
వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేశ్
వీ స్క్వేర్ ప్లస్ వీటీ బికమ్స్ వీ2. ఈక్వల్ టు ఎఫ్2. ఫైనల్లీ వీ2 ఇన్ ఎఫ్2. ఫార్ములా ఫన్‌గా ఉంది కదూ. సేమ్‌టైమ్ కన్‌ఫ్యూజ్డ్‌గా కూడా ఉంది కదూ. డిఫికల్ట్‌గా ఉన్న ఈ ఫన్ ఫార్ములా సాల్వ్ చేయడం ఈజీ. విక్టరీ వెంకటేశ్(వీవీ) ఈజ్ వీ స్క్వేర్. వీటీ ఈజ్ వరుణ్ తేజ్. ఈ ఇద్దరూ కలిసి చేయబోతున్న సినిమా ‘ఎఫ్2’. అదే ‘ఫన్ అండ్ ఫస్ట్రేషన్’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీకి ‘ఎఫ్2’ అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ‘‘వెంకటేశ్‌గారు, ‘దిల్’ రాజుగారు, అనిల్ రావిపూడిలతో సూపర్ ఫన్ ఫిల్మ్ చేయబోతున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘వెంకటేశ్‌గారు, సూపర్ కూల్ వరుణ్ తేజ్ హీరోలుగా నా దర్శకత్వంలో ‘దిల్’ రాజుగారి బ్యానర్‌లో సినిమా రానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. జూలైలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది’’ అన్నాయి చిత్రవర్గాలు.
Comments
Please login to add a commentAdd a comment