VIP Reporter
-
వసతుల కల్పనకు కృషి
తణుకు : తణుకు పట్టణంలోని అజ్జరం రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ వాసులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. వారి అవస్థలను తెలుసుకునేందుకు మునిసిపల్ ఇన్చార్జి కమిషనర్ పి.శ్రీకాంత్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. కాలనీలోని వీధుల్లో తిరుగుతూ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ : ఇక్కడ ఇబ్బందులైమైనా ఉన్నాయా. వెంకటరమణ: మంచినీటి సమస్య ఉంది సార్. బోరు వేసినప్పటికీ ఈ నీళ్లు తాగేందుకు పనికి రావడం లేదు. నాలుగు కిలోమీటర్లు వెళ్లి నీళ్లు కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. కమిషనర్ : గోదావరి జలాలను తరలించే క్రమంలో పైప్లైన్ల విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించాం. పట్టణానికి ఈ ప్రాంతం చాలాదూరంగా ఉండటంతో విస్తరణకు కొన్నాళ్లు సమయం పడుతుంది. వెంకటరమణ : ఇక్కడ దాదాపు 600 కుటుంబాల వారుంటున్నారు. రేషన్ డిపో ఇక్కడ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. కమిషనర్ : ఈ విషయం ఎమ్మెల్యే దృష్టిలో ఉంది. త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. అక్కడి నుంచి మరో వీధిలోకి వెళ్లిన కమిషనర్ రమేష్ అనే వ్యక్తితో మాట్లాడారు. రమేష్ : కరెంటు సమస్య ఉంది సార్. సామర్థ్యానికి సరిపడా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి సమయాల్లో లైట్లు కాలిపోతున్నాయి. కమిషనర్ : రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. దుర్గాప్రసాద్ : బైపాస్ రోడ్డు నుంచి కాలనీ వరకు వీధి దీపాలు లేవు. రాత్రి సమయాల్లో రావడానికి భయపడుతున్నాం. కమిషనర్ : విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. అన్నపూర్ణ : ఇటీవల దోమల ఉధృతి పెరిగిపోవడంతో చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కమిషనర్ : దోమల నివారణకు తక్షణమే చర్యలు తీసుకుంటాను. రూ. 2 కోట్లతో పైప్‌లైన్ విస్తరణ ఇందిరమ్మ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాం. ప్రధానంగా తాగునీటి సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకుంటాం. గోదావరి జ లాలు సరఫరా చేసేందుకు పైపులైన్ల విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించాం. ఇందులో భాగంగా ఇంది రమ్మ కాలనీకి గోదావరి జలాలు తరలించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. దూరం అయినప్పటికీ ఇక్కడకు కూడా పైపులైన్లు విస్తరించి గోదావరి జలాలు అందిస్తాం. కాలనీలో రూ.28 లక్షలతో బీటీ రోడ్లు నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు చేశాం. ప్రస్తుతం రూ.10 లక్షలు వెచ్చించి గ్రావెల్‌తో మెరక చేయిస్తున్నాం. - పి.శ్రీకాంత్, ఇన్చార్జి కమిషనర్, తణుకు -
రోడ్డు భద్రతకే ప్రాధాన్యం
ఇటీవలి కాలంలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరగడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ప్రజలు చూస్తూనే ఉన్నారు. అలాంటి వార్తలు చదివిన ప్రతిసారీ ప్రజలకు రవాణా శాఖ పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలు ప్రజలకే కాదు మరో ముఖ్య వ్యక్తికీ ఉన్నాయి. ఆయనే జిల్లా ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) జే రమేష్‌కుమార్. తమ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలతో వ్యవహరించే తీరు, ప్రజలకు తమ శాఖ అందిస్తున్న సేవలు, అవి సక్రమంగా అందుతున్నాయా లేదా వంటి సందేహాలు ఆయన మనసును తొలుస్తున్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు ఆయనకు ఒక చక్కటి మార్గం దొరికింది. అదే ‘సాక్షి’ దినపత్రిక నిర్వహిస్తున్న వీఐపీ రిపోర్టర్. ఈ కార్యక్రమం ద్వారా ఆయన ఒక విలేకరిగా మారిపోయారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని వాహన చోదకులు నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా ఆరా తీశారు. తొలుత ఆయన తన కార్యాలయంలోని కౌంటర్ల వద్ద ఉన్న వ్యక్తులతో ఇలా సంభాషించారు.. డీటీసీ : మీ పేరేమిటి, ఏ పని మీద వచ్చారు. స్వర్ణ వెంకటేశ్వరరావు : సర్ నేను లెసైన్స్ రెన్యువల్ కోసం వచ్చాను. రెన్యువల్ చేశారు కానీ అన్ని పేర్లూ తప్పు వచ్చాయి. సరిచేయమంటే ఆ కాగితాలు తీసుకురా, ఈ కాగితాలు తీసుకురా అంటూ ఇప్పటికి ఎనిమిది సార్లు తిప్పారు. డీటీసీ : ఒకసారి మా ఏఓ గారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పండి, ఆయన పరిష్కరిస్తారు. అక్కడి నుంచి మెట్ల మీదుగా కి ందకి దిగి సిగ్నల్ వ్యవస్థపై అవగాహన కలిగించే ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక యువతితో డీటీసీ : ఏమ్మా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. డీ సునీత : ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేశాను సార్. టెస్ట్ పెట్టారు అది కూడా పూర్తి చేశాను. అక్కడే ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండీ అలీతో డీటీసీ : మీరు ఇక్కడ ఏ విధులు నిర్వహిస్తున్నారు ఎండీ అలీ : లెర్నింగ్ లెసైన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కల్పిస్తాం సార్ అలాగే లెసైన్స్‌లు ఇచ్చే ముందు వారికి పరీక్షలు నిర్వహించి సంతృప్తి చెందిన తరువాతే లై సెన్స్లు ఇస్తున్నాం సార్. అక్కడి నుంచి హెల్ప్ డెస్క్‌లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్ వద్దకు వెళ్లి డీటీసీ : ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నాయి కదా..వారికి సౌకర్యాలు కలిగించడానికి ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయాల్సి ఉందా అని ప్రశ్నించారు. పీఆర్ కిరణ్‌కుమార్ : ఇక్కడ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి సార్. ఏ పనిమీద వచ్చిన ప్రజలను ఆ పనికి సంబంధించిన సెక్షన్‌కు పంపుతున్నాం, వారి నుంచి ఫిర్యాదులేమీ లేవు. అక్కడి నుంచి నంబర్ ప్లేట్లు ఇస్తున్న కాంట్రాక్టర్ తాలూకు వ్యక్తి వద్దకు వచ్చి డీటీసీ : నంబర్ ప్లేట్లు ఎన్నిరోజులకు వస్తున్నాయి. మోహన్ : ప్లేట్లు 10 రోజులకు వస్తున్నాయి సార్. మామూలుగా నాలుగు రోజులకే రావాలి. ఆలస్యమౌతోంది. అక్కడే ఉన్న కానిస్టేబుల్‌తో ఇక్కడ అంతా సజావుగానే సాగుతోంది కదా అని ప్రశ్నించిన డీటీసీతో కానిస్టేబుల్ రామారావు : బాగానే ఉంది కానీ నంబర్ ప్లేట్ల లో నాణ్యత ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి సార్. డీటీసీ : మీరు ఏ పనిమీద వచ్చారు. వెంకటేశ్వరరావు : నేను ట్రాన్స్‌పోర్టు వాహనం జంగారెడ్డిగూడెం కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. నంబర్ ప్లేటు కోసం ఇక్కడికి రావలసి వచ్చింది. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగితే అక్కడే నంబర్ ప్లేటు వచ్చేలా ఏర్పాటు చేయండి సార్ అని అడిగాడు. అక్కడి నుంచి స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్దకు చేరుకున్న డీటీసీ ఆయన సిబ్బంది ఒక ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు విద్యార్థులను ఆపారు. డీటీసీ : ఏమయ్యా బైక్ ఎవరిది, లెసైన్స్ ఉందా, ముగ్గురు వెళ్లడం నేరమని తెలియదా? రాజేష్ : బైక్ మా నాన్నగారిది సార్ కాలేజీలో చిన్న పని ఉంటే చూసుకుని వెళదామని వచ్చాను. అక్కడ స్నేహితులు కలిస్తే వారిని ఎక్కించుకు వెళుతున్నాను. లెసైన్స్‌కు దరఖాస్తు చేసుకున్నాను. ఇంకా రాలేదు. అని చెప్పాడు. ఈ లోపు అటుగా వెళుతున్న మరో విద్యార్థిని డీటీసీ : ఆపి నీ వయసెంత, లెసైన్స్ ఉందా, మీ నాన్నగారు ఏమి చేస్తారు అని ప్రశ్నించారు. ప్రదీప్ : నేను ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాను సార్. మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. డీటీసీ : అటుగా వెళుతున్న జి.లహరి అనే బిఫార్మసీ విద్యార్థిని ఆపి ఏమ్మా మీకు లెసైన్స్, సీ బుక్, ఇన్సూరెన్సు ఉన్నాయా అని ప్రశ్నించగా ఆమె తన బండిలోని కాగితాలన్నీ చూపడంతో వెరీ గుడ్ మేము ఇప్పటి వరకూ చూసిన వాటిలో మొత్తం రికార్డులున్నది మీ ఒక్కరి దగ్గరే అందరూ మీలాగే ఉంటే మా పని తేలికౌతుంది. అంటూ ప్రశంసించారు. అనంతరం ఎం.బిందు అనే మహిళను ఆపి డీటీసీ : ఏమ్మా మీ బండి రికార్డులు, లెసైన్స్ చూపండి అని అడిగారు. దానికి ఆమె తనవద్ద ఏ రికార్డులూ లేవని తెలపడంతో మీరు ఏమి చేస్తారు అని ప్రశ్నించారు. తాను కాలేజిలో లెక్చరర్‌గా పనిచేస్తానని చెప్పడంతో విద్యార్థులకు అవగాహన కలిగించాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని సున్నితంగా మందలించారు. ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలి : డీటీసీ రవాణా శాఖ రహదారి భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. రోడ్డుపై తిరిగే ప్రతి వాహనం కండిషన్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాలు జరగకుండా ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. నిబంధనలకు విరుద్ధంగా వెళితే మహిళలకూ మినహాయింపు ఉండదు. మైనర్లు కూడా వాహనాలు నడిపేస్తున్నారు. లెసైన్సులు లేకుండా వాహనాలు నడిపితే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చాలామంది ఉన్నతోద్యోగులు, పోలీసుల పిల్లలు కూడా లెసైన్సులు లేకుండా రోడ్లపైకి వాహనాలను తీసుకువస్తున్నారు. ఇటువంటివి మరోసారి మా దృష్టిలో పడితే అటువంటి ఉద్యోగులకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగులిస్తాం. మైనర్లు ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులకు శిక్షపడేలా చట్టాలు రూపొందించాలి. లెసైన్స్‌లు తీసుకోవడంలో ఇబ్బందులుంటే నేరుగా నన్నే కలవవచ్చు. నంబర్ ప్లేట్ల విషయంలో నాణ్యత లేని విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఏజెన్సీని మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రవాణా వాహనాలు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అక్కడే నంబర్ ప్లేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. -
క్షీరా రామం..భక్తిధామం
పొలకొలనుగా.. క్షీరపురిగా విలసిల్లిన పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (పెదగోపురం) పంచారామ క్షేత్రాల్లో ఒకటి భాసిల్లుతోంది. క్షీరా రామలింగేశ్వరుడి పేరుతో ఇక్కడ కొలువైన పరమ శివుణ్ణి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. కార్తీక మాసంలో లక్షలాది మంది ఇక్కడి శివలింగాన్ని దర్శించి పునీతులవుతారు. గోదావరి నది సముద్రంలో సంగమించే నరసాపురం పట్టణం పాలకొల్లుకు అతి సమీపంలో ఉండటంతో పుష్కర యాత్రికులు క్షీరా రామలింగేశ్వరుడిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ పెదగోపురాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 లక్షలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో క్షీరపురిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ అర్చకులు, ఆలయ పరిధిలోని దుకాణాల యజమానుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చల్లపు సూర్యచంద్రరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. భక్తులు, అర్చుకులు, దుకాణాల యజమానులతో మాట్లాడారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది. ఈవో : అమ్మా.. నా పేరు సూర్యచంద్రరావు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. మీ సమస్యలేమిటో చెప్పండి. విజయలక్ష్మి, భక్తురాలు : ప్రతి సోమవారం స్వామికి ఇచ్చే పంచ హారతులను దర్శించుకునే భాగ్యం కేవలం ముందు వరుసలో భక్తులకు మాత్రమే కలుగుతోంది. ఆలయానికి వచ్చే వారందరికీ పంచహారతులు దర్శించుకోవడానికి అవకాశం కల్పించండి. ఈవో : మంచి సూచన చేశారు. వచ్చే సోమవారం నుంచి భక్తులందరికీ పంచహారతుల దర్శన భాగ్యం కల్పిస్తాం. ఆదిమూల నాగేశ్వరరావు, భక్తుడు : నమస్కారమండీ. ఆలయం ముందు దుకాణాలు పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అయినా స్పందన లేదు. ఈవో : నిజమే కొద్దిరోజులుగా సమస్య తీవ్రమైంది. దుకాణాలున్న ప్రాంతం మునిసిపాలిటీది కావడం వల్ల మునిసిపల్ కమిషనర్‌కి లేఖ రాశాం. ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే. లింగం సత్యనారాయణ, భక్తుడు : మాది పూలపల్లి. పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం ఆలయ పరిసరాల్లో లేదు. గుడికి దగ్గరలో పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. ఈవో : పుష్కరాల నేపథ్యంలో దేవుని హాలును అభివృద్ధి చేస్తున్నాం. రూ.35 లక్షలతో నిర్మించే అభిషేకాల మండపం దిగువ భాగంలో పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తాం. నీలకంఠేశ్వరి, భక్తురాలు : పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు విశ్రాంతి తీసుకోవడానికి సరైన సదుపాయం లేదు. దూర ప్రాంత భక్తులు స్వామి దర్శనానంతరం కొద్దిసేపు సేదతీరే అవకాశం ఆలయ పరిసరాల్లో కల్పించాలి. ఈవో : పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా అభిషేకాల మండపం నిర్మిస్తున్నాం. దీంట్లో భక్తులు సేదతీరే వీలుంటుంది. మార్కండేయులు, భక్తుడు : నిత్యం గుడిలోనే ఉంటా. గర్భగుడిలో వీఐపీల పేరుతో కొంతమందికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. దీనివల్ల సామాన్య భక్తులు దర్శన భాగ్యం కోసం గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఈవో : కార్తీక మాసం, పర్వ దినాల్లో ఈ సమస్య తలెత్తుతోంది. గర్భగుడి లో అభిషేకాలను ఇకనుంచి చేయని వ్వం. అభిషేకాల కోసం పుష్కర నిధులతో ప్రత్యేక మండపం నిర్మిస్తున్నాం. ఎస్.గణపతి, భక్తుడు : ఈవో గారూ. పుష్కరాల సందర్భంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నసమారాధన చేయాలి. అవసరమైతే మైకుల్లో ప్రచారం చేయండి. భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయండి. సాధారణ రోజుల్లో ప్రతి సోమవారం భక్తులకు అన్నసమారాధన చేయించండి. ఈవో : మంచి సూచన చేశారు. ఇకనుంచి ముందు పట్టణేతరులకు టోకెన్లు ఇచ్చి ఆ తరువాత మిగిలితే స్థానికులకు భోజనం పెట్టే ఏర్పాటు చేస్తాం. అనంతరం ఈవో సూర్యచంద్రరావు పురోహితుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈవో : అర్చక స్వాములూ.. మీ సమస్యలేమిటో చెప్పండి. కోట నాగబాబు, పురోహితుడు : మాకంటూ ప్రత్యేకంగా సమస్యలు లేవు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నివిధాలా సేవలందిస్తాం. పుష్కర సమయాల్లో అరగంట మాత్రమే విశ్రాంతి ఇస్తాం. మద్దూరి సూర్యనారాయణమూర్తి, పురోహితుడు : గత పుష్కరాల్లో పురోహితులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈ పుష్కరాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కోరుతున్నాం. ఈవో : ఈ విషయమై శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశాం. తప్పనిసరిగా పురోహితులందరికీ గుర్తింపు కార్డులిచ్చే ఏర్పాట్లు చేస్తాం. అనంతరం ఆలయానికి చెందిన షాపులను లీజుకు తీసుకు వ్యాపారాలు చేస్తున్న వారితో ఈవో మాట్లాడారు. వివిధ సమస్యలను వ్యాపారులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి సంబంధించి 42 షాపులు ఉన్నాయని, తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో షాపుల్లో పనిచేసే గుమాస్తాలు, యజమానులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. వీటిలో నీటి సౌకర్యం లేదని, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. పుష్కర నిధులతో మరుగుదొడ్లకు మరమ్మతులు చేస్తున్నామని ఈవో సమాధానమిచ్చారు. స్థలాభావం వల్ల అదనపు మరుగుదొడ్లు నిర్మించే అవకాశం లేదన్నారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పుష్కర యాత్రికులకు సమస్యలు రానివ్వం పుష్కర యాత్రికులకు ఎలాంటి సమస్యలు రానివ్వం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పుష్కర యాత్రికుల కోసం 12 రోజులపాటు పట్టణంలోని అన్నసమారాధన సత్రాల సహకారంతో మెయిన్ రోడ్డులోని రేపాక వారి సత్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. భక్తుల విశ్రాంతి కోసం అన్నదాన సత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు భక్తుల సౌకర్యాల కోసం ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు రూ.85 లక్షలు మంజూరు చేయించారు. రూ.50 లక్షలతో ఆలయానికి రంగులు, వైరింగ్ మరమ్మతులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేయిస్తున్నాం. మరో రూ.35 లక్షలతో అభిషేక మండపాల నిర్మిస్తున్నాం. ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తవుతాయి. - చల్లపు సూర్యచంద్రరావు, ఈవో -
ఆత్మస్థైర్యమే వజ్రాయుధం
పి.సౌమ్యలత. డీఎస్పీగా నరసాపురంలో తొలి పోస్టింగ్. పోలీస్ సబ్ డివిజన్ అధికారిగా శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కీలక బాధ్యతలు ఆమెపైనే ఉన్నాయి. విధుల్లో చేరినప్పుడే మహిళల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పిన ఆమె అక్కడితో ఆగిపోలేదు. ఆ దిశగా ఆచరణ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ‘సాక్షి’ వీఐపీగా రిపోర్టర్‌గా నరసాపురం మండలం సీతారామపురంలోని లేసు పార్కులో పనిచేస్తున్న మహిళల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటలపాటు లేసు పార్కులో పనిచేసే మహిళలతో మమేకమై వారి బాధలను, కష్టాలను, సమస్యలను తెలుసుకున్నారు. చట్టాలపై వారికి అవగాహన ఉందా లేదా, కష్టమొస్తే పోలీసులు ఉన్నారన్న విషయం తెలుసా లేదా అన్న విషయాలను ఆరా తీశారు. మహిళలకు ఆత్మస్థైర్యమే వజ్రాయుధమని, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే అందలం ఎక్కవచ్చని సాటి మహిళగా అక్కడి మహిళలకు బోధించారు. వీఐపీ రిపోర్టర్ విశేషాలు ఇలా... డీఎస్పీ : నా పేరు సౌమ్యలత. నరసాపురం డీఎస్పీగా ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టాను. మిమ్మల్ని కలుసుకోవాలని, మీ ఇబ్బందులు తెలుసుకోవాలని.. పోలీస్ శాఖ పరంగా ఏదైనా సహాయం చేయగలనా అనే విషయాలను తెలుసుకోవడానికి వచ్చాను. లేస్ పార్క్ విశేషాలు చెబుతారా. పడవల మంగతాయారు, ఇన్స్ట్రక్టర్ : నమస్తే మేడమ్. నేను ఇక్కడ కుట్టు అల్లికలకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్న వారికి ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం మా సెక్షన్లో 40 మంది శిక్షణ పొందుతున్నారు. రెండు నెలల పాటు శిక్షణ ఉంటుంది. లేసు అల్లికలు, డిజైన్లలో శిక్షణ ఇస్తాం. డీఎస్పీ : శిక్షణ అనంతరం ఎలాంటి ఉపాధి దొరుకుతుంది. పి. కరుణకృప, కె.అనూష, కె.లక్ష్మీ సరస్వతి : మేడమ్. మేం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాం. శిక్షణ అనంతరం లేసు అల్లికల్లో నైపుణ్యత వస్తుంది. విదేశాలకు ఎగుమతి అయ్యే లేసులను అల్లుతాం. మాకు నెలలో ఒక్కొక్కరికీ రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు ఆదాయం వస్తుంది. డీఎస్పీ : మీరంతా ఎక్కడెక్కడినుంచి వచ్చారు. దూరం నుంచి వచ్చే సందర్భంలో మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా దేశింశెట్టి రమాదుర్గ, పులపర్తి లక్ష్మీకాంతం, సీహెచ్ విజయలక్ష్మి : బస్సుల్లోను, ఆటోల్లోను ప్రయాణం చేసి రావాలి. కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు. అయితే ఈప్రాంతంలో మరీ ఇబ్బందికర పరిస్థితులు లేవు. సమాజంలో మహిళల విషయంలో ఇంకా మార్పు రావాలి. డీఎస్పీ : మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు గురించి మీకేమైనా అవగాహన ఉందా. హేమలత : మహిళల కోసం ఏవో కొన్ని చట్టాలు ఉన్నాయని మాత్రం తెలుసు. కానీ అవేమిటో పూర్తిగా తెలియదు. ఏదైనా కష్టమొస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలుసు. దీంతో డీఎస్పీ సౌమ్యలత మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలను గురించి వారికి వివరించారు. ఇటీవల అమల్లోకి వచ్చిన నిర్భయ చట్టంపై అవగాహన కల్పించారు. గృహహింస, ఈవ్‌టీజింగ్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలన్నది వివరించారు. నరసాపురం డివిజన్ పరిధిలోని మహిళలకు ఏమైనా ఇబ్బందులుంటే.. పోలీస్ శాఖ ద్వారా పరిష్కరించగలిగేవి అయితే వెంటనే తనకు చెప్పాలని సూచించారు. సమస్యలొచ్చినప్పుడు ఏ సమయంలోనైనా తన సెల్ నంబర్ 94407 96615కు ఫోన్ చేయాలని సూచించారు. -
అద్దె భవనాలు...ఇరుకు గదులు
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే ధ్యేయంతో జిల్లాలో ఏర్పాటైన 3,700(మినీ కేంద్రాలతో కలిపి) అంగన్వాడీ కేంద్రాల్లో చాలా కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తోంది. చాలా కేంద్రాలు ఇరుకు గదుల్లోను, 80 శాతం అద్దె భవనాల్లోనూ నడుస్తున్నాయి. కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ ఎఈ.రాబర్ట్స్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. పట్టణంలోని పలు కేంద్రాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో ఆటలాడించి, పాటలు పాడించారు. కేంద్రాల్లో సమస్యలు గురించి తెలుసుకున్నారు. పీడీ ఏమన్నారంటే సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించాను. వాటిలో కొన్ని సమస్యలను గుర్తించాను. ప్రధానంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం, గర్భిణుల్లో రక్తహీనత ఉన్నట్టు అర్థమైంది. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారికి అదనపు ఆహారాన్ని ఇస్తున్నాం. రక్తం తక్కువగా ఉన్న గర్భిణులను గుర్తించి వారికి కూడా అదనపు పౌష్టికాహారాన్ని , ఐరన్ మాత్రలను అందిస్తున్నాం. అధిక శాతం కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న భవనాల్లోకి మార్చడానికి కృషి చేస్తాను. మొదట పట్టణంలోని కొణిసి వీధిలో గల అంగన్వాడీ కేంద్రాన్ని పీడీ సందర్శించారు. అక్కడ సంభాషణ ఇలా సాగింది. పీడీ రాబర్ట్స్: అమ్మా మీపేరేంటి, ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఏఎన్ఎం సత్యవతి: సార్ నాపేరు సత్యవతి నేను ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. ఇమ్యునైజేషన్ చేయడానికి వచ్చాను. రాబర్ట్స్: ఎవరెవరికి టీకాలు వేస్తారు? సత్యవతి: గర్భిణులు, పిల్లలకు టీకాలు వేస్తాం. పీడీ రాబర్ట్స్: అమ్మా నీ పేరేంటి, ఎన్ని సంవత్సరాలు నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ? అంగన్వాడీ కార్యకర్త: సార్ నాపేరు ప్రసన్న. నేను ఐదు సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. పీడీ రాబర్ట్స్: ఎంతమంది పిల్లలు మీ కేంద్రంలో నమోదు అయ్యారు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ప్రసన్న: మా కేంద్రంలో 29 మంది పిల్లలు నమోదు అయ్యారు సార్, ప్రస్తుతం 20 మంది పిల్లలు వచ్చారు పీడీ రాబర్ట్స్: పిల్లలకు ఏం పెడుతున్నారు?, పిల్లల బరువు తూస్తున్నారా ? ప్రసన్న: ప్రతీ రోజు భోజనం, వారంలో నాలుగు పర్యాయాలు గుడ్లు పెడుతున్నాం, పిల్లలు అందరికీ బరువు తూస్తున్నాం పీడీ రాబర్ట్స్: పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలు ఎంతమంది ఉన్నారు?, వారికి అదనంగా ఆహారం అందచేస్తున్నారా ? ప్రసన్న: ఒకరే ఉన్నారు. సాధారణ పిల్లలు కంటే అదనంగా పౌష్టికాహారం అందజేస్తున్నాను. సాధారణ పిల్లలకు నాలుగు గుడ్లు ఇస్తే, వీరికి ఆరు గుడ్లు ఇస్తాం. పీడీ రాబర్ట్స్: మీకేమైనా సమస్యలున్నాయా? ప్రసన్న: అద్దె భవనం కావడం వల్ల ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ భనవం గాని, స్కూలు భవనం గాని ఇప్పించాలి. పీడీ రాబర్ట్స్: మునిపల్ కమిషనర్‌తో మాట్లాడి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న భవనాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. పీడీ రాబర్ట్స్: సీడీపీఓ, సూపర్వైజర్ పర్యవేక్షణకు వస్తున్నారా?, బాల్యవివాహాలపై ప్రచారం చేస్తున్నారా ? ప్రసన్న: వస్తున్నారు సార్, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వాటి వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నాం సార్ పీడీ రాబర్ట్స్: ఏమ్మా నీపేరేంటి,అంగన్ వాడీ కేంద్రానికి ఎందుకు వచ్చావు? బాలింత : సార్ నాపేరు గాయత్రి. మా బాబుకి టీకాలు వేయించడానికి వచ్చాను. పీడీ రాబర్ట్స్ : మీ బాబు బరువు తూస్తున్నారా ? , మీ బాబు పుట్టినప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాడు? గాయత్రి: తూనిక వేస్తున్నారు. మా బాబు పుట్టినప్పుడు రెండున్నర కేజీలు ఉన్నాడు సార్. పీడీ రాబర్ట్స్ : పాప నీపేరేంటి, నీకు గుడ్లు ఇస్తున్నారా, రుచికరంగా ఉంటున్నాయా ? అంగన్వాడీ సెంటర్ విద్యార్థిని: నాపేరు నందిని సార్. గుడ్లు పెడుతున్నారు. గుడ్డు బాగుంటుంది. పీడీ రాబర్ట్స్: ఆటలు ఆడిస్తున్నారా? నందిని: ఆడిస్తున్నారు సార్ పీడీ రాబర్ట్స్: ఏమ్మా నీపేరేంటి , ఎందుకు వచ్చావు? గర్భిణి: సార్ నాపేరు అమీబి. టీకాలు వేయించుకోవడానికి వచ్చాను. పీడీ రాబర్ట్స్: ఎంసీహెచ్ కార్డు ఇచ్చారా, కార్డులో ఏఏ వివరాలు ఉన్నాయి? అమీబి: ఇచ్చార్ సార్. కార్డులో ఏ నెలలో ఏ టీకాలు వేసుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న వివరాలు ఉన్నాయి. పీడీ రాబర్ట్స్: అమ్మా మీపేరేంటి, ఏం చేస్తుంటారు ? పట్టణ సీడీపీఓ : సార్ నా పేరు రాజరాజేశ్వరి. నేను పట్ణణ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓగా పనిచేస్తున్నాను. పీడీ రాబర్ట్స్: నెలలో ఎన్నిసార్లు కేంద్రాలను పర్యవేక్షిస్తారు, మీ పరిధిలో ఎంతమంది సూపర్వైజర్లు ఉన్నారు? రాజరాజేశ్వరి: నెలలో 20 రోజులు కేంద్రాలను పర్యవేక్షిస్తాం సార్, నా పరిధిలో నలుగురు సూపర్వైజర్లు ఉన్నారు. పీడీ రాబర్ట్స్: పట్టణ పరిధిలో పౌష్టికాహార లోపంతో ఎందమంది బాధపడుతున్నారు? రాజరాజేశ్వరి : 154 మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు సర్. పీడీ రాబర్ట్స్: వీరిని సాధారణ స్థితికి తేవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాజరాజేశ్వరి: పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలును సాధారణ స్థితికి తేవాడానికిఅదనపు పౌష్టికాహారాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా ఐరన్ మాత్రలు అందిస్తున్నాం,. పీడీ రాబర్ట్స్: అమ్మా నీ పేరేంటి, అంగన్వాడీ కేంద్రానికి ఎందుకు వచ్చావు? బాలింత : సార్ నాపేరు షకీనా. మా పాపకు టీకాలు వేయించడానికి వచ్చాను. పీడీ రాబర్ట్స్: పుట్టిన ఎంత సేపటికి తల్లిపాలు తాగించాలి? షకీనా: పుట్టిన గంట లోపు తల్లిపాలు తాగించాలి. పీడీ రాబర్ట్స్: మీపేరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? సూపర్వైజర్ : సార్ నాసేరు కుసుమకుమారి. నేను 11 సంవత్సరాలుగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. పీడీ రాబర్ట్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు తీసుకున్నారు కదా, ఏయే సేవలకు అవార్డు ఇచ్చారు? కుసమకుమారి: బాల్య వివాహాలను నిలుపుదల చేసినందుకుగాను, పౌష్టికాహారలోపాన్ని నివారించినందుకు గాను అవార్డు ఇచ్చారు పీడీ రాబర్ట్స్: మరుగుదొడ్ల వినియోగం ఏవిధంగా ఉంది? కుసమకుమారి: మరుగుదొడ్ల వినియోగం బాగానే ఉంది. అనంతరం బూడివీధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పీడీ సందర్శించారు పీడీ రాబర్ట్స్: అమ్మా నీపేరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు? అంగన్వాడీ కార్యకర్త : సార్ నాపేరు రమాదేవి. నేను 11 సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. పీడీ రాబర్ట్స్: ఎంతమంది పిల్లలు నమోదయ్యారు, ఎంతమంది వచ్చారు? రమాదేవి: 22 మంది పిల్లలకు గాను 18 మంది పిల్లలు వచ్చారు సార్. పీడీ రాబర్ట్స్: మిగతా నలుగురు పిల్లలు ఎందుకు రావడం లేదు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారా? రమాదేవి: ఒకో రోజు వస్తున్నారు. ఒకోరోజు రావడం లేదు. పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను. పీడీ రాబర్ట్స్: గృహ సందర్శనకు వెళుతున్నారా ? రమాదేవి: గృహ సందర్శనకు వెళుతున్నాను సార్, గర్భస్థ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నాం. పీడీ రాబర్ట్స్: అమ్మా నీపేరేంటి, మీ వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని రోజూ తెరుస్తున్నారా ? బాలింత : సార్ నాపేరు సునీత, మా వీధిలో అంగన్వాడీ కేంద్రం రోజూ తీస్తున్నారు సార్. పీడీ రాబర్ట్స్: పౌష్టికాహారాన్ని పూర్తి స్థాయిలో ఇస్తున్నారా, లేక కోత విధిస్తున్నారా? సునీత: పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. కోత విధించడం లేదు. పీడీ రాబర్ట్స్: మీపేరేంటి టీకాలు సకాలంలో వేస్తున్నారా? గర్భిణి : సార్ నాపేరు రమాదేవి. టీకాలు సకాలంలో వేస్తున్నారు పీడీ రాబర్ట్స్: పౌష్టికాహారం కేంద్రంలో ఇస్తున్నారా, ఇంటికి ఇస్తున్నారా? రమాదేవి: కేంద్రంలోనే పెడుతున్నారు. -
పాల ఉత్పత్తి పెంచుతాం..
పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, దూడల సంరక్షణ, కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి దూడల అభివృద్ధికి కృషి చేయడం పశు సంవర్ధక శాఖ విధి. ఆ శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి వీటితో పాటు పశుగ్రాసాల సాగు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు దరి చేరకుండా ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నారు. పథకాల అమలును పారదర్శకంగా నిర్వహిస్తూ.. పశు సంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. పశువైద్య శాలలకు సొంత భవనాలు నిర్మించడంలో విజయవంతం అయ్యారు. ఆయన ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారి పశు సంపదకు, పాల ఉత్పత్తికి పెట్టింది పేరైన కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో పశుపోషణ, పాల ఉత్పత్తిలో మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పశు సంపదను రక్షించడం, పాల ఉత్పత్తిని పెంచడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. జేడీ: ఏమ్మా..! అందరూ బాగున్నారా.. పశు పోషణ, పాల ఉత్పత్తి ఎలా ఉంది ? మహిళలు : బాగున్నాం సార్.. పశుపోషణ బాగుంది. ఇప్పటి వరకు పాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంది. మాకు ప్రధాన ఆధారం పాడి పరిశ్రమనే. జేడీ : అమ్మా నీ పేరు ఏమిటి? సమస్య ఉందా? మహిళ: సార్ నా పేరు సకినాబీ. కొద్ది రోజులుగా మా దూడల కళ్ల నుంచి ఒకటే నీళ్లు కారుతున్నాయి. ఏమైనా అనారోగ్యమా? జేడీ : వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కళ్లలో నీరు కారుతాయి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ చికిత్స చేయిస్తాం. ధనలక్ష్మి : సార్.. మేము రెయిన్బో రకం కోళ్లు పెంచుకుంటున్నాం. గుడ్లు బాగా పెడుతున్నాయి. కోళ్లు గుడ్లను పొదగడం లేదు. జేడీ : రెయిన్బో కోళ్లు గుడ్లు ఎక్కువగా పెడతాయి. అయితే అవి పొదగవు. వాటిని నాటుకోళ్ల ద్వారా పొదిగించవచ్చు. ఈ కోళ్లు ఎక్కువ బరువు వస్తాయి. మాంసానికి, గుడ్లకు రెండింటికి ఉపయోగపడుతాయి. ధనలక్ష్మి : కోళ్లకు ఏఏ రోగాలు వస్తాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? జేడీ : ప్రతి కుటుంబంలో పాడి-పంట ఉండాలి. దీనికి కోళ్ల పెంపకం ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. కోళ్లకు మసూచి, కొక్కెర తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. వీటికి కూడా టీకాలు వేస్తాం. పెరటి కోళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది. పద్మావతమ్మ : సార్ పాల ప్రగతి కేంద్రాల కింద తమిళనాడు నుంచి పాడి గేదెలు తెచ్చి ఇచ్చారు. ఇవి చూలు కట్టడం లేదు.. జేడీ : చూలు కట్టకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. గర్భకోశ సమస్యలతో చూలు కట్టకపోయే ప్రమాదం ఉంది. మీ గ్రామంలో ప్రత్యేకంగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించి గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయిస్తాం. మహిళ : సార్..నా పేరు లతీఫాబీ. దూడ చనిపోయింది. ఇందువల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయింది. కంతులు కట్టడం కష్టంగా ఉంది. జేడీ : దూడ లేకపోయినా పశు పోషణకు ఇబ్బంది లేదు. అయితే పచ్చిమేత, దాణా తగినంత ఇవ్వాలి. అప్పుడు యథావిధిగా పాలు ఇస్తాయి. దూడల పరిరక్షణకు సునందిని పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనివల్ల దూడల మరణాలను తగ్గించవచ్చు. తిప్పన్న : సార్, మా గ్రామంలో గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలంలో ఎక్కువగా చనిపోతున్నాయి. గొర్రెలకు రాత్రి బస షెడ్లు ఏర్పరచాలి. జేడీ : వర్షాకాలంలో గొర్రెలు తడుస్తుండటం, కలుషితమైన మేత తినడం, నీరు తాగడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించుకోవాలి. అప్పుడు చనిపోయినా పరిహారం లభిస్తుంది. గొర్రెలకు సామూహిక బీమా పథకం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. గొర్రెలకు రాత్రి బస షెల్టర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. రాముడు : సార్, గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఈ దిశగా చర్యలు తీసుకోండి. జేడీ : గొర్రెలకు అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నాం. ప్రస్తుతం పీపీఆర్ వ్యాక్సిన్ వేయడం జరుగుతోంది. కొత్తగా పుట్టిన జీవాలు, ఆరు నెలల క్రితం వేయని జీవాలకు ఈ వ్యాక్సిన్ వేయించాలి. నట్టల నివారణ మందు కూడా ఉచితంగా తాపుతున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీటీసీ సభ్యుడు శేఖర్ : సార్.. మా గ్రామం పశు సంపదకు నిలయం. కానీ గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. పాడి పశువు పేయి కడగడానికి, వాటికి నీళ్లు తాపడానికి దూరం మంచినీళ్లు తెచ్చుకోవాల్సి ఉంది. నీటి సమస్యను తీర్చాలి. జేడీ: పశు పోషణలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. పశువులు పరిశుభ్రంగా ఉంటేనే పాలు పరిశుభ్రంగా ఉంటాయి. అయితే నీటి సమస్య పరిష్కారం మా చేతిలో లేదు. అయినప్పటికీ నీటి సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఎంపీటీసీ సభ్యుడు : సార్.. మహిళలకు పాడి గేదెలు ఇచ్చి వారి అభ్యున్నతికి దోహదపడ్డారు. ఎద్దుల బండ్లు ఇస్తే సౌకర్యంగా ఉంటుంది. చెరువులో నీళ్లు ఉన్నాయి. ఎద్దుల బండ్ల ద్వారా డ్రమ్ముల్లో తెచ్చుకోవచ్చు. జేడీ : ఎద్దుల బండ్లు ఇవ్వడం కూడా పశుసంవర్ధక శాఖ చేపట్టడం లేదు. వీటిని సబ్సిడీపైన వ్యవసాయ శాఖ పంపిణీ చేస్తోంది. అవసరమైన వారికి ఎద్దుల బండ్లను వ్యవసాయ శాఖ జేడీ దృష్టికి తీసుకెళ్లి పంపిణీ చేసే విధంగా చూస్తాం. జేడీ : ఏమ్మా.. పాల ఉత్పత్తి అధికంగా ఉంది కదా.. వీటికి మార్కెటింగ్ ఉందా ? జుబేదాబీ : సార్.. గ్రామం పాలకోవకు ప్రసిద్ధి. ఇక్కడ ఉత్పత్తి చేసిన కోవాను వివిధ ప్రాంతాలకు తరలిస్తాం. ఉత్పత్తి అయిన పాలను బయటికి అమ్మం. కోవకు వినియోగిస్తాం. వచ్చిన పాలకోవకు వినియోగిస్తుండటం వల్ల పాలకు మంచి ధర వచ్చినట్లు అవుతోంది. జేడీ : పాడి పశువులకు అజొల్లా మంచి పోషక విలువతో కూడిన దాణాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల దాణా ఖర్చు తగ్గుతుంది. అజొల్లా యూనిట్లను సబ్సీడీపై ఇస్తున్నాం. వినియోగించుకున్నారా ? ధనలక్ష్మి : సార్... చిన్న టేకూరు పశువైద్యాధికారి నాగరాజు అజొల్లా యూనిట్ల గురించి చెప్పారు. వాటిని వినియోగించుకున్నాం. ఇదిగో అజొల్లాను చూడండి. దీనిని దాణాలో కలిపి పాడి పశువులకు ఇస్తాం. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతోంది. వెన్నశాతం కూడా పెరిగింది. జేడీ : ఏమ్మా నీ పేరేంటి?ఈ బర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా పోషిస్తున్నారు? మహిళ : సార్, నా పేరు జుబేదాబేగం. మేము స్వయం సహాయక సంఘాల్లో రాణిస్తున్నాం. మా గ్రామానికి డీఆర్డీఏ ద్వారా 15 గ్రూపులకు పాల ప్రగతి కేంద్రాలు మంజూరు చేశారు. ఒకసారి 5, మరోసారి 3 గ్రేడెడ్ ముర్రా జాతి పాడి గేదెలు మంజూరు చేశారు. జేడీ : మరి వీటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన ఉందా? పచ్చిమేత ఇస్తున్నారా? గేదెలకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారా? జూబేదాబేగం : సార్.. ఈ గేదెలను తమిళనాడులో కొని మాకు పంపిణీ చేశారు. మొదట ఇవి ఈ వాతావరణానికి అనువుగా ఉంటాయో లేదోనని భయపడ్డాం. కానీ కొద్ది రోజుల్లోనే అలవాటు పడ్డాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఏపీబీఎన్ గడ్డిని పెంచుతున్నాం. అజొల్లాను కూడా పెంచుతూ దాన్ని దాణాలో కలిపి ఇస్తున్నాం. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నాం. పశువుల్లో ఏమైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే చిన్న టేకూరు పశువైద్యాధికారికి చెబుతాం. వెంటనే వచ్చి చికిత్స చేస్తున్నారు. జేడీ : పశుగ్రాసం వృథా చేసుకోకుండా ఉండేందుకు చాప్ కట్టర్లు ఇస్తున్నాం. మీరు తీసుకున్నారా ? చంద్రకళ : తీసుకున్నాం సార్... యూనిట్ కాస్ట్ రూ.26 వేలు అయితే 50 శాతం సబ్సిడీతో తీసుకున్నాం. పశుగ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వినియోగిస్తున్నాం. ఇందువల్ల పశుగ్రాసం దుర్వినియోగం కావడం లేదు. ధనలక్ష్మి : కొన్ని పాడి గేదెల్లో ఎద లక్షణాలు కనిపించడం లేదు. ఇందువల్ల ఈతకు ఎడం పెరుగుతోంది. జేడీ : గేదెల్లో ఎద లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు దాదాపు 48 గంటలు ఉంటాయి. కొన్ని పశువులో మూగ ఎద లక్షణాలు ఉంటాయి. వీటిని గుర్తించడం కష్టం. ఎద లక్షణాలు కనిపించిన 12 గంటల తర్వాత కృత్రిమ గర్భధారణ సూది వేయించాలి. జేడీ : సునందిని, క్షీర సాగర్ పథకాల గురించి తెలుసా...? మహిళలు : తెలుసు సార్.. మా డాక్టరు వీటి గురించి చెప్పారు. జేడీ: సునందిని పథకం దూడలకు ఉద్దేశించింది. యూనిట్ కాస్ట్ రూ.5 వేలు. ఇందులో లబ్ధిదారుని వాటా రూ.950 ఉంటుంది. దూడలకు మూడు విడతలుగా 237 కిలో దాణా ఇస్తాం. దూడలకు బీమా సౌకర్యం ఉంది. దీనివల్ల దూడలు త్వరగా పెరుగుతాయి. అదే విధంగా క్షీరసాగర్ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనివల్ల చాల ఉపయోగలు ఉన్నాయి. వీటిని వినియోగించుకోవాలి. మహిళలు : జీవనాధారం కోసం పొట్టేళ్లు, గొర్రెల యూనిట్లు కావాలి. సార్.. ఇప్పించండి.? జేడీ : పొట్టేళ్ల యూనిట్ల గొర్రెల యూనిట్ పంపిణీ చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చినప్పుడు తప్పకుండా ప్రాధాన్యం ఇస్తాం. మిహ ళలు: సార్ ఈ గ్రామం పాలకోవాకు ప్రసిద్ధి చెందింది. దీనిని మరింత లభివృద్ధి చేసేందుకు ప్రొత్సాహం లేదు. తగిన చేయూత ఇవ్వాలి. జేడీ : పాలకోవా తయారీని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి బ్యాంకుల ద్వారా చేయూత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. -
పెద్దాస్పత్రి.... సమస్యలతో కుస్తీ !
జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అది. నిత్యం వైద్య సేవలు కోసం వందలాది మంది ఇక్కడకు వస్తారు. పేరుకు పెద్దాస్పత్రి అయినప్పటికీ ఇక్కడ అనేక సమస్యలు నెలకొన్నాయి. పరికరాలు లేక కొన్ని సేవలు అందడం లేదు. ఉన్నా...కొన్ని పరికరాలు మూలకు చేరడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళ స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆస్పత్రిలో పలు వార్డులను, ఓపీ విభాగాలను పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్: అమ్మా నాపేరు సీతారామరాజు. నేను సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను, సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. మీపేరేంటి, ఏసమస్యతో ఎక్కడకు వచ్చారు? రోగి: నాపేరు లెంక రమణమ్మ సార్. మాది గజపతినగరం గ్రామం. బీపీ ఉందని ఇక్కడకు వచ్చాను సూపరింటెండెంట్: డాక్టర్‌గారు వచ్చారా ?, బాగా చెక్ చేశారా? రోగి రమణమ్మ: డాక్టర్‌గారు వచ్చారు. బాగానే చూశారు. సూపరింటెండెంట్: డాక్టర్ గారు కసురుకుంటున్నారా ?, ప్రేమగా మాట్లాడుతున్నారా? రమణమ్మ : బాగానే మాట్లాడుతున్నారు. కసురుకోవడం లేదు. సూపరింటెండెంట్: ఏమ్మా మీదేఊరు? ఏసమస్యతో వచ్చారు? రోగి : నాపేరు భవాని. మాది అయ్యన్నపేట గ్రామం సార్. కడుపునొప్పిగా ఉండడంతో వచ్చాను. సూపరింటెండెంట్: చికిత్స ఏ విధంగా చేస్తున్నారు? భవాని: చికిత్స బాగానే చేస్తున్నారు. మందులు కూడా ఇచ్చారు. సూపరింటెండెంట్: బాబు మీదే గ్రామం. ఆస్పత్రికి ఎందుకు వచ్చారు? రోగి: నాపేరు కె.రమేష్. మాది బీజే పాలెం గ్రామం. బీపీ ఉందని వచ్చాను. సూపరింటెండెంట్: పారిశుద్ధ్యం ఏవిధంగా ఉంది. మరుగుదొడ్లులో నీటి సరఫరా ఉందా, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? రమేష్: ఎవరూ డబ్బులు అడగలేదు. మరుగుదొడ్లలో నీరు వస్తోంది. పారిశుద్ధ్యం బాగానే ఉంది సూపరింటెండెంట్ : ఏమ్మా మీది ఏ ఊరు. ఏ సమస్యతో ఇక్కడకు వచ్చావు? రోగి : బాబు నా పేరు రెడ్డి కమలమ్మ. మాది చింతలవలస గ్రామం. పాము కరవడంతో ఇక్కడకు వచ్చాను. సూపరింటెండెంట్: ఎప్పుడు కరిచింది, ఎన్ని గంటల్లోగా చేరారు, ఏవిధంగా వచ్చారు? కమలమ్మ : గురువారం రాత్రి 7 గంటలకు పాము కరిచింది. రాత్రి 2 గంటలకు కేంద్రాస్పత్రికి వచ్చాను. 108 ద్వారా ఆస్పత్రికి వచ్చాను. సూపరింటెండెంట్ : సిస్టర్ మీపేరేంటి, వార్డులో సమస్యలు ఏవైనా ఉన్నాయా? సునీత స్టాఫ్ నర్స్ : సార్ నాపేరు సునీత. ఎమర్జెన్సీ వార్డులో ఏసీలు నెలరోజులుగా పనిచేయడం లేదు సార్. మెమోలు రాశాం. అయినా బాగు చేయలేదు. సూపరింటెండెంట్ : రెండు మూడు రోజుల్లో ఏసీలు బాగు చేయిస్తాం. రోగులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. సూపరింటెండెంట్ : డాక్టర్ మీ పేరేంటి. క్యాజువాలీటీలో సేవలు ఏవిధంగా అందిస్తున్నారు. డాక్టర్: సార్ నాపేరు శర్మ. క్యాజువాలీటికి వచ్చిన వారికి సకాలంలో సేవలు అందిస్తున్నాం, సేవలు అందించడంలో ఏమాత్రం అలసత్వం వహించడం లేదు. సూపరింటెండెంట్: బాబు ఆస్పత్రికి ఎందుకు వచ్చావు? రోగి: సార్ డయాలసిస్ చేసుకుని ఇంటికి వెళుతుండగా బస్సు దిగినప్పుడు కాలు విరిగింది. చికిత్స చేయించుకోడానికి వచ్చాను. సూపరింటెండెంట్ : ఇప్పుడే వచ్చావా. ఇంతకు మందు ఎప్పుడైనా వచ్చావా. వైద్యులు బాగాచూస్తున్నారా? రోగి: ఇప్పటికి రెండు సార్లు వచ్చాను సార్. హెచ్ఐవీ ఉందని చెప్పి ముట్టుకోకుండా మందులు రాసి పంపిస్తున్నారు. బాధ భరించ లేకపోతున్నాను సార్. సూపరింటెండెంట్: బాధపడుకు నీకు వైద్యం జరిగేలా చూస్తాను. హెచ్ఐవీ రోగులకు కూడా వైద్యం జరిగేలా చర్యలు తీసుకుంటాం. సూపరింటెండెంట్ : డాక్టర్‌గారు మీపేరేంటి, మీ దగ్గరకు ఎంతమంది రోగులు వస్తారు. ఏయే వ్యాధులతో ఎక్కువ మంది వస్తారు? డాక్టర్ సౌజన్య : సార్ నాపేరు సౌజన్య. రోజుకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వస్తారు. ఎక్కువగా జ్వరాలు, జలుబు, దగ్గు, మరీ ముఖ్యంగా రక్తహీనతతో ఎక్కువ మంది వస్తున్నారు. సూపరింటెండెంట్ : రక్తహీనతతో వచ్చే వారికి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? డాక్టర్ సౌజన్య: అందుబాటులో ఉన్న ఆకుకూరలు, కాయగారులు, పండ్లు వంటి ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నాను. సూపరింటెండెంట్ : డాక్టర్ గారు మీ పేరేంటి, నెలకు మీ దగ్గరకు ఎంతమంది మందుల కోసం వస్తుం టారు. మెరుగైన సేవలు అందించడానికి సౌకర్యాలు అదనంగా కావాలా? డాక్టర్ : సార్ నా పేరు సత్యనారాయణ. నా దగ్గరకు మానసిక సమస్యలతో నెలకు 300 మంది వరకు వస్తారు. మరొక మానసిక వైద్యుడు, సోషల్ వర్కర్ కావాలి. మానసిక రోగులకు ప్రత్యేక వార్డు, ఎంఆర్ఐ స్కాన్, ఈసీటీ పరికరం కావాలి. సూపరింటెండెంట్ : మానసిక వైద్యుడు, సోషల్ వర్కర్ నియామకం కోసం, ఎంఆర్ఐ స్కాన్ పరికరం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తాం. సూపరింటెండెంట్: బాబు నీ పేరేంటి ఎక్కడ నుంచి వచ్చాం. నీ సమస్య ఏంటి? రోగి : సార్ నాపేరు మహేష్, మాది పద్మనాభం గ్రామం. నాకు సుగర్ వ్యాధి ఉంది. గత ఎనిమిదేళ్లుగా బాధపడుతున్నాను. నీరసంగా ఉంటుంది. నడవడానికి ఇబ్బందిగా ఉంది సూపరింటెండెంట్ : పిల్లలో సుగర్ వ్యాధి రావడం చాలా అరుదు. ఇటువంటి పిల్లలకు చికిత్స అందించడానికి అవసరమైన అన్ని మందులు ఆస్పత్రిలో ఉన్నాయి. సూపరింటెండెంట్ : మీపేరేంటి, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారా? జూనియర్ అనలిస్టు భువనేశ్వరావు : సార్ నాపేరు భువనేశ్వరరావు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నాం. సూపరింటెండెంట్ : మీకు ఏవైనా సౌకర్యాలు కావాలా? భువనేశ్వరావు : మరుగుదొడ్లు, గదలు చాలక ఇబ్బంది పడుతున్నాం. సూపరింటెండెంట్ : అదనంగా గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తాం. సూపరింటెండెంట్ : మీపేరేంటి, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి మీకు ఏమైనా సౌకర్యాలు కావాలా? ల్యాబ్ టెక్నీషయన్ : సార్ నాపేరు ఆచారి. ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. సెల్‌కౌంటర్, ఎలక్ట్రకల్ ఎనలేజర్ వంటి ఆధునాతన సౌకర్యాలు ఉంటే మెరుగైన వైద్య సేవలు అందించగలిగాం. సూపరింటెండెంట్ : లేబరేటరీలో మెరుగైన సేవలు అందించడానికి అధునాతన పరికరాలు ఏర్పాటు చేస్తాం. సూపరింటెండెంట్ : మీపేరేంటి, నెలకు ఎంత రక్తం సేకరిస్తున్నారు, డాక్టర్ : సార్ నాపేరు సత్యశ్రీనివాస్. బ్లడ్‌బ్యాంక్‌లో నెలకు 300 యూనిట్ల వరకు రక్త సేకరణ చేస్తున్నాం. 600 యూనిట్ల వరకు రక్తం అవసరం పడుతుంది. రక్తదానంపై ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది సూపరింటెండెంట్ : మీపేరేంటి, ఇక్కడకు ఎందుకు వచ్చారు? సామాజిక కార్యకర్త: సార్ నాపేరు రవూఫ్. నేను సామాజిక కార్యకర్తను. సూపరింటెండెంట్: రక్తం కొరత తీర్చడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? రవూఫ్ : రక్తదానం ప్రస్తుతం జిల్లా కేంద్రానికే పరమితమైంది. అలా కాకుండా జిల్లాలో ఉన్న 34 మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి సూపరింటెండెంట్ : 34 మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాను. సూపరింటెండెంట్ : సిస్టర్ మీపేరేంటి, రాత్రి వేళల్లో ఆస్పత్రిలో అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి? స్టాఫ్ నర్స్ : నాపేరు అనురాధ సార్, రాత్రి వేళల్లో అత్యవసర కేసులు గురించి మాట్లడానికి క్యాజువాలీటికి వెళతాం. ఆ తర్వాత వచ్చేస్తాం సూపరింటెండెంట్ : కొంతమంది స్టాఫ్‌నర్స్‌లు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండడం లేనట్టు తెలిసింది. ప్రతీ స్టాఫ్ నర్స్ వారికి కేటాయించిన వార్డుల్లో అందుబాటులో ఉండాలి. సూపరింటెండెంట్ : బాబు నీపేరేంటి, ఎప్పుడు జాయిన్ అయ్యావు. ఏసమస్యతో వచ్చావు? రోగి: సార్ నాపేరు మహేష్, కాలు విరగడంతో జనవరి నెలలో జాయిన్ అయ్యాను. ఇంతవరకు ఆపరేషన్ చేయలేదు. సూపరింటెండెంట్: ఆపరేషన్ రెండు, మూడు రోజు ల్లో అయ్యేలా చర్యలు తీసుకుంటాం. -
ఐనాడా.. ఐనా వస్తా..
ఉమెన్సడే స్పెషల్ vip రిపోర్టర్ నాటు పడవలో సాహస ప్రయాణం మరో గంటపాటు కాలినడక దారీతెన్నూ లేని ఐనాడను సందర్శించిన తొలి ఎమ్మెల్యే ఈశ్వరి పాడేరు మండలంలోని మారుమూల ప్రాంతమైన ఐనాడ పంచాయతీ అనేక ఏళ్ళుగా ప్రజాప్రతినిధులు, అధికారుల అలక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ పంచాయతీలోని 32 గ్రామాల్లో సుమారు 5 వేల మంది గిరిజనులు సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. ఒక్క గ్రామానికి కూడా రహదారి సౌకర్యం లేదు. మండల కేంద్రానికి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీ గ్రామాలు దారి, తెన్ను లేని అడవి ప్రాంతంలో ఉన్నాయి. గిరిజనులు మండల కేంద్రానికి 6 మైళ్ళు అరణ్యంలో కాలిబాటలో నడిచి వస్తుంటారు. లేదంటే కోనాం రిజ ర్వాయర్‌లో నాటు పడవపై ప్రయాణించి చీడికాడ, వి.మాడుగుల మండలాల మీదుగా చుట్టూ తిరిగి పాడేరు చేరుకుంటారు. వర్షాకాలంలో రాకపోకలు చాలా కష్టం. 4 దశాబ్దాల క్రితమే ఐనాడ పంచాయతీ కేంద్రమైంది. కోనాం రిజర్వాయర్ ఒడ్డున ఉన్న ఐనాడకు రోడ్డు లేదు. మట్టిరోడ్డున్నా రవాణా యోగ్యంగా లేదు. ఆటోలు తిరగవు. అ త్యవసర పరిస్థితుల్లో నాటు పడవే వీరికి రవాణా సాధనం. లేదంటే నడిచి రావాల్సిందే. ఐటీడీఏ ఐనాడుకు ‘‘అభివృద్ధి బాట’’ వేయలేకపోయింది. అత్యవసర వైద్యసేవలు అందని పరిస్థితుల్లో గిరి జనులు మృత్యువాత పడుతున్న సంఘటనలను సాక్షి అనేకసార్లు వెలుగులోకి తెచ్చింది. ఇక్కడి గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ‘సాక్షి’ చేసిన ప్రయత్నంలో భాగంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందించి ఐనాడ పంచాయతీకి నాటుపడవలో సాహసంగా వచ్చారు. సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి కాస్సేపు సాక్షి రిపోర్టర్‌గా మారిపోయారు. ఐనాడలో గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి కదిలిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోనాం రిజర్వాయర్‌లో సాహసోపేతంగా నాటు పడవలో ప్రయాణం సాగించారు.ృఆమె వెంట వెళ్ళిన వారు కూడా పడవలో వెళ్ళడానికి భయపడ్డారు. కొందరు ఒడ్డునృ ఉండి పోయారు. ఈశ్వరి మాత్రం నాటు పడవలో ప్రయాణించి తెగువను ప్రదర్శించారు. 40 నిమిషాల పాటు నాటు పడవలో ప్రయాణం సాగించిన ఎమ్మెల్యే మరో గంటసేపు కాలినడకన కొండలెక్కి ఐనాడ వెళ్ళారు. అక్కడ గిరిజనుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఐనాడ సందర్శించిన ఈ నియోజకవర్గంపు తొలి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కావడం విశేషం. గిరిజనులతో వారి సమస్యలపై ఎమ్మెల్యే సంభాషణ ఈ విధంగా సాగింది! ఈశ్వరి: అవ్వా ఎలా ఉన్నావు? నీ పేరేంటి? మీ గ్రామంలో సమస్యలేమిటి? ఎం.లక్ష్మమ్మ: రోడ్డు లేక ఊరుదాటి ఎక్కడికి వెళ్ళ లేకపోతున్నాం. మందు, మాకు అవసొరమొచ్చినా కదల్లేకపోతున్నాం. బోటు ఎక్కలేం. నడక సాల్లేక పోతున్నాం. నువ్వే .. ఏదైనా సెయ్యాలి. ఈశ్వరి: నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా? అశ్విని: వాటి కోసం కోనాం వెళుతున్నాం. గ్రామంలో డిఆర్ డిపో భవనం పునాదులతోనే ఆపేశారు. ఊరికి రోడ్డు లేకపోవడమే అన్నింటికి సమస్యగా ఉంది. మా ఊరొచ్చిన ఎమ్మెల్యే మీరొక్కరే. రోడ్డు వేయిస్తే రుణపడి ఉంటాం. ఈశ్వరి: వైద్యసేవలు అందుతున్నాయా? గ్రామానికి వైద్యసిబ్బంది వస్తున్నారా? సిరగం చెల్లమ్మ: నెలకోసారి వస్తున్నారు. జొరాలొచ్చినప్పుడు చూసేవాళ్ళే లేరు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈశ్వరి: గర్భిణులను కాన్పుకోసం ఆస్పత్రులకు తీసుకెళుతున్నారా? సిరగం చెల్లమ్మ: డోలికట్టి చీడికాడ మండల కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు! గతేడాది నన్ను కాన్పుకోసం ఆస్పత్రికి తీసుకెళ్ళే సరికి నా కడుపులో మగబిడ్డ చనిపోయింది. అవసరానికి వైద్యసాయం అందడం లేదు. ఈశ్వరి: మంచినీటి సౌకర్యం ఉందా? వి.నారాయణమ్మ: తాగడానికి మంచినీరు దొరకడం లేదు. గెడ్డల్లో గాతలు, చెలమలు తవ్వి తాగునీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఈశ్వరి: ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్నారా? కాసులమ్మ: డబ్బుల్లేక ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోలేకపోయాం. కొందరు పునాదులు వేసుకొని బిల్లు రాకపోవడంతో ఆపేసారు. చినబోయిన దేవి శ్లాబ్ వరకూ ఇల్లు పూర్తి చేసినా బిల్లు రాలేదు. కొంత మందికి ఇళ్ళు మంజూరు కాలేదు. తుపాను దెబ్బతిన్న ఇళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఈశ్వరి: దీపం గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారా? చిన్నాలమ్మ: మాకెవరికి గ్యాస్ కనెక్షన్లు లేవమ్మా! ఇప్పుడు మంజూరు చేస్తే తీసుకుంటాం. ఈశ్వరి: కరెంట్ ఉంటుందా? చిన్నాలమ్మ: కరెంట్ ఉంది. ఎప్పుడైనా రిపేరైతే కొన్ని రోజులుండదు. ఈశ్వరి: ఏం పంటలు పండిస్తున్నారు. వాటిని ఎక్కడ అమ్ముతున్నారు? పి.రామారావు: సీతాఫలాలు, జీడిమామిడితోపాటు ఉసిరి, కరక్కాయ, కొండచీపుర్లు, కోవెల జిగురు సేకరిస్తున్నాం. మాడుగుల, కోనాం సంతలకు తీసుకు వెళుతున్నాం. రోడ్డు లేకపోవడం, వర్షాలు పడితే చాలా అవస్థలు పడుతున్నాం. గిట్టుబాటు రావడం లేదు. ఈశ్వరి: పంచాయతీ సమస్యలను ఎప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తారా? గెమ్మెలి నవరాజు: చాలాసార్లు చెప్పామమ్మా. ఒకసారి గ్రామంలోని కొంత మందిని కలిసి రోడ్డుకోసం అప్పటి మంత్రిని కోరాం. ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం గ్రామంలో మూడేళ్ళుగా పంచాయతీ భవనం, డిఆర్ డిపో, సబ్‌సెంటర్ల భవనాల నిర్మాణం మూడేళ్ళుగా పునాదులతోనే ఆగిపోయాయి. వీటిని పూర్తి చేయించాలి. ఈశ్వరి: ఐనాడ సమస్యలను కళ్ళారా చూశారు కదా! మీరేం చేస్తారు? పి.నూకరత్నం(జెడ్పీటీసీ): చాలా సమస్యలతో గిరిజనులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మండలంలో ఐనాడ పంచాయతీ అభివృద్ధి ప్రాధన్యతనిచ్చి జెడ్పీ నిధులు మంజూరు చేయించి, కొన్ని సౌకర్యాలైనా కల్పించేందుకు కృషి చేస్తాను. -
ఫోన్ చేస్తే చాలు
జంగారెడ్డిగూడెం : మధ్యాహ్నం 3.45 గంటలైంది. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతులు ముగిసి విద్యార్థులు బయటకొచ్చే సమయమది. అక్కడేమైనా ర్యాంగింగ్ జరుగుతోందా.. విద్యార్థినులు ఆకతాయిల బెడదను ఎదుర్కొంటున్నారా.. అనే విషయాలను తెలుసుకునేందుకు డీఎస్పీ జె.వెంకటరావు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా విద్యార్థులు, విద్యార్థినులు, అధ్యాపకులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. డీఎస్పీ వెంకటరావు వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది. డీఎస్పీ : ఏమ్మా.. ఏం చదువుకుంటున్నారు. సీహెచ్ ఉష, విద్యార్థిని : డీసీఈ ఫైనలియర్ చదువుతున్నా సార్. డీఎస్పీ : మీది ఏ ఊరు. ఎం.సుధావలి : మేమంతా విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం సార్. డీఎస్పీ : మరి ఎక్కడ ఉంటున్నారమ్మా. ఎం.కల్యాణ్‌దుర్గ : హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం. డీఎస్పీ : మీకేమైనా ఇబ్బందులున్నాయా. విద్యార్థినులు : లేవు సార్. అంతా బాగానే ఉంది. డీఎస్పీ : మీ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతోందా. ఎ.అనూష : లేదు సార్. డీఎస్పీ : ర్యాగింగ్ నివారణ కమిటీలు ఉన్నాయా టి.స్నేహ : ఉన్నాయండి. ఆ కమిటీ పెద్దలు సమస్యలు లేకుండా చూస్తున్నారు. డీఎస్పీ : మీరు కాలేజీకి వచ్చేప్పుడు.. హాస్టల్ వెళ్లేప్పుడు ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారా. సీహెచ్.ఉమ : లేదు సార్. డీఎస్పీ : మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా 100కు లేదా నా నంబర్ 94407 96626కు ఫోన్ చేసి చెప్పండి. పోలీసులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు. పి.రాజేశ్వరి : థాంక్యూ సార్. మాకు ఎలాంటి సమస్య వచ్చినా మీ దృష్టికి తీసుకువస్తాం. డీఎస్పీ : మీ హాస్టల్లో సమస్యలున్నాయా. అక్కడకు వచ్చి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా. పి.రాజేశ్వరి : లేవండి. అక్కడ సంరక్షకులు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీఎస్పీ : మాస్టారూ.. మీ ఈ కాలేజీలో ఏ బాధ్యతలు చూస్తున్నారు. ఎన్‌జేకే నరేంద్రకుమార్ : నేను ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నాను. డీఎస్పీ : కళాశాల లోపల, బయట ఆకతాయిల బెడద ఉంటున్నట్టు మీ దృష్టికి వచ్చిందా. ప్రిన్సిపాల్ : లేదండి. తరగతులు ప్రారంభమయ్యే సందర్భంలోనే విద్యార్థులకు ఈవ్‌టీజింగ్ వల్ల కలిగే అనర్థాలను, మంచి స్నేహితులుగా ఉంటే కలిగే లాభాలను వివరిస్తున్నాం. ఈ విషయాలను తరచూ గుర్తు చేస్తుంటాం. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉంచుతున్నాం. ఇప్పటివరకు మా కాలేజీలో ఎటువంటి ఇబ్బంది రాలేదు. డీఎస్పీ : విద్యార్థినుల విషయంలో మీరు తీసుకుంటున్న చర్యలేమిటి. ఎం.ఉషారాణి, రసాయన శాస్త్ర అధ్యాపకులు: మా కాలేజీ విద్యార్థినులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అప్పుడప్పుడూ పోలీ సు శాఖ అధికారులు కూడా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. నిర్భయంగా ఫిర్యాదు చేయండి కళాశాలలకు వచ్చి చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులకు చక్కని వాతావరణం అవసరం. ముఖ్యంగా చాలామంది ర్యాగింగ్ భూతానికి భయపడుతుంటారు. ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం. అవసరమైతే కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఈ విషయాలను తెలుసుకుని విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలి. చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత చదువుల వైపు సాగాలి. కళాశాలకు వచ్చే సమయంలో బయట వ్యక్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎవరూ భయపడొద్దు. నిర్భయంగా విద్యార్థులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలి. బాధితులకు అన్నివిధాలుగా సహకారం అందిస్తాం. ప్రతి ఒక్క విద్యార్థి చట్టంపై అవగాహన పెంచుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. - జె.వెంకటరావు, డీఎస్పీ, జంగారెడ్డిగూడెం -
కొంచెం బాగు.. కాస్త జాగు!
శ్రీకాకుళం అర్బన్:గతంలో మాదిరిగా తపాలా శాఖ సేవలు ప్రజలకు చేరువ కాలేకపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలపై ప్రచారం కొరవడుతోంది. దీంతో ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం పెరిగి తపాలా ఆదాయానికి గండి పడుతోంది. ప్రజలు కూడా అధిక చార్జీల భారాన్ని మోయాల్సి వస్తోంది. జిల్లాలో తపాలాశాఖకు సంబంధించి మూడు ప్రధాన తపాలా కార్యాలయాలు, 65 సబ్ పోస్టాఫీసులు, 424 బ్రాంచి ఆఫీసులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 1300 మంది పనిచేస్తున్నారు. తక్కువ చార్జీలకే పోస్టాఫీసుల సేవలు అందుబాటులో ఉన్నా ప్రజలు ఎందుకు అటువైపు మొగ్గు చూపడంలేదన్నది తెలుసుకునేందుకు శ్రీకాకుళం తపాలాశాఖ సూపరింటెండెంట్ జనపాల ప్రసాద్‌బాబు ఒక ప్రయత్నం చేశారు. ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా వినియోగదారులను, ఏజెంట్లను, సిబ్బందిని కలుసుకొని లోపాలు తెలుసుకున్నారు. వివిధ వర్గాలతో ఆయన సంభాషణ యథాతథంగా.. సూపరింటెండెంట్ : తపాలాశాఖ అందిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి రామారావు(నిరుద్యోగి, లోలుగు): సేవలు బాగున్నాయి. అయితే కొంత జాప్యం జరుగుతోంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాను. సూపరింటెండెంట్ : తపాలాశాఖలో సీనియర్ సిటిజన్స్‌కు సేవలు ఎలా ఉన్నాయి పి.వీరభద్రరావు: సీనియర్ సిటిజన్స్‌కు సేవలు బాగానే అందుతున్నాయి. సిబ్బంది కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. సూపరింటెండెంట్ : ఆన్లైన్ సేవలు ఎలా ఉన్నాయి ఎన్.వి.శేషాచ లం(ఏజెంట్): ఆన్లైన్ సేవలు బాగున్నాయి. అయితే కొన్ని సమయాల్లో మాత్రం ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా ఎస్బీ, ఆర్డీ, సేవింగ్స్ పథకాలకు సంబందించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని తొలగించాలి. సూపరింటెండెంట్ : తపాలాశాఖ సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? శేషాచలం: సిబ్బంది ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు. సూపరింటెండెంట్ : ఏజెంట్ల పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఎస్.వైకుంఠరావు(ఏజెంట్): మూడు నెలల క్రితం వరకూ ఖాతాదారులు కట్టిన డిపాజిట్లు కాలపరిమితి ముగిసిన వెంటనే నగదు చెల్లించేవారు. ఇపుడు నెల రోజులు ఆలస్యం అవుతోంది. సూపరింటెండెంట్ : ఏజెంట్లు, ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారా? హెచ్.సత్తిబాబు(ప్రధాన తపాలాశాఖ పోస్ట్‌మాస్టర్): ఖాతాదారులు, ఏజెంట్లు పడుతున్న ఇబ్బందులను గుర్తించాం. సమస్యను తపాలాశాఖ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురాలేదు. సూపరింటెండెంట్ : సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? పోస్ట్ మాస్టర్: సిబ్బందికి ఎటువంటి సమస్యలూ లేవు. సూపరింటెండెంట్ : ఖాతాదారులకు మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? పోస్ట్‌మాస్టర్: అన్ని సదుపాయాలు కల్పించాం. కూర్చునేందుకు కుర్చీలు, మంచినీటి సౌకర్యార్థం లయన్స్ క్లబ్ సహకారంతో తాగునీటి కులాయి ఏర్పాటు చేశాం. సూపరింటెండెంట్ : కొత్త పథకాలు గురించి చెప్పండి? పోస్ట్‌మాస్టర్: తపాలాశాఖ సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టింది. కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. సూపరింటెండెంట్ : ఈ పథకం గూర్చి ప్రజలకు, ఖాతాదారులకు తెలియదనే విమర్శ ఉంది. ఏమైనా ప్రచారం కల్పించారా? పోస్ట్‌మాస్టర్: ప్రచారం కల్పిస్తున్నాం. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. సూపరింటెండెంట్ : ఆర్డీ కాలపరిమితి ముగిసిన తరువాత నగదు చెల్లింపులో ఒక నెల ఆలస్యం జరుగుతోందని ఖాతాదారులు చెబుతున్నారు. దీనిపై మీ సమాధానం? ఎ.కృష్ణారావు(అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్): ఆర్డీ కాలపరిమితి ముగిసిన తరువాత ఒక నెల ఆలస్యం అయిన మాట వాస్తవమే. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తా. మెరుగైన సేవలకు కృషి తపాలాశాఖ సేవల గురించి ఖాతాదారులు, సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకున్నాను. కొన్ని విభాగాల్లో చిన్న చిన్న పొరపాట్లను గుర్తించాను. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తా. తపాలాశాఖ పలు కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తోంది. వీటిపై ప్రజలకు మరింత లోతుగా అవగాహన కల్పిస్తాం. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తా. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత చేరువై సేవలందిస్తాం. తపాలాశాఖ ఆదాయం కంటే సేవలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్డీ(రికరింగ్ డిపాజిట్) కాలపరిమితి ముగిసిన తరువాత నెలరోజులు ఆలస్యంగా ఖాతాదారులకు నగదు ఇస్తున్నట్లు గుర్తించాను. ఇక ముందు ఆలస్యం కాకుండా చూస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన, పీఎల్ఐ పథకాలు ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. వీటిపై పూర్తి అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా టీటీడీ దర్శనం కోసం రూ.300 టికెట్లను అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల వద్ద విక్రయిస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అమ్మకాలు బాగున్నాయి. తపాలాశాఖలో 16 ప్రింటర్లకు మరమ్మతు చేయించాం. కొత్తగా 24 కంప్యూటర్లను కొనుగోలు చేశాం. జిల్లా వ్యాప్తంగా 76 కొత్త కంప్యూటర్లు, 54 ప్రింటర్లు కావాల్సి ఉండగా వాటికి ఆర్డర్ ఇచ్చాం. - జె.ప్రసాద్‌బాబు, తపాలాశాఖ సూపరింటెండెంట్ -
విఐపి రిపోర్టర్ - ఎమ్మెల్సీ పూల రవీందర్
-
విఐపి రిపోర్టర్ - రంపచోడవరం ఏఎస్పీ విజయారావు
-
విఐపి రిపోర్టర్ - పార్వతిపురం ఏఎస్పి రాహుల్ దేవ్
-
విఐపి రిపోర్టర్ -రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
-
విఐపి రిపోర్టర్ - ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
-
అవస్థలెన్నో...!
తహశీల్దార్ కార్యాలయం... ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో అర్జీ దారులు వస్తుంటారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాళ్లరిగేలా తిరిగే వారు కొందరైతే....తన సమస్య ఎలా పరిష్కారమవుతుందో తెలియక సిబ్బంది కాళ్లావేళ్లా పడేవారు మరికొందరు. అందులోనూ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం పరిస్థితి అయితే మరి చెప్పనక్కరలేదు. నిత్యం పట్టాదారు పాసుపుస్తకాలు, రేషన్ కార్డులు, మీ సేవలో సర్టిఫికెట్లకు అప్రూవల్, భూముల వివాదాలు , రేషన్ కార్డులో పేర్ల నమోదు, మరణ ధ్రువీకరణ పత్రాలు అన్నింటికీ ఇక్కడికే రావాలి. సిబ్బంది రేపు రా.., మాపు రా.. అని పలుమార్లు తిప్పుతున్నా... పనైతే చాలురా భగవంతుడా అంటూ తిరుగుతూనే ఉంటారు. ఈ అవస్థలను పరిష్కరించేందుకు, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు స్వయంగా ఆర్డీఓ జే. వెంకటరావు రంగంలోకి దిగారు. సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చిన సందర్శకులను ప్రశ్నించారు. వారి సమస్యలు అడిగి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావును ఆదేశించారు. అంతే కాకుండా రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వేచి ఉన్న వివిధ కోర్టు కేసుల కక్షిదారులను ప్రశ్నించి వారి కేసుల విచారణకు, సత్వర పరిష్కారానికి చొరవ చూపించారు. శనివారం సందర్శకులతో ఆర్డీఓ సంభాషణ ఇలా సాగింది... పింఛన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, రేషన్‌కార్డులు, గ్యాస్కనెక్షన్ ఇలా పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ పత్రాల జారీ ఇలా అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. పింఛన్లు పార్టీ పరంగా నిలిపివేయడం ఉండదు, తగిన ఆధారులు చూపితే అర్హులందరికీ తప్పని సరిగా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటాం. స్థానిక తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావుతో చర్చించి పరిష్కారం చూపుతాను. నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు వేరే అధికారులు పరిష్కరించవలసి ఉంది. వారికి సమాచారం అందజేసి ఆ సమస్యలకు పరిష్కారమార్గాన్ని కనుగొంటాం. ఒక వేళ ఏ కారణం చేతనైనా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి నన్ను కలవచ్చు. ఆర్డీఓ: మీ పేరేంటి..? సందర్శకుడు: నా పేరు పతివాడ రామారావు. మాది 24వ వార్డు ఆర్డీఓ : ఎందుకొచ్చారు..?నీ సమస్య ఏమిటి..? పతివాడ రామారావు: నాకు వృద్ధాప్య పింఛను వచ్చేది. రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెన్షన్ పెంచాక అసలు రావడం లేదు. పార్టీ ప్రకారంగా నా పెన్షన్ తొలగించారు. ఆర్డీఓ: అలాంటిదేమీ ఉండదు. అర్హత ఉంటే తప్పనిసరిగా పింఛను వచ్చేలా సిఫార్సు చేస్తాం. పతివాడ రామారావు: నాకు వయస్సు ధ్రువీకరణ పత్రాలన్నీ ఉన్నాయి. రేషన్ కార్డులో తప్పులున్నాయన్న సాకుతో పింఛను తొలగించారు. ఆర్డీఓ : మీ దరఖాస్తు, అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వండి. మీ ఇంటికి వచ్చి విచారణ చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. పతివాడ రామారావు: కృతజ్ఙతలు సార్! ఆర్డీఓ : మీ పేరేంటి? ఏంటి మీ సమస్య! సందర్శకురాలు: అయ్యా! నా పేరు మొండి కామేశ్వరి. నాకు వితంతువు పింఛను ఇవ్వడం లేదు. ఆర్డీఓ: ఎందుక పింఛన్ నిలిపేశారు ? కామేశ్వరి: భర్త మరణ ధ్రువీకరణ పత్రం తెమ్మంటున్నారు. ఎన్నో ఏళ్ల కిందట చనిపోయిన భర్త ధ్రువీకరణ పత్రాన్ని ఇప్పుడెలా తెచ్చేది.? ఆర్డీఓ: మరేం పర్వాలేదు. నీ అడ్రస్‌కు తహశీల్దార్ వ స్తారు. అక్కడ విచారణ చేసి మీకు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. మీరు ఇంటివద్దే ఉండండి. కామేశ్వరి: నేను ఇంటి వద్దనే ఎలా ఉంటాను? పొలం పనికి వెళ్లిపోతాను. ఎన్ని సార్లు వచ్చినా నాకు పిం ఛను ఇవ్వడం లేదు. ఆర్డీఓ: తప్పనిసరిగా మీకు పింఛను ఇస్తారు ఆర్డీఓ: మీ పేరు? సందర్శకుడు: నా పేరు సూర్యనారాయణ. మాది బొంకుల దిబ్బ. ఆర్డీఓ: మీ సమస్య ఏంటి ? సూర్యనారాయణ: నా భార్య పేరున గ్యాస్ కనెక్షన్ ఉంది. నా భార్య ఇప్పుడు లేదు. నాకు గ్యాస్ కనెక్షన్ కావాలి. ఆర్డీఓ: ప్రస్తుతం దీపం గ్యాస్ కనెన్షన్లు డ్వాక్రామహిళల పేరున ఇస్తున్నారు. మీ పేరున ఇవ్వరు. మీ పేరున దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారులను సం ప్రదించి గ్యాస్ కనెక్షన్ ఇవ్వవచ్చే లేదో పరిశీలిస్తాం. లేకుంటే మీరు ప్రైవేటుగా గ్యాస్ కనెక్షన్‌ను కొనుగోలు చేసుకోవాలి. ఆర్డీఓ: మీ పేరేంటి? ఎందుకొచ్చావు? సందర్శకుడు: నా పేరు అప్పల రామయ్య. నా రేషన్ కార్డులో అప్పస్వామి, ఆధార్‌కార్డులో అప్పలరామ య్య అని కరెక్ట్‌గా పడింది. అయితే రేషన్ కార్డులో పే రు తప్పుగా పడిందని విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదు. పేరు మార్పించేందుకు వచ్చాను. ఆర్డీఓ: పక్కనే తహశీల్దార్‌తో... మీరు ఈ అడ్రస్‌కు వెళ్లి విచారణ చేయండి! రెండు పేర్లూ ఒకరివే అయితే ఏ పేరు ఖరారు చేయాలో నిర్ణయించి ధ్రువీకరణ పత్రం ఇచ్చేయండి! అప్పలరామయ్య: వస్తానయ్యా! ఆర్డీఓ: మీ సమస్య ఏంటి ? సందర్శకుడు: సార్! నా పేరు మీసాల శంకరరావు. మేం గ్రామ కంఠమని తెలియక ఓ ఇల్లు కొన్నాం. దా నిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదన్నారు. ఆర్డీఓ: ఏవేని ఆస్తులు, భూములు కొన్నప్పుడు అవి ఎవరి పేరున ఉన్నాయో ముందుగా ఒకటికి రెండుసా ర్లు విచారించి కొనుగోలు చేయాలి. అనంతరం దా నిని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీసాల శంకరరావు: ఇటీవల గ్రామకంఠం భూముల ను కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఇచ్చారని పేపర్లో చదివాం సార్ ! ఆర్డీఓ: అవును..! జీఓ నంబర్ 100 ను రద్దు చేశారని ప్రకటనలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా రాలేదు. వస్తే అమలు చేస్తాం. ఆర్డీఓ: మీ పేరేంటి? ఎందుకొచ్చారు? సందర్శకుడు: నా పేరు అడపా నారాయణరావు. రేషన్ కార్డులో పేరు మార్పు కోసం వచ్చాను. ఆర్డీఓ: ఏంటి సమస్య? నారాయణరావు: రేషన్ కార్డులో పేరు మార్పు కోసం రెండు నెలలుగా తిరుగుతున్నాను. ఇక్కడకొస్తే పరి ష్కారం కావడం లేదు. ఆర్డీఓ: తహశీల్దార్గారూ! ఏమిటీ సమస్య..? తహశీల్దార్ శ్రీనివాసరావు: సార్! రేషన్ కార్డుల్లో స భ్యుల పేర్ల చేర్పులో కొన్ని సాంకేతిక సమస్యలున్నా యి. వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్డీఓ: కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలత గారిని అడిగి పరిష్కారం కనుగొనండి! ఇతని సమస్యను పరిష్కరించి చేర్పులకు అవకాశమివ్వండి! నారాయణ రావు: థ్యాంక్యూ సార్ ఆర్డీఓ: మీరెవరు? ఎందుకొచ్చారు? సందర్శకుడు: నా పేరు పకీర్ రావు సార్! నేను తోటపాలెంలో ఉంటున్నాను. నాకు ఓటు హక్కు స్థల మార్పిడికోసం వచ్చాను. ఆర్డీఓ: దీనికి దరఖాస్తు చేశారా? ఫకీర్రావు: ఫారం 8లో దరఖాస్తు చేశాను. ఆర్డీఓ: ఒకే నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్ కావాలంటే ఫారం 8 కాదు. ఫారం 8ఏ లో దరఖాస్తు చేయాలి. దీనికి సంబంధించి మరో సారి దరఖాస్తు చేయండి. ఇంకేమయినా సమస్యలున్నాయా? ఫకీర్ రావు: ఓటరు నమోదు శిబిరాలను దూరంగా పెడుతున్నారు. శిబిరాలు ఎక్కడున్నాయో కూడా చా లా మందికి తెలియడం లేదు. ఆర్డీఓ: ప్రతీ కేంద్రంలో బూత్‌లెవెల్ అధికారి ఉండే విధంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాం. మీరు ఆన్‌లైన్‌లోనూ నిత్యం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగైతే మీరిచ్చిన అడ్రసుకు బృందం వచ్చి ధ్రువీకరించుకుంటుంది. అనంతరం మీకు ఓటరు కార్డు ఇస్తారు. ఆర్డీఓ: మీరెవరు? ఎందుకొచ్చారు.? సందర్శకుడు: అయ్యా! నాపేరు అప్పారావు. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలు ఆధార్ నంబర్‌లేని గ్యాస్ కనెక్షన్ మార్పిడి కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓ : తహశీల్దార్ గారూ మీరు ఈ విషయమై పరి శీలన చేసి చర్యలు తీసుకోండి! ఏమ్మా..? మీరెందుకు వచ్చారు. ఏ కాలనీ మీది? సందర్శకురాలు: మాది వైఎస్సార్ నగర్ కాలనీ. నా పేరు జగదీశ్వరి.. ఆర్డీఓ: సమస్య ఏమైనా ఉందా? జగదీశ్వరి: సార్! మా కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదు. రహదారులు కూడా సరిగా లేవు. ఆర్డీఓ: దీనిపై మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడాలి. ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు? మీ పేరేటి? సందర్శకుడు: అయ్యా నాపేరు పాసి అప్పారావు. మా అమ్మ ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చాను సార్! ఆర్డీఓ:ఏమైంది.? తహశీల్దార్ : విచారణలో ఉంది. ఆర్డీఓ: నీ పేరంటయ్యా? ఎందుకొచ్చావు? సందర్శకుడు: నా పేరు కె. రాములు బాబుగారూ! నేను వీటీ అగ్రహారం తలయారీని. ఆర్డీఓ: సమస్య ఏమిటీ? రాములు: మూడు నెలలుగా జీతాల్లేవు బాబూ! ఆర్డీఓ: మీ వేతనాలు పెరిగాక బడ్జెట్ రూపంలో ఇస్తున్నారు. నిన్ననే చూశాను. మీ బడ్జెట్ వచ్చింది. రాములు : అయ్యా! మూడు నెలలు జీతాల్లేకపోతే మే మెలా బతకాలి? బిల్లు గుమస్తా పెట్టడం లేదు. ఆర్డీఓ: నీకేం పరవాలేదు. బిల్లు గుమస్తా తప్పు లేదు. జీతాలు వచ్చేశాయి. ఇచ్చేస్తాం. ఆర్డీఓ కార్యాలయంలో.... ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు. ? మీపేరు? సందర్శకుడు: నా పేరు పూసపాటి వెంకటపతిరాజు. మాది డెంకాడ. పట్టాదారు పాసు పుస్తకాల కోసం వ చ్చాను. మా అన్నదమ్ములతో పాటు నాకు కూడా వా టా వస్తుంది. ఆ వాటా పుస్తకాలు ఇవ్వాలి. ఆర్డీఓ: అంటే మీరు కోర్టు పనిమీద వచ్చారా? వెంకటపతిరాజు: అవును సార్! ఆర్డీఓ: మీరు కూర్చోండి వాయిదాకు పిలుస్తాం. విచారణ చేస్తాను. ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు? ( ఓ బృందంతో..) సందర్శకుల బృందం: అయ్యా! మేం గరివిడి ఫేకర్ కార్మికులం. మా సమస్య కోర్టులో ఉంది. ఆర్డీఓ: మీ కేసు కూడా ఈ రోజే విచారిస్తాం. ఆర్డీఓ: మీది ఏ ఊరమ్మా? ఎందుకొచ్చావు? సందర్శకురాలు: అయ్యా ! నాపేరు వల్లి బంగారమ్మ మాది కోడూరు గ్రామం. ఆర్డీఓ: ఏంటి సమస్య? బంగారమ్మ: అయ్యా! 30 ఏళ్లుగా ఉన్న నా భూమి వేరొకరి పేరున ఉన్నది. అందుకే వచ్చాను. ఆర్డీఓ: మీ అందరి కేసులూ విచారిస్తాం. సత్వర న్యా యం అందిస్తాం. -
వీఐపీ రిపోర్టర్ : అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు
-
వీఐపీ రిపోర్టర్ : రిమ్స్ డైరెక్టర్ టి. జయరాజ్
-
విఐపి రిపోర్టర్ - సోమారపు సత్యనారాయణ
-
విఐపి రిపోర్టర్ -హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు
-
భయం.. భయంగా..
పాశిగామ... గోదావరి తీరంలో చిన్న గ్రామం. 1994లో వచ్చిన గోదావరి వరదలతో పంటలు, ఇళ్లు మునిగిపోయాయి. ఆ బాధ ఇప్పటికీ వాళ్ల క ళ్ల ముందు కదలాడుతూనే ఉంది.. ఆ చేదు జ్ఞాపకాలనుంచి తేరుకోకముందే మళ్లీ ఎల్లంపెల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ రూపంలో భయపెడుతోంది. ప్రాజెక్టు నిండినప్పుడు 500 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. తమను ముంపు గ్రామం జాబితాలోకి చేర్చాలంటూ ధర్మపురి మండలం పాశిగామ గ్రామస్తులు కొన్నాళ్లుగా కోరుతున్నారు. వారి బాధలు తెలుసుకోవడానికి ప్రభుత్వ చీఫ్ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొప్పుల ఈశ్వర్ : అందరికీ నమస్కారం.. మీ ఊళ్లో ఉన్న సమస్యలేంటి? అత్తె వెంకన్న : ఎల్లంపెల్లి ప్రాజెక్టు నీళ్లు చేరి మా గ్రా మం మునిగిపోతుందని సర్వేలు చేసిండ్రు. సుమారు 500 ఎకరాలు ముంపులో పోతున్నయ్. ఈ ఊరు మొత్తాన్ని ముంపు కింద తీసుకుని ఆదుకోవాలి. కొప్పుల ఈశ్వర్ : అమ్మా.. నీపేరేంటి ? నీ బాధ ఏంటి చెప్పమ్మా? కంటెం లక్ష్మి : మూణ్ణెళ్ల నుంచి మంచి నీళ్లు దొరకక క ట్టపడుతున్నం. ఊళ్లె చేద బావులు, బోరింగులు ఎం డిపోయాయి. మంచినీళ్లు దొరకక బాధపడుతున్నం. గ్రామపంచాయతీ వాళ్లు ఇస్తున్న నీళ్లు సగం ఊరికి కూడా సరిపోతలేవు. బోరింగ్ వేసి ఆదుకోవాలి. కొప్పుల ఈశ్వర్ : తాతా.. నీకు పింఛన్ అత్తుందా? శంకరయ్య : పింఛన్ అత్తలేదు బాంచెన్. మా ఊళ్లె నాతోటోళ్లకు పింఛన్ అత్తుంది. నాకు అత్తలేదు. నాకు పింఛన్ ఇప్పియ్యాలె సారు. కొప్పుల ఈశ్వర్ :అవ్వా.. నీ సమస్యేంటి ? లక్ష్మీనర్సవ్వ : ఎల్లంపెల్లి నీళ్లు మా ఊరికి దగ్గరగా అచ్చినయి. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నం. పాములు, తేళ్లు ఇండ్లళ్లకు చేరుతున్నయ్. పాములు కుట్టి ఇప్పటికి నలుగురు మనుషులు, ఎడ్లు, బర్రెలు సచ్చిపోతున్నయ్. ముంపుకింద మా ఊరును తీసుకోవాలె బాంచెన్. కొప్పుల ఈశ్వర్ : ఏం.. ఎంపీటీసీ బాగున్నావా .. మీ ఊరు సమస్యలేంటి ? ఈర్ల మొండయ్య, ఎంపీటీసీ : ఇంతకుముందు ప్రభుత్వాలు మా గ్రామాన్ని పట్టించుకోలేదు. అందుకే ఎండాకాలం రాక ముందే నీళ్లకు క ట్టపడుతున్నాం. రోడ్లు లేవు. ఇన్ని రోజులు కరెంటు గురించి పట్టించుకునేటోళ్లు లేరు. తెలంగాణా గవర్నమెంటులోనైనా ప్రజల బాధలను పట్టించుకోవాలె. కొప్పుల ఈశ్వర్ : బాబూ.. ఏం పని చేస్తన్నవ్? నీ సమస్యేంటి? కంటెం తిరుపతి : మాఊర్లో కరెంటు వైర్లతో భయంగా ఉంది. ఇండ్లమీది నుంచి పెద్ద లైను పోయింది. దాంతో దినదినం భయంగా ఉంది. గాలి బాగా వచ్చినప్పుడు తీగలు తెగి మా ఇండ్ల పైన పడేట్టు ఉన్నయ్. లైను ఊరి నుంచి పక్కకు మార్చాలి. కొప్పుల ఈశ్వర్ : రోడ్ల వసతులు ఎట్లున్నయ్? కంటెం మల్లయ్య : గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి రావాంటే నరక యాతన పడుతున్నం. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. పెద్దరోడ్డు నుంచి కోటిలింగాల ఎక్స్‌రోడ్డు వరకు పంట పొలాల్లో నుంచి రోడ్డును మంజూరు చేయాలె. కొప్పుల ఈశ్వర్ : మేడమ్.. పాఠశాలలో సమస్యలున్నాయా ? రమాదేవి, ప్రభుత్వ టీచర్ : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీలేదు. పలువురు స్కూల్ పరిసరాల్లోకి మూత్రవిసర్జన చేస్తున్నారు. బోధనకు ఇబ్బంది అవుతోంది. కంపౌండ్ వాల్‌కు నిధులు మంజూరు చేయాలి. కంపౌండ్ లేక పాఠశాలలో మద్యం సేవిస్తూ ఇబ్బందులు కల్గిస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ : బాబూ... నీబాధేంటి ? ఎంబటి శంకరయ్య : మా గ్రామాన్ని ముంపుకింద చేర్చుతామని, నష్టపరిహారం ఇప్పిస్తామని కొందరు ఇంటికి పదివేల నుంచి ముప్పై వేల రూపాయలు దాకా వసూల్ చేసిండ్రు. ఆరు నెలల్లో పనవుతుందన్నారు. వసూలు చేసి రెండేండ్లరుుతంది. పైసలు ఇత్తలేరు. పని జేత్తలేరు. మా పైసలు మాకు ఇప్పించాలి. మమ్మల్ని ముంపు గ్రామం కింద చేర్చాలె. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా.. అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్న పాశిగామను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. గత పాలకుల నిరంకుశ నిర్లక్ష్యపు ధోరణి తో నేడు చాలా గ్రామాలు తాగునీ టికి అల్లాడుతున్నాయి. స్థానికులు మూడునెలలు గా అవస్థలు పడుతున్నారు. సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసరమైన చోట బోర్‌వెల్స్ వేసి తాగునీటి అవసరాన్ని తీరుస్తాం. గ్రామంలో ఎల్లంపెల్లిప్రాజెక్టు కింద 400ఎకరాల భూమి ము ంపునకు గురై ప్రజలు ఉపాధిని కోల్పోయి ఇబ్బం దులు పడుతున్నారు. వారి సమస్యలు తీరుస్తా. ఎల్లంపెల్లి నీటితో ముంపునకు గురవుతున్నందున ముంపు గ్రామాల జాబితాలో చేర్చడానికి కృషిచేస్తా. జాతీయరహదారి నుంచి గ్రామంలోకి రోడ్డు సౌకర్యం కల్పిస్తా. తాగునీటి వసతుల కోసం సత్వరం బోరింగులు ఏర్పాటు చేసి తాగునీరందిస్తాం. అర్హులందరికీ పింఛన్లు అందించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతా. -
విఐపి రిపోర్టర్ - సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
-
గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా..
ఎటు చూసినా ఎత్తై కొండలు.. చుట్టూ దట్టమైన అడవి.. మధ్యన ఓ కుగ్రామం. దానిపేరు నాగన్నగూడెం. బుట్టాయగూడెం మండలంలోని ఈ గ్రామంలో కొండరెడ్ల తెగకు చెందిన 26 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ఈ గ్రామానికి రహదారి, విద్యుత్ సౌకర్యం లేవు. కేఆర్ పురం ఐటీడీఏ ద్వారా ఈ రెండూ సమకూరారుు. అయినా గ్రామంలో సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. అక్కడ ఇంకా ఎలాంటి సమస్యలున్నాయి.. గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటనే విషయూలను స్వయంగా తెలుసుకునేందుకు కోటరా మచంద్రపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్వీ సూర్యనారాయణ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. మారు మూలన ఉన్న ఆ గ్రామానికి వెళ్లారు. ఇంటింటికీ తిరిగారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆ వివరాలివీ. పీవో : ఏమయ్యూ.. ఏం పనులు చేస్తున్నారు. మాండ్రు శ్రీరామమూర్తి : కూలి పనులు చేసుకుంటున్నామండి. కూరగాయల పంటలు వేశాం. ఆ పనులకు వెళ్లి వచ్చాం. పీవో : మీ గ్రామంలో ఎన్ని కుటుంబాల వారు నివసిస్తున్నారు. మాండ్రు శ్రీరామమూర్తి : 25 కుటుంబాలు ఉంటున్నాయండి. పీవో : మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా. కట్ల బాబుల్‌రెడ్డి : ఉన్నాయండి. మేం ఇప్పటికీ తాటాకింట్లోనే ఉంటున్నాం. మాకు పట్టాలు ఇప్పించండి. ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలండి. పీవో : మీ ఇళ్లకు ఇప్పటివరకు పట్టాలివ్వలేదా మనుగుల రామిరెడ్డి : 1999లో అడవిని నరికి.. భూమిని చదును చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నాం. అప్పటి నుంచి ఇదే తాటాకింట్లో ఉన్నాం. పట్టా కోసం తహసిల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాం. కానీ ఇవ్వలేదు. పీవో : మీ పిల్లలను చదివిస్తున్నారా. కట్ల సీత : మా పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ పాఠశాలలు లేవండి. 10మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. వీరి కోసం ఒక అంగన్వాడీ కేంద్రం పెట్టించండి. పీవో : మీ అందరికీ వ్యవసాయ భూములున్నాయా మాండ్రు వెంకటరెడ్డి : ఉన్నాయండి. అయితే భూములకు పట్టాలు లేవు. అటవీ హక్కుల చట్టం కింద పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నాం. కొంతమందికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన వారికి కూడా పట్టాలిప్పించండి. పీవో : అలాగే. దరఖాస్తులను పరిశీలించి పట్టాలిప్పించేందుకు కృషిచేస్తాం. కెచ్చెల చిన్నారెడ్డి : అయ్యూ.. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో బెండ తోట, మొక్కజొన్న పంట వేసుకున్నాం. సాగునీరు లేదు. పక్కనే ఉన్న కొవ్వాడ కాలువలోంచి రోజుకు రెండొందల అద్దె కట్టి అయిల్ ఇంజిన్‌తో నీటిని తోడుకుంటున్నాం. ఐటీడీఏ ద్వారా ఆయిల్ ఇంజిన్ ఇప్పించండి. పీవో : ట్రైకార్ పథకంలో అవసరమైన రైతులందరికీ ఆయిల్ ఇంజిన్లు ఇప్పించేందుకు కృషిచేస్తా. కోండ్ల శ్రీరామమూర్తి : నేను జీడిమామిడి తోట వేశాను. పూత సమయంలో స్ప్రేయింగ్ చేసేందుకు మెషిన్ లేదు. దాన్ని ఇప్పించండి. పీవో : అలాగే. దరఖాస్తు పెట్టుకో. పట్ల ముత్యాలమ్మ : సార్. మా ఊళ్లో కమ్యూనిటీ హాలు కట్టించండి. పండగలు, పబ్బాల సమయంలో అందరూ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటాం. పీవో : ప్రతిపాదనలు తయారు చేయించి నిర్మాణానికి కృషిచేస్తాం. నక్కా దేవమణి : సార్. మేం డ్వాక్రా సంఘాల్లో ఉన్నాం. బ్యాంకు ద్వారా ఇచ్చిన సొమ్ము ఎటూ సరిపోలేదు. మాకు మళ్లీ రుణాలు ఇప్పించాలి. పీవో : వివరాలివ్వండి. బ్యాంకులు, ఐకేపీ వారితో సంప్రదించి రుణ సదుపాయం కల్పించేందుకు కృషిచేస్తా. మాండ్రు పోశమ్మ : అయ్యూ. మా ఊళ్లో రోడ్లు వేయించండి. పీవో : ముందు ఇళ్లు కట్టించే ఏర్పాటు చేసి.. ఆ తరువాత రోడ్డు నిర్మాణం చేపడదాం. పీవో : మీరు టీవీ చూస్తారా? అన్ని విషయాలు తెలుసుకుంటున్నారా? ఎం.రామిరెడ్డి : మా ఊళ్లో ఒక్క టీవీ కూడా లేదండి. టీవీ చూడాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని రెడ్డిగూడెం వెళ్తాం. ఈ మధ్యనే కరెంటొచ్చింది. టీవీలు పెట్టుకుంటాం. పీవో : సరే.. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి బుధవారం ఐటీడీఏలో జరిగే గిరిజన దర్బార్‌కు రండి. ఏ సమస్య ఉన్నా చెప్పండి. పరిష్కారానికి కృషిచేస్తాం. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తాం బుట్టాయగూడెం మండలం నాగన్నగూడెంలో నెలకొన్న సమస్యలపై నాకు పూర్తి అవగాహన వచ్చింది. ప్రాజెక్టు అధికారిగా నా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తాను. సాగు భూములున్న వారికి అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు వచ్చేలా చూస్తాం. ఇళ్ల స్థలాలకు సంబంధించి రెవెన్యూ అధికారులతో మాట్లాడతాం. గృహ నిర్మాణ అధికారులతో మాట్లాడి ఇళ్లు నిర్మించే ఏర్పాటు చేస్తాం. గ్రామంలో 10మంది పిల్లలు మాత్రమే ఉండటం వల్ల అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చూస్తా. ఈ గ్రామానికి విద్యు త్ సౌకర్యం లేని సమయంలో ఐటీడీఏ ద్వారా సోలార్ లైట్లు పెట్టాం. ఇప్పుడు రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు వచ్చారుు. ప్రస్తుతం గుర్తించిన సమస్యలు పరిష్కరిస్తే గిరిజనులు సంతోషంగా జీవిస్తారు. కొవ్వాడ రిజర్వాయర్ పక్కనే ఉన్నందున గిరిజనులకు ట్రైకార్ పథకంలో ఆయిల్ ఇంజిన్లు మంజూరు చేస్తాం. సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం. - ఆర్వీ సూర్యనారాయణ, పీవో, ఐటీడీఏ -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే పువ్వాడ అజయ్
-
వీఐపీ రిపోర్టర్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-
విఐపి రిపోర్టర్ -నర్సాపురం ఆర్డీఓ పుష్పమణి
-
విఐపి రిపోర్టర్ - గ్రేటర్ విశాఖ కమీషనర్ ప్రవీణ్
-
విఐపి రిపోర్టర్ - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
-
స్వచ్ఛ విశాఖే లక్ష్యం
రోజూ నగరంలో పర్యటిస్తున్నా నేడు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కొత్తగా ఉంది. దీని వల్ల ప్రజలకు మరిం త సన్నిహితమవడం ఆనందంగా ఉంది. స్వచ్ఛ విశాఖే మనందరి ధ్యే యం కావాలి. అందుకోసం పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. నగరంలో పెద్ద ఎత్తున టాయిలెట్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొం దిస్తు న్నాం. నగరం అంతా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్య తదితర అన్ని రంగాల్లోనూ విశాఖను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకు ప్రజల సహకారం కావా లి. అధికారులు, ప్రజలు కలసి పనిచేస్తే విశాఖను మరింత సుందరనగరంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేయగలం. అందుకు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.’ కమిషనర్ ప్రవీణ్: ఏమ్మా ఇక్కడ ఎవరికీ టాయిలెట్లు లేనట్టున్నాయి. ఎక్కడికి పోతున్నారు మీరంతా..! శారద: సార్.. ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. టాయిలెట్లు కట్టుకోవడానికి స్తోమత లేదు. ఇళ్లలో అంత చోటూ లేదు. మున్సిపల్ సులాభ్ కాంప్లెక్స్‌కు వెళ్తే అక్కడ నీరుండదు. మోటార్ పని చేయదంటారు. రెండు నెలలుగా మోటారు పనిచేయడం లేదు. ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నాం. మా ఆడోళ్ల బాధలు చెప్పుకుంటే సిగ్గేస్తాదండి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు మీదకే పోతున్నాం. నేవీ ఉద్యోగులు ఒప్పుకోరని వారికంట పడకుండా అర్ధరాత్రి, వారు లేని వేళల్లో వెళ్లాల్సిన పరిస్థితి.. (కమిషనర్ వెంటనే అక్కడే వున్న జోనల్ కమిషనర్ నాగ నర్సింహారావు, చీఫ్ ఇంజనీర్ దుర్గా ప్రసాద్‌లను పిలిచారు.) కమిషనర్: మున్సిపల్ సులాభ్ కాంప్లెక్స్‌లో మోటారు పనిచేయడం లేదా? రెండు నెలలుగా పనిచేయకుండా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? జోనల్ కమిషనర్: మోటారు కోసం ప్రపోజల్ పెట్టాం సర్. ఇంకా శాంక్షన్ ఆర్డర్స్ రాలేదు. కమిషనర్: నేను ఇప్పుడు ఆ సులాభ్ కాంప్లెక్స్ పరిశీలిస్తాను. మోటారు కోసం వెంటనే రూ. 2 లక్షలు శాంక్షన్ చేస్తున్నా. వెంటనే కొత్త మోటారు వేయించండి. అనంతరం కమిషనర్ ప్రవీణ్ ఆ సమీపంలోని పేదల ఇళ్లలోకి వెళ్లారు. ఓ చిన్న గదిలో అద్దెకు ఉంటున్న జి.మాధవిని పలకరించారు. కమిషనర్: ఏమ్మా.. ఎలా ఉన్నారు.. మీకు మరుగుదొ డ్డి ఉందా? మాధవి: లేదండి. కమిషనర్: లేకపోవడం ఏంటమ్మా.. మ రి కాలకృత్యాలు ఎక్కడ తీర్చుకుంటున్నారు? మాధవి: అలా రోడ్డు పక్కకు వెళ్లాల్సి వస్తోందండి (ఒకింత ఇబ్బంది పడుతూ) కమిషనర్: డబ్బులిస్తాం కట్టుకుంటారా? మాధవి: మాకు ఇల్లే లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇక మరుగుదొడ్డి ఎక్కడ కట్టుకోవాలండీ? (ఇంటి యజమాని సత్యనారాయణని పిలిచి మాట్లాడుతూ..) కమిషనర్: మీకు కార్పొరేషన్ తరపున డబ్బులిస్తాం. మరుగుదొడ్డి కట్టించండి. ఇంటి యజమాని:అలాగే సార్. అనంతరం కమిషనర్ మహిళా సంఘాల ప్రతినిధులను పలకరించారు. కమిషనర్: అంగన్వాడీ కేంద్రం ఉందా..! మహిళలు: ఉందండి. కమిషనర్: పిల్లలకు పౌష్టికాహారం పెడుతున్నారా.. మహిళలు: ఆ! పెడుతున్నారండి. కమిషనర్: స్కూల్ ఉందా..పిల్లలందర్నీ చదివిస్తున్నారా.. మహిళలు: ఎలిమెంటరీ బడి మాత్రమే వుందండి. 6వ తరగతి దాటితే కంచరపాలెమో, మర్రిపాలెమో పోవాలి సర్.. కమిషనర్: ఆస్పత్రి వుందా..! మహిళలు: లేదండి..కేజీహెచ్‌కే పోతున్నాం. అక్కడి నుంచి మరో రెండడుగులు వేశారు. అక్కడున్న వృద్ధులు పోలాకి గిరి, ఉడుంబిల్లి పోతురాజులను పలకరించారు. కమిషనర్: ఏమండీ బాగున్నారా... పోలాకి గిరి: బాబూ పింఛన్ ఆపేశారు.. కమిషనర్: ఎప్పుడు... పోలాకి గిరి: ఈ నెలే.. కమిషనర్: ఈ నెల నుంచి పోస్టాఫీసుకు మార్చడం వల్ల చిన్న సమస్య ఏర్పడింది. వచ్చే నెల నుంచి ఆ సమస్య ఉండదు. అందరికీ సమాయానికి పింఛన్ వచ్చేస్తుంది. ఉడుంబిల్లి పోతురాజు: పోస్టాఫీస్ చుట్టూ తిరగడానికి రోజుకి వందవుతోంది. ఎలా సర్..ఎన్ని రోజులు తిరగాలి.. కమిషనర్ యూసీడీ అధికారులను పిలచి అన్ని పోస్టాఫీస్‌లకు సిబ్బందిని పంపించి సమస్య రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. మార్గమధ్యంలో ఓ దుకాణం వ్యక్తితో కమిషనర్ మాట్లాడుతూ పాన్‌పరాగ్, ఖైనీలు అమ్ముతున్నావా.. అనడిగారు. లేదనడంతో ఇరుకు రోడ్డు గుండా రోడ్డుపైనే పుల్లలతో వంటలు చేస్తున్న వారందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. అక్కడ జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కనిపించారు. వారితో సంభాషిస్తూ.. కమిషనర్: ఏమండీ మీ పేరు..! పారిశుద్ధ్య కార్మికులు: పల్లా నాగయమ్మ...బొమ్మ రమణండీ..! కమిషనర్: ఎన్ని గంటలకు డ్యూటీకొచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు: పొద్దున్నే అయిదో గంటకే వచ్చేస్తామండి.. కమిషనర్: జీతమెంత ఇస్తున్నారు? పారిశుద్ధ్య కార్మికులు: ఆరు వేలండి.. కానీ సరిగా ఇవ్వడం లేదు. గత రెండు నెలలది మొన్న ఇచ్చారు. ఈ నెలది ఇంకా రాలేదండి. ఇలా అయితే మా బోటోళ్లం ఎలా బతకాలి సారూ.. కమిషనర్ వెంటనే అక్కడే ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.ఎం.ఎస్.రాజు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా.మురళీమోహన్ను అడిగారు. ఇంకా జీతాలు చెల్లించకపోతే ఎలా అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ నెల కొంత ఆలస్యమైందని వారిద్దరూ చెప్పారు. రికార్డుల పరిశీలన, ఇతరత్రా పనుల వల్ల ఆలస్యమైం దన్నారు. ఇక నుంచి త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల నుంచి 7వ తేదీ లోగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించారు. ఇంతలోనే పారిశుధ్య కార్మికులు నాగాయమ్మ, రమణలు కమిషనర్‌తో మాట్లాడుతూ... నాగాయమ్మ, రమణ: మాకు గ్లౌజులు ఇవ్వలేదు సార్. ఆరు నెలలుగా వట్టి చేతులతోనే చెత్త చెదారం ఎత్తాల్సి వస్తోంది. చేతుల్లో గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయి. కొత్తవి ఇప్పించండి సారూ. కమిషనర్: గ్లౌజులు ఇస్తున్నారు కదా.. అంటూ జోనల్ కమిషనర్ వైపు చూశారు. మొన్ననే ఇచ్చామండీ అంటూ ఆయన సమాధానం ఇస్తుండగానే.. మరో అధికారి కల్పించుకుని రెండు మూడు మాసాలై వుంటుందండీ అని చెప్పారు. బొమ్మా రమణ: అబ్బే ఆర్నెల్లు అయ్యిందండి.. జోనల్ కమిషనర్: మరి అంతే.. అస్తమానూ ఎక్కడ నుంచి తెచ్చిస్తాం.. దాన్నే జాగ్రత్తగా దాచుకోవాలి. బొమ్మా రమణ: ఏంటండీ ఆర్నెల్లు దాచుకోవాలా.. రోజూ ఉతికి ఆరేసుకుంటుంటే ఆర్నెల్లు మన్నుతుందా? కమిషనర్ అందరికీ ప్రొక్యూర్చేసి ఇవ్వాలని సూచించారు. ఇలా సాక్షి రిపోర్టర్ అవతారమెత్తిన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆశవానిపాలెంలో విసృ్తతంగా పర్యటించారు. ప్రతి వీధిని కలియదిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం పరిష్కరిం చగలిగే వాటిపై అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలపై నివేదిక సమర్పించాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజ ల్లో అవగాహన కల్పించారు. ప్రజల ఫిర్యాదు మేరకు సులాభ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. వెంటనే రూ.2 లక్షలతో మోటారు మంజూరు చేశారు. ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
అందరికీ ఉపాధి
ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా లక్ష కుటుంబాలకు 100 రోజుల పనిదినాలు పని ప్రదేశాల్లో పూర్తి స్థాయిలో వసతులు వేతనం రూ 169 వచ్చేలా కొలతలు ఎండలో మాడిపోతూ... రక్తాన్ని చెమటగా మార్చి చిందిస్తున్న కూలీలకు దక్కుతున్నది ఎంత...?, వారి శ్రమకు తగిన వేతనం అందుతోందా...? కావలసిన వారికి పనులు లభిస్తున్నాయా ? వేతన దారుల సొమ్ము పరుల జేబుల్లోకి వెళుతోందా...? అంటే ఇవన్నీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి. సమున్నత లక్ష్యంతో అమలవుతున్న ఈ పథకం కొందరు అక్రమార్కుల కారణంగా అబాసుపాలవుతోంది. కోట్లకు కోట్లు పథకం నిధులు ఖర్చవుతున్నా...లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. జిల్లా నుంచి వలసలు ప్రతి ఏడాదీ పెరుగుతున్నాయి. వేతనదారుల సమస్యలను తెలుసుకునేందుకు డ్వామా ఏపీడీ ఎస్.అప్పలనాయుడు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామ పంచాయతీ శివారుల్లో జరుగుతున్న ఉపాధి పనుల వద్దకు వెళ్లి ప్రతి వేతనదారునితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వేతనదారులతో ఏపీడీ సంభాషణ ఇలా సాగింది.... ఏపీడీ : ఏమ్మా మీ పేరేంటి..? ఎప్పుడు నుంచి ఉపాధి పనులకు వస్తున్నారు..? దుర్గాభవాని(మేట్) : నా పేరు దుర్గాభవానీ సార్. మూడేళ్లుగా పనిలోకి వస్తున్నాను. నేనే మా జట్టుకి మేట్‌ని. ఏపీడీ: ప్రతి రోజు ఎన్ని గంటల పాటు పనులు చేస్తారు..? మేట్: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మళ్లీ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాం. ఏపీడీ: రోజుకు ఎంత కూలి గిట్టుబాటవుతోంది..? మేట్: జట్టులో ఉన్న వారందరికీ ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట వేత నం వచ్చేలా కొలతలు ఇస్తున్నాం. రెండు మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు , అరమిటరు లోతును రోజుకు తవ్వితే రూ.160 వరకు వస్తుంది. ఏపీడీ: మీ గ్రూపులో ఎంత మంది కూలీలు ఉన్నారు...? మేట్: ఈ రోజు 10 మంది వచ్చారు. ఏపీడీ : ఏమమ్మా నీ పేరు..? బోర విజయ (ఉపాధి వేతనదారు): నా పేరు బోర విజయ అండి. ఏపీడీ: ప్రతి రోజు ఉపాధి పనులకు వస్తారా..? విజయ: ఔనండి. నాతో పాటు మా యజమాని అప్పుడప్పుడు వస్తారు. వ్యవసాయ పనులు ఉంటే రాడు. ఏపీడీ: ఉపాధి పనితో వచ్చే డబ్బులతో ఏం చేస్తుంటారు..? విజయ: పిల్లల్ని చదివించుకుంటున్నామండి ఏపీడీ: గునపాం పట్టుకుని నువ్వు పని చేస్తున్నావేంటి.? సంతోషి (ఉపాధి వేతనదారు): నా పేరు బోర.సంతోషి . మా జట్టు లో ఈ రోజు మగవాళ్లు రాలేదు . అందుకే గునపాం పని మేమేం చేసుకుంటాం. ఏపీడీ: నీ పేరేంటమ్మ..? ఇక్కడ నువ్వు ఏం చేస్తుంటావు..? చంద్రకళ(ఫీల్డ్అసిస్టెంట్): నా పేరు బి.చంద్రకళ. ఈ గ్రామానికి నేనే ఫీల్డ్ అసిస్టెంట్‌ని సార్. ఏపీడీ: ఉపాధి పనులు ప్రారంభం కాకముందు ఏం చేసేవారు..? ఎఫ్ఏ : ఇంటి దగ్గరే ఉండేదాన్ని. ఉపాధి హమీ పథకం వచ్చిన తరువాత ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నా. ఏపీడీ: నువ్వు చేసే పని ఏంటి..? ఎఫ్ఏ: పని కోసం వచ్చే వారికి పనులు కల్పించడం, కొలతలు ప్రకారం పనులు చేయించి, గరిష్ట వేతనం వచ్చేలా చూస్తాను సర్. ఏపీడీ: గరిష్ట వేతనాలు రావాలంటే ప్రత్యేక కార్యాచరణ ఏమైనా పాటిస్తున్నారా..? ఎఫ్ఏ: ప్రణాళిక ప్రకారం పనులు చేస్తుంటాం. ఉదయం పనిలోకి రాగానే ఎంత మంది కూలీలు వచ్చారో చూసుకుని వారికి గరిష్ట వేతనం గిట్టుబాటు అయ్యేలా కొలతలు ఇస్తాం. ఏపీడీ : మీ గ్రామంలో ఎంత మంది 100 రోజుల పాటు పనులు పూర్తి చేసుకున్నారు..? మిగిలిన వారి విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నావు..? ఎఫ్ఏ: మా గ్రామంలో ఇప్పటి వరకు 36 కుటుంబాల వారు 100 రోజుల పనులు పూర్తి చేసుకున్నారు. మరి కొంతమంది 80 నుంచి 90 రోజులకు దగ్గరల్లో ఉన్నారు. ముందుగా వారికి పని కల్పించడంతో పాటు 60 నుంచి 70 రోజులు పనులు పూర్తి చేసుకున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో పనులకు హాజరుకావాలని సూచిస్తా. ఏపీడీ: ఏమయ్యా నీ పేరు..? ఇంతకు ముందు నువ్వు ఏం పని చేసేవాడివి? తౌడు (ఉపాధి కూలి): నా పేరు తౌడు అండి. గతంలో ఉంటే వ్యవసాయం పనులు చేసే వాడిని. లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చునే వాడ్ని. ఐదు సంవ త్సరాలుగా ఉపాధి పనులు చేస్తున్నా. ఏపీడీ: నీకు రోజుకు ఎంత కూలి గిట్టుబాటు అవుతోంది..? తౌడు: రోజుకు రూ 150 వరకు వస్తంది. జట్టులో అందరూ వస్తే పని బాగా జరుగుతుంది. ఏపీడీ : ఏమమ్మా నీ పేరు..? మీకు పని ప్రదేశంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా..? లెంకగౌరి(ఉపాధి వేతనదారు): నా పేరు లెంక గౌరి. ప్రతి రోజు పనికి వస్తా. ఇక్కడ ఎండైతే కూర్చువటానికి టెంటు ఉంది. మంచి నీళ్లు మేమే తెచ్చుకుని తాగుతాం. ఏపీడీ: మంచినీటికిప్రభుత్వండబ్బులుఇస్తుంది .. తెలుసా..? గౌరి: అవున ండి ఎవరి నీరు వారే తెచ్చుకుంటాం. అందుకు ప్రభుత్వం రోజుకు రూ 5 ఇస్తుంది. అదేవిధంగా గునపానికి రూ10 , తట్టకు రూ10 చొప్పున ఇస్తోంది. ఏపీడీ: ఇవన్నీ మీకు ఇచ్చే వేతనం స్లిప్పులో ఉంటుంది .. చూస్తారా..? గౌరి: చూస్తానండి. నేనే పదోతరగతి చదివా.. ఏపీడీ : నీ పేరేంటి ? ఎన్ని రోజు లు పని చేశావు..? కె.జయమ్మ (ఉపాధి వేతనదారు) : నాపేరు కె.జ యమ్మ. ఈ సంవత్సరం నేను ఇప్పటికి 80 రోజులు పని చేశాను. ఏపీడీ: ప్రభుత్వం ఏడాదిలో 100 రోజులు పనులు కల్పిస్తోంది..అవి సరిపోతున్నాయా..? జయమ్మ: ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పనులకు వస్తే వంద రోజులు చాలవు. అప్పుడప్పుడు వ్యవసాయం పనులు ఉంటే వాటికే వెళిపోతాం. ఏపీడీ: కిందటి సంవత్సరం 100 రోజులు పనులు పూర్తి చేసుకున్నారా..? జయమ్మ: పూర్తి చేసేశాం. ఏపీడీ: ప్రతి రోజు పనిలోకి ఎన్ని గంటలకు వస్తారు..? జయమ్మ: ఉదయం 7.30 గంటలకు వచ్చి 11.00 గంటల వర కు చేస్తాం. మళ్లీ మధ్యాహ్నం వచ్చి ఆ రోజు పని పూర్తి చేస్తాం. ఏపీడీ: రాబోయేది వేసవి కాలం కదా.. అప్పుడు ఎలా పనులు చేస్తారు..? జయమ్మ: అప్పుడు తెల్లారే వచ్చేస్తామండి. ఏపీడీ: ఏమమ్మానీపేరేంటి..?ఎవరెవరుపనులకు వస్తారు..? రవణమ్మ : నా పేరు రెల్లి.రవణమ్మ అండి. నేను నా భర్తా పనులకు వస్తాం. ఏపీడీ: నీ పేరేంటమ్మ ..? నీకు రోజు కూలి ఎంత వస్తోంది ? విజయ ( మేట్) నా పేరు విజయ. రోజుకు రూ140 వరకు కూలి వస్తోంది. ఏపీడీ: మీ జట్టులో సభ్యులు ఎంత మంది ఉన్నారు ? మేట్: జట్టులో ఏడుగురు మగాళ్లు, నలుగురు ఆడవారు ఉన్నారు. ఉదయం రాగానే కొలతలు ఇచ్చి పనిప్రారంభిస్తా. వారితో పాటు నేనూ పని చేస్తా. ఏపీడీ: నీ పేరేంటమ్మ..? ఇక్కడ నువ్వు ఏంటి..? రేణుక(మేట్): నా పేరు రేణుక. పది వరకు చదివా.. నేనే మా జట్టుకు మేట్‌ని. ఏపీడీ: మీ జట్టులో వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారు ఎంత మంది ఉన్నారు..? మేట్: ఇప్పటికే నాలుగు కుటుంబాలు 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నాయి. మిగిలిన కుటుంబాల వారు 60 నుంచి 70 రోజులు పనులు పూర్తి చేసుకున్నారు. ఏపీడీ : నీ పేరేంటమ్మ..?ఎన్ని సంవత్సరాలు నుంచి పనిలోకి వస్తున్నావు..? రమణమ్మ: నాపేరు మండల.రమణమ్మ. మూడు సంవత్సరాల నుంచి పనిలోకి వస్తున్నా. ఏపీడీ:గతంలోఎంతకూలివచ్చేది..?ఇప్పుడుఎంత వస్తోంది..? రమణమ్మ: గతంలో రూ120 వరకు వచ్చేది... ఇప్పుడు రూ140 నుంచి రూ150 వరకు వస్తోంది. ఏపీడీ:నీపేరు..?ఉపాధిపనులుఎలాఉపయోగపడుతున్నాయి...? మంగ : నా పేరు మంగ. నాలుగు సంవత్సరాలుగా ఉపాధి పనులకు వస్తున్నా. మాకు ఇద్దరు పిల్లలు . విజయనగరంలో చదువుకుంటున్నారు. మాకు వచ్చే డబ్బులతో వారిద్దరిని బాగా చదివించాలనుకుంటున్నాం. ఏపీడీ: నీ పేరేంటమ్మా ? మీ పిల్లలు ఏం చేస్తుంటారు..? లక్ష్మి : నా పేరు లక్ష్మి. నేను నా భర్త ఇద్దరం పనిలోకి వస్తాం. ఇద్దరిదీ ఒకే సంఘం. మా పిల్లలు బొప్పడాం హైస్కూల్లో చదువుతున్నారు. ఏపీడీ: మీ భర్తపేరు..?ఉపాధి లేని రోజుల్లో ఏంచేసేవారు..? లక్ష్మి: నా భర్త పేరు దుర్గాప్రసాద్. నాయీ బ్రాహ్మణుడు. గతంలో కులవృత్తి చేసుకునే వాళ్లం .ఇప్పుడు ఉపాధి పనులు చేసుకుంటూ రోజుకు రూ150 సంపాదిస్తున్నాం. ఏపీడీ: నీ పేరు...? ఇక్కడ ఏం చేస్తుంటావు.. రమణమూర్తి (టెక్నికల్ అసిస్టెంట్) : నా పేరు శ్రీను. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా. ఏపీడీ: నీ బాధ్యతలు ఏంటి..? టీఏ: గ్రామంలో పనులు కావాలని వచ్చే వారందరికీ పనులు కల్పించటం. ప్రతి వారం వచ్చే దరఖాస్తులను స్వీకరించడంతో పాటు, నా పరిధిలో ఉన్న గ్రామాలకు వారంలో రెండు సార్లు వెళ్లి పనులు పరిస్థితిని పరిశీలిస్తాను. పని చేసే నైపుణ్యం లేని వారికి నైపుణ్యం కల్పించి వారితో పనులు చేయిస్తున్నాం. ఏపీడీ: ఎంపీడీఓగారూ...మండలంలో పరిస్థితి ఎలా ఉంది...? రాజకుమార్(ఎంపీడీఓ) ః మా మండలంలో ఏడాదికి సరాసరిన 10 నుంచి 12 వేల కుటుంబాల వారు ఉపాధి పనులకు హాజరవుతుంటారు. మారుతున్న విధి విధానాలకు అనుగుణంగా ప్రతి బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లకు మండల స్థాయిలో అవగాహన కల్పిస్తాం. మేట్లకు ఏడాదికి ఒక సారి శిక్షణా తరగుతలు నిర్వహించి చట్టం నిర్ధేశించిన మేర వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. -
వీఐపీ రిపోర్టర్ : వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి
-
విఐపి రిపోర్టర్ -ద్వారకా తిరుమల ఇఓ త్రినాధరావు
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : డాక్టర్ వెంకటేశ్వరరావు
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే సంజీవరావు
-
విఐపి రిపోర్టర్ - పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
-
విఐపి రిపోర్టర్ -రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు
-
సౌకర్యాల స్థాయి పెరగలేదు!
పేదల వైద్యానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా సమన్వయం, పర్యవేక్షణ లోపంతో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి రాజాం ఏరియా ఆస్పత్రి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆస్పత్రిని 60 పడకల నుంచి 100 పడకల స్థాయికి రెండేళ్ల క్రితం మార్చారు. సుమారు రూ.4 కోట్లు వెచ్చించి కొత్త భవనాలు నిర్మించారు. అయితే వైద్య పరీక్షలు, చికిత్సలకు అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చడంలో మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థాయి పెరిగినా.. ఆ స్థాయి వైద్యసేవలు అందక పేద రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పెద్ద జబ్బులు చేస్తే వేరే ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో సకాలంలో మెరుగైన చికిత్స అందక రోగులు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకు రాజాం ఎమ్మెల్యేల కంబాల జోగులు ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా ఆస్పత్రిలోని పలు వార్డుల్లో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. వైద్యాధికారులను, ఇతర సిబ్బందితో మాట్లాడి ఇక్కడ అందుతున్న వైద్యసేవలు, అవసరాలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి తన స్థాయిలో ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. వివిధ వర్గాలవారితో ఆయన జరిపిన సంభాషణ యథాతథంగా.. రోగులతో.. ఎమ్మెల్యే జోగులు(గైనిక్ వార్డులో): మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఆపరేషన్ చేశారా లేక సాధరణ డెలివరీయా? ఎంత ఖర్చు అయింది? స్టాఫ్‌కు డబ్బులు ఏమైనా ఇచ్చారా? మడ్డు దుర్గ(రోగి): రాజాం మండలం బొద్దాం నుంచి జనవరి 29న వచ్చి జాయిన్ అయ్యాను. సాధారణ డెలివరీ చేశారు. రూ.200 ఖర్చు అయ్యింది. స్టాఫ్ ఎవరూ డబ్బులు అడగలేదు. ఎమ్మెల్యే : మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? మీ సమస్య ఏంటి? ఆస్పత్రి పనితీరుపై మీ అభిప్రాయమేంటి? ముగడ నరిశింహులు(రోగి సహాయకుడు) : నా పేరు ముగడ నరిశింహులు. సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామం. పేషెంట్‌తో వచ్చా. జ్వరం, జలుబు, ఒళ్లుపీకులు ఉన్నాయని డాక్టర్‌కు చెప్పాం. మందులు ఇచ్చారు. గవర్నెమెంట్ మందులు కావడం వల్ల తగ్గడం లేదని చెప్పాం. మరి అవే ఉన్నాయని డాక్టర్ చెప్పారు. బయట మందులు కొనలేం. ఏం చేయాలో తోచడం లేదు. ఎమ్మెల్యే: ఏమమ్మా.. ఏంటి ప్రాబ్లమ్? ఎప్పుడు జాయిన్ అయ్యావ్? బాత్రూంలు బాగున్నాయా? నీటి సౌకర్యం ఉందా? జి.అప్పలనరసమ్మ(రోగి): విరేచనాలు, కడుపునొప్పితో వచ్చి జాయిన్ అయ్యాను. బాతరూంలు కంపు కొడుతున్నాయి. నీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. తాగునీరు కూడా లేక ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే: ఏమయ్యా.. ఏం జరిగింది? కాలుకి ఎలా దెబ్బ తగిలింది? వైద్యులు ఏమన్నారు? మందులు ఇస్తున్నారా? గురవాన లక్షుం(రోగి): పొలంలో కాలు జారి పడ్డాను. ఎముక విరిగింది. వైద్యులకు చూపిస్తే కట్టు కట్టారు. మందులు ఇస్తున్నారు. పరవాలేదనిపిస్తోంది. ఆపరేషన్ చేయడానికి షుగర్ ఉందన్నారు. ఎమ్మెల్యే: ఆస్పత్రిలో జాయిన్ అయ్యావు, ఏమైంది బాబూ? ఏంటి నీ సమస్య? నాగళ్ల దుర్గారావు(రోగి): కడుపు నొప్పితో జాయిన్ అయ్యాను. మందులు ఇచ్చారు. గ్యాస్ట్రిక్ ఉందని చెప్పారు. ఇప్పుడు బాగుంది. సూపరింటెండెంట్‌తో.. ఎమ్మెల్యే: ఆపరేషన్లు ఎందుకు చేయటం లేదు? అవసరమైతే ఎలా మరీ? గార రవిప్రసాద్(సూపరింటెండెంట్): ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడు ఉన్నారు. కానీ ఆయనకు ఆరోగ్యం బాగులేకపోవడటంతో విధులకు హాజరుకావడం లేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇంకా రెస్పాండ్ కాలేదు. ఎమ్మెల్యే: ఓపీ, ఇతర వైద్య సేవలకు ఎంతమంది వైద్యులు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఎంతమంది అవసరం? రవిప్రసాద్: ప్రతి రోజూ ఓపీకి 350 నుంచి 400 కేసులు వస్తాయి. ఐపీకి మరో 30 వరకు ఉంటాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 8 మంది వైద్యులు పనిచేస్తున్నారు. జనరల్ మెడిసన్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, జనరల్ సర్జన్, గైనకాలజిస్టు, ఎముకలు, మానసిక వైద్య నిపుణులు సాయిరాం, డెంటిస్టు, అనస్థసిస్ట్ ఉన్నారు. మరో ఆరుగురు వైద్యులు అవసరం. ఎమ్మెల్యే: కనీస అవసరాలకు కావల్సిన సిబ్బంది ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఏఏ సమస్యలు ఉన్నాయి? రవిప్రసాద్: బెడ్షీట్లు ఉతకడానికి దోబీ లేడు. పోస్టు మంజూరు చేయాలని ఉన్నతాధికారులను కోరినా స్పందించడం లేదు. దీంతో మంచాలపై బెడ్షీట్లు వేయలేకపోతున్నాం. ఎలక్ట్రీషియన్ లేడు. కరెంటు సమస్యలు ఎదుర్కొంటున్నాం. సొంత డబ్బులు పెట్టి ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నాం. చాలా కష్టంగా ఉంది. ఎమ్మెల్యే: ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలుతోంది కదా.. దాని నివారణకు ఏమైనా సౌకర్యాలు కల్పించారా? కేసులు ఏమైనా నమోదు అయ్యాయా? ప్రత్యేక నిధులు ఏమైనా మంజూరు అయ్యాయా? రవిప్రసాద్: స్వైన్‌ఫ్లూ లక్షణాలు కలిగిన రోగులు ఇంతవరకు రాలేదు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సౌకర్యాలు ఏమీ కల్పించలేదు. నిధులు కూడా మంజూరు కాలేదు. ఇక్కడికి వచ్చే రోగుల్లో అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రిమ్స్‌కు తరలిస్తాం. ఎమ్మెల్యే: ఆస్పత్రి నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం లేదు కదా!.. ఎలా మేనేజ్ చేస్తున్నారు? రవిప్రసాద్: ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. అవసరమైతే హెచ్డీఎఫ్సీ నిధులు ఖర్చు చేయమని చెప్పారు. కానీ ఇంతవరకూ కమిటీ ఏర్పాటు కాలేదు. మీటింగ్ కూడా జరగలేదు. విధిలేని పరిస్థితుల్లో సొంత డబ్బులు నెలకు సుమారు రూ. 15వేల వరకు ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో సగం మంది ఈ ప్రాంతం వారమే కాబట్టి.. సొంత ఊరిపై మమకారంతో ఆస్పత్రి నిర్వహణకు అయ్యే ఖర్చు భరిస్తున్నాం. చిన్నపిల్లల వైద్యనిపుణుడితో.. ఎమ్మెల్యే: చిన్న పిల్లల ఓపీ ఎంత ఉంటుంది? మందులు పూర్తి స్థాయిలో ఉన్నాయా? కరణం హరిబాబు(చిన్నపిల్లల వైద్యనిపుణుడు): ప్రతి రోజూ ఓపీ 50 నుంచి 60 వరకు ఉంటుంది. కొన్ని మందులు ఆస్పత్రిలోనే లభిస్తాయి. మరికొన్ని బయట మందులు షాపుల్లో దొరుకుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటి మందులు రాస్తాం. నర్సులతో.. ఎమ్మెల్యే: ఆస్పత్రిలో దుర్వాసన వస్తోంది. రోగులు ఉండలేక పోతున్నామంటున్నారు. పారిశుధ్ధ్య సిబ్బంది పనులు చేయటం లేదా? కాంట్రాక్టర్ రావటం లేదా? సోఫియా(హెడ్ నర్సు): దోబీ లేకపోవటంతో బెడ్షీట్లు ఉతకటం కుదరడం లేదు. దీంతో మంచాలపై బెడ్షీట్లు వేయటం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. కాంట్రాక్టర్ మాత్రం రావటం లేదు. సూపర్‌వైజరే అన్నీ చూస్తున్నారు. గదులు శుభ్రంగా ఉంచుతున్నాం. ఎమ్మెల్యే: ఏమమ్మా.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందా? పని విషయంలో భద్రత దొరుకుతుందా? విజయలక్ష్మి(స్టాఫ్ నర్స్): పదో పీఆర్సీ అమలు చేయటం లేదు. పనిలో భద్రత దొరకడం లేదు. పనికి తగ్గ జీతాలు ఇవ్వడం లేదు. పని పెరిగింది. సిబ్బంది తక్కువగా ఉన్నారు. మరో 14 మంది స్టాఫ్ నర్సులను నియమించాల్సి ఉంది. ఎమ్మెల్యే(ముక్తాయింపు): మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా.. పరిష్కారానికి చొరవ చూపుతా.. -
వీఐపీ రిపోర్టర్ : ఎస్కేయూ వీసీ లాల్‌కిషోర్
-
విఐపి రిపోర్టర్ - విద్యాసాగర్ రావు
-
విఐపి రిపోర్టర్ - విజయనగరం రైల్వే స్టేషన్ మాస్టర్ చంద్రశేఖర్‌రాజు
-
అర్హులందరికీ ఉపాధి
అడిగిన వారందరికీ ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తామని డ్వామా పీడీ చేరెడ్డి పుల్లారెడ్డి హామీనిచ్చారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారిఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లిమాట్లాడారు. వారు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. ఉపాధి పనులు పెడుతున్నారా, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా... ఎంత కూలి పడుతోంది.. ఇంకా ఏమి కోరుకుంటున్నారు.. తదితర విషయాలను ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. వెలుగులోకి వచ్చిన సమస్యలు... ఒక్కో కుటుంబంలో ఐదుగురు ఉన్నా ఒకే జాబ్ కార్డు ఉంది. దీంతో ఒక్కొక్కరు 20 నుంచి 35 రోజు పని చేసినా 100 రోజులు పూర్తి అవుతున్నాయి. తర్వాత ఉపాధి కరువు అవుతోంది. భూముల్లో వేసిన రాతికత్వలు వ్యవసాయానికి ఇబ్బందిగా మారాయి. సత్వరం వీటిని తొలగించాల్సి ఉంది. పొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మట్టి రోడ్లు వేయాలి. ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాల్వలు లేవు. దీంతో మురుగునీరు ఇళ్ల ముందే నిలుస్తోంది. ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచాలి. పీడీ : గ్రామస్తులందరూ బాగున్నారా... గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్నాయా... మీ రు ఉపాధి పనులకు వెళ్తున్నారా? పాపన్న : సార్.. నేను గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్నాను. అందరికీ అవసరమైన పనులు ఇంకా కల్పించలేదు. ఉపాధి పనులు కల్పిస్తే గ్రామంలో దాదాపు 120 కుటుంబాలకు మేలు జరుగుతుంది. పీడీ : అందరికీ పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని కుటుంబాలు ఈ పనులను వినియోగించుకోవాలి. సిద్ధయ్య : సార్.. గ్రామానికి దాదాపు 100 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 30 పూర్తి అయ్యాయి. మిగిలినవి కూడా వివిధ దశలో ఉన్నాయి. ఉపాధి పథకం కింద మొక్కలు నాటడం, పండ్ల తోటల అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వ్యవసాయ కూలీలకు కూడా పనులు కల్పిస్తున్నారు. పీడీ : ఇంతవరకు ఎన్ని రోజులు పని లభించింది, ఇంకా ఎలాంటి పనులు కోరుకుంటున్నారు? మద్దిలేటి : సార్.. మా కుటుంబానికి ఇప్పటికే 100 రోజుల పని లభించింది. పనిదినాలను 150 రోజులకు పెంచితే బాగుంటుంది. పీడీ: అందరికీ ఉపయోగకరమైన పనులు కల్పిస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పీడీ : ఏమ్మా.. నీ పేరు ఏమిటి? ఉపాధి పనులకు వెళ్తున్నావా... ఏ గ్రూపులో ఉన్నావు, ఎంత కూలీ పడుతోంది? మహిళ : నమస్కారం సార్.. నా పేరు సుబ్బమ్మ. వెన్నెల గ్రూపులో పనిచేస్తున్నాను. ఇప్పటికే 100 రోజుల పనిదినాలు పూర్తి అయ్యాయి. కూలీ రోజుకు సగటున రూ.120 నుంచి రూ.140 పడింది. పీడీ: అమ్మా.. వచ్చిన డబ్బులు ఏమి చేసుకుంటున్నావు? నాగమ్మ : మొన్నటివరకు పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇప్పుడు వారిని చదివించుకోవడానికి ఉపాధి వేతనాలు వినియోగిస్తున్నాం. అదే విధంగా పొలం అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఉపాధి పథకంతో వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. పీడీ : ఏమయ్యా నీ పేరు ఏమిటి? ఉపాధి పనులకు వెళ్తున్నావా.. ఇంతవరకు ఎన్ని రోజులు పనిచేశావు? కూలీ : సార్.. నా పేరు బాలన్న. ఈ సంవ త్సరంలో ఇప్పటివరకు మా కుటుంబం 70 రోజులు పనిచేసింది. ప్రస్తుతం పనులు లేవు. పనులు పెడితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఇంట్లో ఇద్దరం ఉపాధి పనులపైనే ఆధార పడివున్నాం. పీడీ : అందరికీ పనులు కల్పిస్తాం.. సరైన విధంగా పనిచేసుకుంటే గిట్టుబాటు వేతనం కూడా లభిస్తుంది. నీ పేరు ఏమిటి, నీకు ఏమైనా సమస్య ఉందా? కూలీ : సార్.. నా పేరు మౌలాలి. ఇంతవరకు 30 రోజులు పనిచేశాను. పొలం పనులు ఉండటం వల్ల ఉపాధి పనులు చేయలేదు. మా గ్రామంలో గతంలో పొలాల్లో రాతికత్వలు కట్టారు. ఇవి అడ్డంగా మారిపోయాయి. వీటిని ఎత్తివేసే విధంగా పనులు చేపట్టాలి. అడ్డంగా ఉన్న రాతికత్వలను ఎత్తివేయడం వల్ల రైతులకు సౌకర్యంగా సాగుకు అనువుగా ఉంటుంది. పీడీ : పొలంలో ఉన్న రాతికత్వలను ఎత్తివేసేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉందో లేదో చూస్తాను. అవకాశం ఉంటే కచ్చితంగా ఆ పనులకు అవకాశం ఇస్తాం. సర్పంచ్ : సార్.. గార్గేయపురం నుంచి కేతవరం వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. ఉపాధి పథకం కింద రోడ్డు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందా..? అదే విధంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగునీరు పోవడం లేదు. ఇళ్ల మధ్యనే నిలుస్తోంది. కాల్వలు నిర్మించడానికి చొరవ తీసుకోవాలి. పీడీ: రోడ్డు అభివృద్ధి చేసే పనులకు ఉపాధి పథకంలో అవకాశం ఉండదు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు మాత్రం అవకాశం ఉంది. ఎస్సీ కాలనీ సీసీ రోడ్లు వేయడానికి చర్యలు తీసుకుంటాం. మాణిక్యమ్మ : సార్.. రేండేళ్లుగా మేము ఉపాధి పనులపైనే ఆధారపడి బతుకుతున్నాం. మా ఇంటికి ఒక్క జాబ్ కార్డు ఉంది. ఇద్దరం పనిచేస్తాం. ఒక్కొక్కరం 50 రోజులు పనిచేయడంతో 100 రోజుల పనిదినాలు పూర్తి అయ్యాయి. ఇక మాకు ఉపాధి లేదంటున్నారు. పనిదినాలను 150 రోజులకు పెంచాలి. అప్పుడే మాకు ఉపయోగంగా ఉంటుంది. పీడీ : ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచడం మా చేతిలో లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పనిదినాలను 150 రోజులకు పెంచే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. అవసరమైతే మీ కుటుంబానికి మరో జాబ్ కార్డు ఇచ్చి 100 రోజుల పని కల్పిస్తాం. మహిళ : సార్... నా పేరు కళ్యాణి. జయంతి గ్రూపులో మేటిగా పనిచేస్తున్నాను. మాకు ఒక జాబ్ కార్డు ఉంది. ఇందులో నలుగురం పనిచేస్తున్నాం. ఒక్కొక్కరం 25 రోజులు పనిచేయడంతోనే 100 రోజు పనిదినాలు పూర్తి అయ్యాయి. ఇక పని లేదంటున్నారు. మా పరిస్థితి ఏమిటి? పీడీ : మీ ఇంటికి ఉన్న జాబ్ కార్డులో నలుగురు సభ్యులుగా ఉన్నారా... అయితే మీ కుటుంబానికి అదనంగా మరో జాబ్ కార్డు మంజూరు చేస్తాం. అర్హత కల్గిన అన్ని కుటుంబాలకు అదనపు జాబ్ కార్డులు ఇస్తాం. మీరు ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లి జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి... మంజూరు చేస్తాం. పీడీ : అమ్మా.. మీకు ఇప్పుడు ఎంత కూలి పడుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా...? మహిళలు : సార్.. మాకు ఇప్పటివరకు కూలి బాగానే పడుతోంది. రూ.120 నుంచి రూ.140 వరకు పడుతోంది. మాకు ఈ కూలి రూ.160 వరకు వచ్చే విధంగా చూడాలి. అప్పుడు మాకు ఉపాధి పనులు గిట్టుబాటు అవుతాయి. పీడీ : రోజుకు ప్రభుత్వం గరిష్ట కూలి రూ.169గా నిర్ణయించింది. ఈ మేరకు కూలి రావాలంటే రోజుకు కనీసం 8 గంటలు, కొలతల ప్రకారం పని చేయాలి. గోవర్ధన్ : సార్... ఉపాధి పథకం వ్యవసాయ కూలీలకు ఎంతో తోడ్పడుతోంది. గ్రామంలోని పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వేయిస్తే బాగుంటుంది. పీడీ : వ్యవసాయ భూములకు వెళ్లడానికి వీలుగా మట్టి రోడ్లు వేసేందుకు ఉపాధి హామీ పథకం కింద ప్రొవిజన్ ఉంది. -
సమస్యల స్టేషన్ !
ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్లో ప్రధాన జంక్షన్‌గా విజయనగరానికి పేరుంది. నిత్యం వందలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. అటు ఒడిశా, ఇటు రాయపూర్ వెళ్లాలన్నా వ్యాపారులు విజయనగరం రైల్వేస్టేషన్లోనే ట్రైన్ మారాల్సి ఉంటుంది. అందువల్లే జిల్లా వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇటువంటి స్టేషన్లో సమస్యలు కూత పెడతున్నాయి. రిజర్వేషన్ దగ్గర నుంచి డస్ట్బిన్ల ఏర్పాటు వరకూ పలు సమస్యలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన్లో టిఫిన్, టీ, తదితర స్టాల్స్ నిర్వహకులు ఎమ్ఆర్పీకి మించి అమ్ముతున్నారని, రైళ్లలో టాయిలెట్లు సక్రమంగా లేకపోవడ ం వంటి ఫిర్యాదులున్నాయి. విజయనగరం రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలను కనుగొనేందుకు విజయనగరం రైల్వే స్టేషన్ మేనేజర్ బి.చంద్రశేఖర రా జు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ గా మారారు. స్టేషన్ పరిసరాలతో పాటూ, ఫ్లాట్‌ఫామ్స్, రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు, పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే హమాలీలు, సీనియర్ టికెట్ కలెక్టర్లను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో ఆయన సంభాషణ ఇలా సాగింది స్టేషన్ మేనేజర్ : నమస్తే.. నా పేరు చంద్రశేఖర రాజు. నేను రైల్వే స్టేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. మీ సమస్యలు తెలుసుకోడానికి ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీ వద్దకు వచ్చాను. మీ పేరేంటి ? మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ప్రయాణికురాలు: నమస్తే సార్.. నా పేరు అరుణ. పండగకు ఊరొచ్చాం. మేము బెంగుళూరు వెళ్తున్నాం. స్టేషన్ మేనేజర్: రైల్వేస్టేషన్లో మీకేమైనా సమస్యలు ఎదురయ్యాయా ? స్టేషన్‌పై మీ అభిప్రాయమేంటి ? అరుణ: విజయనగరం రైల్వేస్టేషన్ గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గానే ఉంది. అప్పట్లో ఇరుగ్గా ఉండేది. ప్రస్తుతం విశాలంగా, సౌకర్యంగానే ఉంది. పెద్ద పెద్ద స్టేషన్లను బాగా డెవలప్ చేయాలి. స్టేషన్ మేనేజర్ : హలో సార్... నమస్తే, మీ పేరేంటి , సమస్యలు ఏమైనా ఉన్నాయా? రాజన్న: నాపేరు రాజన్న, స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగానే ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం గమనించాం. చెత్తా, చెదారాలు కిందపడేయకుండా మరికొన్ని డస్ట్బిన్లను ఏర్పాటుచేస్తే బావుంటుంది. స్టేషన్ మేనేజర్ : మరో ప్రయాణికుడి దగ్గరకు వెళ్తూ... మీ దగ్గర టికెట్ ఉందా? ఆన్లైన్లో తీశారా, రిజర్వేషన్ కౌంటర్ ద్వారానా? ఈజీ టికెటింగ్ పట్ల అభిప్రాయం? వంశీ: ఆన్లైన్లోనే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాను. మొబైల్ టికెటింగ్ రావడం రైల్వేస్‌లో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. పని సులభంగా అయిపోతుంది. భువనేశ్వర్ వెళ్తున్నాను. స్టేషన్ మేనేజర్: ప్రయాణికుల దగ్గర నుంచి ఎంఆర్పీని మించి అమ్ముతున్నారంట? ఇప్పుడే నా దృష్టికి వచ్చిం ది. ఏంటి విషయం ? వెంకటరావు, వ్యాపారి: లేదు సార్... అటువంటిదేమీ లేదు.. ఎక్కడో జరిగి ఉండవచ్చు. మన స్టేషన్లో ఎంఆర్పీకే అమ్మకాలు చేస్తున్నాం. స్టేషన్ మేనేజరు: నీ పేరేంటి, ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నావు? జీతం సక్రమంగా వస్తుందా? పారిశుద్ధ్య కార్మికుడు: నాపేరు అప్పలరాజు సార్, నాలుగేళ్ల నుంచి కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాను. ఎనిమిది గంటల సమయం పనిచేస్తాను. పీఎఫ్ కట్ అవుతోంది. రూ.5వేల వరకూ జీతమిస్తారు. ఈ లోపు బెంగుళూరు నుంచి భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రానే వచ్చింది. ఒక వ్యక్తి నడుస్తున్న రైల్లోంచి దూకడం గమనించిన స్టేషన్ మాస్టర్ ఆయన దగ్గరకు వెళ్లి సార్ నమస్తే, అలా దూకితే ప్రమాదమని తెలీదా ? రన్నింగ్ ట్రైన్లోంచి దిగడం కరెక్ట్ కాదు గదా? అశోక్ నాయక్ : ఆకలికి తట్టుకోలేక ఏదో తినేద్దామన్న ఆత్రుతతో గెంతేశాను. అంతేనండి. పొరపాటైంది. ఇంకెప్పుడూ ఇలా చేయను. స్టేషన్ మేనేజర్ : రైల్వే ప్రాంగణంలో మార్కింగ్ ప్రకారం పార్కింగ్ చేస్తున్నారా? కారు, జీపు తదితర పార్కింగ్లు చేయడంలో మీకేమైనా సమస్యలు వస్తున్నాయా? సీహెచ్ రాజా (డ్రైవర్) : లేదు సర్.. గత కొన్నాళ్లుగా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం. మార్కింగ్ మేరకు ఇచ్చిన స్థలంలో చక్కగానే పార్కింగ్ జరుగుతోంది. అదనపు రుసుం వసూలు చేయడం లేదు. కానీ పార్కింగ్ పక్కన ఖాళీస్థలాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం. స్టేషన్ మేనేజర్ : పార్కింగ్ పక్కన ఖాళీ స్థలంలో సులబ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. స్టేషన్ మేనేజర్ : ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులతో మాట్లాడుతూ.. రైలు ప్రయాణంలో ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా? బోగీలను క్లీన్‌గా ఉంచుతున్నారా? మంచి ఆహారాన్ని అందిస్తున్నారా ? డి.ఎస్. పాడి(ప్రయాణికుడు) : రైల్లో క్లీనింగ్ చేస్తున్నప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నవారికి కాస్త ఇబ్బందిగానే ఉంటోంది. బాత్రూమ్లు సక్రమంగా లేవు. నీటి సౌకర్యం లేదు. చెత్తా, చెదారాలు పడేస్తున్నారు. ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద క్లీనింగ్, వాటరింగ్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలి. స్టేషన్ మేనేజర్ : తప్పకుండా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరిస్తాం. అలా రైల్లోనే నడుస్తూ... క్యాంటిన్ బోగీలోకి వెళ్లి వండుతున్న ఆహారాపదార్థాలను పరిశీలించారు. రైస్ ఎప్పుడు వండారు? పన్నీరు ప్రెష్‌గా కనబడటం లేదు? ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంట? నిల్వ ఆహార పదార్థాలు ఇస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు ? ఏమిటి విషయం? రాజీవ్ గుప్త ( క్యాంటిన్ కార్ నిర్వహకుడు) : రైస్ ఇప్పుడే దించాము సార్.. లంచ్ టైమ్‌కి ప్యాకింగ్ చేసేందుకు పక్కన పెట్టాం. పన్నీరు ప్రెష్దే , ఎప్పటికప్పుడు ఆర్డర్ ప్రకారమే వంట చేస్తాం. వెజ్మీల్స్, బిర్యానీ, కాఫీ, టీ అన్నీ ఐఆర్సీటీసీ ఇచ్చిన ధరల ప్రకారమే విక్రయిస్తున్నాం. స్టేషన్ మేనేజర్ : రైలు దిగిన తర్వాత రైల్వే కూలీలతో మాట్లాడుతూ జీతం సక్రమంగా వస్తోందా? బేరాలు వస్తున్నాయా ? లక్ష్మణరావు(హమాలీ) : ప్రయాణికులు చక్రాల బ్యాగులు వాడుతుండడంతో వారే తమతో పాటు తీసుకువెళుతున్నారు. ఇంకా మేము మోసేది ఎక్కడ సార్. ప్రభుత్వం రూ.2,415 ఇస్తుంది. అది కూడా 30 మందికే వస్తుంది. ఇంకా 140 మంది వరకూ కార్మికులు ఉన్నారు. బయట కూలికెళితే రోజుకు రూ.300 వరకూ వస్తుంది. ఇక్కడ అది కూడా రావడంలేదు. పీఎఫ్ లే దు. పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నాం. స్టేషన్ మేనేజర్ : మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను. స్టేషన్ మేనేజర్ : స్టేషన్లో టికెట్ చెకింగ్ ఎలా ఉంది? టికెట్ తీసే ప్రయాణాలు చేస్తున్నారా ? ఎవరైనా టికెట్లేని ప్రయాణికులు దొరికారా ? బీరేంద్ (సీనియర్ టీసీ) : లేదు సర్.. ప్రయాణికులు టికెట్ తీస్తున్నారు. స్టేషన్ మేనేజర్ : రైల్వే రిజర్వేషన్ కౌంటర్లోకి వెళ్తూ... స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికురాలికి సూచించారు. అనంతరం ఆమె దగ్గర ఉన్న చీపురును తీసుకుని రిజర్వేషన్ కౌంటర్లో ఒక భాగాన్ని పరిశుభ్రం చేశారు. అనంతరం ఆమెతో మాట్లాడుతూ సక్రమంగా జీతాలు వస్తున్నాయా ? ఫినాయిల్, బ్లీచింగ్ తదితర వాటిని సక్రమంగా అందజేస్తున్నారా ? లక్ష్మి (పారిశుద్ధ్య కార్మికురాలు): పారిశుద్ధ్య కార్మికులంతా ఒకరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. రిజర్వేషన్ కౌంటర్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే చెత్తా,చెదారాలు పేరుకుపోతుంటాయి. అందుకే నిత్యం ఒకరు పనిచేస్తూనే ఉంటాం సార్.. ఫినాయిల్, బ్లీచింగ్ తదితర సామాగ్రిని సక్రమంగానే అందజేస్తున్నారు సర్. -
పేదల సేవే పరమావధిగా..
ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే పై ప్రాణాలు పైనే పోతాయనే భయం వెన్నాడుతుంటుంది. అక్కడి అపరిశుభ్ర వాతావరణం వల్ల కొత్త రోగాలు అంటుకుంటాయని జనం బెంబేలెత్తిపోతుంటారు. అక్కడ సిబ్బంది నుంచి వైద్యుల వరకూ అందరి చేతులూ తడిపితేనే గానీ వైద్యం అందదనే అవినీతి మరక ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్‌కు దీటుగా చేసేందుకు, సిబ్బందిలో క్రమశిక్షణ పెంచడంతోపాటు అవినీతిని పారదోలడం వంటి అంశాలపై దృష్టిపెట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ ఆసుపత్రిలోని ఏ విభాగంలో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా పరిశీలించాలనుకున్నారు. అందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను పలకరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ మోహన్ : ఏమ్మా.. ఈ ఆసుపత్రిలో మీరు గుర్తించిన ఇబ్బందులేమైనా ఉన్నాయూ. కె.జ్యోతి : దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల కోసం ఓపీ సమయాన్ని పెంచితే బాగుంటుంది. డాక్టర్ మోహన్ : ఏమండీ.. మీ పేరేంటి. మీరు గుర్తించిన సమస్యలేమిటి. ఆర్.భవానీ, పాలకొల్లు : ఆసుపత్రిలోకి రావాలంటే ఆటోలు అడ్డుగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎటు తిప్పుతారో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నాం. ఓపీ టికెట్లు ఇచ్చే ప్రాంతానికి వెళ్లిన సూపరింటెండెంట్ మోహన్ అక్కడి మహిళలతో ఓపీ టికెట్లు తీసుకోవడంలో ఏమైనా ఇబ్బం దులు ఎదురౌతున్నాయా అని ప్రశ్నిం చారు. లేవని సమాధానం రావడంతో డయాగ్నోస్టిక్స్ విభాగానికి వెళ్లారు. డాక్టర్ మోహన్ : ఏపని మీద వచ్చారు. అందరూ నిలబడే ఉన్నారేంటి. ఎం.దుర్గ, గుడివాకలంక : రక్తం, కఫ పరీ క్షలు చేయించుకోవడానికి వచ్చాం సార్. ఇక్కడ కూర్చోవడానికి ఏమీ లేకపోవడంతో నిలబడ్డాం. డాక్టర్ మోహన్ : మీరూ పరీక్షలకే వచ్చారా. కాగిత మంగాపట్నం : ఔనండి. నమూనాలు ఇచ్చాం. ఫలితం రావడానికి సమయం పడుతుందన్నారు. కొన్ని రేపు ఇస్తామంటున్నారు. అన్ని ఫలితాలూ ఈ రోజే ఇచ్చేలా చూడండి. పరీక్షా కేంద్రం లోనికి వెళ్లిన సూపరింటెండెంట్‌ను రక్త, మూత్ర తదితర పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతోంది, త్వరగా ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అని ప్రశ్నించారు. డి.వెంకట్రావు, ల్యాబ్ టెక్నీషియన్ : చాలా పరీక్షల ఫలితాలు కొంతసేపటిలోనే ఇస్తున్నాం సార్. కొన్ని పరీక్షలకు సమ యం పడుతుంది. వాటిని త్వరగా ఇవ్వడానికి సాధ్యపడదు. అక్కడి నుం చి నవజాత శిశువుల విభాగానికి వెళ్లిన మోహన్ అక్కడి మహిళలతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న ఎముకల విభాగానికి వెళ్లారు. డాక్టర్ మోహన్ : చికిత్స బాగా జరిగిం దా. ఏమైనా ఇబ్బందులున్నాయా. వి.శ్యామలాదేవి : వైద్యం బాగానే చేశారు. భోజనంలో నాణ్యత లేదు. డాక్టర్ మోహన్ :మీరు చెప్పండి. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి. కాట్రు సురేష్, ధర్మాజీగూడెం : శ్లాబ్ నుంచి నీరు కారి మంచాలపై పడుతోంది. చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడి నుంచి ప్రధాన డ్రగ్ స్టోర్స్‌కు వెళ్లిన డాక్టర్ మోహన్ ‘రోగు లకు అవసరమైన మందులన్నీ ఉన్నా యా. స్వైన్ ఫ్లూ నివారణ మందులున్నాయా’ అని ప్రశ్నించారు. ఎం.ఇందిర : అన్ని మందులూ అందుబాటులో ఉన్నాయ్ సార్. స్వైన్ ఫ్లూ మందులు ప్రస్తుతం మనవద్ద లేవు. ప్రసూతి వార్డుకు వెళ్లిన మోహన్ ‘ఇక్కడ సిబ్బంది ఎలా చూస్తున్నారు. ఆపరేషన్ చేయడానికి ఎవరికైనా డబ్బులిచ్చారా’ అని అడిగారు. ఎం.రేవతి : బాగానే చూస్తున్నారు. ఎవరూ డబ్బు అడగలేదు. అక్కడి నుంచి మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లిన సూపరింటెండెంట్ ‘ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఇంకా ఏమైనా చేయాలా’ని సిబ్బందిని ప్రశ్నించారు. బి.సుందరబాబు : సిబ్బంది బాగా తగ్గిపోయారు సార్. ఎంఎన్‌వోలు, స్ట్రెచర్ బేరర్లు లేకపోవడంతో వారి పనులు కూడా మేమే చేయాల్సి వస్తోంది. దీని వల్ల ఆపరేషన్లు సమయానికి పూర్తి చేయలేకపోతున్నాం. డాక్టర్ మోహన్ : అది సరే.. ఇక్కడ ఆపరేషన్లు చేస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయ్. ఎం.సత్యనారాయణ : అలాంటిందేం లేదు సార్. ఎవరైనా సంతోషం కొద్దీ ఇస్తే తీసుకుంటున్నాం. డాక్టర్ మోహన్ : సంతోషంగా ఇచ్చినా తీసుకోవద్దు. అదే అలవాటై ఇవ్వని వా ళ్లను అడిగే పరిస్థితికి దిగజార్చుతుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సిబ్బందితో మాట్లాడుతూ ‘ఎక్కడైనా లోటు జరుగుతోందా’ అని అడిగారు. జి.రంగమణి : ఇక్కడ చేరిన వారందరికీ అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయ్ సార్. సెక్షనింగ్ (అన్ని బెడ్లకు ఆక్సిజన్) సౌకర్యం కల్పిస్తే మరింత త్వరగా సేవలందించే వీలవుతుంది. ట్రామా కేర్ సెంటర్‌ను సందర్శించి సేవలపై ఆరా తీశారు. ఏఎన్ఎంలతో మాట్లాడుతూ.. డాక్టర్ మోహన్ : మీకేమైనా సమస్యలున్నాయా. ఏఎన్ఎంలు : వైద్య సేవలందించే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్న మాకు 5 నెలలుగా జీతాలు అందలేదు. పిల్లలతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. వెంటనే జీతాలు విడుదల చేయించడానికి చర్యలు తీసుకోండి సార్. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే జలీల్ ఖాన్
-
విఐపి రిపోర్టర్ - ఏలూరు డిఎస్పీ సరిత
-
వీఐపీ రిపోర్టర్ : మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే sv మోహన్‌రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే శ్యామసుందర శివాజీ
-
వీఐపీ రిపోర్టర్ : అన్నవరం ఈఓ జగన్నాథరావు
-
విఐపి రిపోర్టర్ - దపేధర్ రాజు
-
విఐపి రిపోర్టర్ - ఆళ్ల రామకృష్ణారెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే గాదరి కిషోర్
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే జయరాములు
-
కౌన్సిల్లో మీ గొంతుకనవుతా..
నల్లగొండ: ‘విద్య’తోనే ప్రగతి... అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం.... ఉమ్మడి సర్వీసు రూల్స్ లేక పదేళ్లుగా నిలిచిపోయిన కీలకపోస్టుల పదోన్నతులు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు ‘కల్పన’గానే మిగిలిపోతున్నది. హెల్త్‌కార్డుల జారీకి స్పష్టమైన నిబంధనల కోసం ఎదురుచూపులు.... ఆశల లోకంలో విహరింపజేస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటన, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.... పాఠశాలల పనివేళల మార్పుతో ఇబ్బందులు.. ఇలా ఎన్నో హామీలపై గత పాలకుల వాగ్దానాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నల్లగొండలో పలువురు ఉపాధ్యాయులు, సంఘ నేతలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలుసుకున్నారు. ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కౌన్సిల్లో మీ గొంతుకనవుతానని భరోసా ఇచ్చారు. నల్లగొండ నుంచి పూల రవీందర్ వీఐపీ రిపోర్ట్... పూల రవీందర్ : ఏమండీ నర్సింహారెడ్డి గారు.. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులెదురవుతున్నాయి? కోమటిరెడ్డి నర్సింహారెడ్డి : సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనడం సంతోషమే. పాఠశాలల్లో నీళ్లున్నా తెచ్చే వారు లేరు. అటెండర్లు, స్వీపర్లను నియమించాలి. మౌలిక వసతులు కల్పించాలి. పూల : హెల్త్‌కార్డులు ఎలా ఉండాలనుకుంటున్నారు? అలుగుపల్లి పాపిరెడ్డి : హెల్త్కార్డ్స్పై స్పష్టమైన నిబంధనలివ్వాలి. ఎయిడెడ్ వారికీ కార్డులివ్వాలి. వారికి 010 పద్దు కింద జీతాలివ్వాలి. 2013 జూలై నుంచి పీఆర్సీని వర్తింపజేస్తూ వెంటనే ప్రకటించాలి. పూల :ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటున్నారు? జెల్లా చంద్రమౌళి : ఉమ్మడి సర్వీసురూల్స్ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత పదేళ్లుగా ప్రమోషన్లు నిలిచిపోయాయి. వెంటనే డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులివ్వాలి. పూల : తెలంగాణ పునర్నిర్మాణానికి మీ సూచన? మునగాల సోమయ్య : కామన్ స్కూల్ విధానాన్ని అమలుపర్చాలి. వేర్వేరు యాజమాన్యాల పరిధి నుంచి అన్ని స్కూళ్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. పూల : మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం బాగున్నాయా? నంద్యాల మోహన్‌రెడ్డి : మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం సరఫరా ముదావహం. పిల్లలు ఇష్టంగా తింటున్నారు. వారికి సరిపడే రీతిలో బియ్యం కోటా పెంచాలి. పాఠశాలల పనివేళలను సవరించాలి. పూల ః పీఈటీల సమస్యలున్నాయా? పి.కృష్ణమూర్తిగౌడ్ : హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ స్థాయి పీఈటీలను, ప్రైమరీ స్కూళ్లలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలి. గ్రౌండ్ ఉంటేనే ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి. పూల ః పండిట్లు ఏం ఆశిస్తున్నారు? ఎండీ. యూసుఫుద్దీన్ : 2009 నుంచి పండిట్ల సమస్యను పాలకులు నాన్చుతున్నారు. తెలుగు, ఉర్ధూ, హిందీ పండిట్ల పోస్టుల అప్‌గ్రేడేషన్ ఫైల్‌కు మోక్షం కల్పించాలి. పూల ః మీకున్న సమస్యలేమిటి? కె.రాజారామ్: జీఓ 342 ఎస్సీ, ఎస్టీలు వేతనంతో కూడిన రెండేళ్ల ఉన్నత చదువులకున్న అవకాశాన్ని తొలగించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇలాంటివి పునరుద్ధరించాలి. పూల:ఎలాంటి వేతన సవరణను కోరుకుంటున్నారు? సుంకరి భిక్షంగౌడ్ : 63 శాతం ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణను అమలు చేయాలి. 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, 1996 డి.యస్సీలో నియమితులైన ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి. పూల : హెడ్మాస్టర్ల సమస్యల పరిస్థితి ఏమిటి? సీహెచ్.చంద్రశేఖర్ : పాఠశాలల్లో కంప్యూటర్లు ఇతర విలువైన పరికరాలుంటున్నాయి. వాచ్మన్లను నియమించాలి. నాన్‌టీచింగ్, పరిశుభ్రత సిబ్బందిని రిక్రూట్ చేయాలి. పూల ఃనాలుగో తరగతి ఉద్యోగుల ఇబ్బందులేమిటి? మర్రి యాదయ్యగౌడ్ : 112 జీఓను సవరించాలి. చాలాకాలం నుంచి పనిచేస్తున్న కాంటింజెంట్ స్వీపర్లు, పార్ట్‌టైమ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి. పూల : వృత్తి విద్య ఉపాధ్యాయులేమంటున్నారు? ఎండీ.కరీం : 8వ తరగతి వరకే రెగ్యులర్ కోర్సులు బోధించాలి. ఆ తర్వాత ఉపాధి యోగ్యమైన వృత్తి వి ద్యా కోర్సులను అందరు విద్యార్థులకు అందించాలి. పూల : హెల్త్‌కార్డులపై ఏం సూచనలిస్తారు? వెంకులు : హెల్త్ స్కీమ్ కోసం ఉపాధ్యాయుల నుంచి ప్రతి నెలా కంట్రిబూషన్ స్వీకరించి నాణ్యమైన వైద్య సేవలందించే విధంగా హెల్త్‌కార్డులు జారీ చేయాలి. పూల :ప్రభుత్వ విద్యా రంగాన్ని ఎలా బలోపేతం చేద్దాం? ఎస్ఎం అలీం : ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచే మంచి విద్యనందించేందుకు తరగతికో ఉపాధ్యాయుడిని నియమించాలి. పూల : సెల్ఫోన్ల నిషేధంపై మీ అభిప్రాయం? వెంకటేశ్వర్లు : సెల్ఫోన్లను నిషేధించినంత మాత్రాన పాఠశాలలో ఉదో పెద్ద మార్పును ఆశించలేం. దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచితే చాలు. పూల: మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వివరిస్తారా? కాలం నారాయణరెడ్డి : పాఠశాలల్లో మహిళా టీచర్లకు టాయిలెట్లు లేవు. మౌలిక వసతులను కల్పించాలి. పాఠశాలల పనివేళలను సవరించాలి. విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా.. విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధి చూపుతున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డిల సహకారంతో సమస్యలను అధిగమించి అభివృద్ధి పథంలో నడిపిస్తా. గత 60 సంవత్సరాల్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. కామన్ సర్వీస్ రూల్స్‌కు త్వరలోనే సానుకూల ఫలితం రానున్నది. మధ్యాహ్న భోజన పధకంలో సన్నబియ్యం పట్ల విద్యార్థులు ఆకర్శితులవుతున్నారు. కడుపు నిండా భోజనం అందించేందుకు బియ్యం కోటా పెంచేందుకు కృషి చేస్తాం. విద్యార్థుల నమోదును పెంచితే తరగతులు పెరుగుతాయి. టీచర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. పీఆర్సీ, హెల్త్‌కార్డుల జారీ, అందరినీ మెప్పించే విధంగా సీఎంతో చర్చిస్తాం. ఇంకా పలు సమస్యలను కౌన్సిల్లో చర్చించి ప్రభుత్వంతో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. పూల రవీందర్ హామీలు.. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి, త్వరలోనే ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ ఏర్పాటు. విద్యార్థుల సంఖ్య పెరిగితే తరగతికో ఉపాధ్యాయుడి నియామకానికి ప్రత్యేక కృషి. పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి 398 టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, 1996 డీ.ఎస్సీ నియమిత టీచర్లకు జరిగిన నష్టం భర్తీ. పాఠశాలల పనివేళల మార్పు, మధ్యాహ్న భోజనంలో బియ్యం కోటా పెంచడం. మెరుగైన పీఆర్సీ, కార్పొరేట్ వైద్యం అందే హెల్త్‌కార్డులు. -
వెతలు తీరుస్తా..
రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ ప్రాంతం మెదక్ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పట్టణం. భిన్న సంస్కృతులకు నిలయం. వలస జీవుల ఆవాసం. మినీ భారత్‌ను తలపించే నియోజకవర్గ కేంద్రం. జనాభాకు తగ్గట్టుగానే ఇక్కడి సమస్యలూ ఎక్కువే. అందుకే ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించే వారికి క్షణం తీరిక ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ తలమునకలై ఉంటారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మహిపాల్‌రెడ్డిది కూడా అదే పరిస్థితి. కానీ ఆదివారం ఆయన ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కొత్త అవతారం ఎత్తారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారి స్థానిక మార్కెట్ సమస్యలు తెలుసుకున్నారు. ఇటు వ్యాపారులు, అటు వినియోగదారుల ఇబ్బందులను వారి ద్వారానే తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి: ఏమయ్యా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి. వ్యాపారి అల్తాఫ్ : సార్ నమస్కారం (లేచి నిలబడేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే వారించి కూర్చోబెట్టారు) సార్ ధరలు మండి పోతున్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. ఎమ్మెల్యే: తెలంగాణ రాష్ట్రం వచ్చిన త ర్వాతకూడ ధరలు తగ్గలేదా? (నవ్వుతూ) అల్తాఫ్: అలా అని కాదు సార్.. కాలం సరిగ్గా లేక కూరగాయల ధరలు పెరిగాయి. ఎమ్మెల్యే: పటాన్‌చెరుకు కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అల్తాఫ్: సిటీ నుంచి సార్. అలాగే శంకర్పల్లి, పటాన్చెరు మండలం నుంచి కూడా వస్తున్నాయ్. ఎమ్మెల్యే: కూరగాయల మార్కెట్లో ఉన్న సమస్యలేంటి ? అశోక్ (స్థానికుడు): చాలా సమస్యలున్నాయి సార్. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ మార్కెట్‌ను పట్టించుకో లేదు. మీరైనా దయతో దీన్ని బాగు చేయండి. పారిశ్రామిక వాడ పెద్దగా ఉన్నా, మార్కెట్ ప్రత్యేక ప్రదేశం లేదు. దీంతో రోడ్డుపైనే మార్కెట్ జరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే : మున్సిపాలిటీ వాళ్లు రోజు మార్కెట్‌ను శుభ్రం చేస్తున్నారా? అర్షాద్ (స్థానికుడు): లేదు సార్... మార్కెట్లో కంపువాసన వస్తోంది. మురిగిపోయిన కూరగాయలను ఇక్కడి నుంచి తొలగించడం లేదు. వర్షాకాలంలో అమ్మేటోళ్లు, కొనేటోళ్లు శాన ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటోళ్లు సరిగ్గా పట్టించుకుంట లేరు. మార్కెట్‌ను షిఫ్టు చేయాలి. రోడ్డు మీద కూరగాయలు అమ్మకుండా సూడాలి. (సమస్యలన్నీ సావదానంగా విన్న మహిపాల్‌రెడ్డి స్పందిస్తూ) ఎమ్మెల్యే: పట్టణంలోని తిమేసియా ఫ్యాక్టరీ ఆవరణలో 12 ఎకరాల జాగా ఉంది. అక్కడికి మార్కెట్‌ను తరలిస్తాం. అన్ని రకాల వసతులు కల్పిస్తాం. ఇదే విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఒక్కటిన్నర నెలలో కూరగాయల మార్కెట్‌ను అక్కడికి తరలిస్తాం. దశాబ్దాల మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. (ఒక్కొక్కొ దుకాణాన్ని చూస్తూ ముందుకు సాగిన మహిపాల్‌రెడ్డి మహిళా వ్యాపారి వద్ద ఆగారు) ఎమ్మెల్యే : ఏమమ్మా మార్కెట్ యార్డును తిమేసియా ఫ్యాక్టరీ దగ్గరలోని స్థలంలోకి బదిలీ చేస్తే బాగుంటదా? వ్యాపారి నర్సమ్మ : ఇక్కడైతే ఏం బాగాలేదు పటేలా. మార్కెట్‌ను మంచి జాగలో పెటుండ్రి. ఇప్పుడైతే సానా కష్టాలు పడుతున్నాం. ఏండ్ల నుంచి ఈడనే అమ్ముతున్నాం. కొనేటోళ్లకు, మాకు శాన ఇబ్బంది ఐతాంది. ఎమ్మెల్యే: ఇక ఈ సమస్యలన్నీ పోతయి తల్లీ.. త్వరలోనే మార్కెట్ కమిటీని కూడా ఏర్పాటు చేయిస్తా. (మార్కెట్‌కు వచ్చిన ప్రజలతో మాట్లాడిన మహిపాల్‌రెడ్డి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు) ఎమ్మెల్యే: పింఛన్లు అందరికి వస్తున్నాయా? లక్ష్మమ్మ: సారూ...మాకు పింఛన్లు రావడం లేదు. ఎవరికి అడిగినా సమాధానం లేదు. ఎమ్మెల్యే: ఏం బాధపడొద్దమ్మా...పింఛనే కాదు..అన్ని సంక్షేమ పథకాలను అర్హులందరికీ దక్కేలా చూస్తా. పింఛన్ పోయిందని ఆందోళనొద్దు. నీను నేనేం జెప్తున్నా తప్పకుండా నీకు పింఛన్ వస్తుంది. (పక్కనే ఉన్న శ్రీనివాస్ అనే స్థానికుడు కల్పించుకుని..) శ్రీనివాస్: వృద్ధులు, వికలాంగులు పింఛన్ కోసం ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇచ్చే రూ. 200లే అందరికీ ఇస్తే బాగుండేది. ఎమ్మెల్యే: అర్హులందరికీ రూ. వెయ్యి పింఛన్లు వస్తాయి. గతంలో రూ. 200 ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. అర్హులై ఉండీ ఇంతవరకూ పింఛన్లు రాని వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోండి. తప్పకుండా వస్తుంది. ఎమ్మెల్యే: సర్కార్ భూముల్లో నివాసముంటున్న పేదోళ్లకు ఉచితంగానే పట్టాలిస్తున్నారు తెలుసా? (అక్కడున్న వాళ్లంతా అనుమానంగా మొహాలు చూసుకున్నారు..వారి అనుమానం అర్థం చేసుకున్న మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ..) ఎమ్మెల్యే: అవునయ్యా..సర్కార్ స్థలంలో ఉన్న పేదోళ్లందరికీ సర్కార్ పట్టాలిస్తుంది. అయితే నివాసముంటున్న భూమి 125 గజాల్లోపు ఉండాలి. అర్హులంతా 18వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం ఉచితంగానే పట్టాలిస్తుంది. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు వీఐపీ రిపోర్టర్‌ను చేయడంతో పాటు ప్రజల వద్దకు తీసుకువచ్చి వారి సమస్యలను స్వయంగా తెలుసుకునే చేసిన ‘సాక్షి’ ప్రత్యేక కృతజ్ఞతలు. విలేకరిగా మారి జనం సమస్యలను రిపోర్ట్ చేయడం మంచి అనుభూతిని మిగిల్చింది. స్వాతంత్య్రం రాక ముందునుంచీ పట్టణంలో కూరగాయల సంత ఇక్కడే జరిగేది. జనాభా పెరిగినా సౌకర్యాలు ఆమేరకు పెరగలేదు. తెలంగాణ సర్కార్ దశాబ్ధాల మార్కెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. -మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు -
వీఐపీ రిపోర్టర్ : కలెక్టర్ రఘునందన్ రావు
-
వీరికి కష్టం.. వారికి నష్టం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖవంతం.. అన్న నినాదం ప్రచారానికే పరిమితమవుతోంది. కాలం చెల్లిన బస్సులు.. అరకొర సర్వీసులతో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. కండీషన్లో లేని బస్సుల వల్ల ప్రాణాలకు భద్రత లేకుండాపోతోంది. బస్టాండ్లు, కాంప్లెక్సుల్లో వసతుల కొరత, సమయానికి రాని బస్సులు, పలు రూట్లలో అందుబాటులో లేని సర్వీసులతో ప్రైవేట్ వాహనాలపై ఆధారపడక తప్పని పరిస్థితిని ఆర్టీసీయే కల్పిస్తోంది. జిల్లాలో శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, పాలకొండ, టెక్కలి, పలాస డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 462 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతిరోజూ సుమారు లక్షన్నర మంది ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కాగా సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో వారి సమస్యలు, ఆర్టీసీ పనితీరును తెలుసుకునేందుకు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ సమస్యలను ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ప్రయాణికులు, సిబ్బంది, అధికారులతో మాట్లాడి పలు సమస్యలు తెలుసుకున్నారు. వసతులను పరిశీలించారు. వివిధ వర్గాలతో ఆయన జరిపిన సంభాషణ యథాతథంగా.. స్టేషన్ మాస్టర్‌తో.. సత్యనారాయణ(డీసీటీఎం) : ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సరైన సౌకర్యాలు కల్పించారా? బీఎల్పీరావు(స్టేషన్‌మాస్టర్): ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. కాంప్లెక్స్ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చేస్తున్నాం. కాంప్లెక్స్‌లోని దుకాణాల్లో వస్తువులు ఎంఆర్పీ రేట్లకే అమ్మేలా చర్యలు చేపడుతున్నాం. డీసీటీఎం: కాంప్లెక్స్‌లో బిచ్చగాళ్ళు ఎక్కువయ్యారని, పందులు, పశువులు సంచరిస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? స్టేషన్ మాస్టర్: బిచ్చగాళ్ళు లేకుండా చూస్తున్నాం. పందులు, పశువుల సంచారానికి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీసీటీఎం: పచ్చదనంపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? స్టేషన్ మాస్టర్: ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పోర్టికోకు ఇరువైపులా మొక్కలు పెట్టాం. కాంప్లెక్స్ వెనుక మొక్కలు నాటాం. ఇటీవల తుపానుకు చాలా చెట్లు విరిగిపోయాయి. వీటి స్థానంలో కొత్త మొక్కలు నాటాం. ప్రయాణికులతో.. డీసీటీఎం: ఆర్టీసీ బస్సులు సకాలంలో నడుస్తున్నాయా? జి.చైతన్య(విద్యార్థి): కళాశాలకు వెళ్లేందుకు నేను ప్రతిరోజూ రణస్థలం నుంచి శ్రీకాకుళం వస్తుంటాను. సకాలంలో బస్సులు రావు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపితే బాగుంటుంది. డీసీటీఎం: కాంప్లెక్స్‌లో మరుగుదొడ్ల పరిస్థితి ఏవిధంగా ఉంది? టి.డి.రాజు(ప్రయాణికుడు): మరుగుదొడ్ల వసతి బాగానే ఉంది. డీసీటీఎం: బస్సులు సకాలంలో నడుస్తున్నాయా? కండక్టర్, డ్రైవ ర్ల ప్రవర్తన ఎలా ఉంటోంది? పలువురు ప్రయాణికులు: చాలా వరకు సకాలంలో నడుస్తున్నా. కొన్ని సందర్భాల్లో రెండు మూడు బస్సులు ఒకేసారి వస్తున్నాయి. తర్వాత చాలా సేపటి వరకు అసలు ఉండటం లేదు. కొందరు కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటోంది. చిల్లర విషయంలో, బస్సులు నిలిపే విషయంలో వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. డీసీటీఎం: ఆర్టీసీ బస్సులు సౌకర్యవంతంగా ఉన్నాయా? మరికొందరు ప్రయాణికులు: ప్రైవేటు వాహనాల కంటే కొంత నయం. అయితే ఆర్టీసీ బస్సు డిపోల నుంచి వచ్చేటపుడే బ్రేకులు, లైట్లు, టైర్లు వంటివి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. డీసీటీఎం: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. లాభాల బాట పట్టాలంటే ఏం చేయాలి? ఈశ్వరరావు(ప్రయాణికుడు): లోపాలు ఎక్కడ ఉన్నాయో ముందు గుర్తించాలి. బస్సులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఆదాయం అధికంగా వచ్చే రూట్లను గుర్తించాలి. ఆయా రూట్లలో బస్సులు సకాలంలో నడిపితే ఫలితం బాగుంటుంది. దుకాణదారులతో.. డీసీటీఎం: కాంప్లెక్స్‌లోని దుకాణాల్లో వస్తువులను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి? మీ సమాధానం ఏంటి? వి.జనార్ధన్(దుకాణదారుడు): వస్తువులను అధిక రేట్లకు విక్రయించడం లేదు. ధరల పట్టికను కూడా పెడుతున్నాం. డీసీటీఎం: తినుబండారాలు, పళ్లు, రసాలపై ఈగలు, దోమలు వాలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కుటుంబరావు(దుకాణదారుడు): నెట్లు, అద్దాలతో కూడిన అల్మరాల్లో తినబండారాలను పెడుతున్నాం. సిబ్బందితో.. రిపోర్టర్: విచారణ కేంద్రం వద్ద ప్రయాణికులకు ఏవిధమైన సమాచారం ఇస్తున్నారు? విష్ణుమూర్తి(విచారణ కేంద్ర ఉద్యోగి): ప్రయాణికులు అడిగే బస్సుల వివరాలు తెలుపుతాం. ఫోన్ ద్వారా కూడా బస్సుల వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. మా కేంద్రం ఫోన్ నెంబరు 08942-223188. డీసీటీఎం: రూట్లో తిరిగేటపుడు ప్రయాణికుడు ఆపమన్నచోట ఆపడం లేదనే విమర్శ ఉంది? దీనిపై ఏం చెబుతారు? పి.సిమ్మయ్య(డ్రైవర్): అదేం లేదు.. వారు ఆపమన్నచోటే ఆపుతున్నాం. డీసీటీఎం: వికలాంగులు, వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిస్తున్నారా? డ్రైవర్: చాలా సందర్భాల్లో ఇతర వ్యక్తులు కూర్చుంటున్నారు. దీనిపై ప్రయాణికుల్లో అవగాహన అవసరం. డీసీటీఎం: ఏ రూట్లో విధులు నిర్వహిస్తున్నారు? చిన్నబాబు(డ్రైవర్): బందరువానిపేట రూట్లో వెళుతున్నాను. ఈ రూట్లో సుమారు 15 బస్సుల వరకూ నడుస్తున్నాయి. డీసీటీఎం: ఎంతకాలం నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు? ఎం.రావు(డ్రైవర్): 29 ఏళ్లుగా పని చేస్తున్నాను. 18సార్లు బెస్ట్ డ్రైవర్‌గా అవార్డులు అందుకున్నాను. గ్యారేజీ నుంచి బస్సు బయటకు తీసేటపుడు కండిషన్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాం. డీసీటీఎం: ప్రయాణికులకు రిజర్వేషన్ సౌకర్యం ఉందా? మోహనరావు(ఓపీఆర్ఎస్): ఆర్టీసీలో ప్రయాణించే వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉంది. సుదూర ప్రయాణాలు చేసే వారు ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం. శ్రీకాకుళం-1 డిపో మేనేజర్‌తో.. డీసీటీఎం: శ్రీకాకుళం ఒకటవ డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి? ఎం.సన్యాసిరావు(డిపో డీఎం): మా డిపోలో 77 ఆర్టీసీ, 29 అద్దె బస్సులు ఉన్నాయి. డీసీటీఎం: అత్యధిక ఆదాయం వచ్చే శ్రీకూర్మం రూట్లో బస్సులు తక్కువగా ఉన్నాయని ప్రయాణికుల నుంచి విమర్శ ఉంది. దీనిపై మీ సమాధానం ఏమిటి? డిపో డీఎం: శ్రీకూర్మం రూట్లో బస్సులు అధికంగానే ఉన్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఇంకా రద్దీ ఉండి, అధిక ఆదాయం వస్తుందనుకుంటే అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం. డీసీటీఎం: అనంతపురం దుర్ఘటన నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డిపో డీఎం: ఆర్టీసీలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ఇతర వాహనాలను ఓవర్టేక్ చేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్త గురించి చెబు తున్నాం. డీసీటీఎం: మీ డిపో పరిధిలో ప్రమాదకర రూట్లు ఏమైనా ఉన్నాయా? డిపో డీఎం: మా డిపో పరిధిలో కేదారిపురం రూట్ ఒక్కటే కొద్దిగా ప్రమాదకరం. ఈ రూట్లో ప్రస్తుతం రెండు బస్సులు తిరుగుతున్నాయి. అవగాహన, అనుభవం ఉన్న డ్రైవర్లను పంపుతున్నాం. -
ట్రా‘ఫికర్’,పోకిరీలకు చెక్
రెండు లక్షలకుపైగా జనాభా... మూడు వేల ఆటోలు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవి అదనంగా మరో మూడు వేలు... భారీస్థాయిలో ద్విచక్ర వాహనాలు, లెక్కకు మించి కార్లు... కానీ, సన్నని రోడ్లు... ఇరుకు సందులు.. విస్తరించని జంక్షన్లు.. సీసీ కెమెరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వంటివి పెద్దగా కనిపించని కూడళ్లు. ఫలితం... నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుని ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఏడాదికి వాహనాల నుంచి జరిమానా కింద రూ.38 లక్షల వసూలవుతున్నా.. ట్రాఫిక్ మెరుగుకు చర్యలు తీసుకోవడం లేదు. విజయనగరం పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ కోసం నిధులు వెచ్చించాలంటే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం అవసరం. ఆ దిశగా కౌన్సిల్ తీసుకున్న చర్యలు శూన్యం. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాతంలో కళాశాలలు ఎక్కువగా ఉండడం వల్ల ఈవ్‌టీజింగ్, అసభ్యకర ప్రవర్తన వంటి సంఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు, పోకిరీల సమస్యకు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. పలు కూడళ్లు, కళాశాలలకు వెళ్లి ప్రజలు, విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. విజయనగరం పట్టణంలోని ట్రాఫిక్, ఈవ్‌టీజింగ్ సమస్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాను. పట్టణంలో 2.50 లక్షల మంది జనాభా ఉన్నారు. మూడు వేల ఆటోలు, ఇతర ప్రాంతాల నుంచి అనేక ఆటోలు, ఇతర వాహనాలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి 2600 బస్సులు వస్తున్నాయి. ఇరుకైన రోడ్ల వల్ల కూడా ట్రాఫిక్ సమస్యకు ఏర్పడుతోంది. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మున్సిపల్ పాలకమండలి సభ్యులతో కూడా మాట్లాడాం. మయూరీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కొత్తపేట నీళ్లట్యాంకు వద్ద సిగ్నల్ లైట్లు, జిల్లా ఎస్పీకార్యాలయం వద్ద ప్రమాదాల నిరవార ణకు బ్లింకర్స్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. స్పెషల్ పార్టీలను నియమించి ఈవ్‌టీజింగ్‌ను నిరోధిస్తాం. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, ఆటో యూనియన్, కాంప్లెక్స్‌లో విద్యార్థినీవిద్యార్థులతో ఆయన సంభాషణ ఇలా సాగింది... డీఎస్పీ: సమస్కారమండి, నా పేరు శ్రీనివాస్, నేను డీఎస్పీగా పనిచేస్తున్నాను మీపేరేంటి ? అప్పలరెడ్డి: నమస్తే సార్, నాపేరు అప్పలరెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షుడిని సార్. డీఎస్పీ: మీ సమస్యలేంటి ? అప్పలరెడ్డి: పట్టణంలో పార్కింగ్ స్థలా లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ట్రాఫిక్ పోలీసులు రాంగ్ పార్కిం గ్‌కు అప్పుడప్పుడు కేసులునమోదు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాలు ఉంటే నలబైశాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది. డీఎస్పీ:ట్రాఫిక్ పోలీసులువేధిస్తున్నారా? అప్పలరెడ్డి: అటువంటిదేమీ లేదండి. ట్రాఫిక్ పోలీసులు సహకరిస్తున్నారు. డీఎస్పీ: అమ్మాయిలూ మీ పేర్లేంటి? అమ్మాయిలు: నాపేరు కె.ప్రమీల, నాగమణి డీఎస్పీ : ఏ కాలేజీలో చదువుతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు ? ప్రమీల,నాగమణి: శ్రీచైతన్యంలో కళాశాలలో సార్, లక్కిడాం నుంచి వస్తున్నాం. డీఎస్పీ: ఏ వాహనంలో ప్రయాణం చేస్తున్నారు? ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారా? ప్రమీల,నాగమణి: ఆర్టీసీ బస్సులో వస్తున్నాం సార్, ఇబ్బందులు లేవు సార్. డీఎస్పీ: ప్రయాణికులను అధికంగా ఎక్కించుకున్న ఆటో డ్రైవరువద్దకు వెళ్లి... నీపేరేంటి? నాగరాజు: నాపేరు నాగరాజు సార్. డీఎస్పీ: ఆటోలో ఎంతమందిని ఎక్కిం చాలి? నాగరాజు: 4+1సార్ డీఎస్పీ: మరి ఎంతమందిని ఎక్కించారు నాగరాజు : ఎక్కువ మందిని సార్. డీఎస్పీ: ఎక్కించకూడదని తెలియదా? నాగరాజు: లోకల్లో ఎక్కిస్తాం. దూరప్రాం తాలకు వెళ్లే సమయంలో తక్కువగా ఎక్కిస్తాం డీఎస్పీ(ఆటోలో ప్రయాణికుడిని ఉద్దేశించి): నీపేరేంటి ? మూర్తి: నా పేరు మూర్తి. డీఎస్పీ: ప్రమాదాలు జరిగితే ఎవరి మీద నిందలువేస్తారు? మూర్తి: ఎవరి మీద నిందలు వేయం సార్, మాకు తెలియక రద్దీగా ఉన్న ఆటోలు ఎక్కుతున్నాం. మీరు వద్దంటే మానేస్తాం డీఎస్పీ: మీ పేరేంటమ్మా? వెంకటలక్ష్మి: నా పేరు వెంకటలక్ష్మి డీఎస్పీ : ఎక్కడ నుంచి వస్తున్నారు? వెంకటలక్ష్మి: సాలూరు నుంచి వస్తున్నాం. డీఎస్పీ: ఆటోలో ఇంతమంది ప్రయాణం చేస్తే ప్రమాదమని తెలియదా? వెంకటలక్ష్మి: సాలూరు నుంచి బస్సులో వచ్చాను. లోకల్ కదాని తప్పక ఆటోలు ఎక్కుతున్నాం డీఎస్పీ: తల్లీ నీపేరేంటి? ఎక్కడ నుంచి వస్తున్నావు, ఏ కళాశాలలో చదువుతున్నావు? కుమారి: నాపేరు కుమారి, మాది వేం డ్రం. ఊరి నుంచి బస్సులో వస్తున్నాను. ఎం.ఆర్ కళాశాల చదువుతున్నాను డీఎస్పీ: బస్సులో వచ్చే సమయంలో పోకిరీలు వేధిస్తున్నారా? కుమారి: అటువంటిదేమీ లేదుసార్ ఎన్ఆర్ఐ కళాశాల్లోకి వెళ్లి.. డీఎస్పీ: మీపేర్లేంటి ? ఎక్కడనుంచి వస్తున్నారు? ఎలా వస్తున్నారు? అమ్మాయిలు: మా పేర్లు మౌనిక, అనురాధ, కీర్తి, మౌనిక, కీర్తి : మేం విజయనగరంలోనే ఉంటున్నాం సార్ అనూరాధ : నేను గజపతి నగరం నుంచి వస్తున్నాను సార్. డీఎస్పీ: కాలేజీకి వచ్చే సమయంలో ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారా? అమ్మాయిలు: అటువంటిదేమీలేదు సార్ డీఎస్పీ: నీపేరేంటమ్మా ? ఎక్కడ నుంచి కాలేజీకి వస్తున్నారు? సరళప్రియ: నాపేరు సరళ ప్రియ. కామాక్షినగర్ నుంచి వస్తున్నాను. మమ్మీ తీసుకువస్తారు. డీఎస్పీ: పోకిరీలు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా? సరళప్రియ: సూపర్ మార్కెట్ వద్ద పోకిరీలు ఎక్కువగా ఉన్నారు, వారు వేధిస్తున్నారు. పేరెంట్స్‌ని చూడకుండా బండ బూతులు తిడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని మమ్మీ చెప్పింది. డీఎస్పీ: నేను టౌన్ డీఎస్పీని, మీకు ఎలాంటి సమస్యలువచ్చినా వెంటనే నాకుగాని, సీఐలకు గాని, ప్రభుత్వం ప్రకటించిన 100 నంబర్ ఫోన్‌చేస్తే నిమిషాల్లో మీదగ్గర ఉంటాం. ఆకతాయిల ఆట కట్టిస్తాం. ఏ సూపర్ మా ర్కెట్ వద్ద వేధిస్తున్నార మ్మా... సరళప్రియ: మయూరీ హొటల్ కిందనున్న సూపర్ మార్కెట్ వద్ద సార్ డీఎస్పీ: మీపేరేంటి? ఎక్కడ నుంచి కాలేజీ వస్తున్నారు? చాందిని: నాపేరు చాందిని. నేను బా బామెట్టనుంచి ఆటోలో వస్తున్నాను. కళాశాల నుంచి ఆటోలో వెళ్లి రింగురో డ్డు వద్దకు దిగుతాం. అక్కడ నుంచి బాబామెట్టకు వెళ్లేవరకు పోకిరీలుం టున్నారు. నిత్యం వేధిస్తున్నారు సార్. డీఎస్పీ: వేధిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి, లేదా పోకిరీల బైకు నంబర్లను నోట్‌చేసి పోలీసులకు అందించండి? చాందిని: అలాగే సార్. డీఎస్పీ: మీ పేరేంటి? మీరేం చేస్తుం టారు? నాగు: నాపేరు నాగు సార్, నేను శ్రీరాజా డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నాను. ఇక్కడ పార్కింగ్ స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల ఆస్పత్రికి వెళ్లే రోడ్డుగుండా అనేకమంది ఆస్పత్రికి వ స్తూ వెళ్తుంటారు. ఇక్కడి మయూరీ హొటల్కు వచ్చే వారు రోడ్డుమీద వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీఎస్పీ: టీఎస్ఆర్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు. ? నాగు: కాంప్లెక్స్ నిర్వహణను నేనే చూస్తున్నాను సార్. డీఎస్పీ: అయితే మీకు బాధ్యత లేదా? నాగు: ఎవరి షాపుల ముందు, వారి వా హనాలు పార్కింగ్ చేసుకోవచ్చు సార్. డీఎస్పీ: పోకిరీలు ఎవరైనా అమ్మాయిలను వేధిస్తారా? పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహించడం లేదా? నాగు: అమ్మాయిలను యువకులు ర్యాగింగ్ చేస్తుంటారు సార్, మేము అడిగితే మాపై దాడిచేసే అవకాశం ఉందని భయపడుతున్నాం. గతంలో పోలీసులు కాపలాకాసేవారు. ప్రస్తుతం రావడంలేదు డీఎస్పీ: నీ పేరేంటమ్మా ? ఏమి చదువుకున్నావు ? అలేఖ్య: నాపేరు అలేఖ్య, ఆంధ్రా యూనివర్సిటిలో చదువుతున్నాను. డీఎస్పీ: పట్టణంలో ట్రాఫిక్ ఎలా ఉందని భావిస్తున్నారు? అలేఖ్య: పట్టణంలో ట్రాఫిక్ గజిబిజిగా ఉంది సార్. ఉదయం, సాయంత్రం సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. పెద్దచెరువు గట్టు చు ట్టూ ఆహ్లాదకర వాతావరణంలో కూర్చోడానికి వీలుగా బల్లలు వేస్తే బాగుంటుం ది. కనీస సదుపాయాలు కూడా లేవు డీఎస్పీ : మీ పేరేంటి? మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? ఏం చేస్తున్నారు ? వరలక్ష్మి: నాపేరు వరలక్ష్మి. నేను సిద్దార్థనగర్ నుంచి వస్తున్నారు. నేను ఎంఆర్ ఉమెన్స్ కాలేజీలో జువాలజీ లెక్చరెర్‌గా పనిచేస్తున్నాను. డీఎస్పీ: పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉందా? వరలక్ష్మి: పట్టణంలోని మయూరీ హొట ల్ నుంచి ఎత్తుబ్రిడ్జి వరకు ట్రాఫిక్ సమస్యగా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం దా టాలంటే చాలా సమయం పడుతోంది. అలాగే సింహచలం మేడనుంచి కోట జం క్షన్ వరకు వాహనాలతో రద్దీతో ఇబ్బం ది ఎదుర్కొంటున్నాం. డీఎస్పీ: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీ సలహాలు, సూచనలు ఏంటి ? వరలక్ష్మి: ట్రాఫిక్ సమస్య పరిష్కారం కా వాలంటే పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. రోడ్లను వెడల్పు చేయాలి. అందుకు ప్ర జలు సహకరించాలి డీఎస్పీ: నీపేరేంటి? సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని తెలియదా? ఈశ్వరరావు: నాపేరు ఈశ్వరరావు, నేను ప్రైవేటు అకౌంట్స్ చూస్తాను. ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చిందని ఫోన్ ఎత్తి పక్కకు వెళ్లి మాట్లాడుదామని చెప్పి పక్కకు వెళ్తున్నాను. డీఎస్పీ: ప్రమాదానికి గురైతే ఎవరూ బాధ్యత వహిస్తారు? ఈశ్వరరావు: లేదుసార్ సెల్‌ఫోన్ డ్రైవిం గ్ చేయను సార్. డీఎస్పీ: నీపేరేమిటి? ఎన్ని సంవత్సరాల నుంచి సిలిండర్లు తీసుకువెళుతున్నారు ? ఆదినారాయణ: నా పేరు ఆదినారాయణ సార్. పది సంవత్సరాల నుంచి సిలిండర్లను టూ వీలర్‌పై తెస్తూ ప్రజలకు అం దిస్తున్నాను. రోజుకు 10 సిలిండర్లు తెస్తాను సార్. డీఎస్పీ: గ్యాస్ సిలిండర్లు టూ వీలర్‌పై తేవడంవల్ల ప్రమాదాలు జరిగితే ప్రజ ల కు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందికదా? ఆదినారాయణ: వాహనాన్ని తక్కువ స్పీ డులో నడుపుతాను సార్, నెమ్మదిగా ప్ర యాణం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. డీఎస్పీ: మీపేరేంటి, మీరేం చేస్తున్నారు? నాగార్జున: నా పేరు నాగార్జున, నేను ఎం.ఆర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను డీఎస్పీ: ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయా? నాగార్జున: గురజాడ అప్పారావు రోడ్డు నుంచి మూడులాంతర్లు రోడ్డు వరకూ నిరంతరం ట్రాఫిక్ సమస్య ఉంటోంది. రోడ్డు వెడల్పు చేయడానికి మొదటి సం తకం పెట్టిన వాడిని నేనే. డీఎస్పీ: గురజాడ అప్పారావు రోడ్డును వన్‌వే చేస్తే మంచిదేనా? నాగార్జున : కచ్చితంగా సమర్థిస్తాను. చాలా మంచిది కూడా. డీఎస్పీ: మీపేరేంటి? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు? హనుమాన్శెట్టిరాజు: నాపేరు హనుమాన్ శెట్టిరాజు, ఇరవై సంవత్సరాలుగా మెడికల్ వ్యాపారం చేస్తున్నాను. డీఎస్పీ: ట్రాఫిక్ సమస్య ఎలా ఉందని భావిస్తున్నారు? రాజు: నేను అరవై ఏళ్ల నుంచి పట్టణంలో ఉంటున్నాను. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఎక్కువగానే ఉంది. డీఎస్పీ: అప్పట్లో సమస్యలు లేవా? రాజు: అప్పట్లో సైకిళ్లు తప్ప బళ్లు ఎక్కడివి. ఇప్పడు వాహనాలు ఎక్కువగా ఉం డడం వల్ల సమస్యలు వస్తున్నాయి. డీఎస్పీ: గురజాడ అప్పారావు రోడ్డును వన్‌వే చేయడం వల్ల వ్యాపారానికి నష్టం ఉంటుందా? రాజు: ఎటువంటి నష్టం ఉండదు. వన్‌వే చేస్తే చాలా మంచిది. డీఎస్పీ: నీపేరేంటిబాబూ? ఓనర్‌వా? సాయికుమార్: నా పేరు సాయికుమార్, నేను ఓనర్వాళ్ల అబ్బాయిని డీఎస్పీ: రోడ్డు పక్కన పకోడీలు తయారుచేస్తే ప్రజలకు ఇబ్బంది కలగదా? సాయికుమార్: వేరే ప్రాంతంలో తయా రు చేసి తెస్తున్నాను సార్, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. డీఎస్పీ: రోడ్డుమీదే కాగిన నూనె ఉంది, ఎవరైనా స్పీడ్‌గా వచ్చి నూనెను ఢీకొడి తే పరిస్థితి ఏంటి. ప్రమాదం జరిగే అవకాశం ఉందికదా? సాయికుమార్: వంట నూనె కొంచెం లో పలిగా ఉంది సార్. డీఎస్పీ: నీ పేరేంటి? ఎప్పటి నుంచి హెల్మెట్ వాడుతున్నారు? ఏ పని చేస్తున్నారు? తిరుపతిరావు: నా పేరు తిరుపతిరావు, నేను సోషల్ మాస్టర్‌గా పనిచేస్తున్నాను. హెల్మెట్ అనేది రక్షణ కవచంలా, వెపన్‌గా పనిచేస్తుంది. స్పీడ్‌గా వెళ్లాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. డీఎస్పీ: హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అవగాహన కల్పిస్తున్నారా? తిరుపతిరావు: సోషల్ రెస్పాన్స్ బులిటీ, రవాణా భద్రతాలో భాగంగా ట్రాఫిక్‌పై సోషల్ సబ్జెక్టు ఉంది. కుటుంబ సభ్యుల తోపాటు బయట వ్యక్తులకు హెల్మెట్ వాడాలని చెబుతున్నాను. -
సమస్యల చెంతకు..
ఏలూరు.. జిల్లాలోనే ఏకైక నగరం. కలెక్టర్‌తోపాటు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఇక్కడే ఉంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ వంటి ముఖ్య ప్రజాప్రతినిధులు ఉండేది ఈ నగరంలోనే. అలాంటి ప్రాంతం జిల్లాకే తలమానికంగా.. అభివృద్ధిలో మార్గదర్శకంగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ.. ఈ నగరంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడి ప్రధాన సమస్యలను తెలుసుకునేం దుకు నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయి శ్రీకాంత్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. కబాడీ గూడెం, ప్రధాన చేపల మార్కెట్లో పర్యటించారు. వీధుల్లో సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. పేదలు ఎదుర్కొం టున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కమిషనర్ నిర్వహించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ఇలా సాగింది. నగరంలోని మురికివాడల్లో ఒకటైన కబాడీ గూడెంలో అడుగుపెట్టిన కమిషనర్‌కు రోడ్డు పక్కన పాత దుస్తులతో ఏర్పాటు చేసుకున్న స్నానపు గదులు కనిపించాయి. అక్కడ ఉన్న యందం మార్తమ్మను ‘ఏంటమ్మా.. పాత బట్టలతో ఇలా కట్టుకున్నారు’ అని కమిషనర్ ప్రశ్నించారు. యందం మార్తమ్మ: మాకు మరుగుదొడ్లు లేవు సార్. స్నానాలు చేయడానికి వీటిని కట్టుకున్నాం. కమిషనర్ : ఏమ్మా.. ఇక్కడ మంచినీళ్లు వస్తున్నాయా. మాండ్రు మార్తమ్మ : వస్తున్నాయ్ సార్. అందరికీ ఒకే కుళాయి ఉంది. కమిషనర్ : రూ.200 కడితే కుళాయి మంజూరు చేస్తాం. అందరూ దరఖాస్తు చేసుకోండి. ప్రతి ఇంటికీ కుళాయి వచ్చే ఏర్పాటు చేస్తాను. అక్కడి నుంచి ముందుకెళ్లిన కమిషనర్‌కు రోడ్డుమీదే పొరుు్య కనిపించింది. అక్కడి ఇంట్లో ఉంటున్న మహిళను పిలిచిన కమిషనర్ ‘ఏమ్మా.. ఇలా రోడ్ల మీదే పొరుు్య పెడితే ఎలా. ఇలా చేయడం మంచిది కాదు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. ఇకనుంచి ఇలా చేయకండి’ అని సూచించి ముందుకు కదిలారు. తేళ్ల ప్రసాదరావు : సార్.. వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయ్. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మురుగు ఎక్కువగా ఉండటంతో దోమలు పట్టపగలే చంపేస్తున్నాయ్. కమిషనర్ : మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటాం. మీరు కూడా డ్రెరుునేజీల్లో చెత్తాచెదారం వేయకుండా సహకరించాలి. కమిషనర్ : ఏమ్మా.. మీ సమస్యలేంటి. చౌటపల్లి కుమారి : పందులు ఎక్కువగా తిరుగుతున్నాయి. వాటివల్ల పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. కమిషనర్ : తగిన చర్యలు తీసుకుంటాం. దోమల బారినుంచి రక్షించుకోవడానికి దోమ తెరలు వాడండి. కమిషనర్ : ఇక్కడ కమ్యూనిటీ హాలు ఉంది కదా. వాడుతున్నారా. దాసరి వెంకటేశ్వరమ్మ : వాడటం లేదు. ఎప్పుడూ మూసే ఉంటోంది. దానిలో కూడా ఎటువంటి సౌకర్యాలూ లేవు. కమిషనర్ : ఏమ్మా.. మీకూ మరుగుదొడ్లు లేవా. చౌటపల్లి సువర్ణ : లేవు సార్. కట్టించుకోవడానికి స్థలం కూడా లేదు. కమిషనర్ : అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తాం. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. వి.రత్నకుమారి : ఉన్నాయి సార్. వాటినే వినియోగిస్తున్నాం. కమిషనర్ : మీ ఇల్లు బాగానే ఉందా. నాగమణి : లేదు సార్. వర్షం నీరు కారుతోంది. కమిషనర్ : ఇల్లు కట్టుకోవడానికి రుణాలు వచ్చే ఏర్పాటు చేస్తాం. మీరంతా మీ పిల్లలను బాగా చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలి. అక్కడి నుంచి కమిషనర్ పక్కవీధిలోకి వెళ్లారు. పలువురు మహిళలు ఆయన వద్దకు వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. సావధానంగా విన్న కమిషనర్ వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దాసరి వెంకటేశ్వరమ్మ : మాకు ఇళ్లు లేవండి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిప్పిస్తే ఇళ్లు కట్టుకుంటాం. కమిషనర్ : తప్పకుండా. మీరంతా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారా.. రుణాలు తీసుకున్నారా. దాసరి వెంకటేశ్వరమ్మ : ఎన్నికలకు ముందే రుణాలకు కాయితం పెట్టుకున్నాం సార్. ఓట్లు అడగడానికి వచ్చిన వారంతా రుణాలిప్పిస్తామన్నారు. ఇప్పటివరకూ మా మొహాలు చూసిన వారే లేరు. ఖాజా : ఇళ్ల మీదుగా కరెంటు తీగలు వెళుతున్నాయ్. అప్పుడప్పుడూ తెగి ఇళ్లపై పడుతున్నాయ్. స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించిన కమిషనర్ వ్యాపారులు, వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ : ఏమ్మా.. ఇక్కడ ఇన్ని షాపులు కట్టాం. నువ్వు బయట చేపలు అమ్ముతున్నావేంటి. నీలం వరలక్ష్మి : వాటిలో నాకు షాపు ఇవ్వలేదు సార్. అందుకే బయట అమ్ముతున్నాను. కమిషనర్ : ఏమ్మా.. నీకు షాపు ఉందా.. లేదా నూతిపిల్లి దుర్గమ్మ: దుకాణాలు బాగా ఎత్తుగా కట్టారు సార్. పైగా లైట్లు లేవు. నీరు రాదు. అసలు ఎటువంటి సౌకర్యాలూ లేవు. కమిషనర్ : కొనుగోలు చేయడానికి వచ్చేవారికి ఇబ్బందులు కలిగించవద్దు. మీకు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తా. అక్కడి నుంచి ముందుకెళ్లిన కమిషనర్‌ను అరటి పండ్లు అమ్ముకుంటున్న మహిళలు ‘నమస్తే సార్’ అంటూ పలకరించారు. కమిషనర్ : బాగున్నారా. మీ సమస్యలేంటి. లొట్టి లక్ష్మి : మాకెవరికీ దుకాణాలు లేవు సార్. ఇక్కడ వ్యాపారం చేసుకుంటేనే నాలుగు డబ్బులొస్తాయ్. ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట వ్యాపారాలు చేసుకుంటాం. ఇక్కడివారంతా మమ్మల్ని వెళ్లిపొమ్మని గదమాయిస్తున్నారు. మేమెలా బతకాలి సార్. కమిషనర్ : సమగ్ర సర్వే చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం పథకం ప్రవేశ పెట్టింది. ఆ పథకం మీకు వర్తింప చేయడానికి కృషి చేస్తా. అనంతరం పి.వెంకటేశ్వరరావు అనే వినియోగదారునితో మాట్లాడుతూ ‘ఈ మార్కెట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయ్. ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాల్సి అవసరం ఉందా’ అని అడిగారు పి.వెంకటేశ్వరరావు : సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి సార్. సైకిళ్లు, మోటార్ సైకిళ్లపై వచ్చేవారికి పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. కమిషనర్ : ఓకే.. దృష్టి పెడతా. ఇంతలో ఉండవల్లి జయలక్ష్మి అనే మహిళ ఇంటిపన్ను కాగితాలతో వచ్చింది. కమిషనర్ : ఏమ్మా.. ఇంటిపన్ను కాగితాలు పట్టుకుని తిరుగుతున్నారేమిటి. ఉండవల్లి జయలక్ష్మి : నా భర్త మిలటరీలో పనిచేసి రిటైరయ్యారు. కొంతకాలానికి చనిపోయారు. మాజీ సైనికుల కుటుంబాలకు ఇంటి పన్ను మినహాయింపు వస్తుందని తెలిసి మీ ఆఫీసుకే వస్తున్నాను. ఈలోపు మీరే ఇక్కడ కనిపించారు. కమిషనర్ : మాజీ సైనికుల కుటుంబాలకు ఇంటిపన్ను మినహాయింపు ఉంటుంది. మా కార్యాలయ సిబ్బందిని కలవండి. మురికి వాడల అభివృద్ధికి కృషి చేస్తాం నగరంలోని మురికివాడల్లో నివశిస్తున్న ప్రజల జీవనం ఎంతో దుర్భరంగా ఉండటాన్ని గమనిం చాం. మురికి వాడల్లో సౌకర్యాల కల్పన, అభివృ ద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తాం. అక్కడి ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిం చాలి. మరుగుదొడ్లు లేనివారికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. ఖాళీ స్థలం లేనిపక్షంలో పబ్లిక్ టాయిలెట్స్ కట్టిస్తాం. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వృత్తి విద్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మురికివాడల్లో నివాసాన్ని ఆనందమయం చేసుకోవడానికి అనువైన జీవన విధానాలపై అవగాహన కల్పించడానికి అక్కడి ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తాం. పందులు, కుక్కల బెడద నివారణకు చర్యలు చేపడతాం. రూ.3 కోట్లతో నిర్మించిన చేపల మార్కెట్లో సౌకర్యాలు లేవు. సౌకర్యాలు మెరుగుపరిచి మార్కెట్‌ను వ్యాపారులకు అందుబాటులోకి తీసుకువస్తాం. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మార్కెట్‌ను తీర్చిదిద్దుతాం. - యర్రా సారుుశ్రీకాంత్, కమిషనర్ -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే వెంకటరమణ
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే పుట్టా మధు
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే రెడ్యానాయక్
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే కాలె యాదయ్య
-
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
సామర్లకోట : సామర్లకోట ఇరిగేషన్ విభాగం పరిధిలోని రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఆ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. శనివారం ఈ ప్రాంతంలో రైతుల సమస్యలపై ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా వ్యవహరించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమస్యలను సావధానంగా విన్న ఆయన సోమవారం సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ ఈఈ విజయకుమార్, డీఈ నరసింహారావు సోమవారం వీకే రాయపురం, సామర్లకోటల్లో పర్యటించారు. సామర్లకోట లాకుల వద్ద పెరిగిపోయిన గుర్రపుడెక్కను పరిశీలించారు. అలాగే వ్యవసాయ క్షేత్రం నుంచి వీకే రాయపురం శివారులోని సత్యవరపు పేటకు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. ఆ మార్గాన్ని వ్యవసాయక్షేత్రం అధికారులు మూసివేయడంతో దానిపై సర్వే చేయాలని ఈఈ విజయకుమార్ జేఈ సునీతను ఆదేశించారు. తూటేరు డ్రెయిన్ మూసుకుపోవడం వల్ల పొలాలకు నీరు అందడం లేదని అన్నదాతలు వివరించారు. దీంతో గోదావరి కాలువ ఆధునికీకరణలో భాగంగా తూటేరు డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తామని ఈఈ హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ క్షేత్ర ముఖద్వారం నుంచి రామేశ్వరం ఎగువ, దిగువ కాలువకు నీరు వచ్చే తూము గుర్రపుడెక్క పేరుకుపోవడంతో మూసుకుపోయిందని రైతులు వివరించారు. ఆ ప్రదేశాన్ని అధికారులకు చూపించారు. డెక్కను తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం వీకే రాయపురంలో అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వీకేరాయపురంలో ఎగువ, దిగువ కాలువలకు పుష్కలంగా నీరు వచ్చేలా చూడాలని, ఏలేరుకాలువపై వంతెన నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే బోయనపూడి వద్ద ఏలేరు కాలువకు పడిన గండి వద్ద రిటెయినింగ్ వాల్ నిర్మించాలని కోరారు. ఈ సమస్యలపై ఎస్ఈకి నివేదిక అందించి, పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఈలు సునీత, అజహర్, వీకే రాయపురం సర్పంచ్ కుర్రా శ్రీనివాసు, రైతు సంఘ నేతలు పాల్గొన్నారు. -
వీఐపీ రిపోర్టర్ : మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి
-
అండగా ఉంటా
మొన్నటివరకు తెలంగాణ ఉద్యమంలో కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరిగిన మహిళా నేత.. నిన్నటికి నిన్న ప్రజాభిమానంతో ప్రత్యర్థులను మట్టికరిపించి అసెంబ్లీలో అడుగుపెట్టిన మెతుకుసీమ ధీరవనిత.. ఇపుడు తెలంగాణ తొలిఉప సభాపతిగా సభను సమర్థవంతంగా, హుందాగా నడుపుతూ అందరి మన్ననలు చూరగొంటున్న మహిళా నేత.. ఆమే పద్మాదేవేందర్‌రెడ్డి. ప్రజాప్రతినిధిగా నిత్యం బిజీగా ఉండే ఆమె, ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి వెళ్లి ‘సాక్షి’ విలేకరిగా జనం గుండెను తడిమి చూశారు. డిప్యూటీ స్పీకర్ గ్రామానికి వస్తున్న విషయం తెలుసుకున్న పల్లె జనం పిల్లా పాపలతో కలిసి ఊరు పొలిమేర వద్ద ఆమెకు ఘనస్వాగతం పలికారు. డప్పుల దరువు...పల్లె నాట్యాలతో గ్రామంలోకి తీసుకు వెళ్లారు. గ్రామం ముంగిట్లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పద్మాదేవేందర్‌రెడ్డి...అక్కడి నుంచి చౌకధర దుకాణం వద్దకు చేరుకుని ‘సాక్షి’ విలేకరిగా జనం సమస్యలు తెలుసుకున్నారు. ‘కూడు గింజలకు ఇగ రంది లేదమ్మా’ అని వెంకటలక్ష్మి అనే గృహిణి చెప్పినప్పుడు ఆత్మసంతృప్తితో పద్మాదేవేందర్‌రెడ్డి కళ్లు చెమ్మగిల్లాయి. డిప్యూటీ స్పీకర్: ఏమ్మా బాగున్నారా? డి.ధర్మారం ప్రజలు : బాగున్నాం మేడం... డిప్యూటీ స్పీకర్: అందరికీ రేషన్ అందిందా? డి.ధర్మారం ప్రజలు : ఎవరి నోటి నుంచి మాట రాలేదు. డిప్యూటీ స్పీకర్: ఏం మాట్లాడరు? డీలర్ బియ్యం ఇవ్వటం లేదా? డి.ధర్మారం ప్రజలు :: అయ్యో... అట్టేమీ లేదమ్మా. డిప్యూటీ స్పీకర్: నీ పేరు చెప్పమ్మా? నీ సమస్య ఏమిటి? ఎనబోయిన సత్తెవ్వ: అమ్మా... ఎనిదేళ్ల నుంచి కారట్ల నా మొగని పేరు లేదు. కారటు దిగినప్పుడు ఆయన పట్నం బతకబోయిండు.తల్లి మగ్గురు పేరే ఉంది. నెలకు 12 కిలోల బియ్యమొస్తే ఏం సరిపోతాయమ్మ. పిట్ల నర్సమ్మ: నాకు కూడా అట్నే అయిందమ్మా. నాకు ఇద్దరు పిల్లలు. చిన్నోనికి 12 ఏండ్లు. ఆధార్ లేదని కారట్ల పేరెక్కియలేదు. రామాయంపేటకు తీసుకపోయి దింపుకొచ్చిన. ఇప్పుడు పేరు ఎక్కిత్తమని సార్ చెప్పిండు. డిప్యూటీ స్పీకర్: ఇంతకు ముందు ఎన్ని కిలోల బియ్యం వచ్చేవి? మీకు సరిపోయేదా? సరస్వతి: అమ్మా..! ఒళ్లలువ కట్టం చేసుకుంటం. కడపునిండా తింటం. రెండు పూటల తింటే నెలకు ఎట్టా లేదన్నా ఇంటిళ్లిపాదికి కలిపి 40 కిలోల బియ్యం పడుతయి. సార్కారోళ్లు ఇన్నాళ్లు ఎంత మంది ఉన్నరు అని సూడకుండ 20 కిలోల బియ్యం ఇస్తే 15 రోజులకే సరిపోయేవి. సుట్టపోడు అస్తే 10 రోజులకు కూడా సరిపోవు. బయట కొందామంటే కిలో బియ్యం (దొడ్డు బియ్యం) రూ.25 ..రూ.30 పలుకుతోంది. ఆలుమగలం కట్టపడితే రోజు రెండు, మూడోందలు దొరుకుతయి. దాంట్లెనే మొగొళ్లు ఇంత ఏసుకుంటరా..! ఇంకేం ఉంటమయ్మ. సెప్పుకుంటే అమ్మలక్కలు సెప్పుకున్నది అంటరు గానీ...తినీ, తినక పస్తులు పండుకునేదాన్ని. (ఆమెను డిప్యూటీ స్పీకర్ ఆప్యాయం దగ్గరకు తీసుకున్నారు. ఇక నుంచి ఆ కష్టాలుండవని భరోసా ఇచ్చారు) డిప్యూటీ స్పీకర్: ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తుంది కదా? ఇప్పుడెలా ఉందమ్మా? వెంకటలక్ష్మి: ఇప్పుడు జర నయమే నమ్మా... గంజిలకు ఉప్పుగల్లు తోడయినట్టు. మనిషికి ఆరు కిలోల బియ్యం ఇత్తన్రు. ఎంత మంది ఉంటే అన్ని ఆర్లు ఇత్తున్నరు. కూడు గింజలకు రంది లేకుంటయిదమ్మా. రేషన్ కింద ఇస్తున్న ఉప్పు, నూనె, పప్పు, మిరపకాయలు అసలు సరిపోట్లేదమ్మా... బియ్యం పెంచినట్టే వాటిని పెంచితే మీకు పుణ్ణెం వస్తదమ్మా. మీ పేరు చెప్పుకొని పేదోళ్లం రెండు పూటలైనా కడుపు నిండా తింటాం. డిప్యటీ స్పీకర్: నీ సమస్య ఏమిటో చెప్పమ్మా? ఉడుత యశోద: బీడీ కంపెనోళ్లు నెలల 10 రోజులు కూడా పనిత్తలేరు. ఉప్పు, పప్పుకు శానా ఇబ్బందైతంది. బయట కైకిలి కూడా దొరుకుత లేదు. పిల్లలను బతుకు ఏంగావాలే.. మా బతుకు ఎట్టా ఎల్లదీసుకోవాలే. మాకట్టం మీకు తెలుసుకదమ్మా..మీరు కంపెనోళ్లతో మాట్టాడి మాకు దారి సూపించురి. కార్డున్న బీడీ కార్మికులకు రూ 1,000 పింఛన్ ఇస్తే బాగుంటదమ్మా. డిప్యూటీ స్పీకర్: నువ్వు ఏదో మాట్లాడాలను కుంటున్నావు? నర్సయ్య: మేడం గారు.. నాకు అసలే రేషన్ కార్డు లేదమ్మా.. ఊళ్లె ఆధార్ కారటు దింపుకున్నప్పుడు నా కుటుంబం అంతా బీదర్ల బతుకుతున్నాం. మాకెవ్వలు సెప్పలేదు. ఊళ్లె మాకు ఆధార్ కారటు లేదు. ఊళ్లె సర్వే జేత్తున్నరు....కేసీఆర్ సారు అందరిని రమ్మన్నడు అని జెప్తే అప్పుడు ఊళ్లకొచ్చినం. అప్పటి నుంచి ఊళ్లనే ఉంటున్న. రేషన్ కారటుకు కూడా దరఖాస్తు పెట్టుకుంటే ఆధార్ కార్డు ఉందా? అని సారోళ్లు అడిగిండ్రు. ఆదేదో తెల్వక నోరెళ్లబెట్టిన. కుటుంబంమంతా కలిసి నెల రోజుల కింద రామాయంపేటకు పోయి మీ సేవల ఆధార్ దిగినం గానీ..ఇంత వరకు రాలే. నాకు రేషన్ బియ్యం ఇయ్యరని చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్: ఆహార భద్రత కార్డుకు నువ్వు అర్హుడవే. నువ్వు ఎలాగు మీసేవలో ఆధార్ దిగానని చెప్తున్నావు కాబట్టి, అది రాగానే అధికారులు నీకు ఆహార భద్రత కార్డు అందిస్తారు. అంత వరకు నీ పాత కార్డు మీదనే నువ్వు బియ్యం తీసుకోవచ్చు. (అక్కడే ఉన్న ఓ విద్యార్థితో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ..) డిప్యూటీ స్పీకర్: ఏం తమ్ముడు ఎలా ఉన్నావు. చదువు ఎలా సాగుతోంది? వినోద్ : మేడం.. మా ఊరి పేరు మీకు తెలుసు కదా..! దొంగల ధర్మారం. మీది ఏ ఊరంటే సెప్పుకుంటానికి ఇబ్బందిగా ఉంది. ఊరు పేరుతో కాలేజీలో ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నరు. పేరు మార్పించురి. డిప్యూటీ స్పీకర్: అవును మీకు ఆ సమస్య ఉందని నాకు తెలుసు. మీరు గమనిస్తూనే ఉంటారు.. మీ మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని మీ ఊరు పేరును డి. ధర్మారం అని పలుకుతున్నా. జిల్లా కలెక్టర్‌కు చెప్పాను తమ్ముడూ. త్వరలోనే మీ ఊరు పేరును సర్వోదయ నగర్ అని మార్చబోతున్నారు. (గ్రామస్తులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.) ఆ ముచ్చటా తీరింది... ‘‘ఎమ్మెల్యేగా...డిప్యూటీ స్పీకర్‌గా...ఇంత చేసినా... జర్నలిస్టుగా పనిచేయలేకపోయానే అనే అసంతృప్తి ఏదో మూల ఉండేది. ‘సాక్షి’ కల్పించిన వెసులుబాటుతో ఆ ముచ్చటా తీరింది. వీఐపీ రిపోర్టర్‌గా జనం మధ్యకు తీసుకువచ్చి..వారి సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి ధన్యవాదాలు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రజెంటేషన్: వర్ధెల్లి వెంకటేశ్వర్లు ఫొటోలు: కె.సతీష్ -
సదా మీ సేవలోనే..
పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్ : అమ్మా బాగున్నారా? ఏం సాహెబ్‌గారు..మీ కాలనీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా..ఏమైనా ఉంటే చెప్పండి? అల్లం నర్సమ్మ : ఏమి బాగు బిడ్డా.. ముసలోళ్లం బతులు ఇలా అయ్యాయి. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చేటోడు..నెలకు 200 వస్తే మందులు కొనుక్కునే దాన్ని.. గిప్పుడు గా పింఛన్ కూడా వస్తలేదు. ముసలోళ్లమైన మాకే పింఛన్ రాకుంటే ఎవరికిస్తరు బిడ్డా..జర నువ్వైనా ఇప్పించరాదే. అజయ్‌కుమార్ : ఏమి అవ్వా..నీ బాధేంటి? తిరుపతమ్మ : ఏం చేయాలి బిడ్డా..రోజంతా పనిచేసుకొని బతుకేటోళ్లం. మాకు ఉండటానికి ఇళ్లు లేవు. ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టిస్తమంటుంది. మా బతుకులకేసి చూసినోళ్లు లేరు. మీరైనా ఇంటిస్థలం ఇప్పించడయ్యా. అజయ్‌కుమార్ : బుచ్చమ్మా బాగున్నావా..? నీకు పింఛన్ వస్తుందా? బుచ్చమ్మ : లేదు దొరగారు.. మాకు పింఛన్ ఇవ్వట్లేదు. గిదిగో..నా ఆధార్‌కార్డు చూడండి..68 ఏళ్లు ఉన్నయ్..నాకు పింఛన్ ఇస్తలేరు. మీరు ధర్నా చేసిన కాడికి కూడా వచ్చిన. కాగితం ఇచ్చిన..జర పింఛన్ వచ్చేలా చూడండయ్యా. అజయ్‌కుమార్ : సలాం మాలేకోం..మీ బాధలు చెప్పండమ్మా.. మదార్బీ : వాలేకుం సలాం..గీ పార్శీబంధంలో 20 ఏళ్లుగా ఉంటున్నం. ఇరుకుదారులు, రోడ్లులేవు, వర్షాకాలంలో మోకాళ్లలోతు బురద, పొయినేడు రోడ్లు పోస్తమని కంకర పోసిండ్రు. రెండురోజుల తర్వాత దాన్ని తీసుకుపోయిం డ్రు..ఇప్పటి వరకు రోడ్లు వేస్తమని చెప్పినోళ్లు లేరు. అజయ్‌కుమార్ : అమ్మా..మున్సిపాలిటీ వాళ్లు వస్తున్నారా? రహీంబీ : ఎక్కడ మున్సిపాలిటోళ్లు సారు..ఇటువైపు వచ్చినోళ్లే లేరు. నెలల తరబడి కాల్వలు సాపు చేయరు. మురుగునీరు వాసన వస్తోంది..దోమలు విపరీతంగా ఉన్నాయి. పట్టించుకున్నోళ్లు లేరు. అజయ్‌కుమార్ : అంగన్వాడీ కేంద్రం ఎలా ఉండమ్మా? వన్‌ఫుల్ మీల్స్ పెడుతున్నారా? కృష్ణకుమారి (అంగన్వాడీ టీచర్): ఇక్కడున్న వాళ్లంతా పనిచేసుకునే వాళ్లే సార్. 40 మంది పిల్లలు రోజూ వస్తారు. సొంతభవనం లేక ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం ఇచ్చే కిరాయి చిన్నగదులకు మాత్రమే వస్తోంది. జనవరి 1 నుంచి గర్భిణులు, బాలింతలకు వన్‌ఫుల్ మీల్స్ పెడుతున్నాం సార్. అజయ్‌కుమార్ : ఏంటమ్మా..? బస్తాలు కట్టుకొని ఉంటున్నారు.. ? ఇల్లు లేదా.? సరిత : పేదోళ్లం సారు.. ఏం చేస్తాం.. పది సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని ప్రభుత్వ స్థలం కాల్వపై కట్టినమని కూటగొట్టిండ్రు. వేరేచోట ఇస్తమన్నరు..ఇంతవరకు జాడలేరు. ఏం చేస్తాం మా కర్మ. కిరాయి ఇంట్లో ఉండే స్తోమతలేక ఇదిగో ఇలా బస్తలు కట్టుకొని ఉంటున్నాం. అజయ్‌కుమార్ : ఏం తమ్ముడు.. ఏం చదువుతున్నావ్? వంశీ కృష్ణ : బీటెక్ ఫస్టియర్ చదువుతున్నా సార్..ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందని బీటెక్‌లో చేరా. గత సంవత్సరం డబ్బులే ఇప్పటికీ రాలేదట! రీయింబర్స్ రాకపోతే చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తుందని భయంగా ఉంది సార్. అజయ్‌కుమార్ : మీరేరా ఈ స్కూల్ టీచర్? పిల్లలు స్కూల్‌కు బాగా వస్తున్నారా? భోజన పథకం మంచిగా అమలవుతోందా? రవికుమార్ : నేనే సార్. పిల్లలు బాగానే వస్తున్నార్సార్. మధ్యాహ్నభోజనం కూడా బాగానే వండిపెడుతున్నాం సార్. అంతాబాగానే ఉంది సార్. కానీ బడి చుట్టూ కాంపౌండ్‌వాల్ లేదు సార్. మంజూరయ్యేలా చూడండి. అజయ్‌కుమార్ : ఏం అమ్మా..ఏంటి నీ సమస్య? వంగాల లలిత : నాభర్త చనిపోయి ఐదేళ్లయిందయ్యా. ఇద్దరు పిల్లలు. ఆయన డెత్ సర్టిఫికెట్ ఇచ్చినా..ఆధారాలన్నీ సమర్పించినా నాకు పింఛన్ ఇవ్వట్లేదయ్యా. అజయ్‌కుమార్ : ఏంటమ్మా ఆ కాగితం.. ఎందుకు తెచ్చావు..? వాణి : మాకు ఇందిరమ్మ రెండో విడతలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని అధికారులు చెప్పారు. ఇదిగో సార్.. ఇంటిపట్టా కూడా ఇచ్చారు. ఆరేళ్లయినా స్థలం చూపించలేదు. ఇస్తరో..ఇవ్వరో కూడా చెప్పట్లేదు సార్. అజయ్‌కుమార్ : ఏం పెద్దాయనా..బాగున్నావా? హుస్సేన్ : ఏం బాగండి.. మా ముసలి దాని కాళ్లు పడిపోయినై..నెలనెలా వచ్చే పింఛన్ ఐదునెలల నుంచి రావట్లేదు. మీరైనా పింఛన్ ఇప్పించండయ్యా. అజయ్‌కుమార్ : ఏం అన్నపూర్ణమ్మ బాగున్నారా? మీ సమస్యలేమిటి? అన్నపూర్ణమ్మ : బాగున్నాం సార్..మంచినీరు రావట్లేదు. గీ పంపే అందరికీ దిక్కు. దీని పక్కనే మురుగునీరు చేరుతోంది. మంచినీళ్లు, మురికి నీళ్లు కలిసిపోతున్నాయి. మీరే చూడండి ఎలా ఉందో.. (పంపు చూసిన ఎమ్మెల్యే కార్పొరేషన్ కమిషనర్ వేణుమనోహర్కు ఫోన్ చేశారు. పార్శిబం ధం ప్రాంతంలో మురుగుకాల్వలు తీయాలని, పంపుల పరిసరాలు శుభం చేయాలని, ఉదయంకల్లా పనిపూర్తి చేయాలని ఆదేశించారు.) అజయ్‌కుమార్ : ఏం నాగేశ్వరరావు (మాజీ కౌన్సిలర్) బాగున్నారా? పాలకుర్తి నాగేశ్వరరావు : ఏం బాగు సారు. మా వార్డుల్లో అర్హులైన వారి పెన్షన్లు తీసివేశారు. ఏ వీధికి వెళ్ళినా ముసలోళ్ల గోడు వినాల్సి వస్తోంది. రోడ్లు వేస్తమని ప్రతిసారీ అంచనాలు వేస్తున్నారు. కానీ పనులు చేపట్టడం లేదు. వీధి దీపాలు సక్రమంగా వెలగవు..కాల్వలు తీయ రు. అర్హులకు పింఛన్ అందేలా చూడండి. -
ఫణిగిరిని అభివృద్ధి చేస్తా
ఫణిగిరి..బౌద్ధం పరిఢవిల్లిన నేల..వంద ఏళ్లనాటి చర్రితకు ఎన్నో ఆనవాళ్లు....తవ్వకాల్లో వెలుగుచూసిన నిర్మాణాలు, చిహ్నాలు, శాసనాలు ఎన్నెన్నో... కానీ గత పాలకుల నిర్లక్ష్యం, పురావస్తు శాఖ అధికారుల అలసత్వంతో ఈ ప్రాచీన సంపదకు రక్షణ కరువైంది. పర్యాటక కేంద్రంగా మార్చుతామనే పాలకుల హామీలు నీటిమీద రాతలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఫణిగిరి గ్రామాన్ని పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ సందర్శించారు. సాక్షి తరఫున రిపోర్టర్‌గా మారి..అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. గాదరి కిషోర్: మీపేరేమిటి..ఇక్కడి బౌద్ధారామం పరిస్థితి ఎలా ఉంది. పానుగంటి నర్సింహారెడ్డి: మా ఊరిలోని బౌద్ధారామానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే దీనిని పర్యాటక కేంద్రంగా మార్చుతామని పాలకులు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంత వరకు ఎలాంటి అభివృద్ది జరగలేదు. గాదరి: అన్నా...ఏం సమస్యలు ఉన్నాయె..? ఉప్పలయ్య: ఫణిగిరిలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో ఎంతో విలువైన ప్రాచీనసంపద బయల్పడింది. కానీ దీనికి రక్షణ లేదు. ఈ సంపదనంతా ఓ పాతభవనంలో పడవేశారు. గాదరి : ఈ భవనంలో ఎప్పడి నుంచి పనిచేస్తున్నావు. వీరయ్య (సెక్యూరిటీగార్డు) : నేను పది సంవత్సరాలుగా ప్రాచీన సంపదను ఉంచిన భవనానికి కాపలాగా ఉంటున్నాను. నాకు నెలకు మూడు వేల రూపాయల జీతం ఇస్తున్నారు. తెలంగాణ వచ్చింది కదా...ఈ ప్రభుత్వంలోనైనా నా ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలి. గాదరి : అన్న సమస్య ఎందో చెప్పు.. యాదయ్య: మా ఊర్లోన్ని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి వందల ఎకరాల భూములు ఉన్నాయి. అయినా ఆలయం ధూపదీపనైవేద్యాలకు దూరమైంది. గుడిలో గుప్తనిధుల కోసం విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. గాదరి : మండలంలో ఉన్న సమస్యలేమిటి ? కొమ్మినేని సతీష్: గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బోర్లలో ఫ్లోరిన్ అధికంగా ఉండడంతో ఆ నీటిని ప్రజలు తాగి రోగాల పాలవుతున్నారు. గాదరి : అవ్వా... పింఛన్ వస్తుందా ? యాదమ్మ: సారూ...మూడు నెలల సంది పింఛన్లు రావడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. గాదరి: ఏం తాత.. నీసమస్య ఏంటి ? గుగులోతు కాలు: నేను ముసలివాడిని అయ్యా. మాకుటుంబానికి భూమి లేదు. వ్యవసాయానికి ప్రభుత్వ భూమి ఇప్పించాలి. గాదరి: అమ్మా నీ సమస్య... యాదమ్మ: నాకు 65 ఏళ్ల వయస్సు ఉన్నా పింఛన్ రావడం లేదు. రేషన్‌కార్డులో తక్కువ వయస్సువేశారు. మీరైనా పింఛన్ ఇప్పించండి. గాదరి: అన్నా మీ ప్రాంత సమస్యలు ఏంటో చెప్పండి. దాయం విక్రంరెడ్డి: తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయింది. ఎలాంటి సాగునీటి వసతి లేదు. ఎస్సారెస్పీ కాలువలు తీసినా నీళ్లు రావడం లేదు. గాదరి : అక్కా సమస్యలేంటి. పేరాల పూలమ్మ: తండాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సమస్య పరిష్కారానికి ముందస్తుగా నిధులు మంజూరు చేయించాలి. గాదరి: సార్ బాగున్నారా...అంతా కులాసేనా.. ఓరుగంటి సత్యనారాయణ: ఈ ప్రాంతంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉంది. లోఓల్టేజీతో పంటలు ఎండిపోతున్నాయి. గాదరి : జనార్దన్‌గారు చెప్పండి మీసమస్య సుంకరి జనార్దన్: తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఈవిద్యా సంవత్సరం నుంచే ప్రారంభిచేలా చూడాలి. గాదరి : ఆ వీరప్రసాద్ ఇక్కడ పరిస్థితి ఏమిటో... దావుల వీరప్రసాద్: అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనారసింహస్వామి దేవాలయ భూముల సమస్యలు పరిష్కరించాలి. 750 ఎకరాల భూములున్నా ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు కష్టమవుతుంది. రైతులకు ఆమోదయోగ్యమైన ధరకు భూమిని అమ్మి పట్టాలు ఇవ్వాలి. దర్గాను కూడా అభివృద్ధి చేయాలి. గాదరి : అశోకన్న నీ సమస్య చెప్పు మూల అశోక్‌రెడ్డి: తిరుమలగిరి మండల కేంద్రంలో బస్‌డిపో ఏర్పాటు చేయాలి. గాదరి : మీ ఊరు సమస్య లేమిటి ఎ. మధుసూదన్‌రెడ్డి: రైతులకు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేసి ఒకేసారి ఎక్కువ మొత్తంలో రుణాలందజేయాలి. తుంగతుర్తిని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతా గత పాలకుల నిర్లక్ష్యంతో తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయింది. ఫణిగిరి బౌద్ధక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా, సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని రెండో భద్రాద్రిగా మార్చడానికి పక్క గ్రామానికి చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. ఎస్సారెస్పీ రెండో దశ కాలువ పనులు పూర్తి చేయించి ఈప్రాంతానికి సాగు, తాగు నీరందిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డులు వందశాతం ఇప్పిస్తాం. ఒంటరి, మహిళలు, అభయహస్తం పింఛన్‌దారుల సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని నెలకు రూ. 1000 పింఛన్ ఇస్తుంది. ఫణిగిరిలో తవ్వకాల్లో బయల్పడిన ప్రాచీన సంపద కోసం మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరుస్తాం. తాగునీటి అవసరాలకు గ్రామాగ్రామానికి కృష్ణాజలాలు అందించడానికి కృషి చేస్తా. నియోజకవర్గంలోని రోడ్లను బీటీగా మార్చడానికి రూ. 229 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తాం. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
-
యంత్ర సాయం...సాగు లాభం
ఆరుగాలం కష్టించి సాగుచేసిన రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. గత కొన్నేళ్లుగా పంటలు కలిసిరాకపోవడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటనష్టపోతున్నారు. పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రైతన్నల సమస్యలు తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ (జేడీ) దమ్ము ప్రమీల సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. కొండ కరకాం గ్రామంలో పొలాల్లోకి వెళ్లి రైతులు పండిస్తున్న వరి, టమాటా, మిరప, వంగ వంటి పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని, తగిన సూచనలు చేశారు. ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే అధికలాభాలు పొందవచ్చని చెప్పారు. కొండకరకాం గ్రామాంలో పలు పంటలను పరిశీలించి రైతులను సమస్యలను తెలుసుకున్నాను. వరి ఒక్కటే అయితే గిట్టుబాటు కాదని, ఇక్కడ రైతులు వరితోపాటు టమాటా, మిరప, వంగవంటి పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఈ విధానాన్ని మిగతా రైతులు కూడా పాటించాలి. కూరగాయలను విజయనగరం రైతు బజార్లో విక్రయిస్తే మంచిధర వస్తుంది. రైతులకు యంత్ర పరికరాలను 50 శాతం రాయితీపై అందిస్తున్నాం. యంత్ర పరికరాలు కావాల్సిన వారు మీసేవద్వారా దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని వెళ్లడంలో ఇబ్బందుల పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళతాను. నష్టపోయిన రైతులందరికీ పరి హారం అందేలా కృషి చేస్తాను. రైతులతో జాయింట్ డెరైక్టర్ ప్రమీల సంభాషణ ఇలా సాగింది. వ్యవసాయశాఖ జేడీ: నాపేరు ప్రమీల, నేను వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్‌ను. మీ సమస్యలు తెలుసుకోడానికి వచ్చాను. మీ పేరేంటి, ఏపంట వేశారు? రైతు సత్యం: అమ్మా నాపేరు సత్యం. వరి వేశాను జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు? సత్యం: ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నానమ్మ. జేడీ: ఏరకం విత్తనాలు వేశారు ? సత్యం: హెబ్రీడ్ రకం రకాన్ని వేశాను జేడీ: ఎన్ని రోజుల్లో పండుతుంది. పంట వేసిఎన్ని రోజులయింది? సత్యం: 120 రోజుల్లో పండుతుంది. పంట వేసి 25 రోజులయింది. జేడీ: కలుపు మందు ఏమైనా వేశారా? సత్యం: స్వాతి అనే కలుపు మందు వేశాను జేడీ: హైబ్రీడ్ రకాన్నే ఎందుకు వేశారు? సత్యం: మా గ్రామంలో ఓ రైతు ఖరీఫ్‌లో వేశారు. పంట బాగుంది. అందుకే నేనూ వేశాను . జేడీ: హైబ్రీడ్ రకాలను ఏకాలంలోనైనా వేసుకోవచ్చు. అయితే రబీలో వేసుకోవడం మంచిది. ఎందుకంటే తక్కువ రోజుల్లో పంట పండుతుంది. రబీలో నీటి వసతి అన్ని వేళలా అందుబాటులో ఉండదు కాబట్టి ఇటువంటి సల్వకాలిక రకాలను వేసుకోవడం మంచిది. అంతేకాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. పంటకు అవసరమైన ఎరువులను అందిస్తాం. జేడీ: మీ పేరేంటి? రైతు రాములప్పడు : నాపేరు రాములప్పుడమ్మ జేడీ:మీరేపంట వేశారు ? రాములప్పడు : వరి వేశానమ్మ. జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ రకం సాగు చేస్తున్నారు? రాములప్పడు : ఖరీఫ్‌లో ఏడు ఎకరాల్లో హైబ్రీడ్ రకాన్ని వేశాను జేడీ: ఎంతదిగుబడి వస్తుందనుకుంటున్నారు? రాములప్పడు: ఎకరాకు 40 బస్తాలు వరకు వస్తాదని అనుకున్నాను. అయితే హుద్‌హుద్ తుపాను వల్ల పంట దెబ్బతింది. 25 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి రావచ్చు జేడీ: పరిహారం వచ్చిందా? రాములప్పడు : రాలేదమ్మా జేడీ: పంటకు ఇన్సూరెన్స్ కట్టారా? రైతు: ఇన్సూరెన్స్ గురించి తెలియదమ్మా జేడీ: పంటలు బీమా ఇన్సూరెన్స్ ప్రతీ రైతు కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ కడితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటలకు బీమా వర్తిస్తుంది. పరిహారం ఎందుకు రాలేదో విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాను. జేడీ: మీ పేరేంటి రైతు సూర్యనారాయణ : నాపేరు సూర్యనారాయణమ్మ. జేడీ: ఏ పంట వేశారు? సూర్యనారాయణ : టమాటా వేశాను జేడీ: టమాటా ఎందుకు వేశారు ? సూర్యనారాయణ : వరి పంట కొంత వేశాను, అదనపు ఆదాయం వస్తుందని మరికొంత మేర టమాటా వేశాను. జేడీ: ఎక్కడ అమ్ముతారు? సూర్యనారాయణ : విజయనగరం మార్కెట్లో అమ్ముతాను జేడీ: కూరగాయాలను మార్కెట్లో కంటే రైతుబజార్లలో నేరుగా అమ్ముకుంటే మంచి ధర వస్తుంది. రైతు బజార్లో కూరగాయాలు అమ్ముకుంటానంటే ఏడీతో మాట్లాడి కార్డులు ఇప్పిస్తాను. టమాటా సాగులో కలుపు లేకుండా చూసుకోవాలి. ఏదైనా తెగులు సోకితే తక్షణమే ఉద్యానశాఖ అధికారినిగాని, శాస్త్రవేత్తను గాని అడిగి నివారణ చర్యలు చేపట్టాలి. జేడీ : బాబూ నీపేరేంటి? మరో రైతు : నా పేరు సూర్యనారాయణ జేడీ: రుణమాఫీ ఏమైనా అయిందా? సూర్యనారాయణ: తొలివిడతలో అవలేదు. రెండో విడతలో అవుతుందన్నారు. జేడీ: పాసుపుస్తకాలు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలు వివరాలను జన్మభూమి కమిటీకి అందిస్తే సమస్య పరిష్కారమవుతుంది . రైతు: నా పేరు బాబారావు మేడమ్. జేడీ: ఏ పంట వేశారు, పంటనూర్పును సాధారణ పద్ధతిలో చేపడుతున్నారా, లేక యంత్రంతో చేస్తున్నారా? బాబారావు: వరి వేశానమ్మ, సాధారణ పద్ధతిలోనే నూర్పు చేస్తున్నాం. జేడీ: 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలను అం దిస్తున్నాం. మీసేవ ద్వారా దరఖాస్తు చేస్తే పరికరాలను అందజేస్తాం. యంత్ర పరికరాలతో పనులు చేయడం వల్ల కూలీల ఖర్చు, సమయం ఆదా అవుతుంది. జేడీ: బాబు నీ పేరేంటి ? రైతు గోపాల్‌రావు: మేడమ్ నాపేరు పడాల గోపాల్‌రావు. జేడీ: మీరే పంట పండిస్తున్నారు , మీసమస్య ఏంటి? గోపాల్‌రావు: నేను కూరగాయలు పండిస్తున్నాను. నాకు కూరగాయల సాగులో కలుపుతీసే పరికరం కావాలి జేడీ: కూరగాయల సాగును కూడా కొన్ని పరికరాలతో చేపట్టవచ్చు. వాటిని రాయితీపై అందిస్తాం. జేడీ? ఏమండీ మీ పేరేంటి, మీసమస్య ఏంటి? రైతు కోటేశ్వరరావు: అమ్మా... నాపేరు కోటేశ్వరావు. నేను రబీలో మూడు ఎకరాల్లో చోడి పంట వేశాను. యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నాను జేడీ: ప్రస్తుతం యూరియా కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు జిల్లాకు 600 టన్నుల యూరియా వచ్చింది. అన్ని సొసైటీలకు అందిస్తాం. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం. జేడీ ధాన్యం: కొనుగోలు కేంద్రాల వల్ల ఉపయోగం ఉందా? కోటేశ్వరరావు: ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల ప్రయోజనం కంటే, ఖర్చు అదనంగా అవుతోంది జేడీ: ఎందుకు అదనంగా ఖర్చువుతోంది? కోటేశ్వరరావు: ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రానికితీసుకుని వెళ్లడానికిట్రాక్టర్కు అద్దె ఇవ్వాలి. అదే విధంగా ధాన్యం బస్తాల ఆన్లోడింగ్, లోడింగ్‌కు రూ.1000 వరకు ఖర్చువుతోంది జేడీ: మీకు కావాల్సిందేంటి? కోటేశ్వరరావు : మా కళ్లాల దగ్గరకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తే బాగుంటింది. దీని వల్ల రైతులకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా తూనిక యంత్రాలు ఇవ్వాలి. జేడీ: దరఖాస్తు చేసుకుంటే తూనిక యంత్రాలను రాయితీపై అందిస్తాం. ధాన్యం తరలించడానికి అవుతున్న అదనపు ఖర్చు గురించి ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరానికి కృషి చేస్తాను. జేడీ : మీ పేరేంటమ్మా ? మహిళారైతు రాజమ్మ: అమ్మా నా పేరు రాజమ్మ. జేడీ: నీకు పొలం ఉందా, ఉంటే ఏపంట వేశావు? రాజమ్మ: నాకు ఎకరం పొలం ఉంది. వరి వేశాను జేడీ : హుద్‌హుద్ తుపానుకు పంట దెబ్బతిందా?, పరిహారం వచ్చిందా ? రాజమ్మ : పంటంతా పోయిందమ్మ. పరిహారం రాలేదు జేడీ: పరిహారం ఎందుకు రాలేదో విచారణ చేసి చర్యలు తీసుకుంటాను జేడీ :బాబూ నీ పేరేంటి ? రైతు రమణ: నా పేరు రమణ మేడమ్. నేను కూరగాయలు సాగు చేస్తున్నాను జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏఏ పంటలవేశారు? రమణ: ఒక ఎకరంలో ముల్లంగి, గోంగూర, మొక్కజొన్న, టమాటా వేశాను మేడమ్ జేడీ: ఎక్కడ విక్రయిస్తారు ? రమణ: విజయనగరం మార్కెట్లో విక్రయిస్తాను జేడీ: ఎవరుతీసుకు వెళాతారు? రమణ : నేనే తీసుకుని వెళాతాను. జేడీ: ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది? రమణ: ఎకరానికి 20 వేలు వరకూ వస్తుంది మేడమ్. జేడీ : కూరగాయాలను రైతు బజారులో విక్రయిస్తే మంచి గిట్టుబాటు అవుతుంది. మార్కెట్లో అయితే దళారులు బెడద వల్ల నష్ట పోవలసి వస్తుంది. -
పీహెచ్‌సీలపై ప్రత్యేక శ్రద్ధ
జలుబు లేదా జ్వరమొస్తే రూ.వందలు.. ఇంకొంచెం పెద్ద ఆరోగ్య సమస్య అరుుతే రూ.వేలకు వేలు.. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అయ్యే ఖర్చులివి. ఇంత ఖర్చుకు మధ్య తరగతి ప్రజలే కాదు.. సంపన్నులూ వెనుకాడే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిరుపేదలు, సామాన్యులకు మొదట గుర్తుకువచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. అక్కడ వైద్య పరీక్షలే కాదు మందులూ ఉచితం. అయితే పీహెచ్‌సీల నిర్వహణ, వైద్యులు, సిబ్బంది ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని పీహెచ్‌సీల తీరు ఎలా ఉంది.. ప్రజలకు ఏం కావాలి, ఇంకా ఏయే సౌకర్యాలు కల్పించాలి వంటి అంశాలను తెలుసుకోవాలనుకున్నారు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేఎం సునంద. ఇందుకు ‘సాక్షి’ని వేదికగా చేసుకున్నారు. వీఐపీ రిపోర్టర్‌గా నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను, స్కానింగ్ సెంటర్‌ను ఆమె పరిశీలించారు. తొలుత తంగెళ్లమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించడానికి వెళ్లిన డాక్టర్ సునంద అక్కడి పరిస్థితులను గమనించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల తీరు, వైద్యులు, సిబ్బంది వైఖరిపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సునంద : ఈ కేంద్రానికి రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు. గర్భిణులను ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారా డాక్టర్ కె.మిద్దేశ్వరరావు : రోజుకు 30 నుంచి 50 మంది రోగులు వస్తుంటారు మేడమ్. గర్భిణుల వివరాలతో రికార్డులు నిర్వహిస్తున్నాం. ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. సునంద : గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుళ్లు పోస్తున్నారా.. బయటకు పంపుతున్నారా మిద్దేశ్వరరావు : మా కేంద్రానికి వచ్చే గర్భిణులందరినీ 9 నెలలపాటు జగ్రత్తగా పరిశీలిస్తూ ఇక్కడే కాన్పులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసరమైతే జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తున్నాం. సునంద : ఇక్కడ అన్నిరకాల మందులూ అందుబాటులో ఉంచుతున్నారా. కె.విజయ, నర్సు : అన్ని మందులూ ఉన్నాయి మేడమ్. ఈ ప్రాంతం మురికివాడ కావడంతో ఎక్కువ మంది కుక్క కాటుకు గురై వైద్యం కోసం వస్తున్నారు. యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు మేడమ్. సునంద : అర్బన్ హెల్త్ సెంటర్లలో యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం కష్టం. వాటిని శీతల ప్రదేశంలో ఉంచాల్సి ఉన్నందున్న ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి బాధితులను అక్కడికి పంపించాలి. అనంతరం టాయిలెట్స్ ఉన్న ప్రాంతానికి వెళ్లిన డీఎంహెచ్‌వో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ స్వీపర్ ఎవరని ప్రశ్నించారు. కొప్పుల రామలక్ష్మి : నేను ఇక్కడ స్వీపర్‌గా పనిచేస్తున్నాను మేడమ్. సునంద : టాయిలెట్లు ఇంత మురికిగా ఉన్నాయేంటి. నీరుకూడా వృథాగా పోతోంది. రామలక్ష్మి : ఎప్పుడూ కడుగుతూనే ఉంటానండి. రోగులు వచ్చి వినియోగించుకుంటారు కదాండి. అందుకే మురికిగా ఉన్నాయి. మరింత శుభ్రంగా ఉంచుతాను మేడమ్. సునంద : నీరు వృథాగా పోతోంది కదా. పంపులను జాగ్రత్తగా వాడాలి. ఎప్పుడూ పరిశీలిస్తుండాలి. రామలక్ష్మి : అలాగేనండి. ఆ తర్వాత అక్కడున్న కమ్యూనిటీ ఆర్గనైజర్‌తో డీఎంహెచ్‌వో మాట్లాడారు. ఎంబీ విజయసత్యకళ, సీవో : ప్రతినెలా జీతాలు అందడం లేదు మేడమ్. ఏ నెల జీతాలు ఆ నెలలో ఇచ్చేలా ఏర్పాట్లు చేయండి. సునంద : ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావాలి. బడ్జెట్ విడుదల కాగానే జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడి నుండి నగరం నడిబొడ్డులోని రామచంద్రరావు పేటలో గల వంశీ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లిన సునంద ఆ సెంటర్ నిర్వాహకురాలిని అక్కడ ఏయే పరీక్షలు చేస్తున్నారు, బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఎన్.మృణాళిని : మేడమ్. ఇక్కడ నేను కన్సల్టెంట్ రేడియాలజిస్ట్‌గా వ్యవహరిస్తున్నాను. సునంద : అందుకు సంబంధించి మీ అర్హత ఏమిటి. బయట బోర్డు పెట్టారా. మీ పత్రాలు చూపండి. మృణాళిని : రిజిస్ట్రేషన్ చేయించాం మేడమ్. బయట బోర్డు కూడా ఉంది. సునంద : ఇక్కడ స్కానింగ్‌లు చేస్తున్నారా. ఎంత వసూలు చేస్తున్నారు. మృణాళిని : అన్నిరకాల స్కానింగ్లూ చేస్తున్నాం మేడమ్. లింగ నిర్థారణ ప్రకటించడం లేదు. సునంద : రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు. మృణాళిని : గర్భస్థ శిశు పరీక్షలు కాకుండా ఇతర స్కానింగ్‌లు సుమారు 30 నుంచి 40 వరకూ చేస్తాం. సునంద : మీరు చేసే అన్ని పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు మాకు నివేదిక పంపాలి. వైద్యుల సూచనల మేరకు వస్తున్న రోగులకే పరీక్షలు నిర్వహిస్తున్నారా లేక స్వచ్ఛందంగా వచ్చేవారికి కూడా పరీక్షలు చేస్తున్నారా. మృణాళిని : లేదు మేడమ్. డాక్టర్లు పంపిన వారికే పరీక్షలు నిర్వహిస్తున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన డీఎంహెచ్‌వో పరీక్షల కోసం వేచి ఉన్న వారితో మాట్లాడారు. సునంద : ఏమ్మా.. ఏ పరీక్ష కోసం వచ్చారు. ఫాతిమా : కడుపునొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన స్కానింగ్ చేయించుకు రమ్మని పంపారు. సునంద : ఏ వైద్యుడు పంపారు. ఆ చీటీ ఏది. ఫాతిమా : చీటీ నా దగ్గర లేదండి. నా భర్త వద్ద ఉంది. ఆయన బయటకు వెళ్లారు. -
సజావుగా ‘సాగ’నివ్వండి
మార్చి నెలాఖరుకల్లా రబీ సాగు పూర్తి చేయకుంటే క్లోజర్లో ఆధునికీకరణ పనులు చేయలేమని నీటిపారుదల శాఖ అంటుంటే.. కనీసం ఏప్రిల్ 15 వరకు నీరిస్తేనే సాగు సజావుగా పూర్తవుతుందని రైతులంటున్నారు. రబీకి నీటి సరఫరా, సాగు పరిస్థితులపై రైతులు, నీటిపారుదలశాఖ భిన్న వాదనలతో ఉన్న నేపథ్యంలో సాగుకు పలు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించే దిశగా రైతులకు అవగాహన కల్పించి, సాగు సమస్యలను ఆ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువెళ్లే బాధ్యతను ‘సాక్షి’ మీడియా చేపట్టింది. ‘సాక్షి’ అభ్యర్థన మేరకు ఎస్ఈ ఎస్. సుగుణాకరరావు శనివారం వీఐపీ రిపోర్టర్‌గా సామర్లకోట గోదావరి కెనాల్, పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలో రైతుల సమస్యలను పొలాల్లోకే వెళ్లి తెలుసుకున్నారు. పూడుకుపోయిన డ్రైన్లు, కాలువలు, గట్లకు గండ్ల వంటి సమస్యలను రైతులు ఎస్ఈ దృష్టికి తీసుకువచ్చారు. ఆ రిపోర్టింగ్ ఎస్ఈ సుగుణాకరరావు : ఏం పెద్దాయనా.. నీ పేరేమిటి? రబీ సాగులో ఏమైనా ఇబ్బందులున్నాయా? రైతు : వెలమర్తి బులిరాజండీ. మా ఊరు వి.కె.రాయపురం. నీలం తుపానప్పుడు సామర్లకోట కెనాల్‌కు రెండుచోట్ల పడ్ల గండ్లను పూడ్చకున్నారు. పొలాలు మునిగిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. మీరైనా కాస్త దయచూపండయ్యా! ఎస్ఈ: ఆ తుపాన్‌తో రెండుచోట్ల గండ్లు పడితే పూడ్చడానికి రూ.95 లక్షలతో అంచనాలు రూపొందించాం. వచ్చే మార్చి, ఏప్రిల్ లోపు పనులు మొదలు పెట్టించి మీకు సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. నిశ్చింతగా ఉండు పెద్దాయనా. మరో రైతు: నా పేరు రేలంగి రామారావు. వెస్ట్ ఏలేరు కెనాల్ కాలువపై ఫుట్‌పాత్ వంతెన ఉన్నా ధాన్యం తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందవుతోంది సారూ. (మరో రైతు వి.శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ) ఒక ధాన్యం బస్తా తేవాలంటేనే రూ.50 నుంచి వంద రూపాలు ఎగస్ట్రా అయిపోతోందండి. ఇంతవరకు మా బాధ ఎవరూ పట్టించుకోలేదండి. ఎస్ఈ: మీకు దగ్గర్లో మరో వంతెనేమైనా ఉందా? రైతులు: ఎక్కడా లేకపోబట్టే కదా సారూ.. పండించిన గింజలు తెచ్చుకోవాలన్నా కష్టమైపోతోంది. ఎస్ఈ: డ్రైనేజీ ఆధునికీకరణకు నిధులు పుష్కలంగా ఉన్నాయి. మా ఈఈని పంపిస్తాను. అన్నీ పరిశీలించి ప్రతిపాదనలు తయారుచేసి పనులు చేపట్టే ప్రయత్నం చేస్తాను నన్ను నమ్ముతారు కదా! మీరేదో చెపుదామనుకుంటున్నారు చెప్పండి మీ సమస్య. రైతు: నా పేరు బేతిన బాబ్జీ సార్. జగ్గమ్మగారిపేటలో తరచు కాలువకు గండ్లు పడుతున్నాయి. ఆ సమస్యను పరిష్కరిస్తారని. ఎస్ఈ: ఆధునికీకరణ పనులు చేయడానికి కనీసం రెండు నెలలు కావాలి. డిసెంబరు ఫస్ట్ నుంచి నీరు ఇచ్చాం. ఇప్పటికీ ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఇలా అయితే పనులు ఎలా చేపట్టగలమో మీరే మావైపు ఆలోచించండి. మీరు సహకరిస్తేనేమేం ఏమైనా చేయడానికి ఉంటుంది. రైతు: సార్ నా పేరు చుండ్రు శ్రీరామచంద్రమూర్తి సర్, మీరేమనుకున్నా కానీ పిఠాపురం, ఏలేరు కింద సాగు కొంత ఆలస్యమవుతుంది. మార్చి నెలాఖరుకు కాలువలు కట్టేస్తామంటే కరెక్టు కాదండి. ఏప్రిల్ వరకు నీరివ్వాల్సిందే. ఎస్ఈ: లేదంటే డెరైక్ట్ సోయింగ్(వెదజల్లు) వేయొచ్చు కదా, వాటర్ లేకా, లేబర్ దొరక్కా.. ఎందుకు లేటవుతుందో చెప్పండి. మీరు నారుమడి ముందుగా వేసుకోవాలి కదా! రైతు: నా పేరు సత్తిబాబండీ, లేబర్ దొరక్క ఆలస్యమవుతోంది, మీరే కాస్త మా పక్కనుంచి ఆలోచించండి సారూ. ఎస్ఈ: మా సమస్య మాకుంది. ఆధునీకరణకు ఆరుకోట్లున్నా మీరు సహకరించకపోతే పనులు చేయలేం. మీరంతా వచ్చారు కాబట్టి ఒకసారి ఆలోచించండి మరి. రైతు: సర్ నా పేరు ఇంటి వెంకట్రావండీ. మేం అడుగుతుంది ఏప్రిల్ 15 దాకానే కదా. మూడేళ్లుగా పంటలు పోయాయి. అప్పుల్లో ఉన్నాం. ఏదో భగవంతుడు కరుణించాడు కాబట్టే కొద్దిగా గుక్కతిప్పుకున్నాం. నీరు ఇచ్చేది కాస్త పొడిగించండి బాబూ. మరో రైతు: నా పేరు రాజబాబు సార్. సామర్లకోట లాకులు ఓపెన్ చేయడం లేదండి. ఎస్సీ పేట మొత్తం మునిగిపోతోంది. 20 వేల ఎకరాల్లో వ్యవసాయం ఉత్తినే ఇస్తామన్నా చేయడానికి కూడా ఎవరూ రావడం లేదు. ఎస్ఈ: సరే మా డీఈని సోమవారం మీ దగ్గరకు పంపిస్తాను. మీరంతా దగ్గరుండి ఆ సమస్యను పరిశీలించండి. ఆధునికీకరణ పనుల్లో చేపట్టేలా చర్యలు తీసుకుంటాను. రైతు: నా పేరు సత్తిరాజు. సారూ నేను కూడా ఏదైనా చెప్పొచ్చా? (మరోరైతు) నా పేరు శ్రీనివాసండీ. మేమంతా సమస్యలన్నింటినీ కలిసే చెబుతామండీ. కల్వర్టులు పోయాయి. తమరు మాయందు దయుంచి మాకు గిఫ్ట్‌గా ఇవ్వండి సర్, మీకు రుణపడి ఉంటాం. 28/4 నంబర్ పైపు కింద వాటర్ రావడం లేదండీ.గోడ కూలగొట్టేశారు. నీరు మెరకకు రావడం లేదు. తూటేరుడ్రైన్ మొత్తం మూసుకుపోయింది. వీకే రాయపురం, హుస్సేన్‌పురం వంటి గ్రామాలు ముంపులో ఉంటున్నాయి. డ్రైన్ తవ్వి పాతికేళ్లయ్యిందయ్యా. ఎస్ఈ: మా నోటీసుకు తీసుకువచ్చారు కదా. ఐదు లక్షల లోపు అంచనాలుంటే మీరంతా కలిసి ఆయకట్టు కమిటీగా ఏర్పడితే మీ ద్వారానే పనులు పూర్తి చేస్తాం. 28/4 నంబర్ పైపు కింద వాటర్ వచ్చేలా చూస్తా. మరో విషయం కూడా చెబుతాను. తుల్యభాగ, టేకి డ్రైన్లు చేపట్టాం. సోమవారం ఈఈని పంపించి అంచనాలు తయారు చేయిస్తాను. రైతు: నేను రైతు సంఘం అధ్యక్షుడినండీ. నా పేరు కంటే బాబు. లెహెర్ తుపాన్‌తో గట్లన్నీ కుంగిపోయాయి. వెస్ట్ ఏలేరు పరిధిలో ఒకపక్క వీకే రాయపురం, మరోపక్క సత్యవరపుపేటలకు కనీసం రోడ్డు కూడా లేదండి. రైతులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఈ: సామర్లకోట పరిధిలో రూ.92 కోట్ల పనులు మంజూరైతే రూ.16 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన పనులు ఆగిపోవడానికి కారణమైన ఏజెన్సీల అగ్రిమెంట్ రద్దు చేస్తాం. గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయిస్తాను. సహకార సంఘం అధ్యక్షుడు: సర్ నా పేరు ఊటా వాసండీ. రామేశ్వరం రిటైనింగ్‌వాల్ పోయింది. రైతులు చాలా ఇబ్బందులుపడుతున్నారు. ఎస్ఈ: వాటిని పరిశీలించి ఈ ఏడాది కచ్చితంగా పనులు చేపట్టి పూర్తి చేద్దాం. మీరు కొంత సహకారం అందించాలి, ఇస్తారు కదా. మరో ఇద్దరు రైతులు: సాగో ఫ్యాక్టరీలు, సుగర్ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కలుషితమైన మురుగుతో దూడలు కూడా చచ్చిపోతున్నాయి. దోమలు పెరిగిపోతున్నాయి. పంటలు పోతున్నాయి. మీరే ఏదైనా ఆలోచించండి. సీఎం దాకా వెళ్లింది. ఎస్ఈ: నేను వచ్చి ఆరునెలలే అయింది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళతాను. రైతు: నా పేరు ప్రభాకరండీ. గుర్రపుడెక్క చాలా ఇబ్బందిపెడుతోంది. లాకుల వద్ద తీసేసి రోడ్డుపై పడేశారు. వాటర్ రావడం లేదు. ఎస్ఈ: ఖరీఫ్లోవేసిన డెక్క ఎండిపోయాక తీసేస్తారు. కాంట్రాక్టర్‌కు చిల్లిగవ్వ పేమెంట్ చేయలేదు. సంక్రాంతి వెళ్లాక తీయించేస్తాను. రైతు: నా పేరు ఎలిశెట్టి భీమన్నదొరండి. పీబీసీ-1 కాలువ పరిధిలో కండికాలువ వద్ద అక్రమ లేఅవుట్లు వేశారు. కలెక్టర్ వరకు వెళ్లింది. ఆక్రమణలతో నీరు పోవడం లేదు. ఎస్ఈ: కలెక్టర్‌గారు చెప్పారు.. వెరిఫై చేశాను. 15 వరకు అనధికారిక భవనాలున్నాయి. వాటిని తొలగించాలంటే లక్షన్నర కావాలి. వాటికి మంజూరు రాగానే తొలగించేస్తాము. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
-
విఐపి రిపోర్టర్ - మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు
-
విఐపి రిపోర్టర్ - గంగుల కమలాకర్
-
వీఐపీ రిపోర్టర్ : ఐఏఎస్ అధికారి రజత్‌కుమార్
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య
-
విఐపి రిపోర్టర్ - నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి
-
విఐపి రిపోర్టర్ - కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్
-
ఆశే వారి శ్వాస
చుట్టూ ఎటు చూసినా పచ్చని పొలాలు.. జీడిమామిడి తోటలు.. పక్కనే గలగల పారే వంశధార. చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఆ గ్రామ ప్రజల మనస్సుల్లో మాత్రం గుండెలు పిండేసే వ్యథ గూడుకట్టుకుంది. గ్రామ భూములను సస్యశ్యామలం చేయాల్సిన వంశధార ఏటా వరదల రూపంలో దాడి చేస్తూ గ్రామానికిప్రపంచంతో సంబంధాలను తుంచేస్తోంది. ఇసుక మేటల రూపంలో సారవంతమైన భూములను బీళ్లుగా మార్చేస్తోంది. విలువైన పంట భూములు రెల్లు తుప్పలుగా మారిపోయాయి. 2006 నుంచి ఏటా ఇదే చేదు అనుభవం. ఆ ఏడాది వరదలకు వరదగట్టుకు సుమారు 400 మీటర్ల గండి పడి గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. ప్రజల జీవనాన్ని దుర్భరం చేసింది. ప్రతి ఏటా వరదల సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎందరో వస్తున్నారు.. ఏవేవో హామీలు ఇస్తున్నారు.. వెళుతున్నారు.. అంతే.. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. అయినా ఆ గ్రామస్తులు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఆశపడుతున్నారు. దాన్నే శ్వాసగా చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాకు శివారున, ఒడిశా సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఆ బాధాతప్త పెనుగొటివాడ గ్రామాన్ని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సందర్శించారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గ్రామంలోకి అడుగుపెట్టి వంశధార సృష్టించిన విలయాన్ని.. స్థానికుల కన్నీటి గాథలను స్వయంగా చూశారు.. విన్నారు.. రెండేళ్లలో సమస్యకు పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చిన ఆయన గ్రామస్తులతో జరిపిన మాటామంతీ యథాతథంగా.. కలమట: నువ్వు రైతువేనా? పంటలు ఎలా పండుతున్నాయి? కె.మృత్యుంజయ(రైతు): నేను రైతునే బాబు ఒకప్పుడు. మా పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇంక పంటలేమి పండుతాయి. అన్నీ రెల్లి తుప్పలు వేశాయి. మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, నాయకులు వచ్చి చూసెల్లిపోతున్నారు. కలమట: ఇసుక మేటలు ఎంత మేర వేశాయి. వాటిని ఎలా తొలగించాలనుకుంటున్నారు? కె.జమ్మినాయుడు(రైతు): ఇసుక మేటలు 2006 నుంచి ఉన్నాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయం ఇవ్వలేదు. ఇప్పుడైనా పంట పొలాల్లో ఉన్న ఇసుక మేటలను తొలగించుకునేందుకు సాయం చేయమని కోరుతున్నాం. కలమట: ఎంత విస్తీర్ణంలో మేటలు వేసి ఉంటాయి. ఇంకా మిగిలి ఉన్న భూములు ఏమైనా ఉన్నాయా? జి.ఆనందరావు: పెనుగొటివాడ, మాతల రెవెన్యూ గ్రామాల్లో సుమారు 1250 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. మిగిలిన పొలాలు వరద నీటిలోనే ఉంటాయి. చిన్న చినుకు పడితే మునిగిపోతాయి. మేటలు తొలగించడంతో పాటు వంశధార నదికి కరకట్టలు కట్టేందుకు ఎమ్మెల్యేగా మీరే చర్యలు తీసుకోవాలి. కలమట: గతంలో అధికారులు గ్రామానికి వచ్చారా.. ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు? రేగేటి మురళి: వరదలు వచ్చినప్పుడే జిల్లా కలెక్టర్‌తో పాటు ఎంతో మంది అధికారులు మా గ్రామాలకు వస్తున్నారు. ఆప్పుడు ఎన్నో మాటలు చెపుతున్నారు. అందులో ఒక్కటీ అమలు కాలేదు. మాది సుమారు 35 ఎకరాల భూమి. వరదనీరు, ఇసుక మేటల కారణంగా పంటలు పండటంలేదు. వృద్ధురాలితో... కలమట: అమ్మా బాగున్నావా.. ఆరోగ్యం బాగుందా. వరదలు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? గవర వరలక్ష్మి: ఎం బాగు నాయనా.. మా ఊరికి ఒక ఆటో కూడా రాదు. ఎవరికైనా బాగులేనప్పుడు మంచానికి కట్టి మోసుకెళతారు. వరదలు వచ్చినప్పుడు ఊరి చుట్టు నీరే ఉంటుంది. భయం భయంగా బతుకుతున్నాం. 8 సంవత్సరాలుగా ఇదే తీరు నాయనా.. మీరైనా పట్టించుకోండి. కలమట: మీ పిల్లలు ఏమి చేస్తున్నారు. ఆరోగ్యం బాగుందా? నూలు అంకమ్మ: మా ఊరికి వరదలని, చేసేందుకు పనుల్లేక పోవడంతో పిల్లలు వలస వెళ్లిపోతున్నారు. ముసలోల్లమే ఊరు పట్టుకుని ఉన్నాం. ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏదో నాయనా నువ్వు వచ్చి మా కట్టాలు అడిగావయ్యా.. సంతోసంగా ఉంది. పింఛను లబ్ధిదారులతో.. కలమట: ప్రతి నెల పింఛను డబ్బులు వస్తున్నాయా.. ఎంత ఇస్తున్నారు? బొంతల సూర్యకాంతం: ప్రతి నెల డబ్బులు వత్తన్నాయి. నెలకు రూ.వెయ్యి ఇత్తన్నారు బాబు. మా పొలాలే పండకుండా పోతున్నాయి. మీరైనా మంచి చేయండి. జడగ గణపతి(వికలాంగుడు): ఎమ్మెల్యే బాబూ.. నాకు ప్రతి నెల రూ.200 పింఛను అందేది. నాకు కాలు వంకర పోయింది. అది తక్కువగా ఉందని పింఛను ఆపేశారు. దాంతో పూట గడవడం కట్టంగా ఉందయ్యా. మీరైనా పింఛను వచ్చేలా చేయండయ్యా.. కలమట: జిల్లా కలెక్టర్లు, అనేక మంది అధికారులు మీ ఊరు వచ్చి సమస్యలు విని వెళ్లారు. ఊరు బాగు కోసం ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? ఇతర గ్రామస్తులతో.. కందుకూరి పాపారావు: ఆయ్యా నేను విశ్రాంత ఉపాధ్యాయుడ్ని. వరదల కారణంగా ఇసుక మేటలు వేయడంతో ప్రస్తుతం మా పొలం ఎక్కడుందో కూడా తెలియదు. తుప్పలు ఉండటంతో అడవి పందులు, విష పురుగులు చేరాయి. అటువైపు వెళ్లలేని దుస్థితి. పంట భూములకు పరిహారం ఇచ్చి మా గ్రామానికి పునరావాస ప్యాకేజీ కల్పిస్తే మేమంతా మరో చోటికి వెళ్లిపోతాం. స్థానిక ఎమ్మెల్యేగా మీరు, ప్రజా సమస్యలపై పోరాడే పత్రికగా ‘సాక్షి’ ఈ విషయంలో మాకు సహాయం చేయాలి. కలమట: ప్రస్తుతం ఏం పనులు చేస్తున్నారు. మీ జీవనం ఎలా సాగుతోంది? కొప్పిశెట్టి సుబ్బారావు: మమ్మల్ని ఉపాధి హామీ పథకం కొంత ఆదుకుంటోంది. వేసవిలో పనులు దొరుకుతున్నాయి. ఇబ్బందులు ఉండటంలేదు. జూన్ నుంచి పనులు ఉండవు. దీంతో పూట గడవటం కష్టంగా ఉంటుంది. మా ఊరికి ఏడాదంతా పనులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కలమట: గ్రామంలో యువకుడువి నువ్వొక్కడివే కనిపించావు. ఏం చేస్తున్నావు? కందుకూరి ఫల్గుణరావు: సార్ నేను ఆటో నడుపుకొని జీవిస్తున్నాను. ఆటో మా ఊరి వరకు రాదు. పక్కనున్న మాతలలో ఆటో ఉంటుంది. అక్కడి నుంచి నివగాం మీదుగా కొత్తూరు వరకు, లేకుంటే పాతపట్నం, పర్లాకిమిడి వరకు నడిపి జీవిస్తున్నారు. మా ఊరి వరకు రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలి. చేనేత కార్మికుడితో.. కలమట: అయ్యా.. నువ్వు నేత కార్మికుడివని విన్నాను. ఇప్పుడు బట్టలు నేస్తున్నావా.. పింఛను వస్తుందా? అలక చంద్రరావు: ఇప్పుడు బట్టలు నేయడంలేదు. ఒకప్పుడు కుటుంబమంతా నేసేవారం. ఇప్పుడంతా కొత్తకొత్త రకాల బట్టలు వచ్చాయి. మాకు పనిలేకుండా పోయింది. ఎవరైనా సరుకు ఇచ్చి నేయమంటే నేస్తాను. నాకు పింఛను వస్తోంది. కలమట: మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి. గ్రామంలో మీరంతా ఎలా జీవిస్తున్నారు? కె.శ్రీరాములు: 2006 తరువాత మా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మా ఊరిలోని ఆడపిల్లలను పెళ్లి చేసుకునేందుకు, మా ఊరికి కోడళ్లుగా వచ్చేందుకు ఎవరు ముందుకు రావడలేదు. మా పిల్లలు ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుని పంపించిన డబ్బులతో గ్రామంలో ముసలి వాళ్లమంతా జీవిస్తున్నాం. వంశధార వరదలు మా జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. విద్యార్థులతో.. కటమట: మీరంతా బడికి వెళ్లడం లేదా? పిల్లలు: వెళ్తున్నాం. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. కలమట: మీ బడికి టీచర్లు రోజూ వస్తున్నారా..ప్రతి రోజూ తెరుస్తున్నారా? పిల్లలు: మా టీచరు రోజూ వస్తారు. వర్షం పడితే మాత్రం బడికి సెలవే. ఊరి చుట్టూ నీరు వచ్చేస్తుంది. టీచరు ఊరిలోకి రాలేరు. అప్పుడు మా ఊరి వాళ్లు ఎక్కడికీ వెళ్లడం అవ్వదు. -
అమ్మలకు భరోసా !
నిత్యం అక్కడ సమస్యలు రాజ్యమేలుతాయి...కనీస సౌకర్యాలు లేక గర్భిణులు, బాలింతల ఆక్రందనల ఘోష అక్కడ ప్రతిధ్వనిస్తుంది. ప్రసవం కోసం వెళ్లిన గర్భిణి అక్కడి నుంచి శిశువుతో క్షేమంగా ఇంటికి చేరుకుంటుందన్న భరోసా లేదు. నవమాసాలు మోసి, శిశువులకు జన్మనిచ్చిన ముగ్గురు తల్లులు... బిడ్డల ఎడబాటుతో నరకయాతన అనుభవించారు. ఆస్పత్రి నుంచి ముగ్గురు పిల్లలు మాయమవగా ‘సాక్షి’ చొరవతో ఒక బిడ్డ తిరిగి తల్లిచెంతకు చేరింది. మిగతా ఇద్దరు తల్లులూ గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. పడకలు చాలకపోవడంతో ఒకే మంచంపై చిరిగిన పరుపులపై ఇద్దరేసి చొప్పున చికిత్స పొందే దుస్థితి ఉంది. గర్భిణులకు పూర్తిస్థాయిలో భోజనం అందడంలేదు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఇలా ఎన్నో సమస్యలు ఆ దవాఖానాలో రోగులపై దండెత్తుతున్నాయి. ఘోషా ఆస్పత్రిలో ఉన్న సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఉప్పాడ స్వరాజ్యలక్ష్మి ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు, పలు వార్డుల్లో కలియ తిరిగి గర్భిణులు, బాలింతలు, వారికి సహాయం చేసేందుకు వచ్చినవారితో మాట్లాడి, సమస్యలు పరిష్కరిస్తానని, మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గర్భిణులు,బాలింతలు, వైద్యులతో డీఎంహెచ్ఓ సంభాణ ఇలా సాగింది. డీఎంహెచ్ఓ: అమ్మా నాపేరు ఉప్పాడ స్వరాజ్యలక్ష్మి. నేను డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్నాను, మీసమస్యలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీదగ్గరకు వచ్చాను. నీపేరేంటి , ఎక్కడనుంచి వచ్చావు? గర్భిణి జ్యోతి: అమ్మా నాపేరు జ్యోతి. మాది బొండపల్లి గ్రామం. తనిఖీకోసం వచ్చాను. డీఎంహెచ్ఓ: మీ దగ్గరలో ఆస్పత్రి ఉంది కదా... అక్కడ తనిఖీలు చేయడం లేదా? జ్యోతి: అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారని వచ్చాను. డీఎంహెచ్ఓ: మీకు దగ్గరలో ఏ ఆస్పత్రి ఉంది. సేవలు బాగా అందిస్తున్నారా? జ్యోతి: మాకు దగ్గరలో బొండపల్లి పీహెచ్సీ ఉంది. అక్కడబాగానే వైద్య సేవలు అందిస్తున్నారు. డీఎంహెచ్ఓ: డాక్టర్ గారు మీపేరేంటి, రోజుకు ఎంతమంది గర్భిణులను పరీక్షిస్తున్నారు? డాక్టర్ : మేడమ్ నాపేరు సుధ. రోజుకు 50 మంది వరకు గర్భిణులను పరీక్షిస్తున్నాను. డీఎంహెచ్ఓ : అందరికీ మీరు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించగలుగుతున్నావా, లేక అదనంగా ఇంకో వైద్యురాలు కావాలా? డాక్టర్ సుధ: మేడమ్ నాతోపాటు , ఇంకో వైద్యురాలు సహాయంగా ఉంటే గర్భిణులకు ఇంకా మెరుగైన సేవలు అందించగలం. డీఎంహెచ్ఓ: కౌన్సిలర్ గారు మీపేరేంటి, రోజుకు ఎంతమందికి కౌన్సెలింగ్ చేస్తున్నారు కౌన్సెలర్ గోపాల్‌రావు: మేడమ్ నా పేరు గోపాల్‌రావు. రోజుకు 30 నుంచి 40 మంది వరకు హెచ్ఐవీపై కౌన్సెలింగ్ ఇస్తున్నాను. డీఎంహెచ్ఓ: ఏప్రిల్ నెల నుంచి ఎంత మంది హెచ్ఐవీ గర్భిణులు ప్రసవించారు. గోపాల్‌రావు: మేడమ్ ఏప్రిల్ నుంచి ఇంతవరకు 23 మంది హెచ్ఐవీ గర్భిణుల ప్రసవాలు జరిగాయి డీఎంహెచ్ఓ : బిడ్డకు ఎన్ని సంవత్సరాలలో లోపు హెచ్ఐవీ ఉందని నిర్ధారిస్తున్నారు? గోపాల్‌రావు: 18 నెలలు వయస్సు వచ్చినప్పుడు బిడ్డనుంచి శాంపిల్ తీసి నిర్ధారణకోసం ముంబైకి పంపిస్తాం డీఎంహెచ్ఓ: డాక్టర్ గారు మీపేరేంటి, రోజుకు ఎంతమందిరోగులు సుఖవ్యాధులతో వస్తున్నారు? డాక్టర్ : మేడమ్ నాపేరు మీసాల వేణుగోపాల్. రోజుకు 10 నుంచి 15 మంది వరకు సుఖవ్యాధి, సంబంధిత ఇతర వ్యాధులతో వస్తున్నారు. డీఎంహెచ్ఓ: సూపరింటెండెంట్ గారు ఆస్పత్రిలో సౌకర్యాలు ఏవిధంగా ఉన్నాయి? సూపరింటెండెంట్ రవిచంద్ర: మేడమ్ ఆస్పత్రిలో ప్రస్తుతం 100 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్పత్రి మేడపైన150 పడకలు గైనిక్ బ్లాక్ నిర్మాణంలో ఉంది. ఒకటిరెండు నెలల్లో పూర్తి కానుంది. గైనక్ బ్లాక్ అందుబాటులోకి వస్తే మొత్తం 250 పడకలు ఏర్పాటవుతాయి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు డీఎంహెచ్ఓ: రోగులను వేరే ఆస్పత్రి ఎక్కువగా రిఫర్ చేస్తున్నారటా... నిజమేనా? సూపరింటెండెంట్ : అత్యవసరమనుకుంటేనే రిఫర్ చేస్తున్నాం. లేదంటే చేయడం లేదు డీఎంహెచ్ఓ: ఏమ్మా...నీపేరేంటి, ఇక్కడకు ఎందుకు వచ్చావు, నీచేతిలో ఉన్నది పాపా ? ... బాబా? బాలింత తల్లి బంగారమ్మ: అమ్మ నాపేరు బంగారమ్మ. మాది జొన్నవలస. మా పాప కాన్పు కోసం ఇక్కడకు తీసుకువచ్చాను. పాప పుట్టింది. డీఎంహెచ్ఓ: ఇక్కడ బాగానే చూస్తున్నారా? మందులు ఏవైనా కొనుగోలు చేశారా? బంగారమ్మ: బాగానే చూస్తున్నారమ్మా, మందులు కొనమని చెప్పలేదు. డీఎంహెచ్ఓ: 108 వాహనంలో వచ్చారా, ఆటోలో వచ్చావా? బంగారమ్మ: ఆటోలో వచ్చానమ్మ డీఎంహెచ్ఓ:108 వస్తుందని తెలియదా, ఎవరూ చెప్పలేదా? బంగారమ్మ: నాకు ఏవరూ చెప్పలేదు తల్లి, నా అల్లుడి తమ్ముడికి ఆటో ఉంటే, ఆ ఆటో పట్టుకుని వచ్చాం. డీఎంహెచ్ఓ: మీ పాపకు బ్యాంకు ఖాతా ఉందా? బంగారమ్మ: లేదమ్మా డీఎంహెచ్ఓ : ఏమ్మా నీపేరేంటి, మీదేఊరు ? గర్భిణి ఆదిలక్ష్మి: మేడమ్‌గారు నాపేరు ఆదిలక్ష్మి . మాది సాలూరు. తనిఖీచేయించుకోవడానికి వచ్చాను. డీఎంహెచ్ఓ: సాలూరులో సీహెచ్‌సీ ఉంది కదా, ఇంత దూరం నుంచి ఎందుకు వచ్చావు? ఆదిలక్ష్మి: అక్కడ ఆపరేషన్ చేయాలంటే ఇక్కడకే రిఫర్చేస్తారు. ఆ సమయంలో సకాలంలో రాలేంకదా మేడమ్. అందుకే ఏ ఇబ్బంది ఉండదని, ఇక్కడ తనిఖీ చేయించుకోవడానికి వచ్చాను. డీఎంహెచ్ఓ : ఏమ్మా ఈ రోజు గర్భిణులకు ఏ ఆహారం ఇచ్చారు, నీపేరేంటి? డైట్ సూపర్వైజర్: మేడమ్ గారు నాపేరు లక్ష్మి. గర్భిణులకు అన్నం, పప్పు, సాంబారు, అరటి పండు ఇచ్చాం. డీఎంహెచ్ఓ: ఏమ్మా... ఆస్పత్రిలో మీకు సంబంధించిన వారెవరున్నారు ? గర్భిణి తల్లి అన్నపూర్ణ: అమ్మా నాపేరు అన్నపూర్ణ. మా అమ్మాయికి ఆస్పత్రిలో ప్రసవం అయింది. డీఎంహెచ్ఓ: మీ అమ్మాయికి ఇక్కడ ఇచ్చిన భోజనం పెడుతున్నావా. ఇంటి నుంచి తెచ్చిన భోజనం పెడుతున్నావా? అన్నపూర్ణ: ఇంటినుంచి తెచ్చిన తోట కూర అన్నం పెట్టాను. డీఎంహెచ్ఓ: ఇక్కడ పప్పువంటి మంచి ఆహారం ఇస్తారు కదా? అన్నపూర్ణ: పప్పు తినకూడదు కదమ్మా... అందుకే పెట్టడం లేదు డీఎంహెచ్ఓ: ఎవరన్నారు పప్పు తినకూడదని? అన్నపూర్ణ: ఇక్కడ వాళ్లే అన్నారమ్మా. డీఎంహెచ్ఓ: పప్పు తినవచ్చు. పప్పు తింటే కంటే తల్లి పాలు ఇవ్వగలదు. డీఎంహెచ్ఓ: ఏమ్మా నీపేరేంటి, ఏ గ్రామం నుంచి వచ్చావు? బాలింత శ్రీవాణి: మేడమ్‌గారు నాపేరు శ్రీవాణి, మాది దేవుపల్లి గ్రామం. డీఎంహెచ్ఓ: నీకు బ్యాంకు ఖాతా ఉందా? బాలింతశ్రీవాణి: లేదు మేడమ్. డీఎంహెచ్ఓ: డాక్టర్ , నర్సులు బాగా చూస్తున్నారా? శ్రీవాణి: బాగానేచూస్తున్నారు. డీఎంహెచ్ఓ: డాక్టర్ గారు మీపేరేంటి, ఎంతమందిపిల్లలకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్నారు? డాక్టర్ : మేడమ్ నాపేరు సుజాత. ఎస్‌ఎన్‌సీయూలో 16 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. డీఎంహెచ్ఓ: ఎక్కువుగా ఏ వ్యాధితో వస్తున్నారు? డాక్టర్ సుజాత: బరువు తక్కువతో పుట్టిన పిల్లలు ఎక్కువగా వస్తున్నారు మేడమ్. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి
-
విఐపి రిపోర్టర్ - కర్నూలు ఎంపి బుట్టారేణుక
-
విఐపి రిపోర్టర్ - మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క
-
విఐపి రిపోర్టర్ - కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
-
విఐపి రిపోర్టర్ - జడ్చర్గ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
-
మేం మీ స్నేహితులం
ఆ గ్రామాలు రాజకీయ కక్షలతో రగిలిపోతున్నాయి...దీనికి తోడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అభివృద్ధికి దూరంగా అవి మగ్గిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు ‘సాక్షి’ కృషిచేసింది. పార్వతీపురానికి 60 కిలోమీటర్ల దూరంలో మక్కువ మండలంలో ఉన్న కోన, దబ్బగెడ్డ గ్రామాల సమస్యలు తెలుసుకునేందుకు పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ... ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. మావోయిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వెనుకడుగువేయకుండా మారుమూల గ్రామాల్లో కలయతిరిగి, అందర్నీ అప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. మేము మీ స్నేహితులమని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. గ్రామస్తులతో ఏఎస్పీ సంభాషణ ఇలా సాగింది... ఏఎస్పీ ఏమన్నారంటే... ఒకప్పటి పోలీసులకు...ఇప్పటి పోలీసులకు మార్పు వచ్చింది. అప్పుడు మీరు పోలీసుల వద్దకు వచ్చేవారు...ఇప్పుడు పోలీసులే మీ వద్దకు వస్తున్నారు. ప్రతి గ్రామాన్ని ఓ పోలీసు దత్తత తీసుకుని మీతో మమేకమవుతున్నారు. ఒక్క శాంతిభద్రతల సమస్యే కాదు...ఏ సమస్య అయినా ఆయా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. అసాంఘిక శక్తుల మాటలు విని యువత చెడు మార్గం పట్టకుండా పోలీసు ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇస్తున్నాం. ముఖ్యంగా రైతులు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అది మంచిది కాదు. సమస్యలు అందరికీ ఉంటాయి. ఆత్మహత్యలకు పాల్పడే ముందు మీ భార్యాపిల్లల గురించి ఆలోచించండి. ఏఎస్పీ : నా పేరు రాహుల్ దేవ్ శర్మ, నేను పార్వతీపురం ఏఎస్పీని, మీ సమస్యలు తెలుసుకునేందుకు సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మీ దగ్గరుకు వచ్చాను కోన, దబ్బగెడ్డ గ్రామస్తులు: నమస్కారం బాబూ...మా సమస్యలు తెలుసుకునేందుకు మీ అంతటి అధికారి మా గ్రామాలకు రావడం నిజంగా మా అదృష్టం. మీరొచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: మీ పేరు చెప్పండి...? మీ సమస్యలు చెప్పండి...? కోన గ్రామస్తుడు లక్ష్మునాయుడు : సార్...నా పేరు కొట్టా డ లక్ష్ము నాయుడు. నాతో పాటు మా గ్రామంలో 24 మందికి పింఛన్లు ఆగిపోయాయి. దీంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. నెల నెలా వచ్చే పింఛన్ సొమ్ముతోనే బతుకీడుస్తున్నాం. పింఛన్లు వచ్చేలా చూడండి బాబు. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: మీరు ఆధార్ కార్డులు తీసుకున్నారా?రేషన్‌కార్డులో వయస్సుసరిపోయిందా ? మీ గ్రామం లో జన్మభూమి జరిగిందా ? అక్కడ సమస్య చెప్పారా ? లక్ష్ము నాయుడు: అయ్యా...! ఆధార్ కార్డుంది. రేషన్ కార్డులో వయస్సు సరిపోయింది. జన్మభూమిలో సమస్య చెప్పాం. అయినా ఇప్పటి వరకు మాకు పింఛన్లు రాలేదు. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : మా ఎస్సై రవీంద్రరాజు మీ గ్రామానికి ఎంపీడీఓను, కార్యదర్శిని తీసుకు వచ్చి పింఛన్ల సమస్య తీరుస్తారు. నేను కూడా పెద్ద ఆఫీసర్‌తో మాట్లాడతాను. మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: మీ పేరు చెప్పండి...? మీ సమస్యలేంటి...? శ్రీరామ్ : సార్ నా పేరు మరిశర్ల శ్రీరామ్. మాకు షుగర్ ఫ్యాక్టరీ బిల్లులివ్వడం లేదు. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: ఈ సమస్య చాలా వరకు తీరిపోయింది. సంబంధిత అధికారులతో మాట్లాడి మీ బిల్లులు వచ్చేలా కృషి చేస్తాను. తౌడు: సార్...నా పేరు తాడ్డి తౌడు. మా గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టారు. అయితే ఆ కేంద్రంలో మా ఊరికలాసీలను పెట్టకుండా బయటగ్రామస్తులను పెట్టా రు. దీంతో మాకు కూలి లేక ఇబ్బందులు పడుతున్నాం. ఏటా మా గ్రామంలో ధాన్యం పనులు మేమే 15 మందిమి చేసేవారిమి. మాకు కలాసీ పనులు వచ్చేలా చేయండి. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: సరే ఈ విషయం సంబంధిత ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాను. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: అమ్మా...! మీ పేరు చెప్పండి...?మహిళా సంఘాలు బాగున్నాయా...? ఉపాధి పనులు చేస్తున్నారా...? మీ సమస్యలు చెప్పండి...? అనూరాధ : బాబూ నా పేరు మరిశర్ల అనూరాధ. మహిళా సంఘాలు బాగున్నాయి. ఉపాధి పనులు అవుతున్నాయి. అయితే మా చెల్లెలు చనిపోయాక ఆమె కుమారుడు ధనుంజయరావు ఇంటర్ చదువుతూ కళాశాలకు వెళ్లలేదు. దీంతో కాలేజీలో పేరు తీసేశారు. వాడు చదువుకునేలా చేయండయ్యా...! ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: సరే మా ఎస్సై వెళ్లి ఆ పని చేసి పెడతారు. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : అమ్మా...! మీ పేరు చెప్పండి...? పిల్లలకు మధ్యాహ్న భోజనం మంచిగా పెడుతున్నారా...? మెనూ పాటిస్తున్నారా...? మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు : సార్...నా పేరు గొట్టా పు లక్ష్మి. సెప్టెంబర్ నుంచి మధ్యాహ్న భోజనం బిల్లులు రాలేదు. దీంతో అప్పులు చేసి పిల్లలకు భోజనం పెట్టాల్సి వస్తోంది. ఇంట్లో ఉన్న ఒక్కరిద్దరికే కూరలు కష్టం, అటువంటిది 149 మంది పిల్లలకు రోజూ అప్పు చేసి వంటలు చేయాలంటే ఎంత కష్టమో చూడండి. బిల్లు వచ్చే లా చేయండి. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాను. ఈ రోజు చుక్క కూర, పప్పు వండుతున్నాను. ఆహారంపై మూతలు వేస్తున్నాను. వంట షెడ్ లేదు, గ్యాస్ లేదు. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: ఎస్సై రవీంద్రతో మాట్లాడుతూ ఈ సమస్య మండలంలో ఎన్ని పాఠశాలల్లో ఉంది...? ఎస్సై రవీంద్రరాజు: ఈ సమస్య దాదాపు అన్ని పాఠశాలల్లో ఉంది. మూడు, నాలుగు నెలలకొకసారి బిల్లులొస్తాయి. వంట షెడ్లు, గ్యాస్ లేదు. కొన్నింటికి ఈ మధ్య ప్రతిపాదనలు పెట్టారంటున్నారు. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: సరేనమ్మా...! ఈ సమస్య సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తాను. వంటలు బాగా వండి పిల్లలకు పెట్టండి. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : పిల్లలూ బాగున్నారా...? మీ సమస్యలు చెప్పండి కోన పాఠశాల పిల్లలు : సార్...మేము ఏడోతరగతి చదువుతున్నాం. తరగతి గదులు చాలడం లేదు. బెంచీలు లేక నేలపై కూర్చొంటున్నాం. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : హెడ్మాస్టర్ గారు...సమస్యల పరిస్థితి ఏంటి...? హెచ్ఎం శివున్నాయుడు : పాఠశాలకు అదనపు గదులు మంజూరయ్యాయి సార్. ఆడపిల్లలకు మరుగుదొడ్లున్నాయి. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : పిల్లలూ చక్కగా చదువుకోవాలి. రిజర్వేషన్లు ప్రకారం మంచి ఉద్యోగాలు సంపాదించాలి. గ్రామాభివృద్ధికి మీరంతా పాటుపడాలి. ఇవిగో చాక్లెట్లు తీసుకోండి. పిల్లలు ః ఎస్ సార్... ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ: హాయ్...యూత్...! ఎలా ఉన్నా రు...? మీసమస్యలు చెప్పండి...?(కుర్రాళ్ల భుజం తడుతూ...) యువకులు: సార్ బాగున్నాం. ఉద్యోగావకాశాలకోసం చూస్తున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నాం. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : వెరీ గుడ్...!అవసరమైతే గతంలోలా శిక్షణ కూడా ఇస్తాం. చదివిన చదువుకు సార్థకమయ్యేలా ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు, గ్రామానికి సాయపడండి. అసాంఘిక శక్తులు చెప్పే మాటలు నమ్మి చెడుతోవ పట్టొద్దు. మా తరఫున వాలీబాల్ కిట్లు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. గ్రామంలో నాటు సారా అమ్మకాలు లేకుండా చూడండి. స్వచ్ఛభారత్‌ను నిర్వహించి రోగాలను దూరం చేయండి. యువకులు : అలాగే సార్ ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ : అమ్మా...! మీ పేరు చెప్పండి...? మీ సమస్యలేంటి..? సింహాచలం : అయ్యా...! నా పేరు ఇప్పాకుల సింహాచలం. మా ఊరి మాజీ ఎంపీటిసీ నా పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ తీసుకున్నాడు. ఇప్పుడు బ్యాంకు వారు నాకు లక్ష రూపాయల అప్పుందని, కట్టమని నోటీసులిచ్చారు. అప్పు సంగతి నాకు తెలీదు. ఆ అప్పు ఎలా కట్టగలను. నాకు చావే గతి అంటూ... తల బాదుకొంటూ ఏఎస్పీ కాళ్లపై పడి ఏడ్చింది. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: నీ సమస్యను మా ఎస్సై పరిష్కరిస్తారు. మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం. బినామీ రుణాలు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ వీఆర్వో ఎవరు...? వీఆర్ఓ: సార్... నా పేరు కోట సురేష్...! ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ: మీరు మా ఎస్సై కలిసి వెళ్లి ఈ సమస్యను పరిష్కరించండి. దుప్పట్లు, చీరలు, వాలీబాల్ కిట్లు పంపిణీ ఏఎస్సీ రాహుల్ దేవ్ శర్మ గ్రామాలను సందర్శించిన సందర్భంగా పోలీసుల ఆయా గ్రామాల వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు, యువతకు వాలీబాల్ కిట్లు, దోమతెరలు, పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేశారు. మక్కువ మండలం మారుమూల కోన, దబ్బగెడ్డ తదితర ప్రాంతాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జగన్మోహన్రావు, మక్కువ ఎస్సై వి.రవీంద్రరాజు తదితరులు ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ భద్రత ఏర్పాటు చేశారు. -
ముడి వీడని..ట్రాఫిక్ చిక్కో లు!
శ్రీకాకుళం పట్టణ జనాభా ఎప్పుడో లక్ష దాటేసింది. ఇక్కడి ఆటోల సంఖ్య 1000. శివారు ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలు సుమారు 600. భారీ స్థాయిలో ద్విచక్రవాహనాలు. లెక్కకు మించి కార్లు. కానీ అవే రోడ్లు.. అవే జంక్షన్లు.. ఫలితం నిత్యం ప్రజలు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకొని నరకం చూస్తున్నారు. అవసరాలకు తగినంతగా ట్రాఫిక్ పోలీస్ విభాగంలో సిబ్బంది సంఖ్య పెరగకపోవడంతో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ చిక్కుముడిని విప్పలేకపోతున్నారు. ఏటా వాహనదారుల నుంచి జరిమానాల పేరిట సుమారు రూ.20 లక్షలు వసూలవుతున్నా.. ట్రాఫిక్ మెరుగుకు అవసరమైన వసతుల కల్పనపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. జంక్షన్లలో సీసీ కెమెరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపర్చడం, ట్రాఫిక్ ఐలెండ్లు, డివైడర్ల ఏర్పాటు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం వంటివి పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు, పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ఇటీవలే డీఎస్పీగా విధులు చేపట్టిన పి.శ్రీనివాసరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ రూపంలో రంగంలోకి దిగారు. పలు కూడళ్లలో తిరిగి వాహనదారులు, ప్రజల నుంచి సమాచారం రాబట్టారు. మోటార్ వెహికల్ చట్టం గూర్చి వివరించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే పోలీసులు తమ వంతు పాత్ర పోషించగలరనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మెరుగుపరుస్తాం : ట్రాఫిక్ డీఎస్పీ ఇన్నాళ్లు ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది ఇక్కడి ట్రాఫిక్ వ్యవస్థను నడిపించేవారు. ప్రభుత్వం ఈ వ్యవస్థను బలోపేతం చేయడంతో సీఐ స్థానంలో డీఎస్పీ వచ్చారు. వాహనాల తనిఖీ, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, స్కూల్ బస్సుల తనిఖీ, విద్యార్థులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడంతోపాటు తల్లిదండ్రులను చైతన్య పర్చేందుకు కృషి చేస్తున్నాం. సూర్యమహల్, రామలక్ష్మణ కూడలి, చినబజార్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. దుకాణాలు, షాపింగ్ మాళ్ల వద్ద పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటుకు, పట్టణంలోని రెండు మూడు ప్రాంతాల్లో కార్లు, ఆటోలు నిలపడానికి మున్సిపాలిటీ అనుమతితో పార్కింగ్ జోన్ల ఏర్పాటు ఆలోచన ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుంటాం. జిల్లా ఎస్పీ ఆదేశాలు, సూచనల మేరకు ట్రాఫిక్ వ్యవస్థను చక్కదిద్దుతాం. ఆర్టీసీ కాంప్లెక్ వద్ద విద్యార్థితో.. డీఎస్పీ: మీది ఏ ఊరు, కళాశాలకు ఎలా చేరుకుంటున్నావు? శివప్రసాద్(విద్యార్థి): మాది గార మండలం కొర్ని గ్రామం, ప్రతి రోజు ఆటోకు వ స్తున్నాం. మాకు ఒక్క బస్సే ఉంది సార్.. దీంతో విద్యార్థులమంతా చాలా ఇబ్బందులు పడి కళాశాలలకు ఆలస్యంగా చేరుకుంటున్నాం. డీఎస్పీ: మరి మీకు ప్రత్యామ్నాయం ఏమిటి? విద్యార్థి: ఆటోలు పట్టుకొని రావాల్సి వస్తోంది. గంటల తరబడి వేచి ఉంటే కానీ ఆటోడ్రైవర్లు ఆటోలు తీసే పరిస్థితి ఉండదు. డీఎస్పీ: ఆటోలతో ఎలాంటి ఇబ్బంది వస్తోంది? విద్యార్థి: సార్.. ఒక ఆటోలో 13 నుంచి 15 మందిని ఎక్కిస్తున్నారు. వేలాడుతూ ప్రయాణం చేస్తేగానీ వచ్చే పరిస్థితి లేదు. డీఎస్పీ: ఆటోవాలాలు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారా? విద్యార్థి: సాయంత్రం 4 గంటల తరువాత ప్రతి అరగంటకు రూ. 5 చొప్పున పెంచుతున్నారు ఏమీ చేయలేక అడిగినంత ఇస్తున్నాం. కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్ తో.. డీఎస్పీ: డ్రైవర్బాబూ.. మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నాయి? ఆటోడ్రైవర్: సార్.. కాంప్లెక్స్ నుంచి వన్ వే చేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రయాణికులు ఆటో ఎక్కే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. డీఎస్పీ : వన్‌వే వల్ల ప్రయాణికులకు ఇబ్బందులుంటాయా? ఆటో డ్రైవర్: వన్‌వే వల్ల ఆర్టీసి కాంప్లెక్స్‌లో బస్సు దిగిన ప్యాసింజర్లు లగేజీలతో బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. డీఎస్పీ: ఆటోలు నడిపేవారు నిబంధనలను పాటించడం లేదట కదా? ఆటోడ్రైవర్: సార్.. ఎవరో ఒకరిద్దరు అలా చేస్తే అందరూ ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు శిక్ష వేస్తున్నారు. పోలీసులు కూడా మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుడితో.. డీఎస్పీ: తమ్మూ.. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు. పోలీసులు అడగడం లేదా? దుర్గారావు(వాహనాదారు): సార్ హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలని లేదు. పోలీసులు అప్పడప్పుడు హడావుడి చేస్తారంతే. డీఎస్పీ: హెల్మెట్ లేకపోతే ప్రమాదం కదా? వాహనదారు: సుదూర ప్రయాణాలకే హెల్మెట్ వాడతాం. లోకల్‌గా అవసరం లేదు. డీఎస్పీ: డ్రైవింగ్ లెసైన్సు లేకుంటే పోలీసులు జరిమానా విధిస్తున్నారా? వాహనదారు: లెసైన్స్, సీ బుక్, పొల్యూషన్ లేకుంటే రూ.400 వరకు జరిమానా విధిస్తారు. ఒక్కోసారి అన్ని పేపర్లు ఉన్నా వందో రెండొందలో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వ్యక్తితో.. డీఎస్పీ: బాబూ త్రిబుల్ రైడింగ్ చేయడం తప్పు కదా? జనార్ధన్(వాహనదారు): ఒక్కోసారి తప్పదు సార్. పోలీసులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. వారికి దొరికితే కదా! పట్టుకున్నా పలుబడి ఉన్నవారిచేత ఫోన్ కొట్టిస్తే వదిలేస్తారు.. అంతే. డీఎస్పీ: ప్రమాదానికి గురైతే పరిస్థితి ఏమిటి? జనార్ధన్: మాకు ఇది అలవాటే. రిజిష్ట్రేషన్ చేయించని వాహనదారుతో.. డీఎస్పీ: ఏమయ్యా రిజిస్ట్రేషన్ చేయించకుండా ప్రయాణం చేస్తున్నావ్? శ్రీనివాసరావు(వాహనదారు): సార్.. బండి ఈ మధ్యనే కొన్నాం. నెలరోజులైంది. వెయ్యి కిలోమీటర్లలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ చేయించలేదు. పోలీసులకు దొరికితే రెండు నుంచి ఐదువేల రూపాయల వరకు ఫైన్ విధిస్తారు. డీఎస్పీ: జరిమానా వేసి వదిలేస్తారా.. ఇంకా ఏమైనా ఇబ్బందులు పెడతారా? శ్రీనివాసరావు: వారి మూడ్ బట్టే ఉంటుంది సార్. జరిమానా చెల్లిస్తే వదిలేస్తారు. లేకుంటే బండిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిపోతారు. అది తిరిగి మా చేతికి రావాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. మైనర్ డ్రవర్తో.. డీఎస్పీ: తమ్ముడూ నీకు డ్రైవింగ్ లెసైన్స్ ఉందా? 18 ఏళ్లు రాకుండా ఆటో తోలకూడదు తెలుసా? దయాకర్(డ్రైవర్): డ్రైవింగ్ లెసైన్స్ లేదండీ.. నేను నేర్చుకుంటున్నాను. నా పక్కనే మామయ్య ఉంటారు. ఎక్కడైనా పోలీసులు ఎదురుపడితే ఆయనకు డ్రైవింగ్ ఇచ్చేస్తాను. డీఎస్పీ: ఫైన్ కట్టమని, కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటే ఏం చేస్తావు? దయాకర్: వాళ్లు అలానే బెదిరిస్తారు. కాస్త బతిమాలితే వదిలేస్తారు. జీటీ రోడ్డులో బట్టల షాపు యజమానితో.. డీఎస్పీ: షాపుల ముందు ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయకూడదు కదా? షాపు యజమాని: పట్టణంలో పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో దుకాణాల ముందే కస్టమర్స్ పెట్టేస్తుంటారు. డీఎస్పీ : ఈ సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది? దుకాణ యజమాని : సార్ పట్టణంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను కేటాయించాలి. మున్సిపల్ మైదానంతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తే ఈ సమస్య తీరుతుంది. వీరితోనే పర్యవేక్షణ ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో ఒక డీఎస్పీ, ఇద్దరు శాశ్వత ఎస్సైలు, నలుగురు తాత్కాలిక ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఏడుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 34 మంది కానిస్టేబుళ్లు, 35 మంది హోంగార్డులున్నారు. డే అండ్ నైట్ జంక్షన్‌లోనే సిగ్నల్ పాయింట్ ఉంది. ఒకేఒక్క ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఉండగా సిబ్బంది కోసం నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు జీపులు ఉన్నాయి. -
కడలి కూడెట్టట్లేదయ్యా..
‘నడి సంద్రంలో పొద్దగూకలా కట్టపడ్డా తిండికి కూడా కట్టమైపోతోంది సారు. సంద్రంలో సంపద మొత్తం పోనాది. పోయినేడాది ఏటకు ఎలితే పెట్టుబడులు తీసేస్తే పది, పదిహేనేలు కన్పించేయి. పొద్దుగాలం కొట్టుకున్నా ఒడ్డుకు వచ్చాక నాలుగు డబ్బులు కూడా చేతిలో ఉండటం లేదు. ఏట మానేసుకుని పనుల్లోకి పోతున్నామయ్యా. సముద్రం ఒడ్డుల్లో పరిశ్రమలు వచ్చేసి ఆయిల్లు వదిలేత్తన్నారు. దానొల్ల సంపద సచ్చిపోతాంది సారూ.. ఏట లేకుండా మాము బతకలేం. సముద్రంలోకి ఏట కెళితే చేపలు అగుపించడం లేదు. ఏమి చేత్తాము చెప్పండి సారూ. మీరే ఏదైనా చూడాలి సారూ’ ఇదీ గంగపుత్రుల గోడు. కడలిని నమ్ముకున్న మత్స్యకారుల కడగండ్లను వెలుగులోకి తేవాలనుకున్న ‘సాక్షి’ ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిందిగా మత్స్యశాఖ జిల్లా డిప్యూటీ డెరైక్టర్ డి.గోవిందయ్యను కోరింది. దాంతో ఆయన శనివారం వీఐపీ రిపోర్టర్‌గా కాకినాడ జగన్నాథపురం, ఏటిమొగ పరిసరాల్లో మత్స్యకారులతో మాట్లాడారు. ఎప్పుడూ తమకు సలహాలు ఇచ్చే అధికారి ‘సాక్షి’ మైకు పట్టుకుని రావడాన్ని చూసి మత్స్యకారులు కళ్లింత చేసుకున్నారు. ‘ఈ రోజు మీ సమస్యలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మీ ముందుకు వచ్చాను. మొహమాటం లేకుండా అన్ని వివరంగా చెప్పండి. పరిశీలించి మీకు న్యాయం చేస్తాను’ అంటూ వారి వెతలను ఆరా తీశారు. ఆ వివరాలు ఇవి.. మత్స్యకారులకు అండగా ఉంటా.. జిల్లాలో 99 మత్స్యకార గ్రామాల్లో వేల మంది మత్స్యకారులు సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. డీజిల్ సబ్సిడీ చాలా పెండింగ్‌లో ఉందని మత్స్యకారులు, వారి ప్రతినిధులు చెప్పారు. పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. 2002 ఏప్రిల్ వరకూ నమోదైన బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ వర్తిస్తోందంటున్నారు. తర్వాత రిజిస్టరైన బోట్లకు కూడా డీజిల్ సబ్సిడీ అందించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించి మత్స్యకారులకు, బోట్ల యజమానులకు అండగా ఉంటాను. చేపల వేట నిషేధాన్ని సక్రమంగా అమలు చేస్తాం. ఆ కాలంలో ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ఉండేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ఉప్పాడలో రూ.80 లక్షలు, ఓడలరేవు, అంతర్వేది పల్లిపాలెంలో రూ.18 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. డిప్యూటీ డెరైక్టర్ గోవిందయ్య : ఏమయ్యా! నీ పేరేమిటీ? వలల పని ఎలా ఉంది? మత్స్యకారుడు : నూకరాజండీ. వలల రిపేరు చేస్తుంటాను. డీడీ : పాతవి బాగు చేస్తారా? ఆదాయం బాగుంటుందా? నూకరాజు : ఏదో గడిచిపోతోంది సారూ! డీడీ (బకింగ్‌హామ్‌కెనాల్‌లో బోట్లపై ఉన్న వారితో : ఏం బాబూ...నీ పేరేమిటీ? వేట ఎలా సాగుతోంది? మత్స్యకారుడు : కోలా నాగేశ్వరరావండి. రెండు, మూడు నెలల నుంచి తీవ్రంగా నష్టపోతున్నామండి. చేపలు పడడం లేదు. డీడీ : కారణం ఏమిటో వివరంగా చెప్పయ్యా. నాగేశ్వరరావు : ఏమో తెలియదు సారూ. డీడీ : ఏం బాబూ. నీ పరిస్థితి ఏమిటీ? ఎందుకు చేపలు పడటం లేదు? మత్స్యకారుడు : గేదెల సత్తిబాబు సారూ. చేపలు పడక చాలా బాధగా ఉంటోంది. మాది పూటగడవని పరిస్థితి. డీడీ : నెలకు నీకు ఎంత వస్తుంది? సత్తిబాబు : మాకు నూటికి రూ.10 ఇస్తారండి. చేపలు పడక సముద్రంలోకి వెళ్లి తిరిగొచ్చేస్తున్నామయ్యా. కుటుంబ పరిస్థితి చాలా కట్టంగా ఉందయ్యా. డీడీ : బోటుకు సర్టిఫికెట్, మీరు గుర్తింపు కార్డులు తీసుకున్నారా? సత్తిబాబు : అన్నీ తీసుకున్నామండీ. మా దగ్గరే పెట్టుకుంటున్నాం. డీడీ : ఏమయ్యా.. నీ పేరేమిటి? ఏం చేస్తుంటావు? వీహెచ్ఎఫ్ సెట్లు వాడుతున్నారా? మత్స్యకారుడు : సీహెచ్ సత్తిబాబండి. బోటు మీద వేటకు వెళ్తుంటాను. వీహెచ్ఎఫ్ సెట్ వాడుతున్నామండి. డీడీ : ఏ ఛానల్లో ఉంటున్నారు? పోలీస్ ఛానల్‌కు వెళ్లకూడదు తెలుసా? సత్తిబాబు : మేము 14, 15, 16 ఛానల్స్‌లో మాత్రమే ఉంటున్నాం సారూ. డీడీ : తీరంలో టవర్ కట్టాం కదా. సముద్రంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సెట్ వాడుకోండి. సత్తిబాబు : అదే వాడుకుంటున్నాం. కాని ఫ్యాక్టరీల కాలుష్యం వల్ల చేపలు పడడం లేదండి. డీడీ : అయినా నష్టపరిహారంగా రూ.కోట్లు ఇస్తున్నారు కదా. సత్తిబాబు : మాకేమీ అందడం లేదండి. మేము ఏ రోజు వేటాడిన డబ్బు ఆరోజే తెచ్చుకుంటున్నాం. చేపలు పడకపోతే పస్తులుంటున్నాం. మాకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేయండి సారూ. డీడీ : చేపల వేట నిషేధాన్ని మీరు పాటించి ఉంటే ఇప్పుడు చేపలు లభించేవి. మీరు చేసిన తప్పిదమే అది. సత్తిబాబు : మేము కాదండీ. ఇతర ప్రాంతాల మత్స్యకారులు బ్యాన్ పీరియడ్‌లో చేపలు వేటాడేసుకున్నారు. ముందు వారిని ఆపాలి సారూ.. డీడీ : ఏమండీ... మత్స్యకార నాయకుడుగారూ! మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? మత్స్యకార నాయకుడు మాతరాజు : బ్యాన్ పీరియడ్‌ను సక్రమంగా అమలు చేయడం లేదు సారూ.. డీడీ : చాలామంది మత్స్యకారుల్లో అవగాహన లేక బ్యాన్ పీరియడ్‌లో వేటకు వెళ్లిపోతున్నారు. మాతరాజు : మీరేమైనా చర్యలు చేపట్టాలి కదా, మరి మీరేం చేత్తున్నారు చెప్పండి మరి.. డీడీ : పరిష్కార మార్గం మీరే చెప్పండి! మాతరాజు : అవగాహన సదస్సులు నిర్వహించాలి సారూ. ఇప్పుడు చేపలు ఎందుకు దొరకడం లేదో మత్స్యకారులకు వివరిస్తే వారు బ్యాన్ పీరియడ్‌లో చేపల వేటకు వెళ్లకుండా ఆపొచ్చండి. కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులకు అప్పగిస్తేనే దానిని కంట్రోల్ చేయవచ్చండి. డీడీ: ఇంకేమైనా సమస్యలున్నాయా? మాతరాజు: పది నెలలుగా డీజీల్ సబ్సిడీ రావడం లేదండి. రూ. 12 కోట్లు రావాలి. డీడీ : సబ్సిడీ వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి నివేదిస్తాం. డీడీ: నీ పేరేమిటి? డీజిల్ సమస్యలు నీకు ఉన్నాయా? మత్స్యకారుడు : సారూ.. కాటాడి సత్యనారాయణ. డీజిల్ సబ్సిడీ పెరగడం లేదండి. గతంలో డీజిల్ రూ.30 ఉన్నప్పుడు రూ. 6 సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు డీజిల్ రూ.70 అయినా అదే సబ్సిడీ వస్తోంది. ఇలా అయితే ఎలా నడుపుతాం సారూ మీరే ఆలోచించండి. డీడీ : విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. డీడీ : ఏమండీ.. మీ పేరు? మత్స్యకారుడు : సారూ.. కాటాడి మల్లికార్జునరావు. కోస్టల్ ఏరియాలో పరిశ్రమల వల్ల చేపలు పోతున్నాయండి. డీప్ సీ లోకి వెళ్తేగాని చేపలు దొరకడం లేదు. అక్కడ కూడా ఆయిల్ వాసనతో చేప చచ్చిపోతోంది. ఏటకు ఖర్చు ఎక్కువైపోతోంది. డీడీ : ప్రభుత్వానికి సమస్య నివేదిస్తాను. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలున్నాయి ఇక వెళతాను మరి సరేనా... ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు, మంత్రి సతీష్. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే కృష్ణారావు
-
విఐపి రిపోర్టర్ - ఆదిమూలపు సురేష్
-
వీఐపీ రిపోర్టర్ : కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ ఉమ
-
విఐపి రిపోర్టర్ - నగిరి ఎమ్మెల్యే రోజా
-
వీఐపీ రిపోర్టర్ : పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత
-
విఐపి రిపోర్టర్ - తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి
-
బాగున్నారా!
ఆరోగ్యం కాపాడుకోవడానికి మొదట పరిశుభ్రతను పాటించాలి. వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వివిధ వ్యాధులు, వాటితో కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఏర్పడినా సమీపంలోని ఆరోగ్యకేంద్రానికిగానీ, ఆస్పత్రికిగానీ వెళ్లాలి. అక్కడ మా వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. వైద్య సేవలు, సలహాలు అందిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరుగకుండా చూసుకోవాలి. ఇంటిలోనూ, వసతి గృహాలలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలోని బాలికల వసతి గృహం అది. ఆదివారం పగలు 12 గంటల సమయం. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోవింద్ వాగ్మారే ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా అక్కడికి చేరుకున్నారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో గంటసేపు మాటామంతీ జరిపారు. బాలికల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. యోగ, క్షేమాలను విచారించారు. చక్కగా చదువుకోవాలని, వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని వారికి సూచించారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజెప్పారు. విద్యార్థినులు కూడా ఆయనను పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను తీర్చుకున్నారు. ఈ వసతి గృహంలో ఆర్మూర్, కామారెడ్డి, నందిపేట్, నవీపేట్, డిచ్పల్లి, ఎడపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 311 మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. వైద్యాధికారి : నీ పేరేమిటి? ప్రియాంక : నా పేరు ప్రియాంక. నేను గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న. వైద్యాధికారి : ఏ గ్రూప్ చదువుతున్నవు? ప్రియాంక : మైక్రో బయాలజీ రెండవ సంవత్సరం చదువుతున్న. వైద్యాధికారి : నీకు వ్యాధులపై అవగాహన ఉంటుంది కదా..క్రిములు, దోమలతో కలిగే అనర్థాలు తెలిసే ఉంటాయి కదా! ప్రియాంక : అవును సార్ వైద్యాధికారి : దోమలతో వచ్చే వ్యాధుల పేర్లు చెప్పు? ప్రియాంక : మెదడువాపు, డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వస్తాయి సార్. వైద్యాధికారి : వెరీ గుడ్ వైద్యాధికారి : నువ్వేం చదువుతున్నవు. ఏ కాలేజీ? అలేఖ్య : నేను గిరిరాజ్ కళాశాలలో సైన్స్ గ్రూప్‌లో విద్యనభ్యసిస్తున్నా. వైద్యాధికారి : వివిధ వ్యాధులతో కలిగే ఇబ్బందులపై అవగాహన ఉందా? అలేఖ్య : ఉంది సార్. వైద్యాధికారి : బోధకాలు నివారణ మాత్రలు వేసుకున్నారా? రజనీ : కొందరు వేసుకున్నారు, కొందరు వేసుకోలేదు సార్. వైద్యాధికారి : మాత్రలు వేసుకోనివారెవరు? నాగలక్ష్మి (వార్డెన్) : కొందరు విద్యార్థులు భోజనం చేయలేదు సార్, భోజనం చేసిన తరువాత వేసుకుంటారు. వైద్యాధికారి : ఇది చాలా ముఖ్యమైన విషయం. భోజనం చేసిన తరువాతే మాత్రలు వేసుకోవాలి. అనంతరం విశ్రాంతి తీసుకోవాలి. శిల్ప : మాత్రలు వేసుకుంటే ఏం కాదా? వైద్యాధికారి : ఎలాంటి ప్రమాదమూ ఉండదు. మాత్రలు వేసుకుంటే ముందస్తుగానే బోధకాలు వ్యాధిని నివారించవచ్చు. సౌమ్య : గతంలో ఎప్పుడూ ఈ మాత్రలు హాస్టళ్లలో ఇవ్వలేదు. వైద్యాధికారి : అది తెలిసే, ఈసారి తప్పనిసరి గా మీకు మాత్రలు అందించాలని మా సిబ్బందిని ఇక్కడికి పంపించాను. అవును హాస్టళ్లలో ఉంటున్నారు కదా.. మీ ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయి. మీకు ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కడికి వెళుతున్నారు? సుహాసినీ: మాకు ఆరోగ్య సమస్యలు వస్తే మా వార్డెన్‌ను సంప్రదిస్తాం. వారు దగ్గరుండి వైద్యం అందేలా చూస్తారు. వైద్యాధికారి : మీకు ఎలాంటి సమస్యలున్నా, పక్కనే అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడికి వెళ్లండి. మా వైద్య సిబ్బంది కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అపర్ణ : వ్యాధులలో డెంగీ ఎందుకు ప్రమాదకరమైంది? వైద్యాధికారి : డెంగీతో రక్తంలోని సెల్స్, ప్లేట్లెట్స్ పడిపోతాయి. దీంతో రక్తం తక్కువై నీరసించిపోతారు. వైద్య సహాయం అందకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. ఆడ ఎనాఫిలిస్ దోమతో డెంగీ వ్యాపిస్తుంది. అందుకే దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వసతి గృహంలో దోమలు లేకుండా చూసుకోండి. నాగలక్ష్మి (వార్డెన్): విద్యార్థినులు దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాస్టల్లోని పరిసరాలను ఎప్పుడు కప్పుడు శుభ్రం చేయిస్తుంటాం. వైద్యాధికారి : విద్యార్థినులు ఉండే గదులు శుభ్రంగా ఉంచుకోవాలి. కిటీకీలకు దోమ తెరలను ఏర్పాటు చేసుకోవాలి. దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తపడాలి. సంధ్య: విరేచనాలు ఎందుకు వస్తాయి? వైద్యాధికారి : కలుషిత ఆహారం తిన్నా, కలుషిత నీరు తాగినా విరేచనాలు అవుతాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. లేదంటే మా వైద్య సిబ్బంది మీకు అందుబాటులో మాత్రలు కూడా ఉంచుతారు. విద్యార్థినులు : అలాగే సార్. వైద్యాధికారి : మీరు ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఆడపిల్లలు కదా ఇంటివైపు ఆలోచన ఉండదా? మౌనిక : మేము వసతి గృహంలో ఉంటే ఇంటి వైపు ధ్యాస ఉండదు. స్నేహితులందరం కలిసి చక్కగా ఉంటాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉంటారు. సమిష్టిగా చదువుకుంటాం. కబుర్లు చెప్పుకుంటాం. సుజాత: సెలవులు వస్తే ఇంటికి వెళ్తాం. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తారు. వైద్యాధికారి : వచ్చినప్పుడు ఏం చేస్తారు. వంటకాలు తీసుకొస్తారా? రాణి : తీసుకొస్తారు. ఆదివారం ప్రత్యేకంగా వంటకాలు తీసుకొస్తారు. వైద్యాధికారి : వ్యాధుల నివారణకు సంబంధిం చి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వాటితో కలిగే నష్టాలు తెలుసుకోవాలి. చదువుతో పాటు వీటిపై కూడా దృష్టి సారించాలి. అప్పుడే ఆరోగ్యాలు బాగుంటాయి. -
గోదారున్నా... గొంతెండుతోంది
తలాపునే గోదావరి. పక్కనే ఎన్టీపీసీ. పరిధి కార్పొరేషన్. విద్యుత్‌ప్లాంట్ సమీపంలోనే 12 లక్షల లీటర్ల సామర్థ్యమున్న నీటి ట్యాంకు. ఇంకేం... ఆ కాలనీ ప్రజలకు 24 గంటలు తాగునీరు... సౌకర్యాలకు ఏ కొదవా లేదనుకుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లభించవు. డ్రెయినేజీ సమస్య, బహిర్భూమికి బయటకెళ్లాల్సిందే. రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆదివారం ఉదయం నర్రశాలపల్లి, రామయ్యపల్లి, మల్కాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. -గోదావరిఖని సోమారపు సత్యనారాయణ : బాగున్నారా...? శాలపల్లిలో ఇబ్బందులేమైనా ఉన్నాయా? లక్ష్మి : మీదికి మంచిగనే ఉన్నం సారు... కానీ, మాకు చెప్పలేని బాధలున్నయ్. తాగే నీళ్లకు చానా తప్పలైతంది. పైపులైన్లు ఉన్నట్టే గని నీళ్లు మాత్రం వస్తలేవు. చాలా ఏండ్ల సంది నీళ్ల కోసం అరిగోసపడుతున్నం. సోమారపు : ఇది ఎన్టీపీసీ పునరావాస ప్రాంతం కదా..? వాళ్లు పట్టించుకుంటలేరా? రాధ : మా భూములు ఎన్టీపీసీకి అప్పగించినా... వారికి మా గురించి పట్టింపులేదు. ఊళ్లె రెండు చోట్ల ప్లాస్టిక్ ట్యాంకులు పెట్టి తాగేనీళ్లు ఇస్తమన్నరు. ఇప్పటికి ఏదీ లేదు. సోమారపు: కార్పొరేషన్ నుంచి నీళ్లు వస్తలేవా? లక్ష్మీ : ట్యాంకర్లు పంపిస్తున్నరు. గింతమందికి అవి ఏ మూలకు సరిపోతయ్ సారూ... కొంత మందికే సరిపోతున్నయ్. మిగతావాళ్లం నిన్నమొన్నటి నీళ్లతోనే సరిపెట్టుకుంటున్నం. సోమారపు : ఏం బాబూ ఏం చదువుతున్నవ్? బొద్దుల వెంకటేశ్ : సార్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నా. శాలపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్నట్టేగానీ గ్రామ పంచాయతీలో ఉండే సౌకర్యాలు కూడా లేవు. ఎన్టీపీసీ దత్తత గ్రామమని చెబుతున్నా వాళ్లెప్పుడూ పట్టించుకోలేదు. పిల్లలకు కనీసం ఆడుకునేందుకు ఆట స్థలాలు కూడా లేవు. సోమారపు అమ్మా పెన్షన్ ఇస్తున్నరా? రాసకొండ విజయలక్ష్మి: సార్, మొన్నటిదాక పింఛిన్ వచ్చింది. ఇప్పుడింకా ఇవ్వలేదు. చిన్న దుకాణం పెట్టుకుని బతుకు ఎల్లదీత్తున్న. బ్యాంకు లోను ఇప్పియ్యండి సార్. సోమారపు : బ్యాంకు వాళ్లతో, మహిళా సంఘాలతో మాట్లాడి రుణం ఇప్పిస్తానమ్మా. సోమారపు : బాబూ... ఏం పనిచేస్తున్నవ్? వెంకటేశ్వర్లు : నేను ఎన్టీపీసీలో క్యాజువల్ లేబర్‌ను. సార్, ఇక్కడ నీళ్ల సమస్య ఎక్కువున్నది. డ్యూటీకి పోయి వచ్చినంక మళ్ల నీళ్ల డ్యూటీ చేసుడు. బాగా ఇబ్బందైతంది. పక్కనే గోదావరి నది పారుతున్నా మాకు గుక్కెడు నీళ్లు ఇస్తలేరు. ఇటు ఎన్టీపీసోళ్లుగానీ, అటు కార్పొరేషనోళ్లు గానీ పట్టించుకుంటలేరు. మమ్ముల్ని ఇట్లనే బతుకుమంటరా? సోమారపు : బాబూ.. నీ బాదేంది ? నంబయ్య : సార్, ఇంటి ముందట మురుగు కాల్వతో ఇబ్బంది పడుతున్నం. పందులతో రోజూ పరేషాన్ అయితంది. జరాలొచ్చి సచ్చిపోతున్నం. జర పట్టించుకోండి సార్. సోమారపు : అమ్మా.. మంచిగున్నరా? వెంకటతార : నాకు ఇల్లు లేదు. కిరాయికుంటు న్న. ఆధార్‌కార్డు లేదని రేషన్ బియ్యం పోత్తలే రు. నలుగురు ఆడపిల్లలు. బతుకు ఎల్లదీస్తన్న. ఇంట్ల మూగపిల్ల ఉన్నది. ఆమెకు పెన్షన్ ఇస్తలేరు. సాయం చేయండి. నీ కాళ్లుమొక్కుత. సోమారపు : తప్పకుండా అధికారులకు చెప్పి పెన్షన్ ఇప్పిస్తానమ్మా. సోమారపు : నువ్వే కాల్వలు తీస్తున్నవేంది? చిలుముల గట్టయ్య : ఇండ్ల ముందట కట్టిన ఓపెన్ డ్రెయినేజీలల్ల చెత్త నిండిపోతంది. కార్పొరేషన్ వాళ్లు ఎప్పుడస్తరో తెల్వది. ఒగలమీద ఆధారపడితే పనికాదు కదా! అందుకే నేనే తీసుకుంటన్న. సోమారపు : బాబూ! బోరు సరిగ్గా పని చేస్తుందా? రామయ్య : పనిచేస్తంది సార్. ఈ బోరే మాకు దిక్కు. కార్పొరేషనోళ్లు, ఎన్టీపీసోళ్లు మంచినీళ్లను పంపుతలేరు. ఈ బోర్ నీళ్లనే తాగుతున్నం. ఇవి ఎట్లున్నా తాగక తప్పుతలేదు. రోడ్డుకుపోయి రోజు నీళ్లు తెచ్చుకునుడు కష్టమైతంది. ట్యాంకర్లతోటి నీళ్లు తెచ్చినా అవి కొంత మందికే సరిపోతున్నయ్. సోమారపు : ఇంటింటికి మరుగుదొడ్లు లేవా ? లింగయ్య : లేవు సార్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ లేక అందరూ బహిర్భూమికి బయటకే వెళ్తున్నరు. అంతకుముందు ఖాళీ జాగా బాగనే ఉండేది. పట్టాలున్నొళ్లు వాళ్ల జాగల చుట్టూ గోడలు కట్టుకున్నరు. ఇప్పుడు బహిర్భూమికి వెళ్లాలంటే చాలా దూరం పోవాల్సిందే. సోమారపు : అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే మరుగుదొడ్లు కట్టుకుంటరా? గట్టయ్య : మాకంత స్థోమత లేదు సార్. ఏదైనా స్కీం కింద మరుగుదొడ్లు కట్టించెటట్లు చూడుండి. అక్కడక్కడ చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేయించుండ్రి. సోమారపు : ఏమమ్మా... మీదేం సమస్య ? నంద స్వరూప : రామయ్యపల్లె ఉన్నదా అంటే ఉన్నదన్నట్టుగానే ఉంది. కాల్వలు లేవు. చెత్త బండి వస్తలేదు. పక్కనే గోదావరి పారుతున్నా మంచినీళ్లు లేవు. మొన్న నెల రోజుల క్రితం నీళ్లను పంపించినట్టే చేసిండ్రు. మళ్ల ఇప్పుడు వస్తలేవు. ఎవలన్న ఒకలు పనికిపోకుండ ఉంటేనే బయటకుపోయి నీళ్లు తెచ్చుకునుడు. లేకపోతే బాయినీళ్లే దిక్కు. సోమారపు: సింగరేణివల్ల ఇబ్బందులున్నయా? ఎండి రహీం : పక్కనే మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ఉంది. ప్రతీ రోజు బొగ్గు కోసం బ్లాస్టింగ్ చేస్తుంటే ఆ ధాటికి మా ఇళ్లు కదులుతున్నయ్. చాలా ఇళ్లు పగుళ్లు తేలి ఎప్పుడు కూలుతాయో అన్నట్లుగా భయం భయంగా ఉంది. సోమారపు : కార్పొరేటర్‌గా ఈ ప్రాంత సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ? వెంగల పద్మలత : 5వ డివిజన్ పరిధిలోని చాలా సమస్యలను కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన. ముఖ్యంగా ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు వద్ద ట్యాంకు నిర్మించి ఐదేళ్లవుతున్నా ఇక్కడి ప్రజలు తాగునీటికి నోచుకోలేదు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ లేక చాలా మంది బహిర్భూమికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నా గ్రామస్థాయి సౌకర్యాలకు కూడా నోచుకోలేదు. -గోదావరిఖని ఎమ్మెల్యే హామీలు శాలపల్లి, రామయ్యపల్లి, మల్కాపురం గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్‌కు మరమ్మతు చేయిస్తా. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కొత్తగా పైప్లైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా. శాలపల్లిలో ఎన్టీపీసీ పునరావాసం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా యాజమాన్యంతో చర్చిస్తా.ఈ మూడు గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాన్ని ఎన్టీపీసీ యాజమాన్యంతో చేయించేలా చూస్తా. ఓపెన్ డ్రెయినేజీల్లో కాలువలు కుంగిపోతే ఇంజినీర్లతో చెక్చేయించి తిరిగి నిర్మింపజేయిస్తా. చెత్త తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులతో మాట్లాడుతా.గోదావరి నది ప్రస్తుతం ఎండిపోతున్నందున భవిష్యత్‌లో ఇబ్బంది ఉండకుండా ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు వస్తున్న నీటిని ఎన్టీపీసీ సిస్టర్న్ నుంచి గ్రావిటీ ద్వారా కార్పొరేషన్‌కు తాగునీరు అందించేందుకు రూ.48 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఆ నిధులు మంజూరైతే కార్పొరేషన్‌తోపాటు గ్రామాల్లో కూడా నీటికి ఇబ్బందులుండవు. -
విఐపి రిపోర్టర్ - కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా
-
సిరివరాలు
పీఓ ఏమన్నారంటే.. తనకు ఆప్యాయంగా ఆహ్వానం పలికిన అమాయకపు సిరివర గ్రామ గిరిజనులపై పీఓ రజత్ కుమార్ సైనీ వరాల జల్లు కురిపించారు. గెడ్డ నుంచి గ్రామానికి తాగునీటిని తెచ్చుకునేందుకు పైపులు. 1000ఏలో వ్యవసాయ గట్లకు ఉపాధి పనులు, 30 సోలార్ లైట్లు, సబ్సిడీ రుణాలు, ట్రైకార్లో రైస్ మిల్లు, ఆటోలు, ఉచిత విత్తనాలు, సుఖ ప్రసవాలు జరిపించేందుకు మహిళలకు శిక్షణ, యువతకు డ్రైవింగ్, కంప్యూటర్ తదితర వాటిలో శిక్షణ తదితర అనుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా బడి ముఖం చూడని తాడిపుట్టి, సిరివర ఉపాధ్యాయుల సస్పెన్షన్‌కు డీఈఓకు సిఫారసు చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వృక్షాలతో నిండిన కొండలు. ఎత్తై లోయలు..ఎవరి ఊపిరి వారికే భయం గొలిపే భయంకర నిశ్శబ్ద వాతావరణం..మా వోయిస్టు ప్రభావిత ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భీకర వాతావరణం. ఎక్కడ ఏ మూల నుంచి ఏ జంతువు వచ్చి దాడిచేస్తుందో...? ఏ విషపురుగులు మీద డతాయో..తెలియని ప్రమాదకర దారి..అక్కడక్కడా విసిరేసినట్లున్న గిరిజన డలు..రాయనక..రప్పనక..కొండనక..కాననక..వాగనక..వంకనక..శ్రమ అనక..చెమట అనక..ఎత్తై ఆరు కొండలను దాటి...సుమారు 7 గంటల పాటు నడిచారు ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ. పార్వతీపురం సబ్-ప్లాన్‌లో గిరిశిఖరాలలో ఉన్న సాలూరు మండలం కొదమ పంచాయతీలోని ఆంధ్రా-ఒడిశా మధ్య శతాబ్దాలుగా సర్వేకు నోచుకోకుండా మిగిలిన ‘సిరివర’ గిరిజన గ్రామంలో గిరిజనుల సమస్యలు, వారి జీవన విధానాన్ని అవలోకనం చేసుకునేందుకు ఐటీడీఏ పీఓ రజత్ కుమార్ సైనీ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆ గ్రామ గిరిజనుల సమస్యలు వింటూ..తక్షణమే పరిష్కరిస్తూ.. ‘సిరివర’కు వరాలజల్లు కురిపించారు. నా పేరు రజత్ కుమార్ సైనీ...ఐటీడీఏ పీఓను: సాలూరు మండలం, కొదమ పంచాయతీ, ‘సిరివర’ గ్రామ గిరిజనులందరికీ నమస్కారం...నేను ఈ రోజు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. మీ సమస్యలను ఒక్కొక్కటి..ఒక్కొక్కరుగా నాకు చెప్పండి. ‘సిరివర’ గ్రామస్తులు: నమస్కారం సారూ..మా సమస్యలు తెలుసుకోడానికి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మా గూడెంకు వచ్చినం దుకు...స్వాగతం...ఐటీడీఏ పీఓ వచ్చారంటే...నమ్మలేని నిజంగా ఉంది... మీరొచ్చినందుకు సంతోషంగా ఉంది. తాగు నీటికి పైపులు...! ఐటీడీఏ పీఓ: మీ పేరేంటి చెప్పండి...? సిరివర గ్రామ గిరిజనుడు: నా పేరు సీదరపు సిత్తురు... పీఓ :మీ ప్రధానమైన సమస్య చెప్పండి...? సిత్తురు: మాకు తాగు నీరు కష్టంగా ఉంది. గెడ్డ దూరంగా ఉంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడుతున్నాం. పీఓ: గెడ్డ ఎంత దూరముంది...? నీరు క్లోరినేషన్ చేస్తున్నారా...? వేడి నీరు తాగుతున్నారా...? సిత్తురు: కిలో మీటరు దూరముంది. అలా తెచ్చి తాగుతుంటాం. వర్షాకాలంలో బురద నీరు. ఆకులు, పుల్లలు కుళ్లిపోయిన కలుషిత నీరే తాగుతూ రోగాల బారిన పడుతున్నాం. పీఓ : సరే...సోషల్ కన్జర్వేషన్‌లో...గెడ్డ నుంచి గ్రామానికి నీరు తీసుకురావడానికి ఎన్ని పైపులు కావాలంటే అన్ని మంజూరు చేస్తున్నాను. ఆ నీరు గ్రామానికి తెచ్చి ట్యాంకులో వేసి, క్లోరినేషన్ మాత్రలు అందులో కలుపుకొని తాగండి. అప్పుడు జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు. ఉపాధిలో పొలం గట్లకు టైంగ్ పీఓ : మీ పేరు చెప్పండి...? గ్రామస్తుడు: నా పేరు సీదరపు సింగురు... పీఓ : ఉపాధి పనులు చేస్తున్నారా..? సింగురు: ఉపాధి పనులు చేయలేదు...! ఉపాధి ఏపీఓ దిలీప్: ఇది అన్ సర్వేయ్‌డ్ ఏరియా....అందుకే ఇక్కడ భూ అభివృద్ధిలో ఉపాధి పనులు లేవు. గతంలో ట్యాంకులు చేశాం సార్...ఈ మధ్యనే 1000ఏలో సర్వే చేశాం సార్...80 మంది పనులు కావాలన్నారు. పీఓ : సరే...1000ఏలో ఇక్కడ ఉపాధి పనులివ్వండి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులివ్వండి. పీఓ : సింగురూ...ఉపాధి పనులు ఇస్తే...చేస్తారా...? ఏ పనులు చేస్తారు...? సింగురు: ఎందుకు చేయం. అందరం చేస్తాము. అయితే పొలాలకు రాళ్లతో గట్లు వేసుకుంటాము...అనుమతివ్వండి...? పీఓ : సరే..మీకు ఎన్ని రోజులు కావాలంటే.. అన్ని రోజులు ఉపాధి పనులను ఏపీఓ ఇస్తారు. చేయండి. అలాగే మీ పొలాలకు టైంగ్(రాతి కట్టడాలు) వేసుకోండి. ఇది మీకు మాత్రమే స్పెషల్ పర్మిషన్. టీచర్ల సస్పెన్షన్‌కు ఆదేశాలు.. పీఓ : మీరు చెప్పండి మీ పేరేమిటి..? సిరివర గిరిజనుడు: నా పేరు సీదరపు సొంబురు సామంతు పీఓ : మీరు చెప్పండి. మీ ఊరిలో ఇంకా ఏ సమస్య ఉంది...? టీచర్లు రోజూ బడికి వస్తారా...? చిన్న పిల్లలు వీధుల్లో తిరుగుతున్నారెందుకు...? బడికి పంపించ లేదా...? సామంతు:టీచర్లు బడికి రారు. పీఓ : బడి ఎక్కడుంది...? ఎంతమంది టీచర్లున్నారు..? సామంతు: బడి లేదు...ఒకరి ఇంటి దగ్గర అప్పుడు చెప్పేవారు. ఇద్దరు టీచర్లున్నారు. పీఓ : ఎన్ని రోజులకొకసారి వస్తారు...? సామంతు: టీచర్లొచ్చి ఎన్ని నెలలయ్యిందో...? గురుతు లేదు. ఇద్దరు రారు. సుధీష్ టీచర్ అప్పుడప్పుడు సంతకొచ్చి కలుస్తాడు. హెడ్మాస్టర్ అస్సలు రాడు. అందుకే పిల్లలు అ..ఆ..లు రాకుండా ఊరి మీద, పొలాల కాడ...కొండకాడ తిరిగి గాలిబారిపోతున్నారు. పీఓ : సరే ఆ టీచర్ల సంగతి నేను చూస్తాను. కొద్దిగా పెద్ద పిల్లల్ని మన ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు పంపించండి. పీఓ: సురేష్(సీసీతో) ఇక్కడ స్కూలు ఎంపీపీదా...? ఐటీడీఏదా...? ఆ టీచర్ల వివరాలు తీసుకోండి. డెలివరీ చేసేందుకు శిక్షణ పీఓ : మీ పేరు చెప్పండి...? ప్రసవాలకు ఆస్పత్రికి వెళ్తున్నారా...? సిరివరపు గిరిజన మహిళ: నా పేరు సీదరపు బిందిరి...ప్రసవాలు ఇంటి దగ్గరే అవుతాయి. ఆస్పత్రికి కొండ దిగి వెళ్లలేము. అందుకే... పీఓ : ఇక్కడ ఏఎన్ఎం ఎవరు...? ఆవిడ వస్తుందా...? ఏఎన్ఎం:సార్...నేనే ఇక్కడ ఏఎన్ఎంని నా పేరు సీహెచ్.బుజ్జి పీఓ : చెప్పండి...డెలివరీకి ఆస్పత్రికి ఎదుకు తీసుకెళ్లడం లేదు..? మీరు ఎన్ని పంచాయతీలు చూస్తున్నారు...? పల్లకీలు ఉపయోగపడుతున్నాయా...? ఏడాదికి ఎన్ని డెలివరీలు అవుతున్నాయి...? డెలివరీ తర్వాత మీరు చూస్తున్నారా...? ఇక్కడ ఆశ కార్యకర్త ఉన్నారా? మందులు ఉన్నాయా...? క్లోరినేషన్ మాత్రలున్నాయా..? ఏఎన్ఎం : సార్ డెలివరీకి ఆస్పత్రికి రారు. కొండలు దిగడం కష్టం. ఏడాదికి 10 నుంచి 12 డెలివరీలు అవుతున్నాయి. ఒక్క కొదమ పంచాయతీ చూస్తున్నాను. మొత్తం 16 గ్రామాలున్నాయి. డెలివరీ తర్వాత మెడికల్ కేర్ ఇస్తున్నాం. ఆశ వర్కర్ ఈ గ్రామంలోనే ఉంది. బరువు వల్ల పల్లకీ ఉపయోగించడం లేదు సార్... పీఓ: సరే...డెలివరీ చేసేందుకు గ్రామస్తులకు మనమే శిక్షణ ఇద్దాం. కొంతమందిని ఎంపిక చేయండి..! సబ్సిడీ రుణాలు... పీఓ సైనీ: మీ పేరు చెప్పండి...? ఐకేపీ సీసీ వస్తారా...? మహిళా సంఘాలు ఎలా ఉన్నాయి..? సమస్య ఏమైనా ఉందా...? సిరివర గిరిజన మహిళ: నా పేరు సీదారపు నీలస...మహిళా సంఘం ఉంది. సీసీ రాదు. బ్యాంకుకు వస్తది. మాకు ఈ ఏడాది, గత ఏడాది...లోను రాలేదు. మ్యాచింగ్ గ్రాంట్ రాలేదు. పీఓ : సరే...మీ వద్దకు సీసీ కంటే పెద్ద ఆఫీసర్ని పంపిస్తాను. బ్యాంకులోను అయితే సబ్సిడీ ఉండదు. నేను మీకు సబ్సిడీ లోను లిస్తాను. ఏమి లోను కావాలి. కోరుకోండి. సీదారపు నీలస: మాకు గొర్రెల లోను ఇవ్వండి. రైసు మిల్లు ఇవ్వండి. పీఓ : సరే ట్రైకార్లో మీకు రూ.2లక్షల రైస్ మిల్లు. ఆటోలు కావాలంటే ఇస్తాను. దుగ్గేరు నుంచి మెండ ంగి వరకు నడుపుకోండి. మంచి డబ్బులు వస్తాయి. పంచాయతీ సెక్రటరీ పాపారావు గారూ...ట్రైకార్ అప్లికేషన్లు సిద్ధం చేయండి. విత్తనాలు, ఆయిల్ ఇంజిన్లు ... పీఓ : మీ పేరు చెప్పండి...? పంటలు ఏమి పండిస్తారు...? విత్తనాలు ఎక్కడ నుంచి వస్తాయి...? పంటలు ఎక్కడ అమ్ముతారు...? గిరిజనుడు: నా పేరు సీదరపు లాహిరి సార్...మేము విత్తనాలు సొంతంగా తయారు చేసుకుంటాం. వరి, చిక్కుడు, సామలు, సోలు(రాగులు), గోధుమలు, జొన్న, కందులు పంటలు పండిస్తాం. కందులు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మకాలు చేస్తాం. వరితో పాటు మిగతా పంటలన్నీ తిండికి ఉపయోగిస్తాం. పీఓ సైనీ: వ్యవసాయానికి ఏమి కావాలి...అడగండి...? లాహిరి: ఆయిల్ ఇంజిన్లు ఇవ్వండి. పీఓ సైనీ: ఆయిల్ ఇంజిన్లతోపాటు మీకు ఐటీడీఏ నుంచి మంచి విత్తనాలిస్తాం. ఆ విత్తనాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. వాటిలో కొన్ని మీరు తిని, మిగతావి విశాఖ, విజయనగరం లాంటి పట్టణాలకు పట్టుకెళ్లి అమ్మండి. మంచి ధర వస్తుంది. ఆ పంటల అమ్మకానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. పీఓ ప్రయాణం ఎలా సాగిందంటే...! కోడి కూత కూయగానే ఉదయం 5గంటలకు తన బంగ్లా నుంచి చేత లోగో పట్టుకొని ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా పార్వతీపురం ఐటీడీఏ పీఓ రజత్ కుమార్ సైనీ బయలు దేరారు. అక్కడ నుంచి పార్వతీపురం మండలం పెదబొండపల్లి, తాళ్లబురిడి మీదుగా మక్కువ మండలం దుగ్గేరుపై నున్న మెండంగి గ్రామానికి 6గంటల ప్రాంతంలో తన వాహనంలో చేరుకున్నారు. అప్పుడప్పుడే మంచు తెరలు వీడుతుండడంతో తట్ట,పార పట్టుకుని..కాయకష్టం కోసం పయనమవుతున్న గిరిజనులంతా..ఇంత తెల్లవారి తమగ్రామానికి ఐటీడీఏ పీఓ రావడం చూసి...ఒకింత ఆశ్చర్యం...మరింత సంతోషంతో..చుట్టూ చేరి...తమ గూడెం పల్లెకొచ్చిన పీఓను పిల్లా పాపలతో వారు కొండపైకి సాదరంగా సాగనంపారు. అలా ఓ గంటసేపు కొండలెక్కాక...దారిలో వచ్చిన ‘తాడిపుట్టి’ గ్రామంలో గిరిజనులతో పీఓ కాసేపు ముచ్చటించి...వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అక్కడే ఆదేశించారు. అనంతరం కాలు జారితే లోయలోకి జారిపోతామన్న రాళ్లరప్పల భయంకర దారిలో నడక ప్రయాణం కొనసాగించారు. గంటసేపు ప్రయాణం తర్వాత ‘డొయివర’ అంచున వెళ్తున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన సీదరపు పొన్న అయ్యా...నాకు రేషన్, ఆధార్, ఉపాధి...ఏ కార్డూ లేదు. నేను ఆంధ్రావావాడినే...అంటూ పీఓకు తన ఆవేదన చెప్పాడు. అక్కడే ఉపాధి ఏపీఓ దిలీప్‌ను పీఓ పిలిచి తక్షణమే ఉపాధి హామీ కార్డు ఇచ్చి, పనులిచ్చి...ఆ కార్డుతో మిగతా కార్డులు చేయించాలని ఆదేశించారు. అనంతరం వాగులు, వంకలు, గెడ్డలు...కర్రల వంతెనలు దాటి...గిరిశిఖరంలో ఉన్న ‘సిరివర’కు చేరుకున్నారు. తనకు ఆప్యాయంగా ఆహ్వానం పలికిన ఆ అమాయకపు గిరిజనులకు పీఓ రజత్ కుమార్ సైనీ వరాల జల్లు కురిపించారు. పొట్టతగ్గుతుంది కదా..! పీఓ తన ప్రయాణంలో బడి ముఖం చూడని తాడిపుట్టి, సిరివర ఉపాధ్యాయులను సస్పెన్షన్‌కు డీఈఓకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. అనంతరం తనను బతిమాలుతున్న టీచర్ని చూసి...వారానికోసారైనా బడికొస్తే...జీతంతోపాటు బరువు కూడా తగ్గుతారు కదా...? అని చలోక్తులు విసిరారు. అలాగే తన దఫేదార్ ఎస్.రమణతో వారానికి ఓ హిల్‌టాప్ గ్రామానికి వెళ్దామా...? నీ పొట్ట తగ్గుతుందని హాస్యమాడారు. కొండ దిగొచ్చే సమయంలో కొండనుంచి వెదురు బొంగుల ద్వారా వస్తున్న నీటితో ముఖం కడుక్కుని, ఆ నీరు తాగారు. పీఓ రాకతో సిరివర పున్నమై పూసింది. పది మంది మేలు కోరిన ‘సాక్షి’కి పులకించిన ‘సిరివర’ తన దీవెనలు గుమ్మరించింది. -
పెద్ద తిరుపతికి దీటుగా
పేరుకు మాత్రం చిన్న తిరుపతి.. అభివృద్ధి విషయంలో పెద్ద తిరుపతికి దీటుగా పరుగులు పెడుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రతీతి పొందిన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణలతోపాటు అభివృద్ధి మంత్రం పఠిస్తోంది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుండడంతో వారి అవసరాలు తీర్చేందుకు కోట్లాది రూపాయలతో ఆధునిక సౌకర్యాలు కల్పించే దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలు తెలుసుకునేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే శనివారం నాడు భక్తుల మధ్యకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈవో : మీది ఏవూరు. దర్శనం తొందరగా అయ్యిందా. మా సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది. టి శ్రీనివాసరావు : మాది ఎర్రమిల్లిపాడు. రూ.50 టికెట్ కొని దర్శనానికి వెళ్లాం. మాకన్నా ఉచిత దర్శనం లైన్లో వాళ్లే తొందరగా వెళ్లొచ్చారు. ఈవో : మీ పేరేమిటి.. దర్శనం ఎలా జరిగింది. సీహెచ్ శివసాయి : బాగానే జరిగింది. పాదయాత్రగా వచ్చే భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చూడండి సార్. ఈవో : ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందా. సీహెచ్ శివసాయి : వృద్ధులకు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈవో : దర్శనం వద్ద మా సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు. కె.రాజు : స్వామి వద్దకు వెళ్లేసరికి సిబ్బంది ముందుకు కదలాలంటూ తోసేస్తున్నారు. ఈ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టండి సార్. అక్కడి నుండి ముందుకెళ్లిన ఈవోకు నవ దంపతులు కనిపించడంతో వారిని ఆపి మాట కలిపారు. ఈవో : ఎక్కడి నుంచి వచ్చారు. లైన్లో ఎంతసేపు ఉన్నారు బి.వెంకటేష్ : ‘మాది ఏలూరు సార్. ఇక్కడ సౌకర్యాలు బాగానే ఉన్నాయి. దర్శనం తొందరగానే అయ్యింది’ అని చెబుతుండగా క్యూలైన్లో ఉన్న అయ్యప్ప మాలధారులు ‘స్వామీ.. ఇటుై రండి’ అని పిలిచారు. ఈవో వెళ్లి ‘చెప్పండి. మీకేమైనా సమస్యలున్నాయా’ అని అడిగారు. ఎం.శ్రీను : భిక్ష సమయంలో గోవింద మాలధారులను తొందరగా పంపుతున్నారు. అయ్యప్ప మాలధారులను కొంతసేపు నిలిపివేస్తున్నారు. మాకూ త్వరగా భిక్ష పెట్టేలా చర్యలు తీసుకోండి. ఈవో : మీరు చెప్పండి. ఇక్కడ కల్పించాల్సిన సౌకర్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయా. కె.సత్యనారాయణ : మోకాళ్లపై నడిచి వస్తామని మెక్కుకునే వారికి ఇక్కడున్న కారు రాళ్లు గుచ్చుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారి సౌకర్యం కోసం కార్పెట్లు వేయిస్తే బాగుంటుంది. ఈవో : ఏవండీ దర్శనం బాగా జరిగిందా. సౌకర్యాలు ఎలా ఉన్నాయి. కె.అప్పలస్వామి, రమణ దంపతులు : అన్నీ బాగానే ఉన్నాయి. మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం. మొదటి ఆహ్వానం స్వామివారికి ఇవ్వాలని వచ్చాం. దర్శనం బాగానే జరిగింది. ఈవో : ఉద్యోగుల ప్రవర్తన బాగుందా. కె.సత్యనారాయణ : సిబ్బంది బాగానే పనిచేస్తున్నారు. భక్తులను మర్యాదగానే చూస్తున్నారు. ఈవో : చెప్పండి.. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు. కె వెంకటరమణ : కాకినాడ నుంచి ఈవో : భీమడోలులో రైలు దిగి ఉంటారు. అక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయా కె.వెంకటరమణ : రైలు దిగిన వెంటనే బస్సు దొరికింది. రవాణా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. అక్కడి నుంచికొండ దిగువ భాగాన నూతనంగా నిర్మించిన డార్మెటరీ వద్దకు చేరుకున్న ఈవో డార్మెటరీలో ఉన్న భక్తులతో మాట్లాడారు. ఈవో : ఎక్కడి నుంచి వచ్చారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఎ.శ్రీనివాస్ : ‘అమలాపురం నుంచి వచ్చాను. డార్మెటరీ సౌకర్యంగానే ఉంది. స్నానానికి వేడి నీళ్లు సరఫరా చేస్తామన్నారు కానీ రావడం లేదు’ అని చెప్పగా.. పక్కనే ఉన్న సహాయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ‘ఇక్కడ సోలార్ సిస్టం అమర్చాం. ఇవాళ వాతావరణం మబ్బుపట్టి ఉండటంతో వేడినీరు అందలేద’ని వివరణ ఇచ్చారు. పక్కనే ఉన్న మరో వ్యక్తిని ఈవో పలకరించి డార్మెటరీలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగారు. ఎ.శివనాగబాబు : సామాన్య ప్రజలకు బాగా ఉపయోగంగా ఉంటోంది. బయట మంచం అద్దెకు తీసుకుంటే కనీసం రూ.50 వసూలు చేస్తున్నారు. ఇక్కడ కేవలం రూ.10 మాత్రమే తీసుకోవడం వెసులుబాటుగా ఉంది. ఈవో : ప్రస్తుతం చాప, దిండు ఇస్తున్నాం. భవిష్యత్‌లో దుప్పట్లు కూడా ఇచ్చి రూ.20 రుసుంగా నిర్ణయించే ఆలోచనలో ఉన్నాం. అక్కడి నుంచి తలనీలాలు సమర్పించే ప్రాంతానికి ఈవో చేరుకున్నారు. ఈవో : తలనీలాలు ఇచ్చే చోట మా సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తున్నారా. ఎస్.శివ : మన సంతృప్తి మేరకు ఇస్తే డబ్బు పుచ్చుకుంటున్నారు గానీ డిమాండ్ చేయడం లేదు. ఈవో : కల్యాణకట్టలో తలనీలాలు తీస్తున్న మా సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటోంది. పి.దుర్గారావు : బాగానే ఉంటోంది కానీ కొంతమంది డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వకపోతే గాట్లు పెడతారేమోనని భయపడి ఇవ్వాల్సి వస్తోంది. అక్కడి నుంచి ఈవో పూజలు, తలనీలాలు, ప్రసాదాలకు టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ఈవో : టిక్కెట్లు తొందరగానే అందుతున్నాయా. ఏమైనా ఇబ్బంది ఎదురవుతోందా? ఎం.భూపతికుమార్ : తొందరగానే అందుతున్నాయి సార్. అక్కడి నుంచి అన్నదానం నిర్వహించే భవనంలోకి అడుగుపెట్టారు. ఈవో : ఏమ్మా.. భోజనం ఎలా ఉంది. నాణ్యత, రుచి ఎలా ఉన్నాయి. గంగాదేవి : బాగుంది. ఉచిత భోజ నంలా లేదు. ఇంట్లో తిన్నట్టే ఉంది. సౌకర్యాలకే ప్రాధాన్యం : ఈవో నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండేళ్లు అవుతోంది. భక్తులకు సౌకర్యాలు కల్పించడానికే అత్యధిక ప్రాధాన్యమిచ్చా. స్వామివారి సన్నిధిలో వివాహాలు చేసుకునే భక్తుల సౌకర్యార్థం గతంలో తాత్కాలికంగా ఉన్న షెడ్డును రూ.3.50 కోట్ల నిధులతో పక్కా మండపంగా నిర్మిస్తున్నాం. కొండ దిగువ నుంచి నేరుగా వాహనాలపై ఎగువకు వచ్చే వారి కోసం విశాలమైన ఘాట్ రోడ్డు నిర్మించాం. ప్రస్తుతం 5 వేల మందికి నిత్యాన్నదాన పథకం ద్వారా భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. ఒకే సిట్టింగ్‌లో 350 మంది భక్తులకు భోజనం అందుతోంది. 750 మందికి ఒకేసారి భోజన పెట్టేలా రూ.14 కోట్లతో నూతన భవనం నిర్మిస్తున్నాం. కొండపై నాలుగు కల్యాణ మండపాలు అందుబాటులో ఉండగా భక్తుల విరాళాలతో ఒక్కొక్కటీ సుమారు రూ.45 లక్షల అంచనా వ్యయంతో 18 మినీ కల్యాణ మండపాలు నిర్మించడానికి ప్రతిపాదనలు చేశాం.21 కాటేజీలు ఇప్పటికే అందుబాటులో ఉండగా, మరో 7 నిర్మాణ దశలో ఉన్నాయి. సౌకర్యాలు కల్పించే విషయంలో భక్తులతో సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. -
సమస్యల శిక్ష
‘ఇంటి పేరు కస్తూరివారు.. ఇల్లంతా గబ్బిలాల కంపు’ అన్న సామెతను నిజం చేస్తున్నాయి కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ). కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నత లక్ష్యాలతో 2005-06 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ విద్యాలయాలు దశాబ్దకాలం గడిచినా బాలారిష్టాలను అధిగమించలేకపోతున్నాయి. మొదట 12 విద్యాలయాలతో ప్రారంభమై ఈ వ్యవస్థ ప్రస్తుతం 32 సంస్థలకు పెరిగింది. ఇందులో మూడు గిరిజన సంక్షేమశాఖ, ఒకటి సాంఘిక సంక్షేమశాఖ, ఎనిమిది ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తుండగా మిగిలిన 20 సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 32 కేజీబీవీల్లో 22 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలినవి అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.పేద విద్యార్థినులకు రెసిడెన్షియల్ విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ విద్యాలయంలో కొలువుదీరిన సమస్యలు నీరుగార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు (సీఆర్టీలు), బోధనేతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యాలయాల్లో లోపాలను స్వయంగా తెలుసుకునేందుకు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్ గణపతిరావు ముందుకొచ్చారు. సాక్షి తరపున వీఐపీ రిపోర్టర్‌గా శ్రీకాకుళం రూరల్ మండలం మునసబుపేట సమీపంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించారు. పరిస్థితిని స్వయంగా వీక్షించారు. అందరితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఆయన సమస్యలు సేకరించిన తీరు యథాతథంగా.. స్పెషలాఫీసరు గదిలో.. పీవో(ఎస్వోతో) : మీరు ఏ పద్ధతిలో ఎంపికయ్యారు? ఎంపికలు పారదర్శకంగా జరిగాయా.. అవకతవకలు ఏమైనా జరిగాయా? గొలివి లత(ఎస్వో) : స్పెషలాఫీసర్ ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది. జిల్లాలో మొదటి ర్యాంకు సాధించడంతో నేను ఎంచుకున్న శ్రీకాకుళం కేజీబీవీలోనే నన్ను నియమించారు. అవకతవకలు జరిగి ఉంటే నాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చేది కాదు. పీవో: మొదటి ర్యాంకు సాధించినందుకు కంగ్రాట్స్ అమ్మా.. విద్యాలయంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎస్వో: నూతన భవనం కావడం వల్ల పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. భద్రత పరంగా కొంత భయం ఉంది. జాతీయ రహదారిని ఆనుకొని నిర్మానుష్య ప్రదేశంలో భవనం ఉండడం వల్ల ఒంటరితనంతో ఆడవాళ్లందరం భయపడుతున్నాం. రాత్రి వేళల్లో చాలా భయంగా ఉంటోంది. పీవో: ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారా? ఎస్వో: ఎస్సైతో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. భద్రత కల్పిస్తామని ఎస్సై హామీ ఇచ్చారు. రాత్రి వేళల్లో పోలీసులను గస్తీ తిప్పుతున్నారు. దాని వల్ల కొంత భరోసా ఏర్పడింది. పీవో: ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎస్వో: పాఠశాల ఆవరణలో ఏఎన్ఎం లేకపోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే విద్యార్థినులను సింగుపురం పీహెచ్‌సీకి తీసుకువెళ్లాల్సి వస్తోంది. ఏఎన్ఎం పోస్టులు భర్తీ కాకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. పీవో: సిలబస్ సకాలంలో పూర్తవుతోందా.. బోధనను పర్యవేక్షిస్తున్నారా? ఎస్వో: గ ణితం తప్ప మిగతా సిలబస్ అంతా పూర్తయింది. గణితాన్ని నెమ్మదిగా బోధించాలని నేనే చెప్పాను. బోధనను నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. పీవో: విద్యార్ధినులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నారా? ఎస్వో: ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తున్నాను. సమస్యలు ఉంటే ఏ సమయంలోనైనా తనకు చెప్పాలని సూచిస్తున్నాను. సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాను. 10వ తరగతి గదిలో.... పీవో: విద్యార్థినుల హాజరు ఎలా ఉంది? ఎస్వో లత: ఓ విద్యార్థిని అస్వస్థతకు గురవడంతో రెండు రోజుల క్రితం వారి తల్లిదండ్రులతో ఇంటికి పంపించాం. చికిత్స చేసిన తరువాతే పంపించాం. రెండు రోజుల్లో వచ్చేస్తుంది. పీవో: బోధన ఎలా ఉంది? సంధ్య (విద్యార్థిని) : బోధన చాలా బాగుంటోంది. కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. పీవో: ఏమిటా ఇబ్బందులు చెప్పండి? హేమలత(విద్యార్థిని): వీధి దీపాలు లేకపోవడం వల్ల చీకటి వల్ల వేకువజామున లేచి చదవాలంటే భయం వేస్తోంది. తరచూ సర్పాలు కూడా వస్తున్నాయి. పీవో: శానిటరీ న్యాప్కీన్స్ ఇస్తున్నారా..ఎలా ఉన్నాయి? ఢిల్లీశ్వరి(విద్యార్థిని): ఇస్తున్నారు. కానీ అవి అంతగా బాగోవడం లేదు. అందువల్లనే వినియోగించడం లేదు. పీవో: అందరూ పాసవుతారా? విద్యార్థిని లావణ్య: అందరం పాసవుతాం. పీవో: పదో తరగతి గణిత సబ్జెక్టులో గత ఏడాది అత్యధిక మార్కులు ఎన్ని వచ్చాయి. వనజాక్షి(గణిత సీఆర్టీ): గత ఏడాది 98 మార్కులు వచ్చాయి. ఈ ఏడాదికి మంచి కిట్లు రావడంతో 100కి వంద మార్కులు వచ్చే పరిస్థితి ఉంది. ఈ కిట్లు ఉపయోగకరంగా ఉన్నాయి. 8వ తరగతి గదిలో... పీవో: 32 మంది హాజరు కావాల్సి ఉండగా, ఏడుగురు గైర్హాజరయ్యారెందుకు? కుమారి(తరగతి లీడర్): పలు కారణాలతో ఏడుగురు ఈ రోజు సెలవు పెట్టారు. వారి తల్లిదండ్రులు వచ్చి అడగడంతో ఎస్వో పంపించారు. పీవో: డిస్కనరీ, అట్లాస్, యూనిఫారాలు ఇచ్చారా? ఉపాధ్యాయులు కొడుతున్నారా? విద్యార్థినులు: అన్నీ ఇచ్చారు. ఉపాధ్యాయులు ఎవరూ కొట్టడం లేదు. పీవో: కొత్త భవనానికి పెచ్చులెందుకు ఊడుతున్నాయి.. విషయాన్ని ఇంజనీరింగ్ అధికారుల దృష్టిలో పెట్టారా? ఎస్వో: పది రోజుల క్రితమే పెచ్చులు ఊడాయి. విషయాన్ని ఏఈ దృష్టికి తీసుకువెళ్లాం. రెండు రోజుల్లో బాగు చేయిస్తామన్నారు. వంటగదిలో: పీవో: వంట చేసేందుకు తెచ్చిన సరుకులు బాగుంటున్నాయా? ఏమైనా సమస్యలు వస్తున్నాయా? వేదవతి(కుక్): సరుకులు బాగుంటున్నాయి. బియ్యంలో రాళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. అదనంగా సహాయకురాలు అవసరం. 170 మంది పిల్లలకు ఇద్దమే వంట చేయాల్సి వస్తోంది. భవనం వెనుక... పీవో : పాఠశాల ఆవరణంతా ఇలా బురదమయం అయింది ఎందుకు? సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారా? ఎస్వో: విద్యార్థినులు, వంట పనివారు వినియోగిస్తున్న నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేక మురికికూపంగా మారింది. కాలువ తవ్వించినా వెలుపల భాగంలో ఎత్తుగా ఉండడం వల్ల సమస్య వస్తోంది. ఇంజనీరింగ్ అధికారులకు చెప్పాం. కాలువ నిర్మిస్తామన్నారు. ఆట మైదానంలో.. పీవో: పిల్లలకు ఆటలు నేర్పిస్తున్నారా? పీఈటీ : ఆటల్లో మంచి శిక్షణ ఇస్తున్నాం. దేవీ కుమారి, తేజేశ్వరి, విజయలక్ష్మీ, ఇంద్రజ, పద్మజ, చందనలు జిల్లాస్థాయితో పాటు, రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. సంధ్య, శ్రీలలిత, సీతమ్మ సాఫ్ట్‌బాల్‌లో పతకాలు సాధించారు. వసతిగృహంలో... పీవో: బెడ్షీట్లు, ట్రంక్ పెట్టెలు విద్యార్థులందరికీ ఇచ్చారా? ఎస్వో: అందరికీ ఇచ్చాం. పీవో : మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేలా విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారా? ఎస్వో: కల్పిస్తున్నాం. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయి. బోధనేతర సిబ్బందితో.. పీవో : మీకేమైనా సమస్యలున్నాయా? లీలావతి(అకౌంటెంట్): ఇతర జిల్లాల్లో కొత్త వేతనాలు ఇస్తున్నారు. మన జిల్లాలో సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో కూడా కొత్త జీతాలు ఇస్తున్నారని చెబుతున్నారు. మాకు మాత్రం మాకు మాత్రం ఇంకా పాత జీతాలే ఇస్తున్నారు. 15 రోజులకోసారి సమీక్ష:పీడీ ఇక్కడి సమస్యలు గుర్తించాను. అన్ని కేజీబీవీల్లోనూ దాదాపు ఇవే సమస్యలు ఉన్నట్లు తెలిసింది. నా స్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. విద్యార్థినులకు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను. ముఖ్యంగా నాణ్యమైన శానిటరీ న్యాప్కీన్స్తో పాటు భవనాల ఆవరణలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేలా చూస్తాను. అందరూ మహిళలే కావడం వల్ల భద్రతా ఏర్పాట్లు అవసరం. పాఠశాలల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాను. అదనంగా వంటమనిషిని సమకూర్చేందుకు ప్రయత్నిస్తాను. బోధనేతర సిబ్బందికి కొత్త జీతాలు అందించేందుకు ఏజెన్సీని నియమించాల్సి ఉంది. త్వరలోనే ఏజెన్సీని నియమిస్తాను. ఎస్‌వోల ద్వారా 15 రోజులకోసారి సమస్యను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. -
ప్రయాణంలో ప్రయాసలు
దూరంగా రోడ్డు మలుపుకావల నుంచి.. ‘పోయ్..పోయ్’ అన్న రబ్బర్ హారన్ శబ్దం గాలిలో తేలివచ్చి చెవుల పడగానే ఆ ఊరి కూడలిలోనో; ఏ ఊరూ లేకపోయినా నాలుగు దుకాణాలుండే అడ్డరోడ్డు సెంటర్లోనో సందడి మొదలయ్యేది. తాము నిరీక్షిస్తున్న ఆత్మీయులెవరో వచ్చేస్తున్నట్టు జనం కళ్లు సంబరంగా వెలిగిపోయేవి. ఆ వెలుగుకు కారణం రానున్న ఎర్రబస్సు (అదే ఇప్పుడు ‘పల్లెవెలుగు’ అయింది). గత తరాల్లో ముఖ్యంగా గ్రామాల్లో వికాసానికీ, అవసరాలకూ ఆర్టీసీ బస్సు ఓ సంకేతం. తక్కిన ప్రపంచంతో అనుసంధానానికి ముఖ్య సాధనం. బస్సు రంగు మారి ఉండొచ్చు గానీ.. ఇప్పటికీ అనేక పల్లెలకు ఆర్టీసీ బస్సే పుష్పక విమానంతో సమానమైన ప్రయాణ సాధనం. ‘సురక్షిత ప్రయాణం-సుఖమయ జీవితం’, ప్రయాణీకులే మన దేవుళ్లు...చెయ్యి ఎత్తితే బస్సు ఆపుతాం...‘సమయ పాలన పాటిద్దాం-గమ్యం చేరుద్దాం’ వంటి నినాదాలతో జిల్లాలో నిత్యం మూడున్నర లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న 820 ఆర్టీసీ బస్సులు 3.40 లక్షల మందిని గమ్యాలకు చేరుస్తున్నాయి. ప్రైవేట్ వాహనాలు ఎన్ని పెరిగినా.. నేటికీ ప్రజ ల ప్రయాణావసరాలు తీర్చడంలో కీలకంగా ఉన్న ఆర్టీసీకి సంబంధించి ప్రయాణికుల సమస్యలను ఎత్తి చూపాలని ‘సాక్షి’ భావించింది. జిల్లాలో ఆ వ్యవస్థకు సారథ్యం వహిస్తున్న రీజనల్ మేనేజర్ ఆర్వీఎస్ నాగేశ్వరరావును ఆ బాధ్యత స్వీకరించాల్సిందిగా కోరింది. అందుకు అంగీకరించిన ఆయన ‘వీఐపీ రిపోర్టర్’గా మారారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడాక సింగిల్స్టాప్ బస్సులో గోకవరం వెళ్లి, అక్కడి ప్రయాణికులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రెండు గంటలు సాగిన ఆయన వీఐపీ రిపోర్టింగ్ వివరాలిలా ఉన్నాయి... ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆర్వీఎస్ నాగేశ్వరరావు (రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్‌లో) : ఏమ్మా నీ పేరేంటి? బస్సు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులుంటే మొహమాటం లేకుండా చెప్పండమ్మా! ప్రయాణికురాలు : నా పేరు దేవి సర్! గతంలో ఇక్కడ ఎక్కువ సేపు బస్సుల కోసం చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఒక బస్సు వెళ్లి గంటైనా మరో బస్సు రాదు. అందుకే ప్రైవేట్ బస్సులు, ఆటోల్లో పోతున్నాం. ఆర్ఎం : ఇప్పటికే గోకవరం వంటి ప్రాంతాలకు ప్యాసింజర్ సర్వీసులు అరగంట వ్యవధిలోనే తిప్పుతున్నాం. జనం ఎక్కువగా ఉంటే బస్సుల మధ్య సమయం ఇంకా తగ్గించి, సమస్య లేకుండా చేస్తానమ్మా. (మరొకరితో) : ఏమయ్యా నీ పేరేంటి? ఆర్టీసీ బస్సులతో ఏమైనా సమస్యలుంటే చెప్పు. ప్రయాణికుడు : రమణ సార్, న్యూడెమోక్రసీలో పనిచేస్తుంటాను. ఇక్కడి నుంచి అడ్డతీగల వెళ్లాలంటే డెరైక్టు బస్సులేదండీ. ఎన్ని సార్లు మీ వాళ్ల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు సర్. ఇక్కడి నుంచి సింగిల్ స్టాపులు ఎక్కువున్నాయి. ఆర్డినరీ బస్సులు కూడా ఎక్కువగా తిప్పితేనే ప్రయోజనం. పరిశీలించండి సర్. ఆర్ఎం : గోకవరానికి ఆర్డినరీ బస్సులు మీరడుగుతున్నట్టు పెంచుతాం. అడ్డతీగల బస్సులు కూడా మూడు నెలల క్రితం పెంచాం. (మరొకరితో) : బాబూ నీ పేరేమిటి, బస్సులు సక్రమంగా తిరుగుతున్నాయా? ప్రయాణికుడు : శివప్రసాద్ అండీ. రాజమండ్రి నుంచి రంపచోడవరం బస్సుల సంఖ్య పెంచాలండీ. మీరేమో బస్సులున్నాయంటారు. అవసరానికి ఉండటం లేదండీ! ఆర్ఎం : బస్సుల్లో కొన్ని సమయాల్లో ప్రయాణికులు ఉండడం లేదు. రద్దీ ఉంటే తప్పక పెంచుతాం. (మరొకరితో) ఏమయ్యా మా బస్సులతో సమస్యలున్నాయా? మా స్టాఫ్ ఎలా ఉంటున్నారు? ప్రయాణికుడు : గంగాధర్ అండీ. సింగిల్ స్టాప్ సర్వీసులు గోకవరం ప్రయాణికులకు అనుకూలంగా ఉన్నాయి. మీ కండక్టర్లు, డ్రైవర్లు ఇది వరకులా కాక బాగానే ఉంటున్నారు. ఆర్ఎం: సింగిల్ స్టాప్ సర్వీసు 20 నిమిషాలకు ఒక టి నడుపుతున్నాం. ఇంకా రద్దీ ఉంటే 15 నిమిషాలకోటి తిప్పుతాం. ఆర్ఎం (రాజమండ్రి-గోకవరం బస్‌లో ప్రయాణిస్తూ) : తల్లీ నీ పేరేంటి? బస్సులు సక్రమంగా ఉంటున్నాయా? ప్రయాణికురాలు : నాగదేవండి. గోకవరం నుంచి యా ఎర్రంపాలెంకు బస్సులు సరిగా లేవు. ఉదయం 8.30 గంటలకు తర్వాత సాయంత్రం ఐదు గంటలకు కానీ బస్సు రావడం లేదు. మధ్యలో 3.30 గంటలకు ఒక బస్సు వేయాలి సర్. ఆర్ఎం : పరిశీలించి, అవసరం అనుకుంటే బస్సుల సంఖ్య పెంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం సరేనా తల్లీ. (మరొకరితో) నీ పేరేమిటమ్మా? ఏమి చదువుతున్నావు, బస్సులు ఎలా నడుస్తున్నాయి? విద్యార్థిని : సోనీ సర్, మాది బూరుగుపూడి. సాయంత్రం బస్సుల్లో వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. లోపల ఖాళీ ఉన్నా కుర్రాళ్లు డోరు దగ్గర వేలాడుతుంటారు. మేం ఆపుతుంటే డ్రైవర్లు కూడా ఆపడం లేదు. ఆర్ఎం: మా సిబ్బందికి గట్టిగా చెబుతానమ్మా. మీరు కూడా మీ లెక్చరర్లకు చెప్పండి. నేను కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. (మరొకరితో) నీపేరేంటమ్మా? బస్సులు సరిపోతున్నాయా? ప్రయాణికురాలు : తులసీమహాలక్ష్మి, మాది గంగవరం మండలం బయ్యనపల్లి సర్. గంగవరం, బయ్యనపల్లి రోడ్డు బాగానే ఉన్నా బస్సులు మాత్రం తిరగడం లేదు. మా గ్రామానికి కూడా బస్సు తిప్పాలి. గోకవరం నుంచి గంగవరం బస్సులు పెంచాలి. ఆర్ఎం : సర్వే చేయించి ప్రయాణికులు ఎక్కువ ఉంటే బస్సు పంపుతాం. (మరొకరితో) నీ పేరేమిటమ్మా? ప్రయాణికురాలు : సత్యవతి అండీ. రాజమండ్రి నుంచి రంపచోడవరం డెరైక్టు బస్సులు తక్కువ. రంపచోడవరం -రాజమండ్రి టూ స్టాప్ సర్వీసులు తిప్పాలి. ఆర్ఎం : ప్రయాణికుల సంఖ్య బాగుంటే మరిన్ని బస్సులు నడుపుతాము. ఆర్ఎం (గోకవరం బస్ కాంప్లెక్స్‌లో) : నీ పేరేమిటమ్మా, సాయంత్రం, రాత్రిపూట బస్సులు ఎలా ఉంటున్నాయి? ప్రయాణికురాలు : జ్యోతి సార్. మాది రంపచోడవరం. రాత్రి ఎనిమిదిన్నర, తొమ్మిది మధ్యలో బస్సులు అసలు ఉండడం లేదు. గోకవరం బస్టాండ్‌లో, రాజమండ్రిలో చెప్పుకున్నా ఏమీ జరగడం లేదు. ఆర్ఎం : ఆరు దాటాక మరో రెండు బస్సులు తిరుగుతున్నాయి. అవి సరైన సమయాల్లో తిరిగేలా చూస్తాను. లేదంటే రాజమండ్రి వచ్చి నాకు చెప్పండి. (మరొకరితో) నీ పేరేమిటమ్మా? విద్యార్థిని : ప్రసన్నజ్యోతి, మాది కొత్తపల్లి. గోకవరం నుంచి కాకినాడ రూట్లో బస్సులు సరిపోవడంలేదు. కాలేజీ వదిలాక ఇంటికి వెళ్లే సరికి రాత్రి అయిపోతోంది. ఉదయం కూడా మా కొత్తపల్లిలో 9.15, 9.30 మధ్యలో బస్సు ఉండేలా చూడాలి. ఆర్ఎం : ఈ రూట్లో బస్సులనుపెంచేలా చూస్తామమ్మా. (మరొకరితో) అబ్బాయ్ నీ పేరేమిటి? బస్సుల కండిషన్ ఎలా ఉంది? విద్యార్థి : సాయి మణికంఠ, మా తంటికొండ రూట్లో తిరిగే బస్సు సీట్లు ఎక్కడికక్కడ ఊడిపోయాయి. రెండు రోజులకోసారి టైరు పంచరై మధ్యలో ఆపేస్తున్నారు. (మరో విద్యార్థి కృప కల్పించుకుని) మాది గాజులపాలెం. మా గోపాలపురం బస్సు అద్దాలు ఊడిఎప్పుడు ఎవరి మీద గాజుముక్కలు పడిపోతాయోనని భయపడుతున్నాం. ప్లీజ్ సర్ బస్సు మార్చండి. ఆర్ఎం : బస్సులు మార్చేందుకు చర్యలు తీసుకుంటాను (ట్రాఫిక్ అధికారులను బస్సు మార్చాల్సిందిగా అక్కడికక్కడే ఆదేశించారు) ఆర్ఎం : ఏం అబ్బాయి, మీ ఊరుకు బస్సు వస్తుందా? విద్యార్థి : నా పేరు మురళిదొరండీ, పూడిపల్లి వచ్చే బస్సును గొందూరు వరకూ తిప్పాలి.ఉదయం బస్సు 6.30కు వస్తోంది. కాలేజీ పిల్లలం అంత తొందరగా క్యారేజీలు సర్దుకుని రాలేక పోతున్నాం. అందుకే 7.30కు మార్చండి సర్. ఆర్ఎం : బస్సు పొడిగింపు వీలు పడుతుందా అనేది పరిశీలిస్తా. సమయాలు మారుస్తాను. -
వీఐపీ రిపోర్టర్ : వేములవాడ ఎమ్మెల్యే రమేష్
-
విఐపి రిపోర్టర్ - నెల్లూరు జెడ్.పి ఛైర్మన్ బొమ్మిరెడ్డి
-
బస్తీలకు కొత్త సొబగులు
‘బస్తీలలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తా. మంత్రులు, ముఖ్యమంత్రికి ఈ ప్రాంత ప్రజల కష్టాలను వివరిస్తాను. బస్తీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తా’నంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని బస్తీవాసులకు హామీ ఇచ్చారు. ‘సాక్షి’ వినూత్నంగా చేపట్టిన ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం ఆ బస్తీలో పర్యటించారు. స్థానికులతో మమేకమై, సమస్యలు తెలుసుకున్నారు. -
విఐపి రిపోర్టర్ -ముషిరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్
-
విఐపి రిపోర్టర్ - గుంటూరు (తూర్పు) ఎమ్మెల్యే ముస్తఫా
-
విఐపి రిపోర్టర్ - పాయం వెంకటేశ్వర్లు
-
విఐపి రిపోర్టర్ - కర్నూలు ఎస్పీ రవికృష్ణ
-
పొగచూరిన బతుకులు
బీడీ కార్మికులు... రెక్కాడితేగానీ డొక్కాడని వారు..ప్రతి రోజూ కుటుంబం యావత్తూ కష్టపడినా దక్కే ప్రతిఫలం అంతంతే.. వెయ్యి బీడీలు చుడితే వచ్చే కూలీ రూ. 150 మాత్రమే.. ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకునే సంక్షేమ పథకాలు వీరికి ఏ మాత్ర ం అందడం లేదు.. ఇల్లు, పింఛన్, ఇన్సూరెన్స్ ఇలా ఒక్క సౌకర్యాన్ని కూడా వీరు పొందలేకపోతున్నారు.. ఏళ్ల తరబడి ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. రోజురోజుకూ వీరి కష్టం పెరుగుతుందేగానీ వీరి జీవితాల్లో మార్పు కానరావడం లేదు... దుర్భర పరిస్థితుల్లో జీవితాలను వెల్లదీస్తున్న బీడీ కార్మికులను ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పలుకరించారు.. వీఐపీ రిపోర్టర్‌గా మారి వారి పరిస్థితులను చూసి చలించిపోయారు. అసెంబ్లీలో గళమెత్తుతా... బీడీ కార్మికులు దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు.. వీరి సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతా.. చాలీచాలని కూలీలతో పాటు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.. కుటుంబం యావత్తూ కష్టపడి బీడీలు చుట్టినా వచ్చే కూలీ అంతంత మాత్రమే.. వీరి పిల్లలు చదువులకు నోచుకోవడం లేదు.. జిల్లాలోని వేల బీడీ కార్మికుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి.. చేనేత కార్మికుల తరహాలోనే వీరికి కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి.. బ్యాంకులు వీరి బాగోగుల గురించి పట్టించుకోవాలి. ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి.. బీడీలు చుడుతుండటంతో టీబీ, ఆయాసం వంటి వ్యాధులకు గురవుతున్నారు.. వీరికోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి.. ఇల్లులేని వారికి పక్కా గృహాలను మంజూరు చేయాలి.. - రవీంద్రనాథ్‌రెడ్డి ఎమ్మెల్యే, కమాలపురం తెల్లారకముందే ఆ నిరుపేద మహిళలు తమ రోజువారి పని ఆరంభిస్తారు. కాసిన్ని టీ నీళ్లు గొంతులో పోసుకుని పద్మాసనం వేసి... సగం పొగాకు నిండిన చాటను తీసుకుని పని మొదలెడతారు.. ఆకు చుట్టడం.. పొగ చూరడం.. ఇంతే రోజంతా ఇదే పని.. 8 గంటలు..9,10.....1, 2 ఇలా గడియారంలో ముళ్లు తిరుగుతూనే ఉంటుంది... గంటలు గడుస్తూనే ఉంటాయి. అయినా లేవరు. కడుపులో పేగులు సిగ్నల్ ఇస్తున్నా గుక్కెడు మంచినీళ్లతో దాహం తీర్చుకుంటూ.. అలాగే కడుపుమాడ్చుకుంటూ పనిలో నిమగ్నమవుతుంటారు. టీ..టీఫెన్ కాదుకదా.. ఒక్కోసారి మధ్యాహ్నం అన్నానికీ లేవరు.. ఇలా రోజంతా పనిచేస్తేగానీ ఆ పూట తిండికి సరిపోయే కూలిరాని పరిస్థితి వారిది. వేళకు అన్నం తినకపోయినా.. ఈ పనితో రోగాలు వస్తాయని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన దుస్థితి. ఇలా ఒకటి రెండు కాదు దశాబ్దాల తరబడి అదే వారి జీవితం. బీడీ కార్మికుల వ్యథ ఇది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ‘సాక్షి వీఐపీ’ రిపోర్టర్‌గా మారి వారిని పలకరించినప్పుడు వారు వెల్లబుచ్చిన ఆవేదనకు అక్షరరూపం ఇది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి : నమస్తేమ్మా...! బీడిలు మీరు తయారు చేస్తారా? మిమ్మిల్ని ఎవరైనా పట్టించుకున్నారా?? పుల్లమ్మ : అవును సార్.. మేం తయారు చేసుకోవాలి. మా గురించి ఎవరూ పట్టించుకున్నోళ్లే లేర్సార్. ఎమ్మెల్యే: ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏవైనా సౌకర్యాలు కల్పిస్తున్నారా? ప్యారిజాన్ : ఏమొచ్చాండాయో తెలీదు సార్....హాస్పిటల్‌కు వెళ్లాలన్నా రూ. 50 పెట్టి అదేదో ఈఎస్ఐ ఆస్పత్రి అంటా...అక్కడికి వెళ్లాలి. ఎక్కువ లెక్క ఛార్జీలకు పెట్టి పోవాలా! ప్రభుత్వమేమో కనీసం పింఛన్ కూడా ఇయ్యకపోయే! అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పలకకపోయే... ఎమ్మెల్యే: బీడి చుట్టడానికి ఆకు ఎవరిస్తారు? ఎంత ఖర్చు వస్తుంది? కార్మికులకు బీడి చుట్టడం వల్ల ఏమైనా జబ్బులు వస్తున్నాయా? రఫీయున్ : ఎందుకులే సార్...చెప్పుకుంటే చాలా బాధగా ఉంది. ఉబ్బసం, దగ్గు, ఆయాసం లాంటి జబ్బులు వస్తాయి. మాకు వచ్చే నూరు, నాట యాభైతో కష్టపడతాండాం! కార్మికుల గురించి ఎవరూ పట్టించుకోరు. ఆకు, ఇతర సరుకు కంపెనోళ్లే ఇస్తారు. బీడీలు చుట్టి ఇస్తే కూలీ ఇస్తారు. ఎమ్మెల్యే: ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి? అందరికీ సొంత ఇల్లు ఉన్నాయా? రబియా : చాలామందే ఉంటారు సార్....200 నుంచి 300 కుటుంబాలు ఉంటాయి. ప్రతిరోజు పొద్దస్తమానం కష్టపడతాం...బీడీలు చుడతానేం ఉంటాం! స్వంత ఇల్లు అందరికీ లేవు సార్, ఏదో వచ్చినోళ్లకు వచ్చినాయ్..రానోళ్లకు రాలే... ఎమ్మెల్యే: బీడి కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ఎంతమందికి పని కల్పిస్తున్నారు? ఇర్ఫాన్‌బాష (వంకాయ ఫేమస్బీడి ప్రతినిధి) : కమలాపురం చుట్టుపక్కల పల్లెల్లో సుమారు 10 కంపెనీలు ఉన్నాయండి...మా అబ్బ కాలం నుంచి చాలామంది బీడీలు చుడుతున్నారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా. బిజినెస్ భారీగా పడిపోయింది. 500 కుటుంబాలకు పైనే బీడీలు చుడుతున్నారు సార్! ఎమ్మెల్యే: మీరు ఎన్నేళ్ల నుంచి బీడీలు చుడుతున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? రోజుకు ఎన్ని చుడతారు..? షేక్ షమీమ్ బేగం : మేము 30 ఏళ్ల నుంచి బీడీలు చుడుతున్నాం...పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు చుడుతూనే ఉంటాం. కనీసమంటే వెయ్యి బీడీల వరకు చుడతాం.కంపెనోళ్లు 100 నుంచి 150 రూపాయలు ఇస్తారు. మాకు కూడా సమస్యలొచ్చి అక్కడ, ఇక్కడ తిరుగుతున్నాం. జబ్బులు వస్తుండడంతో ఈఎస్ఐ ఆస్పత్రికి కూడా పోయి వచ్చాం. బీడి కార్మికులకు పింఛన్ వచ్చేలా చూడండి సార్. ఎమ్మెల్యే: మీ కుటుంబంలో ఎంతమంది పనిచేస్తున్నారు? అందరూ చేస్తారా? రోజుకు ఎంత సంపాదిస్తారు? మాబున్నీ : సార్, మేమే 37 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తాండాం. మేము తొమ్మిది మంది ఉన్నాం. పిల్లోళ్లు చదువుకుంటాండారు. స్కాలర్షిప్పులు కూడా సక్రమంగాా రాలే! రోజూ బీడీలు చుట్టినా రూ. 200-300 కంటే ఎక్కువ రాలేదు. ఒక్కొసారి కుటుంబ ఖర్చులకే అంతా సరిపోతాంది. ఎమ్మెల్యే: (బజారులో బండమీద కూర్చొని బీడీలు చుడుతున్న వ్యక్తి వద్దకు వెళ్లి) : ఎప్పటినుంచి వృత్తిలోకి వచ్చారు? ప్రభుత్వం సబ్సిడీ లాంటివి ఏమైనా సాయం చేసిందా? ఇబ్రహీం బాష : ఎవరు అడుగుతారు సార్... బీడి కార్మికులను ఎవరూ పట్టించుకోలేరు. దారుణం సార్.బాడుగ ఇళ్లలో ఉన్నాం. అంతా ఎలచ్ఛన్లపుడు వస్తారు. చెబుతారు...పోతారు...ఏమి చేయరు సార్...ఓటుకోసం అందరూ వస్తారు...నేను 30 ఏళ్ల నుంచి చుట్టిచుట్టి పడతాండ. ఏ పభుత్వం చిల్లిగవ్వ ఇయ్యలే...ఇంకే చేస్తారులే సార్. ఎమ్మెల్యే: (సమీపంలో ఉన్న డాక్టరు సురేష్బాబునుద్దేశించి) : ఏమయ్యా డాక్టర్...బీడీలు చుట్టి చుట్టి ఆరోగ్యాలు పాడవుతున్నాయి...వీరికి ఏమేం జబ్బులు ఉన్నాయో ఓసారి చెప్పండి? డాక్టర్ సురేష్‌బాబు : సార్, బీడి కార్మికులు రోజూ పొగాకు చుట్టడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధింధించిన జబ్బులతోపాటు ఇతరత్రా సమస్యలు వస్తున్నాయి. కార్మికులు జాగ్రత్తలు పాటించాలి. బీడి కార్మికులకు సపరేటు ఆస్పత్రి ఉండడంతో అంతా ఈఎస్ఐకి వెళతారు. ఎమ్మెల్యే: ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరూ బీడీలు చుడతారా? మాబుజాన్ : నేను 40 ఏళ్ల నుంచి చుడుతున్నా. మా ఇంట్లో తొమ్మిది మంది ఉన్నాం. నేనొక్కదాన్నే చుట్టిన బీడీలపై వచ్చే సొమ్ముతోనే ఇంట్లో జరగాలి. ఎమ్మెల్యే: బీడి కార్మికులకు ఇన్స్యూరెన్స్ ప్రభుత్వం కడుతుందా? ఎస్.ప్యారీజాన్ : ఏమి రాలేదు సార్...పింఛన్ రాలేదు. బీడి కార్మికులకు ఇన్స్యూరెన్స్ ఎవరిస్తారు సార్, ప్రభుత్వం చెప్పినోళ్లకే చేయలేదు. మాకేమి ఇన్స్యూరెన్స్ డబ్బులు కడతారు సార్. ఎమ్మెల్యే: (సమీపంలో ఆడుకుంటున్న చిన్నారితో) : చిన్నా..బాగున్నావా...? నీవేం చేస్తావు..అమ్మా నాన్న ఏం చేస్తారు? గౌసియా : సార్...నేను చదువుకుంటున్నా...అమ్మానాన్న లేరు. చనిపోయారు. మా అక్క ఒక్కతే కష్టపడి నన్ను సూలుకు పంపుతాంది. అక్క సంపాదనతోనే నేను చదువుకుంటాండా. అక్క కూడా చదువు చాలిచ్చింది సార్. ఎమ్మెల్యే: చనిపోతే బీడి కార్మికులకు ఎక్స్‌గ్రేషియా వస్తోందా? గౌసియా : ఒక్కపైసా కూడా రాలేదు. వైద్య సేవలు కూడా సక్రమంగా అందలేదు. ఎమ్మెల్యే: చేనేత పింఛన్ 50 ఏళ్లకే ఇస్తున్నారు. బీడి కార్మికులకు ఏమైనా ఇస్తున్నారా? బ్యాంకుల్లో రుణాలివ్వలేదా? ఖుర్షీద్ : ఎవరూ ఏమి చేయలేదు..డ్వాక్రాలో ఉన్నా సక్రమంగా రుణాలు రాలేదు. ఇక బీడీ కార్మికులకు ఏం ఇస్తారు సార్? బ్యాంకులకు వెళుతున్నా ఈ రుణాల గురించి ఎవరూ అడగరు..మాట్లాడరు..... ఎమ్మెల్యే: (ఇంటి బయట పాపను ఒళ్లో కూర్చొబెట్టుకుని మాట్లాడుతన్న తల్లితో) : మీ పాపనా అమ్మా....ఏం చదువుతోంది తల్లీ? నూర్ : అవును సార్..మా పాపే....చిన్నప్పుడే ఇబ్బంది జరిగి వికలాంగురాలిగా మారిందిసార్....100 శాతం వికలాంగురాలిగా డాక్టర్లు సర్టిఫికెట్లు ఇచ్చినా పింఛన్ ఇవ్వలేదు సార్! ఎమ్మెల్యే: మీరేం చేస్తారు? బీడీ కార్మికులను ఏ ప్రభుత్వం ఆదరించింది? మాబుసాబ్ : బీడి కార్మికులకు అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ఆ మహానుభావుడు వైఎస్సార్ ఉన్నప్పుడే ఇల్లు, పింఛన్లతోపాటు ఆరోగ్యాన్ని చూపించుకునేందుకు ఒక కార్డు ఇచ్చినాడు. ఇప్పుడెవరు పట్టించుకుంటాడారు సార్...మాలాంటి చదువు రానోళ్లను తోచేస్తాండారు. -
విఐపి రిపోర్టర్ - కమెడియన్ శివారెడ్డి
-
పేరులోనే రాజసం .. సేవల్లో నీరసం
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా రిమ్స్‌లో పలు సమస్యలున్నట్లు గుర్తించాను. వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా. ముఖ్యంగా మెటర్నిటీ వార్డులో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండటం ఇబ్బందికరమే. ఈ సమస్యను పరిష్కారిస్తా. నిర్మాణంలో ఉన్న మూడు బ్లాకుల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తాం. మిగిలిన నాలుగు బ్లాకుల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపుతాను. ఆస్పత్రిలో శానిటేషన్ లోపం కనిపించింది. దీనిపై కూడా దృష్టి పెడతాను. సదరం ధ్రువపత్రాల్లో కొన్ని నకిలీవి వస్తున్నాయి. వాటిని గుర్తించి సంబంధిత అధికారులతో విచారణ జరిగేలా చూస్తాం. ఈ మేరకు డీఆర్డీఏ వాళ్లకు నివేదిక పంపుతాం. ఆస్పత్రికి ప్రహరీ గోడ లేకపోవటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని నిర్మాణానికి నిధులు మంజురయ్యాయి. పనులు త్వరగా జరిగేలా చూస్తాను. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్).. పేరులో రాజసం ఉట్టిపడే ఈ సంస్థ సేవల్లో మాత్రం నీరసంగానే ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికాని భవనాల నిర్మాణాలు, పూర్తిస్థాయిలో అందుబాటులో లేని స్పెషాలిటీ విభాగాలు, వైద్య నిపుణులు, సిబ్బంది కొరత, అధునాతన సౌకర్యాల లేమి.. ఎక్కడికక్కడ పారిశుద్ధ్యలోపం.. ఇలా ఎన్నో సమస్యలతో రిమ్స్ నీరసించిపోతోంది. జిల్లాలో పెద్దాస్పత్రి అయిన ఇక్కడికి రోజూ వందల సంఖ్యలో వచ్చే పేద రోగులు నాణ్యమైన, పూర్తిస్థాయి వైద్యసేవలు అందక ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. వీటికి తోడు గత ఏడు నెలలుగా స్టైపెండ్ అందక జూనియర్ డాక్టర్లు మనస్ఫూర్తిగా పని చేయలేకపోతున్నారు. ఈ లోపాలు, సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ రిపోర్టర్‌గా మారారు. ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టరుగా ఆస్పత్రి అంతటా కలియదిరిగారు. రోగులు, ఉద్యోగుల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. ఆ వివరాలు.. మెటర్నిటీ వార్డులో.. డెరైక్టర్: డాక్టరు గారు.. మీ వార్డులో ఎంత మంది వైద్యులున్నారు. నెలకెన్ని కేసులు చేస్తుంటారు? డాక్టరు శశికళ: మా వార్డులో మొత్తం పది మంది వైద్యులం ఉన్నాం సార్. నెలకు సుమారు 420 కేసుల వరకు వస్తుంటాయి. వాటన్నింటిని సిబ్బంది సహకారంతో విజయవంతంగా చేస్తున్నాం. డెరైక్టర్: ఏమైనా సమస్యలున్నాయా? డాక్టరు శశికళ: పడకలు సరిపోవటం లేదు సార్. ఒక్కో పడకపై ఇద్దరేసి గర్భిణులు, బాలింతలను ఉంచాల్సి వస్తోంది. అలాగే స్టాఫ్‌ను కూడాపెంచితే బాగుంటుంది. డెరైక్టర్: ఏమ్మా...ఏ ఊరు మీది? కుమారి(గర్భిణి): మాది శ్రీకాకుళం పట్టణమే బాబు. డెరైక్టర్: ఆస్పత్రిలో ఎప్పుడు చేరావు. బాగానే చూసుకుంటున్నారా? కుమారి: ఈ నెల రెండో తేదీన చేరాను. రక్తం తక్కువగా ఉందని ఉంచారు. బాగానే చూసుకుంటున్నారు. ఇబ్బంది లేదు సార్. డెరైక్టర్: ఏమ్మా.. ఒకే పడకపై ఇద్దరు బాలింతలను ఉంచారేంటి? హెడ్ నర్స్(విజయ): భవనాలు చాలకపోవటంతో పడకలు తక్కువగా ఉన్నాయి సార్. అందువల్ల ఒకే పడకపై ఇద్దరేసి బాలింతలను ఉంచుతున్నాం. డెరైక్టర్: ఏ ఊరమ్మా మీది.. ఆస్పుత్రిలో సేవలేవిధంగా అందుతున్నాయమ్మ? ఎం.రోజమ్మ(బాలింత): మాది గార మండలం కొర్ని గ్రామం సార్. ఇక్కడ వైద్య సేవలు బాగానే ఉన్నాయి. కాని ఉండటమే కష్టంగా ఉంది. ఒకే పడకపై ఇద్దరిని ఉంచుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థోపెడిక్ వార్డులో.. డెరైక్టర్: డాక్టరు గారు.. మీ వార్డులో ఏమైనా సమస్యలున్నాయా. అసలు ఇక్కడ రోగులకు అందే సేవలేంటి? డాక్టర్ రజనీ: మా వార్డులో పెద్దగా సమస్యలేమీ లేవు సార్. ఆర్థోపెడిక్‌కు సంబంధించి ఆరోగ్యశ్రీ కేసులకు ముందు ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వార్డుకు తరలిస్తాం. అంత వరకు శస్త్రచికిత్సకు ముందు చికిత్సంతా ఇక్కడే అందిస్తాం. డెరైక్టర్: రిఫరల్ కేసులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? రజనీ: చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. రోగి తరపు వారు వచ్చి ఎందుకు రిఫర్ చేశారో తెలియజేయమంటుంటారు. అయితే కొం త మందికి వైద్యపరంగా మేము చెప్పే విషయాలు అర్థం కావు. అటువంటప్పుడు ఇబ్బంది తప్పటం లేదు. వాళ్లకు తెలియక మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. డెరైక్టర్: అసలు కేసులు ఎందుకు రిఫరల్ వెళ్తున్నాయి, సుమారు ఎన్ని ఉండవచ్చు? రజనీ: రిమ్స్‌కు వచ్చే కేసుల్లో పది శాతం ఇతర ప్రాంతాలకు రిఫరల్‌గా వెళ్తున్నాయి. ఆయా కేసులకు సంబంధించిన సౌకర్యాలు ఇక్కడ లేకపోవటం వల్లే రిఫర్ చేస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తే రిఫరల్ సమస్య ఉండదు సార్. డెరైక్టర్: ఏమయ్యా.. నీ పేరేంటి? నీకేమంది? రోగి: నా పేరు లక్ష్మీనాయుడు బాబు. మాది బూర్జ గ్రామమండి. పొలంలో చేను పెరుక్కుని రోడ్డెక్కుతుంటే బండి(స్కూటర్) గుద్దీసింది. ఆస్పత్రిలో సేరి పది రోజులు గడిసిపోనాది బాబు. ఇంత వరకు అపరేషన్ సేయ్యనేదు బాబు. డెరైక్టర్: డాక్టరు గారు.. ఇదేంటి వచ్చిన రెండు మూడు రోజుల్లో శస్త్రచకిత్స చేస్తామంటున్నారు కదా. మరి ఇతను వచ్చి పది రోజులైనా ఎందుకు చేయ్యలేదు? రజనీ: ఆయన కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. అది నయమైతేగానీ శస్త్రచికిత్స చేయలేం. అందువల్లే ఆలస్యమవుతోంది. గైనిక్ వార్డులో.. డెరైక్టర్: ఏం బాబు.. రోగులకు ఏం ఆహారం ఇస్తున్నావు?(డైట్ సరఫరా చేసే సిబ్బంది నారాయణతో) నారాయణ: రోగికివ్వాల్సిన పౌష్టికాహారాన్ని బట్టి ఆ రోజు మెనూ ఉంటుంది సార్. గైనిక్ వార్డుకు సంబంధించి అరటి పండు, రెండు గుడ్లు, రెండు శనగుండలు, భోజనం ఇస్తున్నాం సార్. డెరైక్టర్: ఏమ్మా...నీ పేరేంటి? బాలింత: నా పేరు స్వాతి సార్.. మా ఊరు చిలకపాలెం సార్. డెరైక్టర్: ఎన్నో కాన్పమ్మ?.. ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? స్వాతి: నాది రెండో కాన్పు సార్. ఆస్పత్రిలో దోమలు విపరీతంగా ఉన్నాయి సార్. అసలు ఉండలేకపోతున్నాం. పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. చివరకు బయట డబ్బులిచ్చి దోమ తెరలు కొనుక్కుని పిల్లలకు పెడుతున్నాం సార్. పేదోళ్లమైన మేము ఖర్చు చేయలేకపోతున్నాం. దోమల నివారణకు చర్యలు చేపడితే బాగుంటంది సార్. డెరైక్టర్: ఏమ్మా.. మీరు జూనియర్ డాక్టరే కదా.. మీకేమైనా సమస్యలున్నాయా? లావణ్య: అవును సార్.. మేము జూనియర్ డాక్టర్లమే. మాకు ఒక్క స్టైపెండ్ సమస్య తప్పితే ఇంకే సమస్యలు లేవు సార్. జూనియర్ డాక్టర్లుగా చేరినప్పటి నుంచి ఇంత వరకు ఒక్క నెల మాత్రమే స్టైపెండ్ ఇచ్చారు. ఇంకా ఏడు నెలల స్టైపెండ్ అందాలి సార్. డెరైక్టర్: స్టైపెండ్ కోసం ఇతర జిల్లాల్లో సమ్మె చేస్తున్నారు కదా. మీరు కూడానా...? లావణ్య: లేదు సార్. సమ్మె చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. కాని స్టైపెండ్ అందకపోవటంతో జూనియర్ డాక్టర్లందరం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ప్రభుత్వం మా సమస్యను గుర్తించి, వెంటనే విడుదల చేస్తే బాగుంటుంది. ఆశా వర్కర్లతో.. డెరైక్టర్: ఏ ఊరు మీది. రిమ్స్‌కు ఎందుకు వచ్చారమ్మా? ఆశా వర్కర్లు: సార్.. మాది ఆమదాలవలస. మా పేర్లు శ్రీదేవి, పద్మావతి. మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాం. గర్భిణులను పట్టుకుని ఇక్కడకు వచ్చాం సార్. డెరైక్టర్: అలాగా.. ఆస్పత్రిలో ఏమైనా సమస్యలున్నాయా..? ఆశా వర్కర్లు: రక్త పరీక్షల రిపోర్టు ఇవ్వటం చాలా ఆలస్యం అవుతోంది సార్. దాని కోసం మళ్లీ రెండో రోజు రావల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఏర్పడుతోంది. అలా కాకుండా రక్తపరీక్షలు నిర్వహించిన వెంటనే రిపోర్టులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్. నిర్మాణ విభాగం డీఈతో.. డెరైక్టర్: (నడుచుకుంటూ నిర్మాణంలో ఉన్న కొత్త బ్లాకుల్లోకి వెళ్తూ అక్కడున్న డీఈ శ్రీనివాస్‌తో) సార్...ఏంటీ ఎంత వరకు వచ్చాయి నిర్మాణ పనులు? డీఈ: అవుతున్నాయి సార్. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం సార్. డెరైక్టర్: పనుల్లో 45 శాతమే పూర్తి అయ్యాయని, ఇంకా 55 శాతం నిర్మాణాలు జరగాల్సి ఉందని అందరూ అంటున్నారు. ఏమిటి సార్ దీని పరిస్థితి? డీఈ: మొత్తం 13 బ్లాకుల్లో ఆరు బ్లాకులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం వాడుకులో ఉన్నాయి సార్. నిర్మాణ దశలో ఏడు బ్లాకులు ఉన్నాయి. వీటిలో అత్యవసరంగా 7, 11, 12 బ్లాకుల నిర్మాణాలు చేపడుతున్నాం. ఈ పనులను సత్యసాయి కన్సస్ట్రక్షన్ వారు చేపడుతున్నారు. ఇందుకోసం రూ.20.89 కోట్లు మంజురయ్యాయి సార్. డెరైక్టరు: ఇంతకీ ఎప్పటికి ఈ నిర్మాణాలు పూర్తి అవుతాయి? డీఈ: ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7,11, 12 బ్లాకులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి అవుతాయి సార్. మిగిలిన నాలుగు బ్లాకులకు సంబంధించి ఇటీవలే డీఎంఈ వచ్చి పరిశీలించి వెళ్లారు. వారిచ్చే ఆదేశాల ప్రకారం కొత్త కాంట్రాక్టు పిలవాలో లేక ప్రస్తుతమున్న వారికే పనులు అప్పగించాలో.. నిర్ణయం తీసుకుంటాం. డెరైక్టర్: ఓకే థ్యాంక్యూ వెరీ మచ్.. డీఈ గారు. -
బడిదుడుకులు
జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు అనంతపురం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చి సరిగ్గా పదిరోజులే అయింది. జిల్లాలో పాఠశాలలు, ముఖ్యంగా సర్కారీ స్కూళ్ల పనితీరు, అక్కడ అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నారు. అధికారిగా వెళితే ముందుగానే సమాచారం వెళ్లి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త పడతారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు తెలియవు. అక్కడ విద్యార్థులకు అధికారితో ఎలా మాట్లాడాలి, ఏ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పాలి అనే విషయాలను ఉపాధ్యాయులు ముందుగానే శిక్షణ ఇచ్చి సిద్ధం చేసేస్తారు. అలా జరిగితే క్షేత్ర స్థాయిలో ఏ లోపం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉండదు. ఆకస్మిక తనిఖీకి వెళ్లినా అక్కడేం జరిగిందనేది పూర్తిగా బయటకు రాదు. మరి.. విషయం రాబట్టాలంటే రొటీన్‌కి భిన్నంగా ఏదో ఒకటి చేయాలి. వెంటనే ఆయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఏలూరులోని రెండు స్కూళ్లకు ఆకస్మికంగా వెళ్లారు. తొలుత తూర్పువీధి శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ తొమ్మిదవ తరగతి గదిలోకి అడుగు పెట్టారు. డీఈవో: నేను ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను.. ఏమ్మా నీ పేరేమిటి, నువ్వు స్కూల్‌కి రెగ్యులర్‌గా వస్తావా, టీచర్లు రెగ్యులర్‌గా వస్తున్నారా సుకన్య : నేను రెగ్యులర్‌గా వస్తాను సార్. మా టీచర్లు కూడా వస్తారు డీఈవో: ఉపాధ్యాయులు పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారా ? నీకు ఇష్టమైన సబ్జెక్టు ఏమిటి హేమనీల్ కుమార్ : అర్థమయ్యేలానే చెబుతున్నారు సార్, నాకు ఇష్టమైన సబ్జెక్టు తెలుగు డీఈవో: తెలుగులో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి. హేమనీల్ కుమార్ : 45 వచ్చాయి సార్ డీఈవో: అదేంటి ఇష్టమైన సబ్జెక్టులో 45 మార్కులేనా వచ్చేది? ఐతే మీ టీచర్లు మీకు అర్థమయ్యేలా చెప్పడం లేదన్నమాట లేదు సార్... మా మాస్టార్లంతా మంచోళ్లు అని విద్యార్థుల ముక్తకంఠం డీఈవో: సరే మీకు నోట్స్ చెబుతున్నారా.. ఏదీ చూపించండి అటూ చొరవగా ఒక విద్యార్థి నోట్ పుస్తకాన్ని తీసుకుని పరిశీలించారు. ఆ నోట్స్‌ను టీచర్ కరెక్టు చేసినట్టు లేకపోవడం గమనించారు. డీఈవో : టీచర్‌తో ఏమ్మా నోట్స్ దిద్దాల్సిన బాధ్యత మీకు లేదా? టీచర్ శాంతి కుమారి : నోట్స్ ఎప్పుడూ దిద్దుతాను సార్ వాళ్ళు మొన్న స్కూల్‌కు రాలేదు. ఇవ్వాళే వచ్చారు. అందుకనే దిద్దడం కుదరలేదు. డీఈవో: మీ స్కూలుకు యూనిఫాం ఉందా.. సౌజన్య : ఉంది సార్ డీఈవో : మరి మీరు వేసుకోలేదే విద్యార్థులు : 8వ తరగతి వరకు మాత్రమే ఉంది సార్ అక్కడి నుంచి వడివడిగా బయటకు అడుగులు వేసిన ఆయన పక్కనే మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంటలు వండుతున్న షెడ్డు వద్దకు వచ్చారు. అక్కడ వంట మనిషితో... డీఈవో: ఏమ్మా పిల్లలకు వారానికి ఎన్నిసార్లు గుడ్లు ఇస్తున్నారు. వంట మనిషి ఆదిలక్ష్మి : వారానికి రెండుసార్లు గుడ్లు ఇస్తున్నాం సార్ డీఈవో : గుడ్లకు బదులు అరటి పండ్లు ఇస్తున్నారని తెలిసింది నిజమేనా ఆదిలక్ష్మి : ఈ స్కూల్లో గుడ్లే ఇస్తున్నాం సార్. డీఈవో: భోజనం సమయం మధ్యాహ్నం ఒంటిగంట అయిపోయింది. ఇంకా వండుతూనే ఉంటే ఎప్పటికి పెడతారు. ఆదిలక్ష్మి : అయిపోవచ్చింది సార్ గంట కొట్టగానే పెట్టడానికి సిద్ధం చేస్తున్నాము. పక్కనే ఉన్న ప్రధానోపాధ్యాయునితో ... డీఈవో: మీ స్కూల్లో ఎంతమంది విద్యార్థులున్నారు... ఎంతమంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారు... హెచ్ఎం సీహెచ్ హరిబాబు : స్కూల్లో 500కు పైగా విద్యార్థులున్నారు సార్. 475 మంది వరకూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. డీఈవో: మిగిలిన వాళ్లు ఎందుకు చేయడంలేదు... మీరు వాళ్లకి చెప్పడం లేదా. సరే ఈ రోజు ఎన్ని కేజీల పప్పు వాడారు. హరిబాబు : ఐదున్నర కేజీలు పప్పు వాడాం సార్. డీఈవో : ఒక్కో విద్యార్థికి ఎంత పప్పు వాడాలి హరిబాబు : 30 గ్రాముల పప్పు వాడాలి సార్. డీఈవో : మరి 475 మందికి ఎంత పప్పు వాడాలి. అంటూ నోట్లోనే లెక్కలు వేసుకుని సుమారు 12 కేజీల పప్పు పైన వాడాలి, మీరేమో ఐదున్నర కేజీలే వాడామంటున్నారు. ఎందుకు తగ్గించారు. హరిబాబు : ఈ రోజు మెనూలో పప్పు లేదు సార్. సాంబారుకోసమే పప్పు వినియోగించాం. సాంబారుకు అంత అవసరముండదు సార్. డీఈవో : విద్యార్థులకు మంచినీటి సౌకర్యం ఉందా. ఎలా సరఫరా చేస్తున్నారు. హరిబాబు : మంచినీటికి ట్యాంకు ఉంది సార్, దానికి ట్యాప్‌లు పెట్టాం ఆ నీరే తాగుతారు. డీఈవో : ప్రతి తరగతి వద్ద స్టీల్డ్రమ్ముతో తాగునీటిని అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉంది తెలుసా. ఇక్కడ చూస్తే ఏమీ కనబడడం లేదే. ఇప్పటి నుంచైనా డ్రమ్ములు ఏర్పాటు చేయండి. అనంతరం అక్కడి నుంచి పాఠశాలలోని టాయిలెట్లను పరిశీలించడానికి వెళ్లారు. టాయిలెట్లలో కొన్నింటికి తాళాలు వేసి ఉండడాన్ని గమనించిన డీఈవో మధుసూదనరావు ఈ టాయిలెట్లు వినియోగిస్తున్నారా... తాళాలు ఎందుకు వేశారు అంటూ ప్రశ్నలు సంధించారు. హెచ్ఎం హరిబాబు ఇవి విద్యార్థినుల టాయిలెట్లు సార్ అని ఏదో సర్ది చెప్పబోతుండగా డీఈవో కలుగచేసుకుని ముఖ్యంగా విద్యార్థినుల టాయిలెట్లనే అందుబాటులో ఉంచాలి. ఇంతమంది విద్యార్థినులు ఉంటే టాయిలెట్లకు తాళాలు వేస్తే వారు ఎక్కడికి వెళ్లాలి. టాయిలెట్లలో వాడుకనీటి సరఫరా నిరంతరం జరుగుతోందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన డీఈవో మంచినీటి ట్యాంకు గొట్టాల నుంచి నీరు లీకవుతూ ప్రాంగణం బురదమయంగా మారటాన్ని గమనించారు. ట్యాంకు లీకేజీలు ఉంటే బాగు చేసుకోవాలనే సంగతి తెలీదా అంటూ... ఇది స్కూలేనా... విద్యార్థులు ఉండే ప్రాంగణం ఇలాగేనా ఉండేది.. అని అసహనం వ్యక్తం చేశారు. మీ పాఠశాలకు గ్రాంటులు వస్తున్నాయా అని అడిగి ఆ గ్రాంటులను విత్‌డ్రా చేసి వెంటనే నీటి లీకేజిని నివారించాలని ఆదేశించారు. అనంతరం 10వ తరగతి గదిలోకి వెళ్లారు. డీఈవో అక్కడ డెస్కుపై గైడు ఉండడాన్ని గమనించి ఇదేమిటి గైడ్లు ఎవరు తెచ్చారు. గైడ్లు కొనవద్దని చెబుతున్నాం కదా క్లాస్‌లో నోట్సు చెప్పడం లేదా?. ప్రియాంక : గైడు నాదే సార్ తెలియక కొన్నా. మెదట్లో రిఫరెన్సు కోసం ఉపయోగపడుతుందనుకున్నా. అక్కడి నుంచి బయలుదేరి అగ్రహారంలో ఉన్న బాలికోన్నత పాఠశాలకు వెళ్లారు. ఆయన వెళ్లేటప్పటికి విద్యార్థినులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. ఒక బాలికతో... డీఈవో : ఈ రోజు భోజనంలో గుడ్డు ఇచ్చారా.. వంటలు బాగుంటున్నాయా అని అడిగారు. రాగసుధ : వంటలు బాగా ఉంటాయి సార్. ఈ రోజు గుడ్డు ఇచ్చారు. డీఈవో : మరి నీ కంచంలో గుడ్డు కనబడడం లేదేమిటి... పచ్చడి తెచ్చుకున్నావెందుకు అని అడగగా ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. పక్కనే ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ ఏంజల్‌ను ఉద్దేశించి ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు.. అందరికీ సరిపడా ఫర్నిచర్ ఉందా అని ప్రశ్నించారు. విజయ ఏంజల్ : ఇక్కడ 250 మంది విద్యార్థినులు చదువుతున్నారు సార్. అందరికీ సరిపడే ఫర్నిచర్ ఉంది సార్. డీఈవో : మరి మంచినీటి డ్రమ్ములు కనబడడం లేదేమిటి. మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ప్రతి పాఠశాలకూ రూ 2,500 మంజూరు చేస్తోంది కదా, ఆ నిధులను వాడారా విజయ ఏంజల్ : ఆ గ్రాంటును ఇప్పటివరకూ డ్రా చేయలేదు సార్ డీఈవో : బాధ్యత గల స్థానంలో ఉండి నిధులు డ్రా చేయలేదని చెప్పడం ఎంతవరకూ కరెక్ట్. ఇప్పటికై నా ఆ నిధులను డ్రా చేసి మౌలిక సౌకర్యాల క ల్పనపై దృష్టి పెట్టండి. -
దారి లేదు..బతికించే ‘దారీ’ లేదు..
‘ఎక్కే కొండ దిగే కొండ. కాలినడకన ఎడితేనే మందూ, మాకూ. దాహమేత్తే చెలమల నీరే గతి .. రోడ్లు ఏసినట్టే ఏసి..మద్యలోనే వదిలేసారు. చంటిపిల్లలకు టీకాలు ఏయిద్దామన్నా పాతికకిలోమీటర్లు ఎల్లాలి. కరెంటు లేదు కిరోసిన్ దీపం బుడ్లే గతి’ ఇది రంపచోడవరం నియోజకవర్గంలోని రెండు గిరిజన గ్రామాల దుస్థితి. ‘జనమైత్రి’ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న ఏఎస్పీ సీహెచ్ విజయారావుతోనే జనం సమస్యలను ఎత్తి చూపించాలని భావించిన ‘సాక్షి’ అభ్యర్థనను మన్నించిన ఆయన శనివారం వీఐపీ రిపోర్టర్‌గా మారారు.ఆ రిపోర్టింగ్ వివరాలు.. దారి లేదు.. బతికించే ‘దారీ’ లేదు.. ఏఎస్పీ విజయారావు (గంగవరం మండలం కుసుమరాయి గ్రామంలో) : ఏం పెద్దాయనా నీ పేరేంటి? నీ వయస్సెంత? గిరిజనుడు : అయ్యా నా పేరు సూర్యారావు సారూ, 70 ఏళ్లు బాబూ! ఏఎస్పీ : మీ గ్రామంలో సమస్యలేమైనా ఉన్నాయా.. సూర్యారావు : మా ఇంటికి పక్కనే రోడ్డు వేశారు. సగంలో వదిలేశారయ్యా, మడుగులో నడుస్తున్నట్టుంది. ఏఎస్పీ : నీ పేరేంటయ్యా? మీరెదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమైనా ఉందా? గిరిజనుడు : సత్యనారాయణండీ. మా గ్రామానికి బస్సు వస్తే బాగుంటుంది సారూ. ఏఎస్పీ : మీ సమస్యను ఆర్టీసీ డీఎం గారికి చెబుతా. బస్సువచ్చే ప్రయత్నం చేస్తాను. ఏఎస్పీ : నీపేరేంటమ్మా? గిరిజన మహిళ : బాపనమ్మ సర్ ఏఎస్పీ : ఏం చదువుకున్నావు? బాపనమ్మ : ఇంటర్ పూర్తి చేసి నర్సింగ్ చేశాను. కొంత కాలం గంగవరం పీహెచ్సీలో పనిచేశాను. ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేదు. నా భర్త కూలిపనికి వెళుతున్నాడు. ఏఎస్పీ : ఊళ్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయా? బాపనమ్మ : గ్రామంలో ఊటనీరుతో ఇబ్బందిగా ఉంది. అస్తమాను జ్వరాలు వస్తున్నాయి సారూ. ఏఎస్పీ : మరి వైద్యులు వస్తారు కదా, గ్రామంలో పరిశుభ్రత గురించి అందరూ శ్రద్ధ చూపాలి. బాపనమ్మ : డాక్టర్లు రావడం లేదండీ. మందులు ఇచ్చే వారు రావడం లేదు. ఏఎస్పీ : జ్వరాలొచ్చిన వారికి వైద్యసేవలు అందేలా చూస్తాను. అవసరమనుకుంటే పోలీస్ శాఖ తరఫున మీ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాను. ఏఎస్పీ (ఓ అవ్వను ఉద్దేశించి) : అవ్వా.. ఎలా ఉన్నావు? నీ పేరేంటి? అవ్వ : బాగున్నానయ్యా.. పొట్టమ్మ బాబూ.. ఏఎస్పీ : ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? పొట్టమ్మ : ఫించనీలు కొంత మందికి వస్తున్నాయి.. కొంత మందికి రావడం లేదు బాబా... స్థానికుడు : మా సమస్య వినండి సారూ....నా పేరు సాల్మన్ ఏఎస్పీ : సాల్మన్ ఏంటి సమస్య? సాల్మన్ : ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మా గ్రామంలో ఎస్సీలకు ఇళ్లు ఇస్తే గూడు దొరుకుతుంది సారూ. ఏఎస్పీ : తప్పని సరిగా మీ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టిలో ఉంచుతాను. ఏఎస్పీ : బాబూ.. నీపేరేంటి? గిరిజన యువకుడు : రమేష్ సార్ ఏఎస్పీ : ఏమైనా సమస్యలు ఉన్నాయా? రమేష్ : గ్రామానికి కంకర రోడ్డు ఉంది సారూ. తారు రోడ్డు వేస్తే బస్సులు రావడానికి ఇబ్బంది ఉండదు. ఏఎస్పీ : గ్రామంలో సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి యువకులు కృషి చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచిగా చదువుకుని భవిష్యత్‌లో బాగా స్థిరపడాలి. ఏఎస్పీ (రంపచోడవరం మండలం కింటుకూరులో) : చంటిపిల్లలతో ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లీ? మహిళలు : సారూ మాది కింటుకూరు. ఏఎస్పీ : మీ పేర్లేంటమ్మా? ఓ మహిళ : మడి దుర్గ సారూ.. ఏఎస్పీ : ఎక్కడి నుంచి వస్తున్నారు? దుర్గ : కొయ్యలగూడెం ఆస్పత్రికి వెళ్లి వస్తున్నాం. ఏఎస్పీ : చంటి పిల్లలకు ఏంటి ఇబ్బంది? విజయ : పిల్లలకు టీకాలు వేయించేందుకు వెళ్లాం. ఏఎస్పీ : మరి వేయించారా? విజయ : ఆస్పత్రిలో ఎవరూ లేరు సారూ, మళ్లీ శనివారం వెళ్లాలి.. ఏఎస్పీ : నీ పేరేంటయ్యా? గిరిజన యువకుడు : మడకం సంకురుదొర సారూ. ఏఎస్పీ : మీ సమస్యలేమైనా ఉన్నాయా? సంకురుదొర : రోడ్డు లేదు. ఇంటికాడికి పోవాలంటే అడ్డదారిలో పదిహేను కిలోమీటర్లు కొండలెక్కాలి సార్. జబ్బుచేస్తే ఆస్పత్రికి పోవాలంటే ఏమీ ఉండవయ్యా. సమయానికి తీసుకువెళ్లే దారిలేక మా వూరోళ్లు నలుగురైదుగురు చచ్చిపోయారు. మంచినీరు కూడా లేదయ్యా. ఏఎస్పీ : మీ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువె ళ్లి పరిష్కరిస్తాను. ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు. గురుగుల నారాయణరావు. -
వీఐపీ రిపోర్టర్ : ఎంపీ బూర నర్సయ్య గౌడ్
-
వీఐపీ రిపోర్టర్ : ప.గో.జిల్లా జేసీ బాబురావు
-
వీఐపీ రిపోర్టర్ : రామ చంద్రాపురం ఆర్డీఓ సుబ్బారావు
-
అండగా ఉంటాం
విఐపి రిపోర్టర్ ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ‘సాక్షి’ వినూత్నంగా చేపట్టిన ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమంలో బుధవారం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాల్గొన్నారు. తమ పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో పర్యటించి, ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
వీఐపీ రిపోర్టర్ : మల్కాజ్‌గిరీ ఎంపీ మల్లారెడ్డి
-
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే రామ లింగారెడ్డి
-
కలలా కరిగిన ఐదేళ్లు
‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ (జీహెచ్ఎంసీ).. 150 మంది కార్పొరేటర్లు.. అందుకు తగ్గ అధికారగణం. ఇంత గొప్ప పాలకమండలి ఐదేళ్ల పదవీకాలం రేపటి (3వ తేదీ)తో ముగియనుంది. ఈ సందర్భంగా నేడు కార్పొరేటర్లకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. తమను గెలిపిస్తే నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని, వారి ఇబ్బందులు తొలగిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు కార్పొరేటర్లుగా గెలిచినవారు దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో హామీలు.. అవి అమలైన తీరుపై ఒక అవలోకనం.. - సాక్షి, సిటీబ్యూరో ‘ప్లాస్టిక్ నిషేధం’ విఫలం నగరాన్ని మోడల్ సిటీగా మార్చేందుకు ‘ప్లాస్టిక్ నిషేధం’ అమలు చేస్తామన్నారు. ఒకేసారి పూర్తిస్థాయిలో అమలు కష్టమవుతుందని తొలుత 40 మైక్రాన్ల లోపు బ్యాగుల్ని నిషేధిస్తామని, అనంతరం సంపూర్ణంగా బ్యాన్ చేస్తామని అప్పటి మేయర్ కార్తీకరెడ్డి ప్రకటించారు. అయితే, ఒత్తిళ్లకు తలొగ్గారో.. పచ్చనోట్లకు లొంగిపోయారో గానీ, సంపూర్ణ నిషేధమన్నది సంపూర్ణంగా విఫలమైంది. గ్రేటర్ ప్రజలందరికీ సంపూర్ణ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ‘టిప్’ పథకం అమలు చేస్తామన్నారు. కోర్ ఏరియా ప్రజలతో పాటు శివార్లలోని ప్రజలకు సంపూర్ణ సదుపాయాలు ఉద్దేశించిన ఈ పథకాన్ని అమలు చేసేందుకు బ్యాంకు రుణానికీ సిద్ధమయ్యారు. ఆరంభం కాకుండానే అటకెక్కింది. నగరంలో ఇళ్ల చిరునామాను సులభంగా క నుక్కునేలా కొత్త ఇంటి నెంబర్ల పథకాన్ని ప్రకటించారు. అప్పటి మునిసిపల్ మంత్రి మహీధర్‌రెడ్డితో లాంఛనంగా ప్రారంభోత్సవం కూడా చేయించారు. నాలుగేళ్లయినా ఇంకా పూర్తికాలేదు. గజిబిజి కేబుళ్లు లేకుండా డక్టింగ్ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించడమే కాక శంకుస్థాపన చేసి మూడేళ్లయినా నేటికీ కొలిక్కి రాలేదు. వర్షం వస్తే ప్రాణాంతకంగా మారిన సమస్యల పరిష్కారానికి పలు నాలాలను ఆధునీకరించే ప్రయత్నాలు ప్రారంభమైనా ఏ ఒక్కటీ పూర్తిచేయలేకపోయారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి పాతబస్తీలోని ఖిల్వత్ వద్ద మల్టీ టయర్ పార్కింగ్ కాంప్లెక్సుకు 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు జరగలేదు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన పలు ఆర్ఓబీలు, ఫ్లై ఓవర్లలో ఒక్కటి కూడా పూర్తికాలేదు. పాలకమండలి సర్వసభ్య సమావేశాలకు తవసరమైన కౌన్సిల్‌హాల్, దానితోపాటు అధికారుల కార్యాలయాలతో పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో శంకుస్థాపన చేయించారు. తర్వాత మరచిపోయారు. అక్రమాలను సహించబోమని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, అగ్నిమాపక నిరోధక చర్యల్లేని భవనాలను ఉపేక్షించబోమన్న హామీలు ఆవిరయ్యాయి. ఫంక్షన్‌హాళ్ల నుంచి ఆస్పత్రుల దాకా ఎన్నో భవనాల్లో ఉల్లంఘనలున్నా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ‘ఇంకిపోయిన’ నిధులు ఇంకుడు గుంతల పేరిట భవన నిర్మాణ అనుమతుల సమయంలో ఫీజుల రూపేణా దాదాపు రూ. 60 కోట్లు వసూలు చేశారు. వెల్లువెత్తిన విమర్శలతో రూ. 6 కోట్లతో ఇంకుడు గుంతలు తవ్వుతామన్నారు. ఎక్కడ తవ్వారో ఎవ్వరికీ తెలియదు. బేగంబజార్, కూకట్పల్లి, నాచారం చేపల మార్కెట్లు కాగితాలు దాటలేదు. ఏళ్ల తరబడి చెబుతున్న స్లాటర్ హౌస్‌లు అందుబాటులోకి రాలేదు. తడి, పొడి చెత్తలకు టూ బిన్ సిస్టం ప్రారంభోత్సవానికే పరిమితమై.. అమలు అటకెక్కింది. హుస్సేన్ సాగర్‌కు క్రెస్ట్గేట్లు వరదలొస్తే గుర్తుకొచ్చే ప్రాజెక్టుగా మిగిలింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు ‘ఫేస్ టూ ఫేస్, ప్రజావాణి, కాల్‌సెంటర్లు పేరుగొప్ప ఊరుదిబ్బ చందంగా మారాయి. రూ. 10 కోట్లతో సైనేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించి అమలు మరిచారు. సికింద్రాబాద్, అమీర్‌పేటల్లో స్కైవాక్‌లు, నాలుగు ప్రాంతాల్లో సబ్‌వేలు ప్రకటనలుగా మిగిలాయి. ‘ఒప్పందం’ తారుమారు జీహెచ్ఎంసీలో కాంగ్రెస్- ఎంఐఎంల ఒప్పందం కుడి ఎడమైంది. ఒప్పందం మేరకు ఐదేళ్ల పదవీ కాలానికిగాను తొలి రెండేళ్లు మేయర్ పదవి కాంగ్రెస్‌కు, మలి రెండేళ్లు ఎంఐఎంకు ఇవ్వాలి. చివరి ఏడాది తిరిగి కాంగ్రెస్‌కు మేయర్ పదవి ఇవ్వాలి. కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా ఉన్నప్పుడు ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్, ఎంఐఎం నుంచి మేయర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ ఉండాలనేది ఒప్పందం. తొలి రెండేళ్ల అనంతరం ఒప్పందం మేరకు ఎంఐఎంకు కట్టబెట్టారు. తిరిగి రెండేళ్లు పూర్తి కాగానే ఎంఐఎం మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా చేయక పోవడం.. తీరా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కనీసం ఏడు నెలల సమయం కూడా లేని తరుణంలో ఆయన రాజీనామా చేసినప్పటికీ, అందుకు కాంగ్రెస్ ఆమోదం తెలపలేదు. దాంతో, ఒప్పందం మేరకు మూడేళ్లపాటు కాంగ్రెస్ వారు మేయర్‌గా కొనసాగాల్సి ఉన్నప్పటికీ రెండేళ్లే ఉన్నారు. రెండేళ్లు పదవిలో ఉండాల్సిన ఎంఐఎం మేయర్ మూడేళ్లు కొనసాగారు. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్ మూడేళ్లున్నారు. కాంగ్రెస్ నుంచి తొలి రెండేళ్లు మేయర్‌గా బండ కార్తీకరెడ్డి వ్యవహరించారు. -
విఐపి రిపోర్టర్ -డా,, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
-
మీ గొంతు మేమై..
కొత్త రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త పాలకులు వచ్చేశారు.. ఆరు నెలలు కావస్తోంది. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగానే ఉన్నాయి. ఈ తరుణంలో ‘సాక్షి’ ప్రజల పక్షాన నిలిచేందుకు వినూత్నంగా ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమాన్ని చేపట్టింది.. ప్రజల గొంతుకై నిలవాలని నిర్ణయించుకుంది.. నాయకులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్తోంది.. నేతలకు నేరుగా సమస్యలను తెలిపి సత్వర పరిష్కారానికి కృషి చేస్తోంది. ఆదివారం మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి బోయిన్‌పల్లిలో వీఐపీ రిపోర్టర్‌గా వ్యవహరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కంటోన్మెంట్: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ అయ్యారు. తాను పుట్టి పెరిగిన బోయిన్‌పల్లిలోని పలు బస్తీలో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కాలనీ మధ్య నుంచి వెళ్తున్న హైటెన్షన్ లైన్ కారణంగా నిత్యం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నామని, సమస్యను పరిష్కరించమని బాపూజీనగర్వాసులు కోరారు. మిలటరీ అధికారుల ఆంక్షలతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని పెన్షన్లైన్వాసులు ఆయన దృష్టికి తెచ్చారు. అండగా ఉంటానని.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. -
విఐపి రిపోర్టర్ - పట్నం సునీతామహేందర్ రెడ్డి
-
సమస్యలతో సావాసం
రాజాం.. పారిశ్రామికంగా దూసుకుపోతున్న ఈ నగర పంచాయతీ సౌకర్యాల విషయంలో మాత్రం పంచాయతీల కంటే హీనంగా దగజారిపోతోంది. పంచాయతీ నుంచి 2005లో నగర పంచాయతీ స్థాయికి ఎదిగినా.. ఇప్పటివరకు ఎన్నికలకు.. పాలకవర్గానికీ నోచుకోలేదు. నగర పంచాయతీలో విలీనమైన కొన్ని పంచాయతీలు కోర్టులను ఆశ్రయించడం.. ఆ కేసులు ఇప్పటికీ కొనసాగుతుండటంతో ఎన్నికలకు అవకాశం లేకుండా పోతోంది. ఫలితంగా ప్రత్యేకాధికారుల పాలనే గత్యంతరంగా మారింది. పాలకవర్గాలు లేకపోవడంతో జవాబుదారీతనం లోపించింది. నిధుల మంజూరు, అభివృద్ధి పనుల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడి ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయి. సుమారు 45వేల మంది ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు నగర పంచాయతీ కమిషనర్ వెంపటాపు అచ్చెన్నాయుడు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా నడుం బిగించారు. పలు కాలనీలు, వీధుల్లో కలియదిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలపై ఆరా తీశారు. నేటి వీఐపీ రిపోర్టర్ ప్రజలతో జరిపిన సంభాషణ యథాతథంగా.. సమస్యలు గుర్తించాం.. పరిష్కరిస్తాం కోర్టు వివాదం పరిష్కారమైతే పట్టణం జిల్లాలోనే అగ్రగామిగా నిలవడం ఖాయం. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, విద్యాసంస్థలు ఇక్కడ విస్తృతంగా ఉన్నాయి. నేను ఆరునెలల క్రితం విధుల్లో చేరా. అప్పటి నుంచి అన్ని వార్డుల్లో పర్యటించా. సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాం. రానున్న నిధులతో ఇవి పరిష్కారమవుతాయి. మున్సిపాలిటీ పాలకవర్గం లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించడం క్లిష్టతరం. అయినా అధికారుల సమష్టి కృషితో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి ముందుకెళ్తున్నాం. పట్టణంలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. పాలకవర్గం లేకపోయినా ప్రత్యేకాధికారి, ఎమ్మెల్యే సహకారంతో పాలన కొనసాగిస్తున్నాం. మొక్కలు నాటే కార్యక్రమం, వాటి సంరక్షణ, తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి పారబోయడం వంటి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రూ.39 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు వచ్చే నెల నుంచి సేవలు ప్రారంభిస్తాయి. అప్పుడు పట్టణానికి నిరంతర నీటి సరఫరా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కమిషనర్: ఏమ్మా.. నీ పేరేంటి.. ఎలా ఉన్నారు.. సమస్యలు ఏమైనా ఉన్నాయా?... బంగారమ్మ: నేను ఇప్పిలి బంగారమ్మ ను బాబు. వృద్ధురాలిని. పింఛను రా వడం లేదు. రేషన్‌కార్డు లేదు. కోటా ఆగిపోయింది. బాధలు పడుతున్నాను. కమిషనర్: దరఖాస్తు చేసుకోమ్మా...అన్నీ మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాను. బంగారమ్మ: సంతోషం బాబూ. మమ్మల్ని మీరే ఆదుకోవాలి. కమిషనర్: ఏమ్మా...మీ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? బంటుపల్లి నాగమణి: మా పదో వార్డు కొండక వీధిలో వీధి లైట్లు వెలగడం లేదు బాబూ.. రాత్రి పూట బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది. కమిషనర్ : ఏం...ఫర్వాలేదమ్మా...త్వరలోనే అన్ని వీధులకు ఎల్ఈడీ లైట్లు అమర్చుతాం. కొద్ది రోజులు ఓపిక పట్టండి. సొంత గూడు లేదు కమిషనర్(మరో వీధిలో): ఏమిటి తల్లీ...మీ కుటుంబానికి ఏ లోటూ లేదు కదా? షేక్ జైనాబీ: ఏం బాగా లేదు సార్.. సొంతిల్లు లేదు.. కనీసం జాగా లేదు, నిరుపేదలం.. మా ఆయన హోటల్లో పనిచేస్తారు. జీతం తినడానికే సరిపోవడం లేదు. వట్టి రమణమ్మ(వృద్ధురాలు): ఒక్క దానినే ఇంట్లో ఉంటున్నా బాబూ.. ఏ దిక్కూ లేదు.. పూరింటిలో ఉండలేకపోతన్నాను. కమిషనర్ : మీకు ఇళ్లు కట్టుకోవడానికి రుణాలు ఇప్పిస్తా.. దరఖాస్తు చేసుకోండి.. అంత్యోదయకు అర్హత ఉంటే సిఫారసు చేస్తా. కాలువలు లేక అవస్థలు కమిషనర్ : నమస్తే సత్యారావు గారూ.. ఏంటి సార్ మీ ప్రాంతంలో కష్టసుఖాలు మీరు చూస్తున్నారుగా.. ఏంటి విషయాలు.. కాలెపు సత్యారావు(పట్టణ ప్రముఖుడు): కమిషనర్ గారూ.. చాలా వీధుల్లో కాలువలు కట్టలేదు. పైపులైన్లు అమర్చలేదు. వీధుల్లో విచ్చలవిడిగా పశువులు, కుక్కలు సంచరిస్తున్నాయి. మీరే చూడాలి మరి.. కమిషనర్ : అందుకే సార్ మేం వచ్చింది.. ఈ సమస్యలన్నీ నమోదు చేసుకుని ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తా... ఎర్ర చెరువు బాగు చేస్తే మేలు కమిషనర్ : శ్రీనివాసరావు గారూ ఏదో చెప్పాలని చాలా ఆతృత పడుతున్నారు...ఏంటి విషయం? పి.శ్రీనివాసరావు: సార్...బొబ్బిలి రోడ్లో ఉన్న ఎర్ర చెరువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పట్టణానికి ల్యాండ్ మార్క్ అది. ఒకప్పుడు పట్టణమంతటికీ మంచి నీటి అవసరాలు తీర్చేది. గతంలో మంత్రిస్థాయి ప్రజాప్రతినిధులను కూడా ఎర్రచెరువు బాగుకు నిధులు కోరాం. ప్రయోజనం లేకపోయింది. కమిషనర్ : (ఎర్రచెరువు పరిశీలన అనంతరం) ప్రభుత్వ సహకారం తర్వాత చూద్దాం. ఎర్రచెరు వు బాగుకు స్వచ్ఛంద సంస్థల సహకారం కోరుతున్నాం. వారిస్పందన కోసం ఎదురుచూస్తున్నాం.. కోర్టు కేసులు పరిష్కరించాలి కమిషనర్ : రాజాంను పట్టిపీడిస్తున్న ముఖ్య సమస్య ఏమిటమ్మా? సిరిపురపు అనసూయమ్మ(మహిళా సంఘ నేత): రాజాం నగర పంచాయతీ ఎన్నికలు జరగడానికి వీలుగా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి పెద్దలు చొరవ చూపాలి. ప్రజాప్రతినిధులు లేక పనులు జరగడం లేదు. ప్రజలకు పాలకులు అందుబాటులో లేకపోతే ఆ బాధ చెప్పుకోలేనిది. పన్నుల భారం కూడా అధికంగా ఉంది. మీరు(కమిషనర్నుద్దేశించి) వ చ్చినప్పటి నుంచి అంతా బాగానే ఉంది. కాని కౌన్సిలర్లుంటే వారిని నిలదీయడానికి అవకాశముంటుంది. కమిషనర్ : సరేనమ్మా.. పెద్దలతో మాట్లాడుతా. ప్రభుత్వానికి నివేదిస్తా. కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు ఇంతకు మించి మనం మాట్లాడకూడదు... (అప్పుడే నగర పంచాయతీ డీఈఈ ప్రసాదరావు అక్కడకు వచ్చారు) కమిషనర్ : డీఈఈ గారూ.. మీ కోసమే ఎదురుచూస్తున్నాం. పట్టణంలో కాలువలు, సీసీ రహదారులు పూర్తిస్థాయిలో నిర్మించలేదని ప్రజలు అడుగుతున్నారు. మీ సమాధానమేమిటి? డీఈఈ : నిబంధనల ప్రకారం కాలువలు నిర్మిస్తున్నాం. ప్రజా సహకారం కూడా కావాలి. కాలువలు లేని చోట నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం కమిషనర్ గారు. కమిషనర్ : ఓకే.. థాంక్యూ వెరీమచ్ సార్ -
చెయ్యెత్తితే బస్సాగాలి
‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం వల్ల సాధారణ ప్రయూణికులు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకునే అవకాశం కలిగింది. వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తా. అలాగే వారి సౌకర్యం కోసం సేవలను విస్తృతం చేయడానికి తగిన కార్యాచరణ రూపొందిస్తాం. బస్సులను సకాలంలో తిప్పడానికి చర్యలు తీసుకుంటాం. మహిళలు, వృద్ధుల సీట్లలో వారే కూర్చునేలా కండక్టర్లకు తగిన ఆదేశాలు ఇస్తాం. బస్టాండ్లలోని దుకాణాల్లో ఎంఆర్పీకే ఆయా వస్తువులు విక్రయించేలా చూడాలని సంబంధిత డీఎంలకు కఠిన ఆదేశాలు జారీ చేశాం. టాయిలెట్స్, సైకిల్ స్టాండ్స్‌లో కూడా నిర్ణీత రుసుం వసూలు చేయకుంటే కాంట్రాక్టు రద్దు చేయడానికి వెనుకాడబోం. బస్సులను కండిషన్లో ఉంచడానికి.. ప్రయూణికులను ఎక్కించుకోవడానికి వారు ఎక్కడ చెయ్యి ఎత్తితే ఆక్కడ ఆపేలా కండక్టర్లకు సూచనలిస్తాం. ఆశ్రం వైద్య కళాశాల వద్ద బస్ షెల్టర్ నిర్మించడానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. రామారావు : ఏమండీ.. ఎక్కడికి వెళ్లాలి. బస్సు కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. విచారి : ద్వారకా తిరుమల వెళ్లాలి సార్.. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రామారావు : ఏమ్మా.. వృద్ధులకు సీనియర్ సిటిజన్ పాస్ సదుపాయం ఉంది. మీరు తీసుకున్నారా. సున్నం వర్ధనమ్మ : తీసుకున్నానయ్యా. రామారావు : ఏమ్మా.. బస్సులు ఆపుతున్నారా. వరలక్ష్మి : ఎక్కడ ఆపుతున్నార ండీ.. ఇప్పుడే చింతలపూడి బస్సు ఆపకుండా వెళ్లిపోయారు. బస్టాండులోనే ఇలా చేస్తే బయట ఎలా ఆపుతారో మీరే అర్థం చేసుకోండి. రామారావు : ఏమ్మా.. ఈ ఇద్దరి అబ్బాయిలకు వైకల్య సర్టిఫికెట్ ఉందా. పాసులు తీసుకున్నారా. నీలిమ : సర్టిఫికెట్లు ఉన్నాయ్ సార్. పాస్‌లు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాం. ఈ రోజు ఇస్తారు తీసుకోండని ఆర్ఎం చెప్పగా, ‘ఇందాకే పాస్‌లు ఇచ్చేచోటకు వెళితే లేవన్నారు సార్’ అని తెలిపింది. పక్కనే ఉన్న ఏలూరు డిపో మేనేజర్ టి.పెద్దిరాజు ‘ఎస్కార్ట్ పాస్‌లు అయిపోయాయి సార్. ఈ రోజు వస్తాయనుకున్నాం’ అని వివరణ ఇస్తుండగా.. కోటి రాజేంద్రప్రసాద్ అనే వృద్ధుడు అక్కడికి వచ్చి ‘వికలాంగుల వెంట వచ్చేవారికి పాస్‌లు ఇవ్వడం లేదు. మొన్న అడిగితే ఈ రోజు రమ్మన్నారు. ఈ రోజు వస్తే లేవంటున్నారు. ఇంకా ఏమన్నా అడిగితే కసురుకుంటున్నార’ని ఫిర్యాదు చేశారు. ‘ఈ రోజు కచ్చితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తా’నని భరోసా ఇచ్చిన రామారావు డీఎంను పిలిచి వెంటనే పాస్ జారీ చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి బస్టాండ్‌లోని దుకాణాల వద్దకు వెళ్లారు రామారావు : ఏమండీ.. ఇక్కడి దుకాణాల్లో ధరలెలా ఉన్నాయ్ అంబటి శర్వణ్ : చాలా దారుణంగా ఉన్నాయ్ సార్. ఈ ప్యాకెట్లు బయట రూ.10కి ఇస్తుండగా ఇక్కడ రూ.15 వసూలు చేస్తున్నారు. రామారావు : ఏమండీ.. టాయిలెట్లు ఎలా ఉన్నాయ్ జి.సాంబశివరావు : పరిశుభ్రత లేదు సార్. మరుగుదొడ్డి వినియోగానికి రూ.2 అని బోర్డులో ఉంటే అక్కడ రూ.5 వసూలు చేశారు. రామారావు : రిజర్వేషన్ కౌంటర్లో టిక్కెట్లు సమయానికి ఇస్తున్నారా ఎ.రామాంజనేయులు : ఇస్తున్నారు సార్. తిరుగు ప్రయాణ టికెట్టు ఇవ్వడానికి సమయం తీసుకుంటున్నారు. సైకిల్ స్టాండ్ వద్దకు వెళ్లిన ఆర్ఎం రామారావు అప్పుడే మోటార్ సైకిల్ తీసుకుని బయటకు వస్తున్న కె.సత్యనారాయణ అనే ప్రయాణికుడితో మాట్లాడుతూ ‘ఏమండీ.. సైకిల్ స్టాండ్‌లో వాహనాలకు నీడ ఉంటోందా.. ఎంత చార్జి వసూలు చేస్తున్నారు’ అని అడిగారు. కె.సత్యనారాయణ : ఎన్ని గంటలకు ఎంత వసూలు చేయాలో బోర్డు పెట్టలేదండీ. వాళ్లు ఎంత అడిగితే అంత ఇస్తున్నాం. అక్కడి నుండి పాత బస్టాండ్‌లో ప్రయూణికుల అవసరాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి పాలకొల్లు వెళ్లే బస్సులో ఆర్ఎం రామారావు ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులతో సంభాషణ ఇలా సాగింది. రామారావు : ఏమ్మా.. మా కండక్టర్ల ప్రవర్తన ఎలా ఉంటోంది. ఆర్.సుకన్య : మర్యాదగానే నడుచుకుంటున్నారు సార్. ఫుట్‌బోర్డుల మీద నిలబడే వారిని గదమాయించినా వారు పైకి రావడం లేదు. వీళ్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. వెనుక సీట్టో కూర్చున్న విద్యార్థితో ఆర్ఎం మాట్లాడుతూ ‘ఎక్కడికి వెళుతున్నారు’ అని అడిగారు. రావి రాజేష్ : కైకలూరు సార్. వట్లూరులోని మా కాలేజీ వద్ద చాలా బస్సులు ఆపడం లేదు సార్. రామారావు : ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఇతర జిల్లాల డిపో బస్సుల విషయంలో ఇది జరుగుతోంది. ఇతర రీజినల్ మేనేజర్లతో మాట్లాడాను. ఇకపై అటువంటి ఇబ్బంది ఉండదు. రామారావు : ఏమండీ.. బస్సులో సీట్లు కూర్చోడానికి అనుకూలంగా ఉంటున్నాయా నరసింహరావు : బాగానే ఉంటున్నాయండీ. కాకపోతే సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చుంటున్నారు. వృద్ధులు నిలబడినా వారి సీట్లు వారికి ఇవ్వడం లేదు. కండక్టర్లు ఆ సీట్లను ఖాళీ చేయించి వృద్ధులను కూర్చోబెట్టేలా చర్యలు తీసుకోండి. పాత బస్టాండ్‌లో దిగిన ఆర్ఎం ‘ఏమ్మా.. ఏమ్మా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయ్’ అని అడిగారు. కె.వెంకటరత్నం : ఇక్కడ దొంగల భయం ఎక్కువగా ఉంటోంది సార్. సెక్యూరిటీని పెంచాలి. తాడేపల్లిగూడెం బస్సులో ఎక్కిన ఆర్ఎం ఆశ్రం కాలేజీ వరకూ వెళ్లారు. రామారావు : డ్రైవర్ గారూ.. బస్సు కండిషన్ ఎలా ఉంది. బ్రేకులు సరిగా పడుతున్నాయా. ఆయిల్ వినియోగం ఎలా ఉంది. డ్రైవర్ రమేష్ : కండిషనలోనే ఉంది సార్. బ్రేకులు బాగున్నాయ్. కానీ.. ఆయిల్ మీటర్ పని చేయడం లేదు ఆశ్రం కాలేపీ స్టాప్ రావడంతో ఆర్ఎం బస్సు దిగారు. అక్కడ వేచి ఉన్న ప్రయూణికులతో మాట్లాడారు. రామారావు : ఇక్కడ బస్సులు ఆగుతున్నాయా జి.స్వర్ణశేఖర్ : ఎక్కువగా బైపాస్ సర్వీసులు కావడంతో దిగేవారు ఉంటేనే ఆపుతున్నారు. పైగా నిలబడటానికి షెల్టర్ కూడా లేకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడవాల్సి వస్తోంది. అక్కడే ఆటో వద్ద కొంతమంది మహిళలు వేచి ఉండటాన్ని గమనించిన ఆర్ఎం ‘ఏమ్మా.. ఎక్కడికి వెళ్లాలి’ అని అడిగారు. ‘కైకరం వెళ్లాల’ని వారు చెప్పారు. మరి ఆటో వద్ద నిలబడా ్డరేంటి, ఆర్టీసీ బస్సులో వెళ్లొచ్చుగా అని అడిగారు. దత్త సీతమ్మ : మా ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అందుకే ఆటో మాట్లాడుకుని వెళుతున్నాం. రామారావు : ఆటోలో ప్రయాణం ప్రమాదమని తెలుసా. ఆటో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయ్ కదా. సీతమ్మ : మాకు బస్సు సౌకర్యం లేకపోవడంతో తప్పని పరిస్థితిలో ఆటోలో వెళుతున్నాం. -
మాసూళ్లయినా..మోపెడు కష్టాలే
పంటను అమ్ముదామంటే.. మద్దతు, గిట్టుబాటు ధరల మాటటుంచి కొనే దిక్కే లేదు. సర్కారీ కొనుగోలు కేంద్రాలున్నా ఉపయోగం శూన్యం. ఖరీఫ్ మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ అన్నదాతల అవస్థలను ‘వీఐపీ రిపోర్టర్’ ద్వారా వెలుగులోకి తేవాలన్న ‘సాక్షి’ ఆలోచనను రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు ఆమోదించారు. శనివారం కె.గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన చేసిన ‘వీఐపీ రిపోర్టింగ్’ విశేషాలివి.. రైతుల మేలు, మేలుకొలుపులకు కృషి చేస్తా...రైతులతో ముఖాముఖి మాట్లాడటం వల్ల క్షేత్రస్థాయిలో మద్దతు ధర, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో సాధకబాధకాల వంటి సమస్యలు తెలుసుకున్నాను. వారికి వ్యవసాయశాఖాధికారులు సరైన అవగాహన కల్పించడం లేదని తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, చేస్తున్న సూచనలు ైరె తుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. పొలంబడిలో రైతులను చైతన్యం చేయాల్సి ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి పథకాన్నీ రైతులుసద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులువినియోగించుకుని మంచి ధర పొందేలా అన్ని స్థాయిల్లో అధికారులకు స్వయంగా తెలియచేస్తాను రిపోర్టర్ కె. సుబ్బారావు,ఆర్టీఓ,రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు : బాబూ నీ పేరేంటయ్యా...? రైతు : పర్వతిని సత్యన్నారాయణండీ.... ఆర్డీఓ : ఏంటీ వ్యవసాయం ఎలా ఉంది? ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? తొలకరికి ఎంత పండించావు? రైతు : ఏటా బాడి పిసుక్కుని పంట పండిస్తున్నా తగిన డబ్బులు రావటంలేదు. ఈసారి 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆర్డీఓ : 75 కేజీల బస్తా రేటు ఎంత ఉంది? రైతు : నెమ్ము 18 శాతం దాకా వస్తంటే మిల్లోళ్లు 15 శాతం ఉంటే గానీ కొనమంటున్నారు. ఇప్పటి దాకా ఊళ్లో గింజ కూడా కొనలేదండీ. ఆర్డీఓ : కూలీ డబ్బులు ఎలా ఇస్తున్నారు? రైతు: కుప్ప నూరుత్తున్నానాండీ.. సందేలకి కూలీలకి రూ.15 వేలు దాకా ఇయ్యాల. అక్కడో పదేలు, ఇక్కడో పదేలు తెత్తాను. ఆనక దాన్యం అమ్మాక సావుకారికి తీర్చాలంతే... ఆర్డీఓ : నీపేరేంటయ్యా? రైతు : తాడాల ఏడుకొండలండి. మూడెకరాలు ఏసి, పుత్తు పూస తాకట్టెట్టి పెట్టుబడి ఎట్టానండి. ఆ డబ్బులొత్తాయో లేదో తెలత్తాలేదండీ...? ఆర్డీఓ : తాతా నీ పేరేంటి? కూలి రేట్లు ఎలా ఉన్నాయి? రైతు : కొరమాటి సుబ్బారావండీ. వుప్పుడు సీజన్ కదాండీ మగాళ్లకు రూ.600 నుంచి రూ.700వరకు ఉంది బాబూ. ఆర్డీఓ : నీ పేరేంటి బాబూ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల గురించి తెలుసా? రైతు : దంగేటి సుర్యనారాయణండీ. మాకు పెబుత్వం పెట్టిన వాటి కాడికి దాన్యాన్ని పట్టికెళ్లటం చేనా కట్టం బాబూ. ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? ప్రభుత్వ సహకారం అందుతోందా? రైతు : అల్లూరి వీరవెంకట సత్యన్నారాయణండీ. ఏం పెబుత్వమండీ బాబూ.. సీజన్ అయిపోయినాక అప్పులు ఇత్తే ఏటి లాభం? ఆర్డీఓ : నీ పేరేంటి పెద్దయ్యా? నీవెంత చేను పండిస్తున్నావు? కీ ఇబ్బందులేంటి? రైతు : బోడపాటి అర్జునరావయ్యా. గింజలకు సరైన ధర అందటంలేదు. ఆర్డీఓ : కొనుగోలు కేంద్రాలున్నాయిగా? రైతు : ఆళ్లేమో 15 నెమ్ముండాలంటారు బాబూ. ఇయ్యేమో 18 నెమ్ముంటున్నాయి. ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? వెదజల్లే విధానం పాటిస్తున్నారా? రైతు : పర్వతిని సత్యన్నారాయణ సార్! 20 ఏళ్ల క్రితమే ఎదజల్లేనండీ. ఎద సాగు బానే ఉంటంది. ఈ ప్రాంతంలో రైతులు ఈ పద్దతే ఎక్కువగా రెండో పంటలో వేత్తున్నారు. ఆర్డీఓ : శ్రీవరి సాగు మీకు తెలుసా? వ్యవసాయాధికారులు ఏమైనా సూచనలిస్తున్నారా? రైతు : శ్రీవరి సాగు బానే ఉంటుంది గాని సారూ.. పెట్టుబడి ఎక్కువ. వ్యవసాయాధికారులు మా దగ్గరకు రారు సారూ! ఆర్డీఓ : నీ పేరేంటి? మీకు రుణాలు ఏమైనా ఇస్తున్నారా? పెట్టుబడులు ఎలా పెడుతున్నారు? రైతు : సత్యసాయి వెంకటరమణండీ. డిగ్రీ చదివి వ్యవసాయం చేస్తున్నా..అంత లాభసాటిగా లేదండి. ఆర్డీఓ : చదువుకున్నావు కదా.. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తున్నావా? రైతు : వ్యవసాయాధికారులు ఎప్పుడు మీటింగులు పెడుతున్నారో తెలియటం లేదు. ఆర్డీఓ : సేంద్రియ పద్ధతుల్ని ఎందుకు ఎంచుకోవటంలేదు? పొలంబడికి వెళుతున్నారా? రైతు: ఈ ప్రాంత రైతులకు దీనిపై ఇంకా అవగాహన లేదు. పొలంబడి ఎక్కడో ఒక చోట పెట్టి, అధికారులు వచ్చి వెళుతున్నారు తప్ప ఉపయోగంలేదు. ఆర్డీఓ : మీపేరేంటండీ? మీరెంత వ్యవసాయం చేస్తున్నారు? మీ ఇబ్బందులేంటి? రైతు : జానకిరామయ్యండీ. మూడెకరాలు చేస్తున్నాను. 80 బస్తాల వరకు పండినా కూలీలకే రూ.54 వేలు ఖర్చయ్యింది. ఆర్డీఓ : ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ఎందుకు వినియోగించుకోవటం లేదు? రైతు : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు మాకు ఖర్చవుతుంది. అదే మిల్లర్లయితే ఆ ఖర్చు వారే భరించి తీసుకెళతారండీ. ఆర్డీఓ : నీ పేరేమిటయ్యా? మద్దతు ధర లభిస్తోందా? రూ.1020, రూ.1060 వస్తున్నాయా? రైతు : నరసింహ మూర్తి అండీ. పెట్టుబడులు వస్తే చాలు.. గిట్టుబాటు ఎక్కడ వస్తుంది సారూ. అమ్ముదామంటే కొనేవాడే కనిపించడం లేదండీ. రూ.980, రూ.990 అంటున్నారు. అదీ 17 శాతం నెమ్ములున్నాయంటే ప్రతి ఒక్కశాతానికి కేజీ కటింగ్ పెడుతున్నారండీ. ఆర్డీఓ : నేనూ రైతు బిడ్డనే. మీ ఇబ్బందులన్నీ అర్థమయ్యాయి. అధికారులకు చెప్పి కొనుగోలు కేంద్రాలపై మీకు తెలియచేసే ఏర్పాటుచేస్తా. వ్యవసాయాధికారులు మీ దగ్గరకు వచ్చేలా ఆదేశాలు జారీచేస్తాను. సరే వెళ్లి రమ్మంటారా. రైతులు : మంచిది సారూ.. ప్రజెంటర్స్: - లక్కింశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన శ్రీనివాస్ ఫోటోలు : గరగ ప్రసాద్ -
వీఐపీ రిపోర్టర్ : కర్నూలు జేసీ కన్నబాబు
-
విఐపి రిపోర్టర్ - ఎమ్మెల్సీ గేయానంద్
-
వీఐపీ రిపోర్టర్ : ఆదిలాబాద్ కలెక్టర్ జగన్మోహన్
-
విఐపి రిపోర్టర్ - పాలకొండ ఎమ్మెల్యే కళావతి
-
విఐపి రిపోర్టర్ - పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-
విఐపి రిపోర్టర్ - సునీల్
-
మోడల్‌గా తీర్చిదిద్దుతా..
ఆసిఫాబాద్ : వారంతా ఆదిమ గిరిజన విద్యార్థులు. అందరూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వారే. బిడ్డలు దూరంగా ఉన్నా సరే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందుతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కొందరు అధికారుల పర్యవేక్షణ లోపం.. సిబ్బంది నిర్లక్ష్యం వెరసి గురుకుల పాఠశాలు, వసతిగృహాల్లో సమస్యలు తిష్టవేస్తున్నాయి. కొన్ని చోట్ల మెనూ కూడా అమలుకు నోచుకోవడం లేదు. విద్యార్థులు చదువులోనూ వెనుకబడుతున్నారు. వీటితోపాటు విద్యార్థుల సమస్యలనూ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ఐటీడీఏ ఇన్చార్జి పీవో, ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్ ‘వీఐపీ రిపోర్టర్’ గా మారారు. ఆసిఫాబాద్‌లోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, వార్డెన్ ఉంటే సమస్యలు చెప్పడానికి విద్యార్థులు భయపడుతారనే ఉద్దేశంతో వారిని బయటకు పంపించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సాధక, బాధకాలు తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. మెనూ అమలు తీరు, విద్యార్థుల బస, సిలబస్, బోధన, ఆరోగ్యం, క్రీడలు ఇలా అన్నింటినీ తెలుసుకున్నారు. విద్యార్థులతో కలెక్టర్ సంభాషణ ఇలా సాగింది.. సబ్ కలెక్టర్‌ను గమనించిన విద్యార్థులు : నమస్కారం సార్.. సబ్ కలెక్టర్ : నమస్కారం... అక్కడున్న ఓ విద్యార్థితో ఏ వూరు బాబు విద్యార్థి పాండు : శాకన్గోంది సబ్‌కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ : ఏ క్లాస్ విద్యార్థి పాండు : టెన్త్ సబ్‌కలెక్టర్ : చదువు ఎలా ఉంది, భోజనం సరిపోతుందా..? విద్యార్థి పాండు : బావుంది. సరిపోతుంది సబ్‌కలెక్టర్ : సాయంత్రం స్నాక్స్ ఏమి ఇస్తుండ్రు విద్యార్థి పాండు : పల్లిపట్టి సబ్ కలెక్టర్ : అందరికీ ఇస్తుండ్రా విద్యార్థి : ఇస్తుండ్రు సబ్ కలెక్టర్ : గుడ్లు ఎప్పుడు ఇస్తుండ్రు విద్యార్థి : ప్రతి రోజు సబ్ కలెక్టర్ : ఈ రోజు మెనూ ఏమి ఇచ్చిండ్రు, రాత్రి ఏమి ఇస్తుండ్రు విద్యార్థులు : బాగా తినాలి సబ్ కలెక్టర్ : ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా, టీచింగ్ ప్రాబ్లం ఉందా, టీచర్లు సరైన సమయానికి వస్తుండ్రా విద్యార్థి : సరైన సమాధానం చెప్పలేదు అక్కడే ఉన్న ఉపాధ్యాయులందరినీ, వార్డన్‌ను బయటకు వెళ్లాలని, ప్రిన్సిపాల్‌ను పిలవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. సబ్ కలెక్టర్ : ఇప్పుడు చెప్పండి, మీకు భయం లేదు. రెగ్యులర్‌గా క్లాసెస్ జరుగుతున్నాయా. విద్యార్థులు : జరుగుతున్నాయి. సబ్ కలెక్టర్ : ఉదయం ఎప్పుడు నిద్ర లేస్తున్నారు విద్యార్థులు : 5 గంటలకు.. సబ్ కలెక్టర్ : బ్రేక్‌ఫాస్ట్ ఏమి ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు.. విద్యార్థులు : కిచిడి, ఆలు ఉదయం 7.15 గంటలకు ఇస్తారు సబ్ కలెక్టర్ : ఉపాధ్యాయులు రైట్ టైమ్‌కు వస్తారా, అందరూ వస్తారా విద్యార్థులు : వస్తారు సబ్ కలెక్టర్ : స్కూల్‌కు ఎప్పుడు వెళ్తారు విద్యార్థులు : 9 గంటలకు వెళ్తాం సబ్ కలెక్టర్ : రాత్రి పడుకునేటప్పుడు చెద్దర్లు ఉన్నయా.. విద్యార్థి ఎం.మారుతి : ఉన్నాయి కానీ కరెంటు పోతే ఇబ్బందవుతుంది.. సబ్ కలెక్టర్ : నైట్ స్పెషల్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతయి విద్యార్థి ఎం.మారుతి : రాత్రి 7 గంటలకు సబ్ కలెక్టర్ : టీచర్లు, ప్రిన్సిపాల్ అందరు వస్తరా విద్యార్థి ఎం.మారుతి : వస్తరు సార్ - అదే సమయంలో ప్రిన్సిపాల్ రాజేశ్వరశర్మ వచ్చారు.. సబ్ కలెక్టర్ : ఉదయం విద్యార్థులకు పాలు ఇస్తుండ్రా ప్రిన్సిపాల్ : పాలు, టీ ఇస్తున్నాం సబ్ కలెక్టర్ : విద్యార్థులకు టీ బంద్ చేయాలి. పాలు ఇస్తేనే వారి హెల్త్ బాగుంటుంది. సబ్ కలెక్టర్ : ఉదయం ఏం టిఫిన్ ఇస్తరు విద్యార్థి ఎం.మారుతి : ఇడ్లి, పూరి సబ్ కలెక్టర్ : మధ్యాహ్నం ఎగ్స్ ఇస్తుండ్రా విద్యార్థి : ఇస్తుండ్రు సబ్ కలెక్టర్ : ఎంతమంది విద్యార్థులున్నారు.. ప్రిన్సిపాల్ : 500 మందికి ఈ రోజు 471 మంది ఉన్నారు. మరో విద్యార్థితో.. సబ్ కలెక్టర్ : టెన్త్‌లో పాసైతమని భరోసా ఉందా, మ్యాథ్స్ ఎవరు చెప్తారు.. విద్యార్థి ఉపేందర్ : ఉంది. మ్యాథ్స్ శ్యాంసార్ చెప్తారు. సబ్ కలెక్టర్ : ఎలా చెప్తాడు విద్యార్థులు : బాగా చెప్తాడు సబ్ కలెక్టర్ : మీరు ఏ సబ్జెక్ట్‌లో వీక్ విద్యార్థులు : ఇంగ్లిష్ సబ్ కలెక్టర్ : వాట్ ఈజ్ యువర్ నేమ్ విద్యార్థి : నరేశ్ సబ్ కలెక్టర్ : వాట్ ఈజ్ యువర్ హాబీ విద్యార్థి నరేశ్ : : రైటింగ్ సబ్ కలెక్టర్ : హాబీ అంటే ఖాళీ సమయంలో చేసే పని. ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం, సినిమా చూడడం కూడా హాబీయే. సబ్ కలెక్టర్ : హాస్టల్లో మీరు సంతోషంగా ఉన్నారా. కప్పుకునేందుకు రగ్గులున్నాయా, మీకు ఇంకా ఏం కావాలి విద్యార్థి మారుతి : రగ్గులున్నాయి సబ్ కలెక్టర్ : టాయిలెట్లు ఉన్నయా విద్యార్థి మారుతి : ఉన్నయి కానీ సరిపోతలేవు, వాటర్ప్రాబ్లం ఉంది. సబ్ కలెక్టర్ : ఈ విషయం మీ ప్రిన్సిపాల్‌కు చెప్పారా విద్యార్థి మారుతి : చెప్పాం. ప్రిన్సిపాల్ : టాయిలెట్లు మరమ్మతుకు డబ్బులు లేవు. స్కూల్ నుంచి వచ్చే ఫండ్స్ సరిపోవడం లేదు. సబ్ కలెక్టర్ : ఐటీడీఏ నుండి టాయిలెట్లు మరమ్మతు చేయిస్తా. సబ్ కలెక్టర్ : స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి విద్యార్థులు : చేస్తం సార్ సబ్ కలెక్టర్ : స్పెషల్ క్లాస్ ఎప్పుడు తీసుకుంటారు విద్యార్థులు : రాత్రి 7 నుండి 8 గంటల వరకు సబ్ కలెక్టర్ : నిన్న ఏమి ఇచ్చారు, హోంవర్క్ చేస్తున్నారా విద్యార్థులు : చేస్తున్నం సార్ సబ్ కలెక్టర్ : పరీక్షలు వస్తున్నయి కాబట్టి టైంటేబుల్ తయారు చేసుకోవాలి. ఈ యేడాది ఎస్ఎస్సీ పరీక్షల విధానం మారింది. చూచి రాసే అవకాశం లేదు. గదుల్లో సీసీ కెమెరాలు పెడ్తరు కాబట్టి కాపీ కొట్టే అవకాశం లేదు. మంచిగా చదవాలి విద్యార్థులు : సరే సార్ సబ్ కలెక్టర్ : మీకు తెలుసా నేను సబ్ కలెక్టరని విద్యార్థులు : తెలుసు సార్ పార్ట్ టైం ఉపాధ్యాయుల సమస్యలు అక్కడే ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయులు తమ గోడు సబ్ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. పార్ట్ టైం ఉపాధ్యాయులు : సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్నం. గతేడాది నెలకు రూ.ఏడున్నర వేలు ఇవ్వగా, ఈ యేడాది రూ.ఐదు వేలకు తగ్గించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే మేమే హైదరాబాద్, కరీంనగర్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నం. సబ్ కలెక్టర్ : ఇది నా చేతుల్లో లేదు. పాలసీ మ్యాటర్. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తా. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కదా.. మళ్లీ విద్యార్థులతో మాట్లాడుతూ.. సబ్ కలెక్టర్ : డాక్టర్లు వస్తున్నారా విద్యార్థులు : వస్తున్నారు. సబ్ కలెక్టర్ : మందులు ఏమి ఇస్తున్నరు వద్యార్థులు : జ్వరం ఉన్నవాళ్లకు టాబ్లెట్స్ ఇస్తుండ్రు. సబ్ కలెక్టర్ : మీ ఫ్రెండ్స్‌కు జ్వరం వస్తే వెంటనే ప్రిన్సిపాల్‌కు చెప్పాలి విద్యార్థులు : చెప్తం సార్ సబ్ కలెక్టర్ : స్కూల్లో గేమ్స్ ఆడిస్తరా, విద్యార్థులు : ఆడిస్తరు. సబ్ కలెక్టర్ : స్పోర్ట్స్ మెటీరియల్ ఉందా విద్యార్థులు : లేదు సబ్ కలెక్టర్ : నేను ప్రొవైడ్ చేస్తా అక్కడి నుండి కిచెన్‌కు వెళ్లి పరిశీలించారు. సబ్ కలెక్టర్ : కిచెన్ ఫ్లోరింగ్ సరిగా లేదు. ఏం ప్రాబ్లమ్ ప్రిన్సిపాల్ : ఫండ్స్ లేవు. సంవత్సరానికి రూ.4 వేలు వస్తయి. ఈయేడాది రాకపోతే నేనే రూ.10 వేలతో మరమ్మతులు చేయించా సబ్ కలెక్టర్ : ఏం పరవాలేదు. రెండు మూడు నెలల్లో మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేస్తా. సబ్ కలెక్టర్ : మోటార్ నడుస్తుందా ప్రిన్సిపాల్ : నడుస్తుంది సబ్ కలెక్టర్ : తాగడానికి ఏ నీరు వాడుతున్నారు విద్యార్థులు : ఆర్వో ప్లాంట్ ఉంది సార్ సబ్ కలెక్టర్ : సరిగా పని చేస్తుందా విద్యార్థులు : కొన్ని రోజులు పని చేయలేదు. ఇప్పుడు పని చేస్తుంది. ప్రిన్సిపాల్ : సార్ స్టాఫ్ క్వార్టర్స్ కూలిపోతున్నాయి. సబ్ కలెక్టర్ : ఎన్ని క్వార్టర్స్ ఉన్నయి ప్రిన్సిపాల్ : 16 క్వార్టర్లకు రెండు మాత్రమే బాగున్నయి. సబ్ కలెక్టర్ : ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే ఉంటే విద్యార్థులు బాగు పడతారు. ఉపాధ్యాయులు : విద్యార్థులకు షూస్ రాలేదు. సబ్ కలెక్టర్ : షూ కోసం ప్రాబ్లం లేదు. నేను ఇప్పిస్తా. -
సమస్యలే వారి సిరి
సిరికొండ.. పేరులోనే కొండను చేర్చుకున్న ఈ గిరిజన గ్రామం అక్కడి ప్రజల పాలిట సమస్యల గుదిబండగా మారింది. వెలగవాడ పంచాయతీ పరిధిలో, డివిజన్ కేంద్రమైన పాలకొండకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గ్రామం అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. ఇక్కడ అన్నీ సమస్యలే. తాగునీటికి నిత్యం తిప్పలే.. వీధి కాలువలు లేవు.. ఇళ్లు మంజూరు కావు.. పింఛన్లు అందవు... రేషన్ సరుకులు అందనే అందవు. అన్నింటికీ మించి గిరిజన గ్రామంగా అధికారిక గుర్తింపు లేదు. గ్రామంలో ఒక్కో కుటుంబానిది ఒక్కో దీనగాథ.. సమస్యలు పరిష్కరించేవారు కాదు కదా.. కనీసం తెలుసుకొని ఓదార్చేవారే కరువైన ఆ గ్రామాన్ని ఒక ప్రజాప్రతినిధి సందర్శించారు. ప్రతి ఇంటి తలుపు తట్టారు. సమస్యలు పరిశీలించారు. గిరిజనంతో మమేకమై వారు చెప్పినవన్నీ ఓపికగా విన్నారు. వారి తరఫున పోరాడతానని భరోసా ఇచ్చారు. ఆమె మరెవరో కాదు.. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి.. అందులోనూ ఎమ్మెల్యే హోదాలో కాకుండా ప్రజాసమస్యల పరిష్కార వేదికగా నిలిచిన ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా గ్రామమంతా కలియదిరిగారు. ఆ వివరాలు నేటి వీఐపీ రిపోర్టర్‌లో.. కళావతి : ఏం బాబు నీరు పేరేంటి.. ఎలా ఉన్నారు?... రామారావు : ఏం చెప్పమంటారు. నా పేరు ఆరిక రామారావు. వార్డు సభ్యునిగా ఉన్నాను. మా గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలో చేర్చకపోవడంతో గిరిజనులకు అందాల్సిన సౌకర్యాలు పొందలేకపోతున్నాం. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. నోటిఫైడ్ ఏరియాలో ఈ గ్రామాన్ని కలపాలని ఇప్పుడూ కోరుతున్నాం. కళావతి : ఏయే సౌకర్యాలు అందడం లేదు... రామారావు : ఏ అభివృద్ధి జరగడం లేదు. కాలువల నిర్మాణం, సీసీ రహదారుల నిర్మాణం లేదు. విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేదు. కనీసం పాఠశాల భవనం కూడా మంజూరు చేయలేదు. పిల్లలు చదువులు మానేసి ఇంటిలోనే ఉంటున్నారు. వృద్ధుడి పింఛను కష్టాలు కళావతి(వృద్ధుడితో) : ఏం తాత ఇంకేటి సంగతులు?... పట్టయ్య : ఏం సెప్పనమ్మ.. రోడ్డు పుట్టనప్పుడు పుట్టినాను.. నాకు 45 సంవచ్చరాలంటూ పింఛను నిలిపేనారమ్మా... కళావతి : నీ వయసు ఎంత అంటావ్...? పట్టయ్య : నాను రాసుకోనేదమ్మా...కాకపోతే ఈ ఊరు వెలవకముందే పుట్టినాను. 95 సంవచ్చరాలు దాటి ఉంటాయని తెలుసు. కళావతి: పింఛను ఎందుకు తొలగించారో అడగలేదా...? పట్టయ్య : అడిగినానమ్మా...నాకు 45 సంవచ్చరాలేనని, కార్డులో రాసుకున్నారటమ్మా.. అందుకని పింఛను మరి ఇవ్వమని పెసిరెంటు బాబూ సెప్పినారు. సమస్యలపై ఆరా కళావతి : రేషన్‌కార్డులు అందరికీ ఉన్నాయా...? ఊయక చిన్నమ్మి: ముందు కార్డులు ఉండేవి. మా ఇంట్లో పిల్లలతో కలిసి నలుగురున్నాం. పోయిన నెలలో రేషన్ సరుకులు ఇవ్వనేదు. అడిగితే కార్డు పోయిందని చెప్పి నాలుగు కేజీలు ఈ నెలలో ఇచ్చినారు. కళావతి : కార్డు విషయమై ఎవరిని అడిగారు... చిన్నమ్మి: నాయుడు బాబు వద్దకు మూడుసార్లు ఎల్లినాను. మీ కార్డు పోయిందన్నారు. కొత్త కార్డు వచ్చేవరకు మేమేమీ సేయలేమన్నారు. కళావతి : గ్రామంలో తాగునీరు ఉందా?...కూలి పనులు దొరుకుతున్నాయా??.. చిన్నమ్మి: బోరు ఉన్నాది. అయితే నీరు సేదుగా ఉంటాది. కొండపై నుంచి వచ్చిన ఊట నీరు పట్టుకుని తాగుతున్నాం. జబ్బులు, జొరాలు తప్పడం లేదు. గ్రామానికి ఉపాధి పనులు తీసేసినారు. కళావతి : ఉపాధి పనులు లేవని ఎవరన్నారు?.. చిన్నమ్మి: కిందటి సంవచ్చరం పనులకు ఎల్లాం. వారానికి 500 నుంచి 600 రూపాయలు వచ్చేది. ఈ ఏడాది పనులు ఇయ్యాలని ఫీల్డ్ ఆపీసర్‌ను అడిగాం. గ్రామానికి ఉపాధి పనులు తీసేసినారని సెప్పారు. కళావతి : మరి ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు...? చిన్నమ్మి: కొండపెకైల్లి కట్టెలు తీసుకొచ్చి పాలకొండలో అమ్ముతున్నాం. రోజుకు 40 నుంచి 50 రూపాయలు వస్తే సంతలో సరుకులు, బియ్యం కనుక్కొని జీవిస్తున్నాం. పొదుపు సొమ్ము లాక్కున్నారు కళావతి : డ్వాక్రా సంఘాలు ఎలా నడుస్తున్నాయి? గౌరి : గ్రామంలో రెండు సంఘాలున్నాయి. రుణమాఫీ చేస్తామనడంతో అప్పు తీరుతాదని కట్టడం మానేసినాం. దీంతో బ్యాంకోళ్లు ఇంతవరకు మేం పొదుపు డబ్బు తీసుకున్నారు. కళావతి : డబ్బులు ఎందుకు తీసుకున్నారని అడగలేదా? గౌరి :బ్యాంకు పుస్తకంలో డబ్బులు లేకపోవడంతో బ్యాంకు వారిని అడిగాం. అప్పు కింద జమ సేసుకున్నామన్నారు. రుణ మాఫీ అయితే మా పరిస్థితి ఏమిటని అడిగితే ఇప్పట్లో మాఫీ రాదు, మీరు తీసుకున్న అప్పు చెల్లించకపోతే పోలీసు చర్యలు చేపడతామని బెదిరించినారు. కళావతి : గ్రామంలో పాఠశాల ఉందా. ఎంతమంది చదువుతున్నారు? బంగారమ్మ: ఊరిలో బడి ఉండేదమ్మా. పూర్తిగా పడిపోనాది. అప్పట్లో 20 మంది పిల్లలు సదివేవారు. ఇప్పుడు భవనం లేకపోవడంతో అటవీశాఖ భవనంలో చదువు సెబుతున్నారు. బడి లేకపోవడంతో పిల్లలు మాతో పాటు కొండ పనులకు వస్తున్నారు. పార్టీ మారితేనే సౌకర్యాలంట! కళావతి : ఈ సమస్యలపై ఎవరిని ఇంతవరకు అడగలేదా? కాంతారావు:ఇంతవరకు అధికారులు గానీ, నాయకులు గానీ రాలేదు. ఇప్పుడు మీరొచ్చారు. అందుకే తాగునీరు, కరెంట్, బడి, కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కళావతి : మీరెళ్లి ఎవరినీ కలవలేదా?... కాంతారావు:పాలకొండ ఎల్లాం. పింఛన్లు ఆపేశారని నాయకులను అడిగాం. పార్టీ మారితేనే పింఛన్లు వత్తాయని సెప్పారు. కళావతి : మీరు ఏ పార్టీలో ఉన్నారు...ఏ పార్టీలోకి మారమన్నారు? కాంతారావు: మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. తెలుగుదేశంలోకి వస్తేనే రేషన్‌కార్డులు, పింఛన్లు వత్తాయని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. కళావతి : ఇళ్లు సగం గోడలతో ఎందుకు కనిపిస్తున్నాయి? కొండగొర్రె లక్ష్మణరావు: ఇందిరమ్మ గృహాలు ఇచ్చారు. కిందటేడు ఇళ్లు కట్టాం. 27 వేల రూపాయల బిల్లు ఇచ్చారు. మేము కూలి పనులు చేసుకుంటూ మరికొంత డబ్బు వేసి శ్లాబు వరకు కట్టాం. ఇప్పుడు బిల్లులు ఆపేశారు. కళావతి : ఫోటోలు తీయడానికి ఎవరైనా వచ్చారా? లక్ష్మణరావు: ఎవరూ రాలేదు. బిల్లులు అడిగితే తర్వాత ఇస్తామన్నారు. నెలలు దాటిపోతున్నా డబ్బులు అందకపోవడంతో పూరిపాకలోనే ఉంటున్నాం. కళావతి : ఇంకా ఎంత బిల్లు రావాలి? లక్ష్మణరావు: ఇంకా ఒక్కొక్కరికి రూ.60 వేలు చొప్పున బిల్లులు అందాల్సి ఉంది. ఇది చెల్లిస్తేనే శ్లాబులు వేసుకొని గుడిసెలను ఖాళీ చేయగలం. -
పరిష్కారం చూపుతూ ...ప్రశ్నిస్త్తూ....
జిల్లా కేంద్రంలోని మూడు రైతుబజార్లతో పాటు పార్వతీపురం రైతుబజార్లో సమస్యలను పరిష్కరిస్తాను, రైతులు మాత్రమే అమ్మేలా దళారులు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటాను. విజయనగరం పట్నంలో ఉన్న మూడు రైతుబజార్లలో కేవలం ఆర్అండ్బీ రైతుబజార్లో కాస్త సౌకర్యాలున్నా మిగతా రెండు రైతుబజార్లలో అసౌకర్యాలున్నాయని గుర్తించాను. అన్ని రైతుబజార్లలో బహిరంగ మార్కెట్ ధరల కన్నా 25 శాతం తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకుంటాను. మరుగుదొడ్లు నిర్మించి, రూఫ్‌లకు మరమ్మతులు చేయిస్తాం. అన్ని కౌంటర్లూ కూరగాయల వ్యాపారులతో నిండేలా దాసన్నపేట రైతుబజార్‌ను తీర్చిదిద్దుతాను. రూ.40 లక్షలతో రైతుబజార్లను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటాం. వీఐపీ రిపోర్టింగ్‌లో తెలుసుకున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ రైతు బజారు అది. అప్పటికే రైతులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. కూరగాయలను ఎంచుకోవడంలో కొనుగోలుదారులు బిజీగా ఉన్నారు. తూకం వేస్తూ...డబ్బులందుకుంటూ ైరైతులూ అంతే బిజీగా ఉన్నారు. ఇంతలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అకస్మాత్తుగా అక్కడకి జాయింట్ కలెక్టర్ రామారావు తన వాహనంలో వచ్చారు. రైతులను పేరుపేరున పలకరించారు. కొనుగోలు దారులతో మాట్లాడారు. రైతుబజార్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సమస్యలేమైనా ఉన్నాయి? సౌకర్యాలున్నాయా ? లేదా ? అని తెలుసు కోడానికి సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలెలా అమ్ముకుంటున్నారని రైతులను, నిత్యం వచ్చి కూరగాయలు, బియ్యం, కొనుగోలు చేస్తున్న వినియోగదారులను సమస్యలపై ప్రశ్నించారు. కొన్నింటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. జేసీ : నమస్కారమండీ! నా పేరు రామారావు, నేను జాయింట్ కలెక్టర్‌ను. ఇక్కడ మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను.మీ పేరేమిటి? ఏ ఊరు? రైతు : నాపేరు సీత బాబు. మాది బొండపల్లి మండలం నెలివాడ గ్రామం. జేసీ : ఏం పండిస్తారు? సొంత భూమేనా? సీతబాబు: నేను కౌలుకు పొలం తీసుకున్నాను. వంకాయలు, బీరకాయలు పండిస్తాను. జేసీ : మీకు లాభసాటిగా ఉందా? సీతబాబు: లాభసాటిగా ఉందండి. జేసీ : బోర్డు మీద ధరకే విక్రయిస్తున్నారా? ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారా? సీతబాబు: బోర్డుమీద ధరకే విక్రయిస్తున్నాం. ఎక్కువ ధరలకు విక్రయించడం లేదు. జేసీ : మీ పేరు? (వినియోగదారునితో) వినియోగదారు: నా పేరు కృష్ణారావు రిటైర్డు ఉద్యోగిని జేసీ : ఇక్కడి రైతుబజార్లో సమస్యలేమైనా ఉన్నాయా? కృష్ణారావు: షెడ్లు పాడయిపోవడం వల్ల ఇబ్బందిపడుతున్నాం. వర్షం వస్తే కారిపోతోంది. బజారంతా మురుగునీరు నిల్వుంటోంది. ఎండ వేడిమి భరించలేక ఇబ్బంది పడుతున్నాం. జేసీ : రైతుబజార్లో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. అవి రాగానే బాగు చేయిస్తాం. తుపాను ధాటికి పాడైపోవడంతో రూ.పది లక్షలు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచాం. వెంటనే బాగు చేయిస్తాం. జేసీ : నీ పేరేమిటమ్మా? మహిళ: నా పేరు కొండమ్మ. మాది గెద్దపేట. జేసీ : కూరగాయలు విక్రయిస్తే రోజుకు మీకు ఎంత వస్తుంది? కొండమ్మ: నాకు రోజుకు రెండు వందలు మిగులుతాయి. జేసీ : అంతేనా? ఎక్కువ వస్తుందా? చెప్పమ్మా! కొండమ్మ: అంతేనండీ రెండొందలు వస్తాయి. జేసీ : సబ్సిడీపై విత్తనాలు వస్తున్నాయా? కొండమ్మ: ఇస్తున్నారండీ! ఆ విత్తనాలతోనే పండిస్తున్నాం. జేసీ : మీ పేరేంటి? వినియోగదారుడు: నా పేరు వెంకటరావు, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిని. జేసీ : ఇక్కడ కూరగాయలు సరైనధరలకే లభిస్తున్నాయా? వెంకటరావు: సరైన ధరలకే లభిస్తున్నాయండీ! ఇక్కడ రైతు బజార్లో లాగే మిగతా రైతుబజార్లో కూడా విక్రయాలు చేపడితే బాగుంటుంది. వ్యాపారులు కాకుండా రైతులే అమ్మేలా చర్యలు తీసుకోవాలి. జేసీ : అలాగే చర్యలు తీసుకుంటాం. బియ్యం, ఉల్లి, పంచదార కూడా విక్రయిస్తున్నారు. కొనుగోలు చేయండి. జేసీ : నీ పేరంటమ్మా! మహిళారైతు: నాపేరు కెల్ల పైడమ్మ, మాది కెల్ల గ్రామం. జేసీ : ఏమేం పండిస్తారు? పైడమ్మ: ఆనపకాయలు, బెండకాయలు పండిస్తాం. క్యాబేజీ కొనుగోలు చేసి లాభానికి అమ్ముతుంటాం. జేసీ : నీకు రోజుకు ఎంత మిగులుతుంది? పైడమ్మ: రద్దులు ఎక్కువగా ఉంటే ఏమీ మిగలదండీ! జేసీ : ఇలా అమ్ముకోవడం వల్ల ఏమయినా సంపాదిస్తున్నావా? పైడమ్మ: సంపాదనంటే అలాగేనండీ! రోజుకు రెండు వందలు కన్నా ఎక్కువ రాదండీ! జేసీ :నీపేరు? మహిళా రైతు: నా పేరు తాళ్లపూడి చిన్నమ్మి. మాది అంబటి వలస. జేసీ : నీ వ్యాపారం ఎలా ఉందమ్మా? చిన్నమ్మి: వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయయ్యా! కట్టంగా ఉంది..... జేసీ : అలా కాదు. నీకు లాభం వస్తుందా లేదా ? చిన్నమ్మి: ఎక్కువ రాదండీ! మార్కెట్లో విక్రయిస్తే నాలుగు వందల వరకూ మిగులుతుంది. ఇక్కడ విక్రయించడం వల్ల రోజుకు రెండు వందలే మిగులుతుంది. జేసీ : మీకు ఉద్యాన వన శాఖ అధికారులు వచ్చి సలహాలు, సూచనలూ ఇస్తున్నారా? చిన్నమ్మి: ఇస్తున్నారు.బాబూ! జేసీ : మీ పేరు? వినియోగదారు: నా పేరు ఎస్ రామరాజు, రిటైర్డు కానిస్టేబుల్ని. జేసీ : చెప్పండి ఇక్కడి రైతుబజార్ ఎలా ఉంది? రామరాజు: బాగానే ఉందండీ! కాకపోతే బయట చాలా ట్రాఫిక్ ఇబ్బందులున్నాయి. వాటిని పరిష్కరించాలి. జేసీ : చర్యలు తీసుకుంటాం. జేసీ : మీ పేరు? వినియోగదారు: నా పేరు రామకృష్ణ, స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాను. జేసీ : చెప్పండి! ఇక్కడెలా ఉంది? రామకృష్ణ: ఇక్కడి రైతుబజార్లో సరైన ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇతర బజార్లలో కూడా ఇలానే అమ్మేలా చర్యలు తీసుకోండి. జేసీ : అలాగే! అన్ని ప్రాంతాలకూ మా సిబ్బందిని పంపిస్తాం. చర్యలు తీసుకుంటాం. జేసీ : నీ పేరేమిటి? వ్యాపారి: నా పేరు యామలి శ్రీనివాస రావు! జేసీ :చెప్పండి! మీకు బాగా లాభాలు వస్తున్నాయా? శ్రీనివాసరావు: రోజుకు రెండు వందలు వస్తుందండీ! జేసీ : అంతేనా? శ్రీనివాసరావు: అంతేనండీ ఎక్కువేం రాదు. జేసీ : నువ్వు యువత తరఫున షాపు పెట్టావా? శ్రీనివాసరావు: ఓ సంస్థ ద్వారా ఇక్కడ చేరాను. జేసీ : నీ పేరేంటి ? రైతు : నా పేరు గెద్ద రమణమ్మ, మాది గెద్దపేట. జేసీ : రోజుకు ఎంత వస్తుంది. రమణమ్మ: రోజుకు రెండు నుంచి మూడు వందలు వస్తుంది. జేసీ : నీకు ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయా? పొదుపు చేసుకుంటున్నారా? రమణమ్మ: ఉపయోగపడుతున్నాయి. ఆ డబ్బులతో ఏం పొదుపు చేస్తామండీ! జేసీ : నీ పేరంటయ్యా? రైతు: నా పేరు కోన సోములండీ! మాది నెలివాడ. జేసీ : చెప్పు ఎలా ఉంది? ఎంత వస్తుంది. సోములు: మాకు ఎక్కడిదక్కడే సరిపోతుందండీ! ఎక్కువగా మిగిలే పరిస్థితి లేదు. ఇటీవల వర్షాలతో పంటలు పోయాయి. ఇబ్బందే పడుతున్నాం. ఇక్కడ విక్రయిస్తే కష్టంగా ఉంది. జేసీ : మరి బయట అమ్ముకోలేకపోయావా? సోములు: లేదు లెండి ఇక్కడే బాగుంది. జేసీ : మీ పేరు? ఏ ఊరు మీది ? వినియోగదారు: మాది ఢిల్లీ. నా పేరు విశ్వేశ్వరరావు. బంధువులింటికి వచ్చాను. జేసీ : చెప్పండి! మీకు రైతుబజారు ఎలా అనిపిస్తోంది. విశ్వేశ్వరరావు: ఇక్కడ చాలా బాగుంది. మాకు ఇలా ఉండదు. అక్కడ కూడా ఇలా ఏర్పాటు చేయాలని కోరతా! జేసీ : మీరు రోజూ వస్తారా? ఏం పేరు? వినియోగదారు: నా పేరు రామారావు. జేసీ : ఎలా ఉందీ రైతుబజార్? రామారావు: మేం వాడిపోయిన కూరలూ, తాజా కూరలూ ఒకే ధరకు కొనాల్సి వస్తోంది. ఇబ్బందులు పడుతున్నాం. జేసీ : అలా ఎందుకు? కాస్త తాజా తగ్గితే కిలో వద్ద రూపాయి చొప్పున తగ్గించండి! సరేనా... ఇక నుంచి ఈ పద్ధతి అమలు చేయండి.(ఎస్టేట్ ఆఫీసర్ సతీష్‌తో) జేసీ : మీ పేరేంటి? వినియోగదారు: నా పేరు వెంకటరావు. జేసీ : చెప్పండి? ఇక్కడెలా ఉంది? రామారావు: ఇక్కడ వాడిన కూరగాయల వ్యర్థాలు పడేస్తున్నారు. ధరలు బాగానే ఉన్నా, దుర్వాసన వస్తే బాగుండదు కదా! ఆ సమస్య పరిష్కరించాలి. జేసీ : చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలన్నీ బయట పడేసే చర్యలు తీసుకోండి(అధికారులకు ఆదేశం) జేసీ : మీరు కొనుగోలు చేస్తున్న కూరగాయలు బానే ఉంటున్నాయా? జోస్యుల ప్రసాదరావు: ఇతర బజార్లలో కూరగాయలు ఫ్రెష్‌గా ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం సెకండ్స్లా వాడిపోయి ఉంటున్నాయి. ధర మాత్రం ఒకటే! ఇలా ఎందుకు? కచ్చితంగా వాడిపోయినట్టే కనిపిస్తున్నాయి. చూడండి! జేసీ : అట్లానా! చర్యలు తీసుకుంటాం.అన్ని కౌంటర్లలో తాజా కూరగాయలు విక్రయించేలా రేపటి నుంచి చర్యలు తీసుకోండి(ఏడీ మార్కెటింగ్ శ్రీనివాసరావుకు ఆదేశం) జేసీ : ఏమ్మా! మీదే ప్రాంతం. ఇక్కడ పంచదార విక్రయాలు బాగానే ఉన్నాయా? ఎస్ భాగ్యరాణి: మాది వివేకానంద కాలనీ అండీ! పంచదార బయట మార్కెట్లో 40 రూపాయల వరకూ పలుకుతుంది. ఇక్కడ 34 రూపాయలకే ఇస్తున్నారు. ఇది కాస్త సౌకర్యంగా ఉంది. -
అండగా ఉంటా..
గుంటూరు నగరాన్ని అందంగా...ఆహ్లాదంగా ఉంచటంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో ఉంటుంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలోనూ వారి శ్రమ గుర్తించదగినదే...వారంతా ఒక్కరోజు పనులకు బ్రేక్ ఇస్తే నగర సొగసు ఊహించలేం...క్షణం కూడా నగర గాలి పీల్చలేం. రోడ్లు, వీధులు, చివరకు ఇళ్ల ముందు సైతం పెట్టని కోటల్లా చెత్తా చెదారం టన్నులకొద్దీ పేరుకుపోయి దుర్గంధం దిగంతాలను తాకుతుంది. నిత్యం చెత్త ఎత్తుతూ, డ్రైనేజీలను శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులను వెలుగులోకి తెచ్చేందుకు ‘సాక్షి' సంకల్పించింది. వారి పరిస్థితిని ప్రజల మనిషిగా, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధికి బాగా అర్థమవుతోంది. అందుకే ‘సాక్షి' తన సంకల్పాన్ని సాకారం చేసే బాధ్యతను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫాకు అప్పగించింది. ‘వీఐపీ రిపోర్టర్’గా గుంటూరులోని పారిశుద్ధ్య కార్మికుల జీవన స్థితిగతులపై ఆరా తీయించింది. రిపోర్టర్‌గా ఎమ్మెల్యే ఈ కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. వారు నివసించే ఆనందపేట రెండవ లైన్‌కు వెళ్లారు. కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. వారి బాధలు సావధానంగా విన్నారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు ఉంటున్న ఆనందపేటలో కమ్యూనిటీ హాలు నిర్మించేందుకు కృషి చేస్తా. కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి యూనిఫాం, సబ్బులు, కొబ్బరినూనె, బూట్లు ఇప్పించేలా చర్యలు చేపడతా. ఇంటి పన్నులు కట్టించుకుని కుళాయి వేయించేలా కృషి చేస్తా. కాలనీలో మౌలిక సదుపా యాలను కల్పిస్తా. కార్మికులకు ప్రమాద బీమా అందించేందుకు చర్యలు చేపడతా. కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యల కోసం పోరాడతా. - ఎమ్మెల్యే ముస్తఫా మొహమ్మద్ ముస్తఫా : నమస్తే, నా పేరు షేక్ మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేని. మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా? ఏంటి మీ సమస్యలు ? వెంకటరమణ : నమస్కారం సారూ... మేము ఊరంతా శుభ్రం చేస్తున్నా.. మా కాలనీలను పట్టించుకునే వారే లేరు. కనీస సౌకర్యాలు లేవు. ఎవరైనా చనిపోతే దహనసంస్కారాలు చేసేందుకు జాగా కూడా లేదు. కనీసం మీరైనా స్పందించి మా సమస్యలు తీర్చండి సారూ.. నూకమ్మ : అయ్యా.. ఎప్పటి నుంచో ఈ కాలనీలో ఉంటున్నాం. ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు. కనీసం పన్ను కూడా కట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ క్వార్టర్స్‌లోనే ఉంటున్నాం. అవికూడా బాగోలేదు. కనీసం మరుగుదొడ్లు లేవు. శుభకార్యాల కోసం మాకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించండయ్యా... మొహమ్మద్ ముస్తఫా : జీతాలు వస్తున్నాయా? దుర్గాభవాని : నెలంతా కష్టపడితే రూ. 6 వేలు వస్తాయి. సెలవు పెడితే కోత పెడుతున్నారు. అవి కూడా సక్రమంగా రావడంలేదు. నెల దాటి 20 రోజులు గడిస్తేగానీ జీతం రావడంలేదు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. మొహమ్మద్ ముస్తఫా: మీకు ఈఎస్ఐ కార్డులు జారీ చేశారా..? వైద్య సేవలు అందుతున్నాయా ? సత్యవతి: కార్డులు ఇంతవరకూ ఇవ్వలేదు. కార్డులే లేకుండా వైద్యం ఎట్లా..మా జీవితాలు దుర్భరంగా మారాయి. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మొహమ్మద్ ముస్తఫా : యూనిఫాం, స్టేషనరీ ఇస్తున్నారా ? బంగారు పార్వతి : కార్పొరేషన్ అధికారులు మా సమస్యలు పట్టించుకోవడం లేదు. యూనిఫాం మూడేళ్లుగా ఇవ్వలేదు. మురుగు కాల్వల్లో చెప్పులు లేకుండా దిగితే మే కులు దిగి సెప్టిక్అవుతుంది. బూట్లు మాటే ఎత్తడం లేదు. మొహమ్మద్ ముస్తఫా : కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీపై అధికారులు ఏమంటున్నారు? బండి దుర్గమ్మ : ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాయకులు, అధికారులు మమ్మల్ని పర్మనెంట్ చేస్తామంటున్నారు. ఎవరూ ఏమీ చేయడం లేదు. 14 ఏళ్లుగా కాంట్రాక్టు పైనే ఉన్నాం. మొహమ్మద్ ముస్తఫా ః మీకు ఇవ్వాల్సిన వస్తువులను కార్పొరేషన్ అధికారులు అందిస్తున్నారా? భజంత్రీ ఈశ్వరమ్మ : రోజూ మురుగులో తిరిగే మాకు చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనె, వంటివి అందించాలి సార్..కానీ అధికారులు ఏ ఒక్కటీ ఇవ్వడం లేదు. మా జీతం డబ్బుతో మేమే కొనుక్కుంటున్నాం. ఎప్పుడో ఎంఎం నాయక్ కమిషనర్‌గా ఉన్నప్పుడు బట్టలు, చెప్పులు, కొబ్బరినూనె ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన కమిషనర్లు మా గోడు పట్టించుకోవడం లేదు. మొహమ్మద్ ముస్తఫా : మీ సమస్యలు కమిషన్‌కు చెప్పారా? రౌతు వెంకటరమణ : మేడమ్ గారితో నేరుగా మాట్లాడలేదు. మా యూనియన్ నాయకులు ఆమెతో అనేక సార్లు సమస్యల గురించి చెప్పినా తిరిగి ఏమీ చెప్పలేదు. జీతాలు పెంచాలని ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. ఇంత వరకూ పర్మనెంట్ చేయలేదు. మొహమ్మద్ ముస్తఫా : కార్పొరేషన్ తరఫున మీకు ప్రమాద బీమా కల్పించారా..? అరుణకుమారి : అసలు అదంటే ఏమిటో కూడా మాకు తెలియదయ్యా. అధికారులకు మాగోడు పట్టదయ్యా. అసలు మాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు. మా కనీస అవసరాలైనా తీర్చేలా చూడండి. ఎవరికైనా ప్రమాదం జరిగితే పట్టించుకోరు. అసలు అధికారులు ఎవరూ రారు. మొహమ్మద్ ముస్తఫా : మీ పిల్లల సంక్షేమానికి కార్పొరేషన్ ఏమైనా చేస్తోందా? శ్రీను : అధికారులకు మా గురించే పట్టించుకునే తీరిక లేదు. ఇక మా పిల్లల సంక్షేమం గురించి వాళ్లేం చేత్తారయ్యా.. మొహమ్మద్ ముస్తఫా : వీరి జీవితాలు ఏం చేస్తే బాగుపడతాయో కార్మిక నాయకుడిగా మీరు చెప్పగలరా..? కార్మిక నాయకుడు రవి: జీతాలు పెంచుతామని హామీలు ఇవ్వడం తప్ప అధికారులు వీరి గురించి పట్టించుకోవడం లేదు. పారిశుధ్య కార్మికుల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పించడం ద్వారా వారి జీవన విధానంలో మార్పు తేవచ్చు. నగరంలో 12 కాలనీల్లో పారిశుధ్య కార్మికులు జీవిస్తున్నారు. వీరికి పక్కా ఇళ్ళు కట్టించాలి. కాలనీల్లో రోడ్లు, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలి. ఎస్సీల కాలనీలపై అధికారులు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. కార్మికుడి ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే... భజంత్రి సాంబశివరావు అనే కార్మికుడి ఇంట్లోకి ఎమ్మెల్యే ముస్తఫా వెళ్లి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇంత చిన్న ఇంట్లో ఎంత మంది ఉం టున్నారని వారిని ప్రశ్నించారు. సాంబశివరావు మాట్లాడుతూ ‘ఈ ఇంట్లో ఆరుగురుం ఉంటున్నాం సార్. పెపైచ్చులు ఊడిపోయాయి.’ వర్షం వస్తే ఎలా అని ఎమ్మెల్యే ప్రశ్నించగా ‘వర్షాకాలంలో ఎక్కడో ఓ చోట తలదాచుకోవడమేనని, మొత్తం మూడు కుటుంబాలు ఈ ఇంట్లోనే ఉంటున్నా’యని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇప్పించి ఆదుకోవాలని,పిల్లలను బడికి కూడా పంపలేకపోతున్నామన్నారు. మీ కష్టాలు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తామని ముస్తఫా హామీ ఇచ్చి వెనుదిరిగారు. ట్రాన్స్‌కో డీఈకి ఫోన్... ఆనందపేటలోని పారిశుద్ధ్య కార్మికుల ఇళ్లకు విద్యుత్ మీటర్లు ఇవ్వకపోవడం గురించి ఎమ్మెల్యే ముస్తఫా ట్రాన్స్‌కో డీఈ విజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన డీఈ ఆనందపేటలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అక్కడి నుంచి ఆనందపేట మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహరీగోడ నిర్మించాలని కోరారు. మరుగుదొడ్లు సక్రమంగా లేవని తెలిపారు. కమిషనర్‌కు ప్రజల సమస్యలు పట్టడం లేదు గుంటూరు నగరపాలక సంస్థ ఐఏఎస్ అధికారుల పాలనలో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ఉన్న కమిషనర్‌కు ప్రజల సమస్యలు పట్టడం లేదని ఎమ్మెల్యే ముస్తఫా విమర్శించారు. తాను 150 డస్ట్బిన్లు కొనుగోలు చేసి కార్పొరేషన్‌కు అప్పగిస్తే వాటినీ పట్టించుకోకుండా వదిలేశారని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులకు మేలు చేసిన ఐఏఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, మల్లిఖార్జున నాయక్‌ల పేర్లు గుర్తున్నాయంటే వారి పనితీరే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ప్రజెంటేషన్ : నక్కా మాధవరెడ్డి ఫొటోలు: రూబెన్ -
ఫ్రెండ్లీ పోలీస్
అది ఏలూరు నగరానికి నడిబొడ్డు.. నిత్యం రద్దీగా ఉండే ఫైర్‌స్టేషన్ సెంటర్. సాయంత్రం 5.10 కావస్తోంది. కాలేజీలు విడిచిపెట్టడంతో విద్యార్థులు బృందాలుగా ఆ ప్రాంతానికి వస్తున్నారు. ఉద్యోగులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లేందుకు బస్సులు, ఆటోల కోసం అక్కడికి చేరుకుంటున్నారు. అంతలో పోలీసు వాహనం వచ్చి ఆగింది. అందులోంచి ఒక మహిళ పోలీస్ యూనిఫాంలో హుందాగా దిగారు. ఆమె పేరు కేజీవీ సరిత. ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (డీఎస్పీ)గా పనిచేస్తున్న ఆమె అక్కడ నిలబడిన వారికి తనను తాను పరిచయం చేసుకున్నారు. ‘పోలీసుల నుంచి ప్రజలేం కోరుకుంటున్నారు.. పోలీసులు పరిష్కరించదగిన సమస్యలు ఏమున్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మీ ముందుకు వచ్చా’నని చెప్పారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడారు. ఆ తరువాత అమీనా పేటలోని ఎస్సీ, బీసీ హాస్టళ్ల సముదాయూనికి వెళ్లారు. అక్కడి విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత శనివారపుపేట కాజ్వే వద్ద గల మద్యం దుకాణం వద్దకు వెళ్లి స్థానికుల సమస్యలపై ఆరా తీశారు. రెండు గంటలకు పైగా వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడిన సరిత ‘పోలీసోళ్లు కాదు.. మన పోలీస్.. ప్రజలు అలా భావించాలి.. అదే మా లక్ష్యం’ అని చెప్పారు. ప్రాథమికంగా పోలీసులు చక్కదిద్దాల్సిన సమస్యలపై తనకు అవగాహన వచ్చిందని.. ఇందుకు సాక్షికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆమె వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే... డీఎస్పీ సరిత హామీలు ‘సాక్షి’ చేపట్టిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో నేరాల అదుపునకు సబ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం నా దృష్టికి వచ్చిన సమస్యల్లో ప్రధానంగా విద్యార్థినులపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈవ్ టీజర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. చైన్ స్నాచింగ్‌లను నివారించడానికి బీట్లను పెంచుతాం. ఫైర్‌స్టేషన్ సెంటర్లో బస్సులు ఆపేవిధంగా ఆర్టీసీ అధికారులతో చర్చిస్తాం. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులకూ సూచనలిస్తాం. హాస్టళ్లల్లో లైబ్రరీ ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, ప్రహరీ గోడలు ఎత్తు పెంచడం వంటి సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. హాస్టళ్ల వద్ద, కళాశాలల వద్ద ఇప్పటికే మఫ్టీలో సిబ్బందిని పెట్టాం. ఇంకా అదనపు సిబ్బందిని ఆ పనిమీద నియమిస్తాం. మద్యం దుకాణాల వద్ద అనుమతి లేకుండా సిట్టింగ్ రూములు నడిపితే వాటి లెసైన్సులు రద్దు చేయిస్తాం. ఫైర్ స్టేషన్ సెంటర్లో కళాశాల విద్యార్థినులను పలకరించిన డీఎస్పీ సరిత ‘మీరు ఏ కాలేజీ.. ఏం చదువుతున్నారు.. మీకేమైనా సమస్యలున్నాయా’ అని ప్రశ్నించారు. లావణ్య : కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కొంతమంది యువకులు ఈవ్‌టీజింగ్ చేస్తున్నారు మేడం. డీఎస్పీ : అక్కడే ఉన్న వనజ అనే మహిళతో ‘ఏమ్మా మీకేమైనా సమస్యలున్నాయా.. పోలీసు శాఖ నుంచి మీరు ఎలాంటి సేవలు ఆశిస్తున్నారు. వనజ : రాత్రి 7 దాటితే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలన్నా భయమేస్తోంది మేడం. బస్సుల్లో కూడా ఈవ్‌టీజర్లు వేధిస్తున్నారు. ఇంతలో రాఘవరావు అనే వ్యక్తి వచ్చి ‘మాది శాంతినగర్ మేడం. మా ప్రాంతంలో పట్టపగలు కూడా చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో పోలీసుల గస్తీ ఏర్పాటు చేయండి. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోమని మీ ఆధికారులకు చెప్పండి మేడం’ అని విజ్ఞప్తి చేశారు. సరేనని హామీ ఇచ్చిన డీఎస్పీ అక్కడి నుంచి అమీనాపేటలోని హాస్టళ్లకు చేరుకున్నారు. పోలీసు శాఖ నుంచి మీరేం కోరుకుంటున్నారని అక్కడి యువతులను అడిగారు. నందమూరి భాగ్యం : హాస్టల్ నుంచి బయటకు వెళ్లినప్పుడు కొంతమంది అబ్బాయిలు టీజింగ్ చేస్తున్నారు మేడం. అసభ్య కామెంట్లు చేస్తున్నారు. బైక్‌ల మీద వేగంగా వెళుతూ భయపెడుతున్నారు. డీఎస్పీ : నువ్వు చెప్పమ్మా.. నువ్వేం కోరుకుంటున్నావ్. ప్రసన్న : మేడం.. హాస్టల్ చాలా ఇరుకుగా ఉంటోంది. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో దోమలు అధికంగా ఉండి చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. డీఎస్పీ : ప్రధాని మోదీ ఈ మధ్య ఒక కార్యక్రమం చేస్తున్నారు. మీకెవరికైనా తెలుసా. విద్యార్థినులు : తెలుసు మేడం.. దానిపేరు స్వచ్ఛ భారత్. డీఎస్పీ : మరి మీ హాస్టల్లో ఆ కార్యక్రమం చేశారా. విద్యార్థినులు : చేశాం మేడం.. కానీ ఇంకా మేం చేయలేని పనులు మిగిలి పోయాయి. డీఎస్పీ : హాస్టల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి. కల్పన : ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండటంతో ఆకతాయిలు గోడదూకి లోనికి వస్తున్నారు. అప్పుడప్పుడూ దొంగలు కూడా వస్తున్నారు మేడం. డీఎస్పీ : కళాశాలకు వెళ్లేప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురౌతున్నాయా. లక్ష్మీప్రియ : శనివారపుపేట కాజ్వే వద్ద బ్రాందీ షాపు ఉంది మేడం. అక్కడ తాగుబోతుల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. అటువైపు నుంచి రాలేకపోతున్నాం. అప్పుడే కళాశాల నుంచి వచ్చిన ఒక విద్యార్థినిని డీఎస్పీ ఆపి ‘ఏమ్మా.. కాలేజీకి ఎలా వెళుతున్నావ్. నీకు ఏ మైనా సమస్యలున్నాయా’ అని అడిగారు. సౌందర్య : మా నాన్నగారు ఆటో డ్రైవర్. నేను ఇంజినీరింగ్ సెకండియర్ చేస్తున్నాను మేడం. డీఎస్పీ : మీ కాలేజీలో ర్యాగింగ్ ఉందా. సౌందర్య : లేదు మేడం.. మా కాలేజీలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. డీఎస్పీ : మీ కాలేజీ యాజమాన్యాన్ని అభినందించాలి. ర్యాగింగ్‌ను ఆపడానికి ఏం చేశారు. సౌందర్య : ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డీఎస్పీ : నువ్వు చెప్పమ్మా.. హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయ్. విజయలక్ష్మి : హాస్టల్లో వసతులన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే మంచి లైబ్రరీ ఉంటే చదువుకోవడానికి మరింత అవకాశముంటుంది మేడం. డీఎస్పీ : మీ వార్డెన్ ఎవరు. విజయలక్ష్మి : మంగళ మేడం. డీఎస్పీ : ఆవిడ ఇక్కడ ఉన్నారా. మంగళ : ఇక్కడే ఉన్నానండి. డీఎస్పీ : ఇక్కడి విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలు మీకు తెలుసా! మంగళ : తెలుసు మేడం. వాటిని పరిష్కరించాలని మా డెప్యూటీ డెరైక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం. 6.30-7 గంటల మధ్య హాస్టల్ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. వారిపై కాస్త దృష్టి పెట్టండి. హాస్టల్లో విద్యార్థినుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ శనివారపుపేట కాజ్వే వద్ద గల మద్యం దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడే కౌంటర్ వద్ద నిలబడి మద్యం సేవిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను చూడటంతోనే మందుబాబులు కొందరు పలాయనం చిత్తగించారు. కౌంటర్ వద్దకు వెళ్లిన డీఎస్పీ దుకాణం నిర్వాహకునితో ‘ఇది బారా.. షాపా’ అని ప్రశ్నించారు. ‘షాపు పక్కనే సిట్టింగ్ ఇస్తున్నారేంటి. షాపుకు లెసైన్సు ఉందా.. సిట్టింగ్‌కు అనుమతి ఉందా’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటువైపు వెళుతున్న కాలేజీ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారట నీకు తెలుసా. కేవలం అమ్ముకోవడమొక్కటే కాదు ఇతరుల గురించి కూడా ఆలోచించాలనే ధ్యాస ఉందా లేదా’ అంటూ చీవాట్లు పెట్టారు. బయటకు వచ్చి అక్కడ సిట్టింగ్ సౌకర్యం కల్పిస్తున్న మహిళపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇకనుంచి ఇక్కడ వ్యాపారం చేయననని ఆమె డీఎస్పీకి స్పష్టం చేసింది. అక్కడి నుంచి ఎదురుగా ఉన్న దుకాణదారుల వద్దకు వెళ్లిన డీఎస్పీ.. ‘చెప్పండి.. మీకేమైనా సమస్యలున్నాయా’ అని అడిగారు. ‘లక్షలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నాం మేడం. ఇక్కడ తాగుబోతులు మా దుకాణాల మెట్లపై కూర్చుని నానాయాగీ చేస్తున్నారు. అదేమని అడిగితే దాడులు చేస్తున్నారు’ అని ఓ వ్యాపారి చెప్పారు. పక్కనే ఉన్న మరో వ్యాపారి మాట్లాడుతూ.. ‘తాగుబోతుల కారణంగా ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయ్ మేడం. తాగి రోడ్లమీదకు వచ్చి అడ్డదిడ్డంగా వెళుతుండటంతో వాహనాలు నడిపేవారు ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
వీఐపీ రిపోర్టర్ - గుత్తా సుఖేందర్ రెడ్డి
-
విఐపి రిపోర్టర్ - కడప మేయర్ సురేష్‌బాబు
-
విఐపి రిపోర్టర్- ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు
-
విఐపి రిపోర్టర్- గొట్టిపాటి రవికుమార్
-
విఐపి రిపోర్టర్: మేయర్ సుజాత
-
కష్టాలు వింటూ...
పౌరుషానికి పుట్టినిల్లు, చరిత్రాత్మక బొబ్బిలి పట్టణ శివారున 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇందిరమ్మ కాలనీ. 2004లో ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా మొదటి సారి ఎన్నికైన తరువాత పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇక్కడ మూడు విడతల్లో ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. రెండు విడతల్లో 20 వార్డులకు చెందిన నిరుపేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు. 2006లో వారు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ప్రస్తుతం 18 వందల మంది వరకూ ఇక్కడ నివాసముంటున్నారు.. కాలనీ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా ఇక్కడ సరైన రహదారులు, వీధి లైట్లు, తాగునీటి వంటి కనీస సదుపాయాలు లేవు. చీకటి పడితే ఒకవైపు పాములు, మరో వైపు దొంగల భయంతో కాలనీవాసులు అల్లాడిపోతున్నారు. నిత్యావసర సరుకుల కోసం చాలా దూరం వెళ్లవలసిన పరిస్థితి. ఈ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకునేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ‘సాక్షి’ తరఫున వీఐపీ విలేకరిగా మారారు. కాలనీ ప్రజలతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ కాలనీని మోడల్ కాలనీగా చేయడానికి ఎంతో ప్రయత్నించాను కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ నీటి సమస్య తీర్చడానికి రక్షిత పథకం నిర్మించాలని ప్రతిపాదించినా ప్రభుత్వం ముందుకు రాలేదు. పర్యటనలో నా దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు పరిష్కరిస్తాను. ఇక్కడ కాలనీ వాసుల కోసం ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేస్తాను. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాను. రహదారులు, వీధిలైట్లు, కాలువల నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తాను. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఈ సమస్యను ఫ్లోర్‌లీడరు, కౌన్సిలర్లు ద్వారా తెలియపరిచి కాలనీవాసులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తాను. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు సుజయ్: నేను సుజయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను.. మీ కాలనీ సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి విలేకరిగా వచ్చాను.. ఏం బాబూ బాగున్నావా... నీ పేరేంటి.. ఏమిటీ నీ ఇబ్బంది? నా పేరు పాపారావు బాబు.. నాకు రెండు కాళ్లు రావు.. సైకిల్ అయితే ఉంది గానీ ప్రభుత్వం నుంచి ఏ సాయం అందడం లేదు.. సుజయ్: ఎన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నావు పాపారావు: అయిదేళ్లుగా ఉంటున్నాను బాబు.. ఉండడానికి స్థలం లేదు.. ఇద్దరు పిల్లలున్నారు. సుజయ్: నీకు రేషను కార్డు ఉందా? పాపారావు: ఉందండీ సుజయ్: సరే నీకు ఇంటి స్థలం వచ్చేలా చేస్తాను.. సుజయ్: ఏమ్మా! నీ పేరేంటి. ఏమిటీ సమస్య లక్ష్మి : నాపేరు లక్ష్మి నాయన.. మాది పక్క ఊరు గున్నతోటవలస. మా ఇళ్లు కాలిపోయింది. అయినా ఇప్పటివరకూ ఇల్లు లేదు బాబు సుజయ్: ఎన్నాళ్లు అయ్యింది కాలిపోయి? లక్ష్మి: రెండు సంవత్సరాలు అయ్యింది.. ఎన్ని కాగితాలు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు. సుజయ్: నేను అధికారులతో మాట్లాడతాను.. నీకు ఇళ్లు ఇచ్చేలా చేస్తాను... సుజయ్: మీ పేరేమిటి... కాలనీలో సమస్యలు ఏమిటో చెప్పు? శ్రీరాములు: నా పేరు శ్రీరాములు సార్.. తమరు మాకు కాలనీ ఇచ్చారు, కానీ సమస్యలు మాత్రం వదలడం లేదు.. సుజయ్: ఏమేమి సమస్యలున్నాయి.? శ్రీరాములు: ఈ కాలనీకి బొబ్బిలి నుంచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కోడి చెరువు పక్కనుంచి మధ్యాహ్నం రాలేకపోతున్నాం.. అసాంఘిక కార్యక్రమాలన్నీ ఆ రోడ్డులోనే జరుగుతున్నాయి సార్ సుజయ్: పోలీసులు ఎవరూ రారా అటువైపు..? ఎల్లంనాయుడు: ఎప్పుడో ఫిర్యాదు ఇస్తే ఒకసారి అలా వచ్చి వెళ్లిపోతారు.. అంతే మళ్లీ మామూలే. సుజయ్: కాలనీలో వీధిలైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? బొంతు శ్రీరాములునాయుడు: లైట్లు ఇలా వేస్తే వారం రోజుల్లోనే అవి పోతున్నాయి.. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.. సుజయ్: నీ పేరేంటింటి తాతా? చిన్నంనాయుడు: నా పేరు చిన్నంనాయుడు బాబు.. మీరు దయ ఉంచి కాలనీలో వీధిలైట్లు వెలిగేటట్టు చేయండి సుజయ్: ఎక్కడా లైట్లు వెలగడం లేదా..అసలు వేయలేదా?.. చిన్నంనాయుడు: మెయిన్ రోడ్డు తప్పించి ఎక్కడా లైట్లు లేవు.. చీకటి పడితే పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అల్లు సింగమ్మ: పాములే కాదు బాబు.. దొంగల భయం కూడా ఉంది.. బళ్లు, బక్కలు ఏవీ వీధిలో ఉంచుకోలేక పోతున్నాం సుజయ్: నీ పేరేంటమ్మ.. రత్నం: నా పేరు రెడ్డి రత్నం నాయన.. సుజయ్: ఎంత కాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు.. రత్నం: కాలనీ కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం బాబు.. కుళాయిలు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది సుజయ్: మరి మీకు నీరు ఎలా? రత్నం: ట్యాంకరు వస్తుంది. అది కూడా రెండు రోజులకొకసారి. ఆ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి సుజయ్: కాలనీలో బోర్లు ఉన్నాయి కదా. బాగోవా? రత్నం: ఆ నీరు మట్టివాసన కొడుతున్నాయి బాబు.. సుజయ్: నీపేరేమిటి పాప (అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో) స్రవంతి: నా పేరు స్రవంతి సుజయ్: ఏం నేర్చుకుంటున్నావు.. పాటలు పాడడం వచ్చా.. ఏమైందీ ఈ పాపకు ? కార్యకర్త: పుట్టిన దగ్గర నుంచి ఈ పాపకు రెండు కాళ్లు, చేతులు ఇలాగే ఉన్నాయి. సుజయ్: ఈ పాప పేరు ఏమిటి? కార్యకర్త: అలేఖ్య.. ఈయనే తండ్రి తాతారావు తాతారావు: పుట్టినప్పటి నుంచి కాళ్లు చేతులు ఇలాగే ఉండిపోయాయి. ఏమి చేయాలో అర్థం కావడం లేదు.. సుజయ్: పాప ఏ పనీ చేసుకోలేదా? తాతారావు: ఏ పనీ చేయలేదు..దేనికీ సహకరించవు కూడా... సుజయ్: వయసు ఎంత ఉంటుంది? తాతారావు: అయిదేళ్లు సార్ సుజయ్: ఈ పాపకు సరైన న్యాయం చేస్తాను.. సరేనా.. సుజయ్ : నీ పేరేంటమ్మ..? శారద: నా పేరు శారద బాబు.. ఈ ఇంటి పక్కనే నలుగురు నడిచిన రోడ్డు ఉంది..అక్కడ విద్యుత్తు వైర్లు ఎలాడుతున్నాయి. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. సుజయ్: ఎన్నాళ్లు నుంచి ఉంది ఇది? శారద: చాలా కాలం నుంచి ఉంది మధ్యలో స్తంభాలు వేసి వైర్లను మీదకు పెట్టాలి బాబు సుజయ్: ఇక్కడ ఇళ్లన్నీ పునాదులు వేసి వదిలేశారు ఎవరూ కట్టరా..? శారద: కట్టడానికి రెడీ అవుతున్న టైంలో ఇసుక ధరలు పెరిగిపోవడం వల్ల ఎవ్వరూ కట్టడానికి ముందుకు రావడం లేదు.. షేక్ షకీలా: బాబు..మేం కాలనీలో మొదటి విడతలో ఇళ్లు వచ్చిన వాళ్లం... మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. సుజయ్: ఏమిటీ మీ సమస్య? షకీలా: ఎవరు ఏ పని చేసినా మొదట్లోనే చేస్తున్నారు గానీ ఇటువైపు ఎవరూ రావడం లేదు. నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం సుజయ్: మీకు బోరింగు లేదా.. ట్యాంకరు రావడం లేదా? షకీలా: బోరింగు ఆరు వీధుల తరువాత ఉంది.. ట్యాంకరు ఒక సారి వస్తే మరో సారి రాదు.. సుజయ్: నీ సమస్య ఏంటమ్మా? రామలక్ష్మి: నా పేరు రామలక్ష్మి.. బాడంగి గూడేపువలస మాది. ఇక్కడకు వచ్చి ఉంటున్నాం. మా ఆయన మూగోడు, కొడుకు పరిస్థితి కూడా అంతే, అయినా పింఛను ఇవ్వడం లేదు.. సుజయ్: వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఉంటే పింఛను ఇస్తారు కదా..? రామలక్ష్మి: ఉన్నా ఇవ్వడం లేదు.. అద్దె ఇంట్లో ఉంటున్నాం.. చాలా ఇబ్బందిగా ఉంది. సుజయ్: ఏం బాబు.. ఏం పేరు.. ఏం చేస్తున్నావు..? శ్రీనివాసరావు: నా పేరు శ్రీనివాసరావు సార్.. నేను వృత్తివిద్యాకోర్సు చేస్తున్నాను. బొబ్బిలి పట్టణంలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సుజయ్: ఏమైంది..సమస్యేంటి? శ్రీనివాసరావు: ఎప్పుడో వేసిన పాత రోడ్లే ఇంకా ఉన్నాయి. వాటిని విస్తరించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. సుజయ్: అవును.. వాటి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్ల విస్తరణ కోసం మా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. బబ్బులు: సార్ నా పేరు బబ్బులు.. ఇక్కడ మైయిన్ రోడ్డు తప్పించి మిగతా రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. పాములు తిరుగుతున్నాయి. సుజయ్ : అవును.. అదే చూస్తున్నాను.. బబ్బులు: మొదట వేసిన రోడ్లును అలాగే వదిలేశారు. మున్సిపాలిటీ అసలు పట్టించుకోవడం లేదు..చైర్‌పర్సన్‌ను చూడడానికి రమ్మంటే ఈ చివరకు అసలు రానేలేదు.. సుజయ్: నీ సమస్య ఏంటమ్మా? రామలక్ష్మి: నా సమస్య కాదు సార్.. ఈ కు ర్రోడు వికలాంగుడు..ఎవరూ లేరు. సర్టిఫికెట్ ఉన్నా ఫించను ఇవ్వడం లేదు సార్ సుజయ్: ఎన్నాళ్లుగా రావడం లేదు.. రామలక్ష్మి: అయిదేళ్లుగా రావడం లేదు. సుజయ్ : సరే చూస్తాను... ఏమండీ సర్పంచ్ గారు, మీ సమస్యేంటి? ఈశ్వరరావు: మా గున్నతోటవలస గ్రామానికి చెందిన 25 ఇళ్లు ఈ కాలనీ శివారున ఉన్నాయి సార్.. వాటికి విద్యుత్ సమస్య, రోడ్డు ఇబ్బంది ఉంది.. సుజయ్: విద్యుత్ సమస్య ఏంటి? ఈశ్వరరావు: ఊర్లోంచి వచ్చే మెయిన్ విద్యుత్ వైరుకు ఎక్కడా స్తంభాలు వేయలేదు. దాంతో మధ్యలో ఇళ్ల మీద నుంచి వైర్లు రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. సుజయ్: సరే...మధ్యలో స్తంభాలు వేసేలా చూస్తా.. నీ పేరు ఏంటి మామ్మా? శాంత: నా పేరు పిట్ల శాంత బాబు.. సుజయ్: చెప్పు నీ సమస్యేంటో? శాంత: ఈ మధ్యను నాకు రెండు నెలల పింఛ ను ఇచ్చారు బాబు.. దానిలో 5 వందలు ఇరుపుకొంటున్నారు.. ఇలాగైతే మేం ఎలా బతకాలి సుజయ్: ఎవరు తీసుకుంటున్నారు... ఎందుకు తీసుకుంటున్నారో అడగలేదా..? శాంత: పెన్సన్ ఇచ్చిన రామారావే ఇరిపేశారు.. ఎందుకో చెప్పడం లేదు.. సుజయ్: పింఛను తీసుకుంటున్నవారు ఎవరికి డబ్బులు ఇవ్వక్కరలేదు.. అలా అడిగితే మీ కౌన్సిలర్లకు చెప్పండి.. వెయ్యి ఇస్తేగాని వేలి ముద్ర వేయకండి ఇందిర: సార్.. నా పేరు ఇందిర..నేను ఐద్వా జిల్లా నాయకురాలిగా పనిచేస్తున్నాను.. సుజయ్: చెప్పండమ్మా.... ఇందిర : ఈ కాలనీ ఉన్న వాళ్లకు టౌన్లో రేషను సరుకులు ఇస్తున్నారు.. అవి విడిపించడానికంటే వాటికి కాలనీకి తీసుకురావడానికే ఎక్కువ ఖర్చు అవుతోంది. సుజయ్: సరుకుల కోసం ఎక్కడెక్కడకు వెళతారు ? ఇందిర: గతంలో ఈ కాలనీకి రాకముందు ఎక్కడున్నారో ఆ వీధుల్లోకే వెళ్లి తెచ్చుకోవాలి సార్, వీళ్లు వెళ్లేసరికి డిపో తీయకపోతే తిరుగుతుండడమే పని. ఈ కాలనీకి ప్రత్యేకమైన డిపోను ఏర్పాటు చేయించాలి సార్. సుజయ్: తప్పకుండా అలాగే ఏర్పాటు చేయిస్తాను. నీ పేరేంటమ్మా? భారతి: వియ్యపు భారతి సార్.. నా భర్త చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా పింఛను మంజూరు చేయలేదు.. సార్ అప్పారావు: సార్ .. నాకు భూములున్నాయని పింఛను తీసేశార్ సార్. సుజయ్: ఎన్నాళ్లు నుంచి పింఛను తీసుకుంటన్నారు. ? అప్పారావు: 20 ఏళ్లుగా పింఛను తీసుకుంటున్నాను. సెంటు భూమి లేదు..ఎవరు చెప్పారో తీసేశారు. సార్.. సుజయ్: ఏమైందయ్యా నీకు..ఏం పేరు నీ పేరు? సత్యారావు: కోట సత్యారావు సార్.నేను ఒకటో వార్డుకు చెందిన వాడిని. నాకు వికలాంగుడి ధ్రువీకరణ పత్రం ఉన్నా ఫించను మాత్రం ఇవ్వడం లేదు.. సుజయ్: ఏమంటున్నారు..ఎందుకు ఇవ్వడం లేదు.? సత్యారావు: ఏమీ చెప్పడం లేదు.. ఈ సర్టిఫికెట్ చేయించుకోవడానికే నాలుగు వేలు ఖర్చు పెట్టాను.. సుజయ్: సరే నేను చూస్తాను. అక్కడ నుంచి కొత్తగా పెట్టిన పాఠశాలకు వెళ్లారు.. మాస్టారు ఇక్కడ ఎంత మంది చదువుతున్నారు? సత్యనారాయణ: ఇక్కడ ప్రస్తుతం 25 మంది ఉన్నారండీ.. కానీ ఈ కాలనీలో సుమారు 50 మందికి పైగా పిల్లలున్నారు.. సుజయ్: ఇక్కడకు ఎప్పుడు వచ్చారు.. మీరు డెప్యుటేషన్‌పై వచ్చారా.? సంతోష్‌కుమార్: ఆగస్టు నెలలో ఇక్కడ స్కూలు పెట్టారు సార్.. టౌన్లో రెండు స్కూళ్లు మూసేసి ఇక్కడ పెట్టారు. మమ్మల్ని బదిలీపై వేశారు.. సుజయ్: అదేంటి ఇక్కడ గతంలో స్కూలు లేకుండా బదిలీపై ఎలా వేశారు? సత్యనారాయణ: ఏమో సార్ ఆర్డర్ అలా ఇచ్చారు.. సునీత: నమస్తే సార్, నేను ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని నడుపుతున్నాను.. సుజయ్: చెప్పమ్మా! నీ సమస్య ఏంటో..? సునీత: స్కూలు ఇక్కడ పెట్టినా వంటకు ఇక్కడ స్టవ్, గ్యాస్, వంట పాత్రలు వంటివి ఇవ్వలేదు. రోజూ ఇంటి దగ్గర వండి తెస్తున్నాను. సుజయ్: బిల్లులు ఇచ్చేస్తున్నారా..? సునీత : రెండు మాసాలుగా అదీ లేదండీ ధనలక్ష్మి: సార్ నమస్తే సార్.. నా పేరు ధనలక్ష్మి.. నేను ఇందిరా గాంధీ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. సుజయ్: నమస్తే చెప్పమ్మా! ఏం చదువుతున్నావు ధన లక్ష్మి: బీకాం ఫస్ట్ ఇయర్ సార్..మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. సుజయ్: నీ పేరేంటమ్మా తులసి: నా పేరు తులసి., మేం నక్కలోల్లం సార్.. మమ్మల్ని ఎస్టీలో కలపాలని ఎన్ని సార్లు కోరుతున్నా అది జరగడం లేదు. సార్ సుజయ్: గతంలో ఎక్కడైనా ఎస్టీలో చేర్చినట్లు ఇచ్చారా? తులసి: చోడవరంలో ఇచ్చారు సార్.. అది చూపించినా ఇక్కడ ఇవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. సుజయ్: దీనిని గవర్నమెంటు దృష్టికి తీసుకెళ్తాను.. ఏమ్మా: పిల్లల్ని బడికి పంపుతున్నారా.. మర్రి ఉమ: లేదండీ... సుజయ్: పంపకుండా ఏమి చేస్తున్నారు..? ఉమ: వాళ్లు పనికి వెళితే మా కడుపులు ఎలా నిండుతాయి. బాబు.. సుజయ్: మీ కడుపులు నిండడానికి, వాళ్లని పనిలో పెడతారా... ఇక్కడే ఉన్న స్కూలుకు పంపండి అక్కడ భోజనాలు పెడతారు..చదువులు చెబుతారు సరేనా.. నారాయణమ్మ: బాబూ ఇక్కడ ఉన్న బావి ప్రమాదకరంగా ఉంది. సుజయ్: దీని గురించి అధికారులకు చెప్పలేదా..? నారాయణమ్మ: చెబుతున్నా పట్టించుకోవడం లేదు.. ఈ బావి నీరు తోడేసి రాతికట్టు కట్టి గట్టు ఎత్తు చేయాలి. అలాగే ప్లాట్‌పారం కట్టాలి బాబు.. సుజయ్: సరే చూద్దాం.. మీకు రుణమాఫీ అందుతుందా? నారాయణమ్మ: ఏం అందడం సార్.. చంద్రబాబు అసలు కట్టవద్దంటే మానేశాం. ఇపుపడు వడ్డీల కింద బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఇరుపుకుంటున్నారు. సుజయ్: ఇప్పటివరకూ ఎంత జమచేశారు? నారాయణమ్మ: 5 లక్షలు తెచ్చాం సార్... నెలకు పది వేలు చొప్పున ఆరుమాసాలకు 60 వేలు ఇరిపేశారు. సుజయ్: మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు..? నారాయణమ్మ: రుణమాఫీ సంగతి దేవుడెరుగు వడ్డీలు పడకుండా ప్రతీ నెలా కట్టేస్తున్నాం. సరే వస్తానమ్మా... -
భూత్ బంగ్లాలో.. చదువుల బెంగ
VIP రిపోర్టర్ హనుమంతు లజపతిరాయ్ వీసీ, బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ లజపతిరాయ్ (వీసీ) : మేడమ్ ఈ పాఠశాలకు చాలా ప్రత్యేకత ఉంది.. నేనూ ఈ పాఠశాలలోనే చదువుకున్నాను. ప్రస్తుతం పాఠశాల పరిస్థితి ఏంటి. సదుపాయాలు ఎలా ఉన్నాయి? వి.పద్మావతి (హెచ్ఎం) : నేనూ కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాను. ఇక్కడే ఏడేళ్లుగా హెచ్ఎంగా పని చేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది ఉన్నతస్థాయిల్లో ఉన్నారు. అయితే పాఠశాలలో ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయి. తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని భవనాలు పడిపోయాయి. వీసీ : అధికారులకు ఫిర్యాదు చేశారా? హెచ్ఎం : సమస్యలపై ఇప్పటికే కలెక్టర్‌కు, మున్సిపల్ కమిషనర్‌గా వినతులు అందజేశాం. ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. వీసీ : హుద్‌హుద్ తుపానుకు కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు ఉన్నాయి.. నిజమేనా? హెచ్ఎం : నిజమే. తుపానుకు తిలక్ హాల్‌తోపాటు రెండు భవనాలు కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ రోజు సమీపంలో పిల్లలు ఎవరూ లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. వీసీ : ఎంతమంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాల సమస్యలు, విద్యార్థుల చదువుల గురించి వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారా? హెచ్ఎం : 200 మంది వరకు చదువుతున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నాం సార్. ఓల్డ్ స్టూడెంట్స్ అందజేసిన విరాళాలతో కొన్ని అభివృద్ధి పనులు జరిపించాం. తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తరగతి గదిలో.. వీసీ : వెనుకబడిన పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? టి.ఉమాదేవి (తెలుగు టీచర్) : ప్రత్యేకంగా వెనుకబడిన పిల్లలను దృష్టిలో ఉంచుకునే పాఠ్యాంశాలను చెబుతున్నాం. అలాంటి వారిని గుర్తించి సాయంత్రం 4.30 తర్వాత ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. వీసీ : ఆడిపిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా? తె.టీచర్ : దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కట్టు, బొట్టు, వస్త్రధారణ వంటి అంశాల గురించి వారితో తరచూ చర్చిస్తుంటాం. కుటుంబ వ్యవస్థ తీరు, మానవతా విలువలు, తల్లిదండ్రులు, పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి వివరిస్తుంటాం. వీసీ (ఓ విద్యార్థితో) : బాబు.. నువ్వు ఏ సబ్జెక్టులోనైనా వెనుకబడి ఉన్నావా? కె.రాజు (టెన్త్ విద్యార్థి) : గణితంలో బాగా డౌట్లు ఉన్నాయి సార్.. సిలబస్ మారిపోవడంతో మాకు పూర్తిగా అర్థం కావడంలేదు. వీసీ (మరో క్లాస్ రూమ్‌లో) : సార్.. మీరు ఉపాధ్యాయుడిగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? సీహెచ్ దేవదత్తానంద్ (గణితం టీచర్) : మా ఇబ్బందులంటే ఏం చెబుతాం సార్.. ప్రభుత్వం కనీసం మమ్మల్ని ఉపాధ్యాయులుగానే గుర్తించడంలేదు. పీఎఫ్‌ను జీపీఎఫ్‌లోకి కన్వర్ట్ చేయలేదు. జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. హెల్త్‌కార్డులు కూడా ఇవ్వమంటున్నారు. ఎల్టీసీ, సర్వస్ రూల్స్‌ను ఇంకా అమలు చేయలేదు. చాలా మధనపడుతున్నాం. ప్రభుతం వీటిపై దృష్టిసారించాలి సార్.. వీసీ : బాధ్యతాయుతమైన బోధన వృత్తి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? గ.టీచర్ : ఎంతసేపూ చదువూ చదువూ అని పిల్లలపై ఒత్తిడి పెంచడం కాసేపు పక్కనపెట్టి వారితో అనుబంధాన్ని పెంచుకోవాలి. టీచర్ అనేవాడు పిల్లలతో స్నేహితుడిగా మెలగాలి. వారి కుటంబ పరిస్థితి, మనోభావాలు గురించి తెలుసుకోవాలి. అలా చేస్తే విజయం సాధించినట్లే. వీసీ : ఈ ఏడాది సిలబస్‌లు మారాయని చెబుతున్నారు. కొత్త సిలబస్ ఎలా ఉంది? పి.రాజు (ఇంగ్లిష్ టీచర్) : సిలబస్ మార్చారు గానీ పేపర్-1, పేపర్-2లకు ఏ ప్రశ్నలు ఇస్తారో.. ఏంటో ఇంతవరకు స్పష్టం చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిషు ఉపాధ్యాయులు, విద్యార్థులందరిదీ ఇదే సమస్య. దీనిపై త్వరగా వర్కషాప్‌లు నిర్వహిస్తే మేలు జరుగుతుంది. వీసీ : పిల్లలూ...మధ్యాహ్న భోజనం ఎలా ఉంది.. బాగా వండుతున్నారా? పిల్లలు : మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుంటుంది సార్.. ఆయా(వంటమనిషి) బాగా వండుతుంది. వీసీ (మధ్యాహ్న భోజనశాలకు వెళ్లి..) : ఏమ్మా.. మీకు నెలనెల బిల్లులు అందుతున్నాయా? జరీనాబీ (వంట మనిషి) : మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేనే పని చేస్తున్నాను సార్. బిల్లులు మాత్రం సక్రమంగా అందడంలేదు సారు. గ్యాస్ ఇవ్వడంలేదు. కట్టెల పొయ్యితోనే పాట్లు పడుతున్నాం.