Huge Pipeline Washed up on Rajayyapeta Cost in Anakapalle District - Sakshi
Sakshi News home page

రాజయ్యపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ పైపులైన్‌

Published Mon, May 30 2022 2:11 PM | Last Updated on Mon, May 30 2022 3:11 PM

Huge Pipeline Washed up on Rajayyapeta Cost in Anakapalle District - Sakshi

నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్రతీరానికి భారీ పై పులైను ఆదివారం కొట్టుకొచ్చింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ పైపులైను చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చారు.  చాలామంది ఈ పైపులైనును ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కానీ భారీ పైపులైను కావడంతో కదపలేకపోయారు.


ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ డి.వెంకన్న రాజయ్యపేట సముద్రతీరానికి వెళ్లి పైపులైన్‌ను పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది కేంద్ర రక్షణ శాఖ ఎస్‌.రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో నిర్మిస్తున్న ఎన్‌ఏవోబీ (నేవల్‌ ఆల్టర్నేనేటివ్‌ బేస్‌)కు చెందిన పైపులైనుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నేవల్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు. (క్లిక్‌: మార్కాపురం వాసిని అభినందించిన ప్రధాని మోదీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement