మోడల్‌గా తీర్చిదిద్దుతా.. | definitely done development | Sakshi
Sakshi News home page

మోడల్‌గా తీర్చిదిద్దుతా..

Published Mon, Nov 24 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

మోడల్‌గా తీర్చిదిద్దుతా..

మోడల్‌గా తీర్చిదిద్దుతా..

ఆసిఫాబాద్ : వారంతా ఆదిమ గిరిజన విద్యార్థులు. అందరూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వారే. బిడ్డలు దూరంగా ఉన్నా సరే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందుతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కొందరు అధికారుల పర్యవేక్షణ లోపం.. సిబ్బంది నిర్లక్ష్యం వెరసి గురుకుల పాఠశాలు, వసతిగృహాల్లో సమస్యలు తిష్టవేస్తున్నాయి. కొన్ని చోట్ల మెనూ కూడా అమలుకు నోచుకోవడం లేదు. విద్యార్థులు చదువులోనూ వెనుకబడుతున్నారు. వీటితోపాటు విద్యార్థుల సమస్యలనూ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్ ‘వీఐపీ రిపోర్టర్’ గా మారారు.

ఆసిఫాబాద్‌లోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, వార్డెన్ ఉంటే సమస్యలు చెప్పడానికి విద్యార్థులు భయపడుతారనే ఉద్దేశంతో వారిని బయటకు పంపించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సాధక, బాధకాలు తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. మెనూ అమలు తీరు, విద్యార్థుల బస, సిలబస్, బోధన, ఆరోగ్యం, క్రీడలు ఇలా అన్నింటినీ తెలుసుకున్నారు. విద్యార్థులతో కలెక్టర్ సంభాషణ ఇలా సాగింది..
 
సబ్ కలెక్టర్‌ను గమనించిన విద్యార్థులు : నమస్కారం సార్..
సబ్ కలెక్టర్ : నమస్కారం... అక్కడున్న ఓ విద్యార్థితో ఏ వూరు బాబు
విద్యార్థి పాండు : శాకన్‌గోంది సబ్‌కలెక్టర్
ప్రశాంత్ పాటిల్ : ఏ క్లాస్
విద్యార్థి పాండు : టెన్త్
సబ్‌కలెక్టర్ : చదువు ఎలా ఉంది, భోజనం సరిపోతుందా..?
విద్యార్థి పాండు : బావుంది. సరిపోతుంది
సబ్‌కలెక్టర్ : సాయంత్రం స్నాక్స్ ఏమి ఇస్తుండ్రు
విద్యార్థి పాండు : పల్లిపట్టి
సబ్ కలెక్టర్ : అందరికీ ఇస్తుండ్రా
విద్యార్థి : ఇస్తుండ్రు
సబ్ కలెక్టర్ : గుడ్లు ఎప్పుడు ఇస్తుండ్రు
విద్యార్థి : ప్రతి రోజు
సబ్ కలెక్టర్ : ఈ రోజు మెనూ ఏమి ఇచ్చిండ్రు, రాత్రి ఏమి ఇస్తుండ్రు
విద్యార్థులు : బాగా తినాలి
సబ్ కలెక్టర్ : ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా, టీచింగ్ ప్రాబ్లం ఉందా, టీచర్లు సరైన సమయానికి వస్తుండ్రా
విద్యార్థి : సరైన సమాధానం చెప్పలేదు అక్కడే ఉన్న ఉపాధ్యాయులందరినీ, వార్డన్‌ను బయటకు వెళ్లాలని, ప్రిన్సిపాల్‌ను పిలవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
సబ్ కలెక్టర్ : ఇప్పుడు చెప్పండి, మీకు భయం లేదు. రెగ్యులర్‌గా క్లాసెస్ జరుగుతున్నాయా.
విద్యార్థులు : జరుగుతున్నాయి.
సబ్ కలెక్టర్ : ఉదయం ఎప్పుడు నిద్ర లేస్తున్నారు
విద్యార్థులు : 5 గంటలకు..
సబ్ కలెక్టర్ : బ్రేక్‌ఫాస్ట్ ఏమి ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు..
విద్యార్థులు : కిచిడి, ఆలు ఉదయం 7.15 గంటలకు ఇస్తారు
సబ్ కలెక్టర్ : ఉపాధ్యాయులు రైట్ టైమ్‌కు వస్తారా, అందరూ వస్తారా
విద్యార్థులు : వస్తారు
సబ్ కలెక్టర్ : స్కూల్‌కు ఎప్పుడు వెళ్తారు
విద్యార్థులు : 9 గంటలకు వెళ్తాం
సబ్ కలెక్టర్ : రాత్రి పడుకునేటప్పుడు చెద్దర్లు ఉన్నయా..
విద్యార్థి ఎం.మారుతి :  ఉన్నాయి కానీ కరెంటు పోతే ఇబ్బందవుతుంది..
సబ్ కలెక్టర్ : నైట్ స్పెషల్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతయి
విద్యార్థి ఎం.మారుతి :  రాత్రి 7 గంటలకు
సబ్ కలెక్టర్ : టీచర్లు, ప్రిన్సిపాల్ అందరు వస్తరా
విద్యార్థి ఎం.మారుతి :  వస్తరు సార్
 - అదే సమయంలో  ప్రిన్సిపాల్ రాజేశ్వరశర్మ వచ్చారు..
సబ్ కలెక్టర్ : ఉదయం విద్యార్థులకు పాలు ఇస్తుండ్రా
ప్రిన్సిపాల్ : పాలు, టీ ఇస్తున్నాం
సబ్ కలెక్టర్ : విద్యార్థులకు టీ బంద్ చేయాలి. పాలు ఇస్తేనే వారి హెల్త్ బాగుంటుంది.
సబ్ కలెక్టర్ : ఉదయం ఏం టిఫిన్ ఇస్తరు
విద్యార్థి ఎం.మారుతి :  ఇడ్లి, పూరి
సబ్ కలెక్టర్ : మధ్యాహ్నం ఎగ్స్ ఇస్తుండ్రా
విద్యార్థి : ఇస్తుండ్రు
సబ్ కలెక్టర్ : ఎంతమంది విద్యార్థులున్నారు..
ప్రిన్సిపాల్ : 500 మందికి ఈ రోజు 471 మంది ఉన్నారు.

మరో విద్యార్థితో..
సబ్ కలెక్టర్ : టెన్త్‌లో పాసైతమని భరోసా ఉందా, మ్యాథ్స్ ఎవరు చెప్తారు..
విద్యార్థి ఉపేందర్ : ఉంది. మ్యాథ్స్ శ్యాంసార్ చెప్తారు.
సబ్ కలెక్టర్ : ఎలా చెప్తాడు
విద్యార్థులు : బాగా చెప్తాడు
సబ్ కలెక్టర్ : మీరు ఏ సబ్జెక్ట్‌లో వీక్
విద్యార్థులు : ఇంగ్లిష్
సబ్ కలెక్టర్ : వాట్ ఈజ్ యువర్ నేమ్
విద్యార్థి : నరేశ్
సబ్ కలెక్టర్ : వాట్ ఈజ్ యువర్ హాబీ
విద్యార్థి నరేశ్ : : రైటింగ్
సబ్ కలెక్టర్ : హాబీ అంటే ఖాళీ సమయంలో చేసే పని. ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం, సినిమా చూడడం కూడా హాబీయే.
సబ్ కలెక్టర్ : హాస్టల్‌లో మీరు సంతోషంగా ఉన్నారా. కప్పుకునేందుకు రగ్గులున్నాయా, మీకు ఇంకా ఏం కావాలి
విద్యార్థి మారుతి : రగ్గులున్నాయి
సబ్ కలెక్టర్ : టాయిలెట్లు ఉన్నయా
విద్యార్థి మారుతి : ఉన్నయి కానీ సరిపోతలేవు, వాటర్‌ప్రాబ్లం ఉంది.
సబ్ కలెక్టర్ : ఈ విషయం మీ ప్రిన్సిపాల్‌కు చెప్పారా
విద్యార్థి మారుతి : చెప్పాం.
ప్రిన్సిపాల్ : టాయిలెట్లు మరమ్మతుకు డబ్బులు లేవు. స్కూల్ నుంచి వచ్చే ఫండ్స్ సరిపోవడం లేదు.
సబ్ కలెక్టర్ : ఐటీడీఏ నుండి టాయిలెట్లు మరమ్మతు చేయిస్తా.
సబ్ కలెక్టర్ : స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి
విద్యార్థులు : చేస్తం సార్
సబ్ కలెక్టర్ : స్పెషల్ క్లాస్ ఎప్పుడు తీసుకుంటారు
విద్యార్థులు : రాత్రి 7 నుండి 8 గంటల వరకు
సబ్ కలెక్టర్ : నిన్న ఏమి ఇచ్చారు, హోంవర్క్ చేస్తున్నారా
విద్యార్థులు : చేస్తున్నం సార్
సబ్ కలెక్టర్ : పరీక్షలు వస్తున్నయి కాబట్టి టైంటేబుల్ తయారు చేసుకోవాలి. ఈ యేడాది ఎస్‌ఎస్‌సీ పరీక్షల విధానం మారింది. చూచి రాసే అవకాశం లేదు. గదుల్లో సీసీ కెమెరాలు పెడ్తరు కాబట్టి కాపీ కొట్టే అవకాశం లేదు. మంచిగా చదవాలి
విద్యార్థులు : సరే సార్
సబ్ కలెక్టర్ : మీకు తెలుసా నేను సబ్ కలెక్టరని
విద్యార్థులు : తెలుసు సార్ పార్ట్ టైం ఉపాధ్యాయుల సమస్యలు అక్కడే ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయులు తమ గోడు సబ్ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.
పార్ట్ టైం ఉపాధ్యాయులు : సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్నం. గతేడాది నెలకు రూ.ఏడున్నర వేలు ఇవ్వగా, ఈ యేడాది రూ.ఐదు వేలకు తగ్గించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే మేమే హైదరాబాద్, కరీంనగర్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నం.
సబ్ కలెక్టర్ : ఇది నా చేతుల్లో లేదు. పాలసీ మ్యాటర్. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తా. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కదా..
మళ్లీ విద్యార్థులతో మాట్లాడుతూ..
సబ్ కలెక్టర్ : డాక్టర్లు వస్తున్నారా
విద్యార్థులు : వస్తున్నారు.
సబ్ కలెక్టర్ : మందులు ఏమి ఇస్తున్నరు
వద్యార్థులు : జ్వరం ఉన్నవాళ్లకు  టాబ్లెట్స్ ఇస్తుండ్రు.
సబ్ కలెక్టర్ : మీ ఫ్రెండ్స్‌కు జ్వరం వస్తే వెంటనే ప్రిన్సిపాల్‌కు చెప్పాలి
విద్యార్థులు : చెప్తం సార్
సబ్ కలెక్టర్ : స్కూల్‌లో గేమ్స్ ఆడిస్తరా,
విద్యార్థులు : ఆడిస్తరు.
సబ్ కలెక్టర్ : స్పోర్ట్స్ మెటీరియల్ ఉందా
విద్యార్థులు : లేదు
సబ్ కలెక్టర్ : నేను ప్రొవైడ్ చేస్తా
అక్కడి నుండి కిచెన్‌కు వెళ్లి పరిశీలించారు.
సబ్ కలెక్టర్ : కిచెన్ ఫ్లోరింగ్ సరిగా లేదు. ఏం ప్రాబ్లమ్
ప్రిన్సిపాల్ : ఫండ్స్ లేవు. సంవత్సరానికి రూ.4 వేలు వస్తయి. ఈయేడాది రాకపోతే నేనే రూ.10 వేలతో మరమ్మతులు చేయించా
సబ్ కలెక్టర్ : ఏం పరవాలేదు. రెండు మూడు నెలల్లో మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేస్తా.
సబ్ కలెక్టర్ : మోటార్ నడుస్తుందా
ప్రిన్సిపాల్ : నడుస్తుంది
సబ్ కలెక్టర్ : తాగడానికి ఏ నీరు వాడుతున్నారు
విద్యార్థులు : ఆర్‌వో ప్లాంట్ ఉంది సార్
సబ్ కలెక్టర్ : సరిగా పని చేస్తుందా
విద్యార్థులు : కొన్ని రోజులు పని చేయలేదు. ఇప్పుడు పని చేస్తుంది.
ప్రిన్సిపాల్ : సార్ స్టాఫ్ క్వార్టర్స్ కూలిపోతున్నాయి.
సబ్ కలెక్టర్ : ఎన్ని క్వార్టర్స్ ఉన్నయి
ప్రిన్సిపాల్ : 16 క్వార్టర్లకు రెండు మాత్రమే బాగున్నయి.
సబ్ కలెక్టర్ : ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే ఉంటే విద్యార్థులు బాగు పడతారు.
ఉపాధ్యాయులు : విద్యార్థులకు షూస్ రాలేదు.
సబ్ కలెక్టర్ : షూ కోసం ప్రాబ్లం లేదు. నేను ఇప్పిస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement