vijay setupathi
-
ఈయన్ను బయటకు పంపించేయండి: విజయ్ సేతుపతి
భిన్న నటులందరూ ఒకే దగ్గర సమావేశమయ్యారు. తమిళ సినీ స్టార్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), అరవింద్ స్వామి, మలయాళ హీరో ఉన్ని ముకుందన్, కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్, తెలుగు హీరో సిద్ధు జొన్నలగడ్డ, హిందీ నటుడు విజయ్ వర్మ.. అందరూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతాఇందులో విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలకు మిగిలినవారంతా పడిపడి నవ్వారు. ఎవరైనా అద్భుతంగా నటిస్తే నేను అభద్రతాభావానికి లోనవుతాను. ఫలానా సన్నివేశంలో అంత ఈజీగా ఎలా యాక్ట్ చేశారు? అని ఆలోచిస్తుంటాను.. అని విజయ్ చెప్పుకుంటూ పోతుంటే అరవింద్ స్వామి నవ్వకుండా ఉండలేకపోయాడు.(చదవండి: Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ)అంతా ఈయన వల్లే..అతడిని చూసి ప్రకాశ్ రాజ్ సైతం నవ్వేశాడు. ఈయన వల్లే నవ్వానంటూ ప్రకాశ్.. అరవింద్వైపు వేలు చూపించాడు. దీంతో సేతుపతి.. సర్.. ఈయన నన్ను మాట్లాడినవ్వట్లేదు. ఇంటర్వ్యూ మధ్యలో చెడగొడుతున్నాడు. వెంటనే ఈయన్ని బయట నిల్చోబెట్టండి అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కోరాడు. దీంతో అక్కడున్న మిగతా నటులు సైతం ఘొల్లుమని నవ్వారు.రాత్రి సిట్టింగ్..కొన్నిసార్లు అరవింద్ స్వామి నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. వెళ్లాక మేము తాగుతూ కూర్చుంటాం. రెండుమూడు గంటలపాటు నన్ను టీజింగ్ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లయితే తెల్లవారేవరకు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అని సీక్రెట్ బయటపెట్టాడు. ఇక మరో సందర్భంలో జీవిత సత్యాన్ని బయటపెట్టాడు. జీవితం కొన్నిసార్లు మనకు పాఠాలు చెప్తుంది. దాన్ని నేర్చుకోకపోతే లైఫ్ మనకు గుణపాఠం చెప్తుందన్నాడు. చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి! -
తెలుగులో విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్ ’.. రీలీజ్ ఎప్పడంటే..?
వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌గా నటించిన చిత్రం ‘సూపర్ డీలక్స్’. సమంత కథానాయకగా నటించగా ఫాహద్ ఫాజిల్ ఓ కీ రోల్లో నటించారు. త్యాగరాజన్ కుమార రాజా దర్శత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది. సీఎల్ఎన్ మీడియా తెలుగులో విడుదల చేయనుంది. ‘‘సూపర్ డీలక్స్’ని నాలుగు వందల థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. నాలుగు విభిన్న కథలను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలుగులో విడుదల చేస్తున్న సీఎల్ఎన్ మీడియా పేర్కొంది. -
మహారాజాగా విజయ్‌సేతుపతి
తమిళసినిమా: కోలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్న విజయ్‌సేతుపతి. ఆ తరువాత తెలుగులోనూ రంగప్రవేశం చేసి అక్కడ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందుతూ తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అక్కడ వెబ్ సీరీస్‌లో నటిస్తూ పాన్ ఇండియా నటుడు స్థాయికి చేరుకున్నారు. ఈయన నటించిన మామణిదన్ చిత్రం విమర్శకులను సైతం మెప్పించి, పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. కాగా విజయ్‌సేతుపతి తాజాగా తమిళంలో నూతన చిత్రానికి సంతకం చేశారని, దీనికి మహారాజా అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. దీనికి కురంగు బొమ్మై చిత్రం ఫేమ్ నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టెయిన్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు నటరాజన్ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు, ప్రస్తుతం విజయ్‌సేతుపతి పాన్ ఇండియా ఇమేజ్ను తెచ్చుకోవడంతో ఈ మహారాజా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా విజయ్‌సేతుపతి దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలోనూ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. -
డిమాన్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి
జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత వసంత బాలన్ సమర్పణలో డిమాన్ అనే చిత్రం రూపొందుతోంది. వండర్ బాయ్స్ పిక్చర్స్ పతాకంపై ఆర్ సోమసుందరం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేశ్ పళనీవేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన అంగాడి తెరు, అరవాన్, కావ్యతలైవన్, జైల్, ఇదర్కుదానా ఆశపట్టాయ్ బాల కుమారా, కాష్మోరా చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. ఇందులో నటుడు సచిన్, నటి అబర్నది జంటగా నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటనలతో కూడిన హర్రర్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. చిత్రం స్క్రీన్ పై ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుందని అన్నారు. పిజ్జా, రక్షకన్, పిశాచి వంటి చిత్రాల తరహాలో ఇది ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతుందన్నారు. చిత్రంలో కుంకీ అశ్విన్, రవీనా దహ, బిగ్ బాస్ ఫ్రేమ్ శతి పేరియసామి, మిప్పుసామి ప్రభాకరన్, అశోక్, ధరణి, నవ్య సుజి, సలీమా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రోనీ రఫెల్ సంగీతాన్ని, ఆర్ఎస్ ఆనంద్ కుమార్ చాయాగ్రహణంం అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం నటుడు విజయ్‌సేతుపతి దర్శకుడు మిష్కిన్ ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపాయి. Happy to launch #WindowBoysPictures #Demon First Look Poster.Congrats @dirramesh1603 & team.@Vasanthabalan1 @sachinmvm75 @abarnathi21 @Actor_Ashwin @suruthisamy8 @RaveenaDaha @anandakumardop @RonnieRaphael01 @EditorRavikumar @iamKarthikNetha @DoneChannel1 @CtcMediaboy pic.twitter.com/4U2CrC8rwI— VijaySethupathi (@VijaySethuOffl) February 16, 2023 చదవండి: స్వాతంత్య్ర సమరయోధురాలిగా మిస్ చెన్నై -
ఆ సౌత్ హీరోకు ఫోన్ చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగా: జాన్వీ
దివంగత తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హిందీ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆమె సౌత్ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా? అని దక్షిణాది సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ఆమె జూనియర్ ఎన్టీఆర్, విజయ్ సేతుపతితో కలిసి నటించాలని ఉందని మనసులోని మాట బయటపెట్టింది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించింది జాన్వీ. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విజయ్ సేతుపతి సర్ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన నానుమ్ రౌడీ వందసార్లు చూశాను. తర్వాత ఓసారి ఆయనకు ఫోన్ చేసి సార్, మీకు పెద్ద అభిమానిని. మీతో కలిసి నటించాలని ఉంది. ఛాన్స్ ఇస్తే ఆడిషన్‌కు వస్తాను అని చెప్పాను. ఆయన మాత్రం అయ్యో.. అయ్యో.. అంటూ సరదాగా నవ్వారే తప్ప సమాధానమివ్వలేదు. ఆయన సిగ్గుపడుతున్నారో, ఇబ్బందిగా ఫీలయ్యారో అర్థం కాలేదు. కాకపోతే ఆయన ఆశ్చర్యపోయారని మాత్రం అర్థమైంది' అని చెప్పుకొచ్చింది జాన్వీ. చదవండి: స్టేజీపై భార్యను పరిచయం చేసిన యంగ్ హీరో రేవంత్‌ను ఎదిరించి మరీ గేమ్ ఆడిన శ్రీసత్య -
జవాన్‌లో విజయ్ సేతుపతి! రెమ్యునరేషన్ ఎంతంటే?
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోల్ నచ్చిందంటే చాలు భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా సినిమాలు చేస్తున్నాడు. ఉప్పెన చిత్రంతో తెలుగులో విలన్‌గా పరిచయమైన ఈయన ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో షారుక్ ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడట. ఈ పాన్ ఇండియా సినిమాకోసం ఆయన్ను ఒప్పించేందుకు అక్షరాలా 21 కోట్ల రూపాయలు ముట్టజెపుతున్నారట. ఇటీవల రిలీజైన విక్రమ్ సినిమాలో ఆయన నటించిన పాత్రకు విశేష స్పందన రావడంతో తన రెమ్యునరేషన్‌ను రూ15 కోట్ల నుంచి 21 కోట్ల మేరకు పెంచాడట విజయ్ సేతుపతి. అంతేకాదు, జవాన్ సినిమా కోసం అప్పటికే లైన్లో ఉన్న రెండు సినిమాలను కూడా అతడు వదిలేసుకున్నట్లు సమాచారం. దీంతో జవాన్ నిర్మాతలు అతడు అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఇదిలా ఉంటే జవాన్ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా దీపికా పదుకొణె ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇటీవలే దీపిక రోల్‌కు సంబంధించిన చిత్రీకరణ సైతం పూర్తయింది. చదవండి: నానామాటలు అన్న థియేటర్ యజమానిని నేరుగా కలిసిన రౌడీ హీరో అభిమాని పాదాలకు నమస్కరించిన స్టార్ హీరో -
కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ..
Kamal Haasan Vikram Movie Twitter Review: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వెండితెరపై సందడి చేసి సుమారు నాలుగేళ్లయింది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జూన్ 3న 'విక్రమ్'గా సందడి చేసేందుకు వచ్చేశారు కమల్ హాసన్. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇందులో సూర్య అతిథి పాత్రలో మెరవనున్నాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు ఈ మూవీ 1986లో వచ్చిన 'ఏజెంట్ విక్రమ్ 007' సినిమా కథకు లింక్ చేసి రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ పెరిగింది. ముఖ్యంగా ట్రైలర్లో అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మరీ ఇన్ని అంచనాల మధ్య విడుదలైన 'విక్రమ్' ప్రేక్షకులను ఎలా అలరించాడో ట్విటర్ రివ్యూలో చూద్దాం. #Vikram #VikramFDFS Full 3 hrs of explosive action|Racy screenplay & execution by @Dir_Lokesh Rocked|Stellar casting & performances @ikamalhaasan @VijaySethuOffl #FahadhFaasil & of course @Suriya_offl Tech excellence BGM @anirudhofficial subtitles @rekhshc camera Girish|MUST SEE pic.twitter.com/o9hmFie9yO — Srinivasan Sankar (@srinisankar) June 3, 2022 ఈ సినిమాను మూడు గంటల హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అని చెబుతున్నారు. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ రాకింగ్‌గా ఉందని పేర్కొన్నారు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య నటన అద్భుతంగా ఉందని తెలిపారు. అనిరుధ్ రవిచందర్ బీజీఎం ఎక్సలెంట్‌గా ఉందన్నారు. What more we want from @Dir_Lokesh he has given life time settlement in #Vikram Moreover @Suriya_offl as Rolex Thaaaa whataaa screen presence yov loki bring back kaithi 2 or Vikram 2 ASAP cant wait🔥#VikramFDFS — KRISH (@KriahGo) June 3, 2022 'డైరెక్టర్ లోకేష్ నుంచి ఏమైతే కోరుకున్నామో అంతకుమించి ఇచ్చాడు. అన్నిటికిమించి సూర్య ప్రసెన్స్ అదిరిపోయింది. ఖైదీ 2 లేదా విక్రమ్ 2 చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం.' @Suriya_offl getup & elevation 🔥 Literally one of the best scene of his career !!#Vikram — GHOST 🦇 (@MGR_VJ) June 3, 2022 'సూర్య గెటప్, ఎలివేషన్ మాములుగా లేదు. అతని కెరీర్లోనే ఇది బెస్ట్ సీన్' #Vikram - Fire Fire Fire 🔥 🔥🔥🔥🔥🔥. Best cinematic experience l’ve ever had in recent times ,action packed second half deserves multiple watch! @ikamalhaasan , Fafa, @VijaySethuOffl& @Suriya_offl- what a treat to watch all these powerful performers in one film 🙏 @Dir_Lokesh — Rajasekar (@sekartweets) June 3, 2022 'ఈ మధ్య కాలంలో నేను చూసి మంచి అనుభూతికి లోనైన సినిమా ఇది. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్లు మళ్లీ వచ్చి చూసేలా ఉంటాయి. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య పవర్ఫుల్ యాక్టింగ్‌ను ఒకే సినిమాలో చూడటం సూపర్ ట్రీట్.' #Vikram 2nd Half last 20Mins rocks. Length is there. But screenplay holds the play. Suriya cameo 🔥. Clean Blockbuster for @Dir_Lokesh & Co. Congrats Thalaivarey ⚡ — × Kettavan Memes × (@Kettavan__Memes) June 3, 2022 Standing ovation for #Vikram after #FansFortRohini FDFS !! @RohiniSilverScr Thats it! — Nikilesh Surya 🇮🇳 (@NikileshSurya) June 3, 2022 #Suriya Entry In #Vikram Will Make U Go Crazy 🤩🤩🤩🤩 What A Movie @Dir_Lokesh Bro !! #EnowaytionPlus — Enowaytion Plus Vijay (@VijayImmanuel6) June 3, 2022 -
విక్రమ్: కమల్ హాసన్ పారితోషికం ఎంతో తెలుసా?
తమిళ స్టార్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విక్రమ్. హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. ఈ క్రమంలో ఇందులో నటీనటులకు ఎంతమేర పారితోషికం ఇచ్చారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు సినిమా బడ్జెట్ రూ.120 కోట్ల పైనే ఉండగా చిత్రబృందం రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ రూ.50 కోట్ల మేర తీసుకుంటే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దాదాపు రూ.8 కోట్లు అందుకున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతికి రూ.10 కోట్లు, ఫహద్ ఫాజిల్‌కు రూ.4 కోట్ల మేర పారితోషికం సర్దినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన అనిరుధ్ రవిచందర్‌కు సైతం రూ. 4 కోట్లు ముట్టజెప్పారట. కాగా కమల్ హాసన్ 2018 ఆగస్టులో విశ్వరూపం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో థియేటర్లలో సందడి చేయనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి 👇 రూ.కోటి ఆఫర్ చేసినా పాడని కేకే! ఎవరీ కేకే, ఆయనకంటే మేమే బాగా పాడతామన్న సింగర్.. నెట్టింట ట్రోలింగ్ -
కమల్ హాసన్ చిత్రంలో సూర్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Vikram: Lokesh Kanagaraj Confirms Suriya Cameo With Kamal Haasan: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్'. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 15) ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2 నిమిషాల 38 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్లో కమల్, విజయ్, ఫాహద్ ఫాజిల్ తమ నటనతో అదరగొట్టారు. కాగా ఈ మూవీలో స్టార్ హీరో సూర్య కూడా నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజు స్పందించారు. విక్రమ్ మూవీలో ఈ మూగ్గురు స్టార్ హీరోలతోపాటు సూర్య కూడా నటిస్తున్నాడని స్పష్టం చేశారు. సూర్య ఒక కీలక పాత్రలో అలరించనున్నాడని తెలిపారు. మే 15న చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ రిలీజ్‌తో పాటు మూవీ ఆడియో లాంచ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలోనే విక్రమ్ చిత్రంలో సూర్య నటిస్తున్నాడని డైరెక్టర్ లోకేష్ తెలిపారు. ఇక ఈ నలుగురు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూస్తే ప్రేక్షకులకు, అభిమానులకు పూనకాలే. -
'పుష్ప'ను వదులుకున్న ఐదుగురు స్టార్స్ ఎవరో తెలుసా?
'పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదే లే..' డైలాగ్ దేశమంతటా మార్మోగిపోతోంది. పుష్ప చిత్రయూనిట్, నటీనటులు కూడా దీనికి ఈ రేంజ్లో ఆదరణ లభిస్తుందని ఊహించి ఉండరు. కరోనా కాలంలోనూ కలెక్షన్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసింది పుష్ప. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమా కోసం ముందుగా ఎవరెవర్ని సంప్రదించారు? ఎవరు తిరస్కరించారు? అంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. దర్శకుడు సుకుమార్ పుష్ప స్క్రిప్ట్‌ను బన్నీ కంటే ముందు మహేశ్‌బాబుకు వివరించాడట. అయితే మహేశ్ మేకోవర్‌కు సిద్ధంగా లేడని, స్క్రీన్‌పై నెగెటివ్ క్యారెక్టర్‌ను చూపించడానికి ఇష్టపడక నిస్సంకోచంగా కుదరదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. 'ఊ అంటావా' సాంగ్‌కు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకోవాలనుకున్నారట. ఇందుకోసం ఆమెకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ పలు కారణాలతో ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు టాక్. ఆ తర్వాత నోరా ఫతేహీని సంప్రదించగా ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంతో పక్కన పెట్టేశారట. శ్రీవల్లి పాత్రకు తొలుత రష్మికను అనుకోలేదని, ఈ క్యారెక్టర్‌కు సమంత అయితే కరెక్ట్‌గా సూట్ అవుతుందని భావించినట్లు వినికిడి. కానీ ఆమె ఈ ఆఫర్‌కు నో చెప్పడంతో అలా ఈ పాత్ర రష్మికను వరించింది. సమంతను 'ఊ అంటావా' సాంగ్ చేయడానికి ఒప్పించడం కోసం ఎంతగానో కష్టపడ్డ విషయం తెలిసిందే! అలాగే ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ పాత్ర మొదట విజయ్ సేతుపతి దగ్గరకు వెళ్లగా డేట్స్ కారణంగా దాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. -
ఎప్పటి నుంచో కోరుకుంటున్నా, మొత్తానికి నెరవేరింది: కత్రినా
Vijay Sethupathi Katrina Kaif: నటుడు విజయ్ సేతుపతి బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్‌తో కలిసి మేరీ క్రిస్మస్కు సిద్ధమయ్యారు. ఈయన బహుబాషా నటుడు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్, టాలీవుడ్లో తన సత్తా చాటిన ఈయన ఇప్పుడు బాలీవుడ్‌నూ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా అక్కడ ఏకంగా అందాల రాణి కత్రినా కైఫ్‌తో జోడీ కడుతున్నారు. 'మేరీ క్రిస్మస్' అనే చిత్రంలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని నటి కత్రినా కైఫ్ స్వయంగా తన ఇన్ స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఇంతకు ముందు ఏజెంట్ వినోద్ బద్లాపూర్, అందాదూన్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు శ్రీరామ్ రాగవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్నానన్నారు. కథను థ్రిల్లింగ్‌గా రూపొందించడంలో ఆయన మాస్టర్ అని పేర్కొన్నారు. ఇందులో నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే ?
Criminal Case Registered Against Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే బ్లాక్ బ్లస్టర్ మూవీ ఉప్పెన చిత్రంతో ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళంలో విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఆయన్ను అభిమానులు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. విజయ్‌తోపాటు అతని మేనేజర్ జాన్సన్‌లపై చర్యలు తీసుకోవాలని సైదాపేట కోర్టులో కేసు వేశారు. నవంబర్‌లో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు విజయ్‌పై గాంధీ అనే వ్యక్తి దాడి చేయగా.. అప్రమత్తమైన విజయ్ సేతుపతి మేనేజర్, ఇతర భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఈ విషయంపై పరువు నష్టం దావా వేసిన గాంధీ విజయ్‌పై తాజాగా క్రిమినల్ కేసు పెట్టాడు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళ్తున్నాని, బెంగళూరు ఎయిర్‌పోర్టులో విజయ్‌ని కలిశానని చెప్పాడు. అప్పుడు వారి ఇద్దరి మధ్య అపార్థాలు రావడంతో విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కూడా నటుడినని, కాబట్టే విజయ్ను పలకరించానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సూపర్ డీలక్స్ చిత్రానికిగానూ విజయ్ సేతుపతికి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చినందుకు అతడిని ప్రశంసించినట్లు తెలిపాడు. అయితే విజయ్ మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన కులాన్ని కించపరిచడాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై జరిగిన దాడిలో తన చెవికి దెబ్బ తగిలిందని, దీంతో చెవి పూర్తిగా వినిపించడం లేదని తెలిపాడు. అంతేకాకుండా అతను విజయ్, అతని మేనేజర్‌పై అస్సలు దాడి చేయలేదని చెప్పాడు. అలాగే ఘటన జరిగిన సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని విజయ్ సేతుపతి తప్పుడు ప్రచారం చేయడంతో తన పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లిందని, గతంలో రూ. 3 కోట్లు పరువు నష్టం దావా వేశాడు గాంధీ. ఇదీ చదవండి: విజయ్ సేతుపతిని తన్నమని రివార్డు.. వ్యక్తిపై కేసు నమోదు -
విజయ్ సేతుపతిని తన్నమని రివార్డు.. వ్యక్తిపై కేసు నమోదు
Claimed Reward For Kicking Vijay Sethupathi And Case Registered: విజయ్ సేతుపతి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఉప్పెన చిత్రంలో విలనిజంతో ఎంతగా ఆకట్టుకున్నారో చెప్పనవసరం లేదు. తమిళంలో విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఆయన్ను అభిమానులు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అంత గొప్ప నటుడికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు ఎయిర్ పోర్టులో మహాత్మగాంధీ అనే వ్యక్తి విజయ్ సేతుపతిని వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. ఈ సంఘటన నెట్టింట వైరల్‌గా కూడా మారింది. అయితే విజయ్ సేతుపతిపై అలా దాడి చేయమని ఓ వ్యక్తి రివార్డు ప్రకటించాడు. విజయ్ను తన్నిన వారికి ప్రతీసారీ రూ. 1001 బహుమతిగా చెల్లిస్తానని హిందూ మక్కల్ కట్చి నాయకుడు అర్జున్ సంపత్ కొద్దిరోజుల క్రితం ప్రకటించాడు. ఈ విషయంపై పోలీసులు నవంబర్ 17న అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 504, సెక్షన్ 506(1) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. 'స్వాతంత్య సమరయోధుడైన ముత్తు రామలింగం తేవర్'ను విజయ్ సేతుపతి అవమానించినందుకే రివార్డు ఇస్తానని ట్విటర్లో పోస్ట్ చేసినట్లు అర్జున్ తెలిపాడు. విజయ్ సేతుపతి చుట్టూ భద్రతా సిబ్బంది ఉన్నా అతనిపై దాడి జరిగింది. అనంతరం ఎయిర్ పోర్టు ఘటనపై 'విమానంలో నాకు అగంతకుడికి మధ్య చిన్న చర్చ జరిగింది. నాపై దాడి జరిగే సమయంలో అతను తాగి ఉన్నాడు. ఇలాంటి చిన్న విషయాల గురించి పట్టించుకోనవసరం లేదు' అని మక్కల్ సెల్వన్ పేర్కొన్నారు. చదవండి: ఎయిర్‌పోర్టులో విజయ్ సేతుపతిపై దాడి -
కమల్‌హాసన్, ఫాహద్, సేతుపతి.. భారీ మల్టిస్టారర్ షూటింగ్ షురు
చిన్న బ్రేక్ తర్వాత విక్రమ్ యాక్షన్ మళ్లీ షురూ అయ్యింది. కమల్‌హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విక్రమ్’. ఇందులో విక్రమ్ పాత్రలో కనిపిస్తారు కమల్. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోయంబత్తూర్‌లో మొదలైంది. ఇప్పటివరకు జరిపిన షూటింగ్లో కమల్–విజయ్ సేతుపతి కాంబినేషన్ సీన్స్, ఫాహద్ సీన్స్‌ను విడి విడిగా తీశారు. తాజా షెడ్యూల్లో కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ కాంబినేషన్లో సీన్స్‌ను షురూ చేశారు లోకేష్. ఇవి యాక్షన్ సీక్వెన్స్ అని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
ప్లీజ్ అలాంటి సినిమాలు చేయొద్దు.. సేతుపతికి ఫ్యాన్స్ విన్నపం
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న నటుడు విజయ్ సేతుపతి. పిజ్జా వంటి సినిమాలతో హీరోగానే కాకుండా.. దళపతి విజయ్ హీరోగా చేసిన ‘మాస్టర్’లో విలన్‌గా చేసి తెలుగులో మంచి గుర్తింపు సాధించాడు. అనంతరం మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథనాయకుడిగా చేసిన ‘ఉప్పెన’ సినిమాతో మక్కల్ సెల్వన్ ఈమెజ్ ఇంకా పెరిగింది. అయితే ఈ కోవిడ్ టైమ్‌లోనూ సేతుపతి వరుస సినిమాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని ఓటీటీల్లో విడుదలవుతుండగా, మరికొన్ని థియేటర్స్‌లో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా ఈ తరుణంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తూ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొహమాటంతో ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవద్దని ఫ్యాన్స్ కొందరు ఆయనని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పటిలాగే మంచి కంటెంట్ ఉన్న మూవీస్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నారు. చదవండి: వారిపై పగ తీర్చుకుంటా: తాప్సీ -
నటుడు విజయ్ సేతుపతి రూ. కోటి విరాళం
తమిళసినిమా: నటుడు విజయ్ సేతుపతి దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (పెప్సీ) భవన నిర్మాణానికి రూ.కోటి విరాళంగా అందించారు. శనివారం చెన్నైలోని స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో పెప్సీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్కె సెల్వమణి పాల్గొన్నారు. నిర్మాత కలైపులి ఎస్.థాను, కె.భాగ్యరాజ్, ఆర్.వి.ఉదయ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న నటుడు విజయ్ సేతుపతి పెప్సీ భవన నిర్మాణానికి గాను కోటి రూపాయలను చెక్కు రూపంలో పెప్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణికి అందించారు. అనంతరం మాట్లాడుతూ పెప్సీ భవన నిర్మాణానికి తన సాయం కొనసాగుతుందన్నారు. ఆర్.కె.సెల్వమణి మాట్లాడు తూ భవన నిర్మాణం అన్నది పెప్సీకి చెందిన తొమ్మిదివేలమంది సభ్యుల కల అని అన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్‌సేతుపతికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (కమెడియన్ వడివేలుకు షాక్.. నోటీసులు జారీ చేసిన కోర్టు) -
'లాభం' ట్రైలర్ విడుదల చేసిన సేతుపతి
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం లాభం. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా విజయ్ సేతుపతి ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ... "ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సినిమాను నా సొంత బ్యానర్ లో నిర్మించాను. కథ చాలా యూనిక్ గా ఉండి... ఓ మెసేజ్ ఇచ్చేలా సినిమాను తీశాము. రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర సమస్య... వ్యవసాయ భూముల పైనా... పంటల పైనా కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం... ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైనా చాలా కూలంకషంగా ఇందులో చూపించడం జరిగింది. ట్రైలర్ లో కూడా అదే చూపించాము. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు నా అభినందనలు" అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం హ్యాపీగా ఉంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు. -
విజయ్ సేతుపతి 'సూపర్ డీలక్స్', ఆహాలో ఆరోజే రిలీజ్
Super Deluxe: 'ఉప్పెన' సినిమాతో తెలుగులోనూ స్టార్ హోదా అందుకున్నాడు విజయ్ సేతుపతి. అప్పటి నుంచి వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడీ యాక్టర్. ఆయనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా 2019లో రిలీజైన తమిళ చిత్రం 'సంఘతమిజన్'ను 'విజయ్ సేతుపతి' అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తాజాగా అతడు నటించిన మరో హిట్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాజిల్, రమ్యకష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'సూపర్ డీలక్స్' తెలుగు డబ్బింగ్ మూవీ ఆగస్టు 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. ఇందులో విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌గా నటించగా రమ్యకృష్ణ పోర్న్ స్టార్‌గా, సమంత, ఫహద్ ఫాజిల్ భార్యాభర్తలుగా కనిపించారు. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. Your wish is our command! Get ready for the blockbuster you've been waiting for, #SuperDeluxe in Telugu just for YOU!@VijaySethuOffl @Samanthaprabhu2 @meramyakrishnan #FahadhFaasil #gayathrieshankar pic.twitter.com/MMQGx0cCja — ahavideoIN (@ahavideoIN) July 27, 2021 -
ఎవరా స్టార్ హీరో? సస్పెన్స్ వీడేదెన్నడు?
-
శౌర్యానిదే కిరీటం!
‘కోడ్: రెడ్’ అంటూ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది ‘విక్రమ్’ చిత్రబృందం. కమల్‌హాసన్ హీరోగా ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రధారులు. మరి.. కమల్.. విజయ్.. ఫాహద్... ఈ ముగ్గురిలో ‘రెడ్’ కోడ్‌ను ఎవరు? ఎలా? డీ కోడ్ చేశారన్నది వెండితెరపై చూడాల్సిందే. ‘‘శౌర్యానికి మాత్రమే కిరీటాన్ని ధరించే అర్హత ఉంది. నేను మళ్లీ ధైర్యంగా వస్తున్నాను. మాలో ఉత్తమమైనవారిని మీరే నిర్ణయించండి’’ అంటూ శనివారం ‘విక్రమ్’ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు కమల్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఉండటం విశేషం. అలాగే పోస్టర్‌పై ఉన్న కోడ్: రెడ్ ఏమై ఉంటుందా? అనే ఊహగానాలు మొదలయ్యాయి. త్వరలో ‘విక్రమ్’ షూటింగ్ ప్రారంభం కానుంది. -
OTT: ఐదు సినిమాలు నేడే విడుదల!
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోయేవి. జనాలు కూడా కొత్త చిత్రాలు ఏమేం రిలీజ్ అవుతున్నాయా? అని ఈ రోజు కోసం తెగ ఎదురుచూసేవాళ్లేవారు. కానీ కరోనా పుణ్యమా అని అన్ని రోజులూ ఆదివారాలే అయిపోయాయి. థియేటర్లకు కూడా హాలీడేస్ వచ్చేశాయి. కానీ ప్రేక్షకుడికి అందించే వినోదానికి మాత్రం బ్రేక్ రాలేదు. సినిమాలు కాకపోతే వెబ్ సిరీస్‌లు, థియేటర్లు కాకపోతే ఓటీటీలు.. ఇలా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త దారుల్లో పయనిస్తోంది చిత్ర పరిశ్రమ. ఈ క్రమంలో నేడు(మే 14) ఐదు సినిమాలు ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయ్యాయి. అవేంటో చదివేయండి.. విజయ్ సేతుపతి తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విజయ్ సేతుపతి. తెలుగులో విలన్, సహాయక పాత్రల్లో మాత్రమే కనిపించిన సేతుపతి ఇందులో హీరోగా సందడి చేయనున్నాడు. విజయ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేటి నుంచి ప్రసారం కానుంది. కర్ణన్ తమిళ హీరో ధనుష్ నటించిన కర్ణన్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి ప్రసారం కానుంది. ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించిన ఈ సినిమా ఓటీటీని ఎలా షేక్ చేస్తుందో చూడాలి. సినిమా బండి ప్రవీణ్ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సినిమా బండి. ఇటీవల రిలీజైన ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయగా నేటి నుంచి ప్రసారం చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. చెక్ యంగ్ హీరో నితిన్ ఖైదీగా, ప్రియా వారియర్ అతడి ప్రేయసిగా నటించిన చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్ లాయర్‌గా కనిపించింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఓటీటీ బాట పట్టిన ఈ మూవీ నేటి నుంచి సన్ నెక్స్ట్ యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. బట్టల రామస్వామి బయోపిక్కు అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బట్టల రామస్వామి బయెపిక్కు. రామ్ నారాయణ్ డైరెక్షన్ చేయగా సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, ఐ మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా జీ 5లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఇక రామ్‌గోపాల్ వర్మ డీ కంపెనీ సినిమా కూడా ఓటీటీలో వస్తోంది. వ్యాపారవేత్త సాగర్ మచనూరు ఆరంభించిన స్పార్క్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక రాధే సినిమా నిన్నటి నుంచే జీ 5లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. -
Vijay Setupathi: బుల్లితెర షో కోసం సేతుపతికి భారీ ఆఫర్!
విజయ్ సేతుపతి.. పేరుకు తమిళ నటుడే అయినప్పటికీ తెలుగువారికి కూడా సుపరిచితుడే. తన సినిమాలు, నటనతో జనాలకు పూనకం తెప్పించే ఈయన తాజాగా బుల్లితెర మీద కూడా అలరించేందుకు సిద్ధమయ్యాడు. సన్ టీవీలో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ తమిళ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు సన్ టీవీ ఇటీవలే ఓ ప్రోమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే మాస్టర్ చెఫ్ 13వ సీజన్‌లోని ఆస్ట్రేలియా సిరీస్ కోసం సేతుపతిని రప్పించేందుకు నిర్వాహకులు భారీ పారితోషికం ఆశ చూపారట. ఇది తను సినిమా కోసం తీసుకునేదాని కన్నా ఎక్కువగా ఉండటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది ఎంత మొత్తం అనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఇక 2014లోనే సేతుపతి ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా అతడి పారితోషికం స్టార్ హీరోలతో సమానంగా ఉండే అవకాశం ఉంది. గతంలోనూ ఆయన ఇదే సన్ టీవీలో నామూరు హీరో అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇదిలా వుంటే విజయ్ సేతుపతి ప్రస్తుతం తుగ్లక్ దర్బార్, మామనితన్, లాభం చిత్రాలు చేస్తున్నాడు. మరోవైపు ఆయన నటించిన 'విజయ్ సేతుపతి' సినిమా ఆహాలో నేటి(మే 14) నుంచి ప్రసారం కానుంది. உலக அளவில் புகழ்பெற்ற சமையல் கலையின் பிரம்மாண்ட ரியாலிட்டி நிகழ்ச்சி! விஜய் சேதுபதி அவர்களுடன்.. மாஸ்டர் செஃப் - தமிழ் | விரைவில்... #SunTV #MasterChef #MasterChefTamil #MasterChefOnSunTV pic.twitter.com/bHkL9HGunx — Sun TV (@SunTV) May 9, 2021 చదవండి: స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్! తెలుగులో ఎప్పుడూ ముంబై బ్యూటీలదే హవా -
స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. అయితే ఈ సినిమాను టాలీవుడ్‌తో పాటు తమిళ్లో కూడా విడుదల చేయాలని తొలుత భావించారట. విజయ్ సేతుపతికి అక్కడ భారీగా క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా ఉప్పెనను తమిళ్లో డబ్ చేసి విడుదల చేయాలని అనుకున్నారట. కానీ విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అందుకే తమిళ్లో విడుదల చేయకుండా కేవలం తెలుగులో మాత్రమే ఉప్పెనను విడుదల చేసింది చిత్ర బృందం. తమిళ రీమేక్ రైట్స్‌ను విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాను స్టార్ హీరో కొడుకుతో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్..ఆల్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో ఈ సినిమాపై తమిళ హీరో దళపతి విజయ్ కన్ను పడిందట. ఉప్పెన తమిళ రీమేక్‌తో కొడుకు జాన్సన్ సంజయ్‌ను హీరోగా పరిచయం చేయాలని విజయ్ భావిస్తున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పెన ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్‌తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఉప్పెన తమిళ రీమేక్ పనులు ప్రారంభం కానున్నాయి. మరి అదే జరిగితే హీరోయిన్గా కృతి శెట్టినే తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌తో ప్రయోగం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : (21 ఏళ్ల ఆల్‌టైం రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’ ) (అదేంటో తెలుసుకోలేను.. బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్) -
శంకర్ దర్శకత్వంలో చరణ్?
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలందరి చేతిలో మినిమమ్ రెండు మూడు సినిమాలు ఉన్నాయి. చేస్తున్న సినిమా కాకుండా మరో రెండు సినిమాల లైనప్ రెడీగా ఉంది. కానీ రామ్‌చరణ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ తప్ప మరే ప్రాజెక్ట్ ప్రకటించలేదు. చిరంజీవి ‘ఆచార్య సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మరి రామ్‌చరణ్ ప్లాన్ చేస్తున్న నెక్ట్స్ సినిమా ఏంటీ అంటే... రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా కమిటయ్యారట. ఇది మల్టీస్టారర్ చిత్రమని టాక్. రామ్‌చరణ్, యశ్, విజయ్ సేతుపతి ఇందులో హీరోలుగా కనిపిస్తారని సమాచారం. మరొకటి... ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చరణ్. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నాయని తెలిసింది. -
‘మాస్టర్’ రొమాంటిక్ ప్రోమో : మాలవిక మాయ
సాక్షి, హైదరాబాద్: తమిళహీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ 4వ ప్రోమోను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. విజయ్‌తో పాటు ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం మరింత ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా అందం వాడి చూపేరా అనే పాట యువతను ఉర్రూతలూగించేలా, అద్భుతంగా ఉంది. అలాగే ఈ లవ్లీ, రొమాంటిక్ ప్రోమోలో కాలేజీ లెక్చరర్‌గా మాలవికా మోహనన్ గ్రేస్ లుక్‌లో అలరిస్తోంది. మరి తన అందంతో ఏం మాయ చేస్తుందో చూడాలి. తెలుగు, తమిళంలో ఈ సినిమా జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ప్రోమోలతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ టీజర్ ను సుమారు 5 లక్షల మంది వీక్షించారంటేనే మాస్టర్ మ్యాజిక్‌ను ఊహించుకోవచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఉత్కంఠ భరిత సన్నివేశాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. మరోవైపు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యాన్ని 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం నుంచి తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కరోనా నిబంధనల నేపథ్యంలో 50 శాతం మాత్రమే ఉండాలన్న కేంద్రం సూచన మేరకు సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. దాంతో విజయ్ సినిమా ఓపెనింగ్స్‌పై సందేహాలు నెలకొన్నాయి. Small break for the mass promos. Here's a lovely romantic promo from #Master this time.. @actorvijay @MalavikaM_ A @Dir_Lokesh film .. @XBFilmCreators @Lalit_SevenScr @Jagadishbliss @SonyMusicSouth #మాస్టర్ pic.twitter.com/PXVOM3zGlj — Mahesh Koneru (@smkoneru) January 8, 2021 -
ఈ ఏడాది ట్విట్టర్లో ఎక్కువగా చర్చించిందేంటంటే..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ప్రజలు అత్యధికంగా చర్చించిన అంశం కోవిడ్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ట్విట్టర్లో కూడా 2020లో అత్యధికంగా ప్రజలు చర్చించుకుంది దీని గురించే.. కోవిడ్‌కు సంబంధించిన విశ్వసనీయ సమాచారం, నిపుణులతో అనుసంధానం కోసంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్విట్టర్లో ప్రజలు విస్తృతంగా చర్చించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల పట్ల ఈ ఏడాది ప్రజలు కృతజ్ఞతలను ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలపడం ప్రపంచ వ్యాప్తంగా 20% పెరగ్గా, ప్రత్యేకంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలపడం 135%, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలపడం 30% పెరిగింది. మరికొన్ని రోజుల్లో 2020 ముగియనుండటంతో ఈ ఏడాది ట్విట్టర్ వేదికగా ప్రజలు చర్చించిన అంశాలను సోమవారం ఆ సంస్థ బహిర్గతం చేసింది. చదవండి: ట్విట్టర్ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇంకా సుశాంత్, హాథ్రస్ ఘటనలు.. సమకాలిక అంశాల (కరెంట్ అఫైర్స్)లో కోవిడ్–19 మహమ్మారి (#covid19) అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు నివాళి (# sushantsinghrajput) అర్పిస్తూ నెటిజన్లు పెట్టిన ట్వీట్లు రెండో అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లుగా నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్లో దళితబాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన(# hathrs)పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కూడా ట్విట్టర్లో విస్తృత చర్చ జరిగింది. మూడో అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లు దీనిపై నెటిజన్లు చేశారు. చదవండి: ట్విటర్ లో మరో కొత్త ఫీచర్ క్రీడల్లో ‘విజిల్‌పొడు’కూడా.. ఇక క్రీడలకు సంబంధించిన అత్యధికంగా #ఐపీఎల్2020 గురించి ట్విట్టర్లో చర్చ జరగగా, ఆ తర్వాత మహేంద్రసింగ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం హ్యాష్‌ట్యాగ్(# విజిల్‌పొడు), మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనకు ట్విట్టర్లో # టీమిండియా హ్యాష్‌టాగ్‌తో విస్తృత అభినందనలు లభించాయి. గోల్డెన్ ట్వీట్లలో విజయ్‌తో అభిమానుల సెల్ఫీ! ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో రిట్వీట్స్, లైక్స్, కోట్ ట్వీట్స్‌ను పొందిన ట్వీట్లను గోల్డెన్ ట్వీట్లుగా ట్విట్టర్ ప్రకటించింది. తమిళ సూపర్‌స్టార్ విజయ్ వేలాది మంది తన అభిమానులతో దిగిన సెల్ఫీ ఫొటోను గత ఫిబ్రవరిలో ట్విట్టర్లో పోస్టు చేయగా, ఈ ఏడాది అత్యధిక రిట్వీట్స్ అందుకుని గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. తమిళ సినీ అభిమానులు విస్తృతంగా ఈ ట్వీట్‌ను షేర్ చేశారు.భారతీయ క్రికెట్ జట్టు కెపె్టన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకోవడానికి చేసిన ట్వీట్ ఈ ఏడాది అత్యధిక లైకులు అందుకుని గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. ‘సరిలేరు నీకెవ్వరు..’ ఇటు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటించిన హిందీ సినిమా #దిల్బెచారపై ట్విట్టర్లో అభిమానులు అత్యధికంగా చర్చించారు. హీరో సూర్య నటించిన తమిళ సినిమా # సూరారిపొట్రును తమిళ సినీ అభిమానులు మాస్టర్ పీస్‌గా ప్రకటించారు. ఇక అత్యధిక చర్చ జరిగిన తెలుగు సినిమాగా మహేష్‌బాబు, రష్మిక మందన్న నటించిన తెలుగు సినిమా # సరిలేరునీకెవ్వరు నిలిచింది. ఈ ఏడాది ట్విట్టర్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, టీవీ గురించి నిమిషానికి 700 ట్వీట్లు చేశారు. బినోద్పై నవ్వులే నవ్వులే.. ఇక #బినోద్( Binod) అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లు అందుకున్న మీమ్(Meme of the year)గా నిలిచింది. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్టులకు సంబంధం లేకుండా అసంబద్ధమైన, హాస్యాస్పదమైన కామెంట్లు పెడుతుంటారు. ఇలానే ఓ పోస్టు కింద బినోద్ అనే వ్యక్తి తన పేరును కామెంట్‌గా పెట్టడంతో అతడి పేరు వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది. ► కోవిడ్‌తో ప్రభావితమైన వారిని ఆదుకోవడానికి రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటిస్తూ టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా చేసిన ట్వీట్ విస్తృత ప్రశంసలు పొంది మరో గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. ►కోవిడ్ బారినపడి ఆస్పత్రిలో చేరినట్టు తెలుపుతూ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయగా, ఆయన త్వరగా కోలుకోవాలని భారీ సంఖ్యలో అభిమానాలు ‘కోట్ రీట్వీట్’చేయడంతో.. ఇది కూడా గోల్డెన్ ట్వీట్‌గా మారింది. ►కోవిడ్ మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతగా రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన దీపాలు వెలిగిస్తూ పెట్టిన ట్వీట్.. రాజకీయ నేతల విభాగంలో అత్యధిక రీట్వీట్లు అందుకుంది. ►క్రికెట్‌కు ధోని చేసిన సేవను కొనియాడుతూ ప్రధాని మోదీ పంపిన ప్రశంసా పత్రాన్ని ధోని ట్వీట్ చేయగా, అభిమానులు భారీ సంఖ్యలో రీట్వీట్ చేశారు. అత్యధిక రీట్వీట్లు పొందిన ఒక క్రీడాకారుడి ట్వీట్ ఇదే.. తీపి గుర్తులు యాది చేసుకున్నరు.. డీడీలో రామాయణం సీరియల్‌ను పున:ప్రసారం చేయడంతో చాలా మంది తమ పాత తీపి గుర్తులను #రామాయణ్‌తో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మహేశ్‌బాబు నటించిన పోకిరి సినిమా 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా # పోకిరి.. మహాభారత్ సీరియల్‌ను మళ్లీ డీడీలో పున:ప్రసారం చేయడంతో # మహా భారత్.. అనే హ్యాష్ ట్యాగ్‌లతో ట్విట్టర్లో ప్రజలు చర్చించారు. వీటితో పాటు ప్రజలు # ఫొటోగ్రఫీ, #యోగా, # పొయెట్రీను సైతం బాగానే చర్చించారు. -
సేతుపతితో రంగమ్మత్త?!
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. యాంకర్‌గా కొనసాగుతూనే.. సినిమాల్లో కూడా నటిస్తున్నారు అనసూయ. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి నవ్వులు చిందిస్తోన్న ఫోటోని షేర్ చేశారు అనసూయ. ‘బాండింగ్ విత్ బ్రిలియన్స్.. నిజంగానే మక్కల్ సెల్వన్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా చిత్రం రాబోతుందా.. అసలు వీరిద్దరు ఎక్కడ కలిశారు.. ఏ చిత్రం కోసం అంటూ అభిమానులు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. (చదవండి: ‘ఆచార్య’లో అనసూయ.. చరణ్‌తో?) అయితే దీని గురించి మాత్రం ఎలాంటి వివరణ లేదు. ఒకవేళ విజయ్‌సేతపతి చిత్రంలో అనసూయ నటిస్తే.. అభిమానులకు పండగే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అనసూయ ‘థాంక్యూ బ్రదర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కాక కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తండ’ చిత్రంలో నటిస్తున్నారు. అలానే ‘పుష్ప’, ‘ఆచార్య’ చిత్రాల్లో కూడా అనసూయ చాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం..
చెన్నై: ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తలపెట్టిన బయోపిక్ 800 తమిళనాట పెను వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటించవద్దని కోరారు. చివరకు మురళీధరన్ కూడా తన బయోపిక్ కోసం కెరీర్‌ని నాశనం చేసుకోవద్దంటూ విజయ్‌ని కోరడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ తర్వాత కూడా విజయ్ కుమార్తెకి అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్ సీను రామసామి తాను కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. జీవితం ప్రమాదంలో పడింది సాయం చేయండి అంటూ ముఖ్యమంత్రి పళని స్వామిని కోరుతున్నారు. సినిమా నుంచి తప్పుకోవాల్సిందిగా విజయ్ సేతుపతిని కోరిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు రావడం ప్రారంభం అయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా రామసామి మాట్లాడుతూ.. ‘చాలా మందిలాగే నేను కూడా విజయ్ సేతుపతిని 800 సినిమా నుంచి వైదొలగాలని కోరాను. ఆ తర్వాత కొద్ది రోజులకు విజయ్ కుమార్తె లాగే నాకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. నోటితో పలకలేని పదాలను ఉపయోగించారు. వాట్సాప్ ఒపెన్ చేయాలంటేనే ఒణుకుపుడుతుంది’ అన్నారు. అలానే ఈ బెదిరింపుల వెనక విజయ్ ఫ్యాన్స్ ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తమ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపుల నేపథ్యంలో రోడ్డు మీద నడవాలన్న భయంగా ఉందన్నారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. (విమర్శలకు చెక్: విజయ్ అనూహ్య నిర్ణయం) ఇక 800 చిత్రం ప్రకటించిన నాటి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. తమిళ ద్రోహి చిత్రంలో ఎలా నటిస్తారంటూ విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్‌కు సూచించారు. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. -
విజయ్ సేతుపతి కూతురికి అత్యాచార బెదిరింపు
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే. తన బయోపిక్ విషయంలో వివాదాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్ సేతుపతికి మాజీ క్రికెటర్ మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముత్తయ్య ఓ పెద్ద లేఖ విడుదల చేశారు. విజయ్ సేతుపతి మంచి నటుడని, కేవలం తన సినిమా వల్ల ఈ కోలీవుడ్ నటుడికి ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఆయనను తప్పుకోవాలని కోరినట్లు మురళీధరన్ తెలిపారు. దీనిపై విజయ్ సేతుపతి కూడా స్పందించి ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ట్విటర్లో ‘ధన్యవాదాలు.. ఇక సెలవు’ అని ట్వీట్ చేశారు. చదవండి: తప్పుకున్న విజయ్ తుపతి ఇక ఈ ప్రాజెక్టు నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్న కొన్ని గంటలకే ఆయన చిన్న కూమార్తెపై సోషల్ మీడియాలో అత్యాచార బెదింపులకు పాల్పడుతున్నారు. విజయ్ సేతుపతి ట్వీట్‌కు సమాధానమిస్తూ.. తన కూమార్తెపై అఘాయిత్యానికి పాల్పడతామని, అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థం అవుతుందని అని పేర్కొన్నారు. అయితే ఈ ట్రోల్‌పై అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో సదరు నెటిజన్ ప్రవర్తనను ఖండిస్తున్నారు. చదవండి: వివాదంలో 800: స్పందించిన మురళీధరన్ అంతేగాక ఇదే ట్రోల్స్‌పై సింగర్ చిన్మయి కూడా స్పందించారు. ట్రోల్ చేసిన అకౌంట్‌ను పోలీసులకు నివేదించారు. నెటిజన్ వ్యాఖ్యలపై మండిపడుతూ దానికి చెందిన స్క్రీన్ షాన్‌ను షేర్ చేశారు. ‘ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు, దీనిని ఎవరూ మార్చలేరు?. అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెప్తున్న వ్యక్తి నేరస్థుడు. ఇంత జరుగుతున్న చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు’ అంటూ మండిపడ్డారు. అలాటే అడయార్ డిప్యూటీ కమిషనర్, చెన్నై పోలీసులను ట్యాగ్ చేశారు. కాగా ఇటీవల క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తెపై అత్యాచారం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు! -
విమర్శలకు చెక్: విజయ్ అనూహ్య నిర్ణయం
సాక్షి, చెన్నై : గతకొన్ని రోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శ్రీలంక మాజీ స్పినర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌పై వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరుస వివాదాలు, విమర్శల నేపథ్యంలో మురళీధరన్ బయోపిక్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించి.. విమర్శలకు చెక్‌పెట్టారు. వివరాల ప్రకారం.. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో 800 పేరుతో మురళీధరన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. (వివాదంలో 800: స్పందించిన మురళీధరన్) ఈ నేపథ్యంలో శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్‌కు సూచించారు. బడా నిర్మాతలు, దర్శకుల నుంచి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. మురళీధరన్ బయోపిక్‌పై తమిళ సంఘాలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. ముత్తయ్య లేఖ.. తాజా వివాదం నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. 2009 అల్లర్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. ఎంతోకష్టపడి అంతర్జాతీయ క్రికెట్లో 800కు పైగా వికెట్స్ సాధించిన తన చిత్రాన్ని అడ్డుకోవడం సరైనది కాదని తమిళలు తీరును ఖండించారు. శ్రీలంకలో పుట్టడమే తాను చేసిన తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రపూరితంగానే కొన్ని రాజకీయ శక్తులు ప్రజలను ఉసిగొళ్పాయని లేఖలో పేర్కొన్నారు. అమాయక ప్రజలకు చంపడం ఎవరికీ సంతోషకరమైన విషయం కాదని, ఆ ఏడాది యుద్ధం యుగియడంతో ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. -
థ్రిల్ అవుతారు
నిత్యామీనన్ ఏదైనా ప్రాజెక్ట్‌లో భాగమైతే ఆటోమేటిక్‌గా ఆ సినిమా మీద ఆసక్తి పెరగడం ఖాయం. అందుకు కారణం ఆమె ఎంపిక చేసుకునే కథలు, చేసే పాత్రలు వినూత్నంగా ఉండటమే. తాజాగా మలయాళంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశారామె. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందు వీయస్ అనే నూతన దర్శకురాలు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సింది. కోవిడ్ వల్ల చిత్రీకరణ ప్రారంభం ఆలస్యం అయింది. తాజాగా కేరళలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. నిత్యామీనన్ మాట్లాడుతూ – ‘‘కథ వినగానే ఈ సినిమా నా టేస్ట్‌కి కరెక్ట్‌గా సరిపోయేది అనిపించింది. నాకు చాలా ఇష్టమైన స్టయిల్లో ఈ సినిమా కథ సాగుతుంది. మా పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఓ సాధారణ అమ్మాయి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలతో ఈ కథ ఉంటుంది. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు’’ అన్నారు. ముందుగా ఇన్డోర్ సన్నివేశాలు చిత్రీకరించి, తర్వాత అవుట్ డోర్ సన్నివేశాలు తీస్తారని తెలిసింది. -
విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్
తిరువనంతపురం: తమిళ స్టార్ విజయ్ సేతుపతి, హీరోయిన్ నిత్యామీనన్ జంటగా ఓ మలయాళ సినిమా రూపొందబోతుంది. ఇప్పటికే మార్కోని మథాయ్‌తో మాలీవుడ్లోకి అడుగుపెట్టిన విజయ్‌కు మలయాళంలో ఇది రెండో సినిమా. ఆంటో జోసెఫ్ నిర్మించనున్న ఈ చిత్రంతో వీఎస్ ఇందూ దర్మకురాలిగా పరిచయం కానున్నారు. అయితే గతేడాదే ఈ సినిమాకు విజయ్ సేతుపతి, నిత్యా మీనన్‌ను చిత్ర యూనిట్ సంప్రదించగా ఇద్దరూ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. చదవండి: త్వరలో పెళ్లి.. రూ.18 వేలే ఉన్నాయి కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఆంక్షలకు లోబడి తక్కువ సిబ్బందితో కేరళలో ముందుగా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉండగా ఇందూ వీఎస్ ఇంతకుముందు జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్ర నిర్మాత సలీం అహ్మద్‌తో కలిసి కుంజనంతంతే కడా, అమీంటే మకాన్ అబూ, పతేమారి వంటి చిత్రాల్లో పనిచేశారు. ఇది ఆమెకు మొదటి మలయాళ చిత్రం కానుంది. అదే విధంగా విజయ్ నటించిన హిట్ మూవీ ‘96’కు సంగీతం సమకూర్చిన గోవింద్ వసంత ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. మనీష్ మాధవన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. చదవండి: వివాదంలో విజయ్ సేతుపతి చిత్రం ప్రస్తుతం విజయ్ సేతుపతి శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సేతుపతిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #షేమ్ఆన్ విజయ్‌సేతుపతి అంటూ ట్విటర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివక్ష చూపించే దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ పాత్రలో మీరు నటిస్తారా అని, ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిత్యామీనన్ కోలాంబి అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అరుంధతి దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: కరోనా జీవితం పోరాటంగా మారింది -
వివాదంలో విజయ్ సేతుపతి చిత్రం
తమిళ హీరో విజయ్ సేతుపతికి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు, సినిమాలతో తన అభిమానులను అలరిస్తుంటారు. ఇక ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. తాజాగా విజయ్ సేతుపతి శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలయిన మోషన్ పిక్చర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇక మురళీధరన్‌గా విజయ్ సేతుపతి లుక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సేతుపతిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #షేమ్ఆన్ విజయ్‌సేతుపతి అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివిక్ష చూపించే దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ పాత్రలో మీరు నటిస్తారా.. ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ ప్రశ్నిస్తున్నారు. (చదవండి: సవాల్‌కి సై) మరి కొందరు మీరు చేసేది పూర్తిగా తప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మూవీ మేకర్స్ మాత్రం ఈ బయోపిక్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని.. నిజాల్ని నిర్భయంగా చూపిస్తామని ప్రకటించారు. ముత్తయ్య మురళీధరన్ జీవితంలో కనిపించని అనేక కోణాలు తెర మీదకు వస్తాయని తెలుపుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. -
ఫారెస్ట్‌కు పయనం
అడవుల్లో డ్రైవింగ్ చేయడానికి రెడీ అవుతున్నారట అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను త్వరలో తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి ఫారెస్ట్ లొకేషన్స్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. అక్కడ అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్ చేశారట. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్ అధికారి పాత్రలో విజయ్ సేతుపతి, విలన్‌గా జగపతిబాబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
గుడ్‌న్యూస్ చెబుతారా?
సమంత–నయనతార ఓ సినిమాలో కలసి నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో నుంచి సమంత తప్పుకున్నారట. మరి.. గుడ్ న్యూస్ అన్నారేంటీ అనుకుంటున్నారా? సమంత ఓ గుడ్‌న్యూస్ చెప్పడానికే ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగలేకపోతున్నారని టాక్. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా ‘కాదు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో సమంత, నయనతారలను హీరోయిన్లుగా అనుకున్నారు. అయితే తల్లి కాబోతున్నారనే కారణంగానే ఈ ప్రాజెక్ట్‌లో నుంచి సమంత తప్పుకోవాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే ఆ గుడ్‌న్యూస్‌ని ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం. -
సూపర్ కాంబినేషన్
లేడీ సూపర్‌స్టార్ నయనతార, సూపర్‌స్టార్ సమంత కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. వీళ్లద్దరూ కలసి లేడీ ఓరియంటెడ్ సినిమా ఏమైనా చేస్తున్నారా? అంటే కాదు. విజయ్ సేతుపతి నటించనున్న తమిళ సినిమాలో సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తారట. దర్శకుడు, నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘కాదు వాక్కుల రెండు కాదల్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను సెవన్ స్క్రీన్ బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మించనున్నారట. సమంత, నయనతార కలసి నటించే వార్త నిజమైతే కచ్చితంగా ఇది సూపర్ కాంబినేషన్. -
వరుణ్ తేజ్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి?
తమిళ స్టార్ విజయ్ సేతుపతికి తెలుగులో అవకాశాలు భారీగా వచ్చిపడుతున్నాయి. అయితే విజయ్‌కు వరుసపెట్టి విలన్ పాత్రలే వస్తుండటం విశేషం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా’లో రాజపాండి పాత్రతో విజయ్ సేతుపతి టాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో వస్తున్న ‘ఉప్పెన’ సినిమాలో విజయ్ నటిస్తన్నారు. ఈ సినిమాతో చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులోనూ విజయ్ విలన్ రోల్‌నే పోషిస్తున్నారు. మరోవైపు తమిళంలో భారీ బడ్జెట్ మూవీ ‘మాస్టర్’ చిత్రీకరణలో విజయ్ బిజీగా ఉన్నారు. ఇందులో తలపతి విజయ్ హీరోగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు. (బన్నీకి విలన్‌గా విజయ్ సేతుపతి!) త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రానున్న సినిమాలోనూ విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ తెలుగులో మరోసారి విలన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ రాబోయే మూవీ ‘బాక్సర్’లో ప్రతినాయకుడి పాత్ర పోషించడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయం పై చిత్ర యూనిట్ కానీ వరుణ్ తేజ్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు వెంకటేష్, సిద్దు ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలోని బాక్సర్ పాత్ర కోసం వరుణ్ తేజ్ ప్రస్తుతం అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. చదవండి : బాక్సింగ్‌కి సిద్ధం -
అభిమాని పుట్టిన రోజు: హీరో సెలబ్రేషన్!
తాము అభిమానించే హీరోల పుట్టినరోజులను అభిమానులు నిర్వహించడం తెలిసిందే. హీరో మీద ఉన్న ప్రేమకు గుర్తుగా కేకు కట్ చేసి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా అభిమాని పుట్టిన రోజును ఓ హీరో నిర్వహించాడు. సైరా మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో విజయ్ సేతుపతి.. ప్రస్తుతం యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న తలపతి 64 సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఆక్టోబర్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్లో ఇటీవలే విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్న విజయ్ సేతుపతి తన అభిమాని పుట్టిన రోజును సెలబ్రేట్ చేశాడు. షూటింగ్లో కేకు కట్ చేసి అభిమానికి కేకు తినిపించాడు. కాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. షూటింగ్ సందర్భంగా కర్ణాటకలోని హోటల్లో విజయ్ ఉంటున్నాడని తెలుసుకున్న అభిమానులు ఆయన్ని చూడటానికి వెళ్లారు. ఆ రోజే ఓ అభిమాని పుట్టిన రోజు కావడంతో విజయ్ దగ్గరకు కేకు తీసుకెళ్లి తన చేతుల మీదుగా పుట్టిన రోజును జరుపుకోవాలని ఆయన కోరాడు. ఇక అభిమాని కోరిక మేరకు విజయ్ సేతుపతి కేకు కట్ చేసి తినిపించాడు. కర్ణాటకలోని శివమోగ్గ జైలులో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుండగా... 2019 డిసెంబర్ 1 నుంచి 2020 జనవరి 18 వరకు జైలులో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ కర్ణాటక జిల్లా అధికారుల అనుమతి తీసుకుంది. కాగా న్యూ ఇయర్ సందర్బంగా కుటుంబంతో సరదాగా గడపడానికి షూటింగ్ నుంచి విరామం తీసుకున్న విజయ్ సేతుపతి త్వరలోనే తిరిగి షూటింగ్లో బిజీ కానున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మాళవికా మోహనన్, ఆండ్రియా, అర్జున్ దాస్, శంతను భాగ్యరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. Actor #VijaySethupathi joined #Thalapathy64 shooting in Shimoga & his initial set of scenes were shot in that schedule. Video of @VijaySethuOffl celebrating a fan's bday from Shimoga,Karnataka. pic.twitter.com/Zv3TcBsP3Q — லோகநாதன் தளபதி பக்தன் (@LoganathanVija9) 26 December 2019 -
బన్నీకి విలన్‌గా విజయ్ సేతుపతి!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తుండటంతో సినిమాపై అభిమానులు ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుండగానే బన్నీ... క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మూవీ అల్లు అర్జున్‌కు 20వ చిత్రం కావడంతో చిత్ర యూనిట్ AA#20 వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఆర్య, ఆర్య-2 సినిమాలు రాగా ఇది హ్యట్రిక్ మూవీ కావడం విశేషం. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్ రోల్లో తమిళ హీరో విజయ్ సేతుపతిని తీసుకోనున్నట్లు సమాచారం. తమిళంలో విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ ఉండటంతో సుకుమార్ ఈ సినిమాకు విలన్ పాత్రకు ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమాలో నటించిన అతిథి పాత్రతో విజయ్ సేతుపతి టాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విజయ్‌కు తెలుగులో భారీగానే ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్‌తో కలిసి తెలుగులో ఇప్పటికే ‘ఉప్పెన’ అనే సినిమా చేయడానికి అంగీకరించారు. ఇక దర్శకుడు సుకుమార్ బన్నీ సినిమా కోసం తనను సంప్రదించినట్లు, కథ నచ్చడంతో మూవీలో వర్క్ చేయడానికి విజయ్ ఓకే చెప్పినట్లు అతడి సన్నిహితులు వెల్లడించారు. కాగా ఈ సినిమా తొలి షూటింగ్ నల్లమల అడవుల్లో జరగనుంది. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో సాగే ఇసుక స్మగ్లర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
సినిమా చాలా బాగుంది: మహేష్ బాబు
తమిళ స్టార్ హీరో, తలైవా రజనీకాంత్ అల్లుడు ధనుష్ తాజా సినిమా ‘అసురన్’పై సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. అసురన్ వాస్తవికతకు దగ్గరగా ఉందని.. ప్రతీ అంశాన్ని లోతుగా స్పృశించిందని కితాబిచ్చారు. సినిమా చాలా బాగుందని మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా తమిళ నవల ఆధారంగా వెట్రిమారన్ ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భూ తగాదా నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ తండ్రీ కొడుకుల్లా ద్విపాత్రాభినయం చేశారు. మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్గా కనిపించారు. ఇక విలక్షణ నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ సేతుపతి సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబరు 4న విడుదలైంది. Asuran...raw real and intense... Cinema at its best👌Congratulations @dhanushkraja @VetriMaaran @prakashraaj @gvprakash @theVcreations @VelrajR and entire team #Asuran — Mahesh Babu (@urstrulyMahesh) October 20, 2019 -
ఉప్పెనలో ఉన్నాడు
సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మంగుళూరు బ్యూటీ కృతీశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళనటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారని ఫిల్మ్‌నగర్‌లో వినిపించిన వార్తల్లో నిజం లేదని తెలిసింది. ‘ఉప్పెన’ తాజా షెడ్యూల్ ఈ నెల 17న హైదరాబాద్‌లో మొదలు కానుంది. 19 నుంచి విజయ్ సేతుపతి సెట్లో జాయిన్ అవుతారని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాకినాడ తీరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్ బయోపిక్
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ బయోపిక్‌లో ముత్తయ్యగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి నిర్మించబోతున్నారు. థార్‌మోషన్ పిక్చర్స్‌తో సంయుక్తంగా సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర మేకర్స్ మంగళవారం ప్రకటించారు. విజయ్ సేతుపతి, దర్శకుడు రంగస్వామి, థార్ ప్రొడక్షన్‌తో కలిసి పనిచేయబోతుండడం ఉత్సాహంగా ఉందని రానా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ సొంతం. సో.. ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ మాత్రం డిసెంబర్లో ప్రారంభంకానుంది. -
విజయ్ @ 800
క్రికెట్ ప్రపంచంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరు తెలియనివారు ఉండకపోవచ్చు. టెస్ట్, వన్ డే క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత ముత్తయ్య పేరు మీదనే ఉంది. ఇటీవల క్రీడాకారుల జీవితాలు వెండితెరపైకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరపైకి వచ్చింది. ఈ బయోపిక్‌లో ముత్తయ్యగా విజయ్ సేతుపతి నటించబోతున్నారు. ఈ సినిమాకు శ్రీపతి రంగస్వామి దర్శకుడు. ‘‘ముత్తయ్య మురళీధరన్ తమిళ సంతతికి చెందిన సూపర్ స్పోర్ట్స్ పర్సన్. స్పిన్నర్‌గా ప్రపంచఖ్యాతి గడించారు. అతని పాత్రలో నటించడం నాకు సవాల్ లాంటిది. ముత్తయ్య మురళీధరన్గారు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, స్వయంగా నాకు క్రికెట్ టిప్స్ చెప్పడం సంతోషంగా ఉంది. నన్ను నమ్మిన మురళీధరన్‌కు, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విజయ్ సేతుపతి. ‘‘విజయ్ సేతుపతి వంటి నటుడు నా పాత్రలో నటించడం హ్యాపీ’’ అన్నారు మురళీధరన్. టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసిన బౌలర్ రికార్డు మురళీధరన్ సొంతం. సో.. ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట టీమ్. ఈ చిత్రాన్ని థార్ మోషన్ పిక్చర్స్ నిర్మించనుంది. -
అమలాపాల్ ‘నగ్నసత్యాలు’
నగ్నంగా కనిపించింది..సంచలనానికి దారి తీసింది. వివాదానికి తెర లేపింది. స్క్రీన్ మీద మగవాడు కత్తి దూస్తాడు.. తుపాకీ పేల్చుతాడు. మొరాలిటీ వదులుతాడు..కానీ స్క్రీన్ కోసం స్త్రీ వస్త్రం విప్పితే ‘టాక్ ఆఫ్ ది టౌన్’.. ‘ఆమె’లో అమలాపాల్ న్యూడ్‌గా కనిపించబోతోంది. బోలెడన్ని ‘నగ్నసత్యాలు’ ఈ ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) టీజర్లో నగ్నంగా కనిపించి, సంచలనం సృష్టించారు. ఇలాంటి పాత్ర అంగీకరించడానికి కారణం ఏదైనా? ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్స్ అన్నీ సహజత్వానికి దూరంగా అబద్ధాలతో నిండినవే. లేదా అన్నీ రెగ్యులర్ మసాలా సినిమాలే వస్తున్నాయి. విసిగిపోయాను. కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి, లేకపోతే మానేయాలని బలంగా నిర్ణయించుకున్నాను. సాధారణంగా మా మేనేజర్ రోజుకు రెండు స్క్రిప్ట్స్ నాకు పంపుతుండేవారు. అవన్నీ మహిళా సాధికారత కథలు లేదా త్యాగాలు చేసే భార్య పాత్రలు, రేప్ విక్టిమ్ కథలు. ఇలాంటి ఎన్నని చూస్తాం? నిజం చెప్పడమే ఆర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అయ్యుండాలి. అలాంటి ఓ స్క్రిప్ట్ కావాలని నేను బలంగా కోరుకోవడం వల్లనో ఏమో ‘ఆమె’ నా దగ్గరకు వచ్చింది. స్క్రిప్ట్ ఒక్క పేజీ చదివి ‘వావ్’ అనుకున్నాను. కొత్త ఎనర్జీ వచ్చింది. వెంటనే మేనేజర్‌తో ఇది ఇంగ్లీష్ సినిమానా? అని అడిగాను, కాదన్నారు. పోనీ హిందీ సినిమానా? కాదు, తమిళ సినిమానే అని చెప్పారు. డైరెక్టర్ ఎవరు? అనడిగితే రత్నకుమార్ అన్నారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. వెంటనే తనను ఇక్కడికి రమ్మనండి అని చెప్పాను. స్క్రిప్ట్ చాలా మోడ్రన్‌గా, ఫ్రెష్‌గా, ఒరిజినల్‌గా అనిపించింది. ఫుల్ గెడ్డంతో రత్నకుమార్ ఢిల్లీ వచ్చారు. ఫస్ట్‌సారి చూడగానే ఈ కథ ఇతనే రాశాడా? అనిపించింది. ఏదో ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ చేశారేమో? రీమేక్ సినిమానేమో అనుకున్నాను. అతన్ని అడిగితే ‘ఒరిజినల్ ఐడియా’ అని చెప్పారు. కథ మొత్తం విన్న తర్వాత ‘ఈ సినిమా నేను చేస్తే మాత్రం యాక్టర్‌గా చాలా పెద్ద స్టెప్ తీసుకుంటున్నట్టే’ అని రత్నతో అన్నాను. అయితే చేయాలా వద్దా? అనే సందిగ్ధంలో పడ్డాను. ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది? అని చాలా ఆలోచనలు. ఫైనల్లీ ఫలితం గురించి అస్సలు ఆలోచించలేదు. సినిమా చేసేవాళ్లకు, చూసేవాళ్లకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ మిగులుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో ఒంటికి కేవలం టిష్యూ పేపర్లు చుట్టుకుని కనిపించడం కొంచెం వివాదం అయింది కదా? సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి ఎక్కువ చెప్పలేను. ఫస్ట్ లుక్ చూసే ఉంటారు. ఒంటికి టిష్యూ పేపర్లు చుట్టుకొని ఏడుస్తూ ఉంటాను. ఐరన్ రాడ్ పట్టుకొని సీరియస్‌గా ఉండే లుక్‌ని ముందు రిలీజ్ చేద్దామనుకున్నాం. అయితే స్త్రీ ఎప్పుడూ బా«ధితురాలిగా కనిపించాలని చాలామంది అనుకుంటారు. అందుకే ఏడుస్తున్న ఫొటోను రిలీజ్ చేశాం. ఆ స్టిల్ కొంచెం కాంట్రవర్శీ అయినా బాగా రిజిస్టర్ అయిం ది. అలాగే టీజర్లో నేల మీద‡బట్టలు లేకుండా స్పృహ లేకుండా ఉంటాను. సడన్‌గా తేరుకుంటాను. ఇది చూసి, అత్యాచారానికి గురైన అమ్మాయి కథ అని కొందరు సినిమా కథ అల్లేశారు. ఆ తర్వాత ట్రైలర్ వచ్చింది. స్టోరీ లైన్ ఎవ్వరూ ఊహించలేదు. రివెంజ్ డ్రామానా? అసలేంటి సినిమా కథ అనుకుంటున్నారు. సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? ఇందులో నేను బ్యాడ్ గాళ్ అని చెప్పను. ప్రస్తుతం సొసైటీలో అమ్మాయిలు ఎలా ఉన్నారో అలానే నా పాత్ర ఉంటుంది. ఇండిపెండెంట్ గాళ్‌ని. మన రెగ్యులర్ సినిమాల్లో చూసే హీరోయిన్ లాంటి అమ్మాయి అయితే కాదు. జనరల్‌గా హీరోయిన్ అంటే మంచి పనులే చేస్తుంది, మంచి మాటలే మాట్లాడుతుంది. ఇలాంటి అమ్మాయే నాకు కావాలని అబ్బాయిలందరూ అనుకునేలా ఉంటుంది. కానీ ఈ సినిమాలో కామిని (అమలాపాల్ పాత్ర పేరు) ఆ టైప్ కాదు. డామినేట్ చేస్తుంది, ఇరిటేట్ చేస్తుంది. ప్రపంచానికి ఎదురు వెళ్లయినా సరే అనుకున్నది సాధిస్తుంది. తనకో డార్క్ సైడ్ కూడా ఉంటుంది. మోరల్‌గా కరెక్ట్‌గా ఉంటుందని కూడా చెప్పను. అందరిలోనూ గ్రే షేడ్స్ ఉంటాయి కదా. అందుకే ఇది రియలిస్టిక్ క్యారెక్టర్ అని నా అభిప్రాయం. ఇందాక అన్నాను కదా.. ఆర్ట్ ముఖ్యోద్దేశం నిజానికి దగ్గరగా ఉండటం అని. కామిని పాత్ర అలాంటిదే. కానీ ‘మంచి’ హీరోయిన్ల పాత్రలనే చూడ్డానికి అలవాటుపడ్డ ప్రేక్షకులు ‘డార్క్ సైడ్’ అంగీకరిస్తారంటారా? ఇలాంటి మూస పద్ధతులను ఎవరో ఒకరు బ్రేక్ చేయాల్సిందే. ఈ ప్రాసెస్‌లో కాంట్రవర్శీలు కూడా ఎదురవుతాయి. వాటికి నేను సిద్ధంగానే ఉన్నాను. బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ తనకు నచ్చిన సినిమాలే చేస్తారు. ఎవరేమన్నా పట్టించుకోరు. మన ఇండస్ట్రీలు కూడా నిజమైన కథలు చెప్పాలి. హీరోయిన్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కథలేనా? ఇంకెన్నాళ్ళు స్క్రీన్ మీద అబద్ధాలే చూపిస్తాం. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్‌లో రకరకాల కంటెంట్ వస్తోంది. సినిమాలు చూసి పాడైపోతున్నారనుకోవడం కరెక్ట్ కాదు. మనమెంత నిజం చెబితే అది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. స్క్రీన్ మీద పర్ఫెక్ట్ అమ్మాయి పాత్రను చూసి అలాంటి అమ్మాయి కోసమే అబ్బాయిలు ఎదురు చూస్తుంటారు. నేను పర్ఫెక్ట్గా లేను అనుకునే అమ్మాయిలు కూడా బాధ పడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా ఉన్నారో అలానే అంగీకరిద్దాం. అందరికీ ఏదో ఓ అసంపూర్ణత ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కామిని పాత్రకు, అమలాపాల్‌కు పోలికలు ఉన్నాయా? ఒకప్పటి అమలాపాల్‌కి, ఈ కామినీకి చాలా దగ్గర పోలికలున్నాయి. టీనేజ్‌లో ఉండే చాలా మంది అమ్మాయిలు కామినీలానే ఉంటారు, ఆలోచిస్తారు. స్వార్థం, అభద్రతాభావం, హైపర్‌గా ఉండటం, డబ్బు సంపాదించాలనుకోవడం.. ఇలా వాళ్ల ఆలోచనలు చాలా వాటి మీద ఉంటాయి. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకటే. ఎక్కువ తక్కువలు లేవు అనుకునే మనస్తత్వం కామినిది. తనలానే నేను రెబల్ పర్సన్‌ని. అయితే ఒకప్పుడు. జీవితంలో జరి గిన సంఘటనలు, యోగా ఇవన్నీ నన్ను ప్రశాంతమైన వ్యక్తిని చేసేశాయి. ఈ పాత్ర చేస్తుంటే నా టీనేజ్ రోజుల్ని మళ్లీ గుర్తు చేసుకున్నట్టుంది. ఈ సినిమా కోసం జిమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. హైపర్‌గా ఉండాల్సి వచ్చింది. ఫిజికల్‌గా స్ట్రెయిన్ చేసిన పాత్రæ ఇది. ఎప్పుడో వదిలేసిన నాలో కొంత భాగాన్ని వెనక్కి వెళ్లి చూసుకొని వచ్చినట్టుంది. ‘మసాలా’ సినిమాలు చేయడం ఇష్టం లేదన్నారు. మరి ‘ఆమె’లో న్యూడ్‌గా కనిపించడం మసాలా కింద రాదా? ప్లీజ్.. దీన్ని గ్లామర్ సినిమా, మసాలా సినిమా అనొద్దు. రత్నలాంటి ధైర్యం ఉన్న డైరెక్టర్‌తో పని చేయడం సంతోషంగా ఉంది. ఇదే అతని ఫస్ట్ స్క్రిప్ట్. ఫస్ట్ సినిమానే ఇలాంటి స్క్రిప్ట్ చేస్తే తన మీద ట్యాగ్ వేస్తారని ‘మేయాద మాన్’ అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేశారు. మంచి హిట్ అయింది. చాలామంది హీరోలు తనతో వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అవన్నీ వదిలేసి ఈ సినిమా చేశాడు. అది నిజమైన ప్యాషన్. న్యూడ్ సీన్స్‌ని డూప్‌తో తీయాలనుకోలేదా? లేదు. మిగతా సీన్స్ మేమే చేస్తాం కదా. దీనికి మాత్రం డూప్ ఎందుకు? ఈ సీన్స్ షూట్ అప్పుడు 15 మంది టీమ్ మాత్రమే లొకేషన్లో ఉన్నారు. వాళ్ల చూపులు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. వాళ్ల కళ్లలో నా పట్ల జాలి ఉన్నా నేను సరిగ్గా చేయలేకపోయేదాన్నేమో? ఆర్ట్ మీద వాళ్లకున్న రెస్పెక్ట్ అది. సినిమా చూస్తే కావాలని అతికించిన సీన్స్‌లా ఉండవు. స్క్రిప్టే దాని చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకులు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. దీనివల్ల మీ ఇమేజ్‌కు ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని అనుకుంటున్నారా? ఇమేజ్ నా చేతుల్లో ఉండదు. అయితే యాక్టర్‌గా నన్ను అభినందిస్తారనుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్‌ని ఈజీగా 50 సార్లు చదివి ఉంటాను. ఆ న్యూడ్ సీన్స్ ఎందుకు పెట్టాం అనేదానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఇక సినిమా ఫలితం గురించి ఆలోచించిన క్షణం నుంచి ఇన్సెక్యూర్ అయిపోతాం. నేను కొన్ని సినిమాలను చూడటానికి ఇష్టపడతాను. ఆ సినిమాలను నేను చేయగలిగితే ఆర్ట్‌కి న్యాయం చేసినట్టు అనుకుంటున్నాను. ఒకవేళ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోయినా మనం కొత్తగా ట్రై చేశాం అనే సంతృప్తి ఉంటుంది. ఈ మధ్య మీ దగ్గరకు వచ్చిన చాలా స్క్రిప్స్ నచ్చలేదన్నారు. ఇప్పుడు యాక్టర్‌గా మెచ్యూరిటీ రావడం వల్లనేనా? అవును. నేను చేసే సినిమాలు ఆ సమయానికి నా మానసిక స్థితి ఎలా ఉందో చెప్పడానికి ఉదాహరణలు. కెరీర్ స్టార్టింగ్‌లో ఇన్సెక్యూరిటీతో, ఫైనాన్షియల్‌గా సర్వైవ్ అవ్వడం కోసమో సినిమాలు చేశాను. ప్రస్తుతం చాలా స్టేబుల్‌గా ఉన్నాను. అందుకే కొత్త సినిమాలు చేయగలుగుతున్నాను. నా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. యంగ్ ఏజ్‌లోనే హీరోయిన్గా వచ్చి, సక్సెస్ అయ్యారు. వ్యక్తిగతంగా 23 ఏళ్లకే పెళ్లి. ఆ తర్వాత బ్రేకప్... మరి జీవితం మీకేం నేర్పించింది? ఐ లవ్ హార్ట్‌బ్రేక్. నాకు బాధ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే జీవితాన్ని చాలా లోతుగా చూడటానికి ట్రాజెడీలే ఉపయోగపడతాయి. మనలోకి మనం డీప్‌గా వెళ్లగలం. 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చాను. 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. 25 ఏళ్లకు సెపరేట్ అయిపోయాం. ఈ జర్నీలో చాలా ఒత్తిడి, బాధలు చూశాను. ఇప్పుడు నేనింత ధైర్యంగా ఉండటానికి అవన్నీ కారణం. జగమే మాయ అంటారు కదా. ఇండస్ట్రీ కూడా ఓ మాయే. ఒక ఆర్టిస్ట్‌కి స్పిర్చువాలిటీ చాలా ముఖ్యం అని నమ్ముతాను. అది లేకపోతే ఈ ఫేమ్, కంఫర్ట్ అన్నీ తలకి ఎక్కేస్తాయి. అప్పుడు మనిషిగా స్థిరంగా ఉండలేం. ఏదో ఓ దానికి అడిక్ట్ అయిపోవడం చూస్తుంటాం. నా ప్రాబ్లమ్స్, నా ట్రాజెడీల వల్ల నేనో కొత్త మనిషిని అయ్యాను. స్పిర్చువాలిటీ మంచి దారి అనుకుని, అటువైపుగా వెళ్లాను. ఇప్పుడు స్థిరంగా ఉంటున్నాను. బాహ్య ప్రపంచంలో జరిగే హంగూ ఆర్భాటాలను కూడా మామూలుగా చూసేంత స్థిరత్వం వచ్చింది. ఇప్పుడు మీరు ఫ్రీ బర్డ్‌లా ఉంటున్నారనుకోవచ్చా? యస్. ప్రస్తుతం నన్ను నేను జడ్జ్ చేసుకోగలుగుతున్నాను. ఇతరులను కూడా జడ్జ్ చేయగలుగుతున్నాను. ఇదో క్రేజీ ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆర్ట్ ద్వారా మనల్ని మనం ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తాం. కానీ మెల్లిగా చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని మార్చేస్తారు. స్టార్ మెటీరియల్‌లో చిక్కుకుపోతాం. వాటిని దాటడానికి నాకు యోగా ఉపయోగపడుతోంది. నేను పాండిచెరీలో ఉంటాను. నా వర్క్ అయిపోయిన తర్వాత పూర్తిగా కట్ అయిపోతా. నా పెట్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా బైక్ మీద ఫ్రీగా తిరుగుతాను. అదో డిఫరెంట్ లైఫ్. ఫ్రెండ్స్, పెట్స్ అన్నీ ఓకే. లైఫ్ పార్టనర్ లేరు అనే వెలితి ఉండటం సహజం కదా? అవన్నీ మనం నిర్ణయించలేం. మనం ఎవర్ని పెళ్ళి చేసుకోవాలో మన చేతుల్లో ఉండదు. అవన్నీ దేవుడి ప్లాన్స్ అని నమ్ముతాను. నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు. అయ్యాను. మా ఫ్యామిలీకి ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఇదంతా దేవుడు ఇచ్చాడనుకుంటాను. వీటన్నింటినీ మనం స్వీకరించాలి. ఆనందించాలి. లైఫ్ పార్టనర్ కంటే కూడా మనతో మనం కనెక్ట్ అయ్యుండాలి. అప్పుడే లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకుంటే చాలు. మనల్ని ఎవరో ప్రేమించాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు నా లైఫ్‌లోనూ ఓ వ్యక్తి ఉన్నారు. లవ్‌లో ఉన్నాను. మీ మనసులో ఉన్న ఆ వ్యక్తి సినిమా ఫీల్డ్కి సంబంధించినవారేనా? కాదు. బయటి వ్యక్తే. ఇప్పటికి ఇంతే చెప్పగలుగుతాను. దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి విడాకులు తీసుకున్నాక చాన్సులు తగ్గాయా? కెరీర్లో మార్పు ఏదైనా వచ్చిందా? లేదు. అయితే నా కెరీర్‌ని ఎఫెక్ట్ చేస్తుందేమో? అనే ఆలోచన ఉండేది. పెళ్లి తర్వాత కెరీర్ అయిపోతుంది. సెపరేట్ అయిన తర్వాత ఆంటీ పాత్రలే, సీరియల్సే అని చుట్టూ ఉన్నవాళ్లు భయపెడతారు. మనలో టాలెంట్ ఉన్నంత వరకూ, మనం ప్రొఫెషనల్‌గా ఉన్నంత వరకూ మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. విడిపోయాక చాలా సీరియస్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాను. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టాను. ఆ ఫైరే ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ తెచ్చిపెట్టింది. విజయ్ పెళ్లి చేసుకున్నారు.. ఏం చెబుతారు? విజయ్ చాలా స్వీట్ పర్సన్. అమేజింగ్ సోల్. అతని లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దంపతులకు ఎక్కువమంది పిల్లలు పుట్టాలి. హ్యాపీగా ఉండాలి. ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాల్లో ‘అదో అంద పరవై పోల’ అనే తమిళ సినిమా ఒకటి. ఈ షూటింగ్లో గాయపడ్డారు. అంత రిస్క్ తీసుకోవడం అవసరమా? గాయాలు లేనీ హీరో లేరు కదా (నవ్వుతూ). యాక్షన్ అనేది కేవలం హీరోలకే అనేది ఉంది. సినిమా డబ్బంతా హీరో మీద ఉంటుంది కాబట్టి యాక్షన్ చేయాలనుకుంటారు. నేను ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేశాను. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు టీమ్ అంతా ఫుల్ రెస్పెక్ట్‌తో చూస్తుంది. స్టంట్స్ కేవలం హీరోలకే కాదు అనే దాన్ని బ్రేక్ చేస్తున్నప్పుడు చాలా సంతృప్తి లభిస్తోంది. జనరల్‌గా అమ్మాయి ఫైట్ చేస్తే మగాడిలా చేశావంటారు. ఆ పోలిక ఎందుకు? మా ట్రైనర్ కూడా స్టంట్స్ సమయంలో అబ్బాయిలా ఫీల్ అవ్వు అని మోటివేట్ చేస్తుంటారు. ‘నేను అబ్బాయిలా ఎందుకు ఫీల్ అవ్వాలి? నేను స్త్రీలానే ఉంటాను. మగాళ్లలా నాకు మజిల్ పవర్ ఉండకపోవచ్చు. అయితే ఇన్నర్ పవర్ తెచ్చుకుంటాను’ అని చెప్పాను. ఈ పోలికను మెల్లిగా పోగొట్టాలి. మంచి కథలు రాకపోవడంవల్ల సినిమాలు మానేద్దాం అనుకున్నా అన్నారు. ఏం చేద్దామనుకున్నారు? తెలియదు. బట్ ఏం చేసినా బోరింగ్ పని మాత్రం చేయను. మీ కెరీర్‌ని చూసి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? ‘ఆమె’ కథ చెప్పగానే ఎలా షూట్ చేయబోతున్నారు? అని అడిగారు. నా పేరెంట్స్ నా చాయిస్‌ని ఎప్పుడూ గౌరవించారు. ప్రస్తుతం చాలామంది పేరెంట్స్ పిల్లల్ని సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వడం లేదు. ప్రతీదాంట్లో వాళ్లే ఉంటున్నారు. పిల్లల లైఫ్‌ని కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నారు. కాదు వాళ్లే పాడు చేస్తున్నారు. పిల్లల్ని ఎదగనివ్వాలి. ఎప్పుడూ తల్లిదండ్రుల మీద ఆధారపడేవాళ్లలాగా పెంచకూడదు. మా అమ్మానాన్న నన్ను ఇండిపెండెంట్ ఉమెన్‌గా ఉండనిచ్చారు. మా నాన్నగారు ‘ఆమె’ టీజర్ చూశారు. వాళ్లు హిపోక్రైట్స్ కాదు. మామూలు సినిమాలు చూసి ఎంజాయ్ చేసి వాళ్ల అమ్మాయి ఇలాంటి సినిమా చేయకూడదు అనుకోరు. నేను చేసే సినిమాల విషయంలో అమ్మానాన్న హ్యాపీ. విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్గా మిమ్మల్ని తప్పించారు. అసలు కారణం ఏంటి? నేనేదో ప్రొడక్షన్ ఫ్రెండ్లీ కాదని, రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేశానని ఆ యూనిట్ ప్రచారం చేస్తోంది. కానీ అది నిజం కాదు. అందుకే పెద్ద పోస్ట్ పెట్టాను. వాళ్లు సినిమా నుంచి తప్పించినా ఏం మాట్లాడలేకపోతున్నావు అని ఎవరైనా అంటారేమో అని భయం. పిరికిదానివి అంటారని భయం. అందుకే సోషల్ మీడియా ద్వారా నా ఫీలింగ్‌ని షేర్ చేసుకున్నాను. ‘కడవేర్’ అనే తమిళ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణం అంటే టఫ్ కదా? నిర్మాణం అంటే ఓన్లీ డబ్బు పెట్టడం మాత్రమే కాదు. చాలా మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. యాక్టర్స్‌ని పిలవాల్సి ఉంటుంది. బేరాలు ఆడాల్సి ఉంటుంది. హీరోయిన్గా ఉన్నప్పుడు ప్యాకప్ అయిన వెంటనే వెళ్లిపోవచ్చు. కానీ నిర్మాతగా చాలా పనులు ఉంటాయి. 16 గంటలు పని చేస్తున్నాను. ఓ టీమ్ లీడర్ అందర్నీ మోటివేట్ చేయాలి. క్రియేటివ్ పీపుల్స్‌ని ఒకలా, మేనేజర్స్‌ని ఒకలా డీల్ చేయాలి. ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగులో ‘భద్ర’ పేరుతో విడుదలవుతుంది. కథలు రాయాలనుకుంటున్నారా? లేదు. చిన్న చిన్న ఐడియాలు చెబుతుంటాను. కానీ ఎప్పుడూ స్క్రిప్ట్ రాయలేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్‌లో చిన్నచిన్న కవితలు రాస్తుంటాను. జర్నల్స్ రాస్తుంటాను. హిమాలయాలకు ట్రెకింగ్ వెళ్లినప్పుడు రాస్తుంటా. ట్రెకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అద్భుతం. అందరూ ఓసారి తప్పకుండా హిమాలయాలను చూడాలన్నది నా అభిప్రాయం. సిటీలో ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితాన్ని లీడ్ చేస్తుంటాం. హిమాలయాల్లో పరిగెత్తం. కేవలం నడుస్తాం. చాలా కామ్‌గా ఉంటాం. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాం. ఫోన్‌కి దూరంగా ఉంటాం. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లమో అలానే మారిపోతాం. బాల్యంలో ఉన్నట్లుగానే ఫీలవుతాం. ఫైనల్లీ.. లవ్‌లో ఉన్నాను అన్నారు. ఆ ప్రేమను పెళ్లితో నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ప్రస్తుతానికి ప్రేమలో ఉన్నాం. దాన్ని అలానే ఉండనిస్తాం. దేని గురించీ ఎక్కువ ఆలోచించడం లేదు. అయితే జీవితం చాలా హాయిగా ఉంది. – డి.జి. భవాని చదవండి: ఆ సమయంలో దడ పుట్టింది: అమలాపాల్ ఆసక్తికరంగా ‘ఆమె’ -
విలన్ విజయ్!
ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటు అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్లో వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. చిరంజీవి ‘సైరా: నరసింహా రెడ్డి’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతిది విలన్ పాత్ర అని సమాచారం. దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. మేలో షూటింగ్ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాకి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్ దత్ సైనుద్దీన్. -
ఎన్నికల్లో మార్పు రావాలి
పెరంబూరు: ఈ ఎన్నికల్లో మార్పు రావాలని నటుడు విజయ్‌సేతుపతి పేర్కొన్నారు. నటుడిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న ఈయన చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మంచి మార్కెట్ ఉండడంతో ప్రైవేట్ కార్యక్రమాలకు అతిథిగా ఆహ్వానాలు అధికం అవుతున్నాయి. అలా గురువారం మదురైలోని ఒక నగల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతి«థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో ముంచెత్తారు. యువత రాజకీయాల్లోకి రావాలని నటులు అంటుంటే ,రాజకీయ నాయకులు మాత్రం విముఖత చూపుతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏమిటన్న ప్రశ్నకు తానీ కార్యక్రమానికి అతిథిగా వచ్చానని, కాబట్టి ఇలాంటి ప్రశ్నలను పక్కన పెడదాం అని అన్నారు. ఈ ఎన్నికలతో తమిళనాడులో మార్పు వస్తుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మంచి జరిగే తీరుతుందన్న నమ్మకంతోనే తానూ మీ మాదిరిగానే ఓటు వేసి ఎదురుచూస్తున్నానని అన్నారు. మార్పు అన్నది ఎప్పుడూ అవసరం అని విజయ్‌సేతుపతి పేర్కొన్నారు. -
విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయండి..
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో విజయ్ సేతుపతి అరెస్ట్ చేయలంటూ హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహత్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’సూపర్ డీలక్స్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విశ్లేషకులు, నెటిజన్లు ఈ చిత్రాన్ని విమర్శనలతో బంతాడుకుంటున్నారు. తాజాగా హిజ్రాలు... చిత్ర హీరో విజయ్ పేతుపతి, దర్శకుడు త్యాగరాజు కుమారరాజాలపై మండిపడుతున్నారు. హిజ్రాల సంఘం నిర్వాహకులు రేవతి, ప్రేమ, కల్కి సూపర్ డీలక్స్ చిత్రాన్ని తీవ్రంగా ఖండిస్తూ, విజయ్‌సేతుపతిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో విజయ్ సేతుపతి అంటే తమకు గౌరవం ఉందని, అయితే సూపర్ డీలక్స్ చిత్రంలో హిజ్రాగా నటించిన తరువాత ఆయనపై ఉన్న గౌరవం తగ్గిపోయిందన్నారు. హిజ్రాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు చిత్రంలో చూపించారని ఆరోపించారు. చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన శిల్పా పాత్రను ముంబైలో పిల్లలను కిడ్నాప్ చేసి బిక్షం ఎత్తించేవారికి విక్రయించినట్లు చూపించారన్నారు. నిజానికి హిజ్రాలు పిల్లలపై ప్రేమ చూపుతారని, వారు ఎన్నటికీ పిల్లలను కిడ్నాప్ చేయరని అన్నారు. ఇక బెదిరింపులకు భయపడి హిజ్రాలు ఎలాంటి అత్యాచారాలకు పాల్పడడం లేదని తెలిపారు. అయితే అలాంటి సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఇకపోతే హిజ్రాలకు పిల్లలు పుట్టే భాగ్యం లేదన్నది విజ్ఞానపరమైన నిజం అన్నారు. అలాంటిది ఒక పిల్లాడికి తండ్రి అయిన విజయ్ సేతపతి హిజ్రాగా మారినట్లు చూపించారన్నారు. ఇలాంటి పలు అంశాలు చిత్రంలో తమను అవమానానికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం అయిన చిత్ర దర్శకుడు, అందులో నటించిన నటుడు విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
అక్కడ హీరో.. ఇక్కడ విలన్?
చిరంజీవి ‘సైరా : నరసింహా రెడ్డి’ సినిమాతో తెలుగు చిత్రరంగానికి పరిచయం అవుతున్నారు విజయ్ సేతుపతి. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారాయన. తమిళ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్‌లో విజయ్ సేతుపతి ఒకరు. వరుస విజయాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఆయన. ‘సైరా’ తర్వాత మరో తెలుగు సినిమాలో సేతుపతి కనిపించనున్నారని టాక్. సుకుమార్, మైత్రీ సంస్థ నిర్మాణంలో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రకు విజయ్ సేతుపతి పేరుని పరిశీలిస్తున్నారట. మరి ఈ సినిమా అంగీకరించి, తెలుగులో విలన్‌గా మారాతారా? వేచి చూడాలి. -
అంజలి.. చాలా పవర్ఫుల్
నయనతార లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘ఇమైక్క నొడిగల్’. అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. నయనతార భర్త విక్రమాదిత్యగా అతిథి పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఆర్. అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో క్యామియో ఫిల్మ్స్ పతాకంపై సీజే జయకుమార్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది తమిళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్‌పై సీహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్‌లు ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పవర్ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా నయనతార టైటిల్ రోల్లో చాలా బాగా నటించారు. ప్రస్తుతం అనువాదకార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రమేష్ తిలక్, దేవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: ఆర్.డి. రాజశేఖర్. -
విరామానికి విరామం
రెండేళ్లవుతుంది తమిళంలో శ్రుతీహాసన్ స్క్రీన్‌పై కనిపించి. సూర్యతో చేసిన ‘సింగం 2’ తమిళంలో శ్రుతి లాస్ట్ సినిమా. ఆ తర్వాత సినిమాలను తగ్గించి సంగీతం మీద దృష్టి పెట్టారామె. లండన్‌లో మ్యూజికల్ షోలు కూడా నిర్వహించారు. అంతే కాకుండా వీలున్నంత సమయాన్ని బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ సినిమాను అంగీకరించారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. లేటెస్ట్గా శ్రుతీ ఓ తమిళ చిత్రం అంగీకరించినట్టు సమాచారం. రెండేళ్ళ గ్యాప్ తర్వాత అంగీకరించిన సినిమా ఇది. విజయ్ సేతుపతి హీరోగా యస్పీ జననాథన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతీహాసన్ అయితే బావుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. శ్రుతీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శ్రుతీ రెండేళ్ల విరామానికి విరామం ఇచ్చి మళ్లీ సినిమాలను అంతే స్పీడ్‌గా చేస్తారో లేదో చూడాలి మరి. -
రాశీ ఎక్స్‌ప్రెస్
గతేడాది విడుదలైన ‘ఇమైక్క నొడిగళ్’ చిత్రంతో తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు రాశీఖన్నా. ఈ చిత్రం విడుదల ఆలస్యం అయినా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘జయం’ రవితో చేసిన ‘అడంగామారు’ చిత్రం కూడా హిట్ సాధించింది. ప్రస్తుతం తెలుగు ‘టెంపర్’ రీమేక్‌లో విశాల్‌తో కలసి యాక్ట్ చేస్తున్నారు రాశి. ఇలా తమిళ జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది ఆమెకు. తాజాగా మరో తమిళ చిత్రంలో యాక్ట్ చేయడానికి అంగీకరించారీ భామ. తమిళ హాట్ ఫేవరెట్ విజయ్ సేతుపతి లేటెస్ట్ చిత్రంలో హీరోయిన్గా ఎంపికయ్యారు. విజయ్ చందర్ దర్శకుడు. ‘‘తమిళంలో నా అభిమాన నటుల్లో ఒకరైన విజయ్ సేతుపతి నెక్ట్స్ సిమిమాలో హీరోయిన్గా చేస్తున్నాను. కొత్త టీమ్‌తో పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మరికొన్ని అనౌన్స్మెంట్స్ కూడా త్వరలోనే చెబుతా’’ అని పేర్కొన్నారు రాశీఖన్నా. కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో రాశీ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌గా కదులుతోంది. ప్రస్తుతం చేస్తున్న ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే తమిళంలో స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లోకి చేరిపోవడం ఖాయం. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తున్నారు రాశీఖన్నా. -
గజ తుఫాన్: హీరో సూర్య కుటుంబం విరాళం
సాక్షి, చెన్నై: దక్షిణ తమిళనాడుపై గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటికే నష్టనివారణ చర్యలకై రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వానికి ఆర్థికంగా భరోసా కల్పించడానికి ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. కోట్ల రూపాయలను నష్టపోయిన తమిళనాడుకు ఆపన్నహస్తం అందించేందుకు సినీ తారలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నాయి. తాజాగా గజా తుఫాన్‌తో ఉక్కిరిబిక్కిరైన తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం కోలీవుడ్ టాప్ హీరో సూర్య కుటుంబం 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించింది. హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక, తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ నలుగురు కలిసి వారి తరఫున ఈ డబ్బును సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. కేరళ వరదల సమయంలోనూ హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తిలు అందరికంటే ముందుంగా స్పందించి విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా గజ తుఫాన్‌తో నష్టపోయిన తమిళనాడుకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుగా స్పందించి విరాళాన్ని ప్రకటించారు. అదేవిధంగా మరో హీరో విజయ్ సేతుపతి తన వంతు సహాయంగా 25 లక్షల విరాళాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. డీఎంకే ట్రస్ట్ కోటి రూపాయలను, ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నెల జీతాన్ని ప్రకటించారు. గతంలో కూడా కేరళ వరదలు, తిత్లీ తుఫాన్ సమయంలో చాలా మంది తమిళ, తెలుగు సినీ తారలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఇప్పుడు కో–స్టార్‌గా...
రజనీకాంత్ ‘పేట్టా’లోని తారాగణం రోజు రోజుకీ భారీగా మారుతోంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహాలు ఎంటరయ్యారు. తాజాగా ఈ టీమ్‌లోకి తమిళ దర్శకుడు మహేంద్రన్ కూడా జాయిన్ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పేట్టా’. రజనీకాంత్‌తో ‘ముల్లుమ్ మలరుమ్, జానీ’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్ ఈ సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్నారు. పదేళ్లుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న మహేంద్రన్ విజయ్ ‘తేరీ’తో నటుడిగా ఇండస్ట్రీకు కమ్ బ్యాక్ ఇచ్చారు. అంతకుముందు ఆయన దర్శకుడిగా మాత్రమే చేసేవారు. కమ్‌బ్యాక్‌లో ఒకప్పుడు తాను సూపర్ హిట్ సినిమాలు తీసిన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మహేంద్రన్‌కి ఓ కొత్త ఎక్స్పీరియన్స్. ప్రస్త్రుతం వారణాసీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
అప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయా!
‘‘నటుడిగా ఫస్ట్ సినిమా ‘దళపతి’ కూడా మల్టీస్టారరే చేశాను. మల్టీస్టారర్స్ చేయడం పెద్ద కష్టం కాదు. అన్ని క్యారెక్టర్స్ బాగా కుదిరితే అందరికీ మంచి గుర్తింపు లభిస్తుంది. స్క్రిప్ట్ స్టార్స్‌ని డిమాండ్ చేస్తే తప్పకుండా కలసి నటించాలి. అలాగే కమర్షియల్ యాంగిల్లో కూడా ఆలోచించాలి. దర్శకుడు హ్యాండిల్ చేస్తాడనే నమ్మకం ఒకటి చాలు. మల్టీస్టారర్స్ వస్తూనే ఉంటాయి’’ అని అరవింద స్వామి అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితీరావ్ హైదరీ, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘చెక్క చివంద వానమ్’. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నవాబ్’ పేరుతో అశోక్ వల్లభనేని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అరవింద స్వామి చెప్పిన విశేషాలు... ►నా పాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. సంతోషంగా ఉంది. రోజా, బొంబాయి నుంచి ప్రేక్షకులు ప్రేమను పంచుతున్నారు. ధన్యవాదాలు. మణిరత్నంగారితో తొమ్మిదోసారి కలసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ను నేనో గురువులా భావిస్తాను. కాళ్లకు మొక్కి నమస్కరించకపోయినా ఆయన మీద మాత్రం నాకు అపారమైన గౌరవం ఉంది. ఇప్పటికీ సినిమా ‘చెయ్’ అని అడగరు. ఐడియా ఉంది. సినిమా చేద్దామా? అని అడుగుతారు. అదే ఆయనలోని స్పెషాలిటీ. ►‘తని ఒరువన్’ (తెలుగులో ‘ధృవ’)లో విలన్‌గా నటించినప్పటి నుంచే నా పాత్ర పట్ల క్రియేటీవ్‌గా ఇన్వాల్వ్ అవ్వాలని అనుకున్నాను. అలా చేస్తే పాత్రలో పూర్తిగా నిమగ్నమవ్వొచ్చన్నది నా అభిప్రాయం. ∙నేను నటుణ్ని అవ్వాలనుకోలేదు. ‘బొంబాయి, రోజా’ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ స్టార్డమ్ చాలా కష్టంగా అనిపించింది. స్టార్డమ్ వచ్చినప్పుడు కూడా స్టార్లా ఫీల్ అవ్వలేదు. మధ్యలో బ్రేక్ వచ్చింది. మళ్ళీ మణిసారే పిలిచి ‘కడలి’ సినిమా చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నెగటీవ్ పాత్రలు చేస్తున్నప్పుడే స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఇంకా ఆసక్తిగా అనిపిస్తోంది. ఏ తప్పూ చేయకుండా హీరో అన్నీ మంచి పనులే చేస్తుంటాడు. కానీ రియల్ లైఫ్‌లో మనుషులు అలా ఉండరే. అందుకేనేమో? (నవ్వుతూ). ∙‘గాడ్ ఫాదర్’ సినిమాలో హీరోకి నెగటీవ్ షేడ్ ఉంటుంది. కానీ కథ అంతా హీరో చుట్టే తిరుగుతుంది. అయినా విలన్ అని అనం. నేను చేసే పాత్రలు కూడా అలానే ఉండాలని భావిస్తాను. ►ఏదైనా స్క్రిప్ట్‌కి ‘యస్’ చెప్పే ముందు మొత్తం స్క్రిప్ట్‌ని క్షుణ్ణంగా చదవాల్సిందే. అప్పుడే యస్ ఆర్ నో చెబుతాను. ఒక్కసారి ‘యస్’ చెప్పాక ఆ పాత్ర గురించి దర్శకుడితో డిస్కస్ చేసుకుంటాను. అలాగే ‘నవాబ్’లో నేను చేసిన వరదన్ పాత్ర గురించి చర్చిస్తుండగా ఫిజిక్ గురించి టాపిక్ వచ్చింది. ‘వరదన్’ పాత్ర బుల్లా ఉంటుంది. అతని శరీరాకృతి అయినా, ప్రవర్తించే విధానమైనా బుల్లానే ఉంటుంది. అలా అనుకుని అందుకు అనుగుణంగా నన్ను మార్చుకున్నాను. ఫస్ట్ సినిమా నుంచి మణిసార్‌తో ఏకీభవిస్తూ, గొడవపడుతూ వర్క్ చేస్తున్నాను. యాక్టర్స్‌కి ఆయన ఎప్పుడూ క్రియేటీవ్ ఫ్రీడమ్ ఇస్తుంటారు. ►ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో మెల్లిగా మార్పు కనిపిస్తోంది. కొత్త కాన్సెప్ట్స్‌ని ప్రేక్షకులు చూస్తున్నారు. నా వరకు నేను ఫార్ములా సినిమాలు సరిగ్గా తీయకపోతే కూర్చుని చూడలేను. అలాంటిది అలాంటి సినిమాల్లో యాక్టింగ్ అంటే చాలా కష్టం. ‘నవాబ్’ సినిమాను తమిళంలో ‘పొన్నియిన్ సెల్వన్’ నవలతో, కరుణానిధి ఫ్యామిలీకు దగ్గరగా ఉంది అని ట్వీటర్లో పోలుస్తున్నారు. కానీ ఇది ఒరిజినల్ స్క్రిప్ట్. అన్నీ కల్పిత పాత్రలే. ► కమర్షియల్ సక్సెస్ మాత్రమే మణిరత్నంగారి టాలెంట్‌కి కొలమానం కాదు. కమర్షియల్ సక్సెస్ తీయాలనుకోవడం చాలా చిన్న పని ఆయనకు. కానీ తనను తాను చాలెంజ్ చేసుకునే దర్శకుడు. ఇప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండకుండా పని చేస్తున్నారు. అది గ్రేట్. మనం అభినందించాల్సిన విషయం. గమనిస్తే ఆయన తీసిన ఏ రెండు సినిమాలూ ఒకలా ఉండవు. ► తెలుగుతో ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను. నాకు కొత్త భాష నేర్చుకోవడం రాదు. మా పిల్లలు కొత్త భాషను టక్కున నేర్చుకుంటారు. నేను మాత్రం నేర్చుకోలేకపోతున్నాను (నవ్వుతూ). ► ‘డియర్ డాడ్’ సినిమాలో స్వలింగ సంపర్కం గురించి మాట్లాడాం. ఆ సినిమా చేయడానికి చాలా సంకోచించాను. ఆడియన్స్ ఒప్పుకుంటారా? ‘ఇంత అందగాడు హోమో సెక్కువల్గానా? అమ్మాయికి ఐ లవ్ యు చెప్పాల్సింది పోయి అబ్బాయికా?’ అని ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొడతారా? అని అనుకోలేదు. అసలు ఆ పాత్రకు సూట్ అవ్వగలనా? అని మాత్రమే ఆలోచించాను. అందుకే మణిరత్నంగారికి కాల్ చేశాను. ఆయన సలహా మేరకు ఆ సినిమా చేశాను. ► మధ్యలో కాళ్లకు జరిగిన గాయం వల్ల కాళ్లు చచ్చుబడిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు నా కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయింది. ఇక్కడ మందులు వాడాం. మార్పు కనిపించకపోవడంతో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాం. ఆయుర్వేదం ట్రై చేశాం. పని చేసింది. అలా మళ్లీ మాములుగా అయ్యాను. ఆ సమయంలోనే మణిరత్నంగారు ‘కడలి’ సినిమా చేయమన్నారు. ఆ సినిమా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ► ఇంతకు ముందు న్యూస్ చూస్తుంటే న్యూస్ తెలుసుకుంటున్న భావన కలిగేది. కానీ ఇప్పుడు వాదనలు చూస్తున్నాం. న్యూస్ వినడం లేదు. ఎవరో అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్టు ఉంది. ఆల్రెడీ న్యూస్ అంటేనే ఏదో డ్రామా విషయాన్ని చెబుతున్నాం. దానికి ఇంకా డ్రామా జోడిస్తున్నారు. దాంతో న్యూస్ చూడటం మానేశాను. చదువుతున్నాను అంతే. ► నా బిజినెస్ బాగానే సాగుతోంది. సుమారు 4000వేల మంది వరకూ మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ► ఈ సంవత్సరమే డైరెక్టర్‌గా సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నాను. కుదర్లేదు. వచ్చే ఏడాది మెగాఫోన్ పట్టుకుంటాను. చాలా స్క్రిప్ట్స్ రాసుకున్నాను. అందులో ప్రస్తుత టైమ్‌కి సూట్ అయ్యే కథతో సినిమా చేస్తా. తమిళంలో కార్తీక్ నరేన్ అనే టాలెండ్ దర్శకుడితో చేసిన ‘నరగాసురన్’ రిలీజ్ కోసం ఎదురుచూసున్నా. అలాగే తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం గురించి డిస్కషన్ జరుగుతోంది. -
సూపర్ స్టార్ సినిమాలో...
రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారని, నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేయనున్నారని ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు నటి సిమ్రాన్, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీలు ఈ సినిమా యూనిట్లోకి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సిమ్రాన్‌ని ఏ పాత్రకు తీసుకున్నారనేది బయటపెట్టలేదు. అయితే కోలీవుడ్ ఊహల ప్రకారం ఆమెకు రజనీ సరసన నటించే గోల్డెన్ చాన్స్ దక్కిందట. ఈ సినిమాలో బాబీ సింహా, సానత్ రెడ్డి, మేఘా ఆకాశ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
కన్నడకు నమస్కార
తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో రేంజ్‌కి వెళ్ళిన విజయ్ సేతుపతి ఇప్పుడు కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. చిరంజీవి ‘సైరా’తో తెలుగు ఆడియన్స్‌కు నమస్కారం చెప్పనున్న ఈ హీరో ఇప్పుడు కన్నడ అభిమానులకు నమస్కార చెప్పబోతున్నారు. వసంత్ విష్ణు హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్‌తో కన్నడకు ఎంట్రీ ఇవ్వనున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ.. ఇలా వేరే భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
కల నిజమైంది
దర్శకుడు మణిరత్నం సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆయన డైరెక్షన్ స్టైల్ డిఫరెంట్. అందుకే మణిరత్నం సినిమాల్లో నటించేందుకు యాక్టర్స్ ఇష్టపడుతుంటారు. కొందరైతే అదృష్టంగా భావిస్తుంటారు. ఆ అదృష్టం దక్కినందుకు ఆనందపడుతున్నారు తమిళ నటి ఐశ్వర్యా రాజేశ్. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీ రావ్ హైదరీ, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చెక్క చివంద వానమ్’. తెలుగులో‘నవాబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో తమ వంతు షూటింగ్స్‌ను కంప్లీట్ చేశారు ఐశ్వర్య రాజేశ్ అండ్ అరుణ్ విజయ్. ‘‘నవాబ్’ సినిమాలో నా వంతు షూటింగ్ కంప్లీటైంది. మణిరత్నంగారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కల నిజమైనట్లు ఉంది’’ అన్నారు ఐశ్వర్య. అంతేకాదు తమిళ హీరో శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్ హౌస్‌లో రూపొందనున్న సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు ఐశ్వర్య. అరుణ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కతోన్నఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ టైటిల్ ఎనౌన్స్మెంట్ రేపు రానుంది. -
బాలీవుడ్‌కు కోలీవుడ్ సూపర్ హిట్
విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోలీవుడ్ సూపర్‌హిట్ సినిమా విక్రమ్ వేదా. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు మాధవన్, విజయ్ సేతుపతి నటనకు ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులోనే నాగార్జున, రానా, వెంకటేష్ లాంటి స్టార్ల పేర్లు వినిపించినా.. ఇంతవరకు ఫైనల్ కాలేదు. తాజాగా విక్రం వేదా బాలీవుడ్ రీమేక్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ త్వరలో విక్రం వేదా రీమేక్ పట్టాలెక్కనుందని ప్రకటించారు. రిలయన్స్ఎంటర్టైన్మెంట్తో పాటు ప్లాన్ సి స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ ఈ రీమేక్‌ను నిర్మించనున్నాయి. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రిలే హిందీ వర్షన్‌కు కూడా డైరెక్ట్ చేయనున్నారు. నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. #BreakingNews: #VikramVedha in Hindi... Reliance Entertainment, Plan C Studios [spearheaded by Neeraj Pandey] and Y Not Studios [headed by S Sashikanth] to remake the much-loved Tamil film in Hindi... Pushkar and Gayatri, who directed the original, will direct Hindi remake. — taran adarsh (@taran_adarsh) 15 March 2018 -
ముందు చిన్న చిరు.. తర్వాత పెద్ద చిరు
అవును.. ముందు చిన్న చిరు ఎంటరయ్యాడు. తర్వాత పెద్ద చిరు సీన్లోకొచ్చారు. కన్ఫ్యూజ్ అవుతున్నారా? విషయం ఏంటంటే... చిరంజీవి హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సైరా’. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కాగా, నరసింహారెడ్డి చిన్నప్పటి విశేషాలను కూడా సినిమాలో చూపిస్తారు. ఆ పాత్ర కోసం పలువురు బాలనటులను పరిశీలించగా, ముంబైకి చెందిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఎంపిక చేశారు. ఈ బాలుడు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిన్న చిరు క్యారెక్టర్ పూర్తయ్యాక పెద్ద చిరు ఈరోజు నుంచి ‘సైరా’ సెట్లోకి ఎంటరవుతున్నారు. ఈ రోజు నుండి రెండో షెడ్యూల్‌ను ఒక ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్లో జరుపుతారు. జస్ట్ చిరంజీవి ఎంట్రీ మాత్రమే కాదు.. ఈరోజు నయనతార కూడా ఈ సెట్లోకి అడుగుపెడుతున్నారు. ఈ షెడ్యూల్లో విజయ్ సేతుపతి తదితరులు పాల్గొంటారు. ఈ నెలాఖరున జరిగే షెడ్యూల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాల్గొంటారట. రెండు రోజుల చిత్రీకరణలో ఆయన పాల్గొంటారని సమాచారమ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు. -
తమిళ హీరోకి బిగ్ బి అవార్డు
తమిళ సినిమా: విలక్షణ నటుడు విజయ్‌సేతుపతి... అమితాబ్‌బచ్చన్ ఐకాన్ అవార్డును అందుకున్నారు. 15వ చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు గత 14వ తేదీ నుంచి చెన్నైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం సాయంత్రం స్థానిక దేవి థియేటర్లో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందించారు. ఉత్తమ చిత్రం అవార్డును ఒరు కిడారియిన్ కరుణై మను గెలుచుకుంది. సురేశ్ చంగయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈరోస్ఇంటర్నేషనల్ మీడియా సంస్థ నిర్మించింది. ద్వితీయ ఉత్తమ చిత్రం – విక్రమ్‌వేదా గెలుచుకుంది. బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ పేరుతో అందించే అవార్డు విజయ్‌సేతుపతిని వరించింది. అదే విధంగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మానగరం చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. కురంగుబొమ్మై చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. నటనా శిక్షణ విద్యార్థుల కోసం నెలకొల్పిన అమ్మ అవార్డును డెయిసీ చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రానికి ఏ.నారాయణమూర్తి దర్వకత్వం వహించారు. కార్యక్రమంలో నటుడు కే.భాగ్యరాజ్, సుహాసిని, మనోబాల సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
శింబు ఫిక్స్
‘ముందుగా అనుకున్న అందరూ ఉన్నారు. ఆ హీరో ప్లేస్ ఒక్కటే డౌట్. మలయాళ హీరో నివిన్ పౌలీని అతని ప్లేస్‌లో సంప్రదించారు’... ఇది నిన్న మొన్నటి వరకు కోలీవుడ్‌లో మణిరత్నం మెగా మల్టీస్టారర్ సినిమా గురించి వినిపించిన వార్త. అతను శింబు అని ఊహించే ఉంటారు. శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అరవింద్ స్వామి, ఐశ్యర్య రాజేష్, ఫాజిల్ ముఖ్య పాత్రల్లో మణిరత్నం ఓ మెగా మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే శింబు ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారా? లేదా అనే సందేహం చాలామందికి ఉండేది. దానికి కారణం అతను తమిళంలో చేసిన ‘అన్బానవన్ అసరాదవన్, అడంగాదవన్ (ఏఏఏ) సినిమా వివాదంలో చిక్కుకుంది. శింబుపై ఈ చిత్రనిర్మాత మైఖేల్ రాయప్పన్ కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో ఈ హీరోగారిపై కోలీవుడ్‌లో కొంతకాలం వేటు పడుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాదం ఇప్పుడు సద్దుమణిగింది. దాంతో మణిరత్నం మెగా మల్టీస్టారర్ మూవీలో శింబునే ఫైనల్ అయ్యారు. అంతేకాదు మణిరత్నం స్టార్ట్ చేసిన యాక్టర్స్ వర్క్ షాష్‌కు కూడా శింబు హాజరవుతున్నారు. జనవరిలో షూటింగ్ ఆరంభం కానుంది. -
జుంగాలో నేహా
తమిళసినిమా: నటి నేహా శర్మ గుర్తుందా? ఇటీవల విడుదలైన సోలో చిత్రంలో నటుడు దుల్కర్‌సల్మాన్‌తో రొమాన్స్ చేసిన ఐదుగురు ముద్దుగుమ్మల్లో ఒకరీ భామ. తాజాగా మరో అవకాశాన్ని తన జేబులో వేసుకుంది. యువ నటుడు విజయ్‌సేతుపతి కథాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జుంగా. తనే రూ.20 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఇందులో ఇప్పటికే ముంబై బ్యూటీ సాయేషాసైగల్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఫ్రాన్స్‌లో పాట చిత్రీకరించుకుంటోంది. రాజుసుందరం నృత్య దర్శకత్వంలో పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చిత్రం యూనిట్ ఇప్పటికే ప్రకటించారు. రెండవ హీరోయిన్గా నటి నేహాశర్మను ఎంపిక చేయడానికి చర్చలు జరగుతున్నాయని చిత్ర దర్శకుడు గోకుల్ తెలిపారు. దీని గురించి ఆయన చెబుతూ రెండవ హీరోయిన్గా నటి నేహా శర్మను నటింపచేయడానికి చర్చలు జరగుతున్నాయని, అయితే ఇంకా ఆమె ఒప్పదంపై సంతకాలు చేయలేదని, తను కాల్షీట్స్ సర్దుబాటు చేసుకుని ఇస్తాననడంతో ఆమెకు సంబంధించిన సన్నివేశాలను డిసెంబర్, జనవరిలో గానీ చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నేహాశర్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఆమె లంగాఓణీ పాత్రలో చిన్నపాటి డాన్‌లా కనిపిస్తుందని అన్నారు. విజయ్‌సేతుపతితో నేహాకు ఒక డ్యూయెట్ కూడా ఉంటుందని చెప్పారు. విజయ్‌సేతుపతి, గోకుల్ కాంబినేషన్లో ఇంతకు ముందు ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. జుంగా ఈ హిట్ కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం అవుతుంది. -
ఒక మంచి రోజు చూసి చెబుతా!
ఏం చెబుతారు? తమిళ ప్రేక్షకులకు మంచి కథ! అంతే కదా... మంచి కథ కావడం వల్లే తమిళంలో సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పారీ తెలుగమ్మాయ్! ‘ఒక మనసు’ సిన్మాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన నిహారిక తమిళ తెరకు పరిచయమవుతున్న సినిమా ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్’. ఒక మంచి రోజు చూసి చెబుతా... తమిళ టైటిల్‌కి తెలుగు మీనింగ్! ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలు. విజయ్ సేతుపతికి జోడీగా నిహారిక నటిస్తున్నారట. ప్రేక్షకులకు సినిమా చూపించే మంచి రోజుని ఎప్పుడు నిర్ణయించారో గానీ... అంతకంటే ముందు అందులో ప్రేక్షకులకు నిహారిక ఎలా కనిపించేదీ చూపించేశారు చిత్రబృందం. ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్లరేన్’లో సౌమ్య అలియాస్ అభయలక్ష్మీ పాత్రలో ఆమె నటిస్తున్నారు. డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని సమాచారమ్! ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి, విడుదల చేయాలని దర్శక–నిర్మాతలు ఆలోచిస్తున్నారట!! -
ఒక మంచి రోజు చూసి చెబుతా!
తమిళసినిమా: ఒక మంచి రోజు చూసి చెబుతానంటోంది నటి నిహారిక. ఈ పేరు వినగానే ఎలాంటి సినీ కుటుంబం నుంచి వచ్చిందన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఎస్.మెగాస్టార్ చిరంజీవి కుంటుంబం నుంచి రంగప్రవేశం చేసిన నటి నిహారిక. చిరంజీవి సోదరుడు, నిర్మాత, నటుడు నాగబాబు కూతురు ఈ వర్ధమాన నటి నిహారిక కొణెదల. ఇప్పటికే తెలుగులో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పుడు కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. తను కథానాయకిగా నటిస్తున్న చిత్రం ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఒక మంచి రోజు చూసి చెబుతా). వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి, ఇటీవలే సక్సెస్ ట్రాక్‌లో పడ్డ గౌతమ్ కార్తీక్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7సీస్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, అమ్మీ నారాయణ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్ముగకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించడం గురించి నటి నిహారిక తెలుపుతూ కోలీవుడ్‌లో తొలి చిత్రమే ఇంత భారీ చిత్రంగా రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్‌సేతుపతి, గౌతమ్ కార్తీక్ లాంటి నిరాడంబరమైన నటులతో కలిసి నటించడం మంచి అనుభవం అని చెప్పింది. ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ చిత్రంలో తనది రెగ్యులర్ కథా పాత్రగా ఉండదని అంది. ఇందులో తనకు రెండు పేర్లు ఉంటాయని, అలా ఎందుకన్నది చిత్రం చూస్తే మీకే తెలుస్తుందని చెప్పింది. నటిగా తనకు తన కుటుంబం ఆదరణ, ప్రోత్సాహం ఎంతన్న మాటల్లో చెప్పలేనని, ఇంత మంచి కుటుంబంలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని నిహారిక పేర్కొంది. ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ చిత్రం కోలీవుడ్ ప్రేక్షకులకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని నిహారిక కొణెదల వ్యక్తం చేసింది. -
టోక్యో ఫిలిం ఫెస్టివల్ కు 'విక్రమ్ వేదా'
విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేదా. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ లో జరుగనున్న ప్రతిష్టాత్మక 30వ టోక్యో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో విక్రమ్ వేదా చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. కోలీవుడ్ లో ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. ఈ సినిమాలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా నటించాడు. సినిమా కథా కథనాలతో పాటు క్లైమాక్స్ విషయంలో కూడా చిత్రయూనిట్ కొత్తగా ప్లాన్ చేసింది. ఎలాంటి ముగింపు ఇవ్వకుండా కథను అర్థాంతరంగా ఆపేయటంతో సీక్వల్ నిర్మిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. The big news is here! We are happy to inform that #VikramVedha has been selected at Tokyo International Film Festival. — Y Not Studios (@StudiosYNot) 26 September 2017 -
లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న హీరో
తమిళంతో పాటు తెలుగు తెర మీద కూడా డబ్బింగ్ సినిమాల ద్వారా ఫేమస్ అయిన సూపర్ స్టార్ విజయ్ ఇప్పుడు తన పనులన్నింటినీ కాసేపు పక్కన పెట్టేసి.. ఎంచక్కా తన భార్య, కూతురితో కలిసి లండన్ చెక్కేశాడు. విజయ్ సేతుపతి నటించిన 'పులి' సినిమా విడుదల కావాల్సి ఉంది. జూలై మొదటి వారంలో తిరిగి చెన్నై వస్తాడని భావిస్తున్నారు. ప్రతియేటా విజయ్ వేసవిలో లండన్ వెళ్తుంటాడని, ఆయన భార్య బంధువులు అక్కడ ఉండటంతో వాళ్ల వద్దకు వెళ్లి చూసి వస్తుంటారని విజయ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అట్లీ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని తమిళ సినిమా షూటింగులో పాల్గొంటారు. జూలై చివరి వారంలో విజయ్ నటించే 59వ సినిమా షూటింగ్ మొదలవుతుంది. చెన్నై బిన్నీ మిల్స్ ప్రాంతంలో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. -
నాకిప్పుడు బాయ్‌ఫ్రెండ్ లేడు
తనకిప్పుడు బాయ్ ఫ్రెండ్ లేదంటున్నారు నటి సునైనా. పేరుకు తగ్గట్టే సొగసైన నయనాల సుందరీమె. ఇంతకుముందు కంటే కాస్త బరువు,పరువాలు పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ అభినయంలోనూ ఆరితేరారన్నది నీర్పరవై చిత్రంతో నిరూపించుకున్నారు. తమిళంలో కథానాయికగా రాణిస్తున్న ఈ భామ పదహారణాల తెలుగమ్మాయి. అయితే ఆశించిన స్థాయిని మాత్రం చేరుకోలేదు. అందుకు తన వంతు కృషి, శ్రమ చేస్తున్నట్లు చెబుతున్నారు సునైనా. ఇటీవల అనూష అంటూ పేరు మార్చుకుని మళ్లీ అసలు పేరుకే మారిపోయారు. ఆ కథేంటో ఈ సుందరి యవ్వారం ఏమిటో చూద్దాం. నీర్పరవై చిత్రం తరువాత తెరపై కనిపించలేదే? నిజం చెప్పాలంటే నీర్పరవై చిత్రం నా ఇమెజ్‌ను హోటల్‌గా మార్చేసింది. నే ను మంచి నటినేనని తమిళ ప్రేక్షకులకు నమ్మకాన్ని కలిగించిన చిత్రం అ ది. అయితే ఆ తరువాత వచ్చిన అవకాశాలన్నీ ఆ తరహాలోనే ఉండటం వల్ల అంగీకరించలేదు. అందుకే ఈ గ్యాప్. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? శ్రీకాంత్‌కు జంటగా నంబియా ర్, కృష్ణ సరసన వన్నం చిత్రాలు చేస్తున్నాను. ఈ రెండు చిత్రాలలో తన పాత్రలు వేర్వేరు గా ఉంటాయి. ఈ చిత్రంలో నాగర్‌కోవిల్ యాసలో మా ట్లాడుతారటగా? అవును. చిత్రం లో విజయ్ సేతుపతి, కృష్ణ పోటీపడి నటిస్తున్నారు. అలాంటప్పుడు నా వంతు నేనూ బాగా నటించాలిగా. నీర్పరవై చిత్రంలో నటనకు ఈ వర్నం చిత్రంలో నటనకు చాలా మార్పు కనిపిస్తుంది. షూటింగ్ స్పాట్లో నాకు నాగర్‌కోవిల్ యాస నేర్పించారు. మొదట్లో మాట్లాడటం కాస్త కష్టం అనిపించింది. నటిగా ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చింత ఉందా? అందుకని మూలన కూర్చుని బాధపడితే ఫలితం ఉంటుందా? అందరికీ మంచి కాలం అంటూ ఒకటొస్తుంది. తొలి రోజుల్లో అందాలారబోసినట్లున్నారు? నాయికగా పరిచయమైయిన తొలి రోజుల్లో ఒకటి రెండు చిత్రాల్లో అలా నటించిన విషయం నిజమే. ఇప్పుడు అలాకాదు. కథ విన్న తరువాతనే కాల్షీట్స్ ఇస్తున్నాను. గ్లామర్ విషయంలో నాకం టూ కొన్ని హద్దులున్నాయంటూ ముందే చెప్పేస్తున్నాను. ఇప్పుడు నన్నెవరూ వివాదాల నటి అని పోకస్ చేయరు. తమిళనాడులో నివాసం ఏర్పరుచుకోలేదే? నా మాతృభాష తెలుగు. మాకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉంది. షూటింగ్లుంటే చెన్నైకి వస్తాను. ఖాళీ దొరికితే నా సొంత ఊరు నాగపూర్‌కు వెళ్లతాను. ఇటీల పేరు మార్చుకున్నట్లున్నారు? సునైనా అన్నది అందరికీ తెలిసిన పేరు. అయితే న్యూమరాలజీ ప్రకారం అనూషగా మార్చుకున్నాను. అయినా ఆ పేరు అచ్చిరాలేదు. దీంతో మళ్లీ అసలు పేరుకు వచ్చేశాను. అయితే నా పేరు పక్కన ఆంగ్ల అక్షరం ఏను అదనంగా చేర్చుకున్నాను. సునైనా అనే పేరును ఇక మార్చుకునే ప్రసక్తే లేదు. ది దర్టిపిక్చర్, క్వీన్ లాంటి చిత్రాల్లో నటిస్తారా? ఎందుకు నటించను? నటించడానికి సిద్ధమైన తరువాత ఎలాంటి పాత్రనయినా చెయ్యగలననే నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ది దర్టిపిక్చర్, క్వీన్ లాంటి చిత్రాలు తమిళంలో తెరక్కెక్కడం మంచిదే. అలాంటి పాత్రలో నటించాలని ఎవరయినా అడిగితే అంతకంటే సంతోషం ఏముంటుంది? బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఇప్పుడూ నిజమే చెబుతున్నాను. ఇప్పుడు నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు. వెంటనే ఒకప్పుడుండేవారా? అతనెవరు? అని అడక్కండి. నేను కాదలిల్ విళుందేన్ (ప్రేమలో పడ్డాను) చిత్రంలో మాత్రమే నటించాను. ఎవర్నీ ప్రేమించలేదు. నిజంగా నన్ను నమ్మండి. -
'ఆ పని నాది కాదు'
తన సరసన నటించే హీరోయిన్లను తాను ఎంపిక చేయనని, ఆ పని దర్శక నిర్మాతలే చూసుకుంటారని యువ నటుడు విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. వైవిధ్యభరిత పాత్రలతో దూసుకుపోతున్న ఈ హీరో తాజా చిత్రం ఇదర్కుదానే ఆశైపట్టాయ్ ఇటీవల విడుదలై హిట్ టాక్ పొందింది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి పత్రికల వారితో శుక్రవారం భేటీ అయ్యూరు. నూతన అవకాశాలను నిరాకరిస్తున్నారట? నిజమే. ప్రస్తుతం నా చేతిలో ఏడెనిమిది చిత్రాలున్నాయి. ఇవి పూర్తి కావడానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టవచ్చు. మళ్లీ నూతన చిత్రాలను ఒప్పుకుని అప్పటి వరకు దర్శక నిర్మాతలను వేచి ఉండమనడం సరికాదు. అందువల్లనే కొత్త చిత్రాలను అంగీకరించడం లేదు. ఈ విషయాన్నే నిర్మాతలకు స్పష్టం చేస్తున్నాను. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల వివరాలు చెప్పరా? రమ్మీ, పణై్నయారుమ్ పద్మినియుమ్ చిత్రాల షూటింగ్ పూర్తియింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఇవి త్వరలో తెరపైకి రానున్నాయి. సుధాకర్ దర్శకత్వంలో సంగుదేవన్, శీను రామస్వామి దర్శకత్వంలో ఇదంపొరుల్ ఇవళ్, ఆనందకుమరేశన్ దర్శకత్వంలో సంతోష్‌కుమార్, ఎస్.పి.జననాథన్ దర్శకత్వంలో పురంబోక్కు, జయకృష్ణ దర్శకత్వంలో వన్మం, రంజిత్ దర్శకత్వం వహించే మెల్లిసై చిత్రాలు చేస్తున్నాను. అన్నీ మంచి పేరు తెస్తాయని భావిస్తున్నాను. ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సన్నివేశాలు ఏమీలేవే? అలాంటి సన్నివేశం పిజ్జా చిత్రంలో చోటు చేసుకుంది. అయితే అంతగా రొమాన్స్ సన్నివేశాలు లేకపోవడం అనేది నాకు లభించిన కథలే కారణం. ఏ హీరోయిన్‌తోనైనా జత కట్టాలని కోరుకుంటున్నారా? అలాంటి కోరికలేమీ లేవు. హీరోయిన్ల ఎంపికలో మీ ప్రమేయం ఎంత వరకు ఉంటుంది? ఇసుమంతా ఉండదు. నా చిత్రాల్లో హీరోయిన్ల ఎంపిక నిర్ణయం పూర్తిగా దర్శక నిర్మాతలదే. నటుడిగా మీ ఎదుగుదలకు కారణం ఎవరంటారు? కచ్చితంగా దర్శకులే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని నేను ఈ స్థాయికి రావడానికి దర్శకుల ప్రోత్సాహమే కారణం. ఇద్దరు హీరోల చిత్రాలలో నటించడం గురించి ఏమంటారు? నా పాత్ర బాగుంటే ఆ చిత్రంలో హీరోలు ఇద్దరా, ముగ్గురా అని పట్టించుకోను. ప్రస్తుతం ఆర్యతో కలిసి ఒక చిత్రం, విష్ణుతో మరో చిత్రం చేస్తున్నాను.