kshana kshnam
-
ప్రయోగాలు చేయాలంటే ధైర్యం కావాలి
‘‘ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ‘చావు కబురు చల్లగా’ చేస్తున్నప్పుడు అది ఎక్స్‌పీరియ¯Œ ్స చేశాను. ‘క్షణక్షణం’తో అలాంటి ధైర్యం చేసిన వర్లుగారిని, మౌళిగారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా చాలా బాగుండటంతో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూష¯Œ ద్వారా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, జియా శర్మ జంటగా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షణ క్షణం’. డాక్టర్ వర్లు, మన్నం చంద్ర మౌళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ‘బన్నీ’ వాసు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఇష్టంతో కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి వస్తారు. నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సినిమాను ప్రేమించాను కాబట్టే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. వారసులకైనా మొదటి సినిమా వరకే అడ్వాంటేజ్.. ఆ తర్వాత వాళ్లు నిరూపించుకోవాల్సిందే’’ అన్నారు. ‘‘క్షణక్షణం’ ట్రైలర్ ఎంత బాగుందో, సినిమా కూడా అంతే బాగుంటుంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘క్షణక్షణం’లో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు కార్తీక్ మేడి కొండ. ‘‘హాలీవుడ్ నిర్మాత వాల్ట్ డిస్నీకి సినిమాలే ప్రపంచం. అదే ప్యాష¯Œ ను ఉదయ్‌లో చూశా’’ అన్నారు డాక్టర్ వర్లు. జియా శర్మ, సంగీత దర్శకులు రోష¯Œ సాలూరి, రఘు కుంచె మాట్లాడారు. -
క్షణక్షణం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది
‘‘సస్పెన్స్, డార్క్ కామెడీ జానర్‌తో పాటు కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘క్షణక్షణం’ సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా కూడా ఉత్కంఠగా సాగుతుందని తెలిసింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా, జియా శర్మ హీరోయిన్గా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్షణక్షణం’. డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని మారుతి విడుదల చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘క్షణక్షణం’లో డార్క్ కామెడీ బాగా కుదిరింది. మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడంతో పాటు, మా టీమ్‌కి పెద్ద సక్సెస్ అందిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్‌గా తీశాం. ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది.. దీంతో ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు. మా సినిమా ప్రేక్షకుల్ని ఎక్కడా రిలాక్స్ కానివ్వదు. సందర్భానికి తగ్గట్టు వచ్చే పాటలు సినిమా మూడ్‌ని మరింత ఎలివేట్ చేస్తాయి’’ అన్నారు కార్తీక్ మేడికొండ. శ్రుతీసింగ్, సంగీత దర్శకులు కోటి, రఘుకుంచె, రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కె. సిద్ధార్థ్ రెడ్డి, సంగీతం: రోషన్ సాలూరి. -
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ
చిక్కటి చీకటిలో చింతలేకుండా నిద్ర పొమ్మని నాయికకు చెప్పాలి! కానీ ధైర్యం ఇవ్వడానికి నాయకుడు ఇస్తున్న ప్రతీకలేమిటి? పిట్టల అరుపులు, పొదల సడులతోపాటు సాక్షాత్తూ వనమే వద్దకొచ్చి నిద్రపుచ్చుతుందట. రాత్రిలో భీతి కలిగించేవాటితోనే ప్రీతి కలిగిస్తున్నాడు కవి. ‘క్షణక్షణం’ చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన– ‘జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా’ గురించి మాట్లాడుతున్నట్టుగా అర్థమైపోయివుంటుంది కదా! ‘కుహు కుహు సరాగాలే శ్రుతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిల కిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా కునుకు రాక పుట్టబొమ్మ గుబులుగుందనీ వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ’ అంటూ సాగే ఈ పాటలో ‘మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో’ అని కమ్మని కల కనమంటాడు. ‘చిటికలోన చిక్కబడ్డ కఠిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి’ అని ముక్తాయింపు ఇస్తాడు. 1991లో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం కీరవాణి. ఆయన స్వరకల్పన చేసిన అత్యుత్తమ గీతాల్లో ఇదీ ఒకటి. పాడింది బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. నటీనటులు శ్రీదేవి, వెంకటేశ్. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. వర్మ ఉత్తమ చిత్రాల్లో కూడా ఇదొకటి. -
జ్ఞాపకాలు బతికే ఉంటాయి
‘‘శ్రీదేవిలాంటి ఆర్టిస్ట్ వేరీ రేర్. భౌతికంగా ఆమె దూరమైనా శ్రీదేవి జ్ఞాపకాలు అలా బతికే ఉంటాయి’’ అన్నారు వెంకటేశ్. ముంబై వెళ్లి, శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొని హైదరాబాద్ వచ్చాక, ‘సాక్షి’తో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ► మీతో యాక్ట్ చేయకముందు శ్రీదేవిగారి గురించి మీరు విన్న మాటలు... యాక్చువల్లీ శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచే తన గురించి నాకు తెలుసు. ‘శ్రీదేవి అనే చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది. చాలా బాగా యాక్ట్ చేస్తోంది’ అని చెబుతుండేవారు. మేమంతా అప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. నాలుగైదేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది తను. 14–15 ఇయర్స్‌కే హీరోయిన్ అయిపోయింది. కమల్‌హాసన్‌గారు చైల్డ్ ఆర్టిస్ట్‌లాగా ఎలా వచ్చారో శ్రీదేవి కూడా అలానే వచ్చారు. హీరోలుగా మేం తర్వాత ఎంట్రీ ఇచ్చాం. యాక్టర్‌గా తను మోస్ట్ సీనియర్. తనుకున్న ఎక్స్పీరియన్స్ కానీ తన జర్నీ కానీ మోస్ట్ రేర్. ప్రపంచంలో అలా చాలా తక్కువమంది యాక్టర్స్ ఉంటారు. శ్రీదేవిలాంటి వాళ్లు సినిమా కోసమే పుట్టిన అరుదైన ఆర్టిస్టులు. అందుకే మనం వాళ్లను లెజెండ్స్ అంటుంటాం. 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు సినిమాకు డెడికేట్ చేయడమంటే మాటలు కాదు. ► ఏయన్నార్, ఎన్టీఆర్గార్లతో యాక్ట్ చేసిన శ్రీదేవి ఆ తర్వాతి తరం అయిన మీతో కూడా యాక్ట్ చేశారు. హీరోయిన్స్ విషయంలో ఇలా జరగడం రేర్ కదా.. డెఫినెట్లీ. అప్పటి టాప్ హీరోస్, టాప్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేసి, మళ్లీ మా తరం హీరోస్ అందరితోనూ యాక్ట్ చేయడమే కాకుండా వెళ్లిన ప్రతీ లాంగ్వేజ్‌లోనూ సూపర్ సక్సెస్ అవ్వడం శ్రీదేవి స్పెషాలిటీ. జనరల్‌గా హీరోయిన్ లైఫ్ స్పాన్ కొన్ని సంవత్సరాలే అని అంటుంటాం. కానీ శ్రీదేవి విషయంలో ఇది వర్తించదు. డీ–గ్లామర్ రోల్ చేసినా, మోస్ట్ గ్లామరస్ రోల్ చేసినా.. ఎక్సెల్ అయ్యారామె. డ్యాన్స్‌లు అంటే శ్రీదేవి. కాస్ట్యూమ్స్ అంటే శ్రీదేవి. యాక్టింగ్‌లో తీసుకుంటే ‘పదహారేళ్ల వయసు, ‘దేవత’ వంటి సినిమాలు ఉన్నాయి. మళ్లీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లాంటి సినిమాతో రీ–ఎంట్రీ ఇచ్చి, తన యాక్టింగ్ కేపబులిటీ చూపించారు. బేసిక్‌గా శ్రీదేవి బ్లడ్‌లోనే యాక్టింగ్ ఉంది. ► ‘ క్షణక్షణం’ అప్పుడు శ్రీదేవిగారు మీకంటే సీనియర్ కాబట్టి ఆవిడతో యాక్ట్ చేయడానికి వెనకాడారా? అలాంటిదేం లేదు. శ్రీదేవి హీరోయిన్ అనగానే టీమ్ అంతా చాలా ఎగై్జట్ అయ్యాం. ఇద్దరం చాలా బాగా యాక్ట్ చేశాం. అది ప్రతీ సీన్లోనూ కనిపిస్తుంది. కొన్ని కొన్ని సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌ను బాగా క్యాప్చర్ చేశాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. శ్రీదేవికి కూడా ఇది చాలా డిఫరెంట్ రోల్. మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో ట్రైన్ సీక్వెన్స్ అప్పుడు నేను పడిపోతే తను చేయి ఇవ్వడం.. చాలా ఫన్నీగా బావుంటాయి. సినిమా అయిపోతున్నా హీరో హీరోయిన్‌కు లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడు. ఫైనల్‌గా జస్ట్ ఇద్దరం హగ్ చేసుకుంటాం. జస్ట్ ఒక్క ఎక్స్ప్రెషన్తో చెప్పేస్తాం. ఆ సీన్లో ఇద్దరం చాలా న్యాచురల్‌గా ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. ► ‘జామురాతిరి జాబిలమ్మ...’ సాంగ్ ఎక్స్పీరియన్స్ గురించి? మేం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే టైమ్‌లో రాము ‘క్షణక్షణం’ సినిమాతో రావడం, అందులో నన్ను, శ్రీదేవిని కొత్త స్టైల్లో చూపించడం, అదొక కల్ట్ సినిమా అవ్వడం.. టోటల్‌గా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ‘జాము రాతిరి...’ సాంగ్ అంతా ఇద్దరం కూర్చుని, ఎక్స్‌ప్రెషన్స్‌తో చేశాం. నాకు తెలిసి ఇప్పటికీ ఏ హీరో హీరోయిన్ కంప్లీట్ సాంగ్ అంతా అలా కూర్చుని చేయలేదు. అది మాకు చాలెంజింగ్‌గా అనిపించింది. శ్రీదేవి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ నేను, నా ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూ తనూ... అలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఆ సాంగ్‌లో ఓ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ కనిపిస్తుంటుంది. ఆ జనరేషన్ ఈ జనరేషన్.. నెక్ట్స్ జనరేషన్... ఎవ్వరికైనా ఈ సాంగ్ ఓ క్లాసిక్. ► మీ సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌తో శ్రీదేవిగారికి మంచి అనుబంధం ఉంది.. అవును. నేను యాక్టర్ అవ్వకముందే శ్రీదేవి మా బ్యానర్లో ‘ముందడుగు, తోఫా’ వంటి సినిమాలు చేశారు. మా డాడీ ఫేవరెట్ ఆర్టిస్ట్. తను చూపించే ప్రొఫెషనలిజం, క్యారెక్టర్స్ విషయాల్లో చూపించే ఇంట్రెస్ట్, దర్శక–నిర్మాతల పట్ల గౌరవం... ఇవన్నీ శ్రీదేవి అంత పెద్ద స్టార్ అవ్వడానికి హెల్ప్ చేశాయి. యాక్టర్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి శ్రీదేవి జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. తనతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే మనందరినీ వదిలిపెట్టి వెళ్లిపోవడం బా«ధగా ఉంది. ► శ్రీదేవిగారి మరణ వార్త వినగానే షాకింగ్‌గా ఉండి ఉంటుంది.. చాలా. వెంటనే ముంబై వెళ్లాలనిపించింది. బోనీ కపూర్, అనిల్ కపూర్ నాకు, మా అన్నయ్య సురేష్‌కు క్లోజ్. అందుకే అక్కడ మేం ఉండాలి, వాళ్లకు మా సపోర్ట్ ఉండాలనిపించింది. అక్కడే ఉండిపోయాను. మేమే కాదు ఇండస్ట్రీ అంతా శ్రీదేవి కోసం వచ్చింది. మంచి ఫేర్వెల్ ఇచ్చారు. శ్రీదేవి డిజర్వ్ దట్ రెస్పెక్ట్. ► శ్రీదేవిలాంటి ఆర్టిస్ట్ భవిష్యత్‌లో రారని చాలామంది అంటున్నారు.. యస్.. శ్రీదేవిలా అంటే కష్టమే. ఫిల్మ్ ఇండస్ట్రీకు, అభిమానులకు మర్చిపోలేనన్ని జ్ఞాపకాల్ని వదిలి వెళ్లారు శ్ర్రీదేవి. ఇప్పుడు తను లేదని బాధపడటం కంటే తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందాం. తనలాంటి అద్భుతమైన యాక్టర్‌ను భూమ్మీదకు పంపినందుకు ఆ దేవుడికి మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. -
కొన్ని క్షణాలు.. సందర్భాలు
మనసు నిండా ట్రాజెడీ... కెమెరా ముందు కామెడీ జీవితంలోని కొన్ని క్షణాలు జీవితాంతపు క్షణాలుగా మిగిలిపోతాయి. స్టార్ నటి శ్రీదేవి జీవితంలోనూ అలాంటి క్షణాలు ఉన్నాయి! గుండె నిండా దుఃఖాన్ని ఉంచుకుని, ముఖమంతా నవ్వును అభినయించిన క్షణాలు అవి! యశ్‌చోప్రా చిత్రం ‘లమ్హే’ (1991) షూటింగ్ లండన్‌లో జరుగుతున్నప్పుడు ఆమెకు తండ్రి చనిపోయిన కబురు అందింది. వెంటనే ఇండియా వచ్చి, తండ్రి అంత్యక్రియల్లో ఉండి, తిరిగి లండన్ వెళ్లారు. ఆ దుఃఖంలోనే.. అనుపమ్ ఖేర్‌తో కామెడీ సన్నివేశాల్లో నటించారు! ‘లమ్హే’ అంటే క్షణాలు అని అర్థం. ఎక్కడి నుంచి వచ్చిందో... ఎక్కడికి వెళ్లి పోయిందో ‘న జానె కహా సె ఆయీ హై’.. ‘చాల్బాజ్’ (1989) చిత్రంలోని పాపులర్ సాంగ్. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలుసు? ఆమె ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు?.. అని భావగర్భితంగా సాగే ఈ పాట.. ఈ సందర్భంలో శ్రీదేవి అభిమానుల హృదయాల మీద కదలాడే ఉంటుంది. ఆ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు శ్రీదేవికి 103 డిగ్రీల జ్వరం. పైగా బోరున కురిసే వర్షంతో మొదలయ్యే పాట అది! ఆడినా తియ్యగా.. పాడినా తియ్యగా.. శ్రీదేవి నవ్వినా, మాట్లాడినా, పాటలు పాడినా చిన్న పిల్ల గొంతులా స్వీట్‌గా ఉంటుంది. సద్మా (1983), చాందినీ (1989), గర్జన (1991), క్షణక్షణం (1991) చిత్రాలలో ఆమె స్వయంగా పాడిన పాటలు ఉన్నాయి. ‘బర్క్’ అడిగినా...‘పార్క్’కి వెళ్లలేదు! ‘జురాసిక్ పార్క్’ (1994)లో శ్రీదేవి చిన్న పాత్ర వేస్తే బాగుంటుందని స్టీవెన్ స్పీల్బర్గ్ ముచ్చట పడ్డారు. శ్రీదేవి మంచి పీక్‌లో ఉన్న సమయం అది. అందుకని కాదు కానీ, అది పెద్దగా గుర్తుండిపోయే పాత్రేమీ కాకపోవడంతో శ్రీదేవి ఆ ఆఫర్‌ని మృదువుగా తిరస్కరించారు. భాష రాకుండానే.. భావం ఒలికింది! ‘చాందినీ’కి ముందంతా శ్రీదేవి హిందీలో తన డైలాగులు తను చెప్పలేకపోయేవారు. అప్పట్లో ఆమె నటించిన చాలా సినిమాలకు నాజ్, రేఖ డబ్బింగ్ చెప్పేవారు. -
‘క్షణక్షణం’
క్రైమ్‌తో కామెడీలు వద్దని చెప్పే ‘క్షణక్షణం’ నాటి సినిమా ‘శివ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు రెచ్చిపోయారు. చిన్న చిన్న ఊళ్లలో ఆవారాగా తిరిగే కుర్రాళ్లు ఒక చేత్తో సైకిల్ చైన్ మరో చేత్తో హాకీ స్టిక్ పట్టుకుని నలుగురైదుగురు గుమిగూడి ‘శివ స్టిల్’ ఫొటోలు దిగడం మొదలెట్టారు. సైకిల్చైన్తో ఎదుటివారిని కొట్టడం చాలా కష్టమని తెలియని చాలామంది కొట్లాటల్లో సైకిల్ చైన్ వాడవచ్చని నమ్మారు. డైరెక్టర్ పేరు దాదాపుగా హవా కోల్పోతున్న సమయంలో రామ్‌గోపాల్‌వర్మ అనే పేరు ఒక సినీ వెర్రికి పర్యాయపదమైంది. మరి అతడు తీయబోయే రెండో సినిమా అంటే– దాని పేరు ‘క్షణక్షణం’ అయితే– అందులో శ్రీదేవి నటిస్తూ ఉంటే– పైగా వెంకటేశ్ ఆమె పక్కన ఫస్ట్‌టైమ్ యాక్ట్ చేస్తుంటే– ఆ క్రేజ్ ఎలా ఉండాలి. కాని తీరా సినిమా రిలీజయ్యాక అలా లేదు. ఎలాగో ఉంటుందనుకుంటే ఇంకెలాగో ఉంది. ఆ ఇంకెలాగో ఉండటం దాని స్టయిల్ అనీ, అది క్లాసిక్ అనీ తెలియడానికి ఫస్ట్ రన్ వెళ్లి సెకండ్ రన్ రావాల్సి వచ్చింది. ‘క్షణక్షణం’ క్లాసిక్. మెల్లగా అది తెలుగు ప్రేక్షకులకు ఎక్కి ఇప్పుడు తమ ప్రియమైన సినిమాగా సెటిల్ అయ్యింది. నిజానికి దాని పేరే దానికి మైనస్ అని చెప్పాలి. ‘క్షణక్షణం’ అని పెట్టేసరికి క్షణం క్షణం టెన్షన్ ఉంటుందని ప్రేక్షకులు వచ్చారు. అదే ‘అనుకోకుండా ఒకరోజు’ అని టైటిల్‌పెట్టి ఉంటే ఫస్ట్ రన్‌లోనే సూపర్ హిట్ అయి ఉండేదేమో!తెలుగువారు స్థిమితమైన కామెడీతో సినిమా తీయలేరు అని ఎవరైనా అంటే వారికి ‘క్షణక్షణం’ చూపించాలి. దినదినప్రవర్థమానమైన తెలుగువారి ప్రతిభను చాటి చెప్పాలి. ఇందులో ‘సత్య’ అనే పేరున్న అమ్మాయిగా వేసిన శ్రీదేవి సత్యభామలాగే గడుగ్గాయి. అంతే అమాయకురాలు. జీవితం పట్లగాని పని పట్లగాని పెద్దగా సీరియస్‌నెస్ లేదు. తెల్లనివన్నీ ప్యాకెట్ పాలనీ నల్లనివన్నీ నల్లానీళ్లని నమ్మేసే బాపతు. పొద్దెక్కేదాకా నిద్రపోవడం ఆఫీసుకు లేటుగా వెళ్లి బాస్ చేత అక్షింతలు తినడం ఆమె పని. బాస్ తిట్లు శ్రుతి మించేసరికి ‘ఆ.. బోడి ఉద్యోగం ఇది కాకపోతే ఇంకొకటి’ అని ఇంకో ఉద్యోగానికి అప్లై చేయడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో కోసం స్టుడియోకు వెళుతుంది. అక్కడే ఆమె జీవితంలో క్రైమ్ ఎంటర్ అవుతుంది. ఆ స్టూడియో యజమానికి అంతకు ముందే ఒక పెద్ద బ్యాంకు దొంగతనంతో సంబంధం ఉంటుంది. అతడు తన బాస్– పరేశ్ రావెల్‌కు ఇవ్వాల్సిన డబ్బు తానే కొట్టేసి దానిని ఒక రైల్వే క్లోక్‌రూమ్‌లో దాచి ఆ రసీదును ఫొటో స్టుడియోలో పెట్టుకుని ఉంటాడు. అతన్ని వెతుక్కుంటూ బాస్ వచ్చేసరికి భయపడిపోయి అప్పుడే ఫొటోల కోసం వెళ్లిన శ్రీదేవికి ఇవ్వాల్సిన ఫొటోల కవర్లో క్లోక్‌రూమ్ రెసిప్ట్ను పెట్టి దానిని స్టుడియో దాటించేస్తాడు. కాని పరేశ్‌రావెల్ నాలుగు తగిలించి, ఒక చిటికెన వేలు తీసేసేసరికి ‘ఇప్పుడే ఫొటోల కోసం వచ్చిన అమ్మాయి ఆ రెసిప్ట్ తీసుకెళ్లింది’ అని కక్కేస్తాడు. అక్కడి నుంచి పరేశ్‌రావెల్ బృందం శ్రీదేవి వెంటపడుతుంది. వీళ్లంతా తన వెంట ఎందుకు పడుతున్నారో తెలియని శ్రీదేవి తన ఫ్లాట్‌లో అడుగుపెట్టిన పరేశ్ రావెల్ మనిషిని దాదాపు చంపినంత పని చేస్తుంది. అంతా చేసి ఒక పూట వ్యవధిలోనే ఆమె జీవితం కకావికలం అయిపోతుంది. ఇప్పుడు ఆమెను కాపాడే మనిషి కావాలి. ఆ కాపాడేవాడే ‘చందు’ అనే పేరు కలిగిన వెంకటేశ్. ఇతనో పెద్ద చిల్లర దొంగ. అయితే ఇతడి నేరాలన్నీ చిల్లర వరకే. ఒక ఇరానీ కేఫ్‌లో శ్రీదేవిని చూసిన ఇతడు ఆమె వెనుక పెద్ద ముఠా పడుతోందని, దీని వెనుక ఒక కోటి రూపాయల బ్యాంకు దొంగతనం ఉందని తెలుసుకొని ఆ డబ్బు కోసం తానూ రంగంలో దిగుతాడు. కాని కత్తి పట్టుకున్నవాడికి కత్తే ఎదురవుతుంది. దొంగడబ్బు కోసం ప్రయత్నిస్తే ఖూనీకోర్లే ఎదురవుతారు. ఈ ఇద్దరూ ఒక నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఎన్నో అటాక్స్‌ను ఇటు పోలీసుల నుంచి అటు పరేశ్‌రావెల్ బ్యాచ్ నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. చివరకు శ్రీదేవి దొంగ డబ్బు మనకు వద్దని అది పోలీసులకు అప్పజెబుదామని పట్టుపడుతుంది. వెంకటేశ్‌కు ఇది నిజంగా పెద్ద కష్టమే. కాని అప్పటికే అతడు ఆమెతో రహస్యంగా ప్రేమలో పడి ఉంటాడు. చివరకు ప్రేమే గెలుస్తుంది. దొంగ సొమ్ము కోసం ప్రేమను కోల్పోయి, ప్రశాంతమైన జీవితం కోల్పోవడం కంటే అది ప్రభుత్వం వారి ముఖాన పడేయడమే బెటర్ అని భావిస్తాడు. చివరకు కలవని రైలు పట్టాల సాక్షిగా వారి ప్రేమ కలుస్తుంది. కథ సుఖాంతం అవుతుంది. ఈ సినిమాకు హీరోలు ముగ్గురు. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. శ్రీదేవి, వెంకటేశ్‌లు కథకు తగినట్టుగా తన ప్రమేయాన్ని ఉంచారని చెప్పాలి. నిజానికి హీరో హీరోయిన్లు కథలో ఒక అంతర్గతభాగమై కనిపించడాన్ని తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి టైమ్ పట్టింది. ఓవర్ డ్రమాటిక్‌గా లేకుండా చాలా సహజంగా కనిపించడం కూడా కొత్తే. ‘దేవుడా దేవుడా దేవుడా’... అని భయపడే హీరోయిన్, ‘మా అమ్మ అప్పుడే చెప్పింది’.. అని అమాయకంగా కన్నీళ్లు పెట్టే హీరోయిన్ నిజంగా బాగుంటుందని వాళ్లు మెల్లగా అంగీకరించారు. వెంకటేశ్ కూడా చాలా క్యాజువల్‌గా ఉంటాడు. చాలా సినిమాల్లో హీరో తాను ఎందుకు దొంగగా మారాడో చెప్పే ‘డ్రామా’ను వెంకటేశ్ శ్రీదేవికి చాలా క్యాజువల్‌గా చెప్పినా, అదంతా అబద్ధం అని మనకు తెలుస్తూ ఉండేలా చెబుతాడు. శ్రీదేవి అంతా విని వెంకటేశ్ చెప్పింది నమ్ముతూనే ‘ఆ సినిమా నేను చూశా’ అనడం ఎంతో హాస్యంగా ఉంటుంది. దాని కన్నా హైలైట్ ఏమిటంటే క్లయిమాక్స్‌లో డబ్బుతో వెంకటేశ్ ఉడాయించేస్తే పరేశ్ రావెల్‌ను కూచోబెట్టి ‘ఆయన అలాంటి వారు కాదు. చిన్నప్పుడు వాళ్లమ్మకు బాగలేక మందుల కోసం ఏదో దొంగగా మారారు కానీ’... అని నమ్మకంగా చెబుతూ ఉంటే జనం కడుపుబ్బా నవ్వుతారు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్సు, అపార్థాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఈ సినిమాలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సున్నితమైన హాస్య సన్నివేశాలను అర్థం చేసుకొని నవ్వడానికి కొంచెం ఎదిగారు. ఇక డెన్లు గట్రా లేకుండా చిన్న మఫ్లర్ కట్టుకొని కనిపించే విలన్– పరేశ్ రావెల్ ఎంత రక్తమాంసాలతో ఉన్న మనిషో అనిపిస్తాడు. అతడి జిప్సీ తీసుకొని అడవిలోకి పారిపోయిన వెంకటేశ్, శ్రీదేవిలను అతడు వెతికి పట్టుకుని అడిగే మొదటి ప్రశ్న ‘జిప్సీలో ప్రయాణం బాగా సాగిందా?’ అని. అడవిలో వాన పడుతుంటే తన డబ్బు అడుగుతూనే ‘వర్షం... వర్షం... ఇలా జరుగు’ అని శ్రీదేవికి జాగ్రత్తలు చెబుతాడు. ‘నేను వంద రూపాయలకు మర్డర్ చేసిన రోజులున్నాయి’ అని అతడు చెప్పడం రియలిస్టిక్‌గా ఉండి ఒకవైపు కామెడీ చేస్తున్నా మరోవైపు నాతో జాగ్రత్త సుమా అని క్యారీ చేసేలా ఉంటుంది. దొంగలకు కూడా వెర్రి డౌట్స్ ఉంటాయని రౌడీలలో కూడా క్యూరియాసిటీ ఉంటుందని ఈ సినిమా చూపుతుంది. ‘అడవిలో ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టుంటారు’ అని పరేశ్ రావెల్ అడిగితే ‘తెలియదు సార్’ అని నర్సింగ్ యాదవ్ జవాబు చెబుతాడు. ‘పాములు పగపడతాయంటావా?’ అని అడిగితే మళ్లీ నర్సింగ్ యాదవ్ ‘తెలియదు సార్’ అంటాడు. ఇలాంటి నార్మల్ డౌట్లు ఉన్న విలన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త. ఈ సినిమాలో చాలా సూక్ష్మమైన సన్నివేశాలు రెప్పపాటులో ముగుస్తాయి. ఉదాహరణకు రైల్లో శ్రీదేవి, వెంకటేశ్ తమ దగ్గర ఉన్న బ్యాగ్‌లో ఎంత డబ్బు ఉందో చెక్ చేయడానికి టాయిలెట్లో దూరుతారు. ఆ తర్వాత తలుపు తెరుచుకుని వాళ్ల హడావిడిలో వాళ్లు వెళుతుంటే ఒకే టాయిలెట్లో నుంచి అలా అబ్బాయి అమ్మాయి రావడం చూసి ఒక పెద్దమనిషి హతాశుడవతాడు. ఇలాంటివే ఎన్నో. ‘క్షణక్షణం’ సినిమా కేవలం సబ్జెక్ట్‌కు మాత్రమే కట్టుబడి ఆనెస్ట్‌గా తీసిన సినిమా.దీని వెనుక ‘రొమాన్సింగ్ ది స్టోన్’ వంటి సినిమాల ప్రభావం ఉన్నా రామ్‌గోపాల్ వర్మ ఎంతో కచ్చితమైన కథాసంవిధానంతో దీనిని తెరకెక్కించాడు. హీరో హీరోయిన్లు ఒకే డ్రస్సులో సినిమా అంతా కనిపించడం, రెండు రోజుల కాలవ్యవధిలో ఒక సినిమా ముగిసేలా చూపించడం ఆనాటికి ఉన్న ఫార్ములాకు ఏమాత్రం పొసగని వ్యవహారం. అయినప్పటికీ జనం, నెమ్మదిగానైనా సరే మెచ్చేలా వర్మ తీయగలిగాడు.ఇందులో ఉన్న వినోదానికి తోడు ఒక్కో సీన్లో కనిపించినా ఆటో డ్రైవర్ మాణిక్, బట్టల షాప్ ఓనర్ బ్రహ్మానందం గుర్తుండిపోతారు.కీరవాణి చేసిన పాటలు హిట్. ‘జాము రాతిరి జాబిలమ్మా’, ‘చలి చంపుతున్న చమక్కులో, ‘ముద్దిమ్మంది బుగ్గా’... కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి. వీటికి మించి కీరవాణి చేసిన రీరికార్డింగ్ కూడా బాగుంటుంది. మన రోజువారీ ప్రపంచం వేరు. క్రైమ్ ప్రపంచం వేరు. మన రోజువారీ ప్రపంచంలో క్రైమ్ దూరితే నేరుగా పోలీసులను ఆశ్రయించడమే బెటర్. కాదూ కూడదని సొంత ప్రయోగాలు చేస్తే జీవితం ప్రమాదంలో పడుతుందని ఈ సినిమా అన్యాపదేశంగా చెబుతుంది. కాకపోతే ఆ ముక్కను సీరియస్‌గా కాకుండా హాస్యపు పూతతో చెప్పడం వల్లే ఈ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. ఎస్. క్షణక్షణం తెలుగువారి చెప్పుకోదగ్గ క్లాసిక్. శ్రీదేవి పాట... 1991లో ‘క్షణక్షణం’ రిలీజయ్యే నాటికి శ్రీదేవి కెరీర్ పతాకస్థాయిలో ఉంది. ఆమె కనిపించడమే సినిమాకు పెద్ద వరంగా ఉండేది. నిర్మాతలు కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్‌రెడ్డిలకు శ్రీదేవి డేట్స్ ఇచ్చాకే ఈ సినిమా ఆమెను దృష్టిలో పెట్టుకొని తయారయ్యింది. వర్మ... శ్రీదేవి వీరాభిమాని. అందువల్ల ఎంతో మంది నిర్మాతలు వెంటపడుతున్నా ఆమె కోసం ‘క్షణక్షణం’ తీశారు. ఇందులో శ్రీదేవితో ఆయన పాట కూడా పాడించారు. ‘కింగులా కనిపిస్తున్నాడు’... పాటను కీరవాణి దగ్గర తర్ఫీదు తీసుకుని పాడారామె. సిరివెన్నెల రాసిన ఆ పాట గమ్మత్తుగా ఉంటుంది. – కె.