పాశిగామ... గోదావరి తీరంలో చిన్న గ్రామం. 1994లో వచ్చిన గోదావరి వరదలతో పంటలు, ఇళ్లు మునిగిపోయాయి. ఆ బాధ ఇప్పటికీ వాళ్ల క ళ్ల ముందు కదలాడుతూనే ఉంది.. ఆ చేదు జ్ఞాపకాలనుంచి తేరుకోకముందే మళ్లీ ఎల్లంపెల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ రూపంలో భయపెడుతోంది. ప్రాజెక్టు నిండినప్పుడు 500 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. తమను ముంపు గ్రామం జాబితాలోకి చేర్చాలంటూ ధర్మపురి మండలం పాశిగామ గ్రామస్తులు కొన్నాళ్లుగా కోరుతున్నారు. వారి బాధలు తెలుసుకోవడానికి ప్రభుత్వ చీఫ్ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కొప్పుల ఈశ్వర్ : అందరికీ నమస్కారం.. మీ ఊళ్లో ఉన్న సమస్యలేంటి?
అత్తె వెంకన్న : ఎల్లంపెల్లి ప్రాజెక్టు నీళ్లు చేరి మా గ్రా మం మునిగిపోతుందని సర్వేలు చేసిండ్రు. సుమారు 500 ఎకరాలు ముంపులో పోతున్నయ్. ఈ ఊరు మొత్తాన్ని ముంపు కింద తీసుకుని ఆదుకోవాలి.
కొప్పుల ఈశ్వర్ : అమ్మా.. నీపేరేంటి ? నీ బాధ ఏంటి చెప్పమ్మా?
కంటెం లక్ష్మి : మూణ్ణెళ్ల నుంచి మంచి నీళ్లు దొరకక క ట్టపడుతున్నం. ఊళ్లె చేద బావులు, బోరింగులు ఎం డిపోయాయి. మంచినీళ్లు దొరకక బాధపడుతున్నం. గ్రామపంచాయతీ వాళ్లు ఇస్తున్న నీళ్లు సగం ఊరికి కూడా సరిపోతలేవు. బోరింగ్ వేసి ఆదుకోవాలి.
కొప్పుల ఈశ్వర్ : తాతా.. నీకు పింఛన్ అత్తుందా?
శంకరయ్య : పింఛన్ అత్తలేదు బాంచెన్. మా ఊళ్లె నాతోటోళ్లకు పింఛన్ అత్తుంది. నాకు అత్తలేదు. నాకు పింఛన్ ఇప్పియ్యాలె సారు.
కొప్పుల ఈశ్వర్ :అవ్వా.. నీ సమస్యేంటి ?
లక్ష్మీనర్సవ్వ : ఎల్లంపెల్లి నీళ్లు మా ఊరికి దగ్గరగా అచ్చినయి. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నం. పాములు, తేళ్లు ఇండ్లళ్లకు చేరుతున్నయ్. పాములు కుట్టి ఇప్పటికి నలుగురు మనుషులు, ఎడ్లు, బర్రెలు సచ్చిపోతున్నయ్. ముంపుకింద మా ఊరును తీసుకోవాలె బాంచెన్.
కొప్పుల ఈశ్వర్ : ఏం.. ఎంపీటీసీ బాగున్నావా .. మీ ఊరు సమస్యలేంటి ?
ఈర్ల మొండయ్య, ఎంపీటీసీ : ఇంతకుముందు ప్రభుత్వాలు మా గ్రామాన్ని పట్టించుకోలేదు. అందుకే ఎండాకాలం రాక ముందే నీళ్లకు క ట్టపడుతున్నాం. రోడ్లు లేవు. ఇన్ని రోజులు కరెంటు గురించి పట్టించుకునేటోళ్లు లేరు. తెలంగాణా గవర్నమెంటులోనైనా ప్రజల బాధలను పట్టించుకోవాలె.
కొప్పుల ఈశ్వర్ : బాబూ.. ఏం పని చేస్తన్నవ్? నీ సమస్యేంటి?
కంటెం తిరుపతి : మాఊర్లో కరెంటు వైర్లతో భయంగా ఉంది. ఇండ్లమీది నుంచి పెద్ద లైను పోయింది. దాంతో దినదినం భయంగా ఉంది. గాలి బాగా వచ్చినప్పుడు తీగలు తెగి మా ఇండ్ల పైన పడేట్టు ఉన్నయ్. లైను ఊరి నుంచి పక్కకు మార్చాలి.
కొప్పుల ఈశ్వర్ : రోడ్ల వసతులు ఎట్లున్నయ్?
కంటెం మల్లయ్య : గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి రావాంటే నరక యాతన పడుతున్నం. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. పెద్దరోడ్డు నుంచి కోటిలింగాల ఎక్స్‌రోడ్డు వరకు పంట పొలాల్లో నుంచి రోడ్డును మంజూరు చేయాలె.
కొప్పుల ఈశ్వర్ : మేడమ్.. పాఠశాలలో సమస్యలున్నాయా ?
రమాదేవి, ప్రభుత్వ టీచర్ : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీలేదు. పలువురు స్కూల్ పరిసరాల్లోకి మూత్రవిసర్జన చేస్తున్నారు. బోధనకు ఇబ్బంది అవుతోంది. కంపౌండ్ వాల్‌కు నిధులు మంజూరు చేయాలి. కంపౌండ్ లేక పాఠశాలలో మద్యం సేవిస్తూ ఇబ్బందులు కల్గిస్తున్నారు.
కొప్పుల ఈశ్వర్ : బాబూ... నీబాధేంటి ?
ఎంబటి శంకరయ్య : మా గ్రామాన్ని ముంపుకింద చేర్చుతామని, నష్టపరిహారం ఇప్పిస్తామని కొందరు ఇంటికి పదివేల నుంచి ముప్పై వేల రూపాయలు దాకా వసూల్ చేసిండ్రు. ఆరు నెలల్లో పనవుతుందన్నారు. వసూలు చేసి రెండేండ్లరుుతంది. పైసలు ఇత్తలేరు. పని జేత్తలేరు. మా పైసలు మాకు ఇప్పించాలి. మమ్మల్ని ముంపు గ్రామం కింద చేర్చాలె.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా..
అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్న పాశిగామను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. గత పాలకుల నిరంకుశ నిర్లక్ష్యపు ధోరణి తో నేడు చాలా గ్రామాలు తాగునీ టికి అల్లాడుతున్నాయి. స్థానికులు మూడునెలలు గా అవస్థలు పడుతున్నారు. సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసరమైన చోట బోర్‌వెల్స్ వేసి తాగునీటి అవసరాన్ని తీరుస్తాం. గ్రామంలో ఎల్లంపెల్లిప్రాజెక్టు కింద 400ఎకరాల భూమి ము ంపునకు గురై ప్రజలు ఉపాధిని కోల్పోయి ఇబ్బం దులు పడుతున్నారు. వారి సమస్యలు తీరుస్తా.
ఎల్లంపెల్లి నీటితో ముంపునకు గురవుతున్నందున ముంపు గ్రామాల జాబితాలో చేర్చడానికి కృషిచేస్తా.
జాతీయరహదారి నుంచి గ్రామంలోకి రోడ్డు సౌకర్యం కల్పిస్తా.
తాగునీటి వసతుల కోసం సత్వరం బోరింగులు ఏర్పాటు చేసి తాగునీరందిస్తాం.
అర్హులందరికీ పింఛన్లు అందించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతా.
భయం.. భయంగా..
Published Mon, Feb 16 2015 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM
Advertisement
Advertisement