విజయనగరం క్రైం: సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విజయనగరం డీఎస్పీ ఏవీ రమణ తెలిపారు. శనివారం రాత్రి పట్టణంలోని వివేకానందకాలనీ వేంకటేశ్వరస్వామి గుడి ఆవరణలో నేరా ల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ప్రజలనుంచి పలు అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వేసవికాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొంతమంది అగంతకులు ఫోన్‌చేసి అకౌంట్ నంబర్లు, ఏటీఎం నంబర్లు తెలియజేయూలని కోరుతారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల ప్రాంతాల్లో పోలీసులతో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. వన్‌టౌన్ సీఐ వీవీ అప్పారావు ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వన్‌టౌన్ ఎస్సైలు జీఏవీ రమణ, కృష్ణవర్మ, సిబ్బంది దామోదర్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు
Published Sun, Mar 13 2016 12:54 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
Advertisement