20 ఏళ్లకే సీక్రెట్‍‌గా పెళ్లి చేసుకున్న ‍'స్ట్రేంజర్ థింగ్స్' నటి | Stranger Things Star Millie Bobby Brown Married To Her Boyfriend | Sakshi
Sakshi News home page

Millie Bobby Brown: బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి

Published Sat, May 25 2024 6:21 PM | Last Updated on Sat, May 25 2024 6:47 PM

Stranger Things Star Millie Bobby Brown Married To Her Boyfriend

సినిమా హీరోయిన్లు చాలామంది లేటుగానే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బ్యూటీ 20 ఏళ్లకే తొందరపడింది. తన 22 ఏళ్ల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. మరోవైపు హ్యాపీగానూ ఫీలవుతున్నారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)

'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్‪‌తో మన దగ్గర కూడా పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి మిల్లీ బాబీ బ్రౌన్. దీనితో పాటు పలు సినిమాలు, ఇతర సిరీసులు కూడా ఈమె చేసింది. అయితే టీనేజీలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి మోడల్ జేక్ బొంగివోయ్‌తో రిలేషన్‌లో ఉంది. సోషల్ మీడియాలో పలు ఫొటోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటకొచ్చింది.

అయితే సడన్‌గా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారనే న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమేనని, గతవారం ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక చాలా సీక్రెట్‌గా జరిగింది. ఇలా చిన్న వయసులోనే 'స్ట్రేంజర్ థింగ్స్' నటి మిల్లీ బాబీ బ్రౌన్ పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్‌ మీ’మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement