Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm Jagan Election Campaign Schedule For May 11
సీఎం జగన్‌ రేపటి ప్రచార షెడ్యూల్‌ ఇలా...

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం( మే11) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.  ఉదయం 10 గంటలకు  నరసరావుపేట  పార్లమెంట్  పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని  కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా ఆఫీస్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ  పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఉప్పాడ బస్‌స్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు.

Ap High Court Angry With Election Commission
ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం

సాక్షి, విజయవాడ: ఎన్నికల సంఘంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందర్రావు ముందుకు డీబీటీ స్కీంలకు నిధుల విడుదల కేసు వచ్చింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది.సంక్షేమ పథకాలకు సంబంధించి (Direct Benefit transfer) డీబీటీ నేరుగా అర్హుల ఖాతాల్లో జమ చేయడానికి ఉద్దేశించిన నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగిందంటూ హైకోర్టు ప్రశ్నించింది. ‘‘రిట్ అప్పీలు వేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏవిధంగా పక్కనపెడుతుంది?. లా పట్ల ఈసీకి ఉన్న అవగాహన ఇదేనా?. తెలంగాణాలో రైతు భరోసాకు ఏ రకంగా అనుమతిచ్చారు? ఈ రాష్ట్రంలో ఈ పథకాలను ఏవిధంగా అడ్డుకుంటారు?’’అంటూ హైకోర్టు సీరియస్‌ అయ్యింది."హైకోర్టు కన్నా ఎక్కువ అని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుంది? న్యాయ సమీక్షాధికారం దీన్ని చూడాల్సి వస్తుంది. 2019లో పసుపు కుంకుమ సహా ఇతర పథకాలకు అనుతించినప్పుడు అనుసరించిన కోడ్ నియమాలను ఇప్పుడు పాటించడంలేదని స్పష్టం అవుతోంది. అప్పుడు అమలవుతున్న పథకాల విషయంలో అనుసరించిన కోడ్ను ఇప్పుడు అనుసరించలేదని వెల్లడి అవుతోంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలపై అప్పీలుకు వచ్చిన నవతరం పార్టీకి హైకోర్టు ప్రశ్నలు వేసింది. "ఎన్నికల్లో అసలు నవతరం పార్టీ ఎన్నిచోట్ల పోటీచేస్తోంది? గతంలో ఎన్నిచోట్ల పోటీచేసింది?" అని ప్రశ్నించింది. అప్పీలు వేసిన లాయర్ల తీరు తీవ్ర దిగ్భ్రాంతికరంగా ఉందని వ్యాఖ్యానించిన డివిజన్ బెంచ్.. హౌస్ మోషన్ కింద పిటిషన్ వేయడానికి రిజిస్ట్రీ సిబ్బందిని బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం వ్యాఖ్యల అనంతరం హైకోర్టుకు  పిటిషనర్ తరఫు న్యాయవాది నాదకర్ణి క్షమాపణలు చెప్పారు. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలకు సమయం లేనందున ఈ కేసును జూన్‌కు వాయిదా వేసింది హైకోర్టు.ఈ కేసులో ఏం జరిగింది?ఏపీలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు నిచ్చినట్లయింది. అయితే నిధుల పంపిణీకి సంబంధించి ఏ రకమైన ప్రచారం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఏం చేసింది?హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఎన్నికల సంఘం పరిశీలించింది. దీనికి సంబంధించి సమీక్షించి తమకు ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపింది. అయితే ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యాదీవెన, ఈబీసీ నేస్తం పథకాలకు నగదు పంపిణీ విషయంలో సీఈసీ ముందడుగు వేయలేదు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిఫికేషన్‌ అడిగింది. ఇవ్వాళే డిబిటి నిధులు విడుదల చేయాల్సిన అవశ్యకత ఏముందంటూ ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది.మళ్లీ హైకోర్టు ముందుకు ఓ వైపు డిబిటి పంపిణీ నిలిచిపోయినట్టయింది. ఇదే సమయంలో నవతరం పార్టీ పేరిట హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలయింది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Kejriwal Released From Tihar Jail On Interim Bail
తీహార్‌ జైలు నుంచి కేజ్రీవాల్‌ రిలీజ్‌​

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి ఆప్‌ కార్యకర్తలకు అభివాదం చేశాారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ తరపున ప్రచారం చేయడానికి గాను సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో సీఎంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించొద్దని, ఫైల్స్‌ చూసేందుకు వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి జూన్‌2న కేజ్రీవాల్‌ లొంగిపోవాలని కోర్టు తెలిపింది. మే 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుండటంతో ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు దేశ  అత్యున్నత కోర్టు మధ్యంతర బెయిల్‌ రూపంలో భారీ ఊరటనిచ్చింది. కాగా, లిక్కర్‌స్కామ్‌ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్‌ అప్పటి నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. 

సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌(PC: BCCI/Jio Cinema)
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌

ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌ కథ ముగిసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్‌ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్‌ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్‌ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్‌ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో రిలీ రొసోవ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్‌ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్‌ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్‌ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్‌ గోయెంకాకు చురకలుమ్యాచ్‌ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్‌ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. ‌చదవండి: ద్రవిడ్‌ గుడ్‌ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్‌?.. జై షా కామెంట్స్‌ వైరల్‌Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024

CM YDS Jagan Speech At Kadapa AP Election TDP
పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో బాబు కాపురం చేస్తాడు: సీఎం జగన్‌

‘వైఎస్సార్‌ చనిపోయాక ఆయనపై కుట్రలు చేసింది ఎవరు?, మహానేత వైఎస్సార్‌ పేరు ఛార్జ్‌షీట్‌లో పెట్టింది ఎవరు?, వైఎస్సార్‌ కుటుంబాన్ని అణగదొక్కాలని కుట్రలు పన్నింది ఎవరు?, వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వీరా వైఎస్సార్‌ వారసులు.., కాంగ్రెస్‌కు వైఎస్సార్‌ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు..’ అంటూ వైఎస్సార్‌ కడప జిల్లా ఎన్నికల ప్రచార సభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్‌ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్‌ చూస్తోందని, రాజకీయ స్వలాభం కోసం, ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల సమయంలో నాన్న సమాధి దగ్గరకు వెళ్తారంట అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ మరణం తర్వాత తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని, తనను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని పేర్కొన్నారు.నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మన కళ్లను మనం పొడుచుకున్నట్లేనని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. టీడీపీని గెలిపించడమేనని పేర్కొన్నారు. వైఎస్సార్‌ వారసులని వస్తున్న వారి కుట్రలను చూస్తున్నామన్న వైఎస్‌ జగన్‌.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా చంద్రబాబు మనిషేనని తెలిపారు. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో బాబు కాపురం చేస్తాడని మండిపడ్డారు. చంద్రబాబు కోసమే కాంగ్రెస్‌ పనిచేస్తుందని దుయ్యబట్టారు.సీఎం జగన్‌ పూర్తి ప్రసంగంవచ్చే ఎన్నికలు అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవి. మరో మూడు రోజుల్లో బ్యాలెట్‌ బద్దలు కొట్టడానికి సిద్ధమా?ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరగుతున్న ఎన్నికలు కావు.. రాబోయే అయిదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి.ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటికి అభివృద్ధి, పేదవాడి భవిష్యతుకు భరోసా.చంద్రబాబు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవడమే.చంద్రబాబుకు ఓటేయడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాంఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు.మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం99 శాతం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాంరాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకొచ్చాంవివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్‌ నొక్కాడు.అక్కాచెల్లెమ్మలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు.2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ.2లక్షల 70 వేల కోట్లు అందించాం.నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లుప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధనబడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్దఅమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మార్పులువిద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాంఅక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తంఅక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాంఅందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలుసకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాంవిత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాంగతంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా?పెట్టుబడి సాయంతో రైతన్నకు తోడుగా ఉన్నాంరైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాంగ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకొని నడిపించే ఆర్‌బీకే వ్యవస్థస్వయం ఉపాధికి అండగా వాహనమిత్ర, నేతన్న నేస్తం,మత్స్యకార భరోసాన్యాయవాదులకు లా నేస్తంజగనన్న తోడు, చేదోడుతో చిరువ్యాపారులకు అండగానిలిచాంగతంలో ఈ పథకాలు ఉన్నాయా?నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చాంఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచాంపేషెంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాంఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాంగతంలో ఇంత అభివృద్ధి జరిగిందాపేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం ఉందా?14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?6 వందల సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థఅవ్వాతాతలకు ఇంటింటికీ అందుతున్న పెన్షన్‌, ఇంటి వద్దకే రేషన్‌, చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయం చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారు.మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు.ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. NRC, CAA అంశాల్లోనూ మైనార్టీలకు అండగా ఉంటాంమోదీ సభలో చంద్రబాబు ఇలా చెప్పగలడా?మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పిన బాబు.. ఇంకా ఎందుకు ఎన్డీయేలో కొనసాగుతున్నారు?ముస్లింలకు మతప్రాతిపదికన 4శాతం రిజర్లేషన్లు ఇవ్వలేదు.వెనుకబాటుతనం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారుమైనార్టీల మనోభావాలకు అండగా మీ బిడ్డ తోడుగా ఉంటాడు.రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా?మైనార్టీ సోదరి శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా కూడా ఉంది.175 స్థానాల్లో మైనార్టీలకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చాం.నలుగురికి ఎమ్మెల్యేలు,నలుగురు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం.కడప రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కడప జిల్లాలో ఉన్న రాజకీయ చైతన్యం ఏపీలో అతికొద్ది జిల్లాల్లోనే ఉంటుందివైఎస్సార్‌ చనిపోయిన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బందులు పెట్టింది.అదే సమయంలో నేనుు ఎంపీగా నిలబడినప్పుడు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు.నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన ద్రోహులతో ప్రజలు జతకట్టాలా?రాజకీయంగా వైఎస్సార్‌ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి అదే కాంగ్రెస్‌, అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్సార్‌ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్ర జరుగుతోంది.వైఎస్‌ అవినాష్‌ రెడ్డి నాకన్న 13 ఏళ్లు చిన్నవాడు .ఈయన భవిష్యత్తును నాశనం చేయడానికి ఈనాడు, చంద్రబాబు, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు వేస్తున్నారు. వీళ్లంతా మనుషులేనా?అవినాష్‌ ఎలాంటి వాడో నాకు, మీ అందరికి తెలుసు.గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా 2014లో ఆయన చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రనూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?ఇంటింటికీ జాబు.. లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?పేదలకు 3 సెంట్ల స్థలం అన్నాడు. సెంటు స్థలమైనా ఇచ్చాడా?సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇప్పుడు కొత్త కొత్త మోసాలతో వస్తున్నారు..నమ్ముతారా?చంద్రబాబు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నాడు, నమ్ముతారా?ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తారంట.. నమ్ముతారా?బాబు జీవితమంతా అబద్దాలు, మోసాలు, కుట్రలు.చంద్రబాబు చేసింది.. దోచుకోవడం, దాచుకోవడం.చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయి.చంద్రబాబు డబ్బులు ఇస్తే వద్దనకండి.. తీసుకోండి.ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందోదో ఆలోచన చేయండి.వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌పై నొక్కాలి.పేదవాడి భవిష్యత్‌ కోసం రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కాలి.175కు 175 అసెంబ్లీ, 25కు, 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.

Actress Laila Khan Death Mystery Revealed
నటి దారుణ హత్య.. 13 ఏళ్ల తర్వాత దోషిని తేల్చిన కోర్టు

దాదాపు 13 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ప్రముఖ నటి కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆమెని దారుణంగా హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది. ఈ క్రమంలోనే విచారణ పూర్తవగా.. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. సవతి తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసి అందరూ షాకవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?1978లో ముంబయిలో పుట్టి పెరిగిన రేష్మా పటేల్.. సినిమాల్లోకి వచ్చేటప్పుడు లైలా ఖాన్ అని తన పేరు మార్చుకుంది. 2002లో కన్నడ మూవీతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ రాజేశ్ ఖన్నాతో చేసిన 'వాఫా'.. ఈమెకు ఓ మాదిరి గుర్తింపు తీసుకొచ్చింది. 2011లో 'జిన్నాత్' అనే సినిమా చేస్తుండగా.. విరామం రావడంతో కుటుంబంతో కలిసి ట్రిప్‌కి వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది.(ఇదీ చదవండి: రొమాంటిక్ సీన్స్.. నాకు ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్)దీంతో లైలా తండ్రి నాదిర్ పటేల్.. తన కుటుంబ సభ్యులు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ మొదలుపెట్టారు. నటి మొబైల్ సిగ్నల్ చివరగా నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించారు. లైలాకు అక్కడ ఫామ్ హౌస్ ఉందని తెలిసి పోలీసులు వెళ్లగా.. అది కాస్త కొంతవరకు అగ్ని ప్రమాదానికి గురై ఉంది. కొన్నాళ్ల తర్వాత జమ్ము కశ్మీర్‌లో వీళ్ల వాహనం దొరకడంతో కేసు క్లిష్టంగా మారింది. అయితే లైలాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ మాత్రం దొరకలేదు.లైలా సవతి తండ్రి పర్వేజ్ తక్‌పై ఎందుకో పోలీసులకు అనుమానమొచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి విషయంలో గొడవ జరిగిందని.. దీంతో భార్య షెలీనాను చంపి ఆ తర్వాత లైలా-ఆమె అక్క అమీనా, కవలలు జారా-ఇమ్రాన్, కజిల్ రేష్మాని హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత బంగ్లా నుంచి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలని వెలికి తీశారు. మొత్తంగా 40 మందిని విచారించారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబై సెషన్స్ కోర్టు.. పర్వేజ్‌ని ఈ కేసులో దోషిగా తేల్చింది. మే 14న శిక్ష ఖరారు చేయనుంది.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్‌బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం)

Aiyar, Pitroda, Raut Are Jokers, Says Shivraj Singh Chouhan
ఆ ముగ్గురు రాజకీయ జోకర్లు.. మాజీ సీఎం సెటైర్లు

బీజేపీ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కాంగ్రెస్‌, శివసేన నేతలను జోకర్లుగా అభివర్ణించారు.  ఆ ముగ్గురు రాజకీయ జోకర్లుకాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, శామ్‌ పిట్రోడా, శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోకర్లని, వాళ్లని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో హాస్యాస్పదమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇలా చేస్తూనే ఉంటారు. ప్రజలు వాటిని ఎంటర్‌టైన్‌గా భావిస్తారని తెలిపారు.  ఎవరూ సీరియస్‌గా తీసుకోరువారి స్థాయి కంటే దిగజారి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప‍్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో రాజకీయ జోకర్లుగా మారారు. అయ్యర్, పిట్రోడా, రౌత్‌లను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు అని చౌహాన్ వ్యాఖ్యానించారు.  56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ‘ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు మేధోపరంగా దివాళా తీశారు. ఇది మునుపటి బలహీనమైన యూపీఏ ప్రభుత్వం కాదని, 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం’ అని ఇదే విషయాన్ని అయ్యర్ గమనించాలి చౌహాన్ సూచించారు.భారత్‌ అంటే అభివృద్దికి కేరాఫ్‌ అడ్రస్‌మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన చౌహాన్‌.. ‘భారత్‌ అంటే అభివృద్దికి కేరాఫ్‌ అడ్రస్‌. దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టి అభివృద్ధి బాటలు వేశారని అన్నారు. అదే సమయంలో దేశానికి ఇబ్బంది కలిగించే ఎవరినీ విడిచిపెట్టరని హెచ్చరించారు.ప్రపంచ దేశాలకు భారత్‌ విశ్వ గురువు ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం విశ్వ గురువుగా మారుతుంది. ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాంగ్రెస్ మరో ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడవలసి ఉంటుంది. కానీ అలా చేయడానికి తగినంత మంది సభ్యులు ఉండరు’ అని చౌహాన్ నొక్కాణించారు. 

Delhi Court Orders Framing Charges Against Brij Bhushan Sharan Singh
బ్రిజ్​భూషణ్​కు షాక్​.. రౌస్‌ అవెన్యూ కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ : జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై అభియోగాలు మోపాలని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని కోర్టు పేర్కొంది.  బ్రిజ్ భూషణ్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 354-ఎ (లైంగిక వేధింపులు), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఫెడరేషన్ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పై కూడా సెక్షన్ 506 కింద అభియోగాలు మోపాలని పోలీస్‌ శాఖకు కోర్టు సూచించింది.  గత ఏడాది జూన్‌లోలైంగిక వేధింపుల కేసులో గత ఏడాది జూన్‌లో బ్రిజ్ భూషణ్,అతని సహచరుడు వినోద్ తోమర్‌పై ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. ఛార్జిషీట్‌లో ఐపీసీ సెక్షన్‌లు 354 (దౌర్జన్యం లేదా నేరపూరిత శక్తి), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంబడించడం), 109 (ప్రేరేపణ), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు.1,500 పేజీల ఛార్జిషీట్‌లోపోలీసులు 1,500 పేజీల ఛార్జిషీట్‌లో బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలకు మద్దతుగా రెజ్లర్లు, ఒక రిఫరీ, ఒక కోచ్, ఫిజియోథెరపిస్ట్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది సాక్షుల వాంగ్మూలాలను చేర్చారు.నో టికెట్‌ఉత్తర్‌ ప్రదేశ్‌ కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్‌భూషణ్‌ ప్రాతినిధ్యం వహించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో సాక్షి మలిక్‌, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‌ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ సారి కైసర్‌గంజ్‌ స్థానంలో పార్టీ ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌కు అవకాశం కల్పించింది. కాగా, గత నెలలో కరణ్‌ భూషణ్‌ సింగ్‌ ఎంపీగా నామినేషన్‌ వేసే సమయంలో  10 వేలమంది  బ్రిజ్‌భూషణ్‌ అనుచరులు.. 700 వాహనాలతో తరలివచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 

Laapataa Ladies Pratibha Ranta On Her Journey In Bollywood
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్‌ ప్రతిభ ఇంట్రస్టింగ్‌ జర్నీ

బాలీవుడ్‌ దర్శకురాలు కిరణ్‌రావు (బాలీవుడ్‌ హీరో ఆమీర్‌ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్‌ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు,  అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన  సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన  ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది.  సిమ్లా టూ బాలీవుడ్‌ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్‌ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్‌ హువా టీవీ సీరియల్‌తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్‌ చేస్తుండగా కిరణ్‌ రావు దృష్టిలో పడింది. అలాలాపతా  లేడీస్‌లో అవకాశం వచ్చింది.  వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్‌కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్‌ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్‌తో, ముఖ్యంగా  లాపతా  లేడీస్‌ 'జయ' పాత్రలో సత్తా  చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్‌లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో  చాలా తక్కువ  సమయంలోనే తనకంటూ  ఒక ఇమేజ్‌  క్రియేట్‌ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా  రాంటాసందేశనా రాంటా,, రాజేశ్‌ రాంటా దంపతుల కుమార్తె  ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్‌ అంటే ఇష్టం. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్‌ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్‌గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్‌లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని  ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్‌లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది.  2018లో మిస్ ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్‌ ముంబై అందాల పోటీల్లో మిస్‌ ముంబై కిరీటం గెలుచుకుంది.  దీంతో  కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్‌ హువా’ టీవీ సీరియల్‌ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్‌ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది.    View this post on Instagram           A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్‌ ఆఫర్‌ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ  ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో. 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all