Janhvi Kapoor: Watched Vijay Sethupathi Naanum Rowdy 100 Time - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: మీతో నటిస్తా, ఒక్క ఛాన్స్‌ ఇవ్వండని ఫోన్‌ చేస్తే ఆయన ఏమన్నాడంటే?

Published Tue, Dec 6 2022 7:17 PM | Last Updated on Tue, Dec 6 2022 8:21 PM

Janhvi Kapoor: Watched Vijay Sethupathi Naanum Rowdy 100 Times - Sakshi

ఆయనకు ఫోన్‌ చేసి సార్‌, మీకు పెద్ద అభిమానిని. మీతో కలిసి నటించాలని ఉంది. ఛాన్స్‌ ఇస్తే ఆడిషన్‌కు వస్తాను అని చెప్పాను. ఆయన మాత్రం అయ్యో.. అయ్యో.. అంటూ సరదాగా నవ్వారే తప్ప

దివంగత తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హిందీ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆమె సౌత్‌ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా? అని దక్షిణాది సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ఆమె జూనియర్‌ ఎన్టీఆర్‌, విజయ్‌ సేతుపతితో కలిసి నటించాలని ఉందని మనసులోని మాట బయటపెట్టింది. తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ విషయాన్ని వెల్లడించింది జాన్వీ.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విజయ్‌ సేతుపతి సర్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన నానుమ్‌ రౌడీ వందసార్లు చూశాను. తర్వాత ఓసారి ఆయనకు ఫోన్‌ చేసి సార్‌, మీకు పెద్ద అభిమానిని. మీతో కలిసి నటించాలని ఉంది. ఛాన్స్‌ ఇస్తే ఆడిషన్‌కు వస్తాను అని చెప్పాను. ఆయన మాత్రం అయ్యో.. అయ్యో.. అంటూ సరదాగా నవ్వారే తప్ప సమాధానమివ్వలేదు. ఆయన సిగ్గుపడుతున్నారో, ఇబ్బందిగా ఫీలయ్యారో అర్థం కాలేదు. కాకపోతే ఆయన ఆశ్చర్యపోయారని మాత్రం అర్థమైంది' అని చెప్పుకొచ్చింది జాన్వీ.

చదవండి: స్టేజీపై భార్యను పరిచయం చేసిన యంగ్‌ హీరో
రేవంత్‌ను ఎదిరించి మరీ గేమ్‌ ఆడిన శ్రీసత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement