సాక్షి, విజయనగరం జిల్లా: పేదవాళ్ల బతుకులతో ఆటలాడుతున్న కూటమికి ఓటు వేయాలా? అంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదల పట్ల చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నీచమైన ఆలోచనలతో ఈసీకి ఫిర్యాదు చేశారని ధ్వజమెత్తారు.
‘‘చంద్రబాబు కూటమికి అవ్వాతాతల ఉసురు తగులుతుంది. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందకుండా చేశారు. ఈబీసీ నేస్తం, విద్యా దీవెన డబ్బులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఓటమి భయంతో చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. ఈసీ నిర్ణయం ధర్మం కాదు.. మేము వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ధర్మమా?’’ అంటూ మంత్రి బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘మీ భూమి మీది కాదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రామోజీ రావుకి ప్రజల పట్ల బాధ్యత లేదా?. డబ్బులు ఇస్తే గడ్డి కరుస్తారా? ఈనాడు ప్రకటనలో ఏ మాత్రమైనా వాస్తవం ఉందా?. ఈ 40 ఏళ్ల ఇంత దరిద్రమైన రాజకీయాలు చూడలేదు.’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment