‘క్షణక్షణం’లో శ్రీదేవి, వెంకటేశ్
‘‘శ్రీదేవిలాంటి ఆర్టిస్ట్ వేరీ రేర్. భౌతికంగా ఆమె దూరమైనా శ్రీదేవి జ్ఞాపకాలు అలా బతికే ఉంటాయి’’ అన్నారు వెంకటేశ్. ముంబై వెళ్లి, శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొని హైదరాబాద్ వచ్చాక, ‘సాక్షి’తో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.
► మీతో యాక్ట్ చేయకముందు శ్రీదేవిగారి గురించి మీరు విన్న మాటలు...
యాక్చువల్లీ శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచే తన గురించి నాకు తెలుసు. ‘శ్రీదేవి అనే చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది. చాలా బాగా యాక్ట్ చేస్తోంది’ అని చెబుతుండేవారు. మేమంతా అప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. నాలుగైదేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది తను. 14–15 ఇయర్స్‌కే హీరోయిన్ అయిపోయింది. కమల్‌హాసన్‌గారు చైల్డ్ ఆర్టిస్ట్‌లాగా ఎలా వచ్చారో శ్రీదేవి కూడా అలానే వచ్చారు. హీరోలుగా మేం తర్వాత ఎంట్రీ ఇచ్చాం. యాక్టర్‌గా తను మోస్ట్ సీనియర్. తనుకున్న ఎక్స్‌పీరియన్స్ కానీ తన జర్నీ కానీ మోస్ట్ రేర్. ప్రపంచంలో అలా చాలా తక్కువమంది యాక్టర్స్ ఉంటారు. శ్రీదేవిలాంటి వాళ్లు సినిమా కోసమే పుట్టిన అరుదైన ఆర్టిస్టులు. అందుకే మనం వాళ్లను లెజెండ్స్ అంటుంటాం. 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు సినిమాకు డెడికేట్ చేయడమంటే మాటలు కాదు.
► ఏయన్నార్, ఎన్టీఆర్‌గార్లతో యాక్ట్ చేసిన శ్రీదేవి ఆ తర్వాతి తరం అయిన మీతో కూడా యాక్ట్ చేశారు. హీరోయిన్స్ విషయంలో ఇలా జరగడం రేర్ కదా..
డెఫినెట్లీ. అప్పటి టాప్ హీరోస్, టాప్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేసి, మళ్లీ మా తరం హీరోస్ అందరితోనూ యాక్ట్ చేయడమే కాకుండా వెళ్లిన ప్రతీ లాంగ్వేజ్‌లోనూ సూపర్ సక్సెస్ అవ్వడం శ్రీదేవి స్పెషాలిటీ. జనరల్‌గా హీరోయిన్ లైఫ్ స్పాన్ కొన్ని సంవత్సరాలే అని అంటుంటాం. కానీ శ్రీదేవి విషయంలో ఇది వర్తించదు. డీ–గ్లామర్ రోల్ చేసినా, మోస్ట్ గ్లామరస్ రోల్ చేసినా.. ఎక్సెల్ అయ్యారామె. డ్యాన్స్‌లు అంటే శ్రీదేవి. కాస్ట్యూమ్స్ అంటే శ్రీదేవి. యాక్టింగ్‌లో తీసుకుంటే ‘పదహారేళ్ల వయసు, ‘దేవత’ వంటి సినిమాలు ఉన్నాయి. మళ్లీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లాంటి సినిమాతో రీ–ఎంట్రీ ఇచ్చి, తన యాక్టింగ్ కేపబులిటీ చూపించారు. బేసిక్‌గా శ్రీదేవి బ్లడ్‌లోనే యాక్టింగ్ ఉంది.
► ‘ క్షణక్షణం’ అప్పుడు శ్రీదేవిగారు మీకంటే సీనియర్ కాబట్టి ఆవిడతో యాక్ట్ చేయడానికి వెనకాడారా?
అలాంటిదేం లేదు. శ్రీదేవి హీరోయిన్ అనగానే టీమ్ అంతా చాలా ఎగై్జట్ అయ్యాం. ఇద్దరం చాలా బాగా యాక్ట్ చేశాం. అది ప్రతీ సీన్‌లోనూ కనిపిస్తుంది. కొన్ని కొన్ని సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌ను బాగా క్యాప్చర్ చేశాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. శ్రీదేవికి కూడా ఇది చాలా డిఫరెంట్ రోల్. మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో ట్రైన్ సీక్వెన్స్ అప్పుడు నేను పడిపోతే తను చేయి ఇవ్వడం.. చాలా ఫన్నీగా బావుంటాయి. సినిమా అయిపోతున్నా హీరో హీరోయిన్‌కు లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడు. ఫైనల్‌గా జస్ట్ ఇద్దరం హగ్ చేసుకుంటాం. జస్ట్ ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో చెప్పేస్తాం. ఆ సీన్‌లో ఇద్దరం చాలా న్యాచురల్‌గా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాం.
► ‘జామురాతిరి జాబిలమ్మ...’ సాంగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి?
మేం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే టైమ్‌లో రాము ‘క్షణక్షణం’ సినిమాతో రావడం, అందులో నన్ను, శ్రీదేవిని కొత్త స్టైల్‌లో చూపించడం, అదొక కల్ట్ సినిమా అవ్వడం.. టోటల్‌గా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ‘జాము రాతిరి...’ సాంగ్ అంతా ఇద్దరం కూర్చుని, ఎక్స్‌ప్రెషన్స్‌తో చేశాం. నాకు తెలిసి ఇప్పటికీ ఏ హీరో హీరోయిన్ కంప్లీట్ సాంగ్ అంతా అలా కూర్చుని చేయలేదు. అది మాకు చాలెంజింగ్‌గా అనిపించింది. శ్రీదేవి ఎక్స్‌ప్రెషన్స్ గమనిస్తూ నేను, నా ఎక్స్‌ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూ తనూ... అలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఆ సాంగ్‌లో ఓ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ కనిపిస్తుంటుంది. ఆ జనరేషన్ ఈ జనరేషన్.. నెక్ట్స్ జనరేషన్... ఎవ్వరికైనా ఈ సాంగ్ ఓ క్లాసిక్.
► మీ సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌తో శ్రీదేవిగారికి మంచి అనుబంధం ఉంది..
అవును. నేను యాక్టర్ అవ్వకముందే శ్రీదేవి మా బ్యానర్‌లో ‘ముందడుగు, తోఫా’ వంటి సినిమాలు చేశారు. మా డాడీ ఫేవరెట్ ఆర్టిస్ట్. తను చూపించే ప్రొఫెషనలిజం, క్యారెక్టర్స్ విషయాల్లో చూపించే ఇంట్రెస్ట్, దర్శక–నిర్మాతల పట్ల గౌరవం... ఇవన్నీ శ్రీదేవి అంత పెద్ద స్టార్ అవ్వడానికి హెల్ప్ చేశాయి. యాక్టర్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి శ్రీదేవి జర్నీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. తనతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే మనందరినీ వదిలిపెట్టి వెళ్లిపోవడం బా«ధగా ఉంది.
► శ్రీదేవిగారి మరణ వార్త వినగానే షాకింగ్‌గా ఉండి ఉంటుంది..
చాలా. వెంటనే ముంబై వెళ్లాలనిపించింది. బోనీ కపూర్, అనిల్ కపూర్ నాకు, మా అన్నయ్య సురేష్‌కు క్లోజ్. అందుకే అక్కడ మేం ఉండాలి, వాళ్లకు మా సపోర్ట్ ఉండాలనిపించింది. అక్కడే ఉండిపోయాను. మేమే కాదు ఇండస్ట్రీ అంతా శ్రీదేవి కోసం వచ్చింది. మంచి ఫేర్‌వెల్ ఇచ్చారు. శ్రీదేవి డిజర్వ్ దట్ రెస్పెక్ట్.
► శ్రీదేవిలాంటి ఆర్టిస్ట్ భవిష్యత్‌లో రారని చాలామంది అంటున్నారు..
యస్.. శ్రీదేవిలా అంటే కష్టమే. ఫిల్మ్ ఇండస్ట్రీకు, అభిమానులకు మర్చిపోలేనన్ని జ్ఞాపకాల్ని వదిలి వెళ్లారు శ్ర్రీదేవి. ఇప్పుడు తను లేదని బాధపడటం కంటే తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందాం. తనలాంటి అద్భుతమైన యాక్టర్‌ను భూమ్మీదకు పంపినందుకు ఆ దేవుడికి మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment