రాశీ ఎక్స్‌ప్రెస్‌ | Rashi Khanna To Romance With Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

రాశీ ఎక్స్‌ప్రెస్‌

Published Thu, Jan 31 2019 1:46 AM | Last Updated on Thu, Jan 31 2019 1:46 AM

Rashi Khanna To Romance With Vijay Sethupathi - Sakshi

రాశీఖన్నా

గతేడాది విడుదలైన ‘ఇమైక్క నొడిగళ్‌’ చిత్రంతో తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు రాశీఖన్నా. ఈ చిత్రం విడుదల ఆలస్యం అయినా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘జయం’ రవితో చేసిన ‘అడంగామారు’ చిత్రం కూడా హిట్‌ సాధించింది. ప్రస్తుతం తెలుగు ‘టెంపర్‌’ రీమేక్‌లో విశాల్‌తో కలసి యాక్ట్‌ చేస్తున్నారు రాశి. ఇలా తమిళ జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది ఆమెకు. తాజాగా మరో తమిళ చిత్రంలో యాక్ట్‌ చేయడానికి అంగీకరించారీ భామ. తమిళ హాట్‌ ఫేవరెట్‌ విజయ్‌ సేతుపతి లేటెస్ట్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

విజయ్‌ చందర్‌ దర్శకుడు. ‘‘తమిళంలో నా అభిమాన నటుల్లో ఒకరైన విజయ్‌ సేతుపతి నెక్ట్స్‌ సిమిమాలో హీరోయిన్‌గా చేస్తున్నాను. కొత్త టీమ్‌తో పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మరికొన్ని అనౌన్స్‌మెంట్స్‌ కూడా త్వరలోనే చెబుతా’’ అని పేర్కొన్నారు రాశీఖన్నా. కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో రాశీ ఎక్స్‌ప్రెస్‌ సూపర్‌ ఫాస్ట్‌గా కదులుతోంది. ప్రస్తుతం చేస్తున్న ఈ రెండు సినిమాలు కూడా హిట్‌ అయితే తమిళంలో స్టార్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లోకి చేరిపోవడం ఖాయం. ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తున్నారు రాశీఖన్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement