ఆ విద్యార్థులకు విజయ్‌ సాయం.. త్వరలో కలుస్తానంటూ మెసేజ్‌ | Actor Vijay Helped To Poor Students | Sakshi
Sakshi News home page

ఆ విద్యార్థులకు విజయ్‌ సాయం.. త్వరలో కలుస్తానంటూ మెసేజ్‌

Published Fri, May 10 2024 7:13 PM | Last Updated on Sat, May 11 2024 8:30 AM

Actor Vijay Helped To Poor Students

కోలీవుడ్‌ హీరో విజయ్ అందరికీ సుపరిచితుడే.తమిళ సూపర్ స్టార్‌గా తిరుగులేని ఫ్యాన్ బేస్‌తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ప్రథమ వరుసలో ఉంటాడు. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విజయ్‌ ముందుంటారు. గతంలో తమిళనాడులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. గతేడాది 12వ తరగతి  పరీక్షలో 600/600 మార్కులు సాధించిన నందినికి కానుకగా డైమండ్‌ నెక్లెస్‌ అందించాడు. అదే సమయంలో రెండు వేల మంది ఉత్తమ విద్యార్థులకు సాయం చేశాడు. అయితే, ఈసారి కూడా విద్యార్థులను ఆయన కలుస్తున్నట్లు ప్రకటించారు.

విజయ్ 50వ పుట్టినరోజు వేడుకలను జూన్ 22న జరుపుకోనున్నారు. గతేడాది విజయ్ పుట్టినరోజు సందర్భంగా అకడమిక్ అవార్డుల వేడుకను ఆయన నిర్వహించారు. ఆ సమయంలో 10వ తరగతి, 12వ తరగతి  విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. వచ్చే నెలలో కూడా అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని  విజయ్ ప్లాన్‌ చేస్తున్నారు. తమిళనాడులోని  234 నియోజకవర్గాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన  విద్యార్థులను ఎంచుకుని వారందరినీ పిలిపించి బహుమతులు అందించారు. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు ఇచ్చి సత్కరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

పదో తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలు రీసెంట్‌గా విడుదలయ్యాయి. ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్ధులను తమిళనాడు వెట్రి కజగం తరపున  విజయ్‌ ఓ ప్రకటనలో అభినందిస్తూ, త్వరలో కలుస్తామని ప్రకటించారు. జూన్ 22న విజయ్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరగవచ్చని తెలుస్తోంది.  234 నియోజకవర్గాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులతో పాటు 12వ తరగతి విద్యార్థులను గుర్తించే పనిని తన అభిమానలకు అప్పచెప్పినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement