విజయ్ సేతుపతి.. పేరుకు తమిళ నటుడే అయినప్పటికీ తెలుగువారికి కూడా సుపరిచితుడే. తన సినిమాలు, నటనతో జనాలకు పూనకం తెప్పించే ఈయన తాజాగా బుల్లితెర మీద కూడా అలరించేందుకు సిద్ధమయ్యాడు. సన్ టీవీలో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ తమిళ్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు సన్ టీవీ ఇటీవలే ఓ ప్రోమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే మాస్టర్ చెఫ్ 13వ సీజన్‌లోని ఆస్ట్రేలియా సిరీస్ కోసం సేతుపతిని రప్పించేందుకు నిర్వాహకులు భారీ పారితోషికం ఆశ చూపారట.
ఇది తను సినిమా కోసం తీసుకునేదాని కన్నా ఎక్కువగా ఉండటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది ఎంత మొత్తం అనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఇక 2014లోనే సేతుపతి ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా అతడి పారితోషికం స్టార్ హీరోలతో సమానంగా ఉండే అవకాశం ఉంది. గతంలోనూ ఆయన ఇదే సన్ టీవీలో నామూరు హీరో అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇదిలా వుంటే విజయ్ సేతుపతి ప్రస్తుతం తుగ్లక్ దర్బార్, మామనితన్, లాభం చిత్రాలు చేస్తున్నాడు. మరోవైపు ఆయన నటించిన 'విజయ్ సేతుపతి' సినిమా ఆహాలో నేటి(మే 14) నుంచి ప్రసారం కానుంది.
உலக அளவில் புகழ்பெற்ற சமையல் கலையின் பிரம்மாண்ட ரியாலிட்டி நிகழ்ச்சி!
— Sun TV (@SunTV) May 9, 2021
விஜய் சேதுபதி அவர்களுடன்..
மாஸ்டர் செஃப் - தமிழ் | விரைவில்... #SunTV #MasterChef #MasterChefTamil #MasterChefOnSunTV pic.twitter.com/bHkL9HGunx
Comments
Please login to add a commentAdd a comment