Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

తాజాగా బయట పడిన వీడియో ఆధారంగా.. పోలింగ్‌ మరుసటి రోజు పల్నాడు జిల్లా కారంపూడి వీధుల్లో మారణాయుధాలతో దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ గూండాలు
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!

రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్‌ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్‌ ట్యాంక్‌ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్‌ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్‌ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్‌ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్‌ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరు­లపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవు­తున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీ­సుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయా­యి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తు­న్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్‌సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, ఆయన అనుచరులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్‌ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్‌బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్‌ బాబు తదితరులు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్‌ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు.

Sakshi Editorial On National politics
బొటాబొటిగా జాతీయం!

చండీగఢ్‌ టూ పట్నా. జాతీయ రాజకీయాలకు ఆయువుపట్టు. సారవంతమైన గంగా–యమునల మైదాన ప్రాంతం ఇదే. కొద్దిగా సింధూ బేసిన్‌ కూడా ఇందులో చేరి ఉండవచ్చు. కాస్త విస్తరిస్తే ‘కౌబెల్ట్‌’ అని కూడా పిలుస్తాము. మనం ఏ రకమైన మాంసం తినాలో, ఏ రకమైనది తినకూడదో తెలియజెప్పే కౌబాయ్స్‌కు ఇది పరమ పూజనీయమైన ప్రాంతం. అనాదిగా పిలుచుకుంటున్నట్టు ‘ఆర్యావర్తం’ కూడా ఇదే! ఈ ప్రాంతం మీద పట్టు సాధించకుండా దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించడం చాలా కష్టం.మొదటి ఐదు సాధారణ ఎన్నికల్లో ఆర్యావర్తం, ద్రవిడదేశం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యత కనబరిచింది. ఆరోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ జైత్రయాత్రకు కళ్లెం వేసిన జనతా పార్టీ మాత్రం అచ్చంగా ఉత్తరాది పార్టీయే! అప్పుడు జనతా పార్టీకి 295 లోక్‌సభ స్థానాలు దక్కాయి. ఇందులో వింధ్య పర్వతాలకు దిగువన గెలిచిన సీట్లు రెండు డజన్లు దాటలేదు. అవి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో గెలిచినవే!భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈసారి అదనంగా తెలంగాణపై కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ, మూడోసారి వరసగా అధికారాన్ని చేపట్టాలంటే కచ్చితంగా గోమాత ప్రాంతమే కాషాయ దళాన్ని కరుణించి కాపాడాలి. గత ఎన్నికల్లో భారీ సీట్లను ప్రసాదించిన ఈ ప్రాంతంలో బలమైన గండి పడితే మాత్రం ఇతర ప్రాంతాలు పూడ్చగలిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈసారి కూడా ఆర్యావర్తం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.చండీగఢ్‌ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా బీహార్‌లోని పట్నా వరకు మొత్తం 157 స్థానాలను అప్పట్లో జనతా పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పటికీ అదే రికార్డు. ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతి ప్రభంజనం (1984)లో కూడా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. అప్పుడు యూపీ, బీహార్‌లలో ఎనిమిదిమంది ఇతర పార్టీల వారు గెలిచారు. కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లను కూడా కలుపుకొంటే ఇదే ప్రాంతంలో బీజేపీకి 2019లో 113 సీట్లు దక్కాయి. ఎన్డీఏ భాగస్వాములతో కలిసి 131 సీట్లలో గెలిచారు.ఇప్పుడా సంఖ్యను బీజేపీ నిలబట్టుకోగలదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌లను కూడా కలిపి చూస్తే కౌబెల్ట్‌ పూర్తవుతుంది. ఇందులో రాజస్థాన్‌ (25), గుజరాత్‌ (26), హిమాచల్‌ (4)లో అప్పుడు బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మధ్యప్రదేశ్‌ (29)లో 28, ఛత్తీస్‌గఢ్‌ (11)లో 9 సీట్లను గెలుచుకున్నది. ఈ దూకుడును ఇప్పుడు కూడా ప్రదర్శించగలుగుతుందా? దాదాపు 90 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో విజృంభిస్తేనే కౌబెల్ట్‌లో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్న రాజ్‌పుత్, జాట్, యాదవ కులాలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్న జాట్‌ నాయకులు రాజస్థాన్, హర్యానాల్లో ఇప్పటికే ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించారు. పశ్చిమ యూపీలోని జాట్లు మాత్రం చరణ్‌సింగ్‌ పరివారానికి చెందిన ఆర్‌ఎల్‌డీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పార్టీ ఎన్డీఏలో చేరినందువల్ల యూపీ జాట్ల మద్దతు బీజేపీకి లభించవచ్చు.ఉత్తరాదిలో తొలి నుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్‌పుత్‌ల తాజా వైఖరి ఆ పార్టీని కొంత కలవరపరుస్తున్నది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించే కర్ణిసేన సభ్యులు బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్‌పుత్‌ వర్గం మీద వీరి పిలుపు ప్రభావం చూపితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలోని కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన యోగీ బాబానే యూపీ సీఎంగా ఉన్నందువలన ఆ రాష్ట్రంలో పెద్దగా భయపడవలసిన అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది.యూపీ, బీహార్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవులు చాలాకాలంగా ఎస్పీ, ఆర్జేడీల వెనుకనే సమీకృతమై ఉన్నారు. ఇప్పుడీ సమీకరణ మరింత సంఘటితంగా ఉన్నట్టు సమాచారం. అఖిలేశ్, తేజస్వీ యాదవ్‌లను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులను చేయాలనే పట్టుదల యువతలో కనిపిస్తున్నది. యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ బీజేపీ ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా ఎంతోకొంత బీజేపీ కోల్పోవచ్చనే అభిప్రాయం బలపడుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.వాజ్‌పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్‌ చేసుకున్న ‘షైనింగ్‌ ఇండియా’ ప్రచారం వికటించినట్టుగానే మోదీ సర్కార్‌ చేస్తున్న ‘వికసిత భారత్‌’ కూడా వికటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఉపాధి రంగం దారుణంగా దెబ్బతిన్నది. పెద్దనోట్ల రద్దు, కోవిడ్‌ వరస దెబ్బలతో కుదేలైన చిన్న వర్తకులు ఇప్పటికీ కోలుకోలేదు. నిరుద్యోగిత రేటుపై నిన్ననే విడుదలైన పీరియాడిక్‌ లేబర్‌ శాంపుల్‌ సర్వే నివేదిక నిరాశాజనకంగానే ఉన్నది. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 38 శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు లభించలేదని వచ్చిన తాజా వార్త పరిస్థితికి అద్దం పడుతున్నది.ఉత్తరాది రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సైనిక బలగాల్లో చేరడం ఒక ప్రత్యామ్నాయం. అందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నివీర్‌’ పథకం ఈ యువతను తీవ్రంగా నిరాశపరిచింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్‌ఫామ్‌ వంటి సంస్థలు క్రమం తప్పకుండా ఇచ్చే నివేదికల్లో ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఒకే దేశంలోని మనుషుల మధ్య వంద రెట్లు, వేయి రెట్లు కాదు లక్షల రెట్ల ఆర్థిక తారతమ్యాలు వెక్కిరిస్తున్నాయి.2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత జాతి సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేరుల జేబుల్లోకి వెళ్లింది. యాభై శాతం మంది అడుగు జనాభా దోసిళ్లలో ఎంగిలి మెతుకులు రాలిపడ్డట్టు ఒకే ఒక్క శాతం సొమ్ము ఉమ్మడిగా జారిపడింది. దీన్నే కొందరు ’ట్రికిల్‌ డౌన్‌ థియరీ’గా పిలుచుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలతో ఎన్డీఏ రాజ్యమేలుతున్నది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే శామ్‌ పిట్రోడాతో సహా పలువురు ఆర్థికవేత్తలు కూడా దేశంలో వారసత్వ పన్ను విధించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటువంటి సూచనలపై విస్తృతమైన చర్చను ఆహ్వానించడం అవసరం. కానీ, పిట్రోడాకు ఉన్న కాంగ్రెస్‌ సంబంధాలను ఆసరా చేసుకొని స్వయంగా ప్రధానమంత్రే ఎదురుదాడికి పూనుకున్నారు. ‘ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మీరు సంపాదించుకున్న సొమ్మును లాగేసుకుంటారట’ అంటూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రచారం బీజేపీకి మేలు చేసిందా... కీడు చేసిందా అనే విషయం ఓట్ల లెక్కింపు తర్వాత తేలిపోనున్నది.ఈ రకమైన సామాజిక – ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కంచుకోటలను ఏ మేరకు కాపాడుకోగలదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎటువంటి గాలి లేదని అభిప్రాయపడిన పక్షంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 స్థానాలను బీజేపీ చేజార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈసారి రెండు రాష్ట్రాల్లో కనీసం 15 స్థానాల వరకు ఆ పార్టీ పోగొట్టుకోవచ్చనే అంచనాలున్నాయి.శరద్‌ పవార్, బాల్‌ఠాక్రేలు స్థాపించిన పార్టీలను చీల్చడం బీజేపీకి కలిసివచ్చే అంశం కాదనే అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్నది. ఎన్నికల హామీల అమలులో చతికిలబడ్డ కర్ణాటక కాంగ్రెస్‌కు బీజేపీ మిత్రపక్షం జేడీఎస్‌ మళ్లీ ఊపిరిపోసింది. దేవెగౌడ పౌత్రరత్నం చేసిన నిర్వాకంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇక బెంగాల్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓ పదిహేను స్థానాలను బీజేపీ అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కోల్పోయే అవకాశం ఉన్న సీట్లు 65 అనుకుంటే, అదనంగా తెచ్చుకునే సీట్లు పదిహేను వరకు ఉండవచ్చని అంచనా. అంటే కనీసం యాభై సీట్లను బీజేపీ నికరంగా కోల్పోతుంది.వ్యతిరేక గాలి బలంగా లేకపోతేనే గత ఎన్నికలతో పోలిస్తే యాభై స్థానాలను బీజేపీ కోల్పోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా మరో పాతిక, ముప్పయ్‌ సీట్లను గెలవచ్చు. ఇది దాదాపు తొంభై శాతం స్థానాలకు పోలింగ్‌ పూర్తయిన తర్వాత పరిశీలకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం. అంటే బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ మూడోసారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి. బీజేపీకి సొంతంగా 370 సీట్లు కావాలనీ, కూటమికి 400 సీట్లు కావాలని ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనను జనం పట్టించుకోలేదు. మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడదనే వాదనను జనం విశ్వసిస్తున్నారనే అనుకోవాలి.విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు కచ్చితంగా ఓడించేవారే. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్యన ఓ పెద్ద అగాధమే ఉన్నది. కానీ, ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్‌ గెలవగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో అతుకుల బొంతతో అస్థిర ప్రభుత్వ ప్రయోగాలకు మెజారిటీ ప్రజలు సిద్ధపడకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఉంటే కూటమి సభ్యుల ఆమోదం లభించేది. సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలు స్వాగతించేవారు. కానీ రాహుల్‌గాంధీ మాటల్లో కనిపించేంత ఔదార్యం, అభ్యుదయం చేతల్లో కనిపించవు. అదే విషాదం. ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభలో సెంచరీ కొట్టే ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

preparing to construct southern part of regional ring road completely
కొత్తగా దక్షిణ ‘రింగ్‌’!

సాక్షి, హైదరాబాద్‌: రీజనల్‌ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా పూర్తి కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న రోడ్ల అనుసంధానం, విస్తరణ వంటివేమీ లేకుండా.. మొత్తంగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా రూపుదిద్దుకోనుంది. దీనితో ముందు భావించిన దానికన్నా రోడ్డు పొడవు పెరిగి.. 189.4 కిలోమీటర్ల నిడివికి చేరనుంది. సంగారెడ్డి నుంచి ఆమన్‌గల్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు నిర్మితం కానుంది. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు సమర్పించిన ఈ అలైన్‌మెంటుకు.. జూన్‌లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ఆ వెంటనే భూసేకరణ సర్వే పనులు మొదలవుతాయి. రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం 158.65 కిలోమీటర్ల రోడ్డుకు ఇప్పటికే భూసేకరణ కూడా జరుగుతోంది. త్వరలోనే దక్షిణ భాగంపై స్పష్టత రానుంది. తొలుత కొన్ని పాతరోడ్లతో కలపాలనుకున్నా.. సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్‌ నుంచి గజ్వేల్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు ఉత్తర భాగానికి కేంద్రం మూడేళ్ల క్రితమే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఉత్తర భాగాన్ని పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నారు. దక్షిణ భాగాన్ని మాత్రం ఇప్పటికే ఉన్న కొన్ని పాత రోడ్లను అనుసంధానిస్తూ నిర్మించాలని తొలుత భావించారు. ఉత్తర భాగంలోని ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. అలాంటప్పుడు భారీ వ్యయంతో నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం వ్యక్తం చేసింది. ఉత్తర భాగాన్ని నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించి.. దక్షిణ భాగాన్ని ప్రస్తుత రోడ్ల అనుసంధానంతో సాధారణ హైవేగా నిర్మిస్తే సరిపోతుందని భావించింది. కానీ రింగు రోడ్డుగా పూర్తి రూపం రావాలంటే.. దక్షిణ భాగాన్ని కూడా నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌ హైవేగా నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరటంతో.. చివరికి కేంద్రం సరేనంది. ఆలోపే కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్‌మెంట్లను రూపొందించింది. అందులో రెండు అలైన్‌మెంట్లు ప్రస్తుత రోడ్లను అనుసంధానిస్తూ రూపొందించగా.. ఒకదాన్ని పూర్తి కొత్త రోడ్డుగా ప్రతిపాదించారు. ఈ మూడో అలైన్‌మెంట్‌నే ఖరారు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ ఒక్క రోడ్డును కలుపుదామనుకున్నా.. షాద్‌నగర్‌ నుంచి చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా కంది వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రోడ్డును.. దక్షిణ ‘రింగ్‌’ అలైన్‌మెంట్‌లో భాగం చేయాలని తొలుత భావించారు. కానీ ఆ రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో వాణిజ్యపర కార్యక్రమాలు బాగా పెరిగాయి. కొత్తగా జనావాసాలు వేగంగా విస్తరించాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ భూసేకరణ కూడా కష్టంగా మారింది. దాంతో ఈ రోడ్డును కలపకుండా.. దానికి దూరంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. దీనితో రోడ్డు ప్రతిపాదిత పొడవు కూడా పెరిగిపోయింది. భారీగా పెరుగుతున్న అంచనా వ్యయం.. రీజనల్‌ రింగురోడ్డును తొలుత ప్రతిపాదించినప్పుడు మొత్తంగా రూ.19 వేల కోట్లతో పూర్తి చేయవచ్చనే అంచనా వేశారు. కానీ ప్రాజెక్టు జాప్యం అవుతున్న కొద్దీ.. ఆ మార్గం వెంట ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెంది, భూముల ధరలు విపరీతంగా పెరగటంతో ఖర్చు రెట్టింపవుతోంది. ఏడాదిన్నర క్రితం ఉత్తర భాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్‌ను ఖరారు చేసింది. ఈ భాగం 158.65 కిలోమీటర్ల నిడివికి రూ.13,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. నిర్మాణ పనులు మరో ఏడాది తర్వాత గానీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించటం లేదు. అప్పటికి ఉత్తర భాగం వ్యయ అంచనా రూ.16 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇక తాజాగా అలైన్‌మెంట్‌ ఖరారు దశకు చేరిన దక్షిణ భాగానికి నిర్మాణ వ్యయం రూ.18 వేల కోట్లుగా అంచనా వేశారు. జాప్యం జరిగితే ఇది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే మొత్తంగా రీజనల్‌ రింగురోడ్డు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లను దాటుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. మొత్తం రీజనల్‌ రింగ్‌ రోడ్డు లెక్క ఇదీ.. ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లు (ఖరారైనది) దక్షిణ భాగం 189.43 కిలోమీటర్లు (అంచనా) మొత్తం పొడవు 348.08 కిలోమీటర్లు (అంచనా) సేకరించే భూమి సుమారు 4,500 హెక్టార్లు భూసేకరణ వ్యయం అంచనా రూ.14,500 కోట్లు (భూముల ధరలు పెరిగేకొద్దీ మారుతుంది) నిర్మాణ పనులకు అయ్యే వ్యయ అంచనా రూ.19,500 కోట్లు (జాప్యం జరిగినకొద్దీ పెరిగే అవకాశం ఉంది)

Central Election Commission Arrangements for Election Votes Counting
ఓట్ల లెక్కింపు ఇలా

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్య­ర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్‌ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటన­లు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజే­షన్‌ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పు­న మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్‌ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల తరలింపు మే 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపర్చారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్‌ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్‌ నంబర్‌ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్‌ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్‌ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్‌తో అవసరం లేదు. కౌంటింగ్‌ హాల్‌లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్‌ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్‌ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్‌గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత క్లోజ్‌ బటన్‌ నొక్కకుండా ఉన్న (క్లోజ్‌ రిజల్ట్‌ క్లియర్‌–సీఆర్‌సీ) ఓటింగ్‌ యంత్రాలతో పాటు మాక్‌ పోలింగ్‌ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్‌ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్‌ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్‌ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

Lok Sabha Election 2024: BJP To Go Solo In Punjab, Stage Set For 4-Way Fight For 13 Lok Sabha Seats
Lok Sabha Election 2024: పంజాబ్‌లో చతుర్ముఖం

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా రాణించని రాష్ట్రాల్లో పంజాబ్‌ ఒకటి. 13 లోక్‌సభ స్థానాల్లో ఎనిమిది కాంగ్రెస్‌ హస్తగతం కాగా బీజేపీ రెండింటికే పరిమితమైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అద్భుత విజయంతో గద్దెనెక్కింది. దాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ఆశ పడుతోంది. దాంతో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో దిగింది. అకాలీదళ్‌ దూరమవడంతో బీజేపీ కూడా సొంతంగానే పోటీ చేస్తోంది. దాంతో రాష్ట్రంలో చతుర్ముఖ పోరు నెలకొంది. ఆప్, బీజేపీ పోటీని తట్టుకుని సిట్టింగ్‌ స్థానాలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు సవాలే... జలంధర్‌కాంగ్రెస్‌కే గాక ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ సీఎం చరణ్‌సింగ్‌ చన్నీకి సైతం ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. 2009, 2014, 2019ల్లో ఇక్కడ కాంగ్రెస్‌ వరుసగా గెలిచింది. 2023 ఉప ఎన్నికలో ఆప్‌ నేత సుశీల్‌కుమార్‌ రింకు నెగ్గారు. ఇప్పుడాయన బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగడం విశేషం! ఆప్‌ నుంచి పవన్‌కుమార్‌ టిను, అకాలీదళ్‌ నుంచి మోహింద్‌ సింగ్‌ బరిలో ఉన్నారు. బీఎస్పీ, సీపీఎం, అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) కూడా పోటీ చేస్తున్నాయి. జలంధర్‌లో కాంగ్రెస్‌ ఏకంగా 13సార్లు ఇక్కడ గెలవడం విశేషం!గురుదాస్‌పూర్‌ఇక్కడా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే! సిట్టింగ్‌ ఎంపీ, బాలీవుడ్‌ నటుడు సన్నీడియోల్‌ స్థానంలో దినేశ్‌ సింగ్‌ బబ్బుకు బీజేపీ టికెటిచ్చింది. అకాలీదళ్‌ అండ లేకపోవడం పారీ్టకి ప్రతికూలం. మోదీపైనే బీజేపీ భారం వేసింది. కాంగ్రెస్‌ నుంచి సుఖ్‌జిందర్‌ సింగ్‌ రాండ్వ, ఆప్‌ నుంచి అమన్‌õÙర్‌ సింగ్‌ కల్సి, అకాలీదళ్‌ తరఫున దల్జీత్‌సింగ్‌ చీమ పోటీలో ఉన్నారు. అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) సైతం అభ్యరి్థని పోటీకి పెట్టింది. ఆనంద్‌పూర్‌ సాహిబ్‌కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మనీశ్‌ తివారీ బదులు విజయ్‌ ఇందర్‌ సింగ్లా బరిలో ఉన్నారు. ఆప్‌ నుంచి మాలీ్వందర్‌ సింగ్, అకాలీదళ్‌ తరఫున ప్రేమ్‌సింగ్‌ చందూమజ్రా, బీజేపీ తరఫున సుభాష్‌ శర్మ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) సైతం పోటీలో ఉన్నాయి. ఇక్కడ 2014లో గెలిచిన అకాలీదళ్‌ నేత ప్రేమ్‌సింగ్‌ 2019లో ఓటమి పాలయ్యారు.పటియాలామాజీ సీఎం అమరిందర్‌సింగ్‌ భార్య ప్రణీత్‌ కౌర్‌ ఇక్కడ పోటీలో ఉన్నారు. 2019 ఇక్కడ కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన ప్రణీత్‌ ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో దిగడం విశేషం. ఆప్‌ నుంచి దల్బీర్‌ సింగ్, అకాలీదళ్‌ తరఫున నరీందర్‌ కుమార్‌ శర్మ, కాంగ్రెస్‌ నుంచి ధరంవీర్‌ గాంధీ పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ ప్రణీత్, ధరంవీర్‌ మధ్యే నెలకొంది. సంప్రదాయంగా కాంగ్రెస్‌కే మద్దతిచ్చే ఇక్కడి ఓటర్లకు నచ్చజెప్పి బీజేపీకి ఓటేయించడం ప్రణీత్, అమరీందర్‌లకు సవాలుగా మారింది. ఆమె ఫిరాయింపుదారు అంటూ రైతులు నిరసన తెలుపుతుండటం తలనొప్పిగా మారింది. అయితే గణనీయంగా ఉన్న హిందూ ఓటర్లపై అమరీందర్‌ దంపతులు ఆశలు పెట్టుకున్నారు.లుధియానాపంజాబ్‌లో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం. ఒకప్పుడు కాంగ్రెస్‌–అకాలీదళ్‌ మధ్యే పోటీ ఉండేది. 2014, 2019ల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన మాజీ సీఎం బియాంత్‌సింగ్‌ కుమారుడు రవనీత్‌ సింగ్‌ భిట్టు ఈసారి బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగారు! 65.96 శాతం మంది హిందువులుండటం బీజేపీకి అనుకూలిస్తుందని భావిస్తున్నారు. దాంతో కాంగ్రెస్‌ నుంచి పీసీసీ చీఫ్‌ అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ బరిలో దిగారు. ఆప్‌ నుంచి అశోక్‌ పరాశర్‌ పప్పీ, అకాలీదళ్‌ తరఫున రంజిత్‌సింగ్‌ ధిల్లాన్‌ బరిలో ఉన్నారు. అకాలీదళ్‌ (అమృత్‌సర్‌)తో పాటు పలువురు స్వతంత్రులూ గట్టి పోటీ ఇస్తున్నారు. అమృత్‌సర్‌ ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ గుర్జీత్‌ సింగ్‌ అజ్లా, బీజేపీ నుంచి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు బరిలో ఉన్నారు. మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సంధు ఇటీవలే బీజేపీలో చేరారు. రాష్ట్రంలో 22 శాతం మేర ఉన్న జాట్‌ సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి. ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. కెపె్టన్‌ అమరిందర్‌ సింగ్‌ చేరిక బీజేపీకి సానుకూలాంశం. ఆప్‌ నుంచి మంత్రి కులదీప్‌సింగ్‌ దలైవాల్‌ రంగంలో ఉన్నారు.పోలింగ్‌ జరగనున్న లోక్‌సభ స్థానాలు... అమృత్‌సర్, గురుదాస్‌పూర్, ఖదూర్‌సాహిబ్, హోషియార్‌పూర్, జలంధర్, ఆనందపూర్‌ సాహిబ్, లుధియానా, ఫతేగఢ్‌ సాహిబ్, ఫరీద్‌కోట్, ఫిరోజ్‌పూర్, భటిండా, సంగ్రూర్, పాటియాలా. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

YSRCP Will Clean Sweep In Uttarandhra Seats
టీడీపీకి తడబాటే.. పచ్చ నేతల్లో కొత్త టెన్షన్‌!

ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి భీకరంగా ఉన్నా.. ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల నుంచి ఊహించని విధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమలు ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్సార్‌సీపీకి కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినఊరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇదేవిధంగా తయారైంది. ప్రతీ ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.ప్రతీ ఎన్నికలోనూ రిగ్గింగ్‌తో గెలిచే అచ్చెన్నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చెన్న గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్సార్‌సీపీకి ప్రజలు మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసీ వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు. ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీకి క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమాహేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

exit poll surveys may confusion on india bloc over lok sabha election 2024
ఇండియా కూటమి ఎఫెక్ట్‌..! కన్ప్యూజన్‌లో ఎగ్జిట్ పోల్స్‌

సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్‌కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.400సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్‌ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్‌ పోల్స్‌ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్‌పుట్‌ ఎడిటర్, సాక్షి

Meet star kid Krishna Shroff who earns in crores
సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్‌కిడ్‌ నెట్‌వర్త్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆమె ఒక సూపర్ స్టార్ కూతురు. దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్‌కు తోడబుట్టింది. స్టార్‌ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌లాగా సినిమాలను కరిర్‌గా ఎంచుకోలేదు. కానీ స్టార్‌ హోదాలో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరీ స్టార్‌ కిడ్‌? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి! సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోనే కెరీర్‌ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.ఆ స్టార్‌ కిడ్‌ ఎవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్‌స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్‌ను కొన సాగిస్తున్నాడు. 1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్‌లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్‌పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్‌ అంటే ప్రాణం పెడుతుంది. ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్‌- ట్రైనింగ్‌ కేంద్రాన్ని స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి. నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’ అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్‌లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఫిట్‌నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్‌శెట్టి హోస్ట్‌ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది.

CS Jawahar Reddy reacts on Janasena Corporator Peethala Murthy Yadav
క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా

సాక్షి, అమరావతి: జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాద­వ్‌ తనపైన, తన కుమారుడిపైన చేసిన నిరాధార తప్పు­డు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.­ఎస్‌.జవహర్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేర­కు శనివారం సీఎస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసు­కుని క్షమా­పణలు చెప్పాలని మూర్తి యాదవ్‌ను ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని సీఎస్‌ హెచ్చరించారు. రెండు నెలలుగా ఒక పథకం ప్రకా­రం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారమే ఈ ఆరో­ప­ణ­లని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశా­ఖ పరిసర ప్రాంతాల్లో తాను గానీ, తన కుమారుడు, బంధువులు ఎలాంటి అసైన్డ్‌ భూములు కొనలేదని స్పష్టం చేశా­రు. తన స్నేహితుడైన రిటైర్డ్‌ ఆర్మీ అధికారి కుమార్తె వివాహం ఏప్రి­ల్‌లో జరిగిందని, ఎన్నికల దృష్ట్యా ఆ వివాహా­నికి హాజరు కాలేకపోయినందున రెండు రోజుల విశాఖ పర్యటలో భాగంగా ఆది­వారం కొత్త దంపతులను ఆశీర్వదించడా­నికి వెళ్లా­నని సీఎస్‌ తెలిపారు. ఆ మరు­సటి రోజు భోగా­పురం విమా­నాశ్రయ నిర్మాణ పను­లను పరిశీలించానన్నారు. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపా­యల విలువైన 800 ఎకరాలు అసైన్డ్‌ భూములు కొట్టేసి­నట్లు యాదవ్‌ చేసిన ఆరోపణలను ఆయ­న తీవ్రంగా ఖండించారు.అసైన్డ్‌ భూముల చట్ట సవరణకు సంబంధించి అసెంబ్లీ­లో 2023 అక్టోబర్‌లో సభ ఆమో­దం తెలిపిందని, ఆ సవరణను అనుసరించి అసై­న్డ్‌ భూము­­ల­పై జీవో 586ను రెవెన్యూ శాఖ జారీ చేసిందని సీఎస్‌ పేర్కొ­న్నారు. చట్ట సభ ఆమోదం మేరకే జీవో జారీ అయితే దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆపా­ది­ంచ­డం ఎంత వర­కు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో ఆధారంగా తన కుమా­రుడి ద్వారా విశాఖ­లో 800 ఎకరాలకు పైగా భూములు కొనుగోలుకు డీల్స్‌ చేసిన­ట్లు చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే 400 ఎకరాల అసైన్డ్‌ భూము­లను తన కుమారుడిని అడ్డంపెట్టుకుని బినామీల పేరిట చేజిక్కించుకు­న్నా­న­న­డంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు.మరో 400 ఎకరాలను రిజి­స్రే­్టషన్‌ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాననడం పూర్తిగా అవా­­స్తవ­మని సీఎస్‌ తెలి­పా­రు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసేందుకు విశా­ఖ, విజయనగరం జిల్లాల అధికారులపై ఒత్తిడి చేశాననడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో తన కుమారుడు విశాఖకు గానీ, ఉత్తరాంధ్ర­లో ఏ జిల్లాకూ గాని వెళ్లలేదని సీఎస్‌ స్పష్టం చేశారు. మరో వైపు భోగాపురం విమా­నా­శ్రయ పనుల పరిశీలన పేరుతో సీఎం జగన్‌ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై తాను సమీక్షించానని చేసిన ఆరోపణా అసంబద్ధమేనని ఖండించారు.

Lok Sabha Election 2024: Varanasi southern communities in focus as Modi campaign aims at record win margin
Lok Sabha Election 2024: కాశీ చుట్టూ ప్రదక్షిణం!

దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు పొలోమని కాశీ బాట పడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ అధికంగా ఉండే దక్షిణాది ప్రజల ఓట్లే లక్ష్యంగా కలియదిరుగుతున్నారు. తెలుగు, తమిళ సంఘాలతో సమావేశమవుతున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణాది ఆశ్రమాల పెద్దలతో ఉదయం, సాయంత్రం బైఠక్‌లు నిర్వహిస్తున్నారు. దక్షిణాది వారే కీలకం.. వారణాసి నియోజకవర్గంలో 18.50 లక్షల ఓట్లున్నాయి. వీరిలో దక్షిణాది ఓటర్లు కనీసం 3 లక్షల పై చిలుకే ఉంటారు. తెలుగు, తమిళ ఓటర్లు 2 లక్షల దాకా ఉంటారు. కన్నడ, మలయాళీలు లక్ష మంది ఉన్నారు. కాశీలోనే దక్షిణాది రాష్ట్రాల నిర్వహణలో కనీసం 200 వరకు ఆశ్రమాలున్నాయి. ఇలా వారణాసిలో దక్షిణాది ఓటర్లు కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో మోదీ 6.74 లక్షల ఓట్లు (63.62 శాతం) సాధించారు. ఈసారి ఏకంగా 80 శాతం ఓట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాది వారి ఓట్లు అత్యధికంగా మోదీకే వచ్చేలా చూడాలని అధిష్టానం భావిస్తోంది. దాంతో ఆయా రాష్ట్రాల కీలక నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి 50 మంది ఓటర్లకు ముగ్గురు, నలుగురితో కూడిన బృందం చొప్పున పని చేస్తోంది! అంతేగాక ఒక్కో బృందం రోజుకు 4 నుంచి 5 సమూహాలతో భేటీలు నిర్వహిస్తోంది. వారణాసిలో ఇలాంటి బృందాలు ఏకంగా 2,000 దాకా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు! ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత డిసెంబర్‌ నుంచే తెలుగు, తమిళ సంగమం పేరుతో వారణాసిలో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. మోదీ వర్చువల్‌గా వాటిలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడకు కాశీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాశీలో నివసించే దక్షిణాది వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. వారణాసి రైల్వే స్టేషన్‌తో పాటు ప్రధాన దారులు, కూడళ్లలో దక్షిణాది పర్యాటకుల సౌలభ్యం కోసం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రకటనలు తదితరాలు ఏర్పాటు చేయించడాన్నీ గుర్తు చేశారు. కీలక నేతలంతా అక్కడే.. వారణాసిలో చివరిదైన ఏడో విడతలో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. అక్కడి దక్షిణాది ఓటర్లతో సమన్వయ బాధ్యతలను తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌కు అధిష్టానం అప్పగించింది. ఆయన వారం రోజులుగా అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్, నిజామాబాద్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి బి.బి.పాటిల్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌; ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తమిళనాడు నేతలు గాయత్రీ దేవి, ఆర్‌.రాజలక్షి్మ, సి.టి.పళనిస్వామి, తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్‌ నాగేంద్రన్, కె.గోపాలస్వామి, కేరళకు చెందిన పీకే కృష్ణదాస్, కుమ్మనం రాజశేఖర్‌ తదితరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ తమిళనాడు, కర్ణాటక అధ్యక్షులు అన్నామలై, బి.వై.విజయేంద్ర కూడా వారణాసిలోనే వారం పాటు మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘మోదీ కూడా ఆదివారం నుంచి వారణాసిలో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలతోనూ ఆయన మమేకమయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేసే యోచన ఉంది’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.– సాక్షి, న్యూఢిల్లీ

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement