ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులను పాకిస్థానీయులుగా అభివర్ణించడాన్ని తప్పుపట్టారు.
నిన్న.. అమిత్ షా ఆప్ మద్దతుదారులు పాకిస్థానీలని అన్నారు. నేను ఆయన్ను ఒకటే అడగాలని అనుకుంటున్నాను. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా ప్రజలే మనకు ఓట్లు ఇచ్చారు? మున్సిపాలిటీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు తమ ప్రేమను, నమ్మకాన్ని మనకు (ఆప్) అందించారు. వాళ్లందరూ పాకిస్థానీయులేనా? అని ప్రశ్నించారు.
అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ 2025 డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనుండగా, అమిత్ షా తదుపరి ప్రధాని అవుతారని అంటూనే.. జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడి పోతుంది కాబట్టి మీరు ప్రధాని కాలేరు అని అమిత్ షాను ఉద్దేశించి కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వే ఫలితాల ప్రకారం, ఇండియా కూటమికి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment