ట్రా‘ఫికర్’,పోకిరీలకు చెక్
రెండు లక్షలకుపైగా జనాభా... మూడు వేల ఆటోలు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవి అదనంగా మరో మూడు వేలు... భారీస్థాయిలో ద్విచక్ర వాహనాలు, లెక్కకు మించి కార్లు... కానీ, సన్నని రోడ్లు... ఇరుకు సందులు.. విస్తరించని జంక్షన్‌లు.. సీసీ కెమెరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వంటివి పెద్దగా కనిపించని కూడళ్లు. ఫలితం... నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుని ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఏడాదికి వాహనాల నుంచి జరిమానా కింద రూ.38 లక్షల వసూలవుతున్నా.. ట్రాఫిక్ మెరుగుకు చర్యలు తీసుకోవడం లేదు. విజయనగరం పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ కోసం నిధులు వెచ్చించాలంటే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం అవసరం. ఆ దిశగా కౌన్సిల్ తీసుకున్న చర్యలు శూన్యం. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాతంలో కళాశాలలు ఎక్కువగా ఉండడం వల్ల ఈవ్‌టీజింగ్, అసభ్యకర ప్రవర్తన వంటి సంఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు, పోకిరీల సమస్యకు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. పలు కూడళ్లు, కళాశాలలకు వెళ్లి ప్రజలు, విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.
విజయనగరం పట్టణంలోని ట్రాఫిక్, ఈవ్‌టీజింగ్ సమస్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాను. పట్టణంలో 2.50 లక్షల మంది జనాభా ఉన్నారు. మూడు వేల ఆటోలు, ఇతర ప్రాంతాల నుంచి అనేక ఆటోలు, ఇతర వాహనాలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి 2600 బస్సులు వస్తున్నాయి. ఇరుకైన రోడ్ల వల్ల కూడా ట్రాఫిక్ సమస్యకు ఏర్పడుతోంది. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మున్సిపల్ పాలకమండలి సభ్యులతో కూడా మాట్లాడాం. మయూరీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కొత్తపేట నీళ్లట్యాంకు వద్ద సిగ్నల్ లైట్లు, జిల్లా ఎస్పీకార్యాలయం వద్ద ప్రమాదాల నిరవార ణకు బ్లింకర్స్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. స్పెషల్ పార్టీలను నియమించి ఈవ్‌టీజింగ్‌ను నిరోధిస్తాం.
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, ఆటో యూనియన్, కాంప్లెక్స్‌లో విద్యార్థినీవిద్యార్థులతో ఆయన సంభాషణ ఇలా సాగింది...
డీఎస్పీ: సమస్కారమండి, నా పేరు శ్రీనివాస్, నేను డీఎస్పీగా పనిచేస్తున్నాను మీపేరేంటి ?
అప్పలరెడ్డి: నమస్తే సార్, నాపేరు అప్పలరెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షుడిని సార్.
డీఎస్పీ: మీ సమస్యలేంటి ?
అప్పలరెడ్డి: పట్టణంలో పార్కింగ్ స్థలా లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ట్రాఫిక్ పోలీసులు రాంగ్ పార్కిం గ్‌కు అప్పుడప్పుడు కేసులునమోదు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాలు ఉంటే నలబైశాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది.
డీఎస్పీ:ట్రాఫిక్ పోలీసులువేధిస్తున్నారా?
అప్పలరెడ్డి: అటువంటిదేమీ లేదండి. ట్రాఫిక్ పోలీసులు సహకరిస్తున్నారు.
డీఎస్పీ: అమ్మాయిలూ మీ పేర్లేంటి?
అమ్మాయిలు: నాపేరు కె.ప్రమీల, నాగమణి
డీఎస్పీ : ఏ కాలేజీలో చదువుతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు ?
ప్రమీల,నాగమణి: శ్రీచైతన్యంలో కళాశాలలో సార్, లక్కిడాం నుంచి వస్తున్నాం.
డీఎస్పీ: ఏ వాహనంలో ప్రయాణం చేస్తున్నారు? ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారా?
ప్రమీల,నాగమణి: ఆర్టీసీ బస్సులో వస్తున్నాం సార్, ఇబ్బందులు లేవు సార్.
డీఎస్పీ: ప్రయాణికులను అధికంగా ఎక్కించుకున్న ఆటో డ్రైవరువద్దకు వెళ్లి... నీపేరేంటి?
నాగరాజు: నాపేరు నాగరాజు సార్.
డీఎస్పీ: ఆటోలో ఎంతమందిని ఎక్కిం చాలి?
నాగరాజు: 4+1సార్
డీఎస్పీ: మరి ఎంతమందిని ఎక్కించారు
నాగరాజు : ఎక్కువ మందిని సార్.
డీఎస్పీ: ఎక్కించకూడదని తెలియదా?
నాగరాజు: లోకల్లో ఎక్కిస్తాం. దూరప్రాం తాలకు వెళ్లే సమయంలో తక్కువగా ఎక్కిస్తాం
డీఎస్పీ(ఆటోలో ప్రయాణికుడిని ఉద్దేశించి): నీపేరేంటి ?
మూర్తి: నా పేరు మూర్తి.
డీఎస్పీ: ప్రమాదాలు జరిగితే ఎవరి మీద నిందలువేస్తారు?
మూర్తి: ఎవరి మీద నిందలు వేయం సార్, మాకు తెలియక రద్దీగా ఉన్న ఆటోలు ఎక్కుతున్నాం. మీరు వద్దంటే మానేస్తాం
డీఎస్పీ: మీ పేరేంటమ్మా?
వెంకటలక్ష్మి: నా పేరు వెంకటలక్ష్మి
డీఎస్పీ : ఎక్కడ నుంచి వస్తున్నారు?
వెంకటలక్ష్మి: సాలూరు నుంచి వస్తున్నాం.
డీఎస్పీ: ఆటోలో ఇంతమంది ప్రయాణం చేస్తే ప్రమాదమని తెలియదా?
వెంకటలక్ష్మి: సాలూరు నుంచి బస్సులో వచ్చాను. లోకల్ కదాని తప్పక ఆటోలు ఎక్కుతున్నాం
డీఎస్పీ: తల్లీ నీపేరేంటి? ఎక్కడ నుంచి వస్తున్నావు, ఏ కళాశాలలో చదువుతున్నావు?
కుమారి: నాపేరు కుమారి, మాది వేం డ్రం. ఊరి నుంచి బస్సులో వస్తున్నాను. ఎం.ఆర్ కళాశాల చదువుతున్నాను
డీఎస్పీ: బస్సులో వచ్చే సమయంలో పోకిరీలు వేధిస్తున్నారా?
కుమారి: అటువంటిదేమీ లేదుసార్
ఎన్‌ఆర్‌ఐ కళాశాల్లోకి వెళ్లి..
డీఎస్పీ: మీపేర్లేంటి ? ఎక్కడనుంచి వస్తున్నారు? ఎలా వస్తున్నారు?
అమ్మాయిలు: మా పేర్లు మౌనిక, అనురాధ, కీర్తి,
మౌనిక, కీర్తి : మేం విజయనగరంలోనే ఉంటున్నాం సార్
అనూరాధ : నేను గజపతి నగరం నుంచి వస్తున్నాను సార్.
డీఎస్పీ: కాలేజీకి వచ్చే సమయంలో ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారా?
అమ్మాయిలు: అటువంటిదేమీలేదు సార్
డీఎస్పీ: నీపేరేంటమ్మా ? ఎక్కడ నుంచి కాలేజీకి వస్తున్నారు?
సరళప్రియ: నాపేరు సరళ ప్రియ. కామాక్షినగర్ నుంచి వస్తున్నాను. మమ్మీ తీసుకువస్తారు.
డీఎస్పీ: పోకిరీలు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా?
సరళప్రియ: సూపర్ మార్కెట్ వద్ద పోకిరీలు ఎక్కువగా ఉన్నారు, వారు వేధిస్తున్నారు. పేరెంట్స్‌ని చూడకుండా బండ బూతులు తిడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని మమ్మీ చెప్పింది.
డీఎస్పీ: నేను టౌన్ డీఎస్పీని, మీకు ఎలాంటి సమస్యలువచ్చినా వెంటనే నాకుగాని, సీఐలకు గాని, ప్రభుత్వం ప్రకటించిన 100 నంబర్ ఫోన్‌చేస్తే నిమిషాల్లో మీదగ్గర ఉంటాం. ఆకతాయిల ఆట కట్టిస్తాం. ఏ సూపర్ మా ర్కెట్ వద్ద వేధిస్తున్నార మ్మా...
సరళప్రియ: మయూరీ హొటల్ కిందనున్న సూపర్ మార్కెట్ వద్ద సార్
డీఎస్పీ: మీపేరేంటి? ఎక్కడ నుంచి కాలేజీ వస్తున్నారు?
చాందిని: నాపేరు చాందిని. నేను బా బామెట్టనుంచి ఆటోలో వస్తున్నాను. కళాశాల నుంచి ఆటోలో వెళ్లి రింగురో డ్డు వద్దకు దిగుతాం. అక్కడ నుంచి బాబామెట్టకు వెళ్లేవరకు పోకిరీలుం టున్నారు. నిత్యం వేధిస్తున్నారు సార్.
డీఎస్పీ: వేధిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి, లేదా పోకిరీల బైకు నంబర్లను నోట్‌చేసి పోలీసులకు అందించండి?
చాందిని: అలాగే సార్.
డీఎస్పీ: మీ పేరేంటి? మీరేం చేస్తుం టారు?
నాగు: నాపేరు నాగు సార్, నేను శ్రీరాజా డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నాను. ఇక్కడ పార్కింగ్ స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల ఆస్పత్రికి వెళ్లే రోడ్డుగుండా అనేకమంది ఆస్పత్రికి వ స్తూ వెళ్తుంటారు. ఇక్కడి మయూరీ హొటల్‌కు వచ్చే వారు రోడ్డుమీద వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
డీఎస్పీ: టీఎస్‌ఆర్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు. ?
నాగు: కాంప్లెక్స్ నిర్వహణను నేనే చూస్తున్నాను సార్.
డీఎస్పీ: అయితే మీకు బాధ్యత లేదా?
నాగు: ఎవరి షాపుల ముందు, వారి వా హనాలు పార్కింగ్ చేసుకోవచ్చు సార్.
డీఎస్పీ: పోకిరీలు ఎవరైనా అమ్మాయిలను వేధిస్తారా? పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహించడం లేదా?
నాగు: అమ్మాయిలను యువకులు ర్యాగింగ్ చేస్తుంటారు సార్, మేము అడిగితే మాపై దాడిచేసే అవకాశం ఉందని భయపడుతున్నాం. గతంలో పోలీసులు కాపలాకాసేవారు. ప్రస్తుతం రావడంలేదు
డీఎస్పీ: నీ పేరేంటమ్మా ? ఏమి చదువుకున్నావు ?
అలేఖ్య: నాపేరు అలేఖ్య, ఆంధ్రా యూనివర్సిటిలో చదువుతున్నాను.
డీఎస్పీ: పట్టణంలో ట్రాఫిక్ ఎలా ఉందని భావిస్తున్నారు?
అలేఖ్య: పట్టణంలో ట్రాఫిక్ గజిబిజిగా ఉంది సార్. ఉదయం, సాయంత్రం సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. పెద్దచెరువు గట్టు చు ట్టూ ఆహ్లాదకర వాతావరణంలో కూర్చోడానికి వీలుగా బల్లలు వేస్తే బాగుంటుం ది. కనీస సదుపాయాలు కూడా లేవు
డీఎస్పీ : మీ పేరేంటి? మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? ఏం చేస్తున్నారు ?
వరలక్ష్మి: నాపేరు వరలక్ష్మి. నేను సిద్దార్థనగర్ నుంచి వస్తున్నారు. నేను ఎంఆర్ ఉమెన్స్ కాలేజీలో జువాలజీ లెక్చరెర్‌గా పనిచేస్తున్నాను.
డీఎస్పీ: పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉందా?
వరలక్ష్మి: పట్టణంలోని మయూరీ హొట ల్ నుంచి ఎత్తుబ్రిడ్జి వరకు ట్రాఫిక్ సమస్యగా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం దా టాలంటే చాలా సమయం పడుతోంది. అలాగే సింహచలం మేడనుంచి కోట జం క్షన్ వరకు వాహనాలతో రద్దీతో ఇబ్బం ది ఎదుర్కొంటున్నాం.
డీఎస్పీ: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీ సలహాలు, సూచనలు ఏంటి ?
వరలక్ష్మి: ట్రాఫిక్ సమస్య పరిష్కారం కా వాలంటే పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. రోడ్లను వెడల్పు చేయాలి. అందుకు ప్ర జలు సహకరించాలి
డీఎస్పీ: నీపేరేంటి? సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని తెలియదా?
ఈశ్వరరావు: నాపేరు ఈశ్వరరావు, నేను ప్రైవేటు అకౌంట్స్ చూస్తాను. ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చిందని ఫోన్ ఎత్తి పక్కకు వెళ్లి మాట్లాడుదామని చెప్పి పక్కకు వెళ్తున్నాను.
డీఎస్పీ: ప్రమాదానికి గురైతే ఎవరూ బాధ్యత వహిస్తారు?
ఈశ్వరరావు: లేదుసార్ సెల్‌ఫోన్ డ్రైవిం గ్ చేయను సార్.
డీఎస్పీ: నీపేరేమిటి? ఎన్ని సంవత్సరాల నుంచి సిలిండర్లు తీసుకువెళుతున్నారు ?
ఆదినారాయణ: నా పేరు ఆదినారాయణ సార్. పది సంవత్సరాల నుంచి సిలిండర్లను టూ వీలర్‌పై తెస్తూ ప్రజలకు అం దిస్తున్నాను. రోజుకు 10 సిలిండర్లు తెస్తాను సార్.
డీఎస్పీ: గ్యాస్ సిలిండర్లు టూ వీలర్‌పై తేవడంవల్ల ప్రమాదాలు జరిగితే ప్రజ ల కు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందికదా?
ఆదినారాయణ: వాహనాన్ని తక్కువ స్పీ డులో నడుపుతాను సార్, నెమ్మదిగా ప్ర యాణం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.
డీఎస్పీ: మీపేరేంటి, మీరేం చేస్తున్నారు?
నాగార్జున: నా పేరు నాగార్జున, నేను ఎం.ఆర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను
డీఎస్పీ: ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయా?
నాగార్జున: గురజాడ అప్పారావు రోడ్డు నుంచి మూడులాంతర్లు రోడ్డు వరకూ నిరంతరం ట్రాఫిక్ సమస్య ఉంటోంది. రోడ్డు వెడల్పు చేయడానికి మొదటి సం తకం పెట్టిన వాడిని నేనే.
డీఎస్పీ: గురజాడ అప్పారావు రోడ్డును వన్‌వే చేస్తే మంచిదేనా?
నాగార్జున : కచ్చితంగా సమర్థిస్తాను. చాలా మంచిది కూడా.
డీఎస్పీ: మీపేరేంటి? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు?
హనుమాన్‌శెట్టిరాజు: నాపేరు హనుమాన్ శెట్టిరాజు, ఇరవై సంవత్సరాలుగా మెడికల్ వ్యాపారం చేస్తున్నాను.
డీఎస్పీ: ట్రాఫిక్ సమస్య ఎలా ఉందని భావిస్తున్నారు?
రాజు: నేను అరవై ఏళ్ల నుంచి పట్టణంలో ఉంటున్నాను. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఎక్కువగానే ఉంది.
డీఎస్పీ: అప్పట్లో సమస్యలు లేవా?
రాజు: అప్పట్లో సైకిళ్లు తప్ప బళ్లు ఎక్కడివి. ఇప్పడు వాహనాలు ఎక్కువగా ఉం డడం వల్ల సమస్యలు వస్తున్నాయి.
డీఎస్పీ: గురజాడ అప్పారావు రోడ్డును వన్‌వే చేయడం వల్ల వ్యాపారానికి నష్టం ఉంటుందా?
రాజు: ఎటువంటి నష్టం ఉండదు. వన్‌వే చేస్తే చాలా మంచిది.
డీఎస్పీ: నీపేరేంటిబాబూ? ఓనర్‌వా?
సాయికుమార్: నా పేరు సాయికుమార్, నేను ఓనర్‌వాళ్ల అబ్బాయిని
డీఎస్పీ: రోడ్డు పక్కన పకోడీలు తయారుచేస్తే ప్రజలకు ఇబ్బంది కలగదా?
సాయికుమార్: వేరే ప్రాంతంలో తయా రు చేసి తెస్తున్నాను సార్, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్.
డీఎస్పీ: రోడ్డుమీదే కాగిన నూనె ఉంది, ఎవరైనా స్పీడ్‌గా వచ్చి నూనెను ఢీకొడి తే పరిస్థితి ఏంటి. ప్రమాదం జరిగే అవకాశం ఉందికదా?
సాయికుమార్: వంట నూనె కొంచెం లో పలిగా ఉంది సార్.
డీఎస్పీ: నీ పేరేంటి? ఎప్పటి నుంచి హెల్మెట్ వాడుతున్నారు? ఏ పని చేస్తున్నారు?
తిరుపతిరావు: నా పేరు తిరుపతిరావు, నేను సోషల్ మాస్టర్‌గా పనిచేస్తున్నాను. హెల్మెట్ అనేది రక్షణ కవచంలా, వెపన్‌గా పనిచేస్తుంది. స్పీడ్‌గా వెళ్లాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే.
డీఎస్పీ: హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అవగాహన కల్పిస్తున్నారా?
తిరుపతిరావు: సోషల్ రెస్పాన్స్ బులిటీ, రవాణా భద్రతాలో భాగంగా ట్రాఫిక్‌పై సోషల్ సబ్జెక్టు ఉంది. కుటుంబ సభ్యుల తోపాటు బయట వ్యక్తులకు హెల్మెట్ వాడాలని చెబుతున్నాను.