సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్న దృశ్యం
గ్రామగ్రామాన ఆధ్యాత్మిక సౌరభాలు
మార్మోగుతున్న హరినామ సంకీర్తనలు
మేలుకొలుపులతో మానసిక ప్రశాంతత
అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లాలోని గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి వెల్లివిరుస్తోంది. భక్తి పారవశ్యం మానసిక ప్రశాంతత చేకూరుస్తోంది. సనాతన సంప్రదాయాలకు మళ్లీ పెద్దపీట వేస్తూ దేవుని పూజలతో తన్మయత్వం పొందుతున్నారు భక్తులు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ధనుర్మాసం పూజల్లో నిమగ్నం అవుతున్నారు. పెద్ద పండుగ ముందు పల్లెలన్నీ హరినామ సంకీర్తనతో మార్మోగిపోతున్నాయి. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమాలు అన్ని గ్రామాలకు విస్తరిస్తున్నాయి. చలికాలం వచ్చిందంటే కాసింత వెచ్చని ఎండ వచ్చే వరకూ నిద్ర లేవని వారు సైతం హరినామ సంకీర్తనలో మమేకం అవుతున్నారు. అచ్యుతాపురం మండలంలోని జగ్గన్నపేటలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మేలుకొలుపులు ఇప్పుడు మండలంలోని 12 గ్రామాలకు పైగా విస్తరించింది.
తిమ్మరాజుపేట, హరిపాలెం, జగన్నాథపురం, కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, చీమలాపల్లి, దుప్పుతూరు, దోసూరు, గండివానిపాలెం, నరేంద్రంపురం గ్రామాల్లో మేలుకొలుపులు నెలగంట కొట్టిన రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్తరాయనంలో 6 నెలల పాటు దేవతలు సంచరించే సమయంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. మేలుకొలుపు కార్యక్రమం వల్ల తెల్లవారుజాము నుంచే భక్తులు లేచి పుణ్య స్నానాలు ఆచరించి హరినామ సంకీర్తన చేస్తున్నారు. అయ్యప్ప మాలధారులు స్వామి సన్నిధికి వెళ్లిన తర్వాత మళ్లీ భక్తితత్వంలో కొనసాగేందుకు మేలుకొలుపులు ఉపయోగపడుతున్నాయని సమరసత సేవా ఫౌండేషన్ యలమంచిలి డివిజన్ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మానసిక ప్రశాంతత, ఉల్లాసం లభిస్తోందని భక్తులు పేర్కొనడం గమనార్హం.
హరిదాసుల సందడి
నెలగంట పెట్టిన రోజు నుంచి గ్రామాల్లో హరిదాసుల సందడి మొదలయ్యింది. అక్షయ పాత్రను తలపై పెట్టుకొని హరినామస్మరణతో వీధుల్లో సంచరిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నారు. గంగిరెద్దుల సందడి, గాలిపటాలతో చిన్నారుల కోలాహలం, ముగ్గుల పోటీల్లో మహిళల కళా కౌశలం ఊరూరా ప్రతిఫలిస్తోంది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏకాదశి రోజున నగర సంకీర్తన, వారం వారం భజనలు, పౌర్ణమి రోజున సామూహిక హారతి, సత్సంగం, కార్తీక పౌర్ణమి రోజున వెన్నెలలో పాలను మరిగించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో మహిళలు కీర్తనలు, కోలాటాలు నేర్చుకొని దేవాలయాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇది కూడా వారిలో భక్తి భావం పెంపొందించడంతోపాటు, శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడుతోంది.
ఈ చిత్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్న వ్యక్తి పేరు చిలకా నారాయణ. 30 ఏళ్లుగా ఊనగట్ల వారపు సంతలో కూరగాయలు విక్రయిస్తున్నాడు. గత ఏడాది ఇదే సమయానికి రూ.40 వేల వరకూ వ్యాపారం చేశాడు. ప్రస్తుతం కొనేవారు లేకపోవడంతో రూ.10 వేలు కూడా దాటని దుస్థితి నెలకొందని వాపోతున్నాడు. ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన చెందుతున్నాడు.
నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం ఊనగట్లలోని వారపు సంత. మూడు గ్రామాల పరిధిలోని సుమారు 10 వేల మంది ప్రజలకు ఈ సంతే ప్రధానం. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ సంతకు వచ్చి ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంత కొనుగోలుదారులతో కిటకిటలాడేది. ప్రస్తుతం జనం లేక వెలవెలబోతోంది.
అతని పేరు రవి. విజయనగరం పట్టణంలోని వీటీ అగ్రహరంలో ఉంటున్నాడు. కూటమి ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ ఇస్తుందంటే కుటుంబ ఆర్థిక భారం తగ్గుతుందని సంబరపడ్డాడు. పథకం అమలు తరువాత రెండుసార్లు గ్యాస్ సిలిండర్ విడిపించారు. ఒక్క దానికి కూడా నగదు జమ కాలేదు. మొదటి సిలిండర్‌కు నగదు జమ కాలేదని విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఈకైవేసీ చేయించమంటే చేయించారు. అయినా నగదు జమ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment