తమిళ స్టార్ విజయ్ సేతుపతికి తెలుగులో అవకాశాలు భారీగా వచ్చిపడుతున్నాయి. అయితే విజయ్‌కు వరుసపెట్టి విలన్ పాత్రలే వస్తుండటం విశేషం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా’లో రాజపాండి పాత్రతో విజయ్ సేతుపతి టాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో వస్తున్న ‘ఉప్పెన’ సినిమాలో విజయ్ నటిస్తన్నారు. ఈ సినిమాతో చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులోనూ విజయ్ విలన్ రోల్‌నే పోషిస్తున్నారు. మరోవైపు తమిళంలో భారీ బడ్జెట్ మూవీ ‘మాస్టర్’ చిత్రీకరణలో విజయ్ బిజీగా ఉన్నారు. ఇందులో తలపతి విజయ్ హీరోగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు. (బన్నీకి విలన్‌గా విజయ్ సేతుపతి!)
త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రానున్న సినిమాలోనూ విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ తెలుగులో మరోసారి విలన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ రాబోయే మూవీ ‘బాక్సర్’లో ప్రతినాయకుడి పాత్ర పోషించడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయం పై చిత్ర యూనిట్ కానీ వరుణ్ తేజ్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు వెంకటేష్, సిద్దు ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలోని బాక్సర్ పాత్ర కోసం వరుణ్ తేజ్ ప్రస్తుతం అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.
చదవండి : బాక్సింగ్‌కి సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment