సాక్షి, అనకాపల్లి: ‘అన్నా.. మా ఇద్దరు పిల్లలూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తోంది.. మీరే ఆదుకోవాలన్నా..’ అని సీఎం వైఎస్ జగన్‌కు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం విసన్నపేటకు చెందిన తలసేమియా రోగులు లోకే‹Ù(13), గుణసాగర్ (11)లతో కలిసి వారి తల్లి నడిశెట్టి లక్ష్మి గోడు వెళ్లబోసుకుంది. పరవాడలో యుజియా ఫార్మా సంస్థ ప్రారం¿ోత్సవం అనంతరం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బాధితులు కలుసుకున్నారు.
వారి సమస్యను విని సీఎం వారిలో మనోధైర్యం నింపారు. నేనున్నా.. అంటూ భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రస్తుత ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున సాయం అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టిని ఆదేశించారు. కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ఇద్దరు పిల్లలకు రూ.లక్ష చొప్పున తక్షణం సాయం అందజేశారు. అంతేకాకుండా ప్రతీ 15 రోజులకోసారి ఉచితంగా డయాలసిస్ చేయాలని డీఎంహెచ్‌వోకు అప్పగించారు. ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆ చిన్నారుల తల్లి కన్నీళ్లపర్యంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment