
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): రూ.82 లక్షలు రుణం తీసుకుని చెల్లించని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కర్ణాటక బ్యాంకు నోటీసులు జారీ చేసింది. రూ.82 లక్షలను 60 రోజుల్లో చెల్లించాలని లేదా తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించింది. ఈ మేరకు బ్యాంకు ఇచ్చిన పత్రికా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: మూడు రాజధానులపై మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత 2015లో విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో లోక్రిష్ గోకుల్ లేఔట్‌లో తన పేరుతో ఉన్న స్థలాలను విశాఖపట్నంలో ఉన్న కర్ణాటక బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.82 లక్షలు రుణం తీసుకున్నారు. అయితే, సకాలంలో చెల్లించకపోవడంతో కర్ణాటక బ్యాంకు ఈ నెల ఒకటో తేదీన పత్రికా ప్రకటనతోపాటు వంగలపూడి అనితకు నోటీసులు జారీ చేసింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా 60 రోజుల్లో చెల్లించాలని, లేని పక్షంలో తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment