వి ఫిక్స్ గురూ!
మల్టీస్టారర్ మ్యాచ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు ‘ఎఫ్ 2’ బ్యాచ్. ఈ బ్యాచ్ కెప్టెన్ అనిల్ రావిపూడి. ఒక లీడ్ ప్లేయర్ విక్టరీ వెంకటేష్ (వి). మరో లీడ్ ప్లేయర్ ప్లేస్‌లో చాలామంది పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఆ ప్లేస్‌ను హీరో వరుణ్ తేజ్ (వి) భర్తీ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) టైటిల్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మే నెలలో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఆల్రెడీ వెంకీ రెడీగా ఉన్నారు. ఈ నెల 9న విడుదల కానున్న ‘తొలిప్రేమ’ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఫ్రీ అయిపోతారు. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్‌ని టార్గెట్ చేశారట. ఆ హ్యాట్రిక్‌ను ఈ మల్టీస్టారర్‌తో స్టార్ట్ చేయనున్నారు. అయితే ఇందులో ఎవరు ‘ఫన్’ క్యారెక్టర్ చేయబోతున్నారు? ‘ఫ్రస్ట్రేట్’ అయ్యే క్యారెక్టర్లో ఎవరు నటించబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్స్ సెలక్షన్స్ కోసం చర్చలు జరుపుతున్నారట చిత్రబృందం. -
పుంజుకోవడానికే..
సంక్రాంతికి మన పందెం కోళ్లు ఫెస్టివల్ బ్రేక్ తీసుకున్నాయి. డ్యూయెట్లు పాడి, ఫైట్లు చేసి, సెంటిమెంట్లు పండించి, పంచ్ డైలాగ్‌లు కొట్టి, అలసి సొలసి పుంజుకోవడానికి బ్రేక్ తీసుకున్నారు. సంక్రాంతికి సైరా ఫుల్ ఫెస్టివల్ మూడ్. ‘సైరా’ టీమ్ ఫుల్ ఫెస్టివల్ మూడ్‌లో ఉంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను కంప్లీట్ చేశారు. ఫిబ్రవరిలో నెక్ట్స్ షెడ్యూల్‌ను పొలాచ్చిలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే.. ‘సైరా’ టీమ్ హ్యాపీగా పండగ చేసుకోవచ్చు. బ్రేక్‌కి గురిపెట్టారు పోలీసాఫీసర్‌గా నాగార్జున మరో హిట్‌పై గురిపెట్టి బుధవారం నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. నాగార్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి రెండు రోజులు బ్రేక్ వచ్చేలా చిత్రబృందం షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించనున్నారని సమాచారం. నాన్‌స్టాప్ షూట్ గురూ... ‘గురు’ రిలీజై పది నెలలైంది. నెక్ట్స్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అని వెంకటేశ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వెంకీ స్లో అయ్యారనుకుంటున్నారేమో? ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తేజతో ఒక సినిమా, త్రివిక్రమ్‌తో ఒక సినిమా, అనిల్ రావిపూడి సినిమా లైన్లో ఉన్నాయి. వీటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుంది? అన్నది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న. ప్రస్తుతానికి బ్రేక్‌లో ఉన్న వెంకీ వన్స్ షూట్ లోకి ఎంటరైతే ఏడాదంతా నాన్‌స్టాప్‌గా చేస్తారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి.. మూడు సినిమాలంటే అంతే కదా. బ్రేక్ తీసుకునే వీలు ఎక్కడుంటుంది? పండగ బ్రేక్ తర్వాత గురు సెట్లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది. బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు మహేశ్‌బాబు. అలాంటిది పెద్ద పండగ సంక్రాంతికి ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించకుండా ఉంటారా? ఆల్రెడీ కేటాయించారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు 13న ప్యాకప్ చెబుతారట. సో.. పండగకు సెలవు దొరికేసినట్లే. ఆల్రెడీ ఇప్పుడు మహేశ్‌బాబు బ్రేక్‌లో ఉన్నారు. ఇలా షూటింగ్లో పాల్గొని, అలా ఐదు రోజులు చేసి బ్రేక్ తీసుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ అన్నమాట. స్టార్ట్ చేస్తే ఆగేది లేదు కెరీర్లో ఎప్పుడూ తీసుకోనన్ని రోజులు ఎన్టీఆర్ బ్రేక్ తీసుకున్నారు. ‘జై లవ కుశ’ రిలీజై మూడు నెలలకు పైగా అయింది. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ కాలేదు. త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ మేకోవర్కి దాదాపు రెండు నెలలు పడుతుంది. లాంగ్ బ్రేక్‌కి ఇదే కారణం అయ్యుంటుంది. ఈ గ్యాప్‌లో మేకోవర్‌పై దృష్టి పెడుతూనే ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్ వెళ్లారు. సో... పండక్కి సెలవే. బహుశా వచ్చే నెల షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగేది లేదు. చిట్టిబాబుకు సెలవు రీసెంట్గా రామ్‌చరణ్ ఎక్కువగా గడుపుతున్నది పల్లెటూరిలోనే. ఈపాటికే మీకు అర్థం అయ్యుంటుంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘రంగస్థలం’ సినిమా గురించి మాట్లాడు తున్నామని. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. ప్రజెంట్ హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌కు 12వ తేదీ తర్వాత సంక్రాంతి సెలవులు ఇస్తారట. పండగ తర్వాత రాజమండ్రిలో స్టార్టయ్యే కొత్త షెడ్యూల్లో రామ్‌చరణ్ పాల్గొంటారు. బ్రేక్ ఉందోయ్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ షూటింగ్‌తో అల్లు అర్జున్ బిజీ. ఈ చిత్రం ‘ఫస్ట్ ఇంపాక్ట్’కి వచ్చిన రెస్పాన్స్ సూపర్బ్. సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా చేసినందుకు యూనిట్ ఫుల్ హ్యాపీ. మామూలుగా బన్నీ ఎనర్జిటిక్. ఇక హ్యాపీ మూమెంట్స్ అంటే జోరు పెరుగుతుంది కదా. మరి.. పండగ రోజు కూడా షూటింగ్ చేస్తారా? అంటే.. గమ్మునుండవోయ్. బ్రేక్ ఉందోయ్. పండగకి ముందు రోజు వరకూ షూటింగ్లో పాల్గొని, ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటారు. ఇలా స్టార్ట్ చేసి.. అలా బ్రేక్ ఒకవైపు ‘టచ్ చేసి చూడు’ సినిమా చేస్తున్నారు రవితేజ. మరోవైపు ఈరోజు నుంచి కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూట్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. ఇలా స్టార్ట్ చేసి.. అలా బ్రేక్ తీసుకోవాలను కుంటున్నారు. నేటి నుంచి మరో వారం రోజుల పాటు జోరుగా షూటింగ్ చేస్తారు. ఆ తర్వాత పండగకు స్మాల్ బ్రేక్. జస్ట్ రెండు మూడు రోజులంతే. ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌తో బిజీ అయిపోతారు. యుద్ధానికి బ్రేక్ ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. అర్జున్‌కి, కృష్ణాకి. ఒకరిది ప్యారిస్ అయితే.. మరొకరిది తిరుపతి అట. అయితే... వీరిద్దరూ యు« ద్ధం చేయడానికి రెడీ అయ్యారు. అసలు ఎవరీ ఇద్దరు అంటే.. ఇద్దరూ నానీనే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. రీసెంట్గా పాతబస్తీమే సవాల్ అంటూ విలన్స్‌ను ఇరగదీశాడు నాని. సంక్రాంతి పండక్కి జస్ట్ టు డేస్ బ్రేక్ తీసుకుని మళ్లీ షూట్లో జాయిన్ అవుతారు. అంటే.. యుద్ధానికి టు డేస్ బ్రేక్ అన్నమాట. మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మిస్తున్న ‘అ’ సినిమా టీజర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫెస్టివల్... లాంగ్ బ్రేక్ కొత్త పెళ్లికొడుకు నాగచైతన్య పెళ్లి తర్వాత జస్ట్ కొన్ని రోజులే బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘సవ్యసాచి’ షూటింగ్‌తో బిజీ. చైతూ–సమంత పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ హిందూ ఫెస్టివల్ సంక్రాంతి. క్రిస్మస్ పండగను ఈ జంట బాగానే జరుపుకున్నారు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ షూటింగ్‌తో బిజీగా ఉన్న చైతూ 11, 12తేదీల వరకూ ఈ సెట్స్‌లోనే ఉంటారు. ఆ తర్వాత పండగకి బ్రేక్ ఇస్తారు. ఇది రెండు మూడు రోజుల బ్రేక్ కాదు. నెలాఖరు వరకూ ఈ యూనిట్ బ్రేక్ తీసుకుంటారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో మళ్లీ షెడ్యూల్ మొదలవుతుంది. ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి.. ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి పండగ చేసుకోబోతున్నారు వరుణ్ తేజ్. ప్రేమకు ఫుల్స్టాప్ పడితే ఎవరైనా పండగ చేసుకుంటారా అనుకుంటున్నారా? వరుణ్ ముగింపు పలికింది సినిమా లవ్‌కి. ప్రస్తుతం ‘తొలి ప్రేమ’ అనే లవ్‌స్టోరీ మూవీలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుగుతోంది. పండగకి ముందే ఇది పూర్తయిపోతుంది. దీంతో సినిమా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో.. పండగ షురూ. ‘అల్లరి’ నరేశ్, శర్వానంద్, సాయిధరమ్ తేజ్‌తో పాటు మరికొందరు హీరోలు సంక్రాంతికి బ్రేక్ తీసుకోబోతున్నారు. -
వెంకీ.. రానా.. ఓ వెబ్ సిరీస్
వెంకటేశ్, రానా కలసి పూర్తి స్థాయి సినిమాలో నటించబోతున్నారనే విషయం మనం చాలాసార్లు విన్నాం. కానీ, ప్రాజెక్ట్‌లు ఏవీ పట్టాలు ఎక్కకపోయేసరికి అభిమానులు నిరాశపడుతూ వస్తున్నారు. మొన్నామధ్య తమిళ బ్లాక్ బాస్టర్ ‘విక్రమ్ వేద’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చినా అది కూడా మెటీరియలైజ్ కాలేదు. ఈసారి బాబాయ్–అబ్బాయ్ కాంబినేషన్ పక్కాగా సిద్ధం అయింది అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. కానీ, వాళ్లు నటించబోయేది సినిమాలో కాదట. ఒక వెబ్ సిరీస్‌లో ఈ దగ్గుబాటి హీరోలు నటించనున్నారట. రాజీవ్ గాంధీ హత్య, ఆ తర్వాత ఎల్టీటీ ఫ్రభాకరన్ కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ఉండనుందట. ‘సైనైడ్ , అట్టహాస’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ కన్నడ దర్శకుడు ఏయంఆర్ రమేష్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయబోతున్నారని టాక్. తొలుత సినిమాగా ప్లాన్ చేసినప్పటికి చెప్పాల్సిన కథ ఎక్కువగా ఉండటంతో సినిమాగా కంటే వెబ్ సిరీస్‌గా బావుంటుందని దర్శకుడు భావించారట. దానికి వెంకటేశ్, రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ టాక్. ఈ వెబ్ సిరీస్‌లో రాజీవ్ గాంధీ కేస్‌ను ట్రేస్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ డీఆర్ కార్తికేయ పాత్రలో వెంకటేశ్ కనిపించబోతున్నారట. మరి రానా? సస్పెన్స్ అంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మొదలు కానున్న ఈ సిరీస్‌ను రానా తన సొంత బ్యానర్లో నిర్మించనున్నారని భోగట్టా. -
ముగ్గురిలో విక్టరీ ఎవరికి?
అనుష్క, కాజల్ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో విక్టరీ ఎవరిది? అదేనండి.. గెలుపు ఎవరిది? ఇక్కడ విక్టరీ వెంకటేశ్ ఫొటో ఉంది కాబట్టి... ఆయన మనసుని గెలుచుకునేది ఎవరు? ఇంతకీ వెంకీ మనసుని వీళ్లు గెలవడం ఏంటి? అంటే.. ఓ సినిమాలో జత కట్టేందుకు. అది తేజ సినిమా. వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ఆరంభమవుతుంది. ఇప్పుడు డిస్కషన్ అంతా ఈ సినిమాలో వెంకీ సరసన నటించనున్నది ఎవరు? అని. ముగ్గురు పేర్లను తేజ పరిశీలిస్తున్నారట. వెంకీ కాంబినేషన్లో ఆల్రెడీ ‘చింతకాయల రవి’, ‘నాగవల్లి’ చిత్రాల్లో నటించిన అనుష్క, వెంకీతో ఇప్పటివరకూ నటించని కాజల్ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకర్ని కథానాయికగా తీసుకోవాలని తేజ అనుకుంటున్నారట.మరి.. ముగ్గురిలో ఎవరికి చాన్స్ దక్కుతుందో ఈ ఇయర్ ఎండింగ్లో తెలిసిపోతుంది. ఎందుకంటే జనవరిలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో యాంగ్రీ మేన్ రాజశేఖర్ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. వెంకీ బావగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయనున్నారట. అది నిజమా? కాదా? అనే క్లారిటీ కూడా ఇయర్ ఎండింగ్లో వచ్చేస్తుంది. -
బావ బావమరిది?
‘గరుడవేగ’ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రాజశేఖర్. ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ జోష్‌లో ఉన్నారు తేజ. అదే జోష్‌తో వెంకటేశ్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ నెల 13న వెంకీ బర్త్ డేకి ఈ సినిమాకి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో రాజశేఖర్ నటించనున్నారట. ‘‘కథ, పాత్ర నచ్చితే విలన్‌గా, ఇతర పాత్రల్లో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని ఇటీవల రాజశేఖర్ చెప్పిన విషయం తెలిసిందే. తేజ చెప్పిన కథ రాజశేఖర్‌కు నచ్చిందట. క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇందులో రాజశేఖర్ విలన్‌గా చేయబోతున్నారట. వెంకీకి బావగా కనిపించనున్నారని మరో టాక్. -
పాతికేళ్ల తర్వాత... కాలేజీలో క్లాసులు!
కళ్లజోడు... గళ్లచొక్కా... రెండిటికీ తోడు చక్కగా బూటులు వేసుకుని, టై కట్టుకుని పాతికేళ్ల క్రితమే వెంకటేశ్ పాఠాలు చెప్పారు. ‘సుందరకాండ’ సిన్మాలో! రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో జూనియర్ కాలేజ్ లెక్చరర్‌గా వెంకీ కనిపించారు. మళ్లీ ఇప్పుడు కాలేజీలో క్లాసులు చెప్పడానికి రెడీ అవుతున్నారట! తేజ దర్శకత్వంలో నటించే సినిమా కోసం! వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో వెంకీ కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట! ఎట్ ద సేమ్ టైమ్... ఆయన లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుందని సమాచారమ్. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న మొదలు కానున్న ఈ సిన్మాలో హీరోయిన్ ఎవరనేది చిత్రబృందం ఇంకా ప్రకటించనప్పటికీ... కాజల్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉందట!! -
రెండూ వెంకీవేనట!
ఏంటో అవి? ఒకటి ఆట... రెండోది వేట! ఈ రెండూ వెంకటేశ్వేనట! తేజ దర్శకత్వంలో వెంకీ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఆ సిన్మాకు ‘ఆట నాదే.. వేట నాదే’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఇటీవలే ఈ టైటిల్ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ అయ్యింది. అది వెంకీ సినిమా కోసమేనని టాక్! ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది! వెంకీ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 13న ఈ సినిమా మొదలు కానుంది. -
టైమ్ ఫర్ సెలబ్రేషన్స్!
సెలబ్రేషన్... వేడుక! అంటే... ఒక్కసారి జరుగుతుంది. సెలబ్రేషన్స్... వేడుకలు! అంటే... ఒకటికంటే ఎక్కువ. అక్కినేని కొత్త జంట నాగచైతన్య, సమంత (చైతూ–సామ్)ల మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఇంకెన్ని జరుగుతాయో! గోవాలో పెళ్లయ్యాక ఓ రిసెప్షన్ జరిగిందా! తర్వాత చెన్నైలో చైతూ అమ్మ లక్ష్మీ ఓ రిసెప్షన్ ఇచ్చారా! ఇదిగో... హైదరాబాద్‌లో ఇంకో రిసెప్షన్ లేదా గెట్ టుగెదర్ (పెళ్లైన సందర్భంగా) జరిగినట్టుంది. ఎప్పుడు జరిగిందో గానీ... ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. బహుశా... దగ్గుబాటి ఫ్యామిలీ (చైతూ మేనమామలు నిర్మాత డి. సురేశ్‌బాబు, హీరో వెంకటేశ్) ఇచ్చిన రిసెప్షన్ అయ్యుంటుంది! అందులో అందరూ ఎంత సందడి చేశారో చూడండి!! -
ఆ రోజే... కొత్త సినిమా ప్రారంభం!
డిసెంబర్ 13... ‘విక్టరీ’ వెంకటేశ్ బర్త్‌డే. ఆ రోజునే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారట వెంకీ అండ్ కో! తేజ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే బర్త్‌డేకి లాంచ్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అట! ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉందంటున్నారు. ‘గురు’ తర్వాత వెంకీ హీరోగా నటించనున్న చిత్రమిది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇందులో వెంకీ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదట! ప్రస్తుతానికి కాజల్ అగర్వాల్ పేరు వినబడుతోంది. తేజ లాస్ట్ సిన్మా ‘నేనే రాజు నేనే మంత్రి’లో కాజలే మెయిన్ హీరోయిన్. ‘లక్ష్మీ కల్యాణం’తో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేసిందీ ఆయనే. అందువల్ల, తేజ అడిగితే కాజల్ ‘యస్’ చెప్పే అవకాశాలు ఎక్కువే! ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలుస్తోంది!! వెంకటేశ్ సినిమా తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందనున్న ఎన్టీఆర్ బయోపిక్‌కి తేజ దర్శకత్వం వహించనున్నారు. -
త్వరలో రానాతో సినిమా తీస్తా
అరసవల్లి : తన మేనల్లుడు, సినీ హీరో దగ్గుబాటి రామానాయుడు(రానా) త్వరలో ఓ క్లాసిక్ సినిమా తీస్తానని ప్రముఖ నిర్మాత, నటుడు కె.అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం తన భార్య ఉషారాణితో కలిసి అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక సూర్యనమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. విక్టరీ వెంకటేష్ తర్వాత తమ కుటుంబంలో అంత స్థాయి నటుడిగా రానా రాణిస్తాడని, అందుకు అతడి విలక్షణ నటనే నిదర్శనమని చెప్పారు. తాను ఇంతవరకు 70 సినిమాలకు పైగా నటించానని, ఇప్పుడు సొంతంగా ప్రొడక్షన్ ప్రారంభించానని, ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు హీరోగా సినిమా చేస్తున్నానని, ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయ్యిందని వివరించారు. పదేళ్ల క్రితం చిన్న అనారోగ్య కారణాలతో ఇక్కడి అరసవల్లి సూర్యక్షేత్రానికి వచ్చానని, ఇక్కడే బస చేసి సూర్యనమస్కారాలు చేయించుకున్నానని, తర్వాత ఆరోగ్యం పొందానని గుర్తుచేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శన భాగ్యం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో నటులకు కొదవలేదని, త్వరలో తెలుగు సిని ఇండస్ట్రీ దృష్టి ఈ ప్రాంతాల్లోని ప్రకృతి దృశ్యాలపై తప్పనిసరిగా పడుతుందన్నారు. కూర్మనాథునికి పూజలు శ్రీకూర్మం(గార): శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని సినీనటుడు అశోక్ సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కిషోర్‌శర్మ ఆలయ చరిత్రతో పాటు రెండు ధ్వజస్తంభాలు, అష్టదళాపద్మాకారం, వైష్ణోదేవి ఆలయం, ఆకుపసర చిత్రాల విశేషాలు వివరించారు. ఆయనతో పాటు సర్పంచ్ బరాటం రామశేషు ఉన్నారు. -
ఆకట్టుకుంటున్న ‘ గురు’ స్టిల్స్
విక్టరీ వెంకటేశ్ ‘గురు’ సినిమా లేటెస్ట్ స్టిల్స్ అభిమానులను అలరిస్తున్నాయి. మంగళవారం(డిసెంబర్ 13) వెంకీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ లేటెస్ట్ ఫొటోలు విడుదల చేసింది. రేపు టీజర్ విడుదల చేయనున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో ‘సాలా ఖడూస్’గా, తమిళంలో ‘ఇరుది సుట్రు’గా ఏకకాలంలో రూపొందిన చిత్రానికి ‘గురు’ రీమేక్. తెలుగు చిత్రానికి కూడా సుధా కొంగరే దర్శకురాలు. ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించడానికి వెంకీ కండలు పెంచారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న వెంకటేష్ గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది. -
మల్లెల వానకు మంచి రెస్పాన్స్
‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు విక్టరీ వెంకటేశ్, నయనతార. వీరిద్దరూ కలసి ముచ్చటగా మూడోసారి నటించిన చిత్రం ‘బాబు బంగారం’. ‘భలే భలే మగాడివోయ్’ వంటి హిట్ చిత్రం తర్వాత మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీపై వస్తున్న రూమర్స్‌కు మారుతి ఫుల్స్టాప్ పెట్టారు. ఈ నెల 24న పాటలు, ఆగస్టు 12న సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు. వాస్తవానికి ఈ నెల 29న ‘బాబు బంగారం’ విడుదల కానుందనే టాక్ వినిపించింది. కానీ, ఆడియో, చిత్రం విడుదల తేదీలను దర్శకుడు స్పష్టం చేయడంతో వెంకీ అభిమానులకు మూవీపై స్పష్టత వచ్చేసింది. ఈ చిత్రంలో వెంకీ పోలీస్ అధికారిగా కనిపించనున్న విషయం తెలిసిందే. జిబ్రాన్ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటల్లో ఇటీవల విడుదల చేసిన ‘మల్లెల వానలా మంచు తుఫానులా..’ పాటకు మంచి స్పందన లభించిందని దర్శక-నిర్మాతలు చెప్పారు. -
వెంకటేష్ 'బాబు బంగారం'
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పడిప్పుడే తిరిగి సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. కుర్ర హీరోల పోటీ పెరిగిపోవటంతో ఎలాంటి కథను ఎంచుకోవాలనే ఆలోచనలతో చాలా టైం తీసుకున్న వెంకీ, తాజాగా భలే బలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ సినిమాలో వెంకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు 'బాబు బంగారం' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. లక్ష్మీ, తులసీ లాంటి హిట్ సినిమాల తరువాత మరోసారి నయనతార వెంకటేష్‌తో జోడి కడుతోంది. ప్రజెంట్ భారీ సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న నయనతార హీరోయిన్గా నటిస్తుండటం ఈ సినిమాకు కూడా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించి 2016 జూన్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
'రాధకృష్ణ'గా వెంకీ
'గోపాల గోపాల' సినిమా తరువాత తన తదుపరి ప్రాజెక్టును ఫైనల్ చేయటానికి చాలా టైం తీసుకున్నాడు విక్టరీ వెంకటేష్. సీనియర్ డైరెక్టర్ల నుంచి కొత్త దర్శకుల వరకు చాలామంది కథలు విన్న విక్టరీ హీరో ఫైనల్ గా ఓ యంగ్ డైరెక్టర్‌కు ఓకే చెప్పాడు. ఇటీవల 'భలే భలే మగాడివోయ్' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'రాధ' అనే సినిమా ఎనౌన్స్ అయి ఆగిపోయింది. ఆ తరువాత మరోసారి వెంకీని తన కథతో మెప్పించిన మారుతి డిసెంబర్ చివరివారంలో కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో వెంకీ జోడిగా నయనతార నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా మళయాల సినిమా 'భాస్కర్ ది రాస్కెల్' రీమేక్‌లో నటిస్తాడంటూ వార్తలు వినిపించటంతో మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది, స్ట్రయిట్ సినిమానా లేక రీమేక్ అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. లాంగ్ గ్యాప్ తరువాత వెంకీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సితార క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది. అన్ని రకాల వినోదాంశాలతో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
మరోసారి పోలీస్ గెటప్‌లో
'గోపాల గోపాల' లాంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత తదుపరి సినిమాపై విక్టరీ వెంకటేష్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యంగ్ హీరోలు హవా చూపిస్తుండటంతో ఎలాంటి కథ ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వరుసగా కథలు వింటూ కాలం గడిపేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఈ గ్యాప్‌లో మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకులకు వెంకీ ఓకె చెప్పాడన్న టాక్ వినిపించినా, ఆ సినిమాలేవి సెట్స్ మీదకు రాలేదు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ కథా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, వెంకటేష్ కోసం ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడట. ఇప్పటికే ఈ కథను వెంకీకి వినిపించిన వంశీ అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని వక్కంతం వంశీ స్వయంగా ప్రకటించాడు. ఈ కథలో వెంకటేష్‌ను మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మారుతి, క్రాంతి మాధవ్‌లు సొంత కథలతో వెంకటేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తుండగా, వక్కంతం వంశీ ఇచ్చిన కథను గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ మూడు ప్రాజెక్ట్స్ లో వెంకీ, ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళతాడో చూడాలి. -
తరలివచ్చిన తారాలోకం
-
విజయనగరంలో ‘వెంకీ’
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: విద్యలనగరమైన విజయనగరంలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ సోమవారం ఒక్కసారిగా హడావుడి చేశారు. పట్టణంలోని ప్రధాన కూడలి గంటస్తంభం ప్రాంతంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో సురేష్ ప్రొడక్షన్స్ వాహనం కనబడగానే ప్రజలంతా గుమిగూడారు. ఇంతలోనే తమ అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ కనబడగానే జనం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరోసారి వాహనంలోంచి బయటకు వచ్చి పలకరిస్తారనే ఉద్దేశం తో పట్టణంలోని వెంకటేష్ ఫ్యాన్స్, అధిక సంఖ్యలో మహిళలతో గంటస్తంభం ప్రాంతం నిండిపోయింది. అరగంట అనంతరం బయటకు వచ్చిన వెంకటేష్ అభిమానులకు తనదై న స్టైల్లో చేయి ఊపుతూ, అప్యాయంగా పలకరిస్తూ అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో వెళ్లిపోయారు. మళయాల చిత్రం రీమేక్‌కి సంబంధించి అరుకు తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిమిత్తం ఆయన వచ్చినట్లు తెలిసింది. అనంతరం ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబుతో కలిసి సాయంత్రం కోట జంక్షన్, మూడు లాంతర్లు తదితర ప్రాంతాల్లో సందడి చేశారు. విజయనగ రం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. విక్టరీ వెంకటేష్ రాకతో అభిమానులు ఆనంద పరవశులయ్యారు. తాటిపూడిలో సినిమా సందడి గంట్యాడ : సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మలయాళం రీమేక్ సినిమా సన్నివేశాలను హీరో వెంకటేష్‌పై తాటిపూడి ఇరిగేషన్ కాలు వ గట్టు వద్ద సోమవారం చిత్రీకరించారు. డెరైక్టర్ శ్రీప్రియ, అసిస్టెంట్ డెరైక్టర్ల పర్యవేక్షణలో స్ల్పెండర్ ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరించారు.ఈ సందర్భంగా నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ ఈ చిత్రం మళయాళంలో ప్రేక్షకుల ఆదరణ పొందిందన్నారు. మంచి కుటుంబ కథాచిత్ర మన్నారు. చిత్రంలో మీనా, నదియాలు నటించనున్నారని చెప్పారు. చిత్రానికి పేరు ఇంకా పెట్టలేదన్నారు. ఇంతవరకు విజయనగరం, విశాఖపట్నం, అరుకు తదితర ప్రాంతాలలో పలు సన్నివేశాలు చిత్రీకరించామని చెప్పారు. వెంకటేష్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. -
వెంకటేశ్ 'రాధ' మూవీ స్టిల్స్ మరియు పోస్టర్స్
-
వెంకటేశ్ 'రాధ' మూవీ ఓపినింగ్
-
మారుతిని నమ్ముకున్న వెంకి
-
నేను అనే భావన పెరిగేలోపే ఆ బాటలో వెళ్లాలి!
బయట ఉన్నంత ‘రిచ్’గా లోపలా ఉండగలమా? లోపల అంటే... మన ఆలోచనల్లో, ఆచరణల్లో. రిచ్‌గా అంటే... భౌతిక విలువలకు అతీతంగా, ఆధ్యాత్మికంగా. ‘ఉండగలం’ అంటారు విక్టరీ వెంకటేష్. ఎలా? మానవుడికన్నా మరికాస్త గొప్పగా ఆలోచించాలట! అంటే?! నంబర్ వన్: నేను, నాది, నా వల్ల... అనుకోకూడదు. నంబర్ టు: దేన్నీ శాశ్వతమని భావించకూడదు. నంబర్ త్రీ: రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ్టిని వృథా చేయకూడదు. బానే ఉంది కానీ.. మానవుడు మానవుడిలా కాకుండా ఇంకెలా ఆలోచిస్తాడు? ఒక సాధువులా, ఒక సద్గురువులా, ఇంకా... హీరో వెంకీలా! వెంకీలో అంతుందా! అంత కాదు, ఎంతో ఉంది. వెంకీతో ఎంటర్టైన్ అవాలనుకునేవారు ఆయన సినిమాలను ఎన్నిసార్లైనా చూడొచ్చు. వెంకీతో ఎన్లెటైన్ అవాలంటే మాత్రం ఒక్కసారైనా ఈ ‘తారాంతరంగం’ చదవాలి. ‘ఐ విల్ కట్ హారిజాంటల్లీ...’ అంటూ వచ్చీ రాని ఇంగ్లిష్‌లో ‘మసాలా’ సినిమాలో డైలాగ్ చెప్పారు. ఒకప్పుడు మీ తెలుగు కూడా అలానే ఉండేది కదా? వెంకటేష్: అవును. తెలుగు మాట్లాడటం చాలా కష్టమయ్యేది. నా స్కూలింగ్ అంతా చెన్నయ్‌లోనే. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లిష్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. పైగా పై చదువుల కోసం విదేశాలు వెళ్లిపోవడం వల్ల తెలుగు మాట్లాడే అవకాశం చాలా చాలా తక్కువ ఉండేది. హీరో అయిన కొత్తలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలా ఇబ్బందిపడేవాణ్ణి. అప్పట్లో నా తెలుగులో బాగా ఇంగ్లిష్ ఉండేదనేవాళ్లు. ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌కి వెళదాం... సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ ఎంబ్లమ్లో ‘ఎస్’ అక్షరంపై మీరు, ‘పి’ అక్షరంపై మీ అన్నయ్య సురేష్‌బాబు ఉంటారు. అక్షరాలకు తగ్గట్టు మీరు స్టార్, మీ అన్నయ్య ప్రొడ్యూసర్ అయ్యారు. ఇలా జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? వెంకటేష్: అస్సలు అనుకోలేదు. నేను సినిమాల్లోకి వస్తాననే అనుకోలేదు. బేనర్ లోగో తయారు చేయించినప్పుడు అన్నయ్యను, నన్ను నిలబెట్టి నాలుగైదు రకాల స్టయిల్స్‌లో నాన్నగారు లోగో తయారు చేయించారు. మేమిద్దరం బాక్సింగ్ చేస్తున్నట్లు, షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు.. ఇలా షూట్ చేశారు. అప్పట్లో మీరేం అవ్వాలనుకునేవారు? వెంకటేష్: స్పైసెస్ (సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు) బిజినెస్ చేద్దామనుకున్నా. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన బిజినెస్ కదా. ఆ వ్యాపారం అయితే ఎక్కువగా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ, మనం అనుకున్నదేదీ జరగదు కదా! కృష్ణగారు బిజీగా ఉండటంవల్ల నాన్నగారు నన్ను ‘కలియుగ పాండవులు’లో హీరోగా చేయమన్నారు. అప్పుడు అబ్రాడ్‌లో చదువుతున్నాను. నాన్నగారు ఫోన్ చేయగానే, ఇక్కడికొచ్చేశాను. అనుకోకుండా హీరో అవ్వడం... ఇదిగో ఇక్కడిదాకా రావడం.. అందరికీ తెలిసిందే. గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు... మీ లైఫ్ అంతా అద్భుతమే కదూ? వెంకటేష్: అసలు గోల్డెన్ స్పూన్ అంటే ఏంటి? ‘మెటీరియల్ వరల్డ్’కి నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టినట్లుగానే ఉంటుంది. దేశంలో ఎంత పెద్ద అయినా, లోపల ‘పూర్’గా ఉంటే జీవితం వృథా అని నా అభిప్రాయం. లోపల బీదగా ఉండటం అంటే..? వెంకటేష్: బయటికి నేను బాగా రిచ్‌గా ఉండొచ్చు. కానీ, లోపల ఎంత ఆనందంగా ఉన్నారో మీకెలా తెలుస్తుంది? ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే నా దృష్టిలో ‘రిచ్’ కింద లెక్క. మరి... మీరు ధనవంతులేనా? వెంకటేష్: యస్..! ఆధ్యాత్మిక అవగాహన ఉంటేనే ‘రిచ్’ అని ఎలా అంటారు? వెంకటేష్: ఓకె.. కొంచెం విపులంగా మాట్లాడుకుందాం. నా కెరీర్‌ని తీసుకుందాం. రెండు సినిమాలు సూపర్ హిట్. బ్రహ్మరథం పడతారు. ఆ తర్వాత రెండు ఫట్లు... ఎవరూ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. సో.. సక్సెస్ అనేది అశాశ్వతమే కదా. అలాగే, స్నేహితులతోనూ బంధువులతోనూ అనుబంధాన్ని తీసుకుందాం. ఎక్కడైనా చిన్న మాటలో తేడా వస్తే.. ఆ అనుబంధం ఏమవుతుంది? కాబట్టి అనుబంధాలూ అశాశ్వతమే. వేసుకునే బట్టలు, వాడే వస్తువులు.. ఏదీ జీవితాంతం మనతోపాటు ఉండిపోవుగా. మరి.. శాశ్వతం కాని వాటి గురించి పాకులాడటం దేనికి? సో.. ఏది శాశ్వతం.. ‘ఇన్నర్ స్ట్రెంగ్తే కదా...’. ఆ బలం ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మిక బాటలో వెళుతూ.. ‘జీవిత సత్యం ఏంటో? శాశ్వతం ఏదో’ తెలుసుకున్నప్పుడు. ఇన్నర్‌గా మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడు దేనికీ భయపడం. మనలో ఓ ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది! దేనికీ భయపడం అంటే... చివరికి మరణానికి కూడానా? వెంకటేష్: ఎగ్జాక్ట్లీ... మరణానికి కూడా భయపడం. అసలు చావంటే ఏంటో తెలుసుకోకుండా భయపడిపోతుంటాం. అయితే, మరణం అనేది శరీరానికి మాత్రమే అనుకున్నప్పుడు భయం ఉండదు. మన శరీరం చనిపోగానే, అందులో ఉన్న ఆత్మ వేరే తల్లి కడుపులో పడుతుందనే సత్యం తెలుసుకుంటే మరణం గురించి భయపడం! డబ్బు, నగలు, వస్తువులు.. ఇష్టపడేవారికి వాటి ద్వారా ఆనందం లభిస్తుంది. మరి.. మీకు ఎందులో ఆనందం లభిస్తుంది? వెంకటేష్: నేను మానవుణ్ణి కాదు.. ఇంకా ఏదో అనుకున్నప్పుడు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఒక మానవుడికన్నా ఇంకా గొప్పగా ఆలోచించగలిగినప్పుడు ఆనందంగా ఉంటుంది. మీరంటే చిన్నప్పట్నుంచీ అన్ని సౌకర్యాలూ అనుభవించారు కాబట్టి, ‘మెటీరియల్స్’ మీద వ్యామోహం పోయి ఉంటుంది. దాంతో... ‘ఆధ్యాత్మికం’ అంటున్నారు. కానీ, ఏమీ అనుభవించనివాళ్లు మీరు అంటున్న అశాశ్వత ఆనందాన్నే కోరుకుంటారేమో? వెంకటేష్: మితిమీరిన ఆశ ఉంటే.. ఎవరికీ ఎప్పుడూ దేనిలోనూ ఆనందం లభించదు. ఉదాహరణకు.. చిన్న కారు కొనుక్కోవాలనుకున్నారు. అది కొన్న తర్వాత ఇంకా లగ్జరీ కారుని కోరుకుంటారు. చిన్న ఇల్లుతో మొదలుపెట్టి.. ఆ తర్వాత పెద్ద ఇంటి వరకు ఆశ పెరిగిపోతుంది. అలాంటివాళ్లకి ఎప్పుడూ ఆనందం దొరకదు. ఇక.. మీరన్నది కరెక్టే. ఏ సౌకర్యాలూ అనుభవించకుండా ఈ బాటలో వెళ్లలేం. నేను అన్ని సౌకర్యాలు అనుభవించాను కాబట్టే, చాలా త్వరగా ‘ఆధ్యాత్మిక బాట’కు ఆకర్షితుణ్ణయ్యాను. అసలేమీ అనుభవించకుండా ఈ భావన అంత సులువుగా రాదు. మీ మాటలు దాదాపు ఎడ్యుకేట్ చేసే విధంగానే ఉన్నాయి. కానీ, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మీరెలా ఉండేవారో తెలుసుకోవాలని ఉంది... వెంకటేష్: చాలా జోష్‌గా ఉండేవాణ్ణి. అల్లరి పిల్లాణ్ణే. నాకో చిన్న గ్యాంగ్ ఉండేది. స్కూల్లో అందరితో బాగుండటం, ఎంజాయ్ చేయడం అలా ఉండేవాణ్ణి. నా క్లాస్‌తో పాటు ఇతర క్లాసుల పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండేవాణ్ణి. చదువుపరంగా చెప్పాలంటే యావరేజ్. స్పోర్ట్స్‌లో బాగా పార్టిసిపేట్ చేసేవాణ్ణి. స్కూల్లో ‘సిస్టమ్’కి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే భరించేవాణ్ణి కాదు. ఉన్నవాళ్ల పిల్లలను ఓ రకంగా, లేనివాళ్లను ఓ రకంగా ట్రీట్ చేస్తే ఊరుకునేవాణ్ణి కాదు. పిల్లలందరికీ ఫ్రెండ్... టీచర్స్‌కి మాత్రం విలన్నే. అయితే.. కాలేజ్‌లో ఇంకా రెబల్‌గా ఉండేవారేమో? వెంకటేష్: అవును. పక్క కాలేజీవాళ్లకీ మా కాలేజీవాళ్లతో మాటా మాటా వచ్చినప్పుడు గొడవపడటానికి ముందుండేవాణ్ణి. రామానాయుడి కొడుకు కాబట్టి.. స్కూల్, కాలేజ్‌లో మీరేం చేసినా చెల్లుబాటు అయ్యుంటుందేమో? వెంకటేష్: స్కూల్లో నన్నెప్పుడూ ప్రత్యేకంగా చూడలేదు. అల్లరి చేసినప్పుడు ‘గో అవుట్’ అంటూ టీచర్స్ నన్ను బయట నిలబెట్టిన రోజులు చాలానే ఉన్నాయి. నేను ‘రామానాయుడు కొడుకు’ అని ఎవరి దగ్గరా చెప్పుకునేవాణ్ణి కాదు. ‘నేను మామూలు వ్యక్తిని’ అనుకున్నప్పుడే లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అని నేను చిన్నప్పట్నుంచీ నమ్మేవాణ్ణి. కాలేజ్ డేస్‌లో బైక్ మీద ఫ్రెండ్స్‌తో బాగానే హల్చల్ చేసేవారా? వెంకటేష్: బీకామ్ ఫస్ట్ ఇయర్లో యమహా కొనుక్కున్నాను. ఫస్ట్ బైక్ థ్రిల్లే వేరు. ఆ బైక్‌ని మాడిఫై చేయించుకోవడం, గారేజ్కి తీసుకెళ్లి, పెయింటింగ్‌లు వేయించుకోవడం అంతా బాగుండేది. కొన్నాళ్లు హాయిగానే సాగింది. కానీ ఓసారి యాక్సిడెంట్ జరగడంతో ఇంట్లోవాళ్లు ఇక బైక్ వద్దన్నారు. ఆ విధంగా నా బైక్ రైడ్‌కి బ్రేక్ పడింది. అది సరే... ‘ప్రేమనగర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు కదా.. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? వెంకటేష్: అది అనుకోకుండా జరిగింది. ఓ రోజు నేనేదో ఆడుకుంటుంటే, మా మేనేజర్ అనుకుంటా.. నా దగ్గరికొచ్చి ‘నాన్నగారు రమ్మంటున్నారు.. యాక్ట్ చేయాలట. చేస్తే మీ బ్యాంక్‌లో డబ్బులు వేస్తారట’ అన్నాడు. సరే.. వెళ్లాను. చేశాను. అంతేకానీ నాకు ప్రత్యేకంగా ఇంట్రస్ట్ ఏమీ లేదు. కనీసం చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి, యాక్ట్ చేసి చూసుకోవడం కూడా చేసేవారు కాదా? వెంకటేష్: సినిమా వాతావరణంలో పెరిగినందువల్లో ఏమో.. మా ఆఫీస్ పైన ఉన్న కాస్ట్యూమ్ రూమ్‌లోకెళ్లి.. మా జానపద సినిమాలకు సంబంధించిన డ్రెస్‌లేసుకుని, అద్దం ముందు నిలబడి, ఏవో పిచ్చి పిచ్చి సైగలు చేయడం ఇంకా గుర్తుంది. అలాగే, మావాళ్లు అప్పుడప్పుడు, నన్ను డాన్స్ చేయమనేవాళ్లట. కొంతమంది స్టార్స్‌ని ఇమిటేట్ చేసేవాణ్ణట. ఇలాంటివన్నీ అన్నయ్య చెయ్యలేదు. నేనే చేశానంటే.. ఏదో మూల నాలో యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఉండేదేమో...! అన్నయ్య, మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? వెంకటేష్: మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. ఇప్పుడూ అలానే ఉంటాం. అన్నయ్య మంచి స్పోర్ట్స్‌మేన్. క్రికెట్ బాగా ఆడేవాడు. ఫాస్ట్ బౌలర్. స్కూల్లో స్పోర్ట్స్ అంటే... అన్నయ్య పార్టిసిపేషన్ కంపల్సరీ. సౌత్‌లో నిర్మాతల కొడుకుల్లో మీ అంతగా సక్సెస్ అయినవాళ్లు లేరు. భవిష్యత్తుని ప్లాన్ చేయనన్నారు కాబట్టి... ఈ ఊహించని సక్సెస్ ఎలా అనిపిస్తోంది? వెంకటేష్: నా మొదటి సినిమా తర్వాత వరుసగా నాలుగైదు ఫ్లాప్‌లు వచ్చాయి. దాంతో, చాలా కామెంట్స్ వచ్చాయి. ‘నిర్మాతల కొడుకులు కష్టం’ అని కొందరు, ‘ఈ అబ్బాయికి యాక్టింగ్‌కి కుదరదు’ అని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. అప్పటికే చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు సినిమాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ నిర్మాత కొడుకుగా నేను ఎంటరయ్యాను. అయినా ఎవరి విమర్శలనీ పట్టించుకోలేదు. హిట్, ఫ్లాప్ గురించీ ఆలోచించలేదు. ఫస్ట్ సినిమాలో నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేనెలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. అబ్రాడ్ నుంచి రావడం రావడమే యాక్టింగ్ మొదలుపెట్టాను. డెరైక్టర్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఏం చెబితే అది చేశాను. కొన్ని ఫ్లాపుల తర్వాత స్వర్ణకమలం, ప్రేమ, శ్రీనివాస కల్యాణం లాంటి డిఫరెంట్ మూవీస్‌కి అవకాశం వచ్చింది. దాంతో మంచి పేరొచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ మూవీస్ చేయడం, ఆడియన్స్ నన్ను అంగీకరించడం... అంతా కూల్‌గా జరిగిపోయింది. సో.. ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకే. మీ కామెడీ టైమింగ్ బాగుంటుంది.. బేసిక్‌గా మీలో సెన్సాఫ్ హ్యుమర్ ఉందా? వెంకటేష్: ఇన్నర్‌గా హ్యుమర్ ఉంటే.. కామెడీ టైమింగ్ బాగా కుదురుతుంది. చిన్న వయసులో మాస్ సినిమాలు చేసి, ఆ తర్వాత ప్రేమకథా చిత్రాల్లో నటించారెందుకని? వెంకటేష్: రక్తతిలకం, బ్రహ్మపుత్రుడు, కూలీ నెం. 1 ఇలా వరుసగా మాస్, ఆ తర్వాత లవ్‌స్టోరీస్ చేశాను. మాస్ సినిమాలు చేసినప్పుడు ‘మెడ’కు గాయం తగిలింది. అది చాలా సివియర్‌గా ఉండేది. దాంతో మాస్ సినిమాలకన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉండేవి చేస్తే బాగుంటుందనుకున్నా. అప్పుడు లవ్‌స్టోరీస్ చేశాను. అవి బాగా ఆడాయి. కాబట్టి.. ఆ గాయం తగలడం కూడా మేలే అయ్యిందని, ఏది జరిగినా అది మన మంచికే అనిపించింది. నాకున్న అనుభవంతో చెబుతున్నా. రిజల్ట్ అనేది 50 శాతం మనం హార్డ్‌వర్క్ చేసినందుకు వస్తుంది. మిగతా 50 శాతం రిజల్ట్ మిస్టీరియస్‌గా వచ్చేస్తుంది. అవతలి హీరోలు బిజీగా ఉన్నప్పుడు, వాళ్లు చేయాల్సిన మంచి సినిమా నాకు వచ్చి ఉండొచ్చు. లేకపోతే మనం ఖాళీగా ఉన్నాం కదా అని మనల్ని ఆ సినిమా కోసం అడిగి ఉండొచ్చు. అందుకే ఏ సక్సెస్ అయినా ‘నాది’ అనుకోను. అది అందరిదీ... ఆ టైమ్దీ అనుకుంటాను. ‘నా వల్ల, నేను’ అనే ఆలోచన మైండ్‌కి వస్తే.. మనం అయిపోయినట్లే. అది చాలా డేంజరస్ ఇగో. మీకు చిన్నప్పట్నుంచీ ‘ఇగో’ లేదా? వెంకటేష్: నిరాడంబరంగా ఉండటం అనేది మా అమ్మానాన్నల జీన్స్ నుంచి సంక్రమించినది. తనో పెద్ద నిర్మాత అని నాన్నగారు ఎప్పుడూ ఫీలవ్వలేదు. అమ్మ చాలా నిరాడంబరంగా ఉంటుంది. నా బ్రదర్, సిస్టర్ కూడా చాలా సింపుల్ పీపుల్. నాది, నేను.. అనే ఆలోచన నాకు రాకపోవడం నా అదృష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఇగో ఉన్నవాళ్లని కూడా నేను నిందించను. ఎవరైనా ఎప్పుడైనా అగ్రెసివ్‌గా బిహేవ్ చేశారనుకోండి.. నేను వాళ్లని కామెంట్ చేయను. అప్పటి తన పరిస్థితి వల్ల, టైమ్ వల్ల, తను నేర్చుకున్న విషయాల ద్వారా అతను అలా చేశాడని అనుకుంటాను. అందుకే నేనెవరి మీద జడ్జ్మెంట్ పాస్ చేయను. అలాగే, ఎవరైనా తప్పు చేస్తే.. వెంటనే కాకుండా ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలనేది నా సిద్ధాంతం. సో.. ఎవరి గురించీ తప్పుగా ఆలోచించరన్నమాట.. అయితే మీరు తప్పులు కూడా చేయరా? వెంకటేష్: సాధ్యమైనంతవరకు నేనవెరి గురించీ తప్పుగా ఆలోచించను. ఒకవేళ ఎవరైనా తప్పులు చేసినా.. ఏమో వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారో అనుకుంటా. ఇక, తప్పులు చేయరా? అనడిగారు. గొప్ప గొప్పవాళ్లూ తప్పులు చేస్తారు. కానీ, ఒక్కోసారి సాదాసీదా వ్యక్తులు కూడా గొప్పగా ఆలోచిస్తారు. అదే జీవితం. కానీ తప్పులు చేయని మానవులు ఉండరు. ఓకే.. ఇప్పుడు మళ్లీ ‘ఆధ్యాత్మికత’ విషయానికొద్దాం.. అసలు మీకీ వైపుగా దృష్టి మళ్లడానికి గల కారణం ఏదైనా ఉందా? వెంకటేష్: నా సినిమాలు ఘనవిజయం సాధించినప్పుడు కూడా నేను మామూలుగా ఉండేవాణ్ణి. ఏదీ పెద్దగా ఆనందాన్నిచ్చేది కాదు. ఒకానొక దశలో ‘ఏంటి ఇలా ఉంటున్నాం. అన్నిటికీ సమానంగా స్పందిస్తున్నాం. అసలు మనం ఏంటి? మనం ఎవరు?’ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలు ఆధ్యాత్మిక బాటలో మళ్లేలా చేశాయి. ‘ప్రేమించుకుందాం రా’ సమయంలో ఈ మార్పు మొదలైంది. ఆ ఆధ్యాత్మిక ప్రయాణం అలా నిరాటంకంగా సాగుతోంది. జనరల్‌గా ఫిఫ్టీ ప్లస్‌లో ఆధ్యాత్మిక బాటలోకి వెళుతుంటారని అంటుంటారు. కానీ, మీరు చిన్న వయసులోనే ఇటువైపు ఎట్రాక్ట్ అయ్యారు... వెంకటేష్: ఆధ్యాత్మికతకు వయసుతో సంబంధం లేదు. మనం అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్న తర్వాత, ‘మనం అనుకున్నదే కరెక్ట్’ అనే భావనలో పడిపోతాం. అప్పుడు ఏ బాటలోనూ అంత సులువుగా వెళ్లలేం. చిన్నపిల్లలను ఓ ఉదాహరణగా తీసుకుందాం. వాళ్లు ఏదైనా త్వరగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే, వాళ్లకి ‘నేను’ అనేది తెలియదు. వాళ్ల గురించి వాళ్లు ఒక ఇమేజ్‌లో పడిపోరు. అందుకే ‘నేను’ అనే భావన పెరిగేలోపే ఈ బాటలో వెళ్లాలి. ఎందుకంటే, ఆ తర్వాత వెళ్లలేం. అంతే తప్ప, అన్నీ అనుభవించేసిన తర్వాత చూద్దాంలే అనుకుంటే కరెక్ట్ కాదు. ‘ఆధ్యాత్మికం’ అంటారు కానీ, ఆడంబరాలు మాత్రం వదులుకోలేదని మీపై ఓ విమర్శ ఉంది. ఎందుకంటే, మణికొండ ఏరియాలో వైభవంగా ఇల్లు కట్టించుకున్నారు కదా? వెంకటేష్: ఆధ్యాత్మికం అంటే నిరాడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రాజ్యాలే ఏలారు. వైభవాలను అనుభవించారు. అదే విధంగా అంతర్గతంగా తామేంటో తెలుసుకున్నారు. శాశ్వతం, అశాశ్వతాలకు వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు. దీన్నే ‘రాయల్ మిడిల్ పాత్’ అంటాం. ఆధ్యాత్మికం అంటే.. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవడం కాదు. నేనిక్కడ పుట్టాను కాబట్టి.. ఇక్కడ ఉండాల్సిందే. ఒకవేళ నేను అడవిలో ఎవరికో పుట్టి ఉంటే.. ఆ పరిస్థితులకు తగ్గట్టు ఉండి ఉండేవాణ్ణి. ఏది దొరికిందో అది యాక్సెప్ట్ చేస్తూ.. అది చేసుకుంటూ వెళ్లడమే. ఆధ్యాత్మిక బాటలో వెళ్లేవాళ్లు సంపాదించకూడదు, వాళ్లకి కుటుంబం ఉండకూడదు అనుకుంటే తప్పు.. ఇవేవీ లేకుండా ఉండాల్సిన అవసరంలేదు. నేనేం సన్యాసిని కాదు కదా. మీరిలా ‘నిజం తెలుసుకోవాలి.. నేనెవర్నో తెలుసుకోవాలి’లాంటివి మాట్లాడినప్పుడు మీ ఇంట్లోవాళ్లు భయపడలేదా? వెంకటేష్: మొదట్లో భయపడ్డారనుకుంటా! అయితే, ఆ తర్వాత వాళ్లు నా లైఫ్‌స్టయిల్‌ని గమనించారు. హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నానని, చక్కగా సంపాదించుకుంటున్నానని, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నానని... అర్థం చేసుకున్నాక రిలాక్స్ అయ్యారు. మీ నలుగురు పిల్లల దగ్గర ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతుంటారా? వెంకటేష్: కొన్ని బోధిస్తాను. గైడ్ చేస్తాను. కానీ, నా అభిప్రాయాలను వాళ్ల మీద రుద్దను. ఇది ‘మెటీరియలిస్టిక్ వరల్డ్’ కాబట్టి.. ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?లాంటివి చెబుతుంటాను. అలాగే వాళ్ల అనుభవాల ద్వారా కూడా జీవితం మీద అవగాహన కలిగించుకోవాలనుకుంటాను. చెప్పాల్సిన విషయాలు సరైన టైమ్‌లో చెప్పకపోతే ‘అయ్యయ్యో.. అప్పుడు చెప్పి ఉంటే బాగుండేది కదా’ అనుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు చెప్పాల్సినది అప్పుడు చెప్పెయ్యాలి. చిన్నప్పుడు మీరు యాక్ట్ చేశారు కదా.. మరి.. మీ అబ్బాయి (అర్జున్ రామ్‌నాథ్)ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎందుకు చేయించలేదు? వెంకటేష్: టైమ్ రావాలి. వాడూ ఏదో ఒకటి చేస్తాడు. చూద్దాం.. ఏం చేస్తాడో? ఇప్పుడు వాడికి పదేళ్లు. నేను నిర్మాత కొడుకుని. వాడు స్టార్ కొడుకు. వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. భవిష్యత్తులో తనేం అవుతాడో తనే డిసైడ్ చేసుకుంటాడు. మీ పిల్లలు సింపుల్‌గానే ఉంటారా... స్టార్ కిడ్స్ స్టేటస్‌కి తగ్గట్టుగా ఉంటారా? వెంకటేష్: వాళ్లు చాలా ‘సింపుల్ చిల్డ్రన్’. నా పిల్లలే కాదు.. ఎవరైనా సరే సింపుల్‌గానే ఉండాలంటాను. నా పిల్లలు ‘వండర్ఫుల్’. వాళ్ల వల్ల నాకు, నా భార్యకూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మీ పిల్లలను ఎప్పుడూ చూడలేదు కాబట్టి.. వాళ్లల్లో మీ మేనరిజమ్స్ గురించి చెప్పలేం. కానీ, నాగచైతన్య నడక, కొన్ని మేనరిజమ్స్ మీలానే ఉంటాయి. ఓ మేనమామగా మీ ఫీలింగ్? వెంకటేష్: వండర్ఫుల్ ఫీలింగ్. నాగచైతన్య ‘నైస్ బోయ్’. నా సిస్టర్ (నాగచైతన్య తల్లి లక్ష్మి)కి నేను చాలా క్లోజ్. అలానే చైతన్య! ‘ఐయామ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్’. ఆ మాటకొస్తే.. ‘ఐయామ్ ఓపెన్ టు ఎవ్రిబడీ’. సినిమాలు కాకుండా మీకు నచ్చేవి? వెంకటేష్: చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వాళ్లకి కల్లా కపటం తెలియదు. ఇగోలు, ఇండివిడ్యువాలిటీ ఉండవు. అలాంటివాళ్లతో గడపడం నాకిష్టం. పిల్లలు దైవసమానులని నా ఫీలింగ్. 27ఏళ్ల కెరీర్ గ్రాఫ్ మీది. ఇన్నేళ్లు నిరాటంకంగా కొనసాగడం ఎలా ఉంది? వెంకటేష్: ఇదంతా బోనస్సే. ఎందుకంటే, ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారంతో.. ఎంతో కొంత డబ్బు సంపాదించుకునేవాణ్ణేమో. కానీ, దేవుడు నాకు చాలా ఇచ్చాడు. అందుకే ఎప్పుడో శాటిస్ఫేక్షన్ వచ్చేసింది. మీరెప్పుడూ దేనికీ బానిస అవ్వలేదా? వెంకటేష్: ఆధ్యాత్మికతకు బానిస అయ్యాను. ఇప్పుడు ఫర్వాలేదు కానీ.. ఒకప్పుడు ఎప్పుడు ఎక్కడికెళ్లాలనిపిస్తే.. అక్కడికి వెళ్లిపోయేవాణ్ణి. రిషికేష్, హిమాలయాస్... అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. అంతే. అక్కడికి వెళితే ఏవో నిజాలు తెలుస్తాయని.. జీవిత సత్యాలు తెలుస్తాయని ఆరాటం. కానీ, ఇప్పుడు అది లేదు. కళ్లు మూసుకుని, హిమాలయాలు ముందున్నట్లుగా ఊహించుకోగలను. దేవుడు నా చుట్టుపక్కలే ఉన్నాడని ఊహించగలను. అంత పరిపక్వత వచ్చేసింది. మళ్లీ సినిమాల్లోకి వద్దాం... మీరు చేసిన సినిమాల్లో ‘సక్సెస్ రేట్’ ఎక్కువ. కానీ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పోల్చితే మీకు అభిమానుల సంఖ్య తక్కువ. ఎందుకలా? వెంకటేష్: ఈ మాట నాతో చాలామంది అంటారు. 99వ రోజున థియేటర్లోంచి తీసేసిన నా సినిమాలు చాలా ఉన్నాయి. అభిమానులు వచ్చి అడిగితే, ‘అభిమానంతో మీరు ఇన్నాళ్లు చూశారు. నాకది చాలు’ అని చెప్పేస్తుంటాను. అంతకుమించి నేను రికార్డ్స్ గురించి ఆలోచించడం కానీ, అభిమానులను ఎంకరేజ్ చేయడం కానీ చేయలేదు. అఫ్కోర్స్.. ఇతర హీరోలు అలా చేశారని చెప్పడంలేదు. నేను నా గురించి చెప్పుకుంటున్నాను. ఏదీ శాశ్వతం కాదని నమ్ముతాను కాబట్టి.. రికార్డ్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నాకెంతమంది అభిమానులు ఉండాలని రాసిపెట్టి ఉందో అంతమందే ఉంటారు. ఈ 16కి రామానాయుడుగారు నిర్మాతగా 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.. మీరేం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు? వెంకటేష్: బహుమతులు ఇచ్చి, పుచ్చుకోవడం మాకు అలవాటు లేదు. ‘ఈరోజు ప్రత్యేకం’ అని నేనెప్పుడూ అనుకోను. అన్ని రోజులూ అలానే ఉంటే ఏం? అనుకుంటాను. కాకపోతే, ఒక్కోసారి సెలబ్రేషన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. వాటిని కాదనను. ఓ పది, పదిహేనేళ్ల తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారా? వెంకటేష్: ఆలోచిస్తాను. కానీ, ఏదీ మన చేతుల్లో ఉండదని కూడా తెలుసు. అప్పట్లో ఒకసారి శోభన్‌బాబుగారి దగ్గర ‘నాకు రిటైర్ అవ్వాలనే ఆలోచన వస్తోంది’ అన్నాను. కానీ, ఇప్పుడే కాదు... దానికి ఇంకా చాలా టైముంది అన్నారాయన. ఆ తర్వాత ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే, మనం అనుకున్నదేదీ జరగదని నాకు తెలుసు. భవిష్యత్తు గురించి ఊహలు, కలలు వేస్ట్ అంటారా? వెంకటేష్: వేస్ట్ అనే అంటాను. రేపు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, ఇవాళ సగం ఎనర్జీని వేస్ట్ చేసుకున్నట్లే. భవిష్యత్తులో ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. కానీ అనవసరంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి, ఈరోజు సగం ఎనర్జీని వేస్ట్ చేసేసుకుంటాం. అసలు, మనిషికి మనశ్శాంతి తగ్గేది ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించడంవల్లే. అందుకే, ఈరోజుని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఫైనల్‌గా... ఓ వ్యక్తిగా మీ జర్నీ గురించి ఏం చెబుతారు? వెంకటేష్: వండర్ఫుల్ జర్నీ. నా జీవితం గురించి నాకెలాంటి కంప్లయింట్స్ లేవు. ఇటు సినిమా పరిశ్రమ, అటు ప్రేక్షకుల ద్వారా నాకెలాంటి చేదు జ్ఞాపకాలు లేవు. కెరీర్ చాలా స్మూత్‌గా వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. సో.. నాకంతా బోనస్‌లా ఉంది! - డి.జి. భవాని అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే... యూనిట్ అంతా పరార్! సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నాకు కొంచెం కోపం ఎక్కువగా ఉండేది. అయితే అది అప్పటి పరిస్థితి వల్ల. అప్పట్లో నా మెడకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తాలూకు ప్రభావం నా మీద చాలా ఉండేది. ఆ ఇరిటేషన్లో కోపంగా ఉండేవాణ్ణి. (నవ్వుతూ) అప్పట్లో నా చెయ్యి మెడ దగ్గరకు వెళితే.. యూనిట్ అంతా పరార్. అందులోనూ ఆ రోజుల్లో నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు.. నచ్చని సీన్స్ ఒకవైపు, నొప్పి ఒకవైపు, దాంతో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయేవాణ్ణి. అయితే ఆ కోపం అంతా నా ఆరోగ్య పరిస్థితి వల్లే. అందుకే, అంటాను.. ఎవరికైనా కోపం వస్తే.. ఆ వ్యక్తికి ఎందుకు కోపం వచ్చింది? అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో అని ఆలోచించాలి. అంతేకానీ, తొందరపడి ఆ వ్యక్తి గురించి ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు. ************* కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. కానీ, ఎప్పుడూ ఆ దేవుడి గురించి ఆలోచిస్తే.. ఆపదలో ఉన్నప్పుడు వస్తాడు. కష్టాలొచ్చాయి కదా అని గుడికెళితే, ఎందుకు రెస్పాండ్ అవుతాడు? అందుకే, ఆ దేవుడు మనపక్కనే ఉన్నాడని ఎప్పుడూ అనుకోవాలి. ఎక్కడో లేడు.. మనలోనే ఉన్నాడనుకునేంత పరిపక్వత వస్తే.. ఇన్నర్‌గా చాలా బలంగా ఉంటాం. ఒక బుక్‌షాప్‌కి వెళ్లారనుకోండి.. త్వరగా డబ్బు సంపాదించడం ఎలా?, సక్సెస్ అవ్వడం ఎలా? అనే పుస్తకాలను కొంటుంటారు. వాటితో పాటు ఆధ్యాత్మికతకకు సంబంధించిన బుక్స్ కూడా కొనుక్కోవచ్చు కదా. కొంచెం జ్ఞానం సంపాదించుకుంటే ఏం పోతుంది? ఆధ్యాత్మిక సైడ్ వెళ్లిపోతే బద్ధకించేస్తాం. పనీ పాటా చెయ్యం అని కొంతమంది ఊహిస్తారు. అది తప్పు. ఈ బాటలో వెళ్లడంవల్ల ఇంకా షార్ప్ అవుతాం. నన్ను తీసుకోండి.. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాగా.. బాగానే సంపాదిస్తున్నాగా. మనం అవతలివాడి గురించే ఎక్కువ ఆలోచిస్తాం. వాడికి సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ ప్రపంచంలో వచ్చే సమస్యలన్నీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడంవల్లే అని నా అభిప్రాయం. మొదట్లో ఏడుపు సీన్స్‌లో చేసేటప్పుడు... చిన్నప్పుడు చనిపోయిన నా ఫ్రెండ్‌ని తల్చుకునేవాణ్ణి. అప్పుడప్పుడు ఎస్వీ రంగారావుగారు, కైకాల సత్యనారాయణగారు, కమల్హాసన్గారిలాంటివాళ్లు చేసిన ఎమోషనల్ సీన్స్‌ని గుర్తు చేసుకుంటుంటాను. ************** ‘చంటి’ చేసేటప్పుడు చాలామంది నవ్వారు. ‘పాపం మీవాడు రిస్క్ తీసుకుంటున్నాడు’ అని నాన్నగారితో అన్నారు. అందరూ ఇలా అంటున్నారేంటి? అని నేను కూడా కొంచెం సందేహపడ్డాను. అద్దం ముందు నిలబడి, సైడ్ పాపిడి తీసి, మొహానికి చిన్న బొట్టు పెట్టుకుని, అమాయకంగా మొహం పెట్టి, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ట్రై చేసేవాణ్ణి. ‘బాగానే ఉంది కదా’ అనిపించి, ఆ సినిమా చేయడానికే నిర్ణయించుకున్నాను. ఓ నమ్మకంతో ‘చంటి’ చేశాను. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. కొత్త తరంవారికి నా బొబ్బిలి రాజా, ప్రేమించుకుందారా, రాజా సినిమాలు తెలియదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటివే తెలుసు. పదేళ్లలోపు పిల్లలు కూడా నన్ను ‘పెద్దోడు’ అంటున్నారు. సో.. న్యూ జనరేషన్‌కి రీచ్ అవుతున్నానని ఆనందంగా ఉంది. అసలు తను మనలోనే ఉన్నాడని చాలామంది అర్థం చేసుకోవడంలేదు. దేవుణ్ణి మనం బయటపెట్టుకుంటే తను అక్కడే ఉండిపోతాడు. లోపలికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. మానవులు ఎప్పుడూ ఏదో కోరుతుంటారని దేవుడు పైకి వెళ్లిపోయాడు. అక్కడున్నా మానవులు వదల్లేదు. ఆ తర్వాత నీళ్ల లోపలకి కూడా వెళ్లిపోయాడు. అక్కడా వదిలిపెట్టలేదు. ఇక లాభం లేదని, ఇంతకంటే సేఫ్ ప్లేస్ లేదని మనలోనే ఉండిపోయాడు. అది తెలుసుకోలేక మనం బయట వెతుకుతున్నాం. అదే మనలోనే ఉన్నాడని గ్రహిస్తే... దేవుడు మనవాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. మనం ‘గాడ్ ఫియరింగ్ నుంచి గాడ్ లవింగ్ అవ్వాలి’. అప్పుడు ఇక, మనకేం భయం లేదనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.