చిరంజీవి ‘సైరా : నరసింహా రెడ్డి’ సినిమాతో తెలుగు చిత్రరంగానికి పరిచయం అవుతున్నారు విజయ్ సేతుపతి. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారాయన. తమిళ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్‌లో విజయ్ సేతుపతి ఒకరు. వరుస విజయాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఆయన. ‘సైరా’ తర్వాత మరో తెలుగు సినిమాలో సేతుపతి కనిపించనున్నారని టాక్. సుకుమార్, మైత్రీ సంస్థ నిర్మాణంలో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రకు విజయ్ సేతుపతి పేరుని పరిశీలిస్తున్నారట. మరి ఈ సినిమా అంగీకరించి, తెలుగులో విలన్‌గా మారాతారా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment