ముందు చిన్న చిరు.. తర్వాత పెద్ద చిరు | Chiranjeevi's Sye Raa Narasimha Reddy starts shooting | Sakshi
Sakshi News home page

ముందు చిన్న చిరు.. తర్వాత పెద్ద చిరు

Published Thu, Mar 15 2018 12:05 AM | Last Updated on Thu, Sep 19 2019 8:25 PM

Chiranjeevi's Sye Raa Narasimha Reddy starts shooting  - Sakshi

చిరంజీవి, నయనతార

అవును.. ముందు చిన్న చిరు ఎంటరయ్యాడు. తర్వాత పెద్ద చిరు సీన్లోకొచ్చారు. కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా? విషయం ఏంటంటే... చిరంజీవి హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సైరా’. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కాగా,  నరసింహారెడ్డి చిన్నప్పటి విశేషాలను కూడా సినిమాలో చూపిస్తారు. ఆ పాత్ర కోసం పలువురు బాలనటులను పరిశీలించగా, ముంబైకి చెందిన ఓ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ని ఎంపిక చేశారు. ఈ బాలుడు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ చిన్న చిరు క్యారెక్టర్‌ పూర్తయ్యాక పెద్ద చిరు ఈరోజు నుంచి ‘సైరా’ సెట్‌లోకి ఎంటరవుతున్నారు. ఈ రోజు నుండి రెండో షెడ్యూల్‌ను ఒక ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో జరుపుతారు. జస్ట్‌ చిరంజీవి ఎంట్రీ మాత్రమే కాదు.. ఈరోజు నయనతార కూడా ఈ సెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ షెడ్యూల్‌లో విజయ్‌ సేతుపతి తదితరులు పాల్గొంటారు. ఈ నెలాఖరున జరిగే షెడ్యూల్‌లో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పాల్గొంటారట. రెండు రోజుల చిత్రీకరణలో ఆయన పాల్గొంటారని సమాచారమ్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement