తహశీల్దార్ కార్యాలయం... ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో అర్జీ దారులు వస్తుంటారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాళ్లరిగేలా తిరిగే వారు కొందరైతే....తన సమస్య ఎలా పరిష్కారమవుతుందో తెలియక సిబ్బంది కాళ్లావేళ్లా పడేవారు మరికొందరు. అందులోనూ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం పరిస్థితి అయితే మరి చెప్పనక్కరలేదు. నిత్యం పట్టాదారు పాసుపుస్తకాలు, రేషన్ కార్డులు, మీ సేవలో సర్టిఫికెట్లకు అప్రూవల్, భూముల వివాదాలు , రేషన్ కార్డులో పేర్ల నమోదు, మరణ ధ్రువీకరణ పత్రాలు అన్నింటికీ ఇక్కడికే రావాలి. సిబ్బంది రేపు రా.., మాపు రా.. అని పలుమార్లు తిప్పుతున్నా... పనైతే చాలురా భగవంతుడా అంటూ తిరుగుతూనే ఉంటారు. ఈ అవస్థలను పరిష్కరించేందుకు, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు స్వయంగా ఆర్డీఓ జే. వెంకటరావు రంగంలోకి దిగారు. సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు.
తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చిన సందర్శకులను ప్రశ్నించారు. వారి సమస్యలు అడిగి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావును ఆదేశించారు. అంతే కాకుండా రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వేచి ఉన్న వివిధ కోర్టు కేసుల కక్షిదారులను ప్రశ్నించి వారి కేసుల విచారణకు, సత్వర పరిష్కారానికి చొరవ చూపించారు. శనివారం సందర్శకులతో ఆర్డీఓ సంభాషణ ఇలా సాగింది...
పింఛన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, రేషన్‌కార్డులు, గ్యాస్‌కనెక్షన్ ఇలా పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ పత్రాల జారీ ఇలా అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. పింఛన్లు పార్టీ పరంగా నిలిపివేయడం ఉండదు, తగిన ఆధారులు చూపితే అర్హులందరికీ తప్పని సరిగా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటాం. స్థానిక తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావుతో చర్చించి పరిష్కారం చూపుతాను. నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు వేరే అధికారులు పరిష్కరించవలసి ఉంది. వారికి సమాచారం అందజేసి ఆ సమస్యలకు పరిష్కారమార్గాన్ని కనుగొంటాం. ఒక వేళ ఏ కారణం చేతనైనా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి నన్ను కలవచ్చు.
ఆర్డీఓ: మీ పేరేంటి..?
సందర్శకుడు: నా పేరు పతివాడ రామారావు.
మాది 24వ వార్డు
ఆర్డీఓ : ఎందుకొచ్చారు..?నీ సమస్య ఏమిటి..?
పతివాడ రామారావు: నాకు వృద్ధాప్య పింఛను వచ్చేది. రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెన్షన్ పెంచాక అసలు రావడం లేదు. పార్టీ ప్రకారంగా నా పెన్షన్ తొలగించారు.
ఆర్డీఓ: అలాంటిదేమీ ఉండదు. అర్హత ఉంటే తప్పనిసరిగా పింఛను వచ్చేలా సిఫార్సు చేస్తాం.
పతివాడ రామారావు: నాకు వయస్సు ధ్రువీకరణ పత్రాలన్నీ ఉన్నాయి. రేషన్ కార్డులో
తప్పులున్నాయన్న సాకుతో పింఛను తొలగించారు.
ఆర్డీఓ : మీ దరఖాస్తు, అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వండి. మీ ఇంటికి వచ్చి విచారణ చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
పతివాడ రామారావు: కృతజ్ఙతలు సార్!
ఆర్డీఓ : మీ పేరేంటి? ఏంటి మీ సమస్య!
సందర్శకురాలు: అయ్యా! నా పేరు మొండి కామేశ్వరి. నాకు వితంతువు పింఛను ఇవ్వడం లేదు.
ఆర్డీఓ: ఎందుక పింఛన్ నిలిపేశారు ?
కామేశ్వరి: భర్త మరణ ధ్రువీకరణ పత్రం తెమ్మంటున్నారు. ఎన్నో ఏళ్ల కిందట చనిపోయిన భర్త ధ్రువీకరణ పత్రాన్ని ఇప్పుడెలా తెచ్చేది.?
ఆర్డీఓ: మరేం పర్వాలేదు. నీ అడ్రస్‌కు తహశీల్దార్ వ స్తారు. అక్కడ విచారణ చేసి మీకు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. మీరు ఇంటివద్దే ఉండండి.
కామేశ్వరి: నేను ఇంటి వద్దనే ఎలా ఉంటాను? పొలం పనికి వెళ్లిపోతాను. ఎన్ని సార్లు వచ్చినా నాకు పిం ఛను ఇవ్వడం లేదు.
ఆర్డీఓ: తప్పనిసరిగా మీకు పింఛను ఇస్తారు
ఆర్డీఓ: మీ పేరు?
సందర్శకుడు: నా పేరు సూర్యనారాయణ. మాది బొంకుల దిబ్బ.
ఆర్డీఓ: మీ సమస్య ఏంటి ?
సూర్యనారాయణ: నా భార్య పేరున గ్యాస్ కనెక్షన్ ఉంది. నా భార్య ఇప్పుడు లేదు. నాకు గ్యాస్ కనెక్షన్ కావాలి.
ఆర్డీఓ: ప్రస్తుతం దీపం గ్యాస్ కనెన్షన్లు డ్వాక్రామహిళల పేరున ఇస్తున్నారు. మీ పేరున ఇవ్వరు. మీ పేరున దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారులను సం ప్రదించి గ్యాస్ కనెక్షన్ ఇవ్వవచ్చే లేదో పరిశీలిస్తాం. లేకుంటే మీరు ప్రైవేటుగా గ్యాస్ కనెక్షన్‌ను కొనుగోలు చేసుకోవాలి.
ఆర్డీఓ: మీ పేరేంటి? ఎందుకొచ్చావు?
సందర్శకుడు: నా పేరు అప్పల రామయ్య. నా రేషన్ కార్డులో అప్పస్వామి, ఆధార్‌కార్డులో అప్పలరామ య్య అని కరెక్ట్‌గా పడింది. అయితే రేషన్ కార్డులో పే రు తప్పుగా పడిందని విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదు. పేరు మార్పించేందుకు వచ్చాను.
ఆర్డీఓ: పక్కనే తహశీల్దార్‌తో... మీరు ఈ అడ్రస్‌కు వెళ్లి విచారణ చేయండి! రెండు పేర్లూ ఒకరివే అయితే ఏ పేరు ఖరారు చేయాలో నిర్ణయించి ధ్రువీకరణ పత్రం ఇచ్చేయండి!
అప్పలరామయ్య: వస్తానయ్యా!
ఆర్డీఓ: మీ సమస్య ఏంటి ?
సందర్శకుడు: సార్! నా పేరు మీసాల శంకరరావు. మేం గ్రామ కంఠమని తెలియక ఓ ఇల్లు కొన్నాం. దా నిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదన్నారు.
ఆర్డీఓ: ఏవేని ఆస్తులు, భూములు కొన్నప్పుడు అవి ఎవరి పేరున ఉన్నాయో ముందుగా ఒకటికి రెండుసా ర్లు విచారించి కొనుగోలు చేయాలి. అనంతరం దా నిని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మీసాల శంకరరావు: ఇటీవల గ్రామకంఠం భూముల ను కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఇచ్చారని పేపర్లో చదివాం సార్ !
ఆర్డీఓ: అవును..! జీఓ నంబర్ 100 ను రద్దు చేశారని ప్రకటనలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా రాలేదు. వస్తే అమలు చేస్తాం.
ఆర్డీఓ: మీ పేరేంటి? ఎందుకొచ్చారు?
సందర్శకుడు: నా పేరు అడపా నారాయణరావు. రేషన్ కార్డులో పేరు మార్పు కోసం వచ్చాను.
ఆర్డీఓ: ఏంటి సమస్య?
నారాయణరావు: రేషన్ కార్డులో పేరు మార్పు కోసం రెండు నెలలుగా తిరుగుతున్నాను. ఇక్కడకొస్తే పరి ష్కారం కావడం లేదు.
ఆర్డీఓ: తహశీల్దార్‌గారూ! ఏమిటీ సమస్య..?
తహశీల్దార్ శ్రీనివాసరావు: సార్! రేషన్ కార్డుల్లో స భ్యుల పేర్ల చేర్పులో కొన్ని సాంకేతిక సమస్యలున్నా యి. వాటిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆర్డీఓ: కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలత గారిని అడిగి పరిష్కారం కనుగొనండి! ఇతని సమస్యను పరిష్కరించి చేర్పులకు అవకాశమివ్వండి!
నారాయణ రావు: థ్యాంక్యూ సార్
ఆర్డీఓ: మీరెవరు? ఎందుకొచ్చారు?
సందర్శకుడు: నా పేరు పకీర్ రావు సార్! నేను తోటపాలెంలో ఉంటున్నాను. నాకు ఓటు హక్కు స్థల మార్పిడికోసం వచ్చాను.
ఆర్డీఓ: దీనికి దరఖాస్తు చేశారా?
ఫకీర్‌రావు: ఫారం 8లో దరఖాస్తు చేశాను.
ఆర్డీఓ: ఒకే నియోజకవర్గంలో ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఫారం 8 కాదు. ఫారం 8ఏ లో దరఖాస్తు చేయాలి. దీనికి సంబంధించి మరో సారి దరఖాస్తు చేయండి. ఇంకేమయినా సమస్యలున్నాయా?
ఫకీర్ రావు: ఓటరు నమోదు శిబిరాలను దూరంగా పెడుతున్నారు. శిబిరాలు ఎక్కడున్నాయో కూడా చా లా మందికి తెలియడం లేదు.
ఆర్డీఓ: ప్రతీ కేంద్రంలో బూత్‌లెవెల్ అధికారి ఉండే విధంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాం. మీరు ఆన్‌లైన్‌లోనూ నిత్యం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగైతే మీరిచ్చిన అడ్రసుకు బృందం వచ్చి ధ్రువీకరించుకుంటుంది. అనంతరం మీకు ఓటరు కార్డు ఇస్తారు.
ఆర్డీఓ: మీరెవరు? ఎందుకొచ్చారు.?
సందర్శకుడు: అయ్యా! నాపేరు అప్పారావు. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలు ఆధార్ నంబర్‌లేని గ్యాస్ కనెక్షన్ మార్పిడి కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి.
ఆర్డీఓ : తహశీల్దార్ గారూ మీరు ఈ విషయమై పరి శీలన చేసి చర్యలు తీసుకోండి! ఏమ్మా..? మీరెందుకు వచ్చారు. ఏ కాలనీ మీది?
సందర్శకురాలు: మాది వైఎస్సార్ నగర్ కాలనీ. నా పేరు జగదీశ్వరి..
ఆర్డీఓ: సమస్య ఏమైనా ఉందా?
జగదీశ్వరి: సార్! మా కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదు. రహదారులు కూడా సరిగా లేవు.
ఆర్డీఓ: దీనిపై మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడాలి.
ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు? మీ పేరేటి?
సందర్శకుడు: అయ్యా నాపేరు పాసి అప్పారావు. మా అమ్మ ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చాను సార్!
ఆర్డీఓ:ఏమైంది.?
తహశీల్దార్ : విచారణలో ఉంది.
ఆర్డీఓ: నీ పేరంటయ్యా? ఎందుకొచ్చావు?
సందర్శకుడు: నా పేరు కె. రాములు బాబుగారూ! నేను వీటీ అగ్రహారం తలయారీని.
ఆర్డీఓ: సమస్య ఏమిటీ?
రాములు: మూడు నెలలుగా జీతాల్లేవు బాబూ!
ఆర్డీఓ: మీ వేతనాలు పెరిగాక బడ్జెట్ రూపంలో ఇస్తున్నారు. నిన్ననే చూశాను. మీ బడ్జెట్ వచ్చింది.
రాములు : అయ్యా! మూడు నెలలు జీతాల్లేకపోతే మే మెలా బతకాలి? బిల్లు గుమస్తా పెట్టడం లేదు.
ఆర్డీఓ: నీకేం పరవాలేదు. బిల్లు గుమస్తా తప్పు లేదు. జీతాలు వచ్చేశాయి. ఇచ్చేస్తాం.
ఆర్డీఓ కార్యాలయంలో....
ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు. ? మీపేరు?
సందర్శకుడు: నా పేరు పూసపాటి వెంకటపతిరాజు. మాది డెంకాడ. పట్టాదారు పాసు పుస్తకాల కోసం వ చ్చాను. మా అన్నదమ్ములతో పాటు నాకు కూడా వా టా వస్తుంది. ఆ వాటా పుస్తకాలు ఇవ్వాలి.
ఆర్డీఓ: అంటే మీరు కోర్టు పనిమీద వచ్చారా?
వెంకటపతిరాజు: అవును సార్!
ఆర్డీఓ: మీరు కూర్చోండి వాయిదాకు పిలుస్తాం. విచారణ చేస్తాను.
ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు? ( ఓ బృందంతో..)
సందర్శకుల బృందం: అయ్యా! మేం గరివిడి ఫేకర్ కార్మికులం. మా సమస్య కోర్టులో ఉంది.
ఆర్డీఓ: మీ కేసు కూడా ఈ రోజే విచారిస్తాం.
ఆర్డీఓ: మీది ఏ ఊరమ్మా? ఎందుకొచ్చావు?
సందర్శకురాలు: అయ్యా ! నాపేరు వల్లి బంగారమ్మ మాది కోడూరు గ్రామం.
ఆర్డీఓ: ఏంటి సమస్య?
బంగారమ్మ: అయ్యా! 30 ఏళ్లుగా ఉన్న నా భూమి వేరొకరి పేరున ఉన్నది. అందుకే వచ్చాను.
ఆర్డీఓ: మీ అందరి కేసులూ విచారిస్తాం. సత్వర న్యా యం అందిస్తాం.
అవస్థలెన్నో...!
Published Sun, Feb 22 2015 1:24 AM | Last Updated on Thu, Apr 4 2019 2:48 PM
Advertisement