
యథార్థ సంఘటనలతో కూడిన హర్రర్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు.
జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత వసంత బాలన్ సమర్పణలో డిమాన్ అనే చిత్రం రూపొందుతోంది. వండర్ బాయ్స్ పిక్చర్స్ పతాకంపై ఆర్ సోమసుందరం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేశ్ పళనీవేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన అంగాడి తెరు, అరవాన్, కావ్యతలైవన్, జైల్, ఇదర్కుదానా ఆశపట్టాయ్ బాల కుమారా, కాష్మోరా చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. ఇందులో నటుడు సచిన్, నటి అబర్నది జంటగా నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటనలతో కూడిన హర్రర్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు.
చిత్రం స్క్రీన్ పై ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుందని అన్నారు. పిజ్జా, రక్షకన్, పిశాచి వంటి చిత్రాల తరహాలో ఇది ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతుందన్నారు. చిత్రంలో కుంకీ అశ్విన్, రవీనా దహ, బిగ్ బాస్ ఫ్రేమ్ శతి పేరియసామి, మిప్పుసామి ప్రభాకరన్, అశోక్, ధరణి, నవ్య సుజి, సలీమా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రోనీ రఫెల్ సంగీతాన్ని, ఆర్‌ఎస్ ఆనంద్ కుమార్ చాయాగ్రహణంం అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం నటుడు విజయ్‌సేతుపతి దర్శకుడు మిష్కిన్ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపాయి.
Happy to launch #WindowBoysPictures #Demon First Look Poster.
— VijaySethupathi (@VijaySethuOffl) February 16, 2023
Congrats @dirramesh1603 & team.@Vasanthabalan1 @sachinmvm75 @abarnathi21 @Actor_Ashwin @suruthisamy8 @RaveenaDaha @anandakumardop @RonnieRaphael01 @EditorRavikumar @iamKarthikNetha @DoneChannel1 @CtcMediaboy pic.twitter.com/4U2CrC8rwI