Anakapalle District
-
Anakapalle: క్వారీ లారీ ఢీకొని రైల్వే ట్రాక్ ధ్వంసం
-
అనకాపల్లిలో ‘అణు’ విద్యుత్ ప్లాంట్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో అణు విద్యుత్ ప్లాంటు (న్యూక్లియర్ పవర్ ప్లాంటు) ఏర్పాటుచేయాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలో దాదాపు రెండువేల ఎకరాల మేరకు భూమి కేటాయించాలంటూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. మొత్తం 2,800 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేసే ఈ అణు విద్యుత్ ప్లాంటు కోసం రెండువేల ఎకరాల మేర భూమి అవసరమవుతుందని ఎన్టీపీసీ భావిస్తోంది. ఇందుకోసం అనకాపల్లి జిల్లా అనువైనదిగా గుర్తించిన ఎన్టీపీసీ.. ఈ ప్లాంటు ఏర్పాటుకు రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. మరోవైపు.. ఈ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకోసం రోజుకు మూడు బిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. కానీ, ఈ అణు విద్యుత్ ప్లాంటు ఏర్పాటుపై ఇప్పటికే అనేక అనుమానాలున్నాయి. ఎందుకంటే.. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తున్న అణు విద్యుత్ ప్లాంటుపై ఇప్పటికే అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఈ ప్లాంటు ఏర్పాటువల్ల తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ ప్లాంటు ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ తలపెట్టిన అణు విద్యుత్ ప్లాంటుపై జిల్లా ప్రజల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చెరొకటి..వాస్తవానికి.. దేశవ్యాప్తంగా 30 గిగావాట్ల (30 వేల మెగావాట్లు) సామర్థ్యం కలిగిన అణు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని ఎన్టీపీసీ నిర్ణయించుకుంది. ‘ఎన్టీపీసీ పరమాణు ఉర్జ నిగమ్’ అనే సంస్థను ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. దేశవ్యాప్తంగా 23 ప్రాంతాలు అనువైనవిగా గుర్తించింది. రోజురోజుకీ బొగ్గు లభ్యత తగ్గిపోవడంతో పాటు సోలార్, విండ్ నుంచి కచ్చితంగా ఇంత మొత్తం విద్యుత్ వచ్చే అవకాశముందని చెప్పే వీల్లేకపోవడంతో దేశ విద్యుత్ అవసరాలను తీర్చేందుకుగానూ అణు విద్యుత్ వైపు ఎన్టీపీసీ అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఒక్కొక్కటి 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు ప్లాంట్లు ఏర్పాటుచేసేందుకు అవకాశముందని ఎన్టీపీసీ తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పక్కనున్న తెలంగాణలో కూడా ఒక అణు విద్యుత్ ప్లాంటు ఏర్పాటుచేయాలని ఎన్టీపీసీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఏదీ అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టతరాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అణు విద్యుత్ ప్లాంట్‌కు భారీగా నీటి లభ్యత అవసరం ఉంటుందని.. ఈ అవసరాలను పోలవరం ద్వారా తీర్చుకునే వెసులుబాటు ఉందని కూడా ఎన్టీపీసీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అణు ధార్మికత ముప్పుపై జిల్లా ప్రజల్లో ఆందోళన..ఇక అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై మొదటి నుంచీ ఆందోళన ఉంది. ఈ ప్లాంటు ఏర్పాటైతే తమ భూములను కోల్పోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి, ప్రాణాలకు ముప్పు తప్పదన్న అభిప్రాయాలున్నాయి. దీన్నుంచి వచ్చే అణు ధార్మికతవల్ల ప్రధానంగా క్యాన్సర్‌తో పాటు ఎక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్, ఎనీమియా వంటి జబ్బులతో ప్రాణాల మీదకు వస్తుందన్న భయాందోళనలు ఉన్నాయి. మరోవైపు.. 1986లో ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌లో జరిగిన సంఘటనతో పాటు 2011 జపాన్‌లో జరిగిన అణు విద్యుత్ ప్లాంటు దుర్ఘటనలవల్ల చోటుచేసుకున్న నష్టాన్ని ప్రజలు గుర్తుతెచ్చుకుంటున్నారు. -
అనకాపల్లి జిల్లాలో అశ్లీల నృత్యాల కలకలం
-
అనకాపల్లి జిల్లాలో మరోసారి రేవ్ పార్టీ కలకలం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో గత సోమవారం రాత్రి రేవ్ పార్టీ కలంకలం రేపిన సంగతి తెలిసిందే. గొలుగొండలోనే మరొక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం రాత్రి గొలుగుండ సమీపంలో బహిరంగంగా అర్ధ నగ్న డాన్స్‌లు నిర్వహించారు. గంజాయి, అమ్మాయిలతో విచ్చలవిడిగా రేవ్ పార్టీ జరిగిన కానీ, పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఈ రేవ్ పార్టీలో నలుగురు అమ్మాయిలు పాల్గొన్నారు. గంజాయి మత్తులో పార్టీలో యువకుల మధ్య కొట్లాట జరిగింది. దీంతో పార్టీలో ఓ యువకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకులను మందలించి పంపించివేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. రేవ్ పార్టీలో మైనర్లు కూడా పాల్గొన్నారు. దీంతో తల్లి దండ్రుల ఆందోళన పడుతున్నారు. పోలీస్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. -
నీ ముక్కెర ... కాళ్ళ పట్టాలు కూడా మెరుస్తాయి లక్ష్మి
చీకటిపడుతున్నవేళ చిన్నగా ఈలవేస్తూ.. లచ్మీ ఇదిగో.. మన పొలం కాడ గుమ్మిలో దొరికింది పట్టేశాను.. బుర్రా తోకలు పులిసెట్టు.. నడు మ్ముక్కలు ఇగురు చెయ్యవే.. అంటూ కళ్ళు కడుక్కోడానికి గోలేం కాడికి వెళ్ళాడు.. మత్స్య రాజు... తిక్కనా సన్నాసికి ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేస్తాడు..ఈడి జిమ్మకు ఒకటి చాలదు .. రెండు రకాలుండాలి.. ఈ చీకట్లో ఇదేటి దరిద్రం.. సన్నగా గొణుక్కుంది లచ్మి .. ఒసేయ్... ఇన్నావా.. వాటిని తియ్యు.. లేపోతే పిళ్లెత్తుకెళ్ళిపోద్ది.. అప్పుడు నీకు దరువులు పడతాయి అన్నాడు కొంటెగా..ఈ రాత్తిరిపూట వాటిని పెరట్లోకి వెళ్లి రాయిమీద పొయ్యి బుగ్గేసి పామి.. కడిగి.. పులు సెట్టి ఈడీకి కూడెట్టాలి.. మొగుడిమీద ప్రేమగా విసుక్కుంది లచ్మి.. ఏందే నీ సణుగుడు... కేకేశాడు.. రాజు.. ఈడీకి పనికొచ్చినముక్క చెప్తే ఒక్కటీ ఇనబడదు కానీ. ఇలాంటివి మాత్రం టక్కున చెవిలోపడతాయి.. సచ్చోనోడివి పాము చెవ్వులు.. అంటూనే వంటి పూర్తి చేసేసింది .. చీకట్లో సరిగ్గా చూసుకుని తిను.. లేపోతే ముల్లుదిగిపోద్ది.. జాగ్రత్త చెప్పింది.. పోన్లేయే.. ఇదొక్కటే చీకటి భోజనం.. ఎల్లుండినుంచి అదిగో.. అక్కడ కూకుని తిందాం.. నువ్వు నేను.. మన బుడ్డి సాంబిగాడు అన్నాడు..సీకట్లో కూకుని ఆ సెట్టుకింద తింతావా .. నువ్వేమైనా గబ్బిలానివా మామ.. అంటూ నవ్వింది లచ్చ్మి.. లేదే.. మనూరికి కరెంటొచ్చింది.. అదిగో మన గొర్రిల పాక పక్కనే స్థంభం వచ్చింది.. ఇక మనకు ప్రతోరోజూ.. పగలే... రేత్తిరి అనేది ఉండదు అన్నాడు.. రేత్తిరి లేకపోతే నువ్వు ఊరుకుంటావా మామ .. నర్మగర్భంగా పంచ్ వేసింది.. ఐనా కరెంటొస్తే మనకేటి మామ.. లాభం అంటూ డోకితో కాసింత పులుసు పోసింది.. అదేటి అలాగంటావు. కరెంటొస్తే ఊరికే కాదే మన బతుకుల్లోకి కూడా వెలుగొచ్చినట్లే అన్నాడు .. అదెలా అంది..చేప తలకాయ ను రాజు పళ్లెంలో వేస్తూ..ఒసేయ్ లచ్చిమి.. కరెంట్ వచ్చిందనుకో.. మనం ఇంటికి ఒక కరెంట్ బుడ్డి వేసుకోవచ్చు.. మన బుడ్డి గాడు మన ఇంట్లోనే పెట్టి మీద కూకుని సదూకుంటాడు.. మనం కొర్రలు... సామలు.. గట్రా ఇంట్లోనే మరాడించుకోవచ్చు.. కరెంట్ కుక్కర్ కొనుక్కోవచ్చు.. ఇక నువ్వు చీకటిపడ్డాక కూడా ఉడుకుడుగ్గా వండొచ్చు.. మనం కూడా వేడివేడిగా తిని.. అన్నాడు.. సాల్సాల్లే నీకు తిపారం ఎక్కువైంది.. అన్నది లచ్చ్మి . ఒసేయ్.. ఈ చీకట్లో కనబళ్ళేదు కానీ... కరెంట్ వచ్చాక.. ఆ వెల్తుర్లో నీ నత్తు .. కాళ్ళ పట్టీలు కూడా భలే మెరుస్తాయి లచ్చిమి అన్నాడు.. ఆమె చుబుకం మీద చెయ్యేస్తూ.. ఈడీకి పనికి వెళ్ళడానికి ఒల్లొంగదుకానీ ఇలాంటీటీకి మాత్రం రద్దీగా ఉంటాడు మురిపెంగా విసుక్కుంది లచ్చిమి.. ఒసేయ్ ఇంకెన్ని లాభాలున్నాయో తెలుసా.. మనఇంటి ముందు లైట్ ఉంటుంది కదా.. అక్కడే మనమంతా రాత్రి పూత కబుర్లు చెప్పుకుని పడుకోవచ్చు.. ఇక ఆముదం. కిరసనాయిలు దీపాలు అక్కర్లేదు.. చుట్టాలు వచ్చినా ఇక ఇంటిముందున్న రాళ్లు తన్నుకుని పడిపోయేది ఉండదు.. ఒసేయ్ లచ్మి కరెంట్ ఎల్తురులో నువ్ మరింత మెరిసిపోతావే అన్నాడు.. రాజు.. ఈడికిపోయేకాలం రాను.. అంటూ గిన్నెలు తీసి.. సర్లే.. అవతల పెయ్యి అరుస్తుంది దాన్ని పాకలో కట్టేసి రా.. అంటూ గదిమింది..అనకాపల్లి జిల్లా గిరిశిఖర గ్రామం నీలబంధకు తొలిసారిగా కరెంట్ వచ్చింది.. ఈ సందర్భంగా ఓ గిరిజన కుటుంబంలో కలిగే మార్పులపై చిన్న కథ.. కథనం.. మీ కోసం... -- సిమ్మాదిరప్పన్న77 ఏళ్ల తర్వాత కొండశిఖర గ్రామమైన నీలబంధకు ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం.#APNDAWorkshttps://t.co/VN2UYyVSxr— Team Rajakeeyam (@TeamRajakeeyam) February 2, 2025 -
అనకాపల్లి జిల్లా చౌడువాడ గ్రామంలో ఎడ్ల బండ్ల పందాలు (ఫొటోలు)
-
ఫార్మాసిటీలో మరో ప్రమాదం..
సాక్షి, అనకాపల్లి: ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వరుస ప్రమాదాలతో కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇరువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్‌హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. -
మనసే కోవెలగా..
అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లాలోని గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి వెల్లివిరుస్తోంది. భక్తి పారవశ్యం మానసిక ప్రశాంతత చేకూరుస్తోంది. సనాతన సంప్రదాయాలకు మళ్లీ పెద్దపీట వేస్తూ దేవుని పూజలతో తన్మయత్వం పొందుతున్నారు భక్తులు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ధనుర్మాసం పూజల్లో నిమగ్నం అవుతున్నారు. పెద్ద పండుగ ముందు పల్లెలన్నీ హరినామ సంకీర్తనతో మార్మోగిపోతున్నాయి. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమాలు అన్ని గ్రామాలకు విస్తరిస్తున్నాయి. చలికాలం వచ్చిందంటే కాసింత వెచ్చని ఎండ వచ్చే వరకూ నిద్ర లేవని వారు సైతం హరినామ సంకీర్తనలో మమేకం అవుతున్నారు. అచ్యుతాపురం మండలంలోని జగ్గన్నపేటలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మేలుకొలుపులు ఇప్పుడు మండలంలోని 12 గ్రామాలకు పైగా విస్తరించింది.తిమ్మరాజుపేట, హరిపాలెం, జగన్నాథపురం, కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, చీమలాపల్లి, దుప్పుతూరు, దోసూరు, గండివానిపాలెం, నరేంద్రంపురం గ్రామాల్లో మేలుకొలుపులు నెలగంట కొట్టిన రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్తరాయనంలో 6 నెలల పాటు దేవతలు సంచరించే సమయంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. మేలుకొలుపు కార్యక్రమం వల్ల తెల్లవారుజాము నుంచే భక్తులు లేచి పుణ్య స్నానాలు ఆచరించి హరినామ సంకీర్తన చేస్తున్నారు. అయ్యప్ప మాలధారులు స్వామి సన్నిధికి వెళ్లిన తర్వాత మళ్లీ భక్తితత్వంలో కొనసాగేందుకు మేలుకొలుపులు ఉపయోగపడుతున్నాయని సమరసత సేవా ఫౌండేషన్ యలమంచిలి డివిజన్ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మానసిక ప్రశాంతత, ఉల్లాసం లభిస్తోందని భక్తులు పేర్కొనడం గమనార్హం.హరిదాసుల సందడినెలగంట పెట్టిన రోజు నుంచి గ్రామాల్లో హరిదాసుల సందడి మొదలయ్యింది. అక్షయ పాత్రను తలపై పెట్టుకొని హరినామస్మరణతో వీధుల్లో సంచరిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నారు. గంగిరెద్దుల సందడి, గాలిపటాలతో చిన్నారుల కోలాహలం, ముగ్గుల పోటీల్లో మహిళల కళా కౌశలం ఊరూరా ప్రతిఫలిస్తోంది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏకాదశి రోజున నగర సంకీర్తన, వారం వారం భజనలు, పౌర్ణమి రోజున సామూహిక హారతి, సత్సంగం, కార్తీక పౌర్ణమి రోజున వెన్నెలలో పాలను మరిగించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో మహిళలు కీర్తనలు, కోలాటాలు నేర్చుకొని దేవాలయాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇది కూడా వారిలో భక్తి భావం పెంపొందించడంతోపాటు, శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడుతోంది. ఈ చిత్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్న వ్యక్తి పేరు చిలకా నారాయణ. 30 ఏళ్లుగా ఊనగట్ల వారపు సంతలో కూరగాయలు విక్రయిస్తున్నాడు. గత ఏడాది ఇదే సమయానికి రూ.40 వేల వరకూ వ్యాపారం చేశాడు. ప్రస్తుతం కొనేవారు లేకపోవడంతో రూ.10 వేలు కూడా దాటని దుస్థితి నెలకొందని వాపోతున్నాడు. ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన చెందుతున్నాడు.నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం ఊనగట్లలోని వారపు సంత. మూడు గ్రామాల పరిధిలోని సుమారు 10 వేల మంది ప్రజలకు ఈ సంతే ప్రధానం. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ సంతకు వచ్చి ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంత కొనుగోలుదారులతో కిటకిటలాడేది. ప్రస్తుతం జనం లేక వెలవెలబోతోంది.అతని పేరు రవి. విజయనగరం పట్టణంలోని వీటీ అగ్రహరంలో ఉంటున్నాడు. కూటమి ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ ఇస్తుందంటే కుటుంబ ఆర్థిక భారం తగ్గుతుందని సంబరపడ్డాడు. పథకం అమలు తరువాత రెండుసార్లు గ్యాస్ సిలిండర్ విడిపించారు. ఒక్క దానికి కూడా నగదు జమ కాలేదు. మొదటి సిలిండర్‌కు నగదు జమ కాలేదని విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఈకైవేసీ చేయించమంటే చేయించారు. అయినా నగదు జమ కాలేదు. -
నాలుగేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి
యలమంచిలి రూరల్: మొబైల్లో పోర్న్ వీడియో చూసిన ఓ 13 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామంలో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ బాలికను సమీపంలో ఉన్న డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లడం, రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు చిన్నారిని ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది.బాలుడు చేసిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పి మందలిద్దామని వెళ్లిన బాలిక కుటుంబీకులపైనే బాలుడి తల్లి ఎదురుదాడికి దిగింది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీంతో శనివారం రాత్రే యలమంచిలి రూరల్ పోలీసులకు బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే అఘాయిత్యానికి పాల్పడిన బాలుడి తల్లి, బంధువులు టీడీపీకి చెందిన వారు కావడంతో ఆదివారం ఉదయం వరకూ కేసు నమోదు చేయలేదు.అనంతరం వైఎస్సార్సీపీ నేతలు పోలీసులను ప్రశ్నించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికను విశాఖ కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇలాంటి పని ఎందుకు చేశావంటూ ప్రశ్నించారు. తన తల్లి మొబైల్ ఫోన్లో ఓ పోర్న్ వీడియో చూసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాలుడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. బాలిక కుటుంబానికి వైఎస్సార్సీపీ పరామర్శవైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాలిక కుటుంబాన్ని పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు.అఘాయిత్యానికి పాల్పడ్డ బాలుడి తల్లి టీడీపీ నాయకురాలు కావడం, బాధితులనే ఆమె బెదిరిస్తోందని తెలుసుకున్న ధర్మశ్రీ.. బాలిక కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. -
అనకాపల్లి జిల్లాలో విద్యార్థుల ఆందోళన
-
YSRCP Bus Yatra Photos: సామాన్యులతో సీఎం జగన్.. అడుగడుగునా జన నీరాజనం (ఫొటోలు)
-
YSRCP అనకాపల్లి అభ్యర్థుల జాబితా ఇదే
అనకాపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
షర్మిలను నిలదీసిన సామాన్యుడు
అనకాపల్లి: కొన్ని రోజుల క్రితం ఏపీలోని కాంగ్రెస్ పార్టీలో చేరి రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజలకు వద్దకు వెళుతున్న షర్మిలకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీ కండువా మళ్లీ మీరు ఎందుకు కప్పుకున్నారని షర్మిలను ఓ సామాన్యుడు నిలదీశాడు. గతంలో జగనన్న వెంట నడిచి, ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీ అనడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెడితే.. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, అప్పుడున్న నిజాయితీ ఇప్పుడెందుకు లేదని నిలదీశాడు. అనకాపల్లి నియోజకవర్గంలో నర్సీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సామాన్యుడి నుంచి ఎదురైన ఈ హఠాత్తు పరిణామంతో షర్మిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని వేధించింది. వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టింది. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మా కార్యకర్తలమంతా తప్పుపట్టాం. ఆ సమయంలో మేమంతా మీకు, మీ కుటుంబానికి అండగా నిలబడ్డాం. మీ పాదయాత్రలో మీతో నడిచాం. ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటున్నారు. అందుకే నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి’ అంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, పింఛన్లు మొదలుకొని ప్రతీ పథకం అర్హుడైన పేదవాడికి అందుతుందని స్పష్టం చేశాడు . -
అనకాపల్లి: పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్ దారుణ హత్య
సాక్షి, అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్‌ను దారుణంగా హత్య చేశారు. గ్రామ సమీపంలో కాలువ వద్ద వాలంటీర్ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
నరకం చూపి ‘నారా’ నాడు
చోడవరం: గత తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులనూ వదల్లేదు. నరకం చూపించింది. జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు మానవత్వాన్నే మరిచి అంగవైకలురుపైనా కక్షసాధింపు చర్యలకు దిగారు. పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైన వారిపైనా కర్కశం ప్రదర్శించారు. ఎన్నిసార్లు వేడుకున్నా.. పింఛన్లు మంజూరు చేయలేదు. అప్పటికే ఉన్నవీ భారీ స్థాయిలో తొలగించారు. ఫలితంగా బాధితులు అష్టకష్టాలు పడ్డారు. పింఛన్ల మంజూరు, పునరుద్ధరణ కోసం శరీరం సహకరించకున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా నాటి ప్రభుత్వ పెద్దల మనసు కరగలేదు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆత్మహత్యయత్నాలు చేసి తమ హక్కును సాధించుకున్నారు. ఇప్పటికీ నాటి ప్రభుత్వ అకృత్యాలను గుర్తుచేసుకుని దివ్యాంగులు మదనపడుతున్నారు. ఇక జన్మలో చంద్రబాబును నమ్మబోమని కరాఖండీగా చెబుతున్నారు. అప్పట్లో నరకం చవిచూసిన అంగవైకలుర మనో‘గతాన్ని’ ఆవిష్కరించే యత్నమిది.. అంధుడిపైనా కర్కశం: అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, ఖండిపల్లికి చెందిన సియాద్రి దుర్గాప్రసాద్ పుట్టుకతోనే అంధుడు. చోడవరం దివ్యాంగుల స్కూల్లో 10వ తరగతి చదివాడు. ఆరోగ్యం బాగోలేక మధ్యలో చదువు ఆపేశాడు. మళ్లీ ఈ ఏడాది గుంటూరు సమర్ధన ట్రస్టులో చేరి ఇంటర్మిడియెట్ చదువుతున్నాడు. 2014 ముందు వరకు ఇతనికి దివ్యాంగ పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీ సభ్యులు ఇతని కుటుంబంపై ఉన్న రాజకీయ కక్షతో పింఛన్ తొలగించారు. ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో 2017లో లోక్‌అదాలత్‌ను ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో అధికారులు పింఛన్ పునరుద్ధరించారు. నేడు వేకువజామునే ఇంటికి.. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతినెలా 1వ తేదీన వేకువజామునే లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి మరీ వలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారు. ఫలితంగా దివ్యాంగులు, అవ్వాతాతల మోములు ‘సిరి’నవ్వులు చిందిస్తున్నాయి. కాళ్లు లేకున్నా.. కరుణించలేదు నేను లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడిని. 2015లో రాజమండ్రి దగ్గర విద్యుత్ తీగలు లారీకి తగిలి ప్రమాదం జరిగింది. నేను చాలా వరకూ కాలిపోయాను. వైద్యులు నా రెండు కాళ్లూ తొలగించారు. కదల్లేని పరిస్థితి తలెత్తింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా జన్మభూమి కమిటీ సభ్యులు కరుణించలేదు. చివరకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ అప్పటి కలెక్టర్ పింఛన్ మంజూరు చేయలేదు. ఆ తర్వాత కూడా సక్రమంగా పెన్షన్ నగదు ఇచ్చేవారు కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వలంటీర్ వచ్చి నగదు ఇస్తున్నాడు. – వియ్యపు సోమునాయుడు, దివ్యాంగ పింఛన్‌దారు, పెదపాడు, బుచ్చెయ్యపేట మండలం ఆత్మహత్యాయత్నం చేస్తేకానీ ఇవ్వలేదు నేను లారీలో పనిచేసేవాడిని. 2014లో అనకాపల్లి దగ్గర అడితీలో కర్రలు లోడ్ చేస్తుండగా అవి నాపై పడ్డాయి. కాలు, చెయ్యి పూర్తిగా విరిగిపోయాయి. వాటిని వైద్యులు శరీరం నుంచి తొలగించారు. అప్పట్లో దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేశా. జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడ్డారు. 2017లో బుచ్చెయ్యపేట మండల ఆఫీసు దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ పింఛన్ రాలేదు. అయినా సక్రమంగా ఇచ్చేవారు కాదు. – ఐతిరెడ్డి గోవింద, వికలాంగ పింఛన్‌దారు, ఐతంపూడి, బుచ్చెయ్యపేట మండలం -
చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త
సాక్షి, అనకాపల్లి జిల్లా: చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షుగర్ ఫ్యాక్టరీకి గ్రాంట్ రూపంలో రూ.12 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. చెరుకు రైతుల బాకీల నిమిత్తం రూ.9 కోట్ల 30 లక్షల రూపాయలు, కార్మికుల జీతాల పెండింగ్ బిల్లుల కోసం మూడు కోట్ల రూపాయలు గ్రాండ్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు విడుదల పట్ల రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధన్యవాదాలు తెలిపారు. -
అధినేత దెబ్బ.. అయ్యన్న అబ్బా..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు అధినేత అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కొట్టిన దెబ్బకు కోలుకోలేక మధనపడుతున్న అయ్యన్నకు.. ఇంటి పోరు మరింత తలపోటుగా మారుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ వారసత్వంగా కొడుకును నర్సీపట్నం నుంచి 2024 ఎన్నికల్లో బరిలోకి దించాలంటూ ఒత్తిడి అధికం కావడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రానున్న ఎన్నికల్లో కొడుకును బరిలోకి దించకపోతే తన రాజకీయ వారసత్వం కష్టమనే భావనలో అయ్యన్న ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక అయ్యన్న నోటికి తాళం పడినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు కోసం అయ్యన్న తీవ్రంగా కష్టపడ్డారు. నోటికి వచ్చినట్టు ఇష్టారీతిన అధికార వైఎస్సార్ సీపీపై విమర్శలు గుప్పించారు. అధినేత దృష్టిలో ఉంటూ అనకాపల్లి ఎంపీ సీటును కొడుకుకు వచ్చేలా యత్నించారు. అయితే, ఎన్నికలు వచ్చేసరికి వ్యాపారవేత్తలు, పైసలు ఉన్నవారికే సీటు ఇచ్చే అలవాటున్న చంద్రబాబు ఈసారి మారారనే భావనలో అయ్యన్న ఉన్నారు. తీరా ఎన్నికల ముంగిటకు వచ్చేసరికి యథావిధిగా అనకాపల్లి ఎంపీ సీటును బాగా ఖర్చు చేయగలిగిన వ్యక్తికి ఇవ్వనున్నట్టు సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ వారసత్వం కోసం నర్సీపట్నం నుంచి కొడుకును బరిలోకి దించాలంటూ ఇంటి పోరు రోజురోజుకీ ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది. కొడుకు పోరుతో విలవిల వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వకపోతే కుమారుడిని నర్సీపట్నం నుంచి బరిలోకి దించాలంటూ ఇంటి పోరు అధికమైనట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడిన అయ్యన్న ఓటమి తర్వాతైనా గుణపాఠం నేర్చుకుంటారని అందరూ భావించారు. అయితే, అయ్యన్న బుద్ధి మాత్రం మారలేదు. సరికదా ఓటమి బాధలో మరింతగా దిగజారి మాట్లాడటం ప్రారంభించారు. ఫలితంగా నియోజకవర్గంలో అయ్యన్నకు ఏ మాత్రమూ పట్టుపెరగడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వివాదరహితుడు కావడం... తాజాగా జరిగిన సాధికార యాత్ర విజయవంతం కావడం వల్ల మరోసారి వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా 2024 ఎన్నికల్లోనే కుమారుడిని బరిలోకి నిలిపేలా ఇంటి పోరు ఎక్కువవుతోందని సమాచారం. 2029 ఎన్నికల వరకూ వేచిచూడటం కష్టమంటూ కుమారుడికి మద్దతుగా అయ్యన్న సతీమణి కూడా గొంతు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా అధినేత వైఖరితో తలబొప్పి కట్టిన అయ్యన్నకు... ఇంటి పోరు మరింత తలపోటుగా మారింది. కొడుకును బరిలోకి దింపి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకుంటారా లేదా అనేది త్వరలో తేలనుంది. రాజకీయ వారసత్వం కష్టమే.. వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడైనా తనకు ఆరోగ్యం, వయస్సు సహకరించిన సమయంలోనే తన వారసత్వాన్ని రాజకీయాల్లో దించటం సహజ పరిణామం. తీరా వయస్సు అయిపోయిన తర్వాత వారసత్వాన్ని రంగంలోకి దించితే గెలిపించడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది రాజకీయ నాయకులు తమ వారసులను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తారు. అయితే అయ్యన్న నర్సీపట్నంతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు మాత్రం ఎప్పటికప్పుడు దీనిపై దాటవేస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల ముందు భారీగా ఖర్చు చేసే అభ్యర్థి దొరకడంతో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. దీంతో పార్టీ కోసం కష్టపడితే ఇదేనా నాకిచ్చే గౌరవమంటూ ఆయన లోలోపల మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇదే పరిస్థితుల్లో నర్సీపట్నం నుంచి తాను రంగంలోకి దిగితే వచ్చే ఎన్నికల వరకు అంటే 2029 వరకూ రాజకీయ వారసత్వం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి ఎన్నికల్లో గెలిచే సూచనలు కనిపించనప్పటికీ కొడుకును బరిలో నిలపడం ద్వారా రాజకీయ వారసత్వం కొనసాగించే అవకాశం ఉంటుంది. -
అనకాపల్లిలో టిడ్కో గృహాలు: సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్
సాక్షి, అనకాపల్లి: సత్యనారయణపురంలో 2,744 టిడ్కో గృహ సముదాయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. కాగా, 27 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టిడ్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తమకు సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..పేదవాడి సొంటితి కల నిజం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. పేదలకు శాశ్వత నివాసం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2.50 లక్షల మందికి టిడ్కో ఇల్లు ఇచ్చే ప్రక్రియకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ఈ సారి మీ సొంత ఇంట్లో చేసుకోవాలని టిడ్కో ఇళ్లు పూర్తి చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. పాదయాత్రలో ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట నిలుపుకున్నారు. లబ్ధిదారులకు రిజస్ట్రేసన్లు ఉచితంగా చేయిస్తున్నారు. కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. జగనన్న కాలనీల ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని కామెంట్స్ చేశారు. -
వాయుసేనలో శిక్షణాధికారిగా రైతు బిడ్డ
చోడవరం: రైతు బిడ్డ భారతదేశ యుద్ధ విమానాల్లో శిక్షణ ఇచ్చే అధికారిగా ఎదిగారు. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుమారుణ్ణి భారత సైన్యంలో చేర్పించగా.. తండ్రి కష్టానికి, ఆశయానికి అనుగుణంగా ఆ కుమారుడు 21 ఏళ్లప్రాయంలోనే ఉన్నత స్థానాన్ని అందిపుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన సాధారణ రైతు మజ్జి గౌరీశంకర్, లక్ష్మి దంపతులకు వెంకటసాయి, దుర్గాప్రసాద్ ఇద్దరు కుమారులు. చిన్నతనం నుంచి ఇద్దరూ చదువులో ముందంజలో నిలిచారు. పెద్ద కుమారుడు ప్రాథమిక విద్య చోడవరంలో చదివి, 6వ తరగతిలో విజయనగరం సైనిక్ స్కూల్లో చేరారు. అక్కడ ఇంటర్మిడియెట్ చదువుతూ భారతదేశ సైనిక విభాగంలో చేరేందుకు శిక్షణ కూడా పొందారు. దేశ రక్షణ విభాగంలో అత్యంత కీలకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షల్లో 2019లో ఉత్తమ స్థానం సాధించి ఎన్డీఏలో చేరారు. మూడేళ్లపాటు పుణెలో, ఏడాదిపాటు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌పోర్టులో యుద్ధ విమానాల్లో శిక్షణ పొందారు. ఎన్డీఏతోపాటు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బీటెక్ ఇంజినీరింగ్ (ఈసీఈ) కూడా పూర్తిచేశారు. శిక్షణ అనంతరం దేశ రక్షణ విభాగంలో కీలకమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ శిక్షణలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా భారత రక్షణ శాఖ నియమించింది. మజ్జి వెంకటసాయిని అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి మంగళవారం అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులకు వెంకటసాయి మంచి స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. దేశానికి సైన్యాన్ని అందిస్తున్న బెన్నవోలు మారుమూల గ్రామంగా పెద్దేరు నది ఒడ్డున ఉన్న బెన్నవోలు గ్రామం దేశానికి ఎందరో సైనికులను అందించింది. ఆరు దశాబ్దాలుగా గ్రామానికి చెందిన అనేక మంది యువకులు త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలందించారు. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామమైనప్పటికీ దేశ రక్షణకు ఈ గ్రామం చేస్తున్న సేవ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నా మొదటి ఆశయం ఇదే చిన్నప్పటి నుంచీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా చేరాలని అనుకునేవాణ్ణి. మా అమ్మ, నాన్న కష్టపడి పనిచేస్తూ నా చదువుకు కావలసినవన్నీ సమకూర్చారు. వారి సహకారంతో నా జీవితాశయాన్ని సాధించగలిగాను. దేశానికి సేవ చేయాలన్న నా ఆశయానికి ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టు మరింత దోహదపడుతుంది. – మజ్జి వెంకటసాయి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
ఏజెన్సీ ముఖద్వారంలో ‘సామాజిక’ జైత్రయాత్ర
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శనివారం ‘జై జగన్..జైజై జగన్’ నినాదాలతో దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆద్యంతం ఉత్సాహం, ఉత్తేజంతో సాగింది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికార పదవులు లభించాయని కొనియాడారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. దళితులకు అడుగడుగునా మేలు.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని కొనియాడారు. జనవరి 1 నుంచి వితంతు, వృద్ధాప్య పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతున్నారని చెప్పారు. రెండు వేళ్లు చూపించే టీడీపీ నేతలకు.. ఇక వృద్ధులు, వితంతువులు మూడు వేళ్లు చూపాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా మేలు జరుగుతోందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఈసారి తనను రాజ్యసభకు పంపుతున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రజల సంక్షేమం కోసం రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశంసించారు. వైద్య విప్లవం తీసుకొచ్చారు.. సీఎం జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి కొనియాడారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని ప్రశంసించారు. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ మాట్లాడుతూ.. సీఎం సహకారంతో రూ.2,700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు సైకోలా తయారై బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సాధికారతకు సీఎం జగన్ నిజమైన అర్థం చెప్పారని కొనియాడారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ఎస్సీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, పార్టీ నేత చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష పాల్గొన్నారు. -
అనకాపల్లి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను రామకృష్ణ, దేవి, వైష్ణవి, జాహ్నవిగా గుర్తించారు. అప్పులు బాధలు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నేడు చోడవరం, రాజంపేట నియోజకవర్గాల్లో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అనకాపల్లి జిల్లాలో చోడవరం, అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది. బడుగు, బలహీన, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ చేసిన మేలును యాత్రలో ఆ వర్గాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరించనున్నారు. -
సబ్బవరం.. బడుగు జనసంద్రం
సాక్షి, అనకాపల్లి: పెందుర్తి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు శనివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన సునామీని తలపించింది. పెందుర్తి మండలం వేపగుంట జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ర్యాలీ సబ్బవరం మండలం మూడు రోడ్ల జంక్షన్లో బహిరంగ సభాస్థలి వరకూ భారీ ఎత్తున సాగింది. వేలాది ప్రజలు కడలిలా బస్సు యాత్రలో పాల్గొన్నారు. వందలాది బైక్‌లతో యువత ర్యాలీ చేశారు. యాత్ర ఆద్యంతం సామాజిక నినాదాన్ని హోరెత్తించారు. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.8 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రయోగశాల భవనాన్ని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ప్రారంభించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. రాష్ట్రంలోని అణగారిన వర్గాలను సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారో నేతలు వివరించినప్పుడు ప్రజలు ‘జై జగన్’ అంటూ పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్న సీఎం జగన్: స్పీకర్ సీతారాం సామాజిక సాధికార సభలో స్పీకర్ తమ్మినేనీ సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తున్నారని చెప్పారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక సాధికారిత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలవుతోందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 139 కులాలను గుర్తించి, 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, వాటిని చైర్మన్లు, 700 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసిన దళితుడైన నందిగం సురేష్ ను పార్లమెంట్‌కు, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారన్నారు. అభివృద్ధి జరగలేదని దుష్ప్రచారం చేస్తున్న వారికి రాష్ట్రంలో రూ.2.30 లక్షల కోట్ల సంక్షేమం కనబడలేదా అని ప్రశ్నించారు. చిరిగిన నిక్కరు, చిరిగిన పుస్తకాలతో పెచ్చులూడిన భవనాల్లో చదువుకునే పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ తరహా విద్య అందించడం, ఇంగ్లిష్ మీడియంలో బోధించడం అభివృద్ధి కాదా అని నిలదీశారు. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టడం, తీరప్రాంత అభివృద్ధితో పాటు నూతన పోర్టులు, హార్బర్ల నిర్మాణం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఈ నాలున్నరేళ్లలో మీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన సీఎం జగన్‌కు రానున్న ఎన్నికల్లోనూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు తండోపతండాలుగా వస్తుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ఈ యాత్ర గురించి పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోందని తెలిపారు. జనమే జగన్ బలం: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నాలుగు ఉపముఖ్యమంత్రి పదవులు కల్పించి అక్కున చేర్చుకున్నారన్నారు. జనమే జగన్ బలమని, ఈ సైన్యం వైఎస్సార్సీపీ విజయసారథులని అన్నారు. జగనన్న పాలనలో సామాజిక న్యాయం: ఎంపీ సురేష్ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్ రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేశారని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఇది పెత్తందార్ల రాజ్యం కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజ్యమని చూపించారన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటం ఓ విప్లవమని, సాధికారతకు నిదర్శనమని అన్నారు. పెందుర్తిలో రూ.2,162 కోట్లతో సంక్షేమం: ఎమ్మెల్యే అదీప్‌రాజ్ పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో పెందుర్తి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు రూ.2,162 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. -
జనసంద్రంతో హోరెత్తిన పెందుర్తి
పెందుర్తి(అనకాపల్లిజిల్లా): అనకాపల్లి జిల్లా పెందుర్తిలో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర జనసంద్రంతో హోరెత్తింది. ఎమ్మెల్యే అదీప్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘ రూపాయి లంచం లేకుండా సీఎం జగన్ పాలన చేశారు. కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబులాగా మాట తప్పే వ్యక్తి సీఎం జగన్ కాదు. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి సీఎం జగన్. నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని చెప్పిన సీఎంలు గతంలో ఎవరు లేరు. ప్రభుత్వ పాఠాశాలలను కార్పొరేట్ పాటశాలలుగా మార్చిన నాయకుడు సీఎం జగన్.మహిళలు కోసం అమ్మ ఒడి, చేయూత, ఆసరా, వసతి దీవెన, విద్య దీవెన వంటి పథకాలు ప్రవేశపెట్టారు. అధికారంలో ఉన్నపుడు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘ రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం కూడా దైర్యంగా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని దైర్యం చెప్పలేదు. ప్రతి కుటుంబం సీఎం జగన్ పథకాలతో బాగుపడింది.పేదల పిల్లలను అగ్ర వర్ణాల పిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. బీసీలను ఎస్సీలకు చంద్రబాబు అవమానించారు’ అని తెలిపారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ‘ సామాజిక న్యాయం సీఎం వైఎస్ జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎన్నో పదవులు కట్టబెట్టారు. త్వరలో వైజాగ్ వచ్చే సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘పెందుర్తి సభను చూసి చంద్రబాబుకు వణుకు పుడుతోంది. 2 లక్షల 35 వేల కోట్లు ప్రజలకు రూపాయి అవినీతి లేకుండా ఇచ్చిన గొప్ప నేత సీఎం వైఎస్ జగన్.సంక్షేమ పథకాలు వలన బడుగు బలహీనర్గాలు బాగుపడ్డాయి’అని స్పష్టం చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ‘ బీసీలకు అత్యధిక మంత్రి ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. బడుగు బలహీనర్గాల వారిని చంద్రబాబు ముష్టి వారిగా చూశారు. పేదల ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు అడ్డుకున్నారు. ద్రబాబు ఎన్నడూ నీతిగా పాలన చేయలేదు మళ్ళీ జగన్ సీఎం కాకపోతే మన జీవితం 25 ఏళ్లు వెనక్కి పోతుంది. రెండు ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించారు?, లేని రోగాలు చెప్పుకొని చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక దొంగ అని గతంలో పవన్ చెప్పారు. ప్యాకేజీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట మారిపోయింది’ అని మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘ జన ప్రవాహాన్ని చూస్తే వేదిక దగ్గరకు వెళ్ళగలనా అనే అనుమానం కలిగింది. సామాజిక సాధికార యాత్రకు ప్రవాహంలా తరలి వస్తున్నారు. సామాజిక సాధికార యాత్ర చూసి ప్రతి పక్ష పార్టీలు కలవర పాటుకు గురవుతున్నాయి. సామాజిక సాధికార యాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంబేద్కర్ పూలే అశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ఏపీ లో ఉన్న పేదరికాన్ని సీఎం జగన్ పారద్రోలుతున్నారు. పేదరికం ప్రభుత్వ పథకాలకు అనర్హత కాకూడదు అనేది సీఎం జగన్ విధానం.కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అణగదొక్కిన కులాలను సీఎం జగన్ ఆదుకున్నారు. క్యాబినెట్ లో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు.బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చట్ట సభలకు పంపించారు.’ అని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. సామాజిక సాధికార యాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. ఈరోజు బస్సుయాత్ర ఎలమంచిలి, నరసరావుపేట, మైదుకూరు నియోజకవర్గాలలో జరుగనుంది. బస్సుయాత్ర వివరాలు ఇవే.. ►అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం 12:30 గంటలకు ఎలమంచిలిలో వైఎస్సార్సీపీ నాయకుల మీడియా సమావేశం ►మధ్యాహ్నం 2:30 గంటలకు వైఎస్సార్ విగ్రహం నుంచి అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ ►మధ్యాహ్నం 3:30 గంటలకు అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్లో బహిరంగ సభ ►సభకు హాజరుకానున్న మంత్రులు ధర్మాన ప్రసాద్, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ, రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, తదితరులు పల్నాడులో ఇలా.. ►పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం 2:15గంటలకు A1 కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►మధ్యాహ్నం 3:15 గంటలకి పాదయాత్ర ప్రారంభం ►మల్లమ్మ సెంటర్, శివుని బొమ్మ సెంటర్ మీదుగా పల్నాడు బస్టాండు వరకు పాదయాత్ర ►సాయంత్రం 5:15 గంటలకి పల్నాడు బస్టాండు సెంటర్లో బహిరంగ సభ వైఎస్సార్ జిల్లాలో ఇలా.. ►వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►మధ్యాహ్నం 2:30 గంటలకు కేఎస్సీ కళ్యాణమండపంలో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం ►మధ్యాహ్నం 3 గంటలకు కేసీ కెనాల్ మీదుగా కార్ల ర్యాలీ ►మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రొద్దుటూరు రోడ్లో బహిరంగ సభ -
ప్రజలకు చేసిన మంచిని వివరిస్తున్నాం: మంత్రి బొత్స
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్, పూలే ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, సీఎం జగన్ బడుగు బలహీనర్గాలకు చేసిన మంచిని వివరిస్తామని మంత్రి బొత్స అన్నారు. కొన్ని పత్రికలు, టీవీలు యాత్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎలాంటి అవినీతి లేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగినట్లు అవినీతి ఈ ప్రభుత్వంలో జరగలేదన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడయితే ఎందుకు జైలులో ఉంటారు.. కన్ను బాగోలేదని బెయిల్ ఇచ్చారు.. మళ్లీ నాలుగు వారాల తరువాత మళ్ళీ జైలుకు రమ్మనారు’’ అని మంత్రి పేర్కొన్నారు ఇది బడుగు బలహీనర్గాల ప్రభుత్వం: రాజన్న దొర డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ, మా ప్రభుత్వం బడుగు బలహీనర్గాల ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను 98 శాతానికి పైగా సీఎం జగన్ అమలు చేశారు.. హామీలు ద్వారా బడుగు బలహీనర్గాలు ఎక్కువ లబ్ది పొందారని మంత్రి అన్నారు. ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది: ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని, ఆరోపణ చేసిన ప్రతిసారి ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నానన్నారు. ‘‘నా పనితనానికి వచ్చే ఎన్నికల ఫలితమే సమాధానం చెబుతుంది. సభకు వచ్చి జనాలను చూస్తే మాడుగుల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని ముత్యాల నాయుడు అన్నారు. చదవండి: చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు -
అనకాపల్లి జిల్లా మాడుగులలో సామాజిక జైత్రయాత్ర
-
AP: అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగాలే ఉద్యోగాలు
అచ్యుతాపురం (అనకాపల్లి): రాష్ట్రంలోని యువతకు మంచిరోజులొచ్చాయి. ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను ఇప్పటికే అక్కున చేర్చుకున్న అచ్యుతాపురం సెజ్‌లో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. రానున్న రోజుల్లో కనీసం 1.80 లక్షల మందికి ఉద్యోగాలు/ఉపాధి కల్పించేందుకు ఇక్కడి ఎస్ఈజెడ్ జోన్లో కర్మాగారాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో 5,400 ఎకరాల భూమి సెజ్, నాన్ సెజ్ కింద సేకరించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన బ్రాండిక్స్, ఏషియన్ పెయింట్స్, లా రస్, యకోహహాతో పలు బ్రాండెడ్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. వివిధ రకాల కోర్సులు పూర్తి చేసిన వారికి అచ్యుతాపురం సెజ్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. సిఫారసులు లేకుండా క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నారు. లారస్ విస్తరణలో భాగంగా 1,800 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొద్ది నెలల్లో మరో 2 కంపెనీలకు శంకుస్థాపన జరగనుంది. వీటిలో 1,800 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లో నిర్మాణాలు పూర్తయి కార్యకలాపాలు జరుగుతున్న కంపెనీలు 450 కాగా.. వీటిలో 1.20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. మరో 223 కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిద్వారా అదనంగా మరో లక్షల 80 వేల ఉద్యోగాలు రానున్నాయి. డిప్లమో, డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు కార్మికులకు వైద్య సేవలందించే ఈఎస్ఐ ఆస్పత్రికి స్థలం కేటాయింపు జరిగింది. చదవండి: కాల్చేస్తే ‘సరి’.. -
మత్స్యకారుల పంట పండింది ఈ చేప ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు
-
నేనున్నా.. తలసేమియా రోగులకు సీఎం జగన్ భరోసా
సాక్షి, అనకాపల్లి: ‘అన్నా.. మా ఇద్దరు పిల్లలూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తోంది.. మీరే ఆదుకోవాలన్నా..’ అని సీఎం వైఎస్ జగన్‌కు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం విసన్నపేటకు చెందిన తలసేమియా రోగులు లోకే‹Ù(13), గుణసాగర్ (11)లతో కలిసి వారి తల్లి నడిశెట్టి లక్ష్మి గోడు వెళ్లబోసుకుంది. పరవాడలో యుజియా ఫార్మా సంస్థ ప్రారం¿ోత్సవం అనంతరం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాధితులు కలుసుకున్నారు. వారి సమస్యను విని సీఎం వారిలో మనోధైర్యం నింపారు. నేనున్నా.. అంటూ భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రస్తుత ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున సాయం అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ రవి పట్టాన్శెట్టిని ఆదేశించారు. కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ఇద్దరు పిల్లలకు రూ.లక్ష చొప్పున తక్షణం సాయం అందజేశారు. అంతేకాకుండా ప్రతీ 15 రోజులకోసారి ఉచితంగా డయాలసిస్ చేయాలని డీఎంహెచ్‌వోకు అప్పగించారు. ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆ చిన్నారుల తల్లి కన్నీళ్లపర్యంతమైంది. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు
అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి ఆర్కే రోజాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. వెన్నెలపాలంలో బండారు స్వగృహంలో బండారును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బండారు వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు, మంత్రి ఆర్కే రోజాపై వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు. 400/2023, 41 (A), 41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. బండారుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు గుంటూరు నుండి రాగా, చాలా సేపు నోటీసులు తీసుకోకుండా తలుపు గడియ పెట్టుకున్నారు బండారు. ఎట్టకేలకు తలుపులు బ్రేక్ చేసి బండారును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న బండారును గుంటూరు తీసుకెళుతున్నారు పోలీసులు. -
ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
సాక్షి, అనకాపల్లి/ విశాఖపట్నం: అనకాపల్లిలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీలో కేబుల్ ట్రాక్ విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాంలో మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో 50 అడుగుల ఎత్తులో కేబుల్ ట్రాక్ నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కేబుల్ ట్రాక్ విరిగిపడటంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్ -
వాడుకుని వదిలేశాడా? ఆ సీనియర్ నేతకు ఎల్లో బాబు హ్యాండ్
చంద్రబాబు వాడుకుని వదిలేసే జాబితాలో మరో నేత చేరారా? ఉత్తరాంధ్రకు చెందిన ఆ సీనియర్ నేతకు ఎల్లో బాబు హ్యాండిస్తున్నారా? నాలుగేళ్ల పాటు ఆయన్ను పొలిటికల్‌గా వాడుకుని ఇప్పుడు సీటు లేదంటున్నారా? చంద్రబాబు చేసిన మోసంతో ఆ నాయకుడికి రాజకీయంగా జ్ఞానోదయం కలిగిందా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయనకు చంద్రబాబు చేసిన ద్రోహం ఏంటి? అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి తగిన శాస్తి జరిగిందనే చర్చ తెలుగుదేశంలో జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా ఎలాగైనా వాడుకోగలడనే విషయం ఆ పార్టీ వాళ్ళందరికీ బాగానే తెలుసు. గడచిన నాలుగేళ్లుగా అయ్యన్నతో అధికార పార్టీ మీద అడ్డగోలు విమర్శలు చేయించారు. అయ్యన్నను అడ్డుపెట్టుకుని బీసీల మీద జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ మొసలి కన్నీరు కార్చారు. తన రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అయ్యన్న కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఇష్టారీతిన రెచ్చిపోయారు. చంద్రబాబు మాట విని ప్రభుత్వం మీద రెచ్చిపోతే తనకు ఎమ్మెల్యే సీటు, తన కొడుక్కి ఎంపీ సీటు వస్తుందని ఆశపడ్డారు. అయితే అయ్యన్న కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కుదరదు. కేవలం ఎమ్మెల్యే సీటుతోనే సరిపెట్టుకోవాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదురుతుందనే సాకుతో అయ్యన్న కుటుంబానికి ఎంపీ సీటు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తీరుతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి అయ్యన్న బెంగ పెట్టుకున్నారు. అయ్యన్న కుమారుడికి సీటు ఇచ్చేదిలేదని చెప్పడమే గాకుండా..ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి డ్యామేజ్ అయిందనే వాదనను చంద్రబాబు తెరపైకి తీసుకువస్తున్నారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు మాటలు విని ఒళ్ళు మరిచి ఇష్టానుసారంగా రెచ్చి పోయిన అయ్యన్నకు ఇప్పుడు అసలు విషయం బోధపడుతోంది. చంద్రబాబు తన రాక్షస క్రీడలో తనను బలి పశువును చేశారనే విషయం అయ్యన్నకు అర్థమైంది. తన రాజకీయ ప్రత్యార్థులైన గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తితో కలిసి చంద్రబాబు తన కుమారునికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాట్లాడని వారికి పెద్దపీట వేస్తూ తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎర్రన్నాయుడు ఇంట్లో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానికి సీట్లు ఇవ్వడంతో పాటు రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని.. అదే తన ఇంట్లో తనకూ తన కుమారునికి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు మాత్రం పార్టీలో ఉన్న బీసీలను అవసరానికి వాడుకొని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు.. సీఎం జగన్ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని, చంద్రబాబు మాత్రం మాట ఇస్తే నిలబెట్టుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? గత ఎన్నికల్లో ఎంతోమంది యువకులకు సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా అవకాశాలు కల్పించారని..చంద్రబాబు మాత్రం ఎంపీ సీటు ఇస్తానని చెప్పి తమను మోసం చేశారని, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అయ్యన్న రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారునికి సీటు ఇవ్వకపోతే చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు మాటలు విని నాలుగేళ్లపాటు ఇస్టానుసారంగా రెచ్చిపోయిన అయ్యన్నకు తగిన శాస్తి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఏడుగురికి గాయాలు
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కింగ్‌జార్జ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంపెనీలోని రెండు రియాక్టర్లు పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. సాహితీ ఫార్మా కంపెనీలోప్రమాదం జరిగిందన్నారు. సమాచారం రాగానే తమ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కంపెనీలో 35 మంది కార్మికులు విధుల్లో ఉండగా.. 28 మంది బయటకు వచ్చేశారని పేర్కొన్నారు. ఏడుగురికి తీవ్ర గాయలవ్వగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో రెండు గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు. విషమంగానే పరిస్థితి సాహితీ ఫార్మా కంపెనీలో గాయపడిన వారందరి పరిస్థితి విషమంగా ఉందని కింగ్‌జార్జ్ ఆసుపత్రి సూపరిండెంట్ శివానంద తెలిపారు. మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వారందరికీ దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని చెప్పారు. మొదట ముగ్గురిని ఆసుపత్రికి తీసుకొచ్చారని తరువాత కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మిగతా నలుగురిని కూడా అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఇక్కడికి షిఫ్ట్ చేశారని తెలిపారు. క్షతగాత్రులను బర్నింగ్ వార్డుకు షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు. గాయపడిన వారి వివరాలు.. ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన రమేష్ (45),రాంబిల్లి మండలం జనగాలపాలేనికి చెందిన సత్తిబాబు (35), రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెం వాసి నూకి నాయుడు (40), విజయనగరానికి చెందిన తిరుపతికి(40)తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం రెబ్బాకకు చెందిన రాజుబాబు, నక్కపల్లికి చెందిన అప్పారావు (43), అనకాపల్లి జిల్లా కొండకొప్పాకకు చెందిన పిల్లా సంతోష్ కుమార్, గాయపడ్డారు. -
మరోసారి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. ‘‘6 నెలల్లో చంద్రబాబు సీఎం అవుతున్నారు.. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.. లేదా లిస్ట్ రాసుకుని ఒక్కొక్కరి సంగతి చెప్తా’’ అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. గుంటూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. చదవండి: పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం.. -
పొత్తు పొడవకముందే టీడీపీ-జనసేన మధ్య విభేదాలు
అనకాపల్లి: ఆ సీటు మాదే అంటే మాదే అంటున్నారు టీడీపీ-జనసేన నేతలు. ఇంకా పొత్తు పొడవకముందే సీట్ల పంపకం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన నేతలు సమావేశం కాగా, అక్కడ సీటు తమకే కేటాయించాలని జనసేన స్వరం పెంచింది. అక్కడ టీడీపీకి సీటు ఇస్తే తాము సహకరించమని తేల్చిచెబుతున్నారు జనసేన నేతలు. అనితకి సీటు ఇస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించమని తెగేసి చెబుతున్నారు జనసేన నేతలు. గతంలో అనితను ఎమ్మెల్యేని చేస్తే తమపై తప్పుడు కేసులు బనాయించారని జనసేన నేతలు కుండ బద్ధలు కొట్టారు. దాంతో అనితకు సీటు ఇస్తే ఎట్టిపరిస్థితుల్తోనూ టీడీపీ సహకరించమని అంటున్నారు. అనితకు సీటు ఇస్తే ఓడించే తీరుతామని ప్రతిన పూనారు జనసేన నేతలు.. అందుకు సంబంధంచి తీర్మానం కూడా చేశారు. -
బీర్ల లోడు నేలపాలు.. సీసాల కోసం జనం పాట్లు
అనకాపల్లి: జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరుసీసాలతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు వందల సంఖ్యలో బీరు కేసులు నేలపాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం టాటా ఏస్ వాహనం అనకాపల్లి నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఒకవైపు బోల్తా పడిన విషయాన్నే పక్కకు పెట్టేసి మరీ చేతికి దొరికిన బీరు బాటిల్స్‌ను పట్టుకుని పారిపోయారు. బీర్లు సీసాల కోసం జనం పాట్లు పడుతూ ఇలా అందినకాడికి పట్టుకుపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీరు సీసాలను పట్టుకెళితే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. -
ఇక్కడ పెట్రోల్ ఫ్రీ
-
అసలు విషయం బట్టబయలు.. వంగలపూడి అనిత ఏం చేసింది?
పాయకరావుపేట సీటు దక్కదనే అపనమ్మకం ఆమెలో పెరుగుతోందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం తనకు మొండి చేయి చూపిస్తుందని భావిస్తున్నారా? సీటును కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబునే బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారా? టీడీపీ కార్యకర్తల మెడలో కండువాలు వేసి వారంతా వైసీపీ కార్యకర్తలేనని పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? తెలుగుదేశంపార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరిస్థితి పైన పల్లకి మోతా.. ఇంట్లో ఈగల మోతలా తయారయిందా అని ప్రశ్న వేసుకుంటే అవుననే సమాధానం వస్తోంది.. ఎందుకంటే పాయకరావుపేట నియోజక వర్గంలో ఆమెకు ఎదురువుతున్న పరిస్థితులే అందుకు కారణమని తెలుస్తోంది.. వంగలపూడి అనిత పేరుకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చెప్పుకుంటుంది కానీ.. ఆమెకు మాత్రం నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న అసమ్మతి ఇప్పటికి అదే విధంగా ఉంది అంటే ఆమె నాయకత్వంపట్ల నియోజవర్గంలో ఎలాంటి విశ్వసనీయత వుందో సులువుగా అర్థమవుతుంది. ఆమెకు ఈ సారి ఎన్నికల్లో పాయకరావుపేట సీటు ఇస్తే వచ్చే ఓడించి తీరుతామని అనిత వ్యతిరేక వర్గీయులు శపథం చేస్తున్నారు.. టీడీపీ ముద్దు.. అనిత వద్దు అంటూ గతంలో అనితకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీలు సభలు నిరసనలు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో అనితకు నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల్లో అనితను కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో ఓడిపోయి తిరుగుముఖం పట్టారు. ఎన్నికల తర్వాత అనిత మళ్లి పాయకరావుపేటకు వచ్చారు.. వంగలపూడి అనిత మీద పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో ఉన్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆమెను మరొకసారి.. ఈ వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం మారుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.. లేదా టీడీపీ జనసేన పొత్తు ఉంటే పోత్తులో భాగంగా పాయకరావుపేట సీటును జనసేనకు కేటాయిస్తారని చర్చ నడుస్తోంది. చదవండి: అయ్యన్న ఆశ అదేనట.. అడ్డు పడుతోందెవరు..? ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో తాను బలంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది అనిత. అయితే ఇందుకోసం ఆమె అనుసరిస్తున్న మార్గమే విమర్శలపాలవుతోంది.. పార్టీ క్యాడర్ కు నిత్యం అందుబాటులో ఉండి, ప్రజల సమస్యల మీద పోరాటం చేసి తాను బలంగా ఉన్నానని ఆమె చెప్పుకుంటే పరవాలేదు.. కానీ ఆమె అలా చేయడంలేదు.. వంగలపూడి అనిత ఈ మధ్యకాలంలో చేసిన ఒక కార్యక్రమం పట్ల సొంత పార్టీ నేతలే చీత్కరించుకుంటున్నారు. ఇంతకీ అనిత చేసిన ఆ పని ఏమిటో ఒకసారి చూద్దాం.. తెలుగుదేశం పార్టీలో ఉన్న పదిమందిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలేనని నమ్మబలికింది. వారి మెడలో కండువాలు వేసి వారంతా వైఎస్ఆర్సిపి కార్యకర్తలే టీడీపీలో చేరుతున్నారంటూ సభ ఏర్పాటు చేసింది.. వాస్తవంగా వారంతా తెలుగుదేశం పార్టీలో వున్నవారే.. వారు మొన్నటిమొన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగాను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అటువంటి వారిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంటూ అటు టీడీపీ అధిష్టానాన్ని ఇటు నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు వనిత. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..! అనిత చేసిన మోసం ఎంతో కాలం నిలవలేదు. సాక్ష్యాలతో సహా వైఎస్సార్సీపీ నాయకులు బట్టబయలు చేశారు. భాస్కర్ చౌదరి అనే టీడీపీ నాయకునితో పాటు కొంతమంది కార్యకర్తలు ఈ మధ్యనే టీడీపీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు మీడియా ముందు విడుదల చేశారు.. ఓ పదిమంది టీడీపీ నేతలను తీసుకువచ్చి వారందరికీ కండువాలు వేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. ప్రజా సేవ చేసి ప్రజల మనసు గెలవాలి గాని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకే కండువా లేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా చిత్రీకరించడం తగదంటూ వంగలపూడి అనితకు హితవు పలికారు. వంగలపూడి అనిత ప్లాన్ చేసిన ఈ నిర్వాకాన్ని ముందుగానే గ్రహించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, యనమల కృష్ణుడు ఆమె నిర్వహించిన బహిరంగ సభకు రాకుండా గైర్హాజయ్యారు. ఈ నేపథ్యంలో అసలు విషయం బయట పడడంతో అనిత నవ్వుల పాలయ్యారు. -
థాంక్యూ సీఎం సార్!
సాక్షి, అనకాపల్లి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ పక్షపాతి అని, 25 ఏళ్ల నాటి కలను నిజం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.వి.రమణమూర్తి కొనియాడారు. అనకాపల్లి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత హోదాలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ‘డీఎస్సీ–1998’ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించారని, ఇది 25 ఏళ్ల నాటి కల అన్నారు. గత ప్రభుత్వాల దృష్టికి అనేకమార్లు తమ సమస్యను తీసుకెళ్లామని.. తామిచ్చిన వినతులను చిత్తు బుట్టలకే పరిమితం చేశారని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4,072 మందిని గురువుల స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. (చదవండి: నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణారెడ్డి) -
అనకాపల్లి వైద్యవిభాగానికి మంత్రి అమర్ నాథ్ అభినందనలు
-
తేనెటీగల బీభత్సం.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
రావికమతం(అనకాపల్లి జిల్లా): రావికమతం మండలం గర్నికం గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. పొలంలో పనిచేసుకుంటున్న వృద్ధ దంపతులు ఆర్లె కామునాయుడు (61), అతని భార్య నూకాలమ్మ( 57)పై శుక్రవారం సాయంత్రం మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వీరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త కామునాయుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, భార్య నూకాలమ్మ అక్కడే చికిత్స పొందుతోంది. గ్రామానికి సమీపంలో వారి పశువుల పాకలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం పొలంలో గొర్రెలు కాస్తూ పనులు చూసుకుంటున్న తరుణంలో మేతకు వెళ్లి వచ్చే పశువులు సమీపంలో ఉన్న ఒక చెట్టు వద్ద ఒకదానితో మరొకటి తలపడి అలజడి చేశాయి. చదవండి: కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు దీంతో ఆ చెట్టుపై ఉన్న తేనెపట్టులోని ఈగలు బెదిరి పశువులతోపాటు వృద్ధ దంపతులపైనా గుంపుగా దాడి చేశాయి. దీంతో వారు కేకలు వేయగా సమీపంలోని రైతులు గోనె సంచులు చుట్టుకుని వెళ్లి వారిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తీసుకువెళ్లారు. కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామునాయుడు శనివారం మృతి చెందారు. -
అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా..
అనకాపల్లి: అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా.. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా.. అంటూ జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి పలకరించారు. మద్యం వ్యసనం మాన్పించేందుకు జేసీ ‘విముక్తి’ అనే ప్రాజెక్టును మునగపాక మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మద్యం విడిచిపెట్టిన ఇద్దరు వ్యక్తులు పాటిపల్లి గ్రామంలో ఉన్నారు. భూముల రీసర్వే సమీక్ష కోసం మంగళవారం మండలానికి వచ్చిన జేసీ.. పాటిపల్లిలో ఆ ఇద్దరు వ్యక్తుల ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మద్యం మానేశాక వారి ఇంటి పెద్దలో వచ్చిన మార్పు, ఇప్పటికీ అదే పరివర్తన కొనసాగుతోందా.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారింట్లో ఫొటో ఆల్బమ్ చూస్తూ పాత జ్ఞాపకాల గురించి వారితో ముచ్చటించారు. ‘విముక్తి’ పైలట్ ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేసిన ఏఎన్ఎం సుజాతను ఈ సందర్భంగా జేసీ అభినందించారు. ఓ పెద్ద కూతురిలా తమ ఇంటికి వచ్చి అంత పెద్ద ఐఏఎస్ అధికారి తమ మంచి చెడ్డలను వాకబు చేయడంతో ఆ ఇంటివారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. -
AP: జాక్‌పాట్ తగిలింది.. వలకు చిక్కిన 600 కిలోల చేప
ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ముక్కుడు టేకుగా పిలిచే ఈ చేప సుమారు 600 కిలోల బరువు ఉంది. దీని విలువ సుమారు రూ.2 లక్షలపైనే. సముద్రంలో వలకు చిక్కిన ఈ చేపను మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు లాక్కొచ్చారు. అంత ఖరీదైన చేపను స్థానికంగా కొనే నాథుడు లేక కాకినాడ, విశాఖపట్నంలోని చేపల వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. ఈ రేవులో ఇంత పెద్ద చేప మొదటిసారిగా దొరికిందని, అనుకున్న ధర రాకపోతే చేపను సముద్రంలో విడిచిపెడతామని మత్స్యకారులు చెప్పారు. ప్రస్తుతం శారద, వరాహ నదుల కలయిక మొగలో నీటిలో వల తాడుతో బంధించి ఉంచారు. -
రయ్.. రయ్.. అనకాపల్లి–ఆనందపురం ఎన్‌హెచ్–16.. గంటకు 120 కి.మీ స్పీడ్..
బుల్లెట్లా దూసుకుపోవచ్చు.. మెరుపు వేగంతో సాగిపోవచ్చు.. దాదాపు పూర్తి కావచ్చిన అనకాపల్లి–ఆనందపురం ఆరు లేన్ల రహదారిపై గంటకు 120 కి.మీ వేగంతో వెళ్లవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. మార్చి నెలాఖరుకు పూర్తి కానున్న ఈ రోడ్డు విస్తరణతో విశాఖ నగరానికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల: సర్రున సాగిపోయేలా ఆరు లైన్ల రోడ్డు.. డివైడర్లపై ఆహ్లాదకరంగా వేలాది మొక్కల పెంపకం.. బ్రేకుతో పనిలేదు.. టోల్‌ప్లాజా వచ్చే వరకు వాహనాన్ని నిలపాల్సిన అవసరమే రాదు.. ఇవీ అనకాపల్లి–ఆనందపురం ఎన్‌హెచ్–16 జాతీయ రహదారి ప్రత్యేకతలు. విశాఖ నగరానికి రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం శరవేగంతో సాగుతోంది. రూ.2,013 కోట్లతో 50.8 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. ఢిల్లీకి చెందిన మెగా ఇంజనీరింగ్ డీబీఎల్ సంస్ధ 98 శాతం పనులు పూర్తి చేసి మార్చి నెలాఖరు నాటికి జాతికి అంకితం చేసేందుకు వేగం పెంచింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంగా వాహనాలు ప్రయాణించేలా ఈ రహదారిని విస్తరించారు. టోల్‌ప్లాజా వద్ద తప్పితే మరెక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రతి రెండు కిలోమీటర్లకు సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌తో నిఘా ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్పీడ్ డిస్ప్లే, స్పీడ్ కంట్రోల్, ట్రాఫిక్ సిగ్నల్స్ తెలుసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో, వంతెనల జంక్షన్లలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి చెన్నై–కలకత్తా 16వ నంబర్ జాతీయ రహదారి అనకాపల్లి, గాజువాక, ఎన్ఏడీ, విశాఖనగరం మీదుగా సాగిపోతుంది. రవాణా, ప్రజా రవాణా తదితర వాహనాలు విశాఖ నగరం మీద నుంచి రాకపోకలు చేయడంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. అనకాపల్లి నుంచి సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం వరకు జాతీయ రహదారిని కలుపుతూ ఈ ప్రాజెక్టు చేపట్టడంతో నగరానికి ట్రాఫిక్ సమస్య తొలగిపోనుంది. కేవలం పనులు ఉన్నవారు మాత్రమే నగరంలోకి వస్తారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలు అనకాపల్లి వద్ద బైపాస్ నుంచి సబ్బవరం మీదుగా ఆనందపురం వద్ద జాతీయ రహదారికి చేరుకుంటాయి. దీంతో నగరానికి ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. విశాఖ నగరానికి ఇది బైపాస్ రోడ్డుగా ఉపయోగపడనుంది. సబ్బవరం దగ్గర ఒక ఇంటర్ చేంజ్ సెక్షన్, పెందుర్తి దగ్గర మరొకటి ఏర్పాటు చేయడంతో విశాఖనగరానికి వెళ్లేందుకు మరిన్ని దారులు ఏర్పడ్డాయి. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఈ జాతీయ రహదారి పొడవు 50.8 కిలోమీటర్ల మేర ఉంది. రోడ్డు పొడవున ఇరువైపులా 15 వేలకు పైగా మొక్కలు నాటడం, నిత్యం వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డుకు మధ్యలో 32 వేలకు పైగా మొక్కలను నాటుతున్నారు. స్ధానికులకు నో టోల్‌ట్యాక్స్ ఈ రహదారిపై మొత్తం మూడు టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేయనున్నారు. క్లోజ్డ్ టోలింగ్ సిస్టమ్ ద్వారా అనకాపల్లి వద్ద మర్రిపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం ప్రాంతాలలో చేపట్టే టోల్‌ప్లాజాల వద్ద స్ధానికులు టోల్‌ఫీజు చెల్లించనక్కరలేదు. సరీ్వసు రోడ్డును ఏ టోల్‌ప్లాజాకు అనుసంధానం చేయడం లేదు. దీంతో స్ధానికులు టోల్‌ప్లాజాకు వెళ్లాల్సిన పనిలేకుండా సులభతరం చేస్తున్నారు. రూ.2,013 కోట్లతో నిర్మాణం దాదాపు 35 గ్రామాలను తాకుతూ నిర్మిస్తున్న ఈ రోడ్డుకు ప్రభుత్వం రూ.2,013 కోట్లు నిధులు వెచ్చిస్తోంది. ఈ మార్గంలో అనకాపల్లి బైపాస్ వద్ద ఒకటి, సబ్బవరం, పెందుర్తి జంక్షన్లలో మూడు ఇంటర్ చేంజ్ సెక్షన్లు, రెండు రైల్వే వంతెనలతో పాటు 21 అండర్ బ్రిడ్జిలు, 10 వంతెనలు, 52 బాక్స్ కల్వర్టులు, 44 పైప్ కల్వర్టులు, 25 గ్రామాల వద్ద అప్రోచ్ రోడ్లు, 34 బస్స్టేషన్లు, 20 జంక్షన్లను రూపొందించారు. ఫ్లైఓవర్ల వద్ద గడ్డర్లు ఏర్పాటు చేసే ప్రాజెక్టును డీబీఎల్ సంస్ధ చేపడుతుంది. మార్చి నెలాఖరుకు పనులు పూర్తి జాతీయ రహదారి విస్తరణ పనులు 98 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెలాఖరునాటికి పనులు పూర్తయ్యేలా వేగం పెంచాం. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఏర్పాటు చేసిన జాతీయ రహదారి విస్తరణ పనులతో విశాఖ నగరానికి ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. రోడ్డుపై ప్రతి రెండు కిలోమీటర్ల వద్ద సీసీ కెమెరాలు, జాతీయ రహదారి కూడలిలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశాం. ప్రమాదాలకు తావు లేకుండా ఆధునిక విధానంలో నిర్మాణం చేపట్టిన జాతీయ రహదారి ఇది. వేగంతో వెళ్లినా ప్రమాదాలకు తావు లేకుండా జాతీయ రహదారి ఉంటుంది. – ప్రమోద్‌కుమార్, ప్రాజెక్టు మేనేజర్, డీబీఎల్ సంస్ధ -
ఇంగితంలేని మాటలు.. అయ్యన్నా.. ఇక ఆపన్నా! టీడీపీ నేతల హితవు
తాగి వాగే అయ్యన్న మాటలు సొంత పార్టీ నేతలకు కూడా రుచించడం లేదా..? అయ్యన్న రోజూ చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారా..? అయ్యన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోందా? ఇంతకీ టీడీపీలో అయ్యన్న పాత్ర ఎలా ఉంది?. కొంతకాలం నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోరు ఉంది కదా అని ఏది బడితే అది వాగడం వల్ల పార్టీకి నష్టం జరుతుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రిని, మహిళలను, ఉద్యోగులను, పోలీసులను పట్టుకొని ఏది బడితే అది మాట్లాడటం వల్ల పార్టీకి డామేజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నేత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటంపై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా అయ్యన్న తీరును కొందరు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం, పార్టీ ఎజెండాను పక్కనపెట్టి సొంత ఎజెండాతో వ్యవహరించే నాయకులు పార్టీకి మేలు చేస్తున్నారో కీడు చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని టీడీపీ నేత బండారు అప్పలనాయుడు ట్విట్టర్ వేదికగా అయ్యన్నను ప్రశ్నించారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు సహనం కోల్పోయి మాట్లాడడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. సీఎంను విమర్శించడం ద్వారా అయ్యన్న తన ఉనికిని చాటుకోవాలని ఇష్టానుసారంగా మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. సీఎంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే తన కుమారుడికి పార్టీ అధినేత అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారనే ఆశతోనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల పోలీసులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. షూట్ ఎట్ సైట్ ద్వారా పోలీసులను కాల్చి పారేస్తానంటు బహిరంగ వేదిక పైనుంచి మాట్లాడారు. హోం మంత్రి పదవితో పాటు లా అండ్ ఆర్డర్ పదవి కట్టబెడితే పోలీసుల సంగతి తేలుస్తానంటూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారు. అయ్యన్న వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించింది. అయ్యన్న వ్యాఖ్యలపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది. ఉద్యోగుల మనోభావాలు కించిపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించింది. గతంలో కూడా ఒక మహిళా అధికారిని పట్టుకొని బట్టలూడదీసి కొడతానంటూ దుర్భాషలాడి విమర్శల పాలయ్యారు.. చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా? గ్రాఫిక్స్ చరిత్రలు సైకిల్ పార్టీవే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణమంతా గ్రాఫిక్స్ అంటూ అయ్యన్న చేసిన విమర్శలపై అనకాపల్లి జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గ్రాఫిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబునాయుడని స్థానిక ప్రజలు అయ్యన్నకు గుర్తు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడుతో సహా టిడిపి నేతలు వస్తే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అయ్యన్న నోటికి తాళం వేయకపోతే రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి మరింతగా దిగజారడం ఖాయమంటునన్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అనకాపల్లి: మహిళపై వీఆర్వో వేధింపులు.. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ..
పాయకరావుపేట: ఇంటి స్థలం మంజూరు చేయాలంటే నన్ను ప్రేమించు... పక్కా గృహం నిర్మించుకోవాలంటే పక్కలోకి రా... అంటూ ఒక వీఆర్వో దళిత మహిళతో బేరసారాలు సాగించాడు. అతని వేధింపులు తట్టుకోలేని బాధిత మహిళ బంధువుల సమక్షంలో వీఆర్వోకు దేహశుద్ధి చేసింది. ఈ షాకింగ్ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత మహిళ తెలిపిన వివరాలు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పి.ఎల్.పురం గ్రామానికి చెందిన వివాహిత ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తు వీఆర్వో భాస్కరనాయుడు పరిశీలనకు వచ్చింది. ఆయన మహిళకు ఫోన్ చేసి ప్రేమించమని, సహజీవనం చేయమని వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడే పనవుతుందని బెదిరించాడు. వాట్సాప్‌లో కూడా అసభ్యకరమైన మెసేజ్‌లు చేసేవాడు. ఒకరోజు బాధితురాలికి ఫోన్ చేసి.. ‘ఒంటరిగా ఉంటున్నావు.. నాతో సహజీవనం చేస్తే అన్నీ చూసుకుంటాన’ని ఒత్తిడి చేశాడు. వీఆర్వో వేధింపులు సహించలేక ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి సమస్యను తీసుకువచ్చింది. వీఆర్వో వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో బాధిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులు వీఆర్వోకు దేహశుద్ధి చేశారు. బాధితురా లు తహసీల్దార్ జయప్రకా‹Ùకు, పోలీసులకు ఫిర్యా దు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
టీడీపీ నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి/ నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కేసులో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌కు సీఐడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టంలోని 41ఏ ప్రకారం జారీ చేసిన ఆ నోటీసుల్లో ఈ నెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ‘భారతి పే’ పేరిట సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన అభియోగాలపై చింతకాయల విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుని నివాసానికి సీఐడీ అధికారులు శుక్రవారం వెళ్లగా విజయ్ అందుబాటులో లేరు. దాంతో ఆయన తల్లికి నోటీసులు అందించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో ఇదివరకే నోటీసు ఇవ్వటం జరిగిందని, విచారణకు రానందున మరోసారి 41 ఏ నోటీసు ఇచ్చామని సీఐడీ పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు. -
అనకాపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
-
నేనున్నానని.. మీకేం కాదని.. సీఎం జగన్ తక్షణ సాయం..
సాక్షి, అనకాపల్లి జిల్లా: మానవత్వాన్ని చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. గురువారం యలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి.. వారికి అవసరమైన సాయం చేశారు. కొండమంచిలి వాణి యలమంచిలి కుమ్మరివీధికి చెందిన కొండమంచిలి వాణి అనే బాలికకు చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు వినపడడం లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి వాణి అమ్మమ్మ విన్నవించుకున్నారు. దీంతో తక్షణ సహాయానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. కలగా శివాజి ఎస్. రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కలగా శివాజి మోటర్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందాడు. ఆ తర్వాత క్రమేపి ఇతర అవయవాలు పని చేయకపోవడంతో వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్థిక స్ధోమత లేదని సీఎంకి శివాజి కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. తక్షణ సహాయానికి సీఎం హమీ ఇచ్చారు. చదవండి: Andhra Pradesh: మళ్లీ ఉద్యోగాల జోష్ ముఖ్యమంత్రి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్ష చొప్పున బాధితులు ఇద్దరికీ మంజూరు చేశారు. ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్నికృష్ణ స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. -
ప్రాణదాతలు.. 108 ఉద్యోగులు
రాంబిల్లి: సముద్ర కెరటాల ధాటికి నీటిలో మునిగి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని 108 అంబులెన్స్ సిబ్బంది రక్షించారు. వారు సకాలంలో స్పందించి ఆక్సిజన్ అందించడంతో బాధితుడి ప్రాణం నిలిచింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి శివారు వాడపాలెం బీచ్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. యలమంచిలికి చెందిన సీహెచ్ లక్ష్మణ (35), అతని నలుగురు స్నేహితులు శనివారం రాత్రి వాడపాలెం వచ్చారు. అక్కడ రాత్రంతా పార్టీ చేసుకున్నారు. ఉదయం బీచ్‌లో స్నానానికి దిగారు. కెరటాల ధాటికి లక్ష్మణ కొట్టుకుపోతుండగా, పక్కనే ఉన్న స్నేహితులు అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. అప్పటికే లక్ష్మణ స్పృహ కోల్పోగా... స్నేహితులు 108కు సమాచారం ఇచ్చారు. 108 వాహనం టెక్నీషియన్ యడ్ల అప్పలనాయుడు, పైలట్ ఎస్.చంద్రశేఖర్‌రాజు హుటాహుటిన బీచ్‌కు చేరుకున్నారు. బీచ్‌కు సుమారు కిలో మీటరు దూరంలో ఇసుక మాత్రమే ఉండటంతో వాహనం వెళ్లేందుకు సాధ్యం కాలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మణను స్ట్రెచర్‌పై ఉంచి స్థానికుల సాయంతో 108 సిబ్బంది అంబులెన్స్ వద్దకు మోసుకొచ్చారు. వెంటనే అతనికి 108లో ఆక్సిజన్ పెట్టారు. సెలైన్ పెట్టి ఎక్కించి మందులు ఇచ్చారు. తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ కోలుకోవడంతో సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. సకాలంలో స్పందించి కిలోమీటరు మేర స్ట్రెచర్‌పై లక్ష్మణను మోసి ఆక్సిజన్, వైద్య సేవలందించి ప్రాణం కాపాడిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
CM Jagan: అధైర్య పడొద్దు.. నేనున్నాను
రావికమతం/కోటవురట్ల/నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): మానవత్వాన్ని చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. దారి వెంబడి తనకు సమస్య విన్నవించుకోవాలన్న ఆర్తితో వచ్చిన వారిని గమనించి, వారి కష్టం తెలుసుకున్నారు. పరిష్కారానికి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. అందరికీ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున సాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇలా ఏకంగా 13 మంది సమస్యలను ఓపికగా విని, తప్పక పరిష్కరిస్తామంటూ కొండంత భరోసా కల్నించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పాము ప్రసాద్ రావికమతం మండలం జెడ్ కొత్తపట్నం గ్రామానికి చెందిన పాము ప్రసాద్ సొరియాసిస్ వ్యాధితో బాధ పడుతున్నాడు. వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బొండపల్లి శ్రీ వెంకట దుర్గా నిఖిత కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామం రాజగోపాలపురానికి చెందిన బొండపల్లి శ్రీ వెంకట దుర్గా నిఖిత హైపర్ కొలెస్ట్రోమియా, సబ్ క్లినికల్ హైపో థైరాయిడిజమ్‌తో బాధ పడుతోంది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు తగినంత సొమ్ము లేదని నిఖిత తల్లి ముఖ్యమంత్రికి విన్నవించుకుంది. అమర్త్య రామ్ నాతవరం మండల కేంద్రానికి చెందిన రెండేళ్ల దేవరకొండ అమర్త్య రామ్ పుట్టినప్పటి నుంచి పి ఆర్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతడి నాలిక లోపలికి వెళ్ళిపోయి ఊపిరి సలపని వ్యాధితో బాధ పడుతున్నందున తల్లిదండ్రులు తమిళనాడులోని నాగర్‌కోయిల్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.7.5 లక్షలు ఖర్చు పెట్టామని తెలిపారు. తగిన ఆరి్థక స్థోమత లేకపోవడంతో చికిత్స చేయించడానికి ఇబ్బంది పడుతున్నామని సీఎంకు విన్నవించారు. గట్రెడ్డి నీరజ్ రావికమతం మండలం కొత్త కోట గ్రామానికి చెందిన గట్రెడ్డి నీరజ్ తల్లి తన కుమారుడు బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్నారు. తగినంత డబ్బు లేకపోవడంతో చికిత్స చేయించుకోలేకపోతున్నామని తెలిపారు. చుక్కా శివ పార్వతీ యామిని నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి గ్రామానికి చెందిన చుక్కా శివ పార్వతి యామిని బైలేటరల్ జీను వేరమ్ సమస్యతో బాధ పడుతోంది. ఆరి్థకంగా స్థోమత లేకపోవడంతో.. చికిత్స చేయించుకోవడం తమకు సాధ్యం కావడం లేదని తండ్రి సీఎంకు విన్నవించుకున్నారు. మల్ల రోహిత్ కశింకోట మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన మల్ల రోహిత్ మెదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని, ఆరి్థక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని సీఎంకు గోడు వెళ్లబోసుకున్నారు. పెదపూడి రిషాంత్ బాబి వివేక్ కోటవురట్ల మండలం రాట్నాల పాలెం గ్రామానికి చెందిన పెదపూడి రిషాంత్ బాబి వివేక్.. సికిల్ సెల్ ఎనీమియాతో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం ముఖ్యమంత్రిని వివేక్ తల్లిదండ్రులు కలిసి విజ్ఞప్తి చేశారు. చింతల ఆకాంక్ష అనకాపల్లి మండలం వూడురు (అల్లిఖానూడు పాలెం) గ్రామానికి చెందిన చింతల ఆకాంక్ష గ్లోబల్ డెవలప్మెంట్ డిలేతో ఇబ్బంది పడుతోంది. ఆమెకు వైద్య సాయం అందించాలని కుటుంబ సభ్యులు సీఎంను కోరారు. నరం రాజబాబు నాతవరం మండలం గుమ్మడిగరడ గ్రామానికి చెందిన నరం రాజబాబు అంధత్వంతో బాధ పడుతున్నాడు. పేదవారమైన తమను మీరే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని వేడుకున్నారు. అందలూరి యేసుబాబు నర్సీపట్నం మండల కేంద్రంలోని గొర్లివీధికి చెందిన అందలూరి యేసుబాబు బ్లడ్ కేన్సర్‌తో బాధ పడుతున్నాడు. మెరుగైన చికిత్స చేయించడానికి తమ వద్ద డబ్బులు లేవని సీఎంతో చెప్పుకున్నారు. నిడదవోలు సుబ్బలక్ష్మి నర్సీపట్నం మండలం పినరిపాలెం గ్రామానికి చెందిన నిడదవోలు సుబ్బలక్ష్మి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. మెరుగైన చికిత్సతో పాటు ఆరి్థకంగా ఆదుకోవాలని సీఎంను కోరారు. పెట్ల పరిమళ గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామానికి చెందిన పెట్ల పరిమళ చేతులు, కాళ్ల వంకర సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. మీరే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు సీఎంను వేడుకున్నారు. గుడివాడ జస్మిత నర్సీపట్నం మండలం వేమలపూడి గ్రామానికి చెందిన గుడివాడ జస్మిత తలసేమియా వ్యాధితో బాధ పడుతోంది. తగినంత ఆర్థిక స్థోమత లేదని సీఎంకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. -
జోగునాథుని పాలెంలో సీఎం జగన్ సభ.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
అన్ని వర్గాలను మోసం చేసిన బాబును ప్రజలు ఎందుకు నమ్ముతారు: సీఎం జగన్
-
రాజకీయమంటే.. డైలాగులు, డ్రోన్ షాట్లా?: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ‘‘రాజకీయమంటే డ్రోన్ షాట్లు, డైలాగులు చెప్పడం కాదు.. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం! ప్రతి నిరుపేద కష్టాన్ని తీర్చి వారికి అండగా నిలవడం.. చంద్రబాబులా ప్రజలను వంచించేవారు రాజకీయ నాయకుడు కాదు..’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు ఆయన మార్కు అభివృద్ధి పథకాన్ని ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. గత పాలకుల నిరాదరణకు గురైన ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం నియోజకవర్గం రూపు రేఖలు ఇప్పుడు ప్రజల ప్రభుత్వం చేపడుతున్న భారీ కార్యక్రమాలతో మారనున్నాయని చెప్పారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం జోగినాథునిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బలిఘట్టం చేరుకున్న సీఎం జగన్ పార్టీ నేతలను కలిశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నర్సీపట్నం మీదుగా సభా స్థలికి చేరుకున్నారు. దారి పొడవునా సీఎం జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సభాస్థలి వద్ద ఏలేరు–తాండవ కాలువల అనుసంధాన ప్రాజెక్టుల బ్లూప్రింట్స్ని సీఎం పరిశీలించారు. అనంతరం నర్సీపట్నంలో 52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాల, అనుబంధ నర్సింగ్ కళాశాల, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.470 కోట్లతో ఏలేరు, తాండవ కాలువల అనుసంధానం, నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో రూ.16.60 కోట్లతో రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. నర్సీపట్నం రూపురేఖలు మారుస్తాం నర్సీపట్నం అంటే ఏజెన్సీ ప్రాంతానికి గేట్‌వే. గత పాలకుల హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అనారోగ్య బాధితులు రెండు గంటలు ప్రయాణించి విశాఖ చేరుకుంటే కానీ వైద్యం అందించలేని దుస్థితిలో తల్లడిల్లుతున్నా పట్టించుకోలేదు. ఈ రోజు ఈ ప్రాంతం రూపురేఖలను మార్చబోయే కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు రూ.986 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు నర్సీపట్నంలో మొదలుపెడుతున్నాం. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం. తద్వారా దాదాపు 150 మెడికల్ సీట్లు ఇక్కడ రానున్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నాం. మూడున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో ఒక మెడికల్ కాలేజీ, పాడేరులో మరో వైద్య కళాశాల, విజయనగరంలో ఇంకోటి.. ఇవన్నీ కేవలం ఈ మూడున్నరేళ్లలో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అడుగులు పడుతున్నాయి. ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, వచ్చే నెలలో ఈ ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. రైతుల కన్నీళ్లు తుడిచేందుకే.. తాండవ రిజర్వాయరు కింది 51,465 ఎకరాల ఆయకట్టుని పూర్తిగా స్ధిరీకరించడంతో పాటు ఏలేరు ఎడమ ప్రధాన కాలువ కింద కొత్తగా మరో లిఫ్ట్ ఏర్పాటు చేసి మరో 5,600 ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. ఏలేరు, తాండవ రిజర్వాయర్లని అనుసంధానం చేస్తున్న కాలువ అభివృద్ధికి మరో 6 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇలా దాదాపు రూ. 470 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తైంది. పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని మండలాలతో పాటు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, నాతవరం, కోటవురట్ల మండలాల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు టెండర్లతో పాటు అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా పూర్తయ్యాయి. శరవేగంగా పనులు మొదలయ్యేలా సర్వే కూడా పూర్తి కావచ్చింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైతన్నల కలను మనందరి ప్రభుత్వం నెరవేరుస్తోంది. మీ కష్టాలు పాదయాత్రలో చూశా.. ఇవాళ నర్సీపట్నం మున్సిపాల్టీలో రూ.16.60 కోట్లతో ప్రధాన రహదారిని విస్తరించడంతో పాటు మరో రహదారిని అభివృద్ధి చేస్తూ సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ లాంటి పనులు చేపడుతున్నాం. ఒకవైపు మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ మరోవైపు పట్టణంలో ప్రధాన రహదారులన్నీ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే నర్సీపట్నం రూపురేఖలు పూర్తిగా మారతాయి. తాండవ, ఏలేరు రిజర్వాయరు కాలువల అనుసంధానం కూడా పూర్తయితే ఆయకట్టు స్ధిరీకరణ, విస్తరణ గణనీయంగా పెరిగి ఈ రెండు జిల్లాల్లో రైతుల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తాయి. మీ కష్టాలన్నీ నా పాదయాత్రలో చూశా. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసేలా.. మీ జగనన్న ప్రభుత్వంలో చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటా. జగన్ గురించి ఎవరైనా కార్యకర్తను అడిగితే సగర్వంగా కాలర్ ఎగరేసుకుని ఫలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగానే మీ అన్న పరిపాలన చేస్తాడు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా మీ అన్న బతుకుతాడు. మంచి చేస్తున్నా.. బురద చల్లుడే రాష్ట్రంలో ఇవాళ ఒక చెడిపోయిన వ్యవçస్థ్ధతో మనందరికీ యుద్ధం జరుగుతోంది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. నిత్యం ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా పని చేస్తున్నాయి. మనం ఎంత మంచి చేస్తున్నా కూడా అందులో వారికి చెడే కనిపిస్తోంది. పెంచేదే.. తగ్గించేదేలే జనవరి 1వతేదీ నుంచి ప్రతి అవ్వాతాత మొహంలో చిరునవ్వులు చూసేలా సామాజిక పెన్షన్‌ని రూ.2750కి పెంచి ఇవ్వబోతున్నాం. దీన్ని చూసి దుష్ట చతుష్టయంలో ఓర్వలేనితనం కనిపిస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు వీళ్లంతా మాట ప్రకారం పెన్షన్ పెంచుతూ చేపట్టిన గొప్ప కార్యక్రమంపైనా అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. ఆర్నెల్లకు ఒకసారి జూన్ , డిసెంబర్లో సాధారణ ఆడిట్లో భాగంగా పారదర్శకంగా జరిగే వెరిఫికేషన్ కార్యక్రమంపై కూడా ఎన్నెన్నో అబద్ధాలు సృష్టించి ఎంత అల్లకల్లోలం చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. గతంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు హయాంలో 2018 అక్టోబరు వరకు అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. మీ జగన్ ప్రభుత్వంలో ఇవాళ అక్షరాలా 62.30 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. మీ జగన్ మనసు ఎలాంటిదంటే రేపు జనవరి 1 తరువాత ఈ 62.30 లక్షల పెన్షన్లు పెరిగేవే కానీ తగ్గేవి కాదన్న సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో పెన్షన్ బిల్లు నెలకు రూ.400 కోట్లు అయితే ఇవాళ మన ప్రభుత్వంలో నెలకు రూ.1,700 కోట్లకు పైగా ఉంది. తేడా ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా ఎల్లో మీడియా ఎలా అల్లకల్లోలం చేస్తోందో చూడండి. డైరెక్టర్ బాబు.. యాక్టర్ దత్తపుత్రుడు చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్క మంచైనా చేసినట్లు చెప్పుకోడానికి ఆధారాలున్నాయా? ఇలాంటి దత్తతండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడో దత్తపుత్రుడు. వీరిద్దరి స్టైల్ ఒక్కటే. అదేమిటంటే.. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం... ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు... ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్య.. ఇదీ వీరిద్దరి స్టైల్! వీరి స్వభావం చూస్తే ఎవరికైనా ఇదేం ఖర్మరా మన రాష్ట్రానికి? ఇదేం ఖర్మ మన రాజకీయాలకు? అని అనిపిస్తుంది. ఒకాయన రాజకీయాల్లో వచ్చి 14 ఏళ్లైనా ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్లా ప్రజలు ఆయన్ను ఓడించారు. ఆయనకు నిర్మాత, దర్శకుడు బాబు. ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు కాల్షీట్స్ ఇస్తాడు. ఎక్కడ షూటింగ్ అంటే అక్కడకు వస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తాడు. బాబుకు అనుకూలంగా, బాబు చెప్పిన డైలాగులన్నీ యాక్ట్ చేసి చూపిస్తాడు. ఇదీ ఈయన స్టైల్. ఇక మరో వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు. ఆ మనిషి రాష్ట్రంలో ఏ మంచి జరిగినా అది తానే చేశానని, తనవల్లే జరిగిందని అంటాడు. చివరికి సింధు బ్యాడ్మింటన్‌లో గెలిచినా కూడా ఆమెకు ఆడటం తానే నేర్పించానంటాడు. ఈ పెద్దమనిషి సొంత నియోజకవర్గం కుప్పంలో నీళ్లుండవు. కుప్పంలో రెవెన్యూ డివిజన్ మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. ఈ 73 ఏళ్ల ముసలాయన్ను చూస్తే అందరికీ రెండే రెండు స్కీంలు గుర్తుకొస్తాయి. ఒకటి వెన్నుపోటు... రెండోది మోసాలు. నీ సభలకు ఎందుకొస్తారు? ఈ మోసాల బాబు సభలకు జనం వచ్చారని చూపించేందుకు ఎల్లో మీడియా, దుష్టచతుష్టయం నానా తంటాలు పడుతున్నాయి. ప్రతి వర్గాన్ని వంచించిన ఆ బాబు సభలకు అసలు ఎందుకొస్తారనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ♦రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తానని నమ్మబలికి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి చివరికి నిండా మోసం చేసినందుకు థాంక్యూ.. థాంక్యూ బాబూ.. అని రైతులేమైనా ఆయన సభకు వస్తారా? ♦రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, వడ్డీలు కూడా కట్టొద్దని నిలువునా మోసగించి పొదుపు సంఘాలన్నింటినీ సర్వనాశనం చేసినందుకు ఆ అక్కచెల్లెమ్మలంతా థాంక్యూ.. థాంక్యూ బాబూ అని ఆయన సభలకు వస్తారా? ♦ప్రత్యేక హోదాను తన ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టినందుకు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ఎగ్గొట్టినందుకు నిరుద్యోగులంతా థాంక్యూ.. థాంక్యూ బాబూ అని చెప్పడానికేమైనా ఆయన సభలకు వస్తారా? ♦ ఓ ఊరిలో పదివేల మంది ఉంటే కేవలం పదిమందికి మాత్రమే విదిల్చి అది కూడా లంచాలు తీసుకుంటూ జన్మభూమి కమిటీలతో నరకం చూపినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు థాంక్యూ థాంక్యూ బాబూ అంటూ ఆయన సభలకు వస్తారా? ♦కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచితంగా చదువులు చెప్పిస్తానంటూ ఎన్నికల వాగ్దానాలు చేసి చివరకు పిల్లలను కూడా మోసగించి ఫీజు రీయింబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని నీరుగార్చినందుకు థాంక్యూ థాంక్యూ బాబూ అంటూ వస్తారా? ♦దత్తపుత్రా.. ఈ పాపంలో నీక్కూడా వాటా ఉంది కాబట్టి నీక్కూడా థాంక్యూ థాంక్యూ అని చెప్పడానికి ఎవరైనా వస్తారా? ♦వీరి సభలకు ఎవరైనా ఎందుకొస్తారు ? ఈ దుర్మార్గులను, వంచకుల్ని చూడడానికా? ఏదైనా ఘనకార్యం చేస్తే అధికారం నుంచి ఎందుకు దించేశారు? నిజంగానే వీళ్లు మంచి చేసి ఉంటే ఆయన కుమారుడిని, దత్తపుత్రుడుని ప్రజలు ఎందుకు ఓడించారు? ♦దుష్టచతుష్టయం రామోజీ, రాధాకృష్ణ, టీవీ 5, దత్తపుత్రుడికి బాబు అమలు చేసిన డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) పథకం చాలా బాగుందని థాంక్యూ చెప్పడానికి వస్తారా? రాజకీయమంటే..? ►రాజకీయమంటే షూటింగ్‌లు, డైలాగులు, డ్రోన్ల షాట్లు కాదు.. డ్రామాలు అంతకన్నా కాదు. ఒక రైతు కుటుంబంలో, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబంలో ఎలాంటి మంచి మార్పు తేగలిగామన్నదే రాజకీయమని వీళ్లందరికీ అర్థం కావాలి. ►ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖల్ని మార్చడం, ప్రతి గ్రామంలోనూ రైతన్నల చేయిపట్టుకుని నడిపిస్తూ వ్యవసాయం రూపురేఖలను మార్చడమే రాజకీయం. లంచాలు, వివక్షకు తావులేకుండా పౌర సేవలను ప్రతి గ్రామంలో ఆత్మగౌరవంతో అందించడం.. రాజకీయమంటే ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి çస్థలాన్ని ఇవ్వడంతో పాటు ఇళ్లను కూడా కట్టించి ఇచ్చి వారి గుండెల్లో చోటు సంపాదించడం. అమరావతితో పాటు అన్ని ప్రాంతాల గురించి ఆలోచించడం రాజకీయం. ►రాజకీయం అంటే ఒక మాటిస్తే దాని మీద నిలబడటం అనేది వీళ్లందరికీ అర్థం కావాలి. అన్ని ప్రాంతాలు, అన్ని కుటుంబాల గురించి ఆలోచన చేస్తే దాన్ని రాజకీయం అంటారు. అటు అమరావతితో పాటు ఉత్తరాంధ్రను, రాయలసీమను చూసుకుంటూ వారందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే అసలైన రాజకీయం. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవకుడు. చంద్రబాబు మాదిరిగా ప్రజలపై అధికారాన్ని చలాయించడం కాదు. బీసీలు వారి సమస్యలు గురించి చెప్పడానికి వెళితే నాడు వారి తోకలు కత్తిరిస్తానన్నారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా? అని హేళన చేశారు. రాజకీయమంటే అది కాదు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజా సేవకులే అన్నది రాజకీయం. మేనిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలను నెరవేర్చాం కాబట్టే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో సగర్వంగా ప్రతి గడప వద్దకు వెళ్లి ఆశీర్వదించాలని అడుగుతుండటం రాజకీయం. సీఎం సభ సూపర్ సక్సెస్ నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఊహించిన దాని కంటే ఎక్కువగా తండోపతండాలుగా తరలివచ్చిన జనసందోహంతో సభాప్రాంగణం లోపల, బయటా కిటకిటలాడింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు చోడవరం, పాయకరావుపేట, మాడుగుల, అనకాపల్లి, తుని నియోజకవర్గంలోని మరికొన్ని మండలాల నుంచి రైతులు, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన జనాలు ప్రధాన కూడళ్లలో బారులు తీరారు. ఇక నర్సీపట్నం ఎటు చూసినా జనసంద్రంగా కనిపించింది. మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం నుంచి జోగునాథునిపాలెంలోని సభా ప్రాంగణం వరకు 4.5 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో వైఎస్ జగన్‌కు పూలజల్లులతో జనం నీరాజనం పలికారు. చిన్నారుల నృత్యాలతో, గిరిజన థింసా నృత్యాలతో, డప్పులతో సీఎంకి ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు.. హెలిపాడ్ వద్ద సీఎం గంటన్నర పాటు పార్టీ శ్రేణులతో కరచాలనం చేసి, ఆత్మీయంగా పలకరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాట తప్పని ఆ మహానుభావుడికి సెల్యూట్: ఆర్ నారాయణ మూర్తి
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అదే విధంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'స్వాతంత్యం సిద్ధించి 75 ఏళ్లు దాటినా.. మన కాళ్ల కిందే ఏలేరు నీళ్లు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి మనది. ఇలాంటి పరిస్థితుల్లో నేను(ఆర్ నారాయణమూర్తి), దాడిశెట్టి రాజా, ఉమా శంకర్ గణేష్, మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గతంలో సీఎం జగన్ గారిని తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి విజ్ఞప్తి చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆ మహానుభావుడు ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాండవ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు సెల్యూట్' అంటూ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. చదవండి: (చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం: సీఎం జగన్) -
ఈ అమ్మాయి ఇంగ్లీష్ స్పీచ్‌కి సీఎం జగన్ ఫిదా
-
చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం: సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.986 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మీ' ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. మన ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాం. వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాం. విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ రాబోతుంది. కొత్త మెడికల్ కాలేజ్ కారణంగా 150 మెడికల్ సీట్లు వస్తాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుంది' అని సీఎం జగన్ చెప్పారు. 'ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నాం. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోంది. ఎల్లోమీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు' అని సీఎం జగన్ మండిపడ్డారు. 12:12 PM నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌రాకతో సంక్రాంతి పండగ ముందే వచ్చింది. రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కాబోతుంది. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులను ప్రారంభించి.. మనకు సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్ అన్నారు. 12:01 PM మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన నర్సీపట్నంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించనున్నారు. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. 11:47AM ►సభాస్థలికి చేరుకున్న సీఎ జగన్ 11:27AM ►రోడ్డు షోలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలు ►రోడ్డుకు ఇరువైపులా నిలుచుని సీఎం జగన్‌కి పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు ►ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తున్న సీఎం జగన్ 11:17AM అనకాపల్లి: ►విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బలిఘట్టం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. ఎమ్మెల్యేలు పెట్ల ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యే ధర్మశ్రీ అవంతి శ్రీనివాస్, కన్నబాబురాజు, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, పాల్గుణ, సీతం రాజు సుధాకర్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీ.. దాడి వీరభద్రరావు, చింతకాయల జమీల్ ►బలిఘట్టం నుంచి జోగినాథపాలెం వరకు ర్యాలీగా బయలుదేరిన సీఎం.. ►మరికాసేపట్లో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. 10:56AM ►గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి సీఎం జగన్ నర్సీపట్నం బయల్దేరారు. 09:23AM తాడేపల్లి: నర్సీపట్నం బయలుదేరిన సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో మెడికల్ కాలేజీ, తాండవ- ఏలేరు లిఫ్టు ఇరిగేషన్ కెనాల్స్ అనుసంధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం ►అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శుక్రవారం(డిసెంబర్ 30) అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం, సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన వివరాలు ఇవే.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10.25 గంటలకు నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. ఉదయం 11.15-12.50 మధ్య జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్ధాపన. తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన. అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
పరవాడ ఫార్మాసిటీ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్‌లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగాగాయపడిన మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ ప్రమాదంపై పరవాడ పోలీసులు తెలిపిన మేరకు.. లారస్ పరిశ్రమ యూనిట్–3లో మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్–6లో డ్రైమర్ రూమ్‌ను మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన బి.రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన రాజేష్‌బాబు, అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడకు చెందిన రాపేటి రామకృష్ణ, చోడవరం మండలం పెన్నవోలు గ్రామానికి చెందిన మజ్జి వెంకటరావు, విజయనగరం జిల్లాకు నెల్లిమర్లకు చెందిన ఎడ్ల సతీష్ శుభ్రం చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్లాష్‌ఫైర్ సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన గది మొత్తం రబ్బరుతో నిండి ఉంది. నిప్పురవ్వలు పడి రబ్బరు నిల్వలు అంటుకోవడంతో గది అంతా మంటలు, దట్టమైన పొగతో నిండిపోయింది. గదిలో ఉన్న ఐదుగురు కారి్మకులు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే పరిశ్రమకు చెందిన అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేసి గాయపడినవారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మార్గంమధ్యలోనే బి.రాంబాబు (32), రాజేష్‌బాబు (36), రాపేటి రామకృష్ణ (32), మజ్జి వెంకటరావు (36) మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్ మార్చురికీ తరలించారు. ఎడ్ల సతీష్ (36) నగరంలోని కిమ్స్ ఐకాన్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అగ్నిప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పరవాడ సీఐ పి.ఈశ్వరరావు, ఎస్ఐ తేజేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదస్థలాన్ని అనకాపల్లి ఎస్పీ గౌతమిశాలి సోమవారం రాత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం పరవాడలోని లారస్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను, ఇక్కడి పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తెలియజేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడికి వైద్యసహాయం అందించాలని వైద్యాధికారులను, ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను మంత్రి ఆదేశించారు. మృతులు వీరే.. బి.రాంబాబు (32) ఖమ్మం జిల్లా, రాజేష్‌బాబు (36) గుంటూరు జిల్లా, రాపేటి రామకృష్ణ (32) అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడ, మజ్జి వెంకటరావు (36) చోడవరం మండలం పెన్నవోలు. -
ఏపీ: ఆపరేషన్ పరివర్తన్ రెండోదశ సక్సెస్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ రెండోదశను కూడా విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 650 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఐదు జిల్లాలకు సంబంధించి దాదాపు 2 లక్షల కిలోల గంజాయిని పట్టుకున్నాము. దీనిలో 90 శాతం గంజాయి ఒరిస్సా నుండి వచ్చింది. పరేషన్ పరివర్తన ద్వారా గత ఏడాది 7500 ఎకరాల్లో గంజాయిని నిర్మిలించాము. ఈ ఏడాది 650 ఎకరాల్లో ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి నిర్మిలించాము. గంజాయి ధ్వంసం చేసిన 7500 ఎకరాల్లో ఆల్టర్ నేట్ పంటలు వేసుకునేలా ప్రోత్సహించడం జరుగుతుంది. 3500 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తరలి రాకుండా 14 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. ఒరిస్సా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గంజాయి రవాణా అరికడుతున్నాము. ఆపరేషన్ పరివర్తన్ నిరంతర ప్రక్రియ. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గంజాయి తోటలను నాశనం చేస్తున్నాము. గతంలో కూడా 2 లక్షల ఎకరాల గంజాయిని ధ్వంసం చేశాము. ఆపరేషన్ పరివర్తన్ రెండోదశ విజయవంతం.. ఒడిశా సరిహద్దుల్లోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో అక్కడక్కడ గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును కూడా పూర్తిగా నిర్మూలించడానికి పోలీసు శాఖ ఆపరేషన్ పరివర్తన్ రెండోదశను తాజాగా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ నెలలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మారుమూల ప్రాంతాల్లో ఐదురోజులపాటు ఒడిశా అధికారుల సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసు శాఖ సమర్థంగా కట్టడి చేసింది. ఒడిశా అధికారులతో కలిసి ఏవోబీ పరిధిలో ఆరుమార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేసింది. ఇలా వివిధ మార్గాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 2,45,832 కిలోల గంజాయిని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది. అందులో 70 శాతం గంజాయి ఒడిశా నుంచి మన రాష్ట్రం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నదే కావడం గమనార్హం. ఈ విధంగా ఆపరేషన్ పరివర్తన్ కింద ధ్వంసం చేసిన గంజాయి, దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసు శాఖ దహనం చేస్తోంది. ఏలూరు రేంజ్ పరిధిలో శుక్రవారం కాల్చేసింది. -
అనకాపల్లి.. ఇదేం లొల్లి..?
అనకాపల్లి జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై జిల్లా నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. సీనియర్ నాయకుడై ఉండి ఒక పార్టీలో వర్గాలను సృష్టించడం పట్ల మండిపడుతున్నారు. ప్రస్తుతం అనకాపల్లి తెలుగుదేశంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడైనా మంటలు రేగవచ్చంటున్నారు. ఇంతకీ అనకాపల్లిలో అయ్యన్న ఏం చేశారు? చింతకాయల మంత్రాంగం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లాలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరొక వర్గాన్ని తొక్కి పెట్టడంపై ఇతర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులుగా ముద్రపడిన వారికి వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తుండడంపై మిగిలిన నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కాపు వర్గం నేతలను తొక్కిపెట్టి తన వర్గం వారికి సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేయడంపై టీడీపీలోని కాపు వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో ఇన్చార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తుల తాతయ్య బాబు కొనసాగుతున్నారు. చోడవరంలో బత్తుల తాతయ్య బాబు స్థానంలో తన శిష్యుడైన కేఎస్ఎన్ రాజుకు సీటు ఇప్పించాలని పార్టీ నాయకత్వం వద్ద పావులు కదుపుతున్నారని అయ్యన్నపై విరుచుకుపడుతున్నారు కాపువర్గం నాయకులు.. డబ్బులుంటేనే టికెట్ ఎలమంచిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ.. ఆయన స్థానంలో వేరొక వ్యక్తిని పోటీకి దించాలంటూ అయ్యన్నపాత్రుడు చంద్రబాబుకు సిఫార్సు చేశారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి చాలామంది కాపు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి కాపు వర్గం నేతలే పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎంపీ స్థానంలో కూడా కాపులు పోటీ చేయకుండా అడ్డుకోవాలని అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీటులో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఉద్దేశంతోనే అయ్యన్న ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ కాపువర్గం నేతలు భావిస్తున్నారు. చదవండి: (టీ గ్లాస్లో తుఫాన్?.. ఉన్నదే గుప్పెడు మంది.. అందులో ముఠాలు) కలిసిన వాళ్లందరికీ హామీలు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా తన వర్గానికి చెందిన వారికే సీట్లు ఇప్పించడానికి అయ్యన్న పావులు కదుపుతున్నారు. చోడవరం సీటు కెఎస్ఎన్ రాజుకు, మాడుగుల సీటు గరివిరెడ్డి రామానాయుడుకు ఇప్పించే బాధ్యత తనదే అంటూ తిరుపతిలో అయ్యన్నపాత్రుడు వారిద్దరికీ మాట ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్వరరావు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో అయ్యన్నపాత్రుడు పీల గోవిందకు మద్దతునిస్తున్నారు. మన కుర్చీకింద తడి, పక్క కుర్చీ కోసం ప్లాన్ పెందుర్తి నుంచి మాజీ మంత్రి బండారు నారాయణమూర్తి పోటీ చేయాలని భావిస్తున్నారు. బండారుకు వ్యతిరేకంగా విశాఖ సౌత్ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జిని పెందుర్తిలో పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు అయ్యన్నపాత్రుడు. తన నియోజకవర్గ పరిస్థితిని చక్క బెట్టుకోలేని అయ్యన్న జిల్లా అంతటా పెత్తనం చేయాలని భావిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లోని నేతలు మండిపడుతున్నారు. ముందు తన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఇతరుల సలహాలు పాటిస్తే ఆయన అయ్యన్న ఎందుకవుతారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రామోజీ తప్పుడు రాతలు మానుకో
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): గ్రామ వలంటీర్లపై అసత్య కథనాలను ప్రచురించిన రామోజీరావు... ఇకనైనా తప్పుడు రాతలు మానుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వలంటీర్లు హెచ్చరించారు. తమపై ‘ఈనాడు’లో వచ్చిన తప్పుడు రాతలను నిరసిస్తూ గ్రామ సచివాలయ వలంటీర్లు అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో సోమవారం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరాధార వార్తలతో తమ మనోభావాలు దెబ్బతీయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గౌరవ పారితోషికంతో గ్రామాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న తమను కించపరిచేలా రాతలు రాయడం వెనుక ఆంతర్యమేమిటంటూ తీవ్రంగా మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ ధ్వజమెత్తారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రామోజీరావు దిష్టిబొమ్మతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారంగా ఏర్పడి ‘వలంటీర్లపై తప్పుడు రాతలు మానుకోవాలి, వలంటీర్ల మనోభావాలను దెబ్బతీస్తే సహించబోం, రామోజీరావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఈనాడు డౌన్ డౌన్, రామోజీరావు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రామోజీరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు వలంటీర్లు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సేవాభావంతో సేవలందిస్తున్న తమను కించపరచడం తగదన్నారు. వలంటీర్ వ్యవస్థ ఇతర రాష్ట్రాల ప్రశంసలు అందుకోవడం వాస్తవం కాదా... అని ప్రశ్నించారు. ప్రజా మన్ననలు పొందుతున్న తమను కించపరిచేలా ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రచురిస్తే సహించబోమని వలంటీర్లు హెచ్చరించారు. -
పిల్లలూ.. మనం జంతువులను పుస్తకాల్లోనే చూడాలేమో..!
హెచ్ఎం: పిల్లలూ... మీరెప్పుడైనా పులిని చూశారా... విద్యార్థులు: ఊహు.. చూడలేదు సార్... హెచ్ఎం: పోనీ.. ఏనుగునీ.. విద్యార్థులు: (లేదన్నట్టుగా తెల్ల మొహం) హెచ్ఎం: భవిష్యత్తులో మీరు వీటిని జూలో, పుస్తకాల్లోనే చూడాల్సిన పరిస్థితి రావొచ్చేమో.. విద్యార్థులు: ఎందుకు సార్? హెచ్ఎం: ఎందుకంటే... అడవులు నశించిపోవడంతో జంతు సంపద కూడా అంతరించిపోతోంది.. అంటూ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోసూరు రాము బోధించారు. విద్యార్థులతో జంతు మాస్క్‌లు ధరింపజేసి, ఆయన కూడా మాస్క్ వేసుకొని బోధన చేశారు. దేశంలో వేలల్లో ఉన్న జంతు సంపద వందల్లోకి చేరిందని.. ప్రస్తుత పరిస్థితులను విద్యార్థులకు వివరించారు. వినూత్న రీతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తిగా విషయాన్ని అర్థం చేసుకుంటారనే ఇలా చేశానని ఆయన చెప్పారు. (క్లిక్ చేయండి: కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!) -
తెల్లవారుజామున డూప్లెక్స్ ఇంట్లో షాకింగ్ ఘటన.. ముచ్చటైన కుటుంబం.. అంతలోనే
నర్సీపట్నం(అనకాపల్లి జిల్లా): ముచ్చటైన కుటుంబం వారిది.. అనుబంధాలు పెనవేసుకున్న వారి అందాల పొదరింటిలో ఆనందాల హరివిల్లు నిత్యం నాట్యం చేస్తుంది.. అందుకే విధికి కూడా కన్ను కుట్టింది.. వారి ఆశలను తుంచేస్తూ, కలల్ని కాల్చేస్తూ అగ్ని ప్రమాదం పొట్టన పెట్టుకుంది.. ఆదివారం తెల్లవారుజామున నిద్రలో ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఊపిరాడక తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాలతో బయటపడ్డ తల్లీ కూతుళ్లు విశాఖ కేజీహెచ్‌లో విషమ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కార్తీక ఆదివారం త్రిమూర్తుల పూజ చేసుకోవడం వారికి ఆనవాయితీ. అందుకే విశాఖలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న కుమారుడిని ముందు రోజే ఇంటికి రప్పించారు. శనివారం రాత్రి పొద్దుపోయేవరకు తల్లీ తండ్రీ, ఇద్దరు పిల్లలు హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. నిద్రకు ఉపక్రమించాక వేకువజామున జరిగిన ప్రమాదం వారి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పట్టణంలోని కృష్ణాబజార్ సెంటర్లో ఈ ఘోరం జరిగింది. బంగారు వ్యాపారి నవర మల్లేశ్వరరావు (నానాజీ) (45) అంబికా జ్యూయలర్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. షాపుపైనే రెండంతస్తుల డూప్లెక్స్ ఇంట్లో భార్య సుజాత, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. కుమారుడు మౌలేష్ (19) విశాఖలోని ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం, కుమార్తె జాహ్నవి మాకవరపాలెంలోని ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు. శనివారం రాత్రి నానాజీ, భార్య సుజాత, కుమారుడు మౌలేష్ పైఅంతస్తులో పడుకున్నారు. కుమార్తె జాహ్నవి కింద అంతస్తులో పడుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇల్లంతా దట్టమైన పొగతో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒకపక్క మంటలు, మరోపక్క పొగతో కారు చీకటిలో ఎటువెళ్లాలో తెలియక ఆందోళన చెందారు. “ఇంట్లో మంటలు వ్యాపించాయి.. రక్షించమ’ని నానాజీ పక్కింట్లో నివాసం ఉంటున్న సోదరుడు అప్పారావుకు ఫోన్ చేశారు. ఇల్లంతా తాళాలు వేసి ఉండడంతో సోదరుడు, అతని కుటుంబ సభ్యులకు కాపాడేందుకు అవకాశం లేకుండా పోయింది. సుమారు 40 నిమిషాలపాటు నానాజీ రక్షించమని ఫోన్లో అరుస్తూనే ఉన్నా.. రెండంతస్తుల్లో ఉన్న నాలుగు గేట్లకు తాళాలు వేసి ఉండడంతో లోనికి ప్రవేశించలేకపోయారు. సోదరుడు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు హుటాహుటిన చేరుకొని, గేట్ల తాళాలను కట్టర్‌తో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కింద అంతస్తులో అపస్మారకస్థితిలో పడి ఉన్న జాహ్నవిని స్థానికుల సాయంతో తాళ్లతో కొందకు దించారు. ఆపై అంతస్తులో నానాజీ, సుజాత, మౌలేష్ కింద పడి ఉన్నారు. నానాజీ అప్పటికే మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న మౌలేష్‌ను తాళ్లతో కిందకు దించుతుండగా మరణించాడు. పరిస్థితి విషమంగా ఉన్న సుజాతను, కుమార్తె జాహ్నివిని తొలుత ఏరియా ఆస్పత్రికి, ఆ తర్వాత విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, సీఐ గణేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు ధ్రువీకరించారు. చదవండి: బావతో వివాహేతర సంబంధం.. దుబాయ్ నుంచి భర్త రావడంతో.. -
AP: ఘోర అగ్నిప్రమాదం.. తండ్రీకొడుకులు సజీవదహనం
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం కృష్ణబజార్ సెంటర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబికా జ్యూవెల్లర్స్‌లో భవనంలో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా, అంబికా జ్యూవెల్లర్స్‌లో పై అంతస్తులో షాపు ఓనర్స్ మల్లేశ్వరరావు ఫ్యామిలీ నివాసం ఉంటోంది. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగా భవనంలో మంటలు చెలరేగడంతో మల్లేశ్వరారావు, ఆయన కుమారుడు మౌలేష్ అక్కడే సజీవ దహనమయ్యారు. మిగిలిన ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక, పాత భవనం కావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు సమాచారం. -
జనసేన కార్యకర్తలపై తిరగబడ్డ స్థానిక మహిళలు
-
జనసేన కార్యకర్తలకు మరోసారి గట్టి షాక్..
సాక్షి, అనకాపల్లి: వరుసగా జనసేన శ్రేణులకు చుక్కెదురైంది. మొన్న ఇప్పటం, నిన్న పెడన, తాజాగా గోలుగొండలో జనసేన కార్యకర్తలకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన నేతలకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. జనసేన కార్యకర్తలపై మహిళలు తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక తెల్లముఖం వేశారు. వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గోలుగొండలో జగనన్న కాలనీల్లోకి జనసేన కార్యకర్తలు వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలపై స్థానిక మహిళలు తిరగబడ్డారు. దీంతో, జనసేన శ్రేణులు బిక్కమొహంతో వెనుదిరిగారు. కాగా, జగనన్న కాలనీలోకి వచ్చిన జనసేన నేతలు.. అక్కడ అవినీతి జరిగిందంటూ ఓవరాక్షన్ చేశారు. ఇళ్లు నిర్మించేందుకు డబ్బులు సరిపోలేదని.. ప్రభుత్వాన్ని డబ్బులు అడగాలని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో, స్థానికంగా ఉన్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు.. మీరు(జనసేన శ్రేణులు) ఇక్కడికి వచ్చి ఎలాంటి రాజకీయం చేయాల్సిన పనిలేదు. ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి జగనన్న.. ఎలాంటి అవినీతి జరగకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకు ఇళ్లు ఇచ్చారు. దీనిలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. మీరు వచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు అడగాలని మాకు చెప్పే పనిలేదు. మాకు ఏం కావాలో జగనన్నకు తెలుసు. జగనన్న మాకు అన్ని ఇచ్చారు. ప్రభుత్వాన్ని మేము ఒక్క రూపాయి కూడా అడగము. కావాలంటే మీరే మాకు లక్ష రూపాయలు ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. దీంతో బిక్కమొహం వచ్చిన జనసేన శ్రేణులు అక్కడి నుంచి వెనుదిగారు. మరోవైపు.. టీడీపీ, జనసేనలపై ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఫైరయ్యారు. తాజాగా ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. తమ ఉనికి కోసమే టీడీపీ, జనసేన పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణను ఓర్పలేకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి అని అన్నారు. -
హమ్మమ్మ.. అయ్యన్నా.. ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించిన వైనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహారం. నోరు తెరిస్తే బూతులతో పాటు నీతులు చెప్పే అయ్యన్న.. తనవరకు వచ్చే సరికి మాత్రం ఫోర్జరీ పత్రాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ) సృష్టించి తప్పును ఒప్పుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి తన అక్రమ ఇంటి కట్టడాన్ని కూల్చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కాలువ భూమిని ఆక్రమించి.. కట్టుకున్న తన ఇంటిని సక్రమమైన నిర్మాణం చేసుకునేలా అయ్యన్న వ్యవహరించిన తీరు అందరూ ఛీత్కరించుకునేలా ఉంది. మరోవైపు అయ్యన్న చేసింది అక్రమమని తేలిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు బీసీ కార్డును ఉపయోగించడం మరీ విడ్డూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశి్చమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వందల కోట్ల విలువ చేసే భూములను కాపాడింది. 430 ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంది. ఇందులో భాగంగానే నర్సీపట్నంలో కూడా అయ్యన్న కుటుంబసభ్యులు ఇంటి నిర్మాణం కూడా పంట కాలువను ఆక్రమించి నిర్మించారని సర్వేలో తేలింది. ఈ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు యత్నించగా భౌతికంగా అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఈ నిర్మాణానికి ఎన్వోసీ ఉందంటూ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. అది తీరా సీఐడీ విచారణలో ఫోర్జరీ అని తేలడంతో చివరకు టీడీపీ నేతలు కులం కార్డును తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మేలు చేస్తోంది. బీసీల్లో గతంలో ఎన్నడూలేని విధంగా మెజార్టీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టింది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి ప్రాంతంలో సామాజిక సమీకరణ దెబ్బతింటుందని పేర్కొంటూ అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే చట్టాన్ని సవరించి మరీ పట్టాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. దానిని కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయా వర్గాలపై తనకున్న వ్యతిరేకతను నిర్లజ్జగా కనబరుస్తున్న టీడీపీ.. అక్రమ వ్యవహారంలో కూరుకున్న అయ్యన్న విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీ కార్డును ప్రయోగిస్తుండం ఆశ్చర్యం కలిగిస్తోంది. -
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అధికారులకు అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన తప్పుడు పత్రాలపై ఇరిగేషన్ అధికారులు.. సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులు అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించినవి ఫోర్జరీ పత్రాలుగా నిర్ధారించారు. ఈ రోజు తెల్లవారుజామున అయ్యన్న కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు అయనను, ఆయన చిన్న కుమారుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ఏలూరు కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐడీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. చదవండి: అది రాజకీయ యాత్రే -
వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరంలో ‘విద్యార్థి గర్జన’
చోడవరం(అనకాపల్లి జిల్లా): మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు గర్జించారు. వికేంద్రీకరణకు మద్దతుగా భేరి మోగించారు. తమ బంగారు భవిష్యత్ కోసం విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని విద్యార్థులంతా చోడవరం వేదికగా గళమెత్తారు. మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో చోడవరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలుత లజపతిరాయ్, దేవుడు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ, తోక పార్టీలు పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. -
పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో అమానుషం జరిగింది. క్యాంటమ్ కంపెనీలోని బాత్రూమ్లో శిశువు కలకలం సృష్టించింది. క్యాంటమ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళకు ప్రసవం జరిగింది. పెళ్లి కాకుండా ప్రసవించడంతో ఆ మహిళ.. శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. కంపెనీకి వెళ్లే బస్సుల్లో మహిళ కోసం సిబ్బంది గాలించారు. శిశువును చైల్డ్ లైన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం -
మన వికేంద్రీకరణ ఆకాంక్ష.. వాళ్లకూ తెలియాలి
సాక్షి, అనకాపల్లి: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి, మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకమై శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. పాదయాత్రగా వచ్చే అమరావతి దండుయాత్ర ఉత్తరాంధ్రకు చేరకుండా, మన ఆకాంక్ష తెలిసేలా రోజుకొక నియోజకవర్గంలో బంధ్లు నిర్వహించాలని.. రాస్తారోకోలు, ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. విశాఖను పాలనా రాజధానిగా చేయాలంటూ అనకాపల్లి రింగ్ రోడ్డు సమీపంలోని పెంటకోట కన్వెన్షన్ హాలులో శుక్రవారం ఉత్తరాంధ్ర మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్వేగభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రాజకీయ, సామాజిక, ఉద్యోగ, విద్యార్థి.. మేధావి వర్గం వారంతా పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి విశాఖను రాజధానిగా చేయడమే మార్గమని నినదించారు. మాజీ వీసీ, ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మ న్ లజపతిరాయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసా గింది. ఏయూ ప్రొఫెసర్ షోరాన్ రాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, జేఏసి వైస్ చైర్మన్ దేముడు నాయుడు తదితరులు మాట్లాడారు. అమరావతి యాత్ర ఆపేయాలి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఉద్యమిస్తోంది. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. 1956 లోనే విశాఖ రాజధాని కావాలని అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పటికైనా మూడు రాజధానులు ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంటుంది. అమరావతి యాత్ర ఇప్పటికైనా విరమించుకోవాలని జేఏసీ హెచ్చరిస్తోంది. లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. – లజపతిరాయ్, ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహి వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అన్ని ప్రాంతాలు బావుండాలి.. అందరూ బావుండాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కోరుకోవడం లేదని కొందరు టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహులు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ విశాఖ గర్జన విజయవంతం కావడమే సమాధానం. ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం ఆగదు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా పార్టీ మద్దతు ఉంటుంది. విశాఖ రాజధాని అయితే రానున్న తరానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటే, విశాఖ రాజధాని కావాల్సిందే. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం పాదయాత్ర సాగే ప్రాంతాల్లో బంద్ చేపట్టాలి విశాఖ పరిపాలన రాజధాని అన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లంటే రూ.ఐదారు లక్షలకోట్లు ఖర్చవుతుంది. చంద్రబా బు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ.6 వేలకోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు. మిగతా రూ.1,500 కోట్లలో రూ.వెయ్యికోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ లెక్కన ఆ ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చుచేశారు. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. చంద్రబాబు నిస్సిగ్గుగా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు. అందుకే రైతుల ముసుగులో పాదయాత్ర చేయిస్తున్నారు. పచ్చ ముసుగు కప్పుకుని చేస్తున్న పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపాలి. షాపులు స్వచ్ఛందంగా మూసి వేసి, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేపట్టాలి. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ద్రోహులు బుద్ధి మార్చుకోవాలి అమరావతి రైతులపేరిట నిర్వహించేయాత్ర చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. తక్కువ ఖర్చుతోనే అద్భుత రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర టీడీపీ ద్రోహులు తమ బుద్ధి మార్చుకోవాలి. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తాం ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఉద్యమం ఉధృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు పరిపాలన రాజధానిగా విశాఖను కోరుకోవడంలేదని చెప్పే ప్రతీ ఒక్కరికీ విశాఖ గర్జన ఒక సమాధానం. అమరావతి రైతుల పేరిట నిర్వహించే దండయాత్ర కారణంగానే ఈ ఉద్యమం మరింత ఉధృతం అయ్యింది. మీరు మా ప్రాంతానికి వచ్చి, మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కోరుకుంటామంటే మేము ఎలా ఊరుకుంటాం? చంద్రబాబు, ఆయన పార్టీ నేతలంతా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాదయాత్ర చేపట్టారు. మా ఉత్తరాంధ్ర ఉద్యమకారులకు చెప్పులు చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరుతో మరోసారి మోసపోలేం. ఇప్పటికైనా పాదయాత్ర నిలిపివేస్తే మంచిదని కోరుతున్నాం. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మేము కట్టుబడి ఉంటాం. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తొడలు కొట్టడం సంస్కారమా? ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా, అందులో కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలుస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కేంద్రమే స్వయానా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పింది. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు అమరావతి ఏకీకృత రాజధాని కావాలని అనడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు రైతుల ముసుగులో చేయిస్తున్న పాదయాత్రకు హైకోర్టు పలు ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. వాళ్లు వాటిని పట్టించుకోకుండా.. తొడలు కొడుతూ.. మీసాలు దువ్వుతూ.. రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటం దారుణం. ఇదేనా మీ సంస్కారం? తక్షణమే న్యాయస్థానం ఈ విషయాలను సుమోటోగా తీసుకుని పాదయాత్రను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. – దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా విశాఖ వాసులు అక్కున చేర్చుకుంటారు. అలాంటి మా ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదు. దానికోసం ఎందాకైనా ముందుకు వెళతాం. మా మౌనాన్ని అమాయకత్వం అనుకుంటే పొరపాటే. సీఎం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలుకుతున్నారు. విశాఖ పాలన రాజధాని అయితే దేశంలోనే ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. – భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ ఉద్యమం ద్వారానే సాధించుకుందాం రాజధాని అవ్వాలంటే రాష్ట్రం మధ్యలోనే ఉండనవసరం లేదు. చరిత్రను పరిశీలిస్తే.. ఉద్యమం ద్వారానే తెలంగాణాను సాధించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఉద్యమం ద్వారానే పరిపాలన రాజధాని సాధించుకోవాలి. 29 గ్రామాల కోసం వారు రాజధాని అడిగితే.. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు ఏమవ్వాలి? మన డిమాండ్‌కు మద్దతివ్వని పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి. – జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) -
‘ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా..ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు’
సాక్షి, అనకాపల్లి: అనాదిగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉందని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ప్రాంతానికైనా వలసలు ఉత్తరాంధ్ర నుంచే జరుగుతున్నాయని, అక్షరాస్యతలోనూ ఈ ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అనేది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పరిపాలన రాజధానిని అందరూ నిలబెట్టుకోవాలని.. అప్పుడే మిగతా ప్రాంతాలతో సమానంగా తమ ప్రాంతం ఎదగగలదని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ. 6,000 కోట్లు ఖర్చు చేశారని, అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు చేసి ఖర్చు చేశారని ప్రస్తావించారు. మిగతా 1,500 కోట్లలో వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇక పోతే చంద్రబాబు తన అయిదేళ్ల కాలంలో కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ నుంచి అమరావతికి ఖర్చు చేశారని గుర్తు చేశారు. అమరావతిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలంటే ఐదు నుంచి ఆరు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖ వద్దనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా అని, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఒకే సామాజిక వర్గానికి రాష్ట్ర సంపద దోచిపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్ విధానమని స్పష్టం చేశారు. చదవండి: మనకు నాయకుడు ఒక్కడే.. మన నాయకుడి నినాదం ఒక్కటే ‘అమరావతిలో భవనం నిర్మించాలంటే 110 నుంచి 135 అడుగుల లోతు పునాది కోసం తవ్వాలి. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. బడ్జెట్ మొత్తం, జీతాలు సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతుంది. నేను చెప్పింది అబద్ధమో.. నిజమో చంద్రబాబు, యనమల రామకృష్ణడు చెప్పాలి. నేను చెప్పింది అబద్ధం అయితే తలదించుకుంటాను. విభజన చట్టంలోనే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని చెప్పారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ సినిమా నటుడు వచ్చినా ప్రజలు చూడడానికి వస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చినంత మాత్రాన రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల మనసు మారదు. చనిపోయిన సిల్క్ స్మిత వచ్చినా ఇంతకంటే ఎక్కువమంది వస్తారు. పాదయాత్రకు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేయాలి. ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. పాదయాత్ర జరుగుతున్న సమయంలో బైక్ ర్యాలీలు, నిరసనలు తెలపడం, నల్ల బ్యాడ్జీలు ధరించడం, స్వచ్ఛందంగా షాపులు మూసివేయడం, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేయాలి. జేఏసీ తలపెట్టిన ఏ కార్యక్రమానికైనా మేము మద్దతుగా ఉంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. -
పూతరేకులు..చాలా ఈజీ
సాక్షి, అనకాపల్లి: పూతరేకులంటే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఆత్రేయపురం. ఆంధ్ర సంప్రదాయ స్వీట్ల వంటకాల్లో వీటిది ప్రత్యేక స్థానం. నోట్లో వేస్తే చటక్కున కరిగిపోయే లక్షణమున్న వీటిని ఉమ్మడి తూర్పు గోదావరి, విజయనగరం– విశాఖపట్నం, గుంటూరు జిల్లాల సరిహద్దు గ్రామాల్లో సాధారణ పద్ధతుల్లో ఎక్కువగా తయారుచేస్తుంటారు. కానీ, ఈ ప్రాంతాలు ఆత్రేయపురం అంత ప్రసిద్ధి కాదనే చెప్పుకోవచ్చు. ఇక సంప్రదాయ పద్ధతిలో కొంచెం కష్టతరమైన వీటి తయారీ ఇప్పుడు చాలా సులభతరమైంది. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు వీటి తయారీకి ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు. సాధారణ పద్ధతిలో తయారీ ఇలా.. పూతరేకుల తయారీకి ప్రత్యేకంగా తయారుచేసిన మట్టికుండను వాడతారు. కుండ పైభాగం నున్నగా వెడల్పుగా ఉంటూ. మంటపెట్టడానికి కింది భాగంలో రంధ్రాన్ని పెడతారు. ఇక బియ్యాన్ని ఒకరోజు ముందుగా నీటిలో నానబెట్టి మరుసటి రోజు రుబ్బురోలులో రుబ్బేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో మారుతున్న కాలానుగుణంగా గ్రైండర్లలో రుబ్బుతున్నారు. ఇలా.. మెత్తగా రుబ్బిన పిండిలో తగిన మోతాదులో నీటిని కలిపి పలచగా జాలుగా వచ్చేలా చేస్తారు. బోర్లించిన కుండ అడుగుభాగం నుంచి కొబ్బరి ఆకులతో సన్నని మంట పెడుతూ కుండ వేడెక్కిన తర్వాత పూతరేకుల తయారీ ప్రక్రియ ప్రారంభిస్తారు. మంచినూనే లేదా నేతిని కుండ పైభాగాన రాస్తారు. పలుచని వస్త్రాన్ని జాలుగా ఉన్న బియ్యపు పిండిలో ముంచి కుండ వేడెక్కిన తరువాత ఆ వస్త్రాన్ని కుండపై ఒకవైపు నుంచి మరొక వైపుకు లాగుతారు. కుండ వేడికి పిండి పలుచని పొరలా వస్తుంది. మంట ఎక్కువైనా తక్కువైనా పూతరేకులు విరిగిపోతాయి. ఇలా వీటిని ఈ విధానంలో రోజుకు కేవలం 200వరకు మాత్రమే చేయగల్గుతారు. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు తయారుచేసిన పూతరేకుల తయారీ యంత్రం తయారీ సులభతరానికి యంత్రం ఈ నేపథ్యంలో.. సాంకేతికత జోడించి పూతరేకుల తయారీని సులభతరం చేయాలన్న ఆలోచన అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలకు 2016లో కల్గింది. అంతే.. ఈ ఆలోచనను శాస్త్రవేత్తలు డాక్టర్ పీవీకే జగన్నాథరావు, డాక్టర్ పి. శ్రీదేవిలు కార్యరూపం దాల్చారు. పూతరేకులను తయారుచేసే యంత్రాన్ని రూపొందించారు. కరెంట్ ఆధారంగా పనిచేసే ఈ యంత్రంపై పూతరేకులను ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తీయ్యొచ్చు. అదే పాత విధానంలో అయితే కుండకు పెట్టే మంట అటు ఎక్కువ కాకుండా, ఇటు తక్కువ కాకుండా చూసుకోవడంలో ఎక్కువ సమయం పడుతుంది. దీంతో యంత్రం రాకతో వాటి తయారీ మరింత సులభతరమైంది. నాలుగు పేటెంట్లు సాధించిన ఆర్‌ఏఆర్‌ఎస్ గతంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఉప్పుడు బియ్యం యంత్రానికి, ప్రాసెస్ పౌడర్ బెల్లానికి, మిషనరీ పౌడర్ బెల్లానికి మూడు పేటెంట్లు పొందారు. ఇప్పుడు తాజాగా పూతరేకుల తయారీ యంత్రానికి చెన్నైలో ఉన్న సౌత్ ఇండియా ఇంటెలెక్చువల్ సంస్థ ఈనెల 7న పేటెంట్ హక్కులను కల్పిస్తూ ఆర్‌ఏఆర్‌ఎస్‌కు అనుమతినిచ్చింది. రోజుకు 200 నుంచి 1,200కు పెరుగుదల సాధారణ విధానంతో రోజుకి గరిష్టంగా 200 వరకు పూతరేకులు తయారుచేస్తారు. పెట్టుబడిపోను రూ.650 వరకు మిగులుతోంది. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఏఆర్‌ఎస్ వారు తయారుచేసిన యంత్రం ద్వారా అయితే రోజుకు గరిష్టంగా 1,200 వరకు తయారుచేయవచ్చు. పెట్టుబడి ఖర్చులు పోను..రూ.2వేల వరకు లాభం ఆర్జించవచ్చు. ఈ యంత్రం ఖరీదు దాదాపు రూ.35 వేలు. రుచిలో ఏమాత్రం తేడాలేదు ఆత్రేయపురంలో మా బృందం నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించాం. పూతరేకుల తయారీ వివరాలను అడిగి తెలుసుకున్నాం. యంత్రం రూపొందించిన తర్వాత తయారుచేసిన పూతరేకులకు, సా«ధారణ పద్ధతుల్లో తయారుచేసిన పూతరేకులకు మధ్య రుచి వ్యత్యాసం కూడా పరిశీలించాం. రెండింటికీ ఒకే రుచి వచ్చాయి. – పీవీకే జగన్నాథరావు, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త -
టీడీపీ నేత వంగలపూడి అనితకు బ్యాంకు నోటీసులు
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): రూ.82 లక్షలు రుణం తీసుకుని చెల్లించని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కర్ణాటక బ్యాంకు నోటీసులు జారీ చేసింది. రూ.82 లక్షలను 60 రోజుల్లో చెల్లించాలని లేదా తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించింది. ఈ మేరకు బ్యాంకు ఇచ్చిన పత్రికా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: మూడు రాజధానులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత 2015లో విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో లోక్రిష్ గోకుల్ లేఔట్లో తన పేరుతో ఉన్న స్థలాలను విశాఖపట్నంలో ఉన్న కర్ణాటక బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.82 లక్షలు రుణం తీసుకున్నారు. అయితే, సకాలంలో చెల్లించకపోవడంతో కర్ణాటక బ్యాంకు ఈ నెల ఒకటో తేదీన పత్రికా ప్రకటనతోపాటు వంగలపూడి అనితకు నోటీసులు జారీ చేసింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా 60 రోజుల్లో చెల్లించాలని, లేని పక్షంలో తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. -
కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా?
సాక్షి, విశాఖపట్నం: ఏటి కుక్కలను ఎప్పుడైనా చూశారా? వాటి పేరైనా విన్నారా? ఏ కొద్దిమందికో తప్ప వీటి గురించి అసలు తెలియనే తెలియదు. ఎందుకంటే ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. అలాంటి అత్యంత అరుదైన ఏటి కుక్కలు మన ఉమ్మడి విశాఖ జిల్లా (ప్రస్తుత అనకాపల్లి జిల్లా)లోని అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. అక్కడే అవి ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కృష్ణా రివర్ బేసిన్‌లోను, తూర్పు గోదావరి జిల్లా కోరింగ మడ అడవుల ప్రాంతంలోనూ ఇవి ఉనికిలో ఉన్నాయి. తాజాగా కొండకర్ల ఆవలోనూ ఇవి మనుగడలో ఉన్నట్టు ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ (ఈసీసీటీ), గ్రీన్ పా సంస్థలు గుర్తించాయి. చదవండి: ఇద్దరి పిల్లల తల్లి.. ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరకు.. కెమెరాతో బంధించి.. ఏటి కుక్కలు పగటి పూట మనుషులకు కనిపించే పరిస్థితి లేకపోవడంతో కొండకర్ల ఆవలో వాటి జాడ తెలుసుకోవడానికి మూడు చోట్ల ఈసీసీటీ సభ్యులు ప్రత్యేక డిజిటల్ కెమెరాలను అమర్చారు. కొన్ని రోజులకు అవి ఈ కెమెరాలకు చిక్కాయి. దీంతో వాటిని అంతరించిపోతున్న ఏటి కుక్కలు (స్మూత్ కోటెడ్ ఆటర్స్)గా నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం నలుగురు ఈసీసీటీ, గ్రీన్ పా సభ్యులు దాదాపు నాలుగు నెలల పాటు అధ్యయనం చేశారు. ఇక్కడ అరుదైన ఏటి కుక్కల జాడ గురించి ఇటీవల ఐయూసీఎన్/ఎస్ఎస్సీ ఆటర్ స్పెషలిస్టు గ్రూప్ బులెటిన్ (జర్నల్)లోనూ ప్రచురించారు. ఏమిటీ ఏటి కుక్కలు? ఏటి కుక్కలు ముంగిసను పోలిన ఆకారంలో వాటికంటే పెద్దగా, ఊరకుక్కలకంటే చిన్నవిగా ఉంటాయి. నీటిలోనే ఎక్కువగా మనుగడ సాగిస్తాయి. ఈదుకుంటూ తిరుగుతుంటాయి. నదులు, సరస్సులుండే ప్రాంతాల్లో ఇవి నివశిస్తాయి. 37–43 సెం.మీల తోక, 59–64 సెం.మీల పొడవుతో, 7–11 కిలోల బరువును కలిగి ఉంటాయి. పగటి పూట మనుషులకు కనిపించకుండా మడ అడవులు, జమ్ము గడ్డి వంటి దట్టంగా ఉండే ప్రాంతాల్లోను, గట్లకు చిన్నపాటి గోతులు చేసుకుని వాటిలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. రాత్రి వేళ నదులు/సరస్సుల్లోని చేపలను ఎక్కువగా తింటాయి. అప్పుడప్పుడు పాములు, పక్షులను కూడా ఆహారంగా చేసుకుంటాయి. సంతతి పెరుగుతోంది.. కొండకర్ల ఆవలో ఏటి కుక్కల జాడ వెలుగు చూడడం ఒక విశేషమైతే వాటి సంతతి పెరుగుతుండడం మరో విశేషం. ఇక్కడ ఆరేడేళ్ల క్రితంకంటే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయని ఆవలో చేపలవేట సాగించే మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఇవి మనుషులకు ఎలాంటి హాని చేయనందువల్ల వీటిని చూసి వీరు భయపడం లేదు. కానీ వలలో పడిన చేపలను తినడానికి వలలను పాడు చేస్తుండడంతో వీరికి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. అవి అరుదైన ఏటి కుక్కలే.. కొండకర్ల ఆవలో వెలుగులోకి వచ్చిన ఏటి కుక్కలు అంతరించి పోతున్న జాతులకు చెందినవే. ఇవి ఇప్పటివరకు రాష్ట్రంలో కోరింగ మడ అడవులు, కృష్ణా రివర్ బేసిన్ తదితర ప్రాంతాల్లోనూ ఉంటున్నట్టు గుర్తించారు. ఏటి కుక్కలు ఈ ఆవలో మనుగడ సాగించడానికి అనువైన ప్రాంతం. మనుషుల నుంచి వీటికి హాని జరగకుండా సంరక్షించాల్సిన అవసరం ఉంది. – అనంత శంకర్, డీఎఫ్ఓ, విశాఖపట్నం -
3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్
సాక్షి, అచ్యుతాపురం(అనకాపల్లి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలో ఏపీ ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం మరో 8 కంపెనీలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీలో ఉత్పత్తి.. ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో ఒక పరిశ్రమను ప్రారంభోత్సవం చేసుకోవడంతోపాటు, రెండో దశ ప్లాంట్ విస్తరణ పనులకూ శంకుస్ధాపన చేశాం. యోకహోమా జపనీస్ టైర్ల తయారీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ.. కంపెనీ గురించి చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా మొదటి 5–6 స్ధానాల్లో తమ కంపెనీ ఉందని, రాబోయే రోజుల్లో టాప్ 3లోకి పోబోతున్నామని చెప్పారు. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం సంతోషకరం. 2020 సెప్టెంబరులో మన దగ్గరకు వచ్చారు. అక్కడనుంచి చకచకా అన్ని రకాలుగా మద్ధతు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించి కేవలం 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తిలోకి వచ్చింది. మనమిచ్చే ప్రోత్సాహంతో రెండో దశకూ శ్రీకారం.. మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకుంది. అందుకే రెండోదశకు కూడా నాందిపలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్రాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే.. మరోవైపు సెకెండ్ ఫేజ్‌కు శంకుస్ధాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగష్టు 2023లోగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. తొలిదశలో రూ.1250 కోట్ల రూపాయలతో దాదాపు 1200 మందికి ఉద్యోగాలు ఇక్కడే కల్పించారు. ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2000 మందికి ఉపాధి ఇక్కడే.. మన పిల్లలకే అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెపుతున్నానంటే.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా ఆ ప్రాంతంలో మన పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు అందడం చాలా అవసరం. అలా ఆ ప్రాంతంలో చదువుకున్న మన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇక్కడే మనం ఇప్పించగలిగితే.. పేదరికం నుంచి మన పిల్లలు బయటపడే పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా మనం చేయాల్సినవి అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. చదవండి: (ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్– ఏపీ.. ఇవాళ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనం ఈరోజు గత మూడు సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నాం. మొట్టమొదటి సారిగా ఈ సారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్టిఫికేషన్ చేసేముందు దాని తీరును కూడా మార్చారు. మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తులతో వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుకూలంగానే ఈజ్ఆఫ్ డూయింగ్‌బిజినెస్ ర్యాంకింగ్ ఇస్తున్నారు. అలా రూల్స్ మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్ 1 ర్యాంకు సాధిస్తోంది. ఇవాళ ప్రతి అడుగులో కూడా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. గతంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చేవారు కాదు. ఏళ్ల తరబడి పరిశ్రమల ప్రోత్సాహాకాలు పేరుకుపోయాయి. ఆ నేపథ్యంలో చిన్నా చితకా పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితులు. దాదాపు లక్షకుపైగా ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయి. పదిలక్షల మందికి పైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకంగా.. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహం ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయిన సందర్భంలో... మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా గుర్తు పెట్టుకుని పాత బకాయిలను క్లియర్ చేస్తూనే, మరోవైపు ఎలాంటి బకాయిలు లేకుండా ప్రతి సంవత్సరం వారికి రావాల్సిన ఇన్సెంటివ్‌లు అందిస్తున్నాం. వాళ్లను చేయిపట్టుకుని నడిపిస్తూ ప్రోత్సహిస్తూ ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1463 కోట్లు ఎంఎస్ఎంఈలకు ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి దశలోనే ప్రోత్సహిస్తూ.. అడుగులు ముందుకు వేస్తుంది కాబట్టే ఈ రోజు.. 2021–22 చూస్తే ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ గ్రోత్‌రేట్ 11.43 శాతం సాధించాం. దేశంలో చూస్తే అది కేవలం 8.9శాతమే. దేశంతో పోలిస్తే.. రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. ఎగుమతుల్లోనూ.. ఎగుమతుల్లో చూస్తే.. ఇప్పటికే మన రాష్ట్రంలో ఆరు పోర్టులుంటే.. ఈ 3 ఏళ్లకాలంలో వేగంగా మరో 4 పోర్టులు కట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు పోర్టులు కొత్తవి నిర్మించడంతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లుకూడా నిర్మిస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ కాని, ఒక పోర్టునుకాని అందుబాటులోకి తెస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో 2021–22 ఆర్ధిక సంవత్సరంలో ఎక్స్‌పోర్టెడ్ గూడ్స్ 19.3 బిలియన్ డాలర్లు అంటే ఇది మొత్తం దేశం ఎగుమతుల్లో 4.58 శాతం. ఈ పోర్టులు పూర్తయిన తర్వాత ఏపీ నుంచే 10శాతం ఎగుమతులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్లు.. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏపీలో మాత్రమే ఉన్నాయి. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదరాబాద్ – బెంగుళూరు కారిడర్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే. గతంలో మన రాష్ట్రంవైపు చూడని వారు కూడా ఇప్పుడు మన వైపు చూస్తున్నారు. మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో సెంచరీ ప్లై వుడ్ భజంకాలు పేరు విన్నారా ? ఈ రోజు భజాంకాలు వైయస్సార్ జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. గతంలో బంగర్‌ల పేర్లు ఎప్పుడైనా విన్నారా ? గతంలో ఎప్పడూ రాష్ట్రంవైపు చూడని వాళ్లు శ్రీ సిమెంట్స్.. ఇవాళ ఆంధ్రరాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడుతున్నారు. గతంలో ఆదిత్యా బిర్లా ఏపీకి వచ్చి, సీఎంతో కలిసి వారి ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న విషయం మీరు చూశారా ? ఈ రోజు ఆదిత్య బిర్లా కూడా ఆంధ్రరాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వాళ్ల ప్లాంట్ ప్రారంభిస్తున్నారు. గతంలో అదానీ, అదానీ అని పేరుకు మాత్రమే అనేవారు. కానీ ఆదానీ అనే సంస్ధ గతంలో ఏపీలో ఎప్పుడూ అడుగులు ముందుకు వేయలేదు. కేవలం జగన్ సీఎం అయిన తర్వాతనే అదానీలు ముందడుగు వేశారు. ప్రతి పెద్ద పరిశ్రమకు చెందిన వారందరూ కూడా ఏపీ వైపు చూసేట్టుగా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామిక వేత్తలకు తోడుగా.. పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెప్తున్నాం. మీరు పరిశ్రమ పెట్టండి.. అన్నిరకాలుగా సహాయ, సహకారాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. అదానీ డేటా సెంటర్‌కు కూడా బహుశా వచ్చే నెలలో విశాఖలో శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఒకవైపు వాళ్లను ప్రోత్సహిస్తూ.. అడుగులు ముందుకు వేయిస్తూ తీసుకొస్తున్నాం. మీ తరపున కూడా సహాయ, సహకారాలు.. మరోవైపున మీ తరఫు నుంచి కూడా అంతే సహాయ సహకారాలు అందాలి. ఏకంగా 75శాతం కచ్చితంగా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టంచేశాం. మన మీద కూడా బాధ్యత ఉందనే విషయం మరిచిపోకూడదు. ఎవరైనా ఏపీకి రావడానికి సంతోషపడాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే.. ఎలా పరిష్కరించుకోవాలి, ఏరకంగా గొడవ పడకుండా పరిష్కరించాలనుకోవాలన్నదానిపైన మనం అడుగులు వేయాలి. అప్పుడే ఆ పారిశ్రామిక వేత్తలకూ నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు వాళ్లు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. అప్పుడు మన పిల్లలకు పుష్కలంగా ఉద్యోగాలు వస్తాయి. మన వాళ్లు చాలా మంచి వాళ్లు, బాగా కష్టపడి పనిచేసేవాళ్లు, ఎటువంటి సమస్యలు సృష్టించరు అని వాళ్లు ఎప్పుడు అనుకుంటారో... అప్పుడు మన రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి. ఆ బాధ్యత మన భుజాల మీద ఉందని... సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
అదానీ, అంబానీల చూపు.. ఏపీ వైపు: సీఎం జగన్
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని సగర్వంగా ప్రకటించారు సీఎం జగన్. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు 2023 నాటికి రెండో పనులు పూర్తి చేసే అవకాశం ఉందన్న ఆయన.. ఒక ప్రాంతం అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి అని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఈ మూడేళ్లలో ఏపీకి 17 భారీ పరిశ్రమల ద్వారా 39, 350 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం జగన్.. వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రానున్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఈ రంగంలోనూ 31,671 పరిశ్రమలు రూ.8,285 కోట్లు పెట్టుబడులు పెట్టాయన్నారు. మూతపడ్డ ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు చేయూతనిస్తున్నట్లు.. రూ.1,463 కోట్లతో ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు ప్రోత్సాహకాలు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. గతంలో అదానీ సంస్థ పేరు మాత్రం చెప్పుకునే వాళ్లు. కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అదానీ అడుగులు ఏపీలో పడ్డాయని, అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు.. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. రాష్ట్రంలో దాదాపు లక్ష వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని.. 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయన్న విషయాన్ని తెలియజేశారు. మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీనే అనే విషయాన్ని వేదిక సాక్షిగా ప్రకటించారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనకాపల్లిలో జాతీయ జెండాలతో విద్యార్థుల భారీ ర్యాలీ
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్ కుమార్‌లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. చదవండి: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం.. తుని రాజా కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రులు దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాయకరావుపేట చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను సీఎం ఆశీర్వదించారు. -
గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫ్యాక్టరీ తెరవకూడదని ఆదేశించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకైన ఘటనపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గతంలో జరిగిన విష వాయువు లీకేజీపై విచారణ జరుగుతుండగా మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. జరిగిన ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. విషవాయువు లీకేజీ సంఘటనలో గాయపడిన బాధితులను ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చదవండి: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీక్ సీడ్స్ యూనిట్లో 121 మంది అస్వస్థతకు గురైనట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని అయిదు ఆసుపత్రుల్లో జాయిన్ చేశామని, బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. జరిగిన ప్రమాదంపై నమూనాలను ఐసీఎమ్ఆర్కు పంపుతున్నట్లు చెప్పారు. జరిగిన తప్పు పునరావృతం కాకుండా సీడ్స్ కంపెనీ చూసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుత ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిశ్రమలు అన్నింటిపైన సేఫ్టీ అడిట్ జరుగుతుందని వెల్లడించారు. రెండు నెలల క్రితం ఇదే కంపెనీలో ప్రమాదం జరిగిందని గుర్తుచేసిన మంత్రి దీనిపై కమిటీ వేశామని, ఇంకా విచారణ జరుగుతుందన్నారు. గత ప్రమాదంలో క్లోరిఫైపాలిష్ అనే రసాయనాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, దీనిపై సీడ్స్ కంపెనీకి నోటీసులు కూడా జారీ చేశామన్నారు. -
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
-
గల్లంతైన ఆరుగురిలో నాలుగు మృతదేహాలు లభ్యం.. విద్యార్థుల కోసం కొనసాగుతున్న గాలింపు
-
అనకాపల్లి: పూడిమడక తీరంలో మరో 2 మృతదేహాలు లభ్యం
-
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో విషాదం
-
పూడిమడిక బీచ్‌లో విద్యార్థుల గల్లంతు ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పోలవరంపై చంద్రబాబు కొంగజపం పూడిమడక బీచ్‌లో అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారిని జగదీష్, యశ్వంత్, సతీష్, గణేష్, చందుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అనకాపల్లి: పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థుల గల్లంతు
-
Anakapalle: పూడిమడక తీరంలో విషాదం
సాక్షి, అనకాపల్లి/సాక్షి అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక మొగ వద్ద విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వారిలో ఒక విద్యార్థిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా, అవి గుడివాడ పవన్, జగదీష్, గణేష్‌లవిగా గుర్తించారు. నిన్న రాత్రి ఒక మృతదేహం లభ్యం కాగా, ఈరోజు ఉదయం రెండు మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన విద్యార్థుల కోసం రెండో రోజు రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పూడిమడక బీచ్ రాంబిల్లి మండలం సీతపాలెం బీచ్‌కు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకొని కొండ ఉంటుంది. కొండ ఒక వైపు నుంచి సముద్రంలోని నీరు ఉప్పుటేరులోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఇక్కడకు పర్యాటకులు ఎవరూ వెళ్లరు. స్థానికంగా కొందరు మత్స్యకారులే ఉంటారు. ఇంజనీరింగ్ విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు సెమిస్టర్ పరీక్షలు రాశారు. పరీక్ష ముగియగానే 12 మంది విద్యార్థులు బైక్‌లపై పూడిమడక బీచ్‌కి వచ్చారు. అందరూ ఇక్కడ సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వారిలో ఏడుగురు సముద్రంలో స్నానానికి దిగారు. కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తుండగా ఉవ్వెత్తున వచ్చిన అలలు సముద్రంలోకి లాగేశాయి. మిగతా విద్యార్థులు పెద్దగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు పరుగున వచ్చారు. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను మాత్రం ఒడ్డుకు తేగలిగారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళం, కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టారు. ముమ్మరంగా గాలింపు చర్యలు జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి, జిల్లా ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు బృందాలు, ఫైర్, మత్స్యకార గజఈతగాళ్లుతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గాలింపు చర్యలు విస్తృతం చేస్తామని జిల్లా ఎస్పీ గౌతమి సాలి చెప్పారు. విద్యార్థులు పూడిమడక బీచ్‌కి వెళ్లడం ఇదే తొలిసారి కావడం కూడా దుర్ఘటనకు కారణమై ఉండోచ్చని పోలీసులు తెలిపారు. -
పవన్ తీరుపై మత్స్యకారుల మండిపాటు
మునగపాక (అనకాపల్లి జిల్లా) : తాను కులమతాలకు అతీతమని గొప్పలు చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాభిమానంతో వ్యవహరిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తనపై కాపు కులానికి చెందిన యలమంచిలి నియోజకవర్గ నేత సుందరపు విజయకుమార్ దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసినా ఇంతవరకు పార్టీ పరంగా ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని అదే పార్టీకి చెందిన పూడిమడక మత్స్యకారుడు ఎరిపల్లి కిరణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. కిరణ్‌కుమార్‌కు న్యాయం చేసేంతవరకు పార్టీలకతీతంగా ఆందోళనలు చేసేందుకు మత్స్యకారులు సమాయత్తమవుతున్నారు. అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన మత్స్యకార యువకుడు ఎరిపల్లి కిరణ్‌కుమార్ జనసేనలో చురుకైన కార్యకర్త. గత నెల 3న ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితిపై సమీక్షించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగబాబు విశాఖ వచ్చారు. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి సుందరపు విజయకుమార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ పార్టీని భ్రష్టుపట్టించేలా వ్యవహరిస్తున్నాడని కిరణ్‌కుమార్ ఈ సమావేశంలో ఫిర్యాదు చేశాడు. ఇది తట్టుకోలేని విజయకుమార్ తన అనుచరులతో కలిసి అదే రోజు కిరణ్‌కుమార్‌పై దాడిచేశాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న కిరణ్‌ను 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విజయకుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు కిరణ్ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాక.. గత నెల 23న కుటుంబ సభ్యులతో పవన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని కిరణ్ వివరించాడు. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు తీర్మానం తనపై దాడిచేసిన విజయకుమార్‌పై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా పూడిమడకలో 21న మత్స్యకారులు సమావేశమయ్యారు. తంతడి, వాడపాలెం, లోవపాలెం, ముత్యాలమ్మపాలెం, పూడిమడకకు చెందిన పలువురు మత్స్యకారులు సమావేశమయ్యారు. మత్స్యకార యువకుడు కిరణ్‌పై దాడికి పాల్పడ్డ సుందరపు విజయకుమార్‌ను అరెస్టుచేయాలని, పార్టీ నుంచి తొలగించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామంటూ సమావేశంలో తీర్మానించారు. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిస్తూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అండగా నిలవడంపట్ల మత్స్యకార కుటుంబాలు మండిపడుతున్నాయి. -
అనకాపల్లి, అల్లూరి జిల్లాల మీదుగా 10 కి.మీ. రహదారి నిర్మాణం
మాడుగుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవాపురం వరకు.. దట్టమైన అడవిలో నుంచి సాగే 10 కిలోమీటర్ల రహదారి.. 15 ఏళ్ల క్రితమే నిర్మాణం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. అటవీ శాఖ అనుమతులు లభించక మధ్యలోనే నిలిచిపోయింది. ఇన్నాళ్లకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. కాకులు దూరని కారడవిలో పొక్లెయిన్లతో జంగిల్ క్లియరెన్స్ చేస్తూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: అడవి బిడ్డలకు త్వరలో డోలి కష్టాలు తీరనున్నాయి. చదువు కోవాలని ఆశపడే విద్యార్థుల కలలు నెరవేరబోతున్నాయి. అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తంగా ప్రగతి పరవళ్లు తొక్కబోతోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో మాడుగుల నుంచి దేవాపురం వరకు కీలకమైన రహదారి నిర్మాణం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీడీఏ సహకారంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రహదారి కొండలు, గుట్టల మీదుగా సాగుతుంది. పక్కా రోడ్డు వేయడం కష్టసాధ్యమే అయినా ఈ సత్సంకల్పాన్ని సుసాధ్యం చేయాలని అందరూ శ్రమిస్తున్నారు. వాణిజ్యంలో ప్రత్యేక గుర్తింపు మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు మధ్యనున్న మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయంటే దానికి కారణం సరైన రహదారి లేకపోవడమే. వందేళ్ల క్రితమే మాడుగుల వాణిజ్య రంగంలో గుర్తింపు పొందింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో పండించిన పిప్పలి, పసుపు, బత్తాయి, నారింజ, అరటి, చింతపండు, సపోట, మొక్కజొన్న, అనాస, సీతాఫలం, అలచందలు, తదితర పంటలు మాడుగుల చేరుకుంటాయి. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఏడాదికి వందల టన్నుల్లో రవాణా జరుగుతుంది. సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మాడుగుల మండలంలో కొన్ని గ్రామాలతోపాటు నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 30 గ్రామాలు ఈనాటికీ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయాయి. దేవాపురం, అయినాడ, సలుగు పంచాయతీల పరిధిలో ఉన్న ఈ గ్రామాలవారు నిత్యావసర సరుకులతోపాటు ఇతర వస్తువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దిగి మాడుగుల రావల్సి వచ్చేది. గిరిజనులు పండించిన పంటలను కావిళ్లతో, గంపలతో నడుచుకుంటూ తీసుకువస్తారు. రహదారి సౌకర్యం లేక ఈ ప్రాంత విద్యార్ధులను చదివించడానికి కూడా ఇష్టం చూపించరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం ఆ గ్రామాలు అల్లూరి జిల్లాలో ఉన్నాయి. గతంలో సగంలోనే నిలిచిన రోడ్డు పనులు 15 ఏళ్ల క్రితం మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖ అనుమతి లేకపోవడంతో అక్కడితో పనులు నిలిపోయాయి. చాలామంది రాజకీయ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి పూనుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాడుగుల–దేవాపురం రోడ్డుకు మోక్షం కలిగింది. గత ఎన్నికలకు ముందే ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దానిని నెరవేరుస్తూ అటవీ శాఖ అడ్డంకులున్నా అధిగమించి ప్రస్తుతం రోడ్డు నిర్మాణం శరవేగంతో చేస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన 13 మండలాల్లో గల 30 గ్రామాల రైతులు, చిరు వ్యాపారస్తులు, ప్రజలు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గిరిపుత్రులకు అండగా ప్రభుత్వం గిరిజనమంటే సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అమితమైన ప్రేమ. వారి అభివృద్ధికి, వారి గ్రామాలకు రోడ్డు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మాడుగుల నుంచి దేవాపురం వరకు రహదారి సౌకర్యం లేపోవడంతో గిరిజన గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో అటవీశాఖ అనుమతులు లభించాయి. మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు ఇప్పటికే రహదారుల నిర్మాణం జరుగుతోంది. –బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం రుణపడి ఉంటాం.. గత 30 ఏళ్లుగా దేవాపురం రోడ్డు కోసం పోరాడుతున్నాము. గతంలో మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖాధికారుల అనుమతులు లేకపోవడంతో అప్పట్లో రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇన్నళ్లకు మా కల నెరవేరుతోంది. రెండు జిల్లాల ప్రజలు సీఎంకు, డిప్యూటీ సీఎంకు రుణపడి ఉంటారు. – వేమవరపు వెంకటరమణ, మాడుగుల మాజీ సర్పంచ్ త్వరితగతిన నిర్మాణ పనులు ఇటీవల అటవీశాఖ అనుమతులు లభించాయి. గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాం. దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను రూ.2 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టాం. వర్షాలు లేకుండా ఉంటే నెల రోజుల్లో ఫార్మేషన్ పూర్తి చేస్తాం. మరో ఆరునెలలలోపు ఈ రోడ్డు అప్‌గ్రెడేషన్ కూడా పూర్తిచేస్తాం. ఇది పూర్తయితే రెండు జిల్లాల్లో గల 13 మండలాల్లో గల 30 గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. – రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ పీఓ -
ధర్మశ్రీకి అందలం.. అభిమానుల ఆనందం
చోడవరం(అనకాపల్లి జిల్లా): అనుభవజ్ఞుడికి సముచిత స్థానం లభించింది. ఆయన సేవలకు తగిన గుర్తింపు దక్కింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్‌గా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చోడవరం నియోజకవర్గంతోపాటు అనకాపల్లి జిల్లాలో అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీఈడీ బీఎల్ చదవిన ధర్మశ్రీ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004లో వైఎస్సార్ హయాంలో మాడుగుల ఎమ్మెల్యేగా, డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మశ్రీ వైఎస్సార్సీపీలో రాష్ట్ర కార్యదర్శిగా పదవి నిర్వహించారు. 2019లో చోడవరం ఎమ్మెల్యేగా 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆ యనను ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పార్టీని బలోపేతంగా చేస్తూ నియోజకవర్గాల పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా రాష్ట్రప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వ విప్ పదవికి ధర్మశ్రీని నియమించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమైంది. చోడవరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి, బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, వైఎస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, బుద్ద గంగరాజు, ఎంపీటీసీల ఫ్లోర్‌లీడర్ పల్లా రమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గూనూరు శంకరరావు, మండల ప్రతినిధి దొడ్డి వెంకట్రావు(డీవీఆర్), పట్టణ ప్రతినిధి దేవరపల్లి సత్య పాల్గొన్నారు. -
అనకాపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం
-
రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాకు పులి టెన్షన్ మొదలైంది. కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలోకి పులి ప్రవేశించింది. నక్కపల్లి మండలం తిరుపతిపాలెం దగ్గర పులి అడుగుజాడలు గుర్తించారు. తటపర్తి దగ్గర గేదెపై పులి దాడి చేసింది. పులి సంచారంతో పాయకరావుపేట పరిధిలోని శ్రీరామపురం, తిరుపతిపాలెం, తడపర్తి, వెంకటాపురం గ్రామాల్లో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామస్తులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. చదవండి: మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం లేదా..? కారణం ఇదే.. కాగా, సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సమీపంలోని కుచ్చులకొండ నుంచి తాండవ నది పరివాహక ప్రాంతానికి వెళుతూ తుని-కొట్టాం రోడ్డుపై పులి చేరుకున్నట్లు సమాచారం. అదే సమయంలో బెండపూడి నుంచి రొయ్యల ఫ్యాక్టరీ బస్సులో ఇళ్లకు వెళుతున్న కార్మికులు దీనిని గుర్తించారు. బస్సు లైట్ల కాంతికి కొంతసేపు పులి రహదారిపైనే ఉన్నట్లు వీరు తెలిపారు. తర్వాత తాండవ నదిలోకి దిగేందుకు మార్గం కనిపించకపోవడంతో కుచ్చులకొండపైకి వెళ్లినట్లు పేర్కొన్నారు. -
లేటు వయసులో ఫలించిన నిరుద్యోగి కల
సాక్షి, అనకాపల్లి: ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 1998 డీఎస్సీలో ఎంపికైన వారికి ఉద్యోగావకాశం కల్పిస్తూ ఫైల్‌పై (జీఓ జారీ) సంతకం చేయడంతో రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగి పంట పండింది. 23 ఏళ్లుగా ఉపాధ్యాయ కొలువు కోసం ఎదురు చూస్తున్న అతని నిరీక్షణ ఫలించింది. గ్రామానికి చెందిన పసగడుగుల బాబూరావు (57)కు పెళ్లయి పిల్లలు కూడా పెద్ద వాళ్లయ్యి పెళ్లీడుకు వచ్చారు. ఈ నేపథ్యంలో 1998 నుంచి నేటి వరకు ఎంతో మంది మంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. ప్రభుత్వాలు మారాయి. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతో మా వంటి అభాగ్యులకు మంచి చేస్తున్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ భార్య, ముగ్గురు పిల్లలతో ఈ సంతోషాన్ని పంచుకున్నాడు. 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థుల హర్షం.. మాడుగుల రూరల్: సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, తదితర నియోజకవర్గాల్లో 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులు 500 మందికి పైగా ఉన్నారు. గత పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటీటీలో సినిమా తీసిన అనకాపల్లి డైరెక్టర్
సాక్షి, మునగపాక (అనకాపల్లి): సినిమా రంగంపై ఆసక్తితో అందరిలా అతను భాగ్యనగరానికి పరుగులు తీయలేదు. తనకున్న పరిమిత వనరులను ఉపయోగించుకుని తొలుత ‘వేదన’, ‘ఓ మనస్సు కథ’, ‘మత్తు వదలరా’ వంటి పలు లఘు చిత్రాలను జీరో బడ్జెట్‌తో తీసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఆపై ఓటీటీ చిత్రం వాడే–వీడు తీసి 7 లక్షలకుపైగా వీక్షకుల అభిమానం పొందాడు. వెండితెర వైపు అడుగులు వేస్తున్న వర్ధమాన దర్శకుడు కోరుకొండ గోపీకృష్ణ స్ఫూర్తిదాయక కథనం... మునగపాక గ్రామానికి చెందిన కోరుకొండ గోపీకృష్ణ చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి చూపేవాడు. సాహిత్యంపై మక్కువతో పలు కవితలు, రచనలు చేశారు. వెయ్యికిపైగా సన్మాన పత్రాలు రాసి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. కంప్యూటర్ పరిజ్ఞానంతో పుస్తకాలు రాసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి అభినందనలు అందుకున్నాడు. నూతన నటీ నటులతో వాడే–వీడు... తార క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన నటీనటులతో వాడే–వీడు చిత్రానికి దర్శకత్వం వహించాడు. స్త్రీ లేనిదే ప్రతీ మగవాడి జీవితం శూన్యం. అదే స్త్రీ కారణంగా మగవాడి జీవితం శూన్యం కాకూడదనే ఇతి వృత్తాంతంతో సినిమా తీశాడు. హీరో హీరోయిన్లుగా సిరి, వెన్నెలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ.. స్థానిక కళాకారులు 15 మందితో సినిమా రూపొందించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 24 రోజుల పాటు వాడ్రాపల్లి, కొండకర్ల ఆవ, తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలరించిన పాటలు... వాడే–వీడు చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై ఉర్రూతలూగిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాటలకు విశేష ఆదరణ వస్తోంది. సింగర్ కార్తీక్ పాడిన వెన్నెల సాంగ్ రంజింపచేస్తోంది. ఈస్ట్‌వెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఈనెల 13న విడుదలైన చిత్రం అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా వీక్షించారు. ఐఎండీబీ 9 రేటింగ్ చేపట్టింది. తెర వెనుక... తారా క్రియేషన్స్ బ్యానర్‌పై వాడే–వీడు చిత్రానికి బ్రహ్మానందరెడ్డి, శ్రీపతి శివకుమార్ నిర్మాతలుగా, ఎంఎల్ రాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా, కెమెరామెన్‌గా హేమవర్ధన్‌రెడ్డి వ్యవహరించారు. సింగర్ కార్తీక్, స్ఫూర్తి జితేందర్, లక్ష్మీ శ్రావణి తదితరులు పాటలు పాడారు. మాటల రచయితగా మునగపాకకు చెందిన విల్లూరి జగ్గప్పారావు, రచనా సహకారం సూరిశెట్టి రాము అందించారు. పరుచూరి అభినందన విశాఖ సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం. కళాకారులను ప్రోత్సహించేందుకు ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. విశాఖను అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి కల నెరవేరే రోజులు కనిపిస్తున్నాయి. వాడే– వీడు సినిమా చూసిన రచయిత పరుచూరి అభినందించారని గోపాలకృష్ణ తెలిపాడు. చదవండి: సినీకార్మికుల సమ్మెపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చైతూ డేటింగ్ గాసిప్స్.. అప్పుడు ‘మజిలీ’ బ్యూటీ.. ఇప్పుడు ‘మేజర్’ భామ -
డీఎస్సీకి ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ
చోడవరం: రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత సాధించారు. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. ఈ విషయమై ఆయనను కదిలించగా.. ‘అప్పుడు నా వయసు సుమారు 30 ఏళ్లు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివాను. ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకున్నాను. 1998 డీఎస్సీ రాశాను. అర్హత సాధించినా అది పెండింగ్‌లో పడటంతో న్యాయవిద్య (బీఎల్) చదవడం ప్రారంభించాను. ఆ సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. ఈ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుచరునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, ఈ రోజు వైఎస్సార్సీపీలో సముచిత స్థానంలో ఉన్నాను. అప్పుడే ఉద్యోగం వస్తే రాజకీయాల కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చేవాడిని. సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న చొరవ వల్ల పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల స్వప్నం నెరవేరింది. ముఖ్యమంత్రికి డీఎస్సీ 1998 బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అన్నారు. -
ఊర్లు వదిలిపోవట్లే.. జనానికి సవాల్‌గా మారిన కోతులు
బుచ్చెయ్యపేట: అనకాపల్లి జిల్లాలో కోతుల నిర్మూలనకు రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామాల్లో కోతులను నిర్మూలించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ గ్రామాల్లో వేలాది కోతులు ఐదారేళ్లుగా తిష్ఠవేశాయి. అరటి, చెరకు, కొబ్బరి, మామిడి, వరి, తమలపాకు, కూరగాయలు, తదితర పంటలపై దాడి చేసి ఫలసాయాన్ని తింటూ పాడు చేస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో తమ భూములను ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా ఒక్కో రైతు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇళ్లలోకి చొరబడి... బుచ్చెయ్యపేట మండలం లోపూడి, బంగారుమెట్ట, ఎల్.బి.పురం, శింగవరం, పి.డి.పాలెం, చిన అప్పనపాలెం, భీమవరం, వడ్డాది, పాయకరావుపేట తదితర పరిసర గ్రామాల్లో కోతులు పంటలను పాడు చేయడమే కాకుండా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను పట్టుకుపోతున్నాయి. మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. రోడ్లపై తిష్ఠ వేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీటిని నిర్మూలించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి, కలెక్టర్‌కు, వ్యవసాయ శాఖ మంత్రికి వందలాది మంది రైతులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కోతులను అటవీ ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి ఆదేశాల మేరకు ముందుగా జిల్లాలో బంగారుమెట్ట, సత్యవరం గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అటవీ, వ్యవసాయ శాఖ అధికార్లు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. వీటిని పట్టేవారిని తీసుకొచ్చి బోనుల ద్వారా అటవీ ప్రాంతాల్లోకి తరలించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఆరేళ్లుగా కోతుల బెడద.. మా గ్రామంలో రెండు వేల కోతులు సంచరిస్తున్నాయి. ఆరేళ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం. పెట్టుబడులు పెట్టిన పంటలపై దాడి చేసి తినేస్తున్నాయి. ఏడాదికి రూ. రెండు లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాం. ఎట్టకేలకు అధికారులు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. – యెనుముల వాసు, రైతు సంఘం నాయకుడు, బంగారుమెట్ట, బుచ్చెయ్యపేట మండలం మిగిలిన గ్రామాల్లో కోతులను నిర్మూలించాలి రైతుల ఇబ్బందులను రైతు సంఘం నాయకుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. కోతులు నిర్మూలనకు తొలుత బంగారుమెట్ట, సత్యవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ రెండు గ్రామాలతోపాటు జిల్లాలో మిగిలిన గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అధికార్లు చర్యలు చేపట్టాలి. – చిక్కాల రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ -
ఆధారాలతో బయటప పెట్టిన ఇరిగేషన్ శాఖ
-
అనకాపల్లి టు అమెరికా.. భలే గిరాకీ
అనకాపల్లి: తాతల నుంచి వచ్చిన వృత్తి.. దానికి వినూత్న ఆలోచనలు జత కలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలగలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం విటమిన్లు వేశారు. వెరసి అనకాపల్లి బెల్లం దేశదేశాలకు వెళ్తోంది. ఆంధ్రా నుంచి అమెరికాకు బెల్లాన్ని అందిస్తున్న ఆ రైతు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే వేగి శ్రీనివాసరావు. ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటయిన చెరకు సాగు, ఉత్పత్తుల్లో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారు. అత్యధిక నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎటువంటి కలుషితం కాని బెల్లాన్ని అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. బీఏ, మెటలర్జీలో డిప్లొమా చదివిన శ్రీనివాసరావు సొంతూరు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం రాజుపేట. శ్రీనివాసరావుది వ్యవసాయ కుటుంబం. తాతల కాలం నుంచి బెల్లం తయారీలో నిమగ్నమైన కుటుంబమది. శ్రీనివాసరావు కూడా వ్యవసాయం చేశారు. పామాయిల్, జీడిమామిడి, సరుగు సాగు చేశారు. అవి పెద్దగా కలిసి రాకపోవడంతో మళ్లీ బెల్లం తయారీపై దృష్టి సారించారు. తాతయ్య కాలం నుంచి వినియోగిస్తున్న బెల్లం క్రషర్‌తో బెల్లం తయారీ ప్రారంభించారు. ఇక్కడే ఆయన వినూత్నంగా ఆలోచించారు. మిగతా తయారీదారులకంటే తాను మరింత నాణ్యమైన సరుకు ఎలా తయారుచేయాలో ఆలోచించారు. బెల్లం తయారీలో సహజంగా సల్ఫర్, పంచదార వినియోగిస్తుంటారు. అయితే మనిషి ఆరోగ్యానికి హాని కలగజేసే ఈ పదార్థాలను శ్రీనివాసరావు ఉపయోగించరు. సుక్రోజు, విటమిన్ ఏ, విటమిన్ సీ తగిన మోతాదులో కలిపి అత్యున్నత ప్రమాణాలతో బెల్లం తయారీ ప్రారంభించారు. పంచదారతో సంబంధం లేకుండా, రంగుకు ప్రాధాన్యమివ్వకుండా, హైడ్రోస్ కలపకుండా బెల్లం అందించడమే ఆయన లక్ష్యం. ఇందుకోసం ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి ఆధునిక పద్ధతుల్లో బెల్లం తయారు చేసే యూనిట్లను పరిశీలించారు. మహారాష్ట్ర, కర్ణాటక, అనకాపల్లి పరిశోధన కేంద్రాల్లో విలువ ఆధారిత బెల్లం తయారీ గురించి తెలుసుకున్నారు. రూ.10 లక్షలతో ప్రారంభం సంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారీకి మొదట రూ.10 లక్షలతో యూనిట్‌ను ప్రారంభించారు. 5 గ్రాముల నుంచి 850 గ్రాముల బరువు బెల్లం దిమ్మలు, కుందులు, పౌడర్, బెల్లం ద్రావణాన్ని తయారీ మొదలెట్టారు. క్రమంగా వ్యాపారం పెంచుకుంటూ పోయారు. భారత దేశం నుంచి ప్రపంచ దేశాలకు 8 మిలియన్ టన్నుల బెల్లం డిమాండ్ ఉంది. ఆరు మిలియన్ టన్నుల బెల్లాన్ని మాత్రమే ఎగుమతి చేయగలుగుతున్నారు. దీంతో బెల్లం ఎగుమతి పైనా శ్రీనివాసరావు దృష్టి పెట్టారు. విదేశీయులు ఇష్టపడే ఫ్లేవర్లలో బెల్లం తయారు చేయాలని నిర్ణయించారు. రూ. 2.5 కోట్లతో కొత్త యూనిట్ నెలకొల్పారు. శ్రీనివాసరావు ఎరుకునాయుడు ఆగ్రోస్ కంపెనీ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో బెల్లం తయారీ మొదలెట్టారు. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు తెప్పించారు. 40 మంది నిపుణులైన ఉద్యోగులను నియమించారు. చక్కని ప్యాకింగ్‌తో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముందుగా మారిషస్‌కు, తర్వాత ఆఫ్రికా, యూరోప్ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకు గాను ఐఎస్వో 22000, హెచ్ఏసీసీపీ, ఐఎస్వో 1001 పత్రాలను పొందారు. ప్రస్తుతం అమెరికా నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఏడాదికి 5 వేల టన్నుల చెరకు క్రషింగ్‌తో బెల్లం, ఉప ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. బెల్లం సరఫరాకు శ్రీనివాసరావుకు ఆఫ్రికా దేశం ఘనా నుంచి అందిన టెండర్ సర్టిఫికెట్ రైతుకూ ఎక్కువ ధర ఒకవైపు చక్కెర కర్మాగారాలు గిట్టుబాటు కాక నష్టాల బాటన పడుతున్నాయి. చెరకు కొన్నందుకు రైతులకు కనీస ధర ఇవ్వలేకపోతున్నాయి. ఇదే సమయంలో శ్రీనివాసరావు చెరకు టన్నుకు రూ.2,800 వరకు ఇస్తున్నాడు. మాకవరపాలెం, నాతవరం, యలమంచిలి, గొలుగొండ, రోలుగుంట ప్రాంతాల నుంచి చెరకు కొంటున్నారు. శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకుంటే ప్రతి రైతు ఆదర్శ పారిశ్రామికవేత్త కావచ్చు. చెరకు సాగును కాపాడుకుందాం వాణిజ్య పంటైన చెరకు సాగును మనం కాపాడుకోవాలి. మా తాతగారు, తండ్రి ఆదర్శంగా బెల్లాన్ని నాణ్యత ప్రమాణాలతో తయారు చేస్తున్నా. రూ.10 లక్షలతో మా తండ్రి పేరిట ఆగ్రోస్ యూనిట్ నెలకొల్పా. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసిన బెల్లాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నా. తాజాగా అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మా దగ్గర తయారయ్యే బెల్లం నాణ్యతతో కూడుకొన్నది. సేంద్రియ పద్ధతుల్లో తయారు చేస్తున్నాం. అందువల్లే డిమాండ్ పెరుగుతోంది. – వేగి శ్రీనివాసరావు -
అచ్యుతాపురం గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ కమిటీ
సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. విచారణ కమిటీని నియమిస్తూ పీసీబీ కార్యదర్శి విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు అధికారులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ సభ్యులుగా అనకాపల్లి జాయింట్ కలెక్టర్, పీసీబీ జేఈఈ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌ను ప్రభుత్వం నియమించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (ఎస్ఈజెడ్) లోని బ్రాండిక్స్ అపరెల్ పార్కు సిటీలో శుక్రవారం ఉదయం విషవాయువు లీకైన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా కళ్ల మంటలు, శ్వాస తీసుకోలేకపోవడం, వాంతులతో అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులు విలవిల్లాడారు. అందరూ బయటకు పరుగులు తీశారు. సుమారు 178 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. -
Atchutapuram Gas Leak: '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు'
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి పరామర్శించారు. 124 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా.. వారిలో ఎవ్వరికీ ప్రాణాపాయం లేదన్నారు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని విశాఖ కేజీహెచ్‌కు తరలించామన్నారు. జరిగిన ప్రమాదంపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి అన్నారు. చదవండి: (అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా) ఈ మేరకు ఘటనపై మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన సంఘటన దురదృష్టం. జరిగిన సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారిని ఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించాము. ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్లో 124 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. వారిలో ఎనిమిది మందికి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 50 బెడ్స్ కేజీహెచ్‌లో అదనంగా ఏర్పాటు చేశాము. జరిగిన ఘటనపై ఒక కమిటీ ఏర్పాటు చేశాము. జరిగిన ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం బాధితులకు అందుతోంది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితిని కలెక్టర్ అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎంపీ సత్యవతి తెలిపారు. చదవండి: (అచ్యుతాపురంలోని సెజ్‌లో గ్యాస్ లీక్! పలువురికి అస్వస్థత) -
రాజయ్యపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ పైపులైన్
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్రతీరానికి భారీ పై పులైను ఆదివారం కొట్టుకొచ్చింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ పైపులైను చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. చాలామంది ఈ పైపులైనును ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కానీ భారీ పైపులైను కావడంతో కదపలేకపోయారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ డి.వెంకన్న రాజయ్యపేట సముద్రతీరానికి వెళ్లి పైపులైన్‌ను పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది కేంద్ర రక్షణ శాఖ ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో నిర్మిస్తున్న ఎన్‌ఏవోబీ (నేవల్ ఆల్టర్నేనేటివ్ బేస్)కు చెందిన పైపులైనుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నేవల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. (క్లిక్: మార్కాపురం వాసిని అభినందించిన ప్రధాని మోదీ) -
ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడి
చోడవరం: అభం శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై ఒక కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారిని జీడి తోటల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడి పళ్లు కోద్దాం రమ్మని నమ్మబలికి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన 8 ఏళ్ల వయస్సు గల చిన్నారిని అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం జీడితోటల్లో తీసుకువెళ్లాడు. ఎవరూ లేని చోట ఆ చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలు 2వ తరగతి చదువుతోంది. ఆ బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు చోడవరం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ విభూషణరావు దర్యాప్తు ప్రారంభించి పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నామని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. వారికి గ్రామస్తులు అండగా నిలిచారు. -
ఐటీలో మేటి.. రైతుల సేవలో ఘనాపాటి
అనకాపల్లి: ఆధునిక పోకడలకు అనుగుణంగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకొని జిల్లా ఏరువాక కేంద్రం అన్నదాతలకు వినూత్నమైన సేవలందిస్తోంది. రైతులు, వ్యవసాయ విస్తరణ విభాగాలకు మధ్య వారధిగా పనిచేస్తోంది. పంటల సాగులో తీసుకోవాల్సిన మెళకువలతోపాటు అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తోంది. అందరి చేతిలో ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ఏరువాక కేంద్రం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) యాప్‌ను రూపొందించింది. ఏడాది పొడవునా కావలసిన సమాచారాన్ని రైతులు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. యాప్ పనిచేస్తుందిలా.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏఎన్జీఆర్ఏయూఆర్బీకే (ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతు భరోసా కేంద్రం) యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో వెబ్ లింకును నొక్కితే ఎఫ్‌ఏఆర్‌ఎం ఆర్ఏడీఐవో.ఇన్ కింద ఫార్మ్ రేడియో ఓపెన్ అవుతుంది. ఇందులో నాలుగు స్లాట్లు ఉంటాయి. వ్యవసాయం, కాయగూరలు పండ్లు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం వస్తుంది. దేనిపై ప్రెస్ చేసినా మూడు నిమిషాల నిడివిగల వాయిస్ వినిపిస్తుంది. అదే సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ నెలకు సంబంధించిన ఆ సమాచారం ఫార్మ్ రేడియోలో వినిపిస్తుంది. రైతుల ముంగిటకే సమాచారం రైతుల వద్దకే సమాచారాన్ని పంపిస్తున్నాం. ఇంటర్నెట్ సదుపాయమున్న వారు వెబ్‌లింకు ద్వారా ఫార్మ్ రేడియోలో వ్యవసాయం, కాయగూరలు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను ఆయా నెలల్లో వినవచ్చు. జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ఈ యాప్‌ను రూపొందించాం. – ప్రదీప్‌కుమార్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త (చదవండి: -
పరుగులు పెట్టించిన ‘ఫిర్యాదు’.. తూచ్... బీరువాలోనే ఉన్నాయి..!
మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): నగదు, బంగారం చోరీకి గురయ్యాయని పొరపాటున ఇచ్చిన ఫిర్యాదు పోలీసులను పరుగులు పెట్టించింది. తమ్మయ్యపాలేనికి చెందిన రొంగల బుల్లిబాబు శనివారం ఉదయాన్నే నిద్ర లేచేసరికి ఇంట్లో బీరువా తలుపులు తెరిచి ఉండడంతో ఇందులోని 25 తులాల బంగారం, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం.. దీంతో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తమ్మయ్యపాలెం చేరుకున్నాయి. ఏఎస్పీ మణికంఠచందోల్ కూడా వచ్చి పరిశీ లించారు. అయితే బీరువాలోని మరో అరలోనే బంగారం, నగదు ఉన్నట్టు క్లూస్ టీం గుర్తించింది. దీంతో బుల్లిబాబు సరిగా వెతకకుండా తొందర పడి ఫిర్యాదు చేశానని తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు. -
తుపాకితో బెదిరించి బ్యాంక్ దోపిడీ
కశింకోట: గుర్తు తెలియని ఆగంతకుడు బ్యాంక్‌లోకి ప్రవేశించి.. తుపాకితో బెదిరించి రూ.3.31 లక్షలను దోచుకెళ్లాడు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నరసింగబిల్లిలోని ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్ శాఖలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిని ఆనుకుని జనసమ్మర్దం గల ప్రాంతంలో ఈ దోపీడీ జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భోజన విరామ సమయంలో సుమారు 30 ఏళ్ల వయసు గల ఓ వ్యక్తి ముఖానికి మాస్కు, తలకు హెల్మెట్ ధరించి బ్యాంక్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో క్యాషియర్ వి.ప్రతాపరెడ్డి ఒక్కరే ఉండగా.. అతడి వద్దకు వెళ్లిన ఆగంతకుడు తుపాకి చూపుతూ బెదిరించాడు. బ్యాంక్ సేఫ్ లాకర్ తెరవమని గదమాయించాడు. మేనేజర్ ఉంటే తప్ప డబుల్ లాకర్ తెరవలేమని బదులిచ్చిన క్యాషియర్ భయంతో లాకర్ గదిలోకి వెళ్లి తలుపులు మూసి దాక్కున్నారు. ఆగంతకుడు చేసేది లేక క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.3.31 లక్షల నగదును తీసుకుని దర్జాగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో బ్యాంక్ ఇన్చార్జి మేనేజర్, మెసెంజర్ భోజనానికి వెళ్లారు. ఖాతాదారులెవరూ లేరు. ఇంతలో భోజనానికి వెళ్లిన సిబ్బంది రావడంతో లాకర్ గది నుంచి క్యాషియర్ బయటకు వచ్చి దోపిడీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ గౌతం సాలి బ్యాంక్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. ట్రైనీ ఏఎస్పీ సునిల్ సెహవాన్, అనకాపల్లి డీఎస్పీ సునిల్ విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. -
Ideal Marriage: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు
మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): అన్నీ సక్రమంగా ఉన్నా మనసులు కలవని రోజులివి..దివ్యాంగులైతే ఇక చెప్పనక్కర్లేదు. ఒకరి సాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలో ఉన్న యువతిని ఓ యువకుడు వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. అందరి మన్ననలు అందుకుంటున్నాడు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి పుట్టుకతోనే దివ్యాంగురాలు. తన తల్లి చిన్నప్పుడే మరణించడంతో అప్పటి నుంచి మాకవరపాలెం మండలంలోని కొండలఅగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు సంస్థలో ఆశ్రయం పొందుతోంది. సంస్థ సంరక్షణలోనే బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన నాగలక్ష్మి వారి జనరల్ ఆస్పత్రిలోనే పనిచేస్తోంది. తామరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నాగలక్ష్మి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో గురువారం కొండల అగ్రహారం ఇమ్మానుయేలు చర్చిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ జంటను సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్‌రాయ్ దంపతులు, పెద్దలు ఆశీర్వదించారు. -
ఇల్లు అంటే మహిళలకు శాశ్వత చిరునామా: సీఎం జగన్
-
బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన
అనకాపల్లి: సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ సమయం.. పశుపక్ష్యాదులకు గడ్డుకాలం. పల్లెల్లో పక్షులకు ఏదో రూపంలో ఆహారం, నీరు సమకూరుతాయి. పట్టణ ప్రాంతాల్లో జంగిల్ కాంక్రీట్ పుణ్యమా అని నీరు లభించడమే కష్టమవుతోంది. అందుకే పక్షి ప్రేమికులు వాటి కోసం విలక్షణంగా ఆలోచించారు. పట్టణాల్లో కూడా ఆహారం, నీరు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణకు విశేష సేవలందించిన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ ఆధ్వర్యంలో సేవామూర్తులు పక్షులకు అండగా నిలుస్తున్నారు. చదవండి👉: 11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది.. పక్షి జాతిని కాపాడుకుందామని ప్రదర్శన చేస్తున్న విద్యార్థినులు నూనె డబ్బాను నాలుగు అరలుగా అమరిక చెట్ల వద్ద ఆహారం, నీటి సౌకర్యం గ్రీన్‌క్లబ్ వ్యవస్థాపకుడైన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తాను పని చేసే పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దే అలవాటు ఉన్న శ్రీధర్ మాస్టారు.. పర్యావరణ పరిరక్షణలో కూడా ముందుంటారు. వేసవి నేపథ్యంలో పట్టణంలో అక్కడక్కడా ఉండే చెట్ల వద్ద అలమంటించే పక్షులకు ఆహారం, నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నూనె డబ్బాలను సగానికి కోసి దాంట్లో నాలుగు అరలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అరలో కొర్రలు, గంట్లు వంటి ఆహార పదార్థాలను, మరో అరలో నీటిని వేసి చెట్లకు కట్టించారు. నీటి బాటిళ్లను మట్టిపాత్రలకు అమర్చి పలు చోట్ల ఏర్పాటు చేశారు. పక్షిజాతిని కాపాడుకోవాలని పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొక్కకు అమర్చిన మట్టిపాత్ర పక్షుల కోసమే.. ఇప్పటికే చాలా పక్షిజాతులు అంతరించిపోయాయి. వేసవికాలంలో అవి పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నగరాల్లో పక్షులకు ఆహారం, మంచినీరు అందించే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. పక్షి జాతులకు ఎంతో కొంత సహాయం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ మహాయజ్ఞంలో చాలా మంది పాలు పంచుకుంటున్నారు. – ఫణిభూషణ్ శ్రీధర్, క్లబ్ వ్యవస్థాపకుడు -
దారుణం.. మేనకోడలిని ఖతం చేసేందుకు రూ. లక్ష సుపారీ
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కక్షకట్టిన మేనమామ మరో వ్యక్తికి సుపారీ ఇచ్చి ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. వివరాలు.. వి.మాడుగుల గ్రామం జగ్గన్న చావిడి వద్ద ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన నగేష్ అనే వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేశాడు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన సిద్ధ స్వాతి(19) అనే యువతిపై నిందితుడు బ్లేడుతో గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న స్వాతిని స్థానికులు వైద్యం కోసం మాడుగుల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే స్వాతిపై దాడి చేసినట్లు గుర్తించారు. యువతి మేనమామ కొండబాబు నగేష్ అనే వ్యక్తితో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ నగేష్ స్వాతిని బైక్‌తో ఢీకొట్టి గాయపర్చినట్లు పోలీసులు తెలిపారు. యువతిని చంపితే కొండబాబు లక్ష రూపాయలు ఇస్తానన్నాడని నగేష్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. అయితే పోలీసులు గతంలో స్వాతి మేనమామకు కౌన్సిలింగ్ ఇచ్చినా అతని తీరులో మార్పు రాలేదు. చదవండి: పుష్ప ఘటన మరువకముందే.. మరో భార్య ఘాతుకం స్వాతిని పెళ్లి చేసుకుంటానని మేనమామ కొండబాబు ఆమె దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో నగదు బంగారం తీసుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని కోరగా ముఖం చాటేశాడు. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో స్థానిక నగేష్‌తో దాడి చేయించాడు. -
వారొస్తేనే మిర్చి కోతలు.. వలస కూలీల బతుకుచిత్రం ఇది..
సాక్షి, ఎటపాక: కాయకష్టం వారికిష్టం..చిన్నా పెద్దా తేడాలుండవు.. సమష్టిగా పనిచేయడం.. వచ్చిన దానినే అంతా సమానంగా పంచుకోవడం వారి నైజం. కల్మషం లేని హృదయాలు వారివి. వారంతా వలస కూలీలు. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా కూలీ పనుల కోసం ఏజెన్సీకి వలస వచ్చి మూడునెలల కాలం ఇక్కడే జీవనం సాగిస్తారు. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలతో పాటు తెలంగాణలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వెలేరుపాడు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తారు. అయితే మిర్చి కోతలకు జనవరి ప్రారంభంలోనే కూలీలు కుటుంబ సమేతంగా తిండి గింజలు పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే వీరొస్తేనే మిర్చి పంట చేతికొచ్చేది. ఏజెన్సీలో సుమారు 8 వేల మంది వలస కూలీలు ఈ నెల చివరి వరకు ఇక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటారు. మిర్చి తోటల్లోనే భోజనం చేస్తున్న కూలీలు ఆహారపు అలవాట్లు వలస కూలీలు వారి వెంట తెచ్చుకున్న దంపుడు బియ్యాన్నే భోజనం తయారీకి వాడతారు. అన్నంలో కలుపుకునేందుకు చింత పండు పులుసునే నిత్యం తయారు చేసుకుంటారు. ఘాటుగా ఉండే పచ్చి మిరపకాయలను బండపై నూరి దానినే అన్నంలో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటారు. రైతులు దయతలచి వారానికోమారు ఇచ్చే జుట్టు కోళ్లను(లగ్గారం) కోసుకుని తింటారు. వీరికి నీటి గుంటలు, సెలయేర్లు, సాగునీటి పైపుల వద్ద నీటితోనే స్నానాలు చేయడం అలవాటు. కొందరు ఆ నీటినే తాగుతుంటారు. ఎండ తీవ్రతకు చెట్ల కింద సేదతీరుతున్న ఆదివాసీలు రాత్రి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలతో సందడి చేసి నిద్ర పోవడం వీరి దినచర్య. ఇలా వారు పిల్లా పాపలతో కలిసి కూలి పనులు చేస్తారు. తద్వారా వచ్చిన డబ్బులు, మిరపకాయలను భద్రంగా దాచుకుని తిరిగి వారి సొంత గ్రామాలకు పయనమవుతారు. ఇలా వలస కూలీలనే నమ్ముకుని ఇక్కడి రైతులు మిర్చి సాగు చేస్తుంటారు. వీరు ఇక్కడ కూలి పనులకు ఉన్నంత కాలం స్థానిక పల్లెల్లో సందడిగా ఉంటుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కాలువల్లో చెలమ నీటిని తాగుతున్న చిన్నారులు వాగులు వంకల్లోనే నివాసం కూలీ పనులకు వచ్చిన వీరంతా గుంపులు గుంపులుగా వాగులు, గోదావరి ఇసుక దిబ్బలపై నివాసం ఉంటారు. నీటి సౌకర్యం ఉన్న చోట గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను కలిసి వండుకుంటారు. సూర్యుడు ఉదయించక ముందే మిర్చి తోటల్లో కాయలు కోసేందుకు వెళ్లిపోతారు. కొద్ది గంటలు పనులు చేశాక వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని సమానంగా పంచుకుని తోటల్లోనే తింటారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంత సమయం చెట్ల నీడనే సేదతీరి.. ఆ వెంటనే మరలా పనులకు ఉపక్రమిస్తారు. సూర్యుడు అస్తమించాక వీరి నివాస ప్రాంతాలకు క్యూ పద్ధతిలో వెళ్లిపోతారు. పని విరామంలో వారికి వారే క్షవరం చేసుకుంటున్న దృశ్యం -
గడువు.. రెండు నెలలు
సాక్షి, అనకాపల్లి: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో జిల్లా ప్రజలు నివసించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ గౌతమి సాలి ఆదేశించారు. రెండు నెలల్లో జిల్లాలో ఎక్కడా గంజాయి, నాటుసారా అనేది లేకుండా మూలాల్ని నాశనం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ క్రతువులో బాగా పనిచేసే సిబ్బందికి రివార్డులతో పాటు పని చెయ్యని వారిపై చర్యలూ ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), జిల్లా పోలీసులతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఈబీ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా గంజాయి, నాటుసారాలపై ఎన్ఫోర్స్మెంట్ చేయాలని ఆదేశించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గ్రామాల్లో ముమ్మర దాడులు నిర్వహించి జిల్లా నుంచి సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వివిధ నేరాలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. అందులో గంజాయి, నాటుసారా కేసులలో ఉన్న పాత నేరస్తులపై బైండోవర్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. వారు మళ్లీ.. ఈ తరహా కేసుల్లో దొరికితే స్థానిక తహసీల్దార్ కోర్టులో నగదు పూచీతో జరిమానా కట్టించాలని, లేదంటే జైలు శిక్ష అనుభవిం చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాల్ని ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలన్నారు. నల్లబెల్లం ఎక్కడిది.? నాటుసారా తయారీలో ప్రధాన ముడిపదార్థమైన నల్లబెల్లం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. గడిచిన రెండు వారాల్లో దాదాపు 50 వేల లీటర్లకు పైగా బెల్లం పులుపుని ధ్వంసం చేసినా.. ఇంకా పలు చోట్ల పట్టుబడుతుండటంపై ఎస్పీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అసలు ఈ నల్లబెల్లం ఎక్కడి నుంచి వస్తోంది.? నాటుసారా తయారు చేస్తున్నవారు ఎలా కొనుగోలు చేస్తున్నారు.? అనే కోణంలో దర్యాప్తు నిర్వహించి.. సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. అనకాపల్లిలో ఉన్న బెల్లం వ్యాపారులతో ఎస్ఈబీ, స్థానిక పోలీసులు సమావేశాలు ఏర్పాటు చేసి.. నల్లబెల్లం విక్రయాలపై నిఘా పటిష్టం చెయ్యాలని ఎస్పీ సూచించారు. అధికారులకు రివార్డులు జిల్లా నుంచి గంజాయి, నాటుసారా సమూల నిర్మూలనకు చేస్తున్న యుద్ధంలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి కీలక భాగస్వామిగా మారాలని ఎస్పీ గౌతమి పిలుపునిచ్చారు. ఎన్ఫోర్స్మెంట్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు ఉంటాయని ప్రకటించారు. అదే సమయంలో అంచనాలకు తగ్గట్లుగా పనిచెయ్యని సిబ్బందిపై చర్యలు కూడా తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్) కె.శ్రావణి, నర్సీపట్నం సబ్ డివిజన్ అదనపు ఎస్పీ మణికంఠ చందోలు, ఎస్ఈబీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవికుమార్‌తోపాటు జిల్లా సీఐలు, ఎస్ఐలు, ఎస్ఈబీ ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు. గంజాయి రవాణాపై గట్టి నిఘా గొలుగొండ: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వస్తున్న గంజాయిపై దృష్టి సారించాలని, గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ గౌతమి సాలి ఆదేశాలు జారీ చేశారు. ఆమె గురువారం రాత్రి ఏజెన్సీకి ముఖద్వారం అయిన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. తరువాత భీమవరం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. చింతపల్లి, జీకేవీధి నుంచి గంజాయి రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి, రికార్డులు పరిశీలించారు. ఆమె వెంట నర్సీపట్నం ఏఎస్పీ మణీకంఠ చందోల్, సీఐ స్వామినాయుడు, ఎస్ఐ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. -
3 డివిజన్లు.. 54,500 మంది ఉద్యోగులు
సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల నెరవేర్చేందుకు రైల్వే అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దక్షిణ కోస్తా జోన్‌కు సంబంధించిన డీపీఆర్ ఆధారిత తుది ప్రక్రియ చివరి దశకు చేరుకుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్త జోన్లో 54,500 మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని డీపీఆర్‌లో పొందుపరిచిన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపైనా కసరత్తులు జరుగుతున్నాయి. కొత్త జోన్ ఏర్పాటైతే.. ప్రస్తుతం ఉన్న వనరుల ఆధారంగా వార్షికాదాయం సుమారు రూ.15 వేల కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. సిబ్బంది సర్దుబాటు విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను సమర్థంగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా జోన్ ఏర్పాటు అయినప్పుడు 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులతో విధులు మొదలు పెట్టేవారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచుతుంటారు. కానీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు మాత్రం 65,800 అవసరం అని డీపీఆర్‌లో పొందుపరిచారు. అయితే కార్యకలాపాలు ప్రారంభమైన సమయంలో మాత్రం 54,500 మంది అవసరమని నిర్ధారించారు. వాల్తేరు డివిజన్ కార్యాలయంలో 17,985 మంది, వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయంలో 930 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని రెండు డివిజన్లకు సర్దుబాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మూడు డివిజన్లలో కలిపి మొత్తం 50 వేల ఉద్యోగులను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆదాయం పెరిగే అవకాశం కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)ని రైల్వే బోర్డు అధికారులు స్టడీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు జోన్లో ఉండనున్నాయి. జోన్ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఎలా మొదలు పెట్టాలి? ఉద్యోగుల సర్దుబాటు ఎలా నిర్వహించాలి? డివిజన్లతో సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి? జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు మొదలైన అంశాలపై కసరత్తులు జరుగుతున్నాయి. అదేవిధంగా వివిధ కేటగిరీల రైల్వే స్టేషన్లు, వాటిని కొత్త జోన్లో అభివృద్ధి చేసేందుకు ఉన్న వనరులు, జోన్ కేంద్రంగా కొత్తగా నడపాల్సిన రైళ్లు, తదితర అంశాల్ని క్రోడీకరిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. మూడు డివిజన్ల నుంచి వచ్చే ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకొని ఈ జోన్ నుంచి వార్షికాదాయం 2018–19 గణాంకాల ప్రకారం రూ.12,200 కోట్లు(డీపీఆర్ తయారు చేసినప్పుడు)గా గణించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రూ.15 వేల కోట్లు సమకూరే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. జోన్ స్వరూపమిదీ.. జోన్ : సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జోన్ పరిధిలో డివిజన్లు : విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రూట్ లెంగ్త్ : 3,496 కి.మీ రన్నింగ్ ట్రాక్ లెంగ్త్ : 5,437 కి.మీ సరకు రవాణా : 86.7 మిలియన్ టన్నులు రాకపోకలు సాగించే ప్రయాణికులు : 192.5 మిలియన్లు జోన్ పరిధిలో ఉన్న పోర్టులు : విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ మేజర్ స్టేషన్లు : విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి జంక్షన్లు : 26 ఏ–1,ఏ,బీ కేటగిరీ స్టేషన్లు : 46 సీ,డీ,ఈ,ఎఫ్ కేటగిరీ స్టేషన్లు : 141 పాసింజర్ హాల్ట్ స్టేషన్లు : సుమారు 170 వైఫై సౌకర్యం ఉన్న స్టేషన్లు : 61 స్టేషన్లు జోన్ నుంచి నడిచే రైళ్లు : సుమారు 500 జోన్ పరిధిలో ఉన్న మెకానికల్ వర్క్‌షాపులు : తిరుపతి, రాయనపాడు, వడ్లపూడి (త్వరలో ఏర్పాటు కానుంది) కోచ్ మెయింటెనెన్స్ డిపోలు : విశాఖపట్నం, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం విజయవాడ, గుంటూరు, తిరుపతి, గుంతకల్లు డీజిల్ లోకో షెడ్లు : విశాఖపట్నం, గూటీ, గుంతకల్లు, విజయవాడ ఎలక్ట్రికల్ లోకోషెడ్లు : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు రైల్వే హాస్పిటల్స్ : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రాయనపాడు, గుంటూరు -
సాగునీటి వనరుల్లో ‘అనకాపల్లి’ ముందంజ
ఒక ప్రాంతం అభివృద్ధికి నీరు ఎంతో అవసరమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వ్యవసాయపరంగా జిల్లా బాగుండాలంటే సాగునీరందించే వనరులు అవసరం. ఒక మేజర్ ప్రాజెక్టుతోపాటు ఐదు జలాశయాలు అందుబాటులో ఉండడం కొత్త జిల్లా అనకాపల్లికి వరం కానుంది. నర్సీపట్నం: పునర్వ్యవస్థీకరణలో కొత్త జిల్లాగా అవతరించి న అనకాపల్లి.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నీటివనరుల్లో సింహభాగాన్ని చేజిక్కించుకుంది. ఏకైక మేజరు ప్రాజెక్టు ‘తాండవ’తోపాటు దాదాపుగా ప్రధాన నీటి పథకాలన్నీ అనకాపల్లిలోనే చేరాయి. ప్రధానంగా వ్యవసాయంతోపాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందేందుకు ఇవి దోహదం చేయనున్నాయి. పెద్దేరు, రైవాడ, కోనాం, కల్యాణపులోవ, రావణాపల్లి వంటి సాగునీటి ప్రాజెక్టులు ఈ జిల్లా పరిధిలో ఉండడంతో వరి సాగుకు అవసరమైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు భవిష్యత్తులో వచ్చే పోలవరం ఎడమ కాలువ ఆధారంగా ఈ జిల్లాలోనే అధిక విస్తీర్ణానికి సాగునీరందించే అవకాశం ఉంది. ఏటా నవంబరులో వచ్చే తుఫాన్ ప్రభావాల వల్ల రిజర్వాయర్లన్నీ నిండుతాయి. వర్షాలు కరుణించకపోయినా ఖరీఫ్‌లో ఈ నీటిని సమృద్ధిగా వాడుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయకట్టు రైతులకు వరి సాగు చేసేందుకు ఢోకా ఉండదు. దీనివల్ల పరోక్షంగా అధిక ఆదాయం సమకూరి రైతాంగం నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న ఏలేరు కాలువ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తాండవ జలాశయానికి అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం రూ.470 కోట్లు కేటాయించింది. ఏలేరు కాలువ నుంచి తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరడంలో కీలకపాత్ర వహిస్తున్నారని కొనియాడారు. కరోనా కాలంలో వలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందించారన్నారు. వారి సేవలను గుర్తిస్తూ రూ.470 కోట్లను ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాల రూపంలో అందిస్తోందన్నారు. మొదటిసారిగా మంత్రి పదవితో వచ్చిన తనను అనకాపల్లి ప్రజలు అక్కున చేర్చుకున్నారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాలుగింతలు కష్టించి పనిచేస్తానని పేర్కొన్నారు. ఎప్పటికీ మీలో ఒకడిగా, మీ బిడ్డగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రిని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ ఘనంగా సత్కరించారు. ఎంపీ డాక్టర్ సత్యవతి, ఆర్డీవో చిన్నికృష్ణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ భీశెట్టి వరహా సత్యవతి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, గ్రామ సర్పంచ్ తట్టా పెంటయ్యనాయుడు, కశింకోట ఎంపీపీ కలగా గున్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి పరుగులు తీస్తుంది.. సాగునీటి ప్రాజెక్టులు సమృద్ధిగా ఉన్నందున జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది. తాండవ ఎత్తిపోతల పథకం, పోలవరం కాలువ పనులు పూర్తయితే జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. వేగవంతంగా అభివృద్ధి చెందే జిల్లాలతో పోలిస్తే అనకాపల్లి ముందు వరుసలో ఉంటుంది. – రాజేంద్రకుమార్, తాండవ ప్రాజెక్టు, డీఈఈ, నర్సీపట్నం -
రామ్మా చిలుకమ్మా.. ప్రేమా మొలకమ్మా ..!
సీతమ్మధార(అనకాపల్లి): కాంక్రీట్ జంగిల్లా మారుతున్న నగరంలో పచ్చని రామచిలుకలు ఒకట్రెండు కనిపించడమే చాలా అరుదు. చిలక జోస్యం చెబుతామంటూ తిరిగేవారి పంజరంలో తప్ప కనిపించని రోజుల్లో చిలుకల సామ్రాజ్యంగా మారింది ఆ ఇల్లు. ఉదయం ఆరు గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఏ చిలుక ఎక్కడ ఉన్నా.. నగరంలోని భానూనగర్లోని ఆయన ఇంటి మేడపైకి రావాల్సిందే. రామచిలుకల కిలకిలలతో ఆ ప్రాంతమంతా ప్రకృతి నిలయంగా మారిపోతోంది. కృష్ణాకాలేజీ సమీపంలోని భానూనగర్లో నివాసముంటున్న లక్ష్మీనారాయణరెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. భార్య శైలజ టీచర్‌గా పని చేస్తున్నారు. దాదాపు పదేళ్ల క్రితం లక్ష్మీనారాయణరెడ్డి మేడపైన పెంచుతున్న పూలమొక్కల వద్దకు రెండు రామచిలకలు వచ్చాయి. వాటిని చూసి ముచ్చటపడిన లక్ష్మీనారాయణరెడ్డి వాటికి గింజల్ని వేశారు. తర్వాత అవి ఒకొక్కటి పెరగసాగాయి. ఇప్పుడవి 200కిపైగా వస్తున్నాయి. ఆ ఇంటికి ఆత్మీయ అతిథులుగా మారిపోయాయి. యాదృచ్ఛికంగా మొదలైన ఈ కుటుంబం, రామచిలుకల బంధం.. విడదీయరానిదిగా అల్లుకుపోయింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు రామచిలుకలు సవ్వడి చేస్తూ వారి మేడమీదకి వచ్చేస్తాయి. మధ్యాహ్నం 1 గంటకు పావురాల కువకువలు వినిపిస్తాయి. మళ్లీ సాయంత్రం 4 గంటలకు రామచిలుకలు అతిథుల్లా పలకరిస్తాయి. ఇది ప్రతి రోజూ దినచర్యగా మారిపోయింది. వీటి కోసం ప్రతి రోజూ దాదాపు 10 కిలోలకు పైగా బియ్యం, ఇతర ఆహార గింజలు ఆహారంగా వేస్తున్నారు. నెలకు సుమారు రూ.4 వేలకు పైగా ఖర్చవుతున్నా.. తమ కుటుంబ సభ్యుల కోసమే కదా అన్నట్లుగా ఈ భార్యభర్తలు చిలుకలను ప్రేమగా సాకుతున్నారు. 2014లో హుద్‌హుద్ ముందు వరకూ 700కి పైగా రామచిలుకలు వచ్చి సందడి చేసేవి. హుద్‌హుద్ సమయంలో గూళ్లు దెబ్బతినడంతో చిలుకల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం 300 వరకూ రామచిలుకలు, 100 వరకూ పావురాలు, గోరింకలు వస్తున్నాయనీ.. ప్రతి రోజూ వాటికి సమయానికి ఆహారం అందించడం మాకు దినచర్యగా మారిపోయిందని భార్యభర్తలు లక్ష్మీనారాయణరెడ్డి, శైలజ చెబుతున్నారు. తమ పిల్లల మాదిరిగానే రామచిలుకలను అపురూపంగా చూసుకుంటున్నామన్నారు. చిలుకల పందిరిలా మారిపోయిన ఈ మేడను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు రామచిలుకలు వచ్చే సమయం కోసం ప్రతి రోజూ ఎదురు చూస్తుండటం విశేషం. -
వింత వాతావరణం.. ఏజెన్సీలో రోజూ వర్షాలే..!
పాడేరు: ఏజెన్సీలో వింత వాతావరణం నెలకొంది. వేసవిలో కూడా రోజూ వర్షాలు కురుస్తుండడంతో పాటు ఉదయం పొగమంచు, సూర్యోదయం తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజుల నుంచి అరకులోయ, పాడేరు నియోజకవర్గాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంచంగిపుట్టు, జి.మాడుగుల, అరకులోయ, పాడేరు, హుకుంపేట మండలాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. గెడ్డల్లో నీటి ప్రవాహం పెరిగింది. పర్యాటక ప్రాంతాలైన చాపరాయి, కొత్తపల్లి జలపాతాలకు వర్షం నీటితో జలకళ ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని రెవెన్యూ యంత్రాంగానికి సబ్ కలెక్టర్ వి.అభిషేక్ ఆదేశించారు. నాలుగు ఇళ్లు ధ్వంసం జి.మాడుగుల: మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదుర గాలులతో కూడిన వర్షానికి నాలుగు రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కోరాపల్లి పంచాయతీ వయ్యంపల్లిలో కోరాబు వెంకటరావు, మర్రి కృష్ణారావు, మర్రి కామేశ్వరరావు, కొర్రా సన్యాసిరావులకు చెందిన ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల పై కప్పు రేకులు ఎగిరి పడడంతో ధ్వంసమయ్యాయి. నాలుగు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ధాన్యం, బియ్యం, ఇతర వస్తువులు పాడయ్యాయని బాధితులు తెలిపారు. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు వారు తెలిపారు. శంకులమిద్దెలో ఆదివారం కురిసిన వర్షానికి ఓ చెట్టు.. మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడడంతో అది నేల కూలింది. పిడుగుపాటుతో మహిళకు గాయాలు హుకుంపేట : పిడుగుపాటుకు ఓ గిరిజన మహిళ తీవ్ర గాయాలపాలైంది. మండలంలోని కొట్నాపల్లి పంచాయతీలోని లొపొలం గ్రామంలో వంతాల నీలమ్మ అనే మహిళ ఇంటి వద్ద ఆదివారం సాయంత్రం పిడుగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న నీలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆటోలో హుకుంపేట ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు కుటుంసభ్యులు తెలిపారు. -
AP New Cabinet: డబుల్ ధమాకా
సమర్థతకు, నమ్మకానికి, విశ్వసనీయతకు వైఎస్ జగన్ సర్కారు పెద్దపీట వేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన వారిద్దరికీ తగిన ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ (కొప్పెలవెలమ)కు చెందిన బూడి ముత్యాలనాయుడికి, కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్కు మంత్రులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు. అందరూ ఊహించినట్లుగానే పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న వెంటే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిద్దరికీ కొత్త కేబినెట్లో చోటు దక్కింది. వార్డు మెంబర్ నుంచి విప్‌గా ఎదుగుతూ.. ఇప్పుడు మంత్రిగా బూడి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎదుగుతూ తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు గుడివాడ అమర్నాథ్. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. సంబరాల వాతావరణంలో పార్టీ శ్రేణులు సందడి చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ మరింత బలోపేతం కానుంది. సాక్షి, విశాఖపట్నం: సంబరాలు మిన్నంటాయి. అభిమాను ల సందడి ఆకాశమే హద్దుగా సాగింది. మిఠాయిలు, బాణసంచా వెలుగులు, అభినందన పూమాలలు.. పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. అనకాపల్లి జిల్లా నుంచి ఇద్దరికి కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కడం వైఎస్సార్సీపీ శ్రేణులకు డబుల్ ధమాకాలా నిలిచింది. ఉదయమంతా శ్రీరామనవమి వేడుకల్లో గడిపిన వారంతా మధ్యాహ్నం నుంచీ గంతులు, కేరింతలతో సందడి చేశారు. నమ్మకానికి మారుపేరు... సర్పంచ్‌గా పనిచేసిన తన తండ్రి బాటలోనే బూడి ముత్యాలనాయుడు వార్డు మెంబరు నుంచి ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు చేపట్టి 2014లో మాడుగుల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, శాసనసభా పక్ష ఉపనేతగా వ్యవహరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2014లో వైఎస్సార్సీపీ రెండు ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకోగా.. ఒక ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో బూడిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జగనన్న వెంటే నిలిచారు. ఆయనతో ఊపిరి ఉన్నంతవరకు ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. ఆ నమ్మకం 2019 ఎన్నికలో ఎమ్మెల్యేగా భారీ విజయా న్ని తీసుకొచ్చింది. అనంతరం ప్రభుత్వ విప్‌గా మూడేళ్లు వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త కేబినేట్లో మంత్రిగా అవకాశం కల్పించారు. తండ్రికి తగ్గ తనయుడిగా... : పేరుకు తగ్గట్టుగానే తన తండ్రి గుడివాడ గుర్నాథరావులాగే గుడివాడ అమర్నాథ్ పోరాటయోధుడిగా నిలిచారు. తండ్రికి తగ్గ తనయునిగా జిల్లాలో చురుకైన యువ రాజకీయ నేతగా ఎదిగారు. అమర్నాథ్ది రాజకీయ కుటుంబం. తాత గుడివాడ అప్పన్న ఎమెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు గుడివాడ గుర్నాథరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఆయన తనయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవి వరించింది. తాత నుంచి వారసత్వ రాజకీయం ఉన్నా.. గుడివాడ అమర్నాథ్ తనంతట తానే రాజకీయంగా ఎదిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వైఎస్సార్సీపీ వెంటే నిలిచారు. జగన్మోహన్రెడ్డికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు. 2014లో వైఎస్సార్సీపీ ఓటమిపాలై అత్యంత కష్టకాలంలో ఉన్న సమయంలో రాజకీయ దిగ్గజాలు పార్టీకి దూరమయ్యారు. ఆ సమయంలోనే యువకుడైన అమర్నాథ్ జిల్లా పార్టీ పగ్గాలను అందుకొని వైఎస్సార్సీపీని ముందుకు నడిపించారు. సీనియర్లను, యువకులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతం అవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. 2007లో విశాఖ కార్పొరేటర్‌గా 22 సంవత్సరాల వయస్సులోనే ఎన్నికయ్యారు. 2008లో జిల్లా ప్రణాళిక సంఘం సభ్యునిగా వ్యవహరించారు. 2018 నుంచి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల్ని చేపట్టారు. జిల్లాలోని కీలకమైన రైల్వేజోన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగానూ, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగానూ పనిచేసిన అమర్నాథ్ అనకాపల్లి అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేశారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మూడు జిల్లాల్లో సంబరాలు... ఉమ్మడి విశాఖ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్లిద్దరినీ మంత్రులుగా ప్రకటించడంతో మూడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎంకు ధన్యవాదాలు నన్ను నమ్మి మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఎలాంటి బాధ్యత అప్పగించినా..దానిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి..మరోవైపు వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కృషిచేస్తాను. ప్రభుత్వం అందించే ప్రతి ఫలాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తాను. సీఎం జగనన్న అడుగుజాడల్లో...నా తండ్రి దారిలో ప్రజల కోసం పనిచేస్తాను. – గుడివాడ అమర్నాథ్ సైనికుల్లా పనిచేస్తాం... కొత్త కేబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాను. మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేస్తాం. ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాను. వార్డు మెంబర్‌గా రాజకీయ అరంగేట్రం చేశాను. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చారు. ఇప్పుడు మంత్రిని చేశారు. నా తుది శ్వాస ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటా... ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తా. – బూడి ముత్యాలనాయుడు -
‘స్పందన’ తలుపులు తెరిచే ఉంటాయ్..
సాక్షి, విశాఖపట్నం : దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబం.. చదువు ఇంజినీరింగ్.. మంచి కంపెనీలో ఉద్యోగం.. అయినా ఏదో లోటు.. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడంలో ఆత్మ సంతృప్తి ఉందంటూ అర్థం చేసుకున్న ఆమె లక్ష్యం వైపుగా అడుగులు వేశారు. ఆమె అకుంఠిత దీక్ష ఫలితమే ఐపీఎస్. వినేందుకు మూడక్షరాలే అయినా.. ఆ స్థాయికి చేరుకునేందుకు కొండంత తెగువ కావాలి.. గుండెల నిండా ధైర్యం ఉండాలి. ఆ రెండింటినీ మేళవిస్తూ.. గౌతమి ఐపీఎస్‌గా లక్ష్యానికి చేరువయ్యారు. ప్రతి పోస్టింగ్‌లోనూ సవాళ్లని ఎదుర్కొంటూ అనకాపల్లి జిల్లాకు మొట్టమొదటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు.. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఈ విషయాలను ఎస్పీ గౌతమి సాలి ‘సాక్షి’తో పంచుకున్నారు. నన్ను మా నాన్నగారే ముందుండి నడిపించారు. చిత్తూరు జిల్లా పెద్ద కన్నెలి గ్రామంలో పుట్టాను. జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి వరకూ, ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదివిన తర్వాత ఎస్వీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ (ఈసీఈ) చదివాను. ఫైనలియర్లో ఉన్నప్పుడు కాగ్నిజెంట్‌లో ప్లేస్మెంట్ సాధించాను. చెన్నైలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించాను. ప్రతి అడుగులోనూ నాన్న వేణుగోపాల్, అమ్మ కల్యాణి ఆత్మస్థైర్యాన్ని నూరిపోసేవారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత నాన్నే మమ్మల్ని నడిపించారు. ఎంఏ ఎంఫిల్ చేసినా.. వ్యవసాయం చేస్తూనే మమ్మల్ని పెంచి పోషించారు. రెండోసారి ర్యాంకు సాధించాను జాబ్ చేస్తూ.. మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ జీవితంలో ఏదో వెలితి ఉన్నట్లుగా అనిపించింది. సమాజానికి దగ్గరవ్వాలంటే ఐఎఎస్, ఐపీఎస్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. జాబ్ చేస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. తొలిసారి 2012లో రాశాను. కానీ ర్యాంకు సాధించలేకపోయాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల మీద ఆధారపడకుండా.. నాకు వస్తున్న జీతంతోనే జీవితాన్ని సాగిస్తూ.. వీకెండ్స్ కోచింగ్ తీసుకుంటూ.. కష్టపడి చదివాను. 2013లో పరీక్ష రాయలేదు. 2014లో 783 ర్యాంకు సాధించాను. మొదటి పోస్టింగ్ కడపలో.. కడప జిల్లాలో ఏఎస్పీ ట్రైనీగా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత విశాఖపట్నంలో అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్, బొబ్బిలి ఏఎస్పీ.. ఆ తర్వాత కర్నూలు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా, ఆ తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. తర్వాత విశాఖపట్నం డీసీపీగా పనిచేశాను. ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్నాను. స్థానిక పరిస్థితులపై దృష్టి సారిస్తాను... ఇప్పటి వరకూ నగర పరిధుల్లో విధులు నిర్వర్తించాను. కానీ.. అనకాపల్లి జిల్లా దానికి పూర్తి విభిన్నం. ముందుగా స్థానిక పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నాను. అనకాపల్లితో పాటు ప్రతి మండలం, గ్రామ స్థితిగతులు, సమస్యాత్మక ప్రాంతాలు మొదలైన అంశాలన్నింటినీ వీలైనంత త్వరగా ఆకళింపు చేసుకొని.. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత గౌరవం పెరిగేందుకు కృషి చేస్తాను. ఎప్పుడైనా వచ్చి ఫిర్యాదులందివ్వండి.. జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎప్పుడైనా వచ్చి ప్రజలు తమ ఫిర్యాదుల్ని స్పందన సెల్లో అందించవచ్చు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముందుగా స్పందన సెల్‌ని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించాం. అదేవిధంగా జిల్లాలోని ప్రతి పౌరుడు 24 గంటల్లో ఎప్పుడు ఏ శాంతిభద్రతలకు సంబంధించిన సహాయం కావాలన్నా ప్రతి పోలీస్ స్టేషన్ తలుపులు తెరిచే ఉంటాయి. వచ్చే ఫిర్యాదుని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించాను. ‘అక్రమం’పై ఉక్కుపాదం గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా, గంజాయి, గుట్కా, ఖైనీ మొదలైన వాటిన్నింటిపైనా ఉక్కుపాదం మోపుతాం. సరిహద్దుల్లో నిరంతర నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరగకుండా నిరోధిస్తాం. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించాం. నాటుసారా తయారు చేసే గ్రామాల జాబితాని తీసుకున్నాను. దానికనుగుణంగా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. మూడు రోజుల వ్యవధిలో 4 వేల లీటర్ల బెల్లంపులుపుని ధ్వంసం చేశాం. ‘దిశ’పై దృష్టి సారిస్తాం... దిశ పోలీస్ స్టేషన్ ఇప్పటికే అనకాపల్లిలో ఉంది. దిశ యాప్‌ని మహిళలందరి ఫోన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. దానికనుగుణంగా ప్రతి కాలేజీలు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటాం. అదేవిధంగా.. జిల్లాలో సైబర్ క్రైమ్ రేట్ ఎలా ఉంది అనే గణాంకాల ఆధారంగా ప్రత్యేక సెల్‌ఏర్పాటు చేయాలా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. మండలాల వారీగా అధ్యయనం.. అనకాపల్లి పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతం మిళితమై ఉంటుంది. ఆయా ప్రాంతాలకు తగినట్లుగా పోలీసింగ్ వ్యవస్థ సేవల్లో మార్పులు చేర్పులు చేపట్టాలి. జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత.. ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఏ టైమ్‌లో ట్రాఫిక్ పెరుగుతోంది, స్కూల్స్ దగ్గర ట్రాఫిక్ ఎలా ఉంది.? ఎక్కడ సమస్య ఉత్పన్నమవుతోంది.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకొని క్రమబద్ధీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మండలాల వారీగా ఆయా ప్రాంతాల పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నాం. దానికనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తున్నాం. సమయం దొరికినప్పుడల్లా వారంలో రెండు మూడు పోలీస్ స్టేషన్లని సందర్శించి.. ప్రజలకు సేవలు అందుతున్నాయా లేదా అనేది నిరంతరం పర్యవేక్షిస్తా. జిల్లాలో శాంతి భద్రతల పరరిక్షణకు అనునిత్యం శ్రమించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు వేస్తుంది. టీచర్ ప్రోత్సాహంతోనే.. సివిల్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుందని నాకు పరిచయం చేసింది మాత్రం విజయశ్రీ మేడం. ఆమె ఇంట్లో సాయంత్రం పూట చదువుకునేటప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది చాలా కష్టమైన పరీక్ష. అందులో పాసైతే.. ప్రజలకు సేవ చేయవచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి నా మనసులో సివిల్స్‌పై బీజం నాటుకుంది. ఆ బీజానికి అమ్మ నీరు పోసి పెంచింది. అమ్మాయిలు బాగా చదువుకుంటేనే సమాజంలో గొప్పగా గౌరవం పొందగలరని మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఆమె వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్లనే నేను ఐపీఎస్‌గా, మా సోదరి మౌనిక కెనరాబ్యాంక్‌లో ఉద్యోగిగా గౌరవం పొందగలిగాం.