చెయ్యెత్తితే బస్సాగాలి | vip Reporter r. Rama Rao Region Manager, RTC | Sakshi
Sakshi News home page

చెయ్యెత్తితే బస్సాగాలి

Published Sun, Nov 30 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

చెయ్యెత్తితే బస్సాగాలి

చెయ్యెత్తితే బస్సాగాలి

సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం వల్ల సాధారణ ప్రయూణికులు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకునే అవకాశం కలిగింది.

 ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం వల్ల సాధారణ ప్రయూణికులు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకునే అవకాశం కలిగింది. వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తా. అలాగే వారి సౌకర్యం కోసం సేవలను విస్తృతం చేయడానికి తగిన కార్యాచరణ రూపొందిస్తాం. బస్సులను సకాలంలో తిప్పడానికి చర్యలు తీసుకుంటాం. మహిళలు, వృద్ధుల సీట్లలో వారే కూర్చునేలా కండక్టర్లకు తగిన ఆదేశాలు ఇస్తాం. బస్టాండ్లలోని దుకాణాల్లో ఎంఆర్‌పీకే ఆయా వస్తువులు విక్రయించేలా చూడాలని సంబంధిత డీఎంలకు కఠిన ఆదేశాలు జారీ చేశాం. టాయిలెట్స్, సైకిల్ స్టాండ్స్‌లో కూడా నిర్ణీత రుసుం వసూలు చేయకుంటే కాంట్రాక్టు రద్దు చేయడానికి వెనుకాడబోం. బస్సులను కండిషన్‌లో ఉంచడానికి.. ప్రయూణికులను ఎక్కించుకోవడానికి వారు ఎక్కడ చెయ్యి ఎత్తితే ఆక్కడ ఆపేలా కండక్టర్లకు సూచనలిస్తాం. ఆశ్రం వైద్య కళాశాల వద్ద బస్ షెల్టర్ నిర్మించడానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం.
 
 రామారావు : ఏమండీ.. ఎక్కడికి వెళ్లాలి. బస్సు కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు.
 విచారి : ద్వారకా తిరుమల వెళ్లాలి సార్.. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను.
 రామారావు : ఏమ్మా.. వృద్ధులకు సీనియర్ సిటిజన్ పాస్ సదుపాయం ఉంది. మీరు తీసుకున్నారా.
 సున్నం వర్ధనమ్మ : తీసుకున్నానయ్యా.
 రామారావు : ఏమ్మా.. బస్సులు ఆపుతున్నారా.
 వరలక్ష్మి : ఎక్కడ ఆపుతున్నార ండీ.. ఇప్పుడే చింతలపూడి బస్సు ఆపకుండా వెళ్లిపోయారు. బస్టాండులోనే ఇలా చేస్తే బయట ఎలా ఆపుతారో మీరే అర్థం చేసుకోండి.
 రామారావు : ఏమ్మా.. ఈ ఇద్దరి అబ్బాయిలకు వైకల్య సర్టిఫికెట్ ఉందా. పాసులు తీసుకున్నారా.
 నీలిమ : సర్టిఫికెట్లు ఉన్నాయ్ సార్. పాస్‌లు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాం. ఈ రోజు ఇస్తారు తీసుకోండని ఆర్‌ఎం చెప్పగా, ‘ఇందాకే పాస్‌లు ఇచ్చేచోటకు వెళితే లేవన్నారు సార్’ అని తెలిపింది. పక్కనే ఉన్న ఏలూరు డిపో మేనేజర్ టి.పెద్దిరాజు ‘ఎస్కార్ట్ పాస్‌లు అయిపోయాయి సార్. ఈ రోజు వస్తాయనుకున్నాం’ అని వివరణ ఇస్తుండగా.. కోటి రాజేంద్రప్రసాద్ అనే వృద్ధుడు అక్కడికి వచ్చి ‘వికలాంగుల వెంట వచ్చేవారికి పాస్‌లు ఇవ్వడం లేదు. మొన్న అడిగితే ఈ రోజు రమ్మన్నారు. ఈ రోజు వస్తే లేవంటున్నారు.
 ఇంకా ఏమన్నా అడిగితే కసురుకుంటున్నార’ని ఫిర్యాదు చేశారు. ‘ఈ రోజు కచ్చితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తా’నని భరోసా ఇచ్చిన రామారావు డీఎంను పిలిచి వెంటనే పాస్ జారీ చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి బస్టాండ్‌లోని దుకాణాల వద్దకు వెళ్లారు
 రామారావు : ఏమండీ.. ఇక్కడి దుకాణాల్లో ధరలెలా ఉన్నాయ్
 అంబటి శర్వణ్ : చాలా దారుణంగా ఉన్నాయ్ సార్. ఈ ప్యాకెట్లు బయట రూ.10కి ఇస్తుండగా ఇక్కడ రూ.15 వసూలు చేస్తున్నారు.
 రామారావు : ఏమండీ.. టాయిలెట్లు ఎలా ఉన్నాయ్
 జి.సాంబశివరావు : పరిశుభ్రత లేదు సార్. మరుగుదొడ్డి వినియోగానికి రూ.2 అని బోర్డులో ఉంటే అక్కడ రూ.5 వసూలు చేశారు.
 రామారావు : రిజర్వేషన్ కౌంటర్‌లో టిక్కెట్లు సమయానికి ఇస్తున్నారా
 ఎ.రామాంజనేయులు : ఇస్తున్నారు సార్. తిరుగు ప్రయాణ టికెట్టు ఇవ్వడానికి సమయం తీసుకుంటున్నారు.
 సైకిల్ స్టాండ్ వద్దకు వెళ్లిన ఆర్‌ఎం రామారావు అప్పుడే మోటార్ సైకిల్ తీసుకుని బయటకు వస్తున్న కె.సత్యనారాయణ అనే ప్రయాణికుడితో మాట్లాడుతూ ‘ఏమండీ.. సైకిల్ స్టాండ్‌లో వాహనాలకు నీడ ఉంటోందా.. ఎంత చార్జి వసూలు చేస్తున్నారు’ అని అడిగారు.
 కె.సత్యనారాయణ : ఎన్ని గంటలకు ఎంత వసూలు చేయాలో బోర్డు పెట్టలేదండీ. వాళ్లు ఎంత అడిగితే అంత ఇస్తున్నాం.
 అక్కడి నుండి పాత బస్టాండ్‌లో ప్రయూణికుల అవసరాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి పాలకొల్లు వెళ్లే బస్సులో ఆర్‌ఎం రామారావు ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులతో సంభాషణ ఇలా సాగింది.
 రామారావు : ఏమ్మా.. మా కండక్టర్ల ప్రవర్తన ఎలా ఉంటోంది.
 ఆర్.సుకన్య : మర్యాదగానే నడుచుకుంటున్నారు సార్. ఫుట్‌బోర్డుల మీద నిలబడే వారిని గదమాయించినా వారు పైకి రావడం లేదు. వీళ్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.
 వెనుక సీట్టో కూర్చున్న విద్యార్థితో ఆర్‌ఎం మాట్లాడుతూ ‘ఎక్కడికి వెళుతున్నారు’ అని అడిగారు.
 రావి రాజేష్ : కైకలూరు సార్. వట్లూరులోని మా కాలేజీ వద్ద చాలా బస్సులు ఆపడం లేదు సార్.
 రామారావు : ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఇతర జిల్లాల డిపో బస్సుల విషయంలో ఇది జరుగుతోంది. ఇతర రీజినల్ మేనేజర్లతో మాట్లాడాను. ఇకపై అటువంటి ఇబ్బంది ఉండదు.
 రామారావు : ఏమండీ.. బస్సులో  సీట్లు కూర్చోడానికి అనుకూలంగా ఉంటున్నాయా
 నరసింహరావు : బాగానే ఉంటున్నాయండీ. కాకపోతే సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చుంటున్నారు. వృద్ధులు నిలబడినా వారి సీట్లు వారికి ఇవ్వడం లేదు. కండక్టర్లు ఆ సీట్లను ఖాళీ చేయించి వృద్ధులను కూర్చోబెట్టేలా చర్యలు తీసుకోండి.
 పాత బస్టాండ్‌లో  దిగిన ఆర్‌ఎం ‘ఏమ్మా.. ఏమ్మా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయ్’ అని అడిగారు.
 కె.వెంకటరత్నం : ఇక్కడ దొంగల భయం ఎక్కువగా ఉంటోంది సార్. సెక్యూరిటీని పెంచాలి.
 తాడేపల్లిగూడెం బస్సులో ఎక్కిన ఆర్‌ఎం ఆశ్రం కాలేజీ వరకూ వెళ్లారు.
 రామారావు : డ్రైవర్ గారూ.. బస్సు కండిషన్ ఎలా ఉంది. బ్రేకులు సరిగా పడుతున్నాయా. ఆయిల్ వినియోగం ఎలా ఉంది.
 డ్రైవర్ రమేష్ : కండిషనలోనే ఉంది సార్. బ్రేకులు బాగున్నాయ్. కానీ.. ఆయిల్ మీటర్ పని చేయడం లేదు
 ఆశ్రం కాలేపీ స్టాప్ రావడంతో ఆర్‌ఎం బస్సు దిగారు. అక్కడ వేచి ఉన్న ప్రయూణికులతో మాట్లాడారు.
 రామారావు : ఇక్కడ బస్సులు ఆగుతున్నాయా
 జి.స్వర్ణశేఖర్ : ఎక్కువగా బైపాస్ సర్వీసులు కావడంతో దిగేవారు ఉంటేనే ఆపుతున్నారు. పైగా నిలబడటానికి షెల్టర్ కూడా లేకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడవాల్సి వస్తోంది. అక్కడే ఆటో వద్ద కొంతమంది మహిళలు వేచి ఉండటాన్ని గమనించిన ఆర్‌ఎం ‘ఏమ్మా.. ఎక్కడికి వెళ్లాలి’ అని అడిగారు. ‘కైకరం వెళ్లాల’ని వారు చెప్పారు. మరి ఆటో వద్ద నిలబడా ్డరేంటి, ఆర్టీసీ బస్సులో వెళ్లొచ్చుగా అని అడిగారు.
 దత్త సీతమ్మ : మా ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అందుకే ఆటో మాట్లాడుకుని వెళుతున్నాం.
 రామారావు : ఆటోలో ప్రయాణం ప్రమాదమని తెలుసా. ఆటో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయ్ కదా.
 సీతమ్మ : మాకు బస్సు సౌకర్యం లేకపోవడంతో తప్పని పరిస్థితిలో ఆటోలో వెళుతున్నాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement