ప్రతీ సమస్యపై దృష్టిపెట్టండి | Focus on each issue | Sakshi
Sakshi News home page

ప్రతీ సమస్యపై దృష్టిపెట్టండి

Published Tue, Dec 9 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

ప్రతీ సమస్యపై దృష్టిపెట్టండి

ప్రతీ సమస్యపై దృష్టిపెట్టండి

సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ 
ఆసిఫాబాద్‌లో అర్జీల స్వీకరణ

 
ప్రజా ఫిర్యాదుల విభాగంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కార్యాలయంలో డివిజన్‌లోని ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కెరమెరి మండలం అనార్‌పల్లికి చెందిన రాథోడ్ వెంకట్రావు, కాగజ్‌నగర్ మండలం చింత గూడకు చెందిన జుమ్మిడి పోచయ్య భూమి నష్ట పరిహారం చెల్లించాలని, సిర్పూర్(టి)కి చెందిన ఐనబోయిన లక్ష్మీనారాయణ,మోసంకు చెందిన దిలీప్‌కుమార్ ఆర్‌వోఆర్ పట్టా పాస్‌బుక్ కోసం, వివిధ సమస్యలపై సబ్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. డీఏవో సూరిబాబు, అధికారులు పాల్గొన్నారు.                   
 
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజలు వివిధ సమస్యలు పరిష్కరించాలంటూ వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికి వచ్చి అర్జీలు అంద జేస్తారని, సంబంధిత అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. ప్రజల సమస్యనూ పరిగణలోకి తీసుకుని పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కరించినట్లయితే ఆ సమస్యకు అప్పుడే ముగింపు ఉంటుందని తెలిపారు.

చిన్న సమస్యలపైనా అధికారులు దృష్టి సారించకపోవడంతోనే ఒక్కో అర్జీదారు మళ్లీమళ్లీ కార్యాలయాలకు రావాల్సిన పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. అనంతరం ఒక్కో అర్జీదారు నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆయా శాఖలకు చెందిన అధికారులకు అందజేశారు. అదనపు జేసీ ఎస్.ఎస్.రాజు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, సీపీవో షేక్‌మీరా, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ గణేశ్ జాదవ్, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
ఉట్నూర్ రూరల్ : గిరిజన దర్బార్‌లో గిరిజనులు అందించే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో భీమ్ అ న్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చి న గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ గిరిజన ద ర్బార్‌లో కాగజ్‌నగర్ మండల కేంద్రానికి చెందిన కుంర అరుణ్, ఆత్రం కిష్టు తాము సాగు చేస్తున్న భూములకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరారు. ఇదే మండలానికి చెందిన సూర్పం చందు తాను పేదవాడినని, ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక స్థోమత లేదని, ఐటీడీఏ ద్వారా ఇల్లు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. జైనూర్ మండలం పారా గ్రామానికి చెందిన కినాక ఆనంద్‌రావ్ తనకు 4 ఎకరా ల వ్యవసాయ భుమి ఉందని, అరటి తోటను పెంచుకునేం దుకు ఆర్థిక సహాయం చేయాలని దరఖాస్తు అందించాడు.

బేల మండలం సోపడ్ గ్రామానికి చెందిన మడావి లక్ష్మి తా ను 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి ఇతరులు కబ్జా చేశారని, తన భూమి తనకు ఇప్పించాలని అర్జీ పెట్టుకుంది. నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన సూర్పం రాజు తన కు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని వ్యవసాయం కోసం బోరు మంజూరు చేయాలని వేడుకున్నారు. దండేపల్లి మండలానికి చెందిన నారాయణ తన భూమికి సంబంధించి న కేసు ఐటీడీఏ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని దాన్ని పరిష్కరించాలని అర్జీ పెట్టుకున్నారు. అర్జీలను సంబందిత అధికారులు క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలని ఏవో ఆదేశించారు. ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.
 
పీవో, డీడీలను వెంటనే నియమించాలి
ఉట్నూర్ రూరల్ : ఐటీడీఏ కార్యాలయంలో రెగ్యులర్ పీవో, డీడీలను వెంటనే నియమించాలని పలువురు ఆదివాసీ సం ఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఐటీడీఏ కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఐటీడీఏలో రెగ్యులర్ పీవో లేకపోవడంతో గిరిజన దర్బార్‌కు సైతం అధికారులు రావడం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా సమస్యలు వివరించేందుకు వస్తున్న గిరిజనులు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెడ్మ బొజ్జు, తుడుందెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, తొటి సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కుడిమెత తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement