
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను రామకృష్ణ, దేవి, వైష్ణవి, జాహ్నవిగా గుర్తించారు. అప్పులు బాధలు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.