Family committed suicide
-
అనకాపల్లి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను రామకృష్ణ, దేవి, వైష్ణవి, జాహ్నవిగా గుర్తించారు. అప్పులు బాధలు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘బాధ్యత తెలియదని అలా మాట్లాడాను.. ఇలా చేస్తారని ఊహించలేదు’
తిరువళ్లూరు(తమిళనాడు): పనికి వెళ్లడం లేదని బంధువుల ముందు మామ మందలించడం.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అవమాన భారంగా భావించిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంచీపురం జిల్లా వాలాజాబాద్ సమీపంలోని అయ్యంపేటకు చెందిన కలైఅరసన్ (37) క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ తిరుమేణి పంచాయతీ వసినంపట్టు గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె నిత్య(30)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు హేమనాథ్ (06) ఉన్నాడు. క్యాటరింగ్ పనుల ద్వారా కలైఅరసన్‌కు సరైన ఆదాయం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో భార్య కుమారుడితో కలిసి మూడు నెలల క్రితం అత్తారింటికి వచ్చాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం నిత్య తండ్రి లోకనాథన్ తన బంధువుల ముందు అల్లుడిని పనులకు వెళ్లాలని మందలించాడు. అప్పటి నుంచి కలైఅరసన్ మనస్తాపంతో ఉన్నాడు. దీనికి తోడు అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందును మొదట కుమారుడికి ఇచ్చారు. అనంతరం నిత్య, కలైఅరసన్ సైతం పురుగుల మందును తాగి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శక్తివేల్ మృతదేహాలను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాళీగా ఉంటే బాధ్యత తెలియదని అలా మాట్లాడానని.. ఇంత పనిచేస్తారని ఊహించలేదని మామ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: ‘నా లక్ష్మిని లోకంలో లేకుండా చేశాను’.. వీడియో రికార్డు చేసి.. చివరికి బిగ్ ట్విస్ట్ -
మిర్యాలగూడలో విషాదం..!
సాక్షి, నల్లగొండ : మిర్యాలగూడలోని సంతోష్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఓ కుటుంబం పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చనపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. పారేపల్లి లోకేష్ అనే వ్యక్తి గత కొద్దికాలంగా ఉద్యోగం లేకపోవడంతో మనోవేదనకు లోనయ్యాడు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని సేవించారు. ఈ ఘటనలో భార్య (40), కుమారుడు లోహిత్ (14) ప్రాణాలు విడువగా.. భర్త పారేపల్లి లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది. 100కు డయల్ చేయడంతో.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లోకేష్ హైదరాబాద్‌లో ఉన్న తన సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వెంటనే నల్లగొండలో నివాసముంటున్న మరో సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. అతను 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారమివ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో లోకేష్ భార్య, పెద్ద కుమారుడు చనిపోయి ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న లోకేష్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతిని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా సమయంలో లోకేష్‌తో పాటు చిన్న కుమారుడు రోహిత్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. తామంతా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పి సూసైడ్ నోట్ రాసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అతను మీడియాకు చెప్పాడు. బతికే అర్హత లేదు.. ఆత్మహత్యాయత్నానికి ముందు లోకేష్ రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. ‘క్షమించండి అమ్మానాన్నా. బ్రతికే అర్హత లేదు. నాన్నా దయచేసి ఈ చిన్న అప్పులు తీర్చండి’ లోకేష్ లెటర్లో ఆవేదన వ్యక్తం చేశాడు. జీవితంతో స్థిరపడకపోవడంతో తన తమ్ముడు ఎప్పుడూ ఆత్మన్యూనతా భావంతో ఉండేవాడని లోకేష్ సోదరుడు చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారని కన్నీరుమున్నీరయ్యాడు. -
ఆత్మాభిమానం చంపుకోలేక..
అమ్మ.. నాన్న.. వారి ఆశల సౌధమైన కుమారుడు. ఆయన బ్యాంకు ఉద్యోగి. ఆమె గృహిణి. కుమారుడిని ఇంజినీరింగ్ చదివించారు. స్నేహితులతో కలసి సౌరవిద్యుత్ కార్ల యూనిట్ పెట్టాలనుకున్న అతడి ఆలోచనకు సరే అన్నారు. స్నేహితులను సమకూర్చుకుని మౌలిక వసతులకోసం కొందరు బయటి వ్యక్తుల సాయం ఆశించి రూ.లక్షల సొమ్ములు ఇచ్చి మోసపోయారు. డబ్బడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి. చస్తే చావండి అన్నారు. అంతే.. ఆ మధ్య తరగతి కుటుంబానికి ఆత్మాభిమానం దెబ్బతింది. ఇతరులకు చెప్పడం అవమానంగా భావించారు. ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. శుక్రవారం రాత్రి గోదావరిలో దూకి తనువు చాలించారు. రాజమహేంద్రవరం రూరల్: పెట్టుబడి పెట్టి కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన విషయాన్ని, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను కనీసం అన్నదమ్ములకు చెప్పినా.. సహోద్యోగులకు చెప్పినా.. చిన్న సలహాతో తీరిపోయేది. రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌కు చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి కొల్లి ఆనందబాబు కుటుంబం ఇతరులకు చెప్పడం అవమానంగా భావించారో.. ఏమో తమ బాధను మనసులోనే దాచేసుకుని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబసభ్యులను, బ్యాంకు ఉద్యోగులను, స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది. వివరాలలోకి వెళితే రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌కు చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి కొల్లి ఆనందబాబు(46), అతని భార్య కొల్లి అరుణ (40), కుమారుడు లక్ష్మీచంద్ సాయిచరణ్‌లు గురువారం రాత్రి 8.10 గంటల సమయంలో ఇంటినుంచి మోటార్‌బైక్‌పై కొవ్వూరు వెళ్లారు. అక్కడ అనన్య థియేటర్లో రోబో 2.0 సినిమా చూసి రాజమహేంద్రవరం బయలుదేరారు. రోడ్డు కం రైలు బ్రిడ్జిపై 135వ నెంబరు పోల్ వద్ద మోటార్ బైక్, సెల్‌ఫోన్, చెప్పులు విడిచి గోదావరిలోకి దూకి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే సాయిచరణ్ చెప్పులు, సెల్‌ఫోన్ మాత్రం అక్కడ లభించలేదు. ఆనందబాబు సోదరుడు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్‌రెడ్డి, ఎస్సై యూవీఎస్ నాగబాబులు జాలర్లతో కలిసి విస్తృతంగా గాలించారు. ఉదయం10 గంటల సమయంలో ఆనందబాబు మృతదేహం దూకిన పిల్లర్ వద్దే పైకి తేలిందని, అరుణ మృతదేహం వాడపల్లి ఇసుకర్యాంపు వద్ద నీటిలో తేలింది. కుమారుడు సాయిచరణ్ చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు దూకాడా లేదా అన్న కోణంలో కుటుంబసభ్యలు, పోలీçసులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినా శనివారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. ఆనందబాబు, అరుణ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో విషాదఛాయలు.. ఆనందబాబు, అరుణల మృతదేహాలు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకోవడంతో ఆయన సోదరులు మధుబాబుతో పాటు, బెహ్రైన్‌లో ఉంటున్న అన్నయ్య వీరవెంకటసత్యనారాయణ, అరుణ తల్లిదండ్రులు ఆకాశపు వీరభద్రరావు, పాపాజీలతో పాటు ఇతర కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం మాకు ఒక్కమాట చెప్పి ఉంటే ఈబాధ ఉండేది కాదని తామంతా చూసుకునేవారమని, ఎవరికీ చెప్పకుండా తన మనస్సులోనే పెట్టుకుని మా అందరికీ దూరమయ్యారన్నారు. అలాగే బ్యాంకు ఉద్యోగులు సైతం అక్కడకు చేరుకుని బ్యాంకు యూనియన్‌లో కీలకమైన పాత్ర పోషించిన ఆనందబాబు కనీసం ఒక్కమాట చెప్పి ఉంటే ఇంతకష్టం వచ్చేది కాదని అన్నారు. తులీప్ అపార్టుమెంటు వాసులు సైతం అందరితోను కలివిడిగా ఉండే ఆనందబాబు, అరుణ దంపతులు ఈ విధంగా చేస్తారని అనుకోలేదన్నారు. ఆ నలుగురే కారణమా? సంస్థ నెలకొల్పడానికి సాయం చేస్తామని వంచన డబ్బు తీసుకుని ముఖం చాటేసిన వైనం సాయిచరణ్ సూసైడ్ నోట్లో వివరాలు వెల్లడి రాజమహేంద్రవరం రూరల్: నలుగురు వ్యక్తులు యువమేధావికి ఆశలు కల్పించడంతో పాటు, దఫదఫాలుగా సుమారు రూ.23.75 లక్షలు తీసుకుని ఇప్పుడు తమకు ఎటువంటి సంబంధం లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తేచావండి అని అనడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజమహేంద్రవరం కెనరాబ్యాంకు క్యాష్ అసిస్టెంట్ ఆనందబాబు, అతని భార్య అరుణ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం, వారి కుమారుడు లక్ష్మీచంద్సాయిచరణ్ ఆచూకీ లభించకపోవడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ఆనంద్‌బాబు కుమారుడు రాసిన సూసైడ్‌నోట్‌లో విషయాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఒక ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ మూడో సంవత్సరం చదువుతున్న చంద్సాయిచరణ్ తన సీనియర్లు రాజీవ్, మోహన్, సురేష్, హరికమల్, అఖిల్‌తో కలసి సోలార్కార్ల తయారీ ప్రాజెక్టును డిజైన్ చేశాడు. దీంతో ఏడాదిన్నర క్రితం ఆల్ట్రాస్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి దానికి సీఈవో, ఫౌండర్‌గా చరణ్ ఉన్నాడు. కళాశాల యాజమాన్యం అనుమతి తీసుకుని ఏడాదిగా ప్రాజెక్టు విషయంపై తిరుగుతున్నాడు. అయితే సోలార్ టెక్నాలజీతో తయారుచేసిన ప్రాజెక్టును పట్టాలెక్కించాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో ఎవరైనా పెట్టుబడిదారుడ్ని పట్టుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు బ్రోకర్లు కె.సత్యనారాయణ, బి.అప్పల కనక శ్రీనివాస్ ఎలియాస్ స్వామిలను వీరు ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు భూమి అవసరమని అలాగే పెట్టుబడి కూడా కావాల్సి ఉంటుందని సదరు బ్రోకర్లకు చరణ్, అతని స్నేహితులు చెప్పినట్లు సమాచారం. దీంతో తాము అంతా చూసుకుంటామని భరోసా ఇచ్చిన బ్రోకర్లు.. విశాఖపట్నానికి చెందిన స్థల యజమాని దొర, గుంటూరుకు చెందిన ఫైనాన్షియర్ శ్రీనివాసరెడ్డిలను రంగంలోకి దింపినట్లు సమాచారం. మొత్తం ఈ నలుగురు కలసి చరణ్ బృందం నుంచి ఖర్చులు నిమిత్తం రూ.23.75 లక్షలను తీసుకున్నట్లు సూసైడ్‌నోట్ ద్వారా అర్థమవుతోంది. పరిశ్రమకు సంబంధించిన 20 ఎకరాల భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టడం ద్వారా డబ్బు సమకూరుస్తామని చెప్పి చరణ్ బృందం నుంచి ఖాళీ చెక్కులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చెక్కులు ఉద్యోగాల నిమిత్తం తీసుకున్నట్లుగా చూపిస్తూ చెక్కులు రిటర్న్ అయినట్లు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు రూ.23.75 లక్షలు చరణ్, అతడి స్నేహితులు సత్యనారాయణ ద్వారా స్వామి, దొర, ఫైనాన్షియర్ శ్రీనివాసరెడ్డిలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు నలుగురు మోసం చేయడంతో చరణ్ కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేకపోయింది. మిగిలిన వారి నుంచి తీవ్ర స్థాయిలో వత్తిళ్లు పెరగడంతో ఆనందరావు, అరుణ, చరణ్‌లు మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. స్థలం యజమాని దొర డబ్బులు తీసుకుని మోసం చేసిన ఫైనాన్షియర్ శ్రీనివాసరెడ్డి, బ్రోకర్లు సత్యనారాయణ, బీఏకే శ్రీనివాస్‌లను ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేయించమన్నా, అగ్రిమెంటు చేయమన్నా, కనీసం డబ్బు వెనక్కి ఇచ్చేయమన్నా వారు వాయిదాలు వేస్తూ రావడంతో చరణ్ కుటుంబం విసిగి వేసారిపోయింది. వారికి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తే చావండి అంటూ సమాధానాలు రావడంతో ఆకుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆనందబాబు సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కోణంలోనే బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్‌రెడ్డి, ఎస్సై యూవీఎస్ నాగబాబు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. -
మరో బురారీ: కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని సామూహిక ఆత్మహత్యల కేసు మరవకముందే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జార్ఖండ్‌లోని హజారిబాగ్ నగరంలో చోటుచేసుకుంది. వీరిలో ఐదు మంది ఉరివేసుకొగా, మరొకరు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సూసైడ్‌నోట్ ఆధారంగా అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. డ్రై ఫ్రూట్ బిజినెస్‌లో భారీగా నష్టాలు రావడంతో ఒత్తిడికి లోనై వారంతా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మృతులు మహావీర్ మహేశ్వరీ(70), అతని భార్య కిరణ్ మహేశ్వరి(65), కొడుకు నరేశ్ అగర్వాల్(40), ఇతని భార్య ప్రీతీ అగర్వాల్(38), పిల్లలు అమన్(8), అంజలి(6)గా గుర్తించారు. -
ఆరుగురిని బలిగొన్న అప్పు
ఆరుగురిని బలిగొన్న అప్పు సాక్షి, సూర్యాపేట: తల్లిదండ్రులకు తెలియ కుండా కొడుకు చేసిన అప్పులు ఓ కుటుం బాన్ని బలి తీసుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన కస్తూరి జనార్దన్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు కుమారులు సురేశ్, అశోక్ ఉన్నారు. పెద్ద కుమారుడు సురేశ్‌కు భార్య ప్రభాత, ఇద్దరు కుమార్తెలు సిరి, రుత్విక ఉన్నారు. జనార్దన్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. సురేశ్ ఖాళీగా ఉండ టంతో కంప్యూటర్ల రిపేర్, సేలింగ్ దుకాణాన్ని పెట్టించాడు. కొంతకాలం దుకాణాన్ని నిర్వ హించిన సురేశ్.. తల్లిదండ్రులకు తెలియ కుండానే భారీగా అప్పులు చేశాడు. వడ్డీవ్యా పారులు వేధింపులు ఎక్కువ కావడంతో ఈనెల 11న పుణె వెళ్తున్నానని చెప్పి సురేశ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో పెట్టుకున్నాడు. సురేశ్‌కు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు ఇంటికి రావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. పదేపదే ఇంటి వద్దకు వచ్చి వేధిస్తుండడంతో అవమానాన్ని తట్టుకోలేక సురేశ్ తల్లిదండ్రులు జనార్దన్ (57), చంద్రకళ(50), సోదరుడు అశోక్(26), భార్య ప్రభాత(30), కుమార్తెలు సిరి(4), రుత్విక(2) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొద్దున పాలు పోసేందుకు వచ్చిన యువకుడు ఎంతసేపు గేటు కొట్టినా తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారికి చెప్పాడు. అందరూ వచ్చి కిటికీలు, తలుపులు పగులగొట్టి చూడగా.. ఆరుగురు విగతజీవు లుగా పడి ఉన్నారు. వెంటనే జిల్లా కేంద్రంలోని పోలీసులకు సమాచారం అందించేందుకు గంటపాటు ప్రయత్నించినా అధికారులెవరూ ఫోన్ ఎత్తలేదని స్థానికులు ఆరోపించారు. షేర్ మార్కెట్లో పెట్టేందుకు.. షేర్ మార్కెట్లో పెట్టేందుకు సురేశ్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చాడు. అందులో నష్టం రావడంతో అటు తల్లిదండ్రులకు.. ఇటు భార్యకు చెప్పుకోలేక కుంగిపోయాడు. వడ్డీ వ్యాపారులు ఒత్తిడి తేవడంతో ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ నెల 11 ఇంట్లో తల్లిదండ్రులు, భార్యకు చెప్పి పుణె వెళ్లాడు. మరుసటి రోజు భార్య ప్రభాతకు ఫోన్ చేసి పుణె నుంచి ముంబై వెళ్తు న్నట్టు చెప్పాడు. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. సురేశ్ తమ వద్ద రూ.లక్షల్లో అప్పులు చేశాడని అవన్నీ చెల్లించకపోతే బాగుండదని వడ్డీ వ్యాపారులు జనార్దన్‌ను హెచ్చరించారు. సురేశ్ సుమారు రూ.3 కోట్ల దాకా అప్పులు చేసి ఉంటాడని తెలుస్తోంది. మోసపోయిన చిన్న కొడుకు.. జనార్దన్ చిన్న కొడుకు అశోక్ డిగ్రీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో కుమారుడిని ఏదో ఉద్యోగంలో పెట్టించాలను కున్నాడు. ఆ ఇంటి పక్కనే ఉండే ఓ మహిళ తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని.. వారు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తారని జనార్దన్‌కు చెప్పింది. దీంతో ఆయన.. ఆమె సూర్యాపేటకు చెందిన వెంపటి సత్యనారాయణ, బెంజారపు ఉపేందర్లను కలిశాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, అందుకు రూ.14 లక్షలు ఖర్చు అవుతుందని వారు చెప్పారు. దీంతో జనార్దన్ గతేడాది రెండు విడతల్లో రూ.14 లక్షలు కట్టాడు. తీరా మోసపోయినట్టు తెలుసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తామన్న వారి వద్దకు వెళ్లి అడగ్గా.. వాయిదాల పద్ధతిలో డబ్బులు ఇస్తామని చెప్పినా ఇప్పటిదాకా ఒక్క పైసా ఇవ్వలేదు. పైగా బెదిరించారు. రెండ్రోజులుగా వారి ఫోన్లు కూడా స్విచ్ఛాప్‌లో ఉన్నాయి. అమ్మను సోదరుల ఇళ్లకు పంపి.. జనార్దన్ వద్దనే కొన్నేళ్లు ఆయన తల్లి రాములమ్మ ఉంటోంది. ఎన్నడూలేని విధంగా ఆదివారం ఇంట్లో నుంచి ఆమెను వెళ్లిపోమన్నాడు. సూర్యాపేటలోనే ఉంటున్న సోదరుల ఇళ్లకు తల్లిని పంపించాడు. తర్వాత అదేరోజు రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అశోక్, ప్రభాతల వద్ద సూసైడ్ నోట్లు లభించాయి. అందులో అశోక్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించగా.. సురేశ్ భార్య ప్రభాత తన భర్త అప్పులు చేశాడో.. చేయలేదో తనకు తెలియదని పేర్కొంది. -
విషాదం: కుటుంబంలో ఆరుగురి ఆత్మహత్య