ఉప్పెనలో ఉన్నాడు | Vijay Sethupathi walks out from Vaishnav Tej Uppena | Sakshi
Sakshi News home page

ఉప్పెనలో ఉన్నాడు

Published Fri, Aug 2 2019 12:35 AM | Last Updated on Fri, Aug 2 2019 12:35 AM

Vijay Sethupathi walks out from Vaishnav Tej Uppena - Sakshi

విజయ్‌ సేతుపతి

సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ‘ఉప్పెన’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మంగుళూరు బ్యూటీ కృతీశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళనటుడు విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్నారని ఫిల్మ్‌నగర్‌లో వినిపించిన వార్తల్లో నిజం లేదని తెలిసింది. ‘ఉప్పెన’ తాజా షెడ్యూల్‌ ఈ నెల 17న హైదరాబాద్‌లో మొదలు కానుంది. 19 నుంచి విజయ్‌ సేతుపతి సెట్‌లో జాయిన్‌ అవుతారని యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాకినాడ తీరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement