విజయ్‌ సేతుపతి 'సూపర్‌ డీలక్స్‌', ఆహాలో ఆరోజే రిలీజ్‌ | Super Deluxe Telugu Version To Be Streaming On AHA Very Soon | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: ఆహాలో 'సూపర్‌ డీలక్స్‌', అప్పటి నుంచే స్ట్రీమింగ్‌!

Published Tue, Jul 27 2021 8:05 PM | Last Updated on Tue, Jul 27 2021 8:10 PM

Super Deluxe Telugu Version To Be Streaming On AHA Very Soon - Sakshi

Super Deluxe: 'ఉప్పెన' సినిమాతో తెలుగులోనూ స్టార్‌ హోదా అందుకున్నాడు విజయ్‌ సేతుపతి. అప్పటి నుంచి వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడీ యాక్టర్‌. ఆయనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా 2019లో రిలీజైన తమిళ చిత్రం 'సంఘతమిజన్‌'ను 'విజయ్‌ సేతుపతి' అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తాజాగా అతడు నటించిన మరో హిట్‌ చిత్రాన్ని కూడా రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

విజయ్‌ సేతుపతి, సమంత, ఫహద్‌ ఫాజిల్‌, రమ్యకష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'సూపర్‌ డీలక్స్‌' తెలుగు డబ్బింగ్‌ మూవీ ఆగస్టు 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు పేర్కొంది. ఇందులో విజయ్‌ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌గా నటించగా రమ్యకృష్ణ పోర్న్‌ స్టార్‌గా, సమంత, ఫహద్‌ ఫాజిల్‌ భార్యాభర్తలుగా కనిపించారు. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement